
నాలుగు తరాల అను‘బంధం’
ఒకే కుటుంబం.. నాలుగు తరాలు.. 123 మంది కుటుంబ సభ్యులు.. 50 ఏళ్ల తర్వాత ఒకచోట కలిసిన అపూర్వ ఘట్టం. మదర్స్‌డే సందర్భంగా వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలగండలో వంశాధిపతి బూజుల నరసమ్మ, అక్కిరెడ్డిల వారసులు నాలుగు తరాలకు చెందిన 123 మంది సభ్యులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం బంధాలను చరవాణులకే పరిమితం చేసి, బంధువులు సైతం ఒకరినొకరు పరిచయం చేసుకునే దుస్థితి ఉంది. ఇలాంటి రోజుల్లో నాలుగు తరాలకు చెందిన 123 మంది కుటుంబసభ్యులు ఒకే వేదికపై కలుసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ వంశాధిపతిబూజుల నరసమ్మ, అక్కిరెడ్డిలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకను కుటుంబసభ్యులో ఒకరు, స్థానిక బీజేపీ నాయకుడు జగ్గారి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
– చిన్నంబావి (వనపర్తి జిల్లా)