ఉన్నతాధికారుల దృష్టికి..
బాదేపల్లి యార్డుకు సెలక్షన్ గ్రేడ్ హోదా లభించేలా కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత కొన్నేళ్లుగా నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువే లభిస్తుంది. ఈ ఏడాది కూడా లక్ష్యానికి తగ్గట్టు ఆదాయం వచ్చింది. ఈసారి దిగుబడులు తగ్గినా మార్కెట్‌లో మంచి ధరలు రావడం ఆదాయానికి కలిసి వచ్చింది. మున్ముందు కూడా ఇదే రీతిలో రైతులకు మంచి ధరలు లభించేలా కృషి చేసి అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు కృషిచేస్తాం.
– నవీన్‌కుమార్,
యార్డు కార్యదర్శి, బాదేపల్లి
స్థాయి పెంపునకు కృషి..
బాదేపల్లి యార్డుకు ప్రతి ఏడాది మంచి ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది కూడా రూ.6.98 కోట్ల ఆదాయం లభించింది. యార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ఆదాయానికి అనుగుణంగా మార్కెట్ స్థాయిని పెంచేందుకు కృషిచేస్తాం. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సహకారంతో సెలక్షన్ గ్రేడ్ మార్కెట్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– జ్యోతి, మార్కెట్ చైర్‌పర్సన్, బాదేపల్లి
●
ఉన్నతాధికారుల దృష్టికి..


