
డ్రంకెన్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలుశిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: అధిక మోతాదులో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా సోమవారం న్యాయమూర్తి జైలుశిక్షతో పాటు జరిమానా విధించారు. రెండు రోజుల కిందట వన్‌టౌన్ పోలీసులు చేసిన డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో ఆనంద్‌చారి, నరేష్ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం కోర్టులో హాజపర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డి.నిర్మల ఒక్కొక్కరికి రెండు రోజుల జైలుశిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురిని ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆర్.శశిధర్.. ఒకరికి ఐదు రోజుల జైలుశిక్ష, ఒకరికి రూ.2వేలు, మరో ఇద్దరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, వన్‌టౌన్ సీఐ అప్పయ్య మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా
కల్వకుర్తి టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జడ్జి జైలుశిక్షతో పాటు జరిమానా విధించనట్లుగా ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు కూడళ్లలో ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించచారు. అందులో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడడంతో వారిని పోలీసులు కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి కావ్య వారిలో వంగూర్ మండలంలోని ఉల్లంపల్లికి చెందిన నాగార్జున, మున్సిపాలిటీలోని తిమ్మరాశిపల్లికి చెందిన నరేందర్‌కు నాలుగు రోజుల జైలుశిక్షతో పాటుగా, ఒక్కొక్కరికి రూ.100 జరిమానా విధించారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలుశిక్ష