ప్రయోగాత్మక విద్యాబోధనతో సత్ఫలితాలు
తరగతి గదిలో జ్ఞాన ప్రసారం కాకుండా.. జ్ఞాన నిర్మాణం జరగాలంటే ప్రతి ఉపాధ్యాయుడు ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలను బోధించాలి. తద్వారా విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జీవశాస్త్ర విభాగంలో జీర్ణ వ్యవస్థలో జిహ్వికపాత్ర, శ్వాస వ్యవస్థలో ఉదరవిధానం, కనవిభజనలో సమవిభజన జరిగే విధా నం. బౌతికశాస్త్రంలో అంతరిక్ష రహస్యం వంటి అంశాల్లో కళాత్మకమైన బోధన సామగ్రి తయా రు చేసి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుంది.
– నాగిళ్ల శ్రీశైలం, జీవశాస్త్ర
ఉపాధ్యాయుడు, రాజాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, కోడేరు మండలం


