breaking news
Telangana
-
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సిర్పూర్: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మహిళలు మృతిచెందారు.. ఈ ఘటన దేవాడ్-సోండో సమీపంలో చోటుచేసుకుంది.స్థానికులు మరియు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కాగజ్ నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబం వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి వెళ్ళారు. వారితో పాటు బంధువులూ ఉన్నారు.బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణంలో వీరు వస్తున్న కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడింది. ఈ ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్ మరియు బంధువులు ఆఫ్జా బేగం, సహారా మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చంద్రపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రేమ వ్యవహారం మలుపు.. నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితి
నల్లగొండ జిల్లా: నేరడుగొమ్ము మండలంలో ప్రేమికుడు మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పులికంటి శ్రీను అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించి, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు మంజుల ఆరోపిస్తోంది. ఈ క్రమంలో గురువారం శ్రీను ఇంటి ఎదుటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన మంజుల, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంజుల కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోగా, తోపులాట కూడా జరిగింది. తనకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అంటూ మంజుల ఆవేదన వ్యక్తం చేసింది.ప్రేమ పేరుతో మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఘటన అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని మంజులను శాంతింపజేశారు. ప్రస్తుతం ఆమె ప్రియుడు పులికంటి శ్రీను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మద్యం బాటిల్లో బల్లి తోక..
మహబూబాబాద్ జిల్లా: మందుబాబులు తాగుతున్న మద్యం బాటిల్లో బల్లితోక కనిపించడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఓ బెల్ట్ షాపులో బుధవారం చోటుచేసుకుంది. బాధిత మందుబాబుల కథనం ప్రకారం.. మండలంలోని వీరారం గ్రామానికి చెందిన కొందరు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా సమీపంలోని ఓ బెల్ట్ షాపులో బ్లెండర్ స్పైడ్ ఫుల్ బాటిల్ కొనుగోలు చేసి సేవిస్తున్నారు. ఈ క్రమంలో సగానికిపైగా అయిపోయిన మద్యం బాటిల్లో ఓ వింత ఆకారం కనిపించగా బయటికి తీశారు. అది తోకగా గుర్తించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మందుబాబులు వాంతులు చేసుకున్నారు. గొంతులో మంటగా ఉందని కేకలు పెట్టారు. అక్కడున్న కొందరు సదరు బెల్ట్ షాపు నిర్వాహకుడిని నిలదీయగా సమాధానం చెప్పకుండా అక్కడినుంచి జారుకున్నాడు. ఇది కల్తీ మద్యంగా భావించిన బాధితులు సంబంధిత ఎక్సైజ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. -
పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది!
తెలంగాణ పల్లెల్లో మళ్లీ కొత్త పాలన మొదలైంది. ఊరూరా ఎన్నికల కోలాహలం ముగిసి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు నియామక పత్రాలు అందుకుని గద్దెనెక్కారు. అయితే, కొంతమంది సర్పంచుల్లో ఈ విజయోత్సాహం వెనుక ఒక చేదు నిజం కూడా ఉంది. ఎన్నికల హోరాహోరీలో గెలుపు కోసం చాలా చోట్ల తాయిలాలు, నగదు ప్రవాహం రాజ్యమేలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు కొత్త సర్పంచుల ముందున్న లక్ష్యం ఏమిటి? ఎన్నికల్లో ఖర్చు చేసిన పెట్టుబడిని రాబట్టుకునే మార్గాలను వెతకడమా? లేక పల్లె ప్రగతికి బాటలు వేయడమా? అనే సందిగ్ధం కొద్దిమందిలో నెలకొంది.2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సర్పంచ్‌కు ఒక సామాన్య ప్రతినిధి హోదా నుంచి గ్రామ పాలకుడి స్థాయి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం అంటే ఆధిపత్యం కాదు.. పారిశుధ్యం, హరితహారం, మౌలిక వసతుల కల్పనలో చూపాల్సిన కార్యదక్షత. ఓటును కొనుక్కున్నామనే భావన పక్కన పెట్టి, గ్రామ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రతి పైసాను అభివృద్ధికి వెచ్చించేలా సర్పంచులు అడుగులు వేయాల్సిన సమయం ఇది. పదవిని ఒక వ్యాపారంగా చూడకుండా, పల్లెను ఒక ఆదర్శంగా మార్చే బాధ్యతగా స్వీకరించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక వికాసానికి గ్రామాలు పట్టుకొమ్మలు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఒక స్వయం ప్రతిపత్తి గల యూనిట్‌గా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో సర్పంచ్ కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, గ్రామ సర్వతోముఖాభివృద్ధికి సారథి.పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ విధులుగ్రామసభ నిర్వహణ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభను నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించడం.పారిశుధ్యం, ఆరోగ్యం.. గ్రామంలో చెత్త సేకరణ (తడి, పొడి చెత్త విభజన), మురుగు కాలువల శుభ్రత, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం సర్పంచ్ ప్రథమ కర్తవ్యం.హరిత హారం.. గ్రామంలో నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల్లో కనీసం 85% బతికించాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉంటుంది.ఆర్థిక నిర్వహణ.. పంచాయతీ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయడం, వార్షిక బడ్జెట్ ఆమోదించి, ఆడిటింగ్‌కు సహకరించడం.మౌలిక సదుపాయాలు.. వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, అంతర్గత రోడ్ల మరమ్మతులు పర్యవేక్షించడం.ఎన్నికల ఖర్చు.. అభివృద్ధి కాంక్షఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భారీగా ఖర్చు చేశారనే వాదనలు ఉన్న మాట వాస్తవం. అయితే, ‘పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలి’ అనే ధోరణితో సర్పంచులు పనిచేస్తే, అది గ్రామానికి శాపంగా మారుతుంది. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు (కలెక్టర్ ద్వారా తొలగింపు) ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాలి. రాజకీయ అధికారం అనేది కేవలం ఐదేళ్ల అవకాశం. ఈ సమయంలో సంపాదించిన సొమ్ము కంటే గ్రామంలో నిర్మించిన అభివృద్ధి చిహ్నాలు, ప్రజల గుండెల్లో సంపాదించుకున్న గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి.గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే మార్గాలుకొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడానికి కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. గ్రామ పంచాయతీ సేవలను ఆన్లైన్ చేయడం, ప్రతి పద్దును ప్రజల సమక్షంలో చర్చించి ఖర్చు చేయడం ద్వారా పారదర్శకతను పెంచవచ్చు. గ్రామ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేషించాలి. పన్నుల వసూలులో క్రమశిక్షణ పాటించాలి. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు అందించాలి. ఏదైనా పని చేసే ముందు ప్రజల సలహాలను తీసుకోవడం వల్ల పనుల్లో నాణ్యత పెరుగుతుంది. జవాబుదారీతనం ఉంటుంది.సర్పంచ్ పదవి అనేది కేవలం హోదా కాదు, అది ఒక గొప్ప సామాజిక బాధ్యత. ఎన్నికల్లోని ఖర్చును ఒక సామాజిక సేవగా భావించి, రాబోయే ఐదేళ్లు గ్రామ పురోభివృద్ధికి అంకితం కావాలి. పచ్చని చెట్లు, శుభ్రమైన వీధులు, విద్యావంతులైన యువత.. ఉన్న గ్రామమే నిజమైన బంగారు తెలంగాణకు పునాది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాభపడటం కంటే ఒక తరాన్ని బాగు చేసే గ్రామ నాయకుడిగా ఎదగడమే సర్పంచుల అసలు విజయం.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
బండి సంజయ్ ఆదేశాలు.. ఖమ్మంలో ఎన్ఐఏ సోదాలు!
సాక్షి, ఖమ్మం: జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖుల ఇళ్లు.. బంధువుల ఇళ్లలో ఎన్ఐఏ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని నెలల కిందట పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ ఖమ్మంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే ఈ ప్రదర్శనల్లో ఈ ఇద్దరు ప్రముఖులు పాల్గొనడాన్ని స్థానిక బీజేపీ నేతలు తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి(సహాయ) బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఆయన ఆదేశాల మేరకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆరుగురు సభ్యుల ఎన్ఐఏ బృందం ఆ ఇద్దరి నివాసాల్లో.. బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిపినట్లు సమాచారం. ఈ ఇద్దరికి ఉగ్రవాద సంస్థలతో లేదంటే మావోయిస్టులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అని దర్యాప్తు సంస్థ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే.. ఈ తనిఖీలను స్థానిక పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఇదీ చదవండి: ఉగ్రవాదుల కన్నా మేధావులే మరీ డేంజర్! -
వరుస బస్సు ప్రమాదాలు.. 2025లో భారీగా మరణాలు
దేశంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో బస్సులో సేదదీరుతూ గమ్యం చేరాలనుకునే సుదూర ప్రయాణికులు ఊహించని ప్రమాదాల్లో శాశ్వత నిద్రలోకి వెళ్లడం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ ఏడాది(2025) భారీ సంఖ్యలో వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు.కార్లు, బైకులు, ఇతర ప్రైవేటు వాహనాలతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణం సురక్షితం. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురైనా ప్రాణ నష్టం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కానీ, అదే అగ్ని ప్రమాదానికి గురైన సమయాల్లో ప్రాణ నష్టం ఊహకు అందడం లేదు. ప్రయాణికులు తేరుకునేలోగానే అగ్ని కీలలు వారిని ఎలా ముంచెత్తుతాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఏడాది జరిగిన బస్సు ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి.మేజర్ ప్రమాదాలు.. సెప్టెంబర్ 14న రాజస్థాన్‌లో దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగి 20 మంది సజీవదహనమయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనక భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి.సెప్టెంబర్ 23న తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35మంది నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు దగ్ధమైంది.సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి బయల్దేరిన బస్సు ఎస్సార్ నగర్ చౌరస్తాలో ఉమేశ్ చంద్ర విగ్రహం వద్దకు రాగానే ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి.అక్టోబర్ 24న కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం. అర్ధరాత్రి బైక్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.అక్టోబర్ 26న యూపీలో స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు.అక్టోబర్ 29న మహారాష్ట్రలోని సమృద్ది హైవేపై బస్సులో మంటలు.నవంబర్ 3న చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం.డిసెంబర్ 12న మారేడుమిల్లి వద్ద లోయలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు.ఈనెల 16న యూపీలోని మథుర వద్ద ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదం. పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు, కార్లు. వాహనాల్లో మంటలు చెలరేగి 13 మంది మృతి, దాదాపు 60 మందికి గాయాలు.డిసెంబర్ 24న తమిళనాడులో రెండు కార్లను ఢీకొన్న బస్సు తొమ్మిది మంది మృతి.డిసెంబర్ 25(ఈరోజు) కర్ణాటకలో బస్సు ప్రమాదం. దాదాపు 13 మంది మృతి, పలువురికి గాయాలు. -
చలి చలిగా.. రోడ్లు ఖాళీగా!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో చలి మామూలుగా లేదు.. నగరవాసిని గజగజ వణికిస్తోంది.. సాధారణ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోతున్నాయి.. శీతల గాలులు విజృంభిస్తున్నాయి.. రాత్రిపూట చలిచలిగా ఉంటోంది.. ఉదయంపూట రోడ్లు ఖాళీఖాళీగా ఉంటున్నాయి.. మొత్తంగా నగరం చలి పంజాలో చిక్కుకుని ఉంది. సగటున నగరంలో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శివారు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ప్రజలు స్వెటర్లు, జాకెట్లు, దుప్పట్లను ఆశ్రయిస్తున్నారు. శీతల గాలుల ప్రభావంతో ఉదయం వేళల్లో రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. పార్కులు, మార్నింగ్ వాక్ చేసే ప్రాంతాల్లో ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గింది. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లేవారు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పేదల జీవనం చలితో మరింత కష్టంగా మారింది. రోడ్ల పక్కన నివసించే వారు ఉదయం వేళ చలి మంటలు వేసుకుని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు పంపిణీ చేస్తూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే కొన్ని రోజులు కూడా చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశముంది. సాధ్యమైనంత మేరకు ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
ప్రమాణం చేయకుండానే సర్పంచ్ మృతి
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ (ఎన్) గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కమ్మ (58) కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. అయితే ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పదవీ ప్రమాణం చేయలేకపోయారు. కాగా, పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మిర్జాపూర్ (ఎన్) గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కమ్మ సర్పంచ్‌గా గెలిచారన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబం ఆమె మరణంతో విషాదంలో మునిగిపోయింది.ఓటేయలేదని బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్యశంకర్పల్లి: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని బెదిరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగా రెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై మోకిల సీఐ వీరబాబు, మృతుని తల్లి పద్మ తెలిపిన వివరాలివి. గోపులారం గ్రామానికి చెందిన వెంకటేశ్, పద్మలకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు అనిల్ (28).. దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో చీర సాయికుమార్ అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తనకు మద్దతు తెల పలేదంటూ మంగళవారం రాత్రి అనుచరులతో కలిసి అనిల్‌ను బెదిరించా డు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్ ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పా డు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్ బెదిరింపుల వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్సిల్ గుచ్చుకుని.. బాలుడి మృతి?
కూసుమంచి: ప్రమాదవశాత్తు కిందపడ్డ బాలుడి చేతిలోని పనునైన పెన్సిల్ గొంతు కిందభాగంలో దిగడంతో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన మేడవరపు ఉపేంద్రాచారి – మౌనిక దంపతులకు కుమారుడు విహార్ (8), కుమార్తె వర్షిత సంతానం. విహార్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ, వర్షిత ఎల్కేజీ చదువుతున్నారు. రోజులాగే బుధవారం ఉదయం పిల్లలిద్దరూ బస్సులో పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం మూత్రవిసర్జన కోసం విహార్ మిగతా విద్యార్థులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత పాఠశాల మైదానంలో పరుగెత్తుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అయితే బాలుడి చేతిలో పదునుగా చెక్కిన పెన్సిల్ ఉండటంతో బోల్తా పడగానే బాలుడి గొంతు కిందిభాగంలో అది దిగబడింది. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో విద్యార్థులు పైకి లేపి ఉపాధ్యాయులకు తెలిపారు. కరస్పాండెంట్ నాగార్జున, ఉపాధ్యాయులు వచ్చి బాలుడిని తొలుత స్థానిక ఆర్ఎంపీ వద్దకు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఖమ్మం తరలించే క్రమంలో ఊపిరి వదిలాడు. కాగా, ఉదయం ఆనందంగా ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఇంకాసేపట్లో వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా ప్రమాదం విషయం తెలియడంతో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. విహార్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. పెన్సిల్‌పై రక్తపు మరకలు లేవెందుకు? కాగా, విహార్ చేతిలోని పెన్సిల్ గొంతులో గుచ్చుకోవడమే మృతికి కారణమని చెబుతున్నా.. పెన్సిల్‌కు రక్తపు మరకలు లేకపోవడంపై బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బాలుడు బోల్తా పడినప్పుడు చేతిలోని పెన్సిల్ గొంతులో దిగిందని.. ఆ వెంటనే విహార్ స్నేహితులు కంగారుగా వెల్లకిలా తిప్పేలోగా పెన్సిల్ గొంతు నుంచి ఊడి కింద పడిందని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాతే గొంతు వద్ద గాయం నుంచి రక్తస్రావం మొదలైందని వెల్లడించారని సమాచారం. ఈ విషయమై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సైతం విహార్ స్నేహితులు, పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
ఎత్తిపోతలకు ‘కరెంట్’ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారంగా మారింది. వాటి విద్యుత్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో బకాయిలు ఏటేటా పెరిగి కొండలాగా మారాయి. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు విద్యుత్ సరఫరా చేస్తున్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు ఏకంగా రూ.24,312 కోట్లకు ఎగబా కాయి. 2014–25 మధ్య కాలంలో మొత్తం రూ.36,435 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.12,278 కోట్లు మాత్రమే చెల్లించింది. » ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లకు విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు చెల్లించా ల్సిన బకాయిలు మరో రూ.1,550.22 కోట్లకు పెరిగాయి. » నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల సబ్స్టేషన్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు రూ.4,849.57 కోట్లకు చేరాయి. మొత్తం కలిపి రూ.30,711.79 కోట్ల బిల్లుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలు, ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది.కరెంట్ బకాయిలు ఇలా.....కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని వివిధ పంప్‌హౌస్‌ల నిర్వహణకు సంబంధించిన మొత్తం 17 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2019–20 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 9,384 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇందుకుగాను మొత్తం రూ.13,156 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, ప్రభుత్వం రూ.3,971 కోట్లు మాత్రమే చెల్లించడంతో రూ.9,185 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. » దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 13 విద్యుత్ కనెక్షన్లుండగా, 2014–15 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 5,257 ఎంయూల విద్యుత్ వినియోగం జరిగింది. మొత్తం రూ.5,568 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తే ప్రభుత్వం రూ.1,727 కోట్లను మాత్రమే చెల్లించింది. »ఇతర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం 462 కనెక్షన్లుండగా, 2014–15 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 15,971 ఎంయూల విద్యుత్ వినియోగం జరిగింది. మొత్తం రూ.17,710 కోట్ల బిల్లులు రాగా ప్రభుత్వం రూ.6,580 కోట్లు చెల్లించింది. రెండేళ్లుగా సబ్స్టేషన్లలో....కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సబ్స్టేషన్ల పనులను రెండేళ్లుగా కాంట్రాక్టర్లు నిలుపుదల చేశారని ట్రాన్స్‌కో ప్రభుత్వానికి నివేదించింది. ఎత్తిపోతల పథకాల సబ్ స్టేషన్ల నిర్మాణ బాధ్యతలను గత ప్రభుత్వం ట్రాన్స్‌కోకు అప్పగించింది. మొత్తం రూ.10,037.12 కోట్ల వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన సబ్స్టేషన్ల నిర్మాణ పనులను ట్రాన్స్‌కో పర్యవేక్షిస్తుండగా, ప్రభుత్వం రూ.4,749.57 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు బకాయిపడింది. నిర్మాణం పూర్తయిన ఎత్తిపోతల పథకాల సబ్స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణను చూస్తున్నందుకుగాను ట్రాన్స్‌కో రూ.1550.22 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. -
పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు ఎన్నికలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సహకార చట్టంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికయ్యే పీఏసీఎస్‌ల స్థానంలోనే రాష్ట్రవ్యాప్తంగా ‘నాన్ అఫీషియల్ పీఏసీఎస్’లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్త సంవత్సరంలో అన్ని పీఏసీఎస్‌లకు ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన ‘త్రీమెన్’కమిటీలను ఏర్పాటు చేసి, వారిలో నుంచే డీసీసీబీ, డీసీఎంఎస్, టెస్కాబ్ కమిటీలకు కూడా పాలకుల ‘ఎంపిక’జరిగేలా కసరత్తు సాగుతోంది. ఈ మేరకు సహకార శాఖ నూతన విధివిధానాలు రూపొందించే పనిలో ఉంది. కొత్తగా చట్టాల్లో మార్పులేమీ చేయకుండానే, సహకార శాఖ చట్టంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2017 నుంచే కొనసాగుతున్న ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే రాష్ట్రంలోని 908 పీఏసీఎస్‌లకు ‘రాజకీయ’త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే నెలలో మొదలుకాబోతుందని చెపుతున్నారు. వెంటనే పర్సన్ ఇన్చార్జీల నియామకం2019 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయ సహకార సంఘాల సొసైటీలకు ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. సుమారు 10 నెలల క్రితం ఈ సొసైటీల కాలపరిమితి పూర్తి కావడంతో ప్రభుత్వం ఆరునెలల చొప్పున రెండుసార్లు ఆయా సొసైటీల పదవీకాలాన్ని పొడిగించింది. కాగా సర్పంచ్ల ఎన్నికలు పూర్తయి, ఎన్నికల కోడ్ ముగిసిన ఈనెల 19వ తేదీనే 908 పీఏసీఎస్‌లతో పాటు 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌ల సొసైటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటే సొసైటీల స్థానంలో పర్సన్ ఇన్చార్జీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరుసటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమితులైన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ ఇన్స్పెక్టర్లు బాధ్యతలు తీసుకున్నారు. వీరి నియామకం సందర్భంగా ఇచ్చిన జీవో 597లో ప్రభుత్వం ‘ఈ ఇన్చార్జీలు 6 నెలలు లేదా ఎన్నికలు జరిగేంత వరకు లేదా ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. వీటిలో ఏది ముందయితే అంతవరకు..’కొనసాగుతారని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఎన్నికలు రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నందున అధికారులతో ఏర్పాటైన పర్సన్ ఇన్చార్జీ కమిటీల స్థానంలో నాన్ అఫీషియల్ పీఏసీఎస్‌లను నియమించాలని నిర్ణయించింది. సహకార చట్టంలో పీఏసీఎస్‌లకు ఏర్పాటయ్యే కమిటీల విషయంలో స్పష్టమైన విధివిధానాలను పొందుపరచడంతో వాటికి అనుగుణంగానే త్రీమెన్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘వ్యవసాయ సహకార సంఘానికి ఎన్నికలతో ఏర్పాటైన కమిటీ (ఎలక్టెడ్ పీఏసీఎస్) లేదా అధికారులతో కూడిన కమిటీ (అఫీషియల్ పీఏసీఎస్) లేదా అధికారులు కాని వారితో కూడిన కమిటీ (నాన్ అఫీషియల్ పీఏసీఎస్) ఉంటుంది’అనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరచడంతో ‘నాన్ అఫీషియల్ పీఏసీఎస్’లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. -
2,322 స్టాఫ్‌నర్స్ పోస్టుల ‘ఫస్ట్ లిస్ట్’ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ‘ఫస్ట్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్’ను బుధవారం విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాసిన మొత్తం 40,423 మంది అభ్యర్థుల వివరాలను, వారు సాధించిన మార్కులతో సహా బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించే క్రమంలో భాగంగా ఆయా దశల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్న బోర్డు, తాజాగా విడుదల చేసిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాపైనా అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తెలిపేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు బుధవారం నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్సైట్లో లాగిన్ అయి.. తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ‘సెకండ్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్’ను విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచి, అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేస్తారు.జనవరిలో ఉద్యోగాల్లోకి..వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన 1,260 ల్యాబ్ టెక్నీషి యన్ పోస్టుల నియామక ప్రక్రియను ఇటీవలే బోర్డు పూర్తి చేసింది. ఈ ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు, ఉద్యోగాలకు ఎంపికయ్యే 2,322 మంది నర్సింగ్ ఆఫీసర్లు కూడా జనవరిలోనే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని వైద్యశాఖ చెపుతోంది. గత సంవత్సరం 7 వేలకు పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్సుల కొరత పూర్తిగా తీరగలదని అధికారులు భావిస్తున్నారు.