
14న హెచ్‌సీఏ ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఎంపిక
జడ్చర్ల టౌన్: పట్టణంలోని మినీ స్టేడియం మైదానంలో బుధవారం హెచ్‌సీఏ ఆధ్వర్యంలో అండర్–19, 23 రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బాలుర జట్టును ఎంపిక చేస్తామని జిల్లా క్రికెట్ కార్యదర్శి రాజశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని స్టేడియం మైదానంలో కొనసాగుతున్న క్రికెట్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికలకు జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, షాద్‌నగర్, రాజాపూర్, ఊర్కొండ మండలంలో నివసించే ఔత్సాహికులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రావాలని కోరారు. అనంతరం క్రీడాకారులకు క్రికెట్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు మోయిన్, మహేష్, వార్డు కౌన్సిలర్ ఉమాశంకర్‌గౌడ్, ఫ్‌లైవాక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.