
కొల్లాపూర్ ఎస్‌బీఐలో షార్ట్‌సర్క్యూట్
కొల్లాపూర్: పట్టణంలోని ఎస్‌బీఐ (ఏడీబీ)లో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. రాత్రి 7:30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బ్యాంకు మేనేజర్‌కు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బ్యాంకులో ఓ కుర్చీ మాత్రమే కాలపోయిందని, ఎటువంటి ఆస్తినష్టం జరగలేదని బ్యాంకు అధికారులు తెలిపారు.
గంజాయి పట్టివేత: నిందితుల అరెస్ట్
జడ్చర్ల: అక్రమంగా దిగుమతి చేసుకున్న గంజాయిని చిన్న చిన్న పాకెట్లుగా మార్చి వినియోగదారులకు విక్రయిస్తున్న నిందితుడితో పాటు గంజాయి సరఫరా చేసిన మరొకరిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు జడ్చర్ల ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. బాలానగర్ మండలం మోతిఘనపూర్‌లో ధన్‌రాజ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో శనివారం అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 760 గ్రాముల గంజాయితో పాటు తూకం యంత్రం, మూడు మొబైల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తంగా రూ.1.20 లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి గంజాయిని సరఫరా చేస్తున్న బిజ్జుసింగ్‌ను కూడా అరెస్ట్ చేసి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఇద్దరు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన వారుగా పేర్కొన్నారు.

కొల్లాపూర్ ఎస్‌బీఐలో షార్ట్‌సర్క్యూట్