రెండేళ్లలో 11 వేలకుపైగా పోస్టుల భర్తీఆరోగ్యశాఖలో రెండేళ్లలో సుమారు 11 వేల ఉద్యోగాలు భర్తీ కాగా, అందులో 9 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 600 పైగా డాక్టర్లు, అలాగే ల్యాబ్ టెక్నీషి యన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 5 వేలకుపైగా పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. ఇందులో 1,600 పైగా స్పెషలిస్ట్ డాక్టర్ (సీఏఎస్ స్పెషలిస్ట్) పోస్టులు, 600 పైగా అసి స్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 700 పైగా ఫార్మసిస్ట్ పోస్టు లు, సుమారు 2 వేల వరకూ మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
మహబూబాబాద్ రూరల్: భర్త చనిపోతే ఆయనపై ఉన్న ఇంటి రుణం మాఫీ అవుతుందని, పనిలోపనిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగుతుందని ఓ మహిళ తన ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో భర్తను హత్య చేయించింది. తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించగా పోలీసులు కేసును ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపారు. డీఎస్పీ ఎన్.తిరుపతిరావు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన కౌలురైతు భూక్య వీరన్న సోమవారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున బోడమంచ తండా నుంచి బేరువాడ గ్రామానికి వెళ్లే దారిలో అతని మృతదేహం కనిపించింది. మృతుడి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భూక్య వీరన్న భార్య విజయకు అదే తండాకు చెందిన బోడ బాలోజీకి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరన్న ఆర్థిక సమస్యలతో బాధపడుతుండగా బాలోజీ తన వ్యవసాయ భూమి అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. ఇంకా అప్పులు మిగిలి ఉండటంతో బోడ బాలోజీ, అతని స్థలంలో అద్దెకు ఉండే ఆర్ఎంపీ వైద్యుడు, గూడూరు మండలం రాజనపల్లి గ్రామానికి చెందిన ధర్మారపు భరత్‌కు వీరన్న తన ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని తెలియజేశాడు. దీంతో భరత్ ముత్తూట్ సంస్థలో వీరన్నకు ఇంటిపై రుణం ఇప్పించగా అదే సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే రుణం మాఫీ అవుతుందని కూడా చెప్పాడు. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ కలిసి ఎలాగైనా వీరన్నను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించాలని, దీనివల్ల అప్పు మాఫీతోపాటు తమ వివాహేతర సంబంధానికి అడ్డు కూడా తొలగుతుందని భావించారు. ఈ క్రమంలో ఆర్ఎంపీ వైద్యుడు భరత్ సహాయం తీసుకుని సోమవారం రాత్రి వీరన్నను మద్యం సేవిద్దామని చెప్పి బాలోజీ.. తండా బయట ఉన్న పామాయిల్ తోట వద్దకు పిలిచాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగాక పథకం ప్రకారం బాలోజీ తనవెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో వీరన్న తల వెనుక బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. భరత్ టవల్‌తో ముక్కు, నోరుమూసి చనిపోయాక దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికిగాను బేరువాడ వెళ్లే రోడ్డు పక్కన పొలంలో మృతుడి ద్విచక్ర వాహనంతో సహా పడేశారు. కేసు విచారణలో భార్య విజయ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా హత్యగా తేలింది. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ, ఆర్ఎంపీ భరత్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, రెండవ ఎస్సై నరేశ్, సిబ్బందికి ఎస్పీ డాక్టర్ శబరీశ్ అభినందనలు తెలిపారు. -
రెండేళ్లు ఒకే చోట ఉంటే బదిలీ
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. రెండేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న వారిని నాన్–ఫోకల్ పోస్టుల్లోకి మార్చాలని భావిస్తోంది. అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతున్న వారినీ దూర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపినట్టు తెలిసింది. ప్రభుత్వం దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.బదిలీలకు సంబం«ధించిన మార్గదర్శకాలను త్వరలోనే రూపొందించాలని, మార్చిలోపే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ శాఖలో బదిలీలు