
మహిళల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
పాలమూరు: పెహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ప్రతీకారం తీర్చుకున్న భారత సైనికులకు సంఘీభావంగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని పాత గ్రంథాలయం నుంచి క్లాక్‌టవర్ వరకు మహిళలతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహిళ కార్యకర్తలు, పట్టణ మహిళలతో కలిసి ఎంపీ జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలో నడిచారు. మహిళా సైనికులు అయిన ఖురేషి, వ్యోమికా సింగ్‌లకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
ధర్మంతోనే జగతికి శాంతి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అందరూ ధర్మం పాటిస్తే జగతికి శాంతి చేకూరడమే గాక నైతిక విలువలు పెంపొందుతాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆమె నివాసంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో వచ్చే నెల 16న జరిగే ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవం, మహాత్మా బసవేశ్వర జయంతోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానవాళి విశ్వశాంతి కోసం ఆది జగద్గురు పంచాచార్యులు పట్టణానికి రానుండటం శుభసూచకమని అన్నారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షుడు ముక్తా శ్రీశైలం, సంఘం నాయకులు ఎం.కె.గాంధీ, జంగం శివరాజయ్య, గాజుల మృత్యుంజయ, రాజశేఖర్, శరణ్‌కుమార్, శివకుమార్, గురుపాదస్వామి, బసప్ప, శివప్రసాద్, గురుపాదయ్య, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ,మహిళలు