
కనీస వేతనం అందించాలని డిమాండ్..
మూడు మాసాల క్రితం గ్రీన్ చానల్ పద్ధతి ద్వారా వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి బ్యాంక్ అకౌంట్లను సేకరించింది. కానీ జిల్లావ్యాప్తంగా ఆపరేటర్లకు టీజీ బీపాస్ ద్వారా ఒక నెల వేతనమే ఇచ్చారు. ఇంకా కొన్ని మండలాల్లో ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు అందాల్సి ఉంది. ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5గంటలకు ఇంటికి వెళతారు. తమతో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ప్రజాపాలన దరఖాస్తులు, ఓటర్ల జాబితా, ఇతర సర్వేలు ఆన్‌లైన్ చేయిస్తూ.. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రకాల పనులు చేస్తున్నా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి కనీస వేతనం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని, క్రమం తప్పకుండా ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు కోరుతున్నారు. అలాగే హెల్త్‌కార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వ జీఓ ప్రకారం ప్రతి కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.28,000 జీతం ఇవ్వాలని కోరుతున్నారు.