
ఇసుక టిప్పర్ల పట్టివేత
గద్వాల క్రైం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. వనపర్తి జిల్లా రంగాపురం పరిధిలోని నదీ పరివాహాక ప్రాంతం నుంచి ఉండవెల్లి మండలం కల్లుగోట్ల గ్రామానికి చెందిన ఆర్‌వీ శేషుకు చెందిన టిప్పర్ల ద్వారా ఆదివారం ఇసుక గద్వాలకు తరలిస్తున్నారన్నా సమాచారం మేరకు జమ్మిచెడ్ శివారులో దాడి చేసి టిప్పర్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించామన్నారు. అదే విధంగా జమ్మిచెడ్ శివారులోని అక్రమంగా ఆరు టిప్పర్ల ఇసుకను నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు టిప్పర్ల యాజమాని ఆర్‌వీ శేషుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.