
మరోసారి ‘రిషి‘ విజయకేతనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన టీజీఎప్‌సెట్ ఫలితాలలో మహబూబ్‌నగర్‌లోని ‘రిషి’ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి 73వ ర్యాంకు సాధించి పాలమూరు జిల్లా విద్యాఖ్యాతిని సగర్వంగా నిలిపారని కళాశాల చైర్‌పర్సన్ చంద్రకళ వెంకట్, అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య పేర్కొన్నారు.అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారు అగ్రికల్చర్, ఫార్మ విభాగంలో స్వర్ణకుమారి 73వ ర్యాంకు, హప్స ఫాతిమా 604వ ర్యాంకు, జ్యోతిక 634వ ర్యాంకు, సిరి 859 ర్యాంకు, అలాగే 5,000 లోపు ర్యాంకులు 25 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో ప్రణీత్ కుమార్ 1,521 ర్యాంకు, అహ్మద్ ఇస్త్రార్ మునావర్ 1,726 ర్యాంకు, అలాగే 10,000 లోపు ర్యాంకులు 37 మంది విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.కార్యక్రమంలో అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్ రెడ్డి,ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి, రాఘవేంద్రరావు,అధ్యాపకులు, అధ్యాపకేతర బందం పాల్గొన్నారు.