
నిప్పంటుకొని గుడిసె దగ్ధం
చిన్నంబావి: మండలంలోని అయ్యావారిపల్లి గ్రామంలో బీజేపీ నాయకుడు చెన్నయ్య యాదవ్‌కు చెందిన గుడిసె నిప్పంటుకొని దగ్ధమైంది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి గుడిసె కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ జగన్మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇంట్లో సామగ్రి మొత్తం కాలిపోయిందన్నారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
వనపర్తి జానపద
నృత్యానికి గుర్తింపు
వనపర్తిటౌన్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం రాత్రి అక్షిత ఫౌండేషన్, నటరాజ అకాడమీ సంయుక్తంగా రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు నిర్వ హించారు. రాష్ట్రస్థాయిలో ఏకపాత్రాభినయాలు, సా మూహిక నృత్య ప్రదర్శనలు 200 వరకు వచ్చాయి. ఇందులో వనపర్తి నుంచి యశ్వంత్ అకాడమీకి చెందిన పదేళ్లలోపు నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ప్రదర్శించిన జానపద నృత్య ప్రదర్శనకు ఐకాన్ అవార్డు దక్కింది. ఈ అవార్డును డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్, విద్యార్థులకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్, అక్షిత ఫౌండేషన్, నటరాజ అకాడమీ ప్రతినిధులు అందజేశారు.