
క్రీడలతో శారీరక దారుఢ్యం
కొత్తకోట రూరల్: ప్రస్తుతం మానవాళిని కబళిస్తున్న జీవనశైలి వ్యాధులను దీటుగా తట్టుకోవాలంటే నాణ్యమైన ఆహారంతో పాటు శారీరక దారుఢ్యం ముఖ్యమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ డా. జె.చీన అన్నారు. పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాల వేదికగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంగళ, బుధవారం జరిగిన క్రీడాపోటీల్లో కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లా, ఆదిలాబాద్‌లోని దస్నాపూర్, నల్గొండలోని గడ్డిపల్లి, కొల్లాపూర్‌లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఆటల పోటీలను తప్పనిసరి భాగంగా చేసుకోవాలన్నారు. వ్యక్తిత్వ వికాసం, బృందాలుగా పనిచేయడం, నాయకత్వ లక్షణాలు, ఆలోచన మార్గాల పెంపొందింపు వంటి జీవన వికాస సూత్రాలన్నీ ఫిజికల్ ఫిట్‌నెస్‌తోనే ముడిపడి ఉన్నాయన్నారు. అన్ని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాతినిథ్యం ఉందని.. ఇందుకుగాను ఫిట్‌నెస్ కోచ్‌లు, కావాల్సిన సౌకర్యాలు వర్సిటీ సమకూరుస్తుందని వివరించారు. అనంతరం వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైద య్య, రామగిరి ఖిల్లా ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. బి.నవీన్‌కుమార్, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ నరేష్‌గౌడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. షహనాజ్, పూర్ణిమ మి శ్రా, కో–ఆర్డినేటర్ డా. జి.విద్య, అసిస్టెంట్ ప్రొఫె స ర్లు శ్రీనివాస్, గౌతమి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ మహేష్ పాల్గొన్నారు.