వనపర్తి రూరల్: బైక్‌ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవర గాయాలయ్యాయి. చిమనగుంటపల్లి శివారులోని సద్గురు భజన మండలి ఎదురుగా బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్‌ఐ జలెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన మంగళి జమ్మున్న (40) వాయిద్యా కళాకారుడు.
గోపాల్‌పేట మండలం చెన్నూర్ గ్రామంలో పెళ్లి ఉండడంతో మరో మిత్రుడితో కలిసి భజంత్రి వా యించడానికి బైక్‌పై వెళ్లి బుధవారం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వనపర్తి మండలం చిమనగుంటపల్లి వద్ద బైక్‌ను టాటా ఏస్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జమ్మున్న అప్పటికే మృతి చెందినట్లు తెలుపగా మరో వ్యక్తి వెంకటేశ్వర్లును కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలయ్య తెలిపారు.
బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
కోస్గి రూరల్: బాలికపై అత్యాచారం చేసిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ బుధవారం తెలిపారు. గుండుమాల్ మండలంలోని బలుబద్రాయపల్లి గ్రామం ఓడ్డుక్రిందితండాకు చెందిన బాలిక (15) ఈ నెల 9న బహిర్భూమికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన సబావత్ విజయ్ కుమార్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి పక్కనే ఉన్న గుట్టలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం ఎరికై నా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అటుగా వెళుతున్న కొందరు దీనిని గమనించి బాలిక తల్లికి విషయాన్ని చెప్పారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.