
ఎక్కడెక్కడంటే..?
ప్రఽదానంగా ఈ అక్రమ వ్యాపారం జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ మండలాల్లో విచ్చలవిడిగా సాగుతుంది. బాదేపల్లి, బూరెడ్డిపల్లి, మల్లెబోయిన్‌పల్లి, చర్లపల్లి శివార్లలోని గుట్టలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు, శంకరాయపల్లి తండా సమీపంలో గుట్టలను సైతం హరిస్తున్నారు. బాదేపల్లి రంగనాయకస్వామి గుట్టకు సైతం ఎసరు పెట్టారు. చర్లపల్లి శివారులో గుట్టను నామరూపాలు లేకుండా చదును చేసి వెంచర్‌కు సిద్ధం చేశారు. శంకరాయపల్లి తండా సమీపంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో గల బొంగురాల తిప్ప గుట్ట ఇప్పటికే పిట్టగూడుగా మారింది. అలాగే శంకరాయపల్లి తండా సమీపంలోని సర్వే నం.385లో గుట్టను తవ్వేశారు. జడ్చర్లలోని హౌసింగ్‌బోర్డు కాలనీ వెనుక ప్రాంతంలో జాతీయ రహదారి–44 పక్కన గుట్టను బ్లాస్టింగ్ పెట్టి ఆనవాళ్లు లేకుండా చేశారు. హౌసింగ్‌బోర్డు పక్కనే గల మరో గుట్టపై అక్రమార్కుల కన్ను పడింది. గత కొన్ని నెలలుగా భారీ యంత్రాలను పెట్టి గుట్టలను తవ్వి ఓ వైపు మట్టిని తరలించి సొమ్ము చేసుకోవడంతోపాటు వెంచర్ ఏర్పాటుకు చదును చేస్తున్నారు. అలాగే మిడ్జిల్ మండలంలోని కేఎల్‌ఐ కాల్వ కట్ట నుంచి యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు.