ఇటిక్యాల: ఈతకు వెళ్లి బావిలో వ్యక్తి గల్లంతైన సంఘటన ఎర్రవల్లి మండల పరిధిలోని వేముల గ్రామంలో బుధవారం చోటుకుంది. ఎస్‌ఐ మురళీ, స్థానికుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా కొంకల్‌పల్లి గ్రామానికి చెందిన శేషయ్య(55) దేవర నిమిత్తం కోదండాపురం గ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఐదు మంది స్నేహితులతో కలసి వేముల గ్రామంలోని జక్కం బావిలోకి ఈత బుధవారం ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈతలో పోటీ పడుతుండగా ప్రమాదశాత్తు శేషయ్య బావిలో గల్లంతైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ సిబ్బందితో కలసి రెస్కూ టీం సహాయంతో గల్లంతైన వ్యక్తి కోసం బావిలో గాలించినట్లు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో దాదాపు ఐదు గంటల నుంచి ప్రయత్నించిన వ్యక్తి ఆచూకీ లభించనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న శేషయ్య కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. దేవర నిమిత్తం వచ్చి బావిలో వ్యక్తి గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కారులో మంటలు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట బుధవారం పార్క్ చేసిన కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో ఊపిరీ పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మిడ్జిల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం జడ్చర్లకు వచ్చి మార్కెట్ యార్డు వద్ద కారును పార్క్ చేసి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కారులో నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు మార్కెట్ యార్డు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైతులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు