వైజ్ఞానిక ప్రదర్శన అదుర్స్
● ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలు
● నిజజీవితంలో ఉపయోగపడేలా
ప్రదర్శనల తయారీ
బిజినేపల్లి: పెరటితో ట పెంపకంలో భాగంగా ఒక అడుగు విస్తీర్ణంలోనే పలు రకాల కూర గాయల మొక్కలను స్టెపుల వారీగా పెంచడం బాగుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నా రు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బిజినేపల్లి మండలం కారుకొండ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు వ్యవసాయంపై 3 రకాల ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను తిలకించిన కలెక్టర్.. సరికొత్త ఆలోచనకు పదునుపెట్టిన విద్యార్థులను అభినందించారు.
కందనూలు: సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సరికొత్త ఆలోచనకు పదునుపెట్టారు. ఉపాధ్యాయుల ప్రేరణతో నూత న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. నాగర్‌కర్నూ ల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జిల్లా నలుమూల ల నుంచి హాజరైన విద్యార్థులు తమ ఎగ్జిబిట్లతో కలిగే ప్రయోజనాలను సందర్శకులకు వివరించారు. నిత్య జీవితంలో ప్రజలకు ఉపయోగపడేలా విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలను సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించారు.
ఆటోమేటిక్ ఫర్టిలైజర్ పరికరం ద్వా రా ఎరువులను సులభంగా మొక్కలకు అందించవచ్చు, శ్రమ, ఖ ర్చు తగ్గుతుంది. రైతులకు వెన్నునొప్పి, చేతినొప్పి, అలసట రా కుండా ఉంటుంది. విలువైన సమయం ఆదా అవుతుంది. ఈ ఆటోమేటిక్ ఫర్టిలైజర్ పరికరం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
– పి.గీతాంజలి, విద్యార్థిని, పెద్దపల్లి జెడ్పీహెచ్‌ఎస్, తెలకపల్లి మండలం
నివాసగృహాలు, కర్మాగారాలు, అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక, అటవీశాఖ అధికారులకు సత్వర సమాచారం అందేలా జీఎస్‌ఎం మాడ్యుల్ రూపొందించాం. దీన్ని ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇంటి వద్ద యజమాని లేనప్పటికీ ఎస్‌ఎంఎస్ ద్వారా అలర్ట్ చేస్తుంది. – వి.శివకుమార్, విద్యార్థి, కొండారెడ్డిపల్లి
జెడ్పీహెచ్‌ఎస్, వంగూరు మండలం
ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు. జంక్‌ఫుడ్ అంటే ప్రాసెస్ చేసిన పోషకాలు తక్కువగా ఉంటాయి. కృత్రిమ రుచులు, రంగులతో పాటు ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, షుగర్, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
– నిషా, విద్యార్థిని, కేజీబీవీ, బిజినేపల్లి మండలం
వైజ్ఞానిక ప్రదర్శన అదుర్స్
వైజ్ఞానిక ప్రదర్శన అదుర్స్
వైజ్ఞానిక ప్రదర్శన అదుర్స్


