
మద్యం మత్తులో ఎక్కువగా..
హత్యలు చేసే వారి మానసిక స్థితి విభిన్నంగా ఉంటుంది. మద్యం మత్తులో ఎక్కువగా నేరాలకు పాల్పడుతుంటారు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మెదడులో కొన్ని రసాయనాలు పనిచేస్తాయి. ఈ సమయంలో వారు ఎవరి మాటను లెక్కచేయరు. తాము చేయాలనుకున్న పనిపైనే దృష్టి పెడుతారు. ఇలాంటి సమయంలోనే హత్యలు చేస్తున్నారు. ఇదే కారణంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. సున్నిత మనసు కలిగిన వారు తమను తాము ఆత్మహత్య చేసుకుంటారు. మిగిలిన వారు అవతలి వ్యక్తులను చంపి ప్రతీకారం తీర్చుకోవడం చేస్తుంటారు. వీరికి సరైన తరహాలో కౌన్సెలింగ్ ఇవ్వడం, ఆలోచన తీరు మార్చడం అవసరం.
– డా.అనిల్‌రాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రిస్ట్
క్షణికావేశంలోనే..
జిల్లాలో జరిగిన హత్యలు పథకం ప్రకారం జరిగినవి కాదు. కేవలం క్షణికావేశంలో చేయడం జరిగింది. కావేరమ్మపేటలో జరిగిన హత్యకు సంబంధించి ఇంకా నేరస్తులు ఎవరూ అనేది తెలియరాలేదు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు పెరుగుతున్నాయి. పోలీస్ శాఖ నుంచి అవసరమైన కౌన్సెలింగ్ కార్యక్రమాలు చేపడుతాం. క్షణికావేశంలో తప్పులు చేయరాదు. చిన్న పొరపాటుకు జీవితకాలం నష్టపోవాల్సి ఉంటుంది.
–వెంకటేశ్వర్లు, డీఎస్పీ
●

మద్యం మత్తులో ఎక్కువగా..