
వైద్యవిధానం విప్లవాత్మక మార్పులతో పురోగమిస్తుంది. నయం కానీ వ్యాధులను సరికొత్త చికిత్సా విధానంతో నయంచేసి రోగుల్లో సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. తాజాగా వైద్య విధానంలో అలాంటి పరిణామామే చోటు చేసుకుంది. అంతేగాదు మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో కొత్త ఆశలను అందిస్తోంది. ఈ ఘనత సాదించింది లాస్ ఏంజిల్స్‌లోని యూఎస్ సర్జన్లు.
అసలేం జరిగిందంటే..నలుగురు పిల్లల తండ్రి ఆస్కార్ లారైన్జార్ కేన్సర్ కారణంగా రెండు మూత్రపిండాలు, మూత్రశయంలోని దాదాపు సగ భాగాన్ని కోల్పోయాడు. దాంతో అప్పటి నుంచి అతడు డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నాడు. అతడి సమస్యను నయం చేసేలా అమెరికన్ యూరాలజిస్ట్‌లు అవయవా దాత నుంచి సేకరించిన మూత్రపిండాలు, మూత్రశయంని మార్పిడి చేశారు.
ఈ సంక్లిష్టమైన సర్జరీ దాదాపు ఎనిమిది గంటలు పైనే పట్టింది. 41 ఏళ్ల ఆస్కార్ లారైన్జార్‌కి ఈ శస్త్రిచికిత్స పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అలాగే మార్పిడి చేసి కొత్త మూత్రపిండాల సాయంతో మూత్ర విసర్జన చేయగలిగాడు కూడా. అతనికి ప్రస్తుతం మూత్రపిండాల పనితీరు మెరుగ్గానే ఉండటంతో డయాలసిస్ అవసరం తగ్గింది కూడా. ఈ సర్జరీ జరిగిన కొన్ని గంటల అనంతరమే..అతడు సాధారణ మూత్ర విసర్జన చేయగలిగాడు. పాపం ఆ వ్యక్తి గత ఏడేళ్లుగా ఈ మూత్ర విసర్జన చేయలేకపోయాడు.
ఈ శస్త్ర చికిత్స అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ మేరకు సదరు వైద్య బృందం మాట్లాడుతూ..మూత్రాశయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సల గురించి గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్లినికల్ ట్రయల్ కోసం మరో నాలుగు శస్త్ర చికిత్సలు చేసేలే ప్లాన్‌లు ఉన్నాయి. నిజానికి ఈ పద్ధతిలో అవయవ తిరస్కరణకు అడ్డుకట్ట వసేలా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అణిచివేయాల్సి ఉంటుందని అన్నారు.
అలాగే ఇంతవరకు బలహీనమైన మూత్రాశయాలతో బాధపడుతున్న చాలామంది బాధితులకు ప్రేగులోని భాగంతో తిరిగి మూత్రశయం తయారు చేయడం వంటి పరిమిత ఎంపికలే గతంలో ఉండేవని అన్నారు. దీంతో ఆయా వ్యక్తుల్లో తరుచుగా ఈ సమస్యల తిరగబెట్టడమే లేదా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నమవ్వడమో జరిగేదన్నారు.
కానీ ప్రస్తుతం తాము చేసిన ఆధునిక మూత్రాశయ మార్పిడి చికిత్సతో అంతకుముందు ఉత్ఫన్నమైన ప్రమాదాలకు తెరపడినట్లయ్యిందన్నారు. అలాగే కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడే వారిలో కొత్త ఆశలను నింపింది. సదరు బాధితుడు లారైన్జార్ చేసిన శస్త్రచికిత్స వైద్యశాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచించడమే గాక అతను పూర్తిస్థాయిలో కోలుకుంటే గనుక చాలామంది రోగులకు జీవితంపై కొత్త ఆశను అందిస్తుంది.
(చదవండి: ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్ )