
టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్‌లో చేరేలా చూడాల
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్):ప్రభుత్వపాఠశాల లో పదవ తరగతి చదివిన వారందరూ ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోనీ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడా రు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులను ఫోన్ ద్వారా సంప్రదించి వారు ఏ కళాశాలలో చేరాలనుకుంటున్నారో ఆ వివరాలను తెలుసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను ఇంటర్మీడియట్‌లో చేర్పించాలన్నా రు. పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండడంపై ఆరా తీసిన కలెక్టర్.. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. చదవడం, రాయడం రాని విద్యార్థుల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల లో రాయడం, చదవడం రావాలన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థు ల నమోదును పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గుర్తించి వారిని సమీపంలోని భవిత కేంద్రాల్లో చేర్పించాలన్నారు. బడులు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే చేయించాలన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి నిర్లక్ష్యం చేయండా నిర్వహించాలన్నారు. రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లడానికి వీలుకాని వారు తెలంగాణ ఓపెన్ పాఠశాల ద్వారా టెన్త్, ఇంటర్ చదువుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) వాల్ పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, డీఐఈఓ కౌసర్ జహాన్, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, డీడబ్ల్యూయూఓ జరీనా బేగం, సీఎంఓ బాలుయాదవ్, ఆర్‌సీఓలు, డీసీఓలు పాల్గొన్నారు.