
జాతీయ గోగేమ్ టోర్నీలో క్రీడాకారులకు పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: బిహార్ రాష్ట్రం ఆరాలో ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు జరిగిన జాతీయస్థాయి గోగేమ్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి మూడు బంగారు పతకాలు సాధించారు. సబ్ జూనియర్ సింగిల్స్‌లో జిల్లా క్రీడాకారుడు పి.రాజేష్ ఫైనల్ మ్యాచ్‌లో 40–30 స్కోర్‌తో బిహార్ క్రీడాకారుడిపై, మరో క్రీడాకారుడు మహ్మద్ బషీరుద్దీన్ ఫైనల్ మ్యాచ్‌లో 16–03 స్కోర్‌తో ఒడిశా క్రీడాకారుడిపై, జూనియర్ సింగిల్స్‌లో మహ్మద్ రయ్యన్ నజం ఫైనల్ మ్యా చ్‌లో తమిళనాడు క్రీడాకారుడిపై 17–9 స్కోర్‌తో గెలుపొంది బంగారు పతకలు సాధించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను తెలంగాణ గోగేమ్ అసోసియేషన్ నసరుల్లా హైదర్, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, కోశాధికారి వినోద్‌కుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్, సభ్యులు అభినందించారు.