
అంబేడ్కర్ అడుగుజాడలే దిశానిరే ్దశం
రాజోళి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావుపూలే అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన ఆశయాలను నెరవేర్చాలని ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. మండలంలోని పెద్ద దన్వాడలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్యం వైపు వెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయని, వాటిని దీటుగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. యువతకు మహనీయులు అంబేడ్కర్, పూలే జీవితాలే ఆదర్శమన్నారు. కలిసికట్టుగా పోరాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ రఘు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
షా–అలీ–పహిల్వాన్
ఉర్సు ప్రారంభం
అలంపూర్ : అలంపూర్ పట్టణంలో వెలసిన షా–అలీ–పహిల్వాన్ ఉర్సు మంగళవారం రాత్రి గంధోత్సవంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాలను ముస్తాబు చేశారు. ఉత్సవాలను తిల కించడానికి వచ్చే భక్తులకు నిర్వాహక కమిటీ తగు సౌకర్యాలు కల్పించింది. ఉత్సవాల నాలుగు రోజుల పాటు పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. తరతరాల సంప్రదాయాలకు స్వాగతం పలుకుతూ ఉత్సవాలను కొనసాగించారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ఖాజ బందేనవాజ్ దర్గా నుంచి వచ్చిన గంధంతో ఉత్సవాలను ప్రారంభించారు.