వికసించిన మే పుష్పం
ప్రకృతి ప్రియులను అలరించే ‘మే’ పుష్పం
వికసించింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పూచే ఈ పువ్వు ఎరుపు రంగులో కనువిందు చేస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా 17వ వార్డులోని పాపయ్యనగర్‌లో రిటైర్డ్ పోస్టుమాస్టర్
నరసింహసాగర్ నివాసంలోని పెరటితోటలో ఈ పుష్పం వికసించింది. దీన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ఇళ్ల వారు ఆసక్తి చూపారు. స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ అనే శాసీ్త్రయ నామం ఈ మొక్కను ఫుట్‌బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీగా పిలుస్తారని జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్య తెలిపారు. దీనిని మనదేశంలో మే పుష్పం అంటారని, ఇది మూడు రోజుల పాటు వికసించి ఉంటుందని పేర్కొన్నారు. – నాగర్‌కర్నూల్


