
గిరిజనులకు ప్రత్యేక హక్కులు : మంత్రి సీతక్క
నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనులకు రాజ్యాంగం ద్వారా ప్రత్యేక హక్కలు లభించాయని మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఐటీడీఏలను నిర్వీర్యం చేసిందన్నారు. వాటికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని సీఎంను కోరారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తే.. ప్రస్తుత ప్రభుత్వం సౌర విద్యుత్ కల్పిస్తూ పండ్ల తోటలకు అవకాశం కల్పించిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గిరిజనుల భూమలు లాక్కొని కేసులు పెట్టారని ఆరోపించారు.
●