
బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం
ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి క్షేత్రంలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో వేలాది భక్తజనం పాల్గొనగా.. బీచుపల్లి క్షేత్రమంతా అంజన్న నామస్మరణతో మార్మోగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు అభయాంజనేయస్వామిని ప్రత్యేకంగా అలంకరించి.. పంచామృతాభిషేకం, వ్యాసపూజలు చేశారు. మధ్యాహ్నం ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన సీతారాముల కల్యాణ వేడుకను భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రథంగా హోమం, రాత్రికి కుంభం పూజలు చేశారు. అనంతరం వేలాది భక్తజనం నడుమ అంజన్న రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతకుముందు దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. అభయాంజనేయస్వామి దర్శనానికి బారులు దీరారు. పలువురు భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్స వాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో మి ఠాయి, బొమ్మలు, గాజుల దుకాణాలు సందడిగా కనిపించాయి. కార్యక్రమంలో ఆలయ ఇఓ రా మన్‌గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా అభయాంజనేయస్వామి రథోత్సవం
మార్మోగిన అంజన్న నామస్మరణ
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం

బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం