ఇంట్రా టోర్నమెంట్‌లో ప్రతిభచాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్‌లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో మంగళవారం ఇంట్రా టోర్నమెంట్‌లో పాల్గొనే అండర్– 19, 23 క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ రెండు విభాగాలకు సంబంధించి దాదాపు 70 మందికిపైగా హాజరుకాగా.. క్రీడాకారులకు బౌలింగ్, బ్యాటింగ్ అంశాల్లో పరీక్షించి ఎంపికలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఈసారి వేసవి ఉచిత శిక్షణ శిబిరాల్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేటల జట్లతో ఈ నెల 19 నుంచి ఇంట్రా టోర్నమెంట్‌లు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు ఇదొక సువర్ణ అవకాశం అని, క్రీడాకారులు టోర్నమెంట్‌లో తమ వ్యక్తిగత ప్రదర్శన చాటుకోవాలని కోరారు. ఈ టోర్నమెంట్‌లలో రాణించే క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్లు, రాబోయే హెచ్‌సీఏ టోర్నమెంట్‌లకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ముఖ్తార్‌అలీ పాల్గొన్నారు.
ఎంపికై ంది వీరే..
పి.రామాచారి, కనిష్క్‌గౌడ్, శేఖర్, దినేష్, లోకేష్, రాఫే, అంకిత్‌రాయ్, అభినవ్, అభిషేక్, ప్రణయ్, ప్రవీణ్, శ్రీకాంత్, పవన్, సోను, నవీన్, అభినవ్‌తేజ, శివ కేశవ్ ఎంపికయ్యారు. అలాగే అండర్– 23లో తరుణ్, అబ్దుల్ రాఫే, అక్షయ్, గణేష్, శ్రీకాంత్‌నాయక్, షాదాబ్, ఎండి.అదిబ్, సయ్యద్ ఇమ్రాన్, వివేక్. కె.శ్రీకాంత్, రయ్యాన్, వంశీ, శషాంక్, అంజనీశ్వర్, ముఖిత్, ఎండీ ఇమ్రాన్ ఉన్నారు.


