విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ధరూరు మండల కేంద్రానికి చెందిన వినోద్ (25) పట్టణంలోని ఈదమ్మ ఆలయం సమీపంలో ఉన్న కారం, పిండి గిర్నిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు వచ్చిన అతడు.. కారం గిర్ని మిషన్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి సవరన్న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాహిత
అనుమానాస్పద మృతి
అడ్డాకుల: మూసాపేట మండలం దాసర్‌పల్లికి చెందిన వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన మోతే జ్యోతి(35)ని 15 ఏళ్ల కిందట మూసాపేట మండలం దాసర్‌పల్లికి చెందిన సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేస్తూ సంచార జీవనం సాగిస్తున్నారు. వీరికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. సొంత ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వ భవనాలు, ఇతర చోట్ల ఉండేవారు. రెండు వారాల కిందట గ్రామానికి రాగా.. ఇటీవల జ్యోతి అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం తెల్లవారుజామన మృతి చెందింది. జ్యోతి మృతదేహాన్ని వాహనంలో ఆమె స్వగ్రామమైన గోపన్‌పల్లికి భర్త తీసుకెళ్లాడు. అక్కడ మహిళ బంధువులు తిప్పి పంపారు. అదే వాహనంలో దాసర్‌పల్లికి సమీపంలోని గుట్ట వద్దకు తీసుకొచ్చాడు. మృతురాలి బంధువులు అక్కడికెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్‌ఐ వేణు దాసర్‌పల్లికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా జ్యోతిని భర్త చంపి ఉంటాడని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.
బొటానికల్ గార్డెన్‌లో
సిగ్నేచర్ స్పైడర్ కనువిందు
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో సిగ్నేచర్ స్పైడర్ కనువిందు చేసింది. గార్డెన్‌లో ఉన్న నెట్‌కు సోమవారం సాయంత్రం సిగ్నేచర్ స్పైడర్ కనిపించడంతో గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య కెమెరాలో బంధించారు. శాసీ్త్రయంగా ఆర్జియోపే అనసూజ స్పైడర్ అని పిలుస్తారని తెలిపారు. వేటలో ఆకర్షణ కోసం ఎక్స్ ఆకారంలో స్కిల్ సంబంధిత గుర్తును ఏర్పాటు చేస్తుందని, చూడటానికి సిగ్నేచర్‌లా ఉంటుందని, అందుకే సిగ్నేచర్ స్పైడర్ అని పిలుస్తారన్నారు. ఇది తలకిందులుగా వేలాడుతూ పసుపు, నలుపు గీతలతో ఉంటుందని, చిన్నపాటి గార్డెన్లు, తోటలు, అడవుల్లో కనిపిస్తుందన్నారు. దీని వలలో పడిన ఈగలు, దోమలు, సీతాకోక చిలుకలు, కందిరీగలు తింటూ జీవిస్తుందని చెప్పారు.
ఇసుక తరలింపును
అడ్డుకున్న గ్రామస్తులు
చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి శివారులోని కోళ్లఫారం సమీపం నుంచి ఆదివారం అర్ధరాత్రి భారత్ బెంజ్ వాహనం ద్వారా అక్రమంగా ఇసుకను తరలించేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న కురుమూర్తి గ్రామస్తులు, సమీప రైతులు అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన కొందరు కొన్నిరోజులుగా అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకు గ్రామసమీపంలోని కోళ్ల ఫారంను అడ్డగా చేసుకున్నారని తెలిపారు. పగలు ట్రాక్టర్ల ద్వారా కోళ్ల ఫారం సమీపంలో డంపులు చేసి రాత్రి సమయంలో తరలిస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే ఆదివారం అర్ధరాత్రి భారత్ బెంజ్ నుంచి మట్టిని తీసుకొచ్చి ఇసుకను తరలించేందకు య్రత్నాలు చేశారన్నారు. అట్టివారి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మట్టిని కోళ్లఫారం వద్దనే పోయించి వాహనాలను వదిలేశారని మండిపడ్డారు. ఇప్పటికై నా పోలీసులు ఇసుక అక్రమ తరలింపును అరికట్టకపోతే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డిని వివరణ కోరగా రాత్రి సమయంలో భారత్ బెంజ్‌లో కోళ్లఫారానికి మట్టిని తీసుకొచ్చారని తెలిపారు.
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి


