
ఆర్టీసీ బస్సు బోల్తా
● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు
కొత్తకోట రూరల్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు ఓవైపు ప్రచారం చేస్తున్నప్పటకీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులకు ఏం జరిగిందో తెలియక రక్షించాలంటూ కేకలు వేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ వివరాల మేరకు.. పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి కడప నుంచి సికిందరాబాద్‌కు 37మంది ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యంలోని పాలెం సమీపంలోకి బస్సు రాగానే ఒక్కసారిగా అదపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ప్రయాణికులు నారాయణ, శిల్ప, తరుణ్‌కు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను 108 లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. బస్సు సా ధారణ స్పీడ్‌లో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నవ వధువు
అనుమానాస్పద మృతి
మద్దూరు/కొత్తపల్లి: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతిచెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కడపని స్వామితో కోయిలకొండ మండలం మల్కాపూర్‌కు చెందిన జ్యోతి(19)కి గత నెల 20న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత జ్యోతి తల్లి గారింటికి వెళ్లి అక్కడ పదిరోజులు ఉండి ఈ నెల 14న ఎక్కమేడ్‌కు వచ్చింది. ఈ నెల 18న రాత్రి పడుకున్న తర్వాత ఆకస్మికంగా మృతిచెందగా ఈ విషయాన్ని స్వామి చిన్నాన్న చంద్రప్ప మృతురాలి బంధువులకు సమా చారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు పెద్దఎత్తున ఎక్కమేడ్‌లోని స్వామి ఇంటికి చేరుకోగా కోస్గి ఎస్‌ఐ బాలరాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుమార్తె మృతిపై అనుమానం ఉందని తండ్రి గుర్రాల కుశలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఉస్మాన్ వివరించారు.