
‘కర్ణాటక వడ్లనే కొనుగోలు చేస్తుండ్రు’
కేటీదొడ్డి: కర్ణాటక నుంచి వస్తున్న వడ్లను కొనుగోలు చేస్తూ స్థానిక రైతులకు మోసం చేస్తున్నారని శనివారం మండలంలోని కొండాపురం రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సన్యాలకు మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటించడంతో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు అక్రమాలకు తెరలేపారని దుయ్యబట్టారు. 15 రోజుల నుంచి వడ్లను కల్లాలకే పరిమితం చేశారని, గోనె సంచులు లేవని సాకులు చెప్తూ కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి రాత్రికే సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం నుంచి కొండాపురం, వెంకటాపురం, ఈర్లబండ, కేటీదొడ్డి, ఎర్సందొడ్డి తదితర ప్రాంతాలకు చెందిన వడ్ల కొనుగొలు కేంద్రాలకు భారీ మొత్తంలో తెస్తుండడంతో వాటిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కొండాపురంలో పండించిన వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ గ్రామ రైతులు ఐకేపీ సెంటర్‌కు తాళం వేశారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. దీనిపై ఏపీఎం గోపాల్ వివరణ కోరగా.. టోకన్ ప్రకారం గన్నీ బ్యాగులు పంపిణీ చేస్తామని తెలిపారు.
స్థానిక రైతుల ఆందోళన
ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తాళం వేసిన అన్నదాతలు
నిర్వాహకుల చేతివాటం