
పాలమూరులో తిరంగా ర్యాలీ
పాలమూరు: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం సాయంత్రం పాలమూరు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ప్రధా న స్టేడియం గ్రౌండ్ నుంచి క్లాక్‌టవర్ వరకు జాతీ య జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాజీ సైనికులు, బీజేపీ నే తలు, యువకులతో కలిసి జాతీయ జెండాలు చేతి లో పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ సైనికల్లో ధైర్యం నింపారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదుల స్థావ రాలపై దాడులు చేసి పాకిస్తాన్‌కు మన సత్తా ఏంటో చూపించామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు సాహితీరెడ్డి, జయశ్రీ, బాలత్రిపుర సుందరి పాల్గొన్నారు.