
ఎకై ్సజ్ దాడుల్లో నల్ల బెల్లం పట్టివేత
కొత్తకోట: కొత్తకోట ఎకై ్సజ్ శాఖ సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రూట్ వాచ్ దాడుల్లో నల్ల బెల్లంను తరలిస్తున్న రెండు వాహనాలను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట ఎకై ్సజ్ సీఐ కరుణ తెలిపిన వివరాల మేరకు కర్నూలు నుంచి పెబ్బేరు ఆటోలో 750 కేజీల నల్ల బెల్లాన్ని తరలిస్తున్న మోహన్‌కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. చిత్తూరు నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో 3,500 కేజీల నల్ల బెల్లాన్ని తరలిస్తున్న సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు వాహనాలపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ పోలీసులు ఎస్సై పృథ్వీ రాజ్, కానిస్టేబుల్స్ నాగరాణి, తిరుమలేష్, జనార్దన్, వినోద్ పాల్గొన్నారు.