
48 గంటలైనా లభించని ఆచూకీ
కృష్ణా: భీమానదిలో మొసలి దాడికి గురైన రైతు ఆచూకీ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు వృథా అయ్యాయి. మండలంలోని కుసుమర్తిలోని భీమానదిలో రైతు జింకల్ తిప్పన్నపై శనివారం మొసలి దాడి చేసి ఈడ్చుకెళ్లిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ, మక్తల్ సీఐ రాంలాల్ ఆధ్వర్యంలో , రెవెన్యూ అధికారులు సోమవారం స్థానిక జాలర్ల సాయంతో నదిలో తిప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటలైనా తిప్పన్న ఆచూకీ లభించక పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా అటవీ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌గౌడ్, నాగేంద్ర, సంతోష్‌పాటీల్, సర్ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తీవ్ర ఆవేదనలో కుటుంబ సభ్యులు
అటవీ అధికారులకు వినతి