
ఎంవీఎస్‌లో ఉపాధి ఆధారిత కోర్సులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉపాధి ఆధారిత కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీలో రెండేళ్లపాటు కళాశాలలో తరగతులు వినడం, తర్వాత మరో ఏడాది అప్రెంటిషిప్ ఉంటుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థికి వేతనం సైతం లభిస్తుందన్నారు. ఇలాంటి కోర్సులు ఎంవీఎస్‌లో 5 ప్రారంభించామని, అందులో బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్‌కు ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, బీఎస్సీ మార్కెటింగ్, ఫార్మా సేల్స్‌కు బైపీసీ, బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌కు బైపీసీ, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐకి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. వీటి ద్వారా డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం డిగ్రీలో చేరికకు దోస్త్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ నెల 21 వరకు అవకాశం ఉందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఎంవీఎస్ కళాశాలను ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అధ్యాపకులు సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.