నేటినుంచి డిగ్రీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి డిగ్రీ పరీక్షలు

May 15 2025 12:16 AM | Updated on May 15 2025 12:16 AM

నేటిన

నేటినుంచి డిగ్రీ పరీక్షలు

15 వేల బస్తాల

వరిధాన్యం రాక

నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం భారీ ఎత్తున వరిధాన్యం వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్‌ 9,136 బస్తాలు, ఇతర సీడ్‌ (1010) 4,176 బస్తాల ధాన్యం వచ్చిందని మార్కెట్‌ కార్యదర్శి రమేష్‌ తెలిపారు. కాగా దీనికి గాను ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,296, కనిష్టంగా రూ.1,911, ఇతర సీడ్‌ క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,220, కనిష్టంగా రూ.1,712 ధర లభించింది. వరి ధాన్యం ఎక్కువగా రావడంతో వారంలో రెండు రోజులు టెండర్లు వేసి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్‌ చైర్మన్‌ లింగం వివరించారు.

సొంతింటి కల నెరవేర్చుకోండి

నవాబుపేట: ‘ఏంటమ్మా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు పూర్తవుతుంది.. ఇల్లు కుదురుగా కట్టుకుని సొంతింటి కల నెరవేర్చుకోండి.. పెద్దగా కట్టుకునేందుకు పోయి అప్పుల పాలుకావొద్దు’ అని కలెక్టర్‌ విజయేందిర ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సూచించారు. బుధవారం ఆమె మండలంలోని దేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారు అలివేలుతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షలతోనే పూర్తి చేసుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నమూనాను రూపొందించిందని వివరించారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకుంటే త్వరగానే బిల్లులు వస్తాయని చెప్పారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉందని గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ్‌ కలెక్టర్‌ దృష్టికి తేగా.. సమస్యను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణం ప్రారంభించని వారికి మరో మూడు రోజులే గడువు ఉందని, ఆలోగా పనులు చేపట్టాలని, లేకపోతే రద్దు చేసి ఇతరులకు కేటాయిస్తామన్నారు. కాగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దేపల్లిని మోడల్‌ గ్రామంగా ప్రకటించి 93 ఇళ్లను మంజూరు చేయించారు. ఇందులో 25 ఇళ్లు బేస్మెంట్‌ పూర్తి చేసుకుని గోడల దశలో ఉండగా.. మరో 15 ఇళ్లు పునాదుల దశలో ఉన్నాయి. అనంతరం కలెక్టర్‌ చౌడూర్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం తేమను చూసి గన్నీ బ్యాగులు, లారీల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ జయరాంనాయక్‌, ఈఓపీఆర్‌డీ బద్రునాయక్‌, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వెంకటేష్‌గౌడ్‌, రాములు, రాజు, అమరేష్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పూర్తిచేశాం..

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్‌ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం.

– శ్రీనివాస్‌, పీయూ వైస్‌ చాన్స్‌లర్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్‌ చేరుకుంది.

సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సెమిస్టర్‌–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్టర్‌– 6లో 13,787 మంది, సెమిస్టర్‌–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రాయనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 47 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించారు. మాస్‌ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.

రెండుసార్లు వాయిదాల తర్వాత

ఎట్టకేలకు ప్రారంభం

47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు

నేటినుంచి డిగ్రీ పరీక్షలు 1
1/3

నేటినుంచి డిగ్రీ పరీక్షలు

నేటినుంచి డిగ్రీ పరీక్షలు 2
2/3

నేటినుంచి డిగ్రీ పరీక్షలు

నేటినుంచి డిగ్రీ పరీక్షలు 3
3/3

నేటినుంచి డిగ్రీ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement