
పిల్లలమర్రిలో ఏర్పాట్ల పరిశీలన
పాలమూరు: జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిని ఈనెల 16న ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్న నేపథ్యంలో సోమవారం ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఏర్పాట్లను పరిశీలించారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షం పిల్లలమర్రికి ప్రపంచ సుందరీమణులు వస్తున్న క్రమంలో భారీ పోలీస్ భద్రతతోపాటు అన్ని రకాల ఏర్పాట్లపై సమీక్షించారు. పురావస్తు మ్యూజియం, పిల్లలమర్రి వృక్షం, ఆలయం వద్ద జరుగుతున్న అన్ని రకాల పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వారి వెంట ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు.