
గంజాయి విక్రేత అరెస్టు
● 680 గ్రాముల గంజాయి స్వాధీనం
గద్వాల క్రైం: గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివ రాలు వెల్లడించారు. గద్వాల పట్టణం చింతలపేట కాలనీకి చెందిన బషీర్ కొన్ని రోజుల నుంచి హై దరాబాద్(దూల్‌పేట), మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా గంజాయి కొనుగోలు చేసి పట్టణంలోని కార్మికులకు 1 గ్రాము రూ.500 చొప్పున్న విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచి ఆరా తీయగా గద్వాలకు చెందిన యువకుడిగా తెలిసిందన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గంజాయి విక్రయించేందుకు రాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 680 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోగా, దాని విలువు రూ.27వేలు ఉంటుందన్నారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి అలంపూర్ కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. డ్రైవర్‌గా పనిచే స్తూ అక్రమంగా డబ్బులు సంపదించాలనే అత్యాశతో నిషేధిత మత్తు పదార్ధాల దందాకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్‌ఐ తరుణ్‌కుమార్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సవరన్న, సిబ్బంది కిరణ్, చంద్రయ్య, రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.