
కోర్టును ఆశ్రయిస్తాం..
జడ్చర్ల పరిధిలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ గుట్టలపై కన్నేసిన మట్టి మాఫి యా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి టిప్పర్లలో తరలిస్తున్నారు. అలాగే గుట్టలను బ్లాస్టింగ్ పెట్టి పేల్చి పిప్పి చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం.
– అనిల్‌కుమార్, సామాజికవేత్త, జడ్చర్ల
చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ భూములు, గుట్టల నుంచి అక్రమంగా మట్టిని తరలించిన సంఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలించడం చట్టవిరుద్ధం. మట్టి తరలింపును అడ్డుకునే విధంగా సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తాం. గుట్టలను బ్లాస్టింగ్ చేసి తొలగించడంపై కూడా విచారిస్తాం.
– నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల

కోర్టును ఆశ్రయిస్తాం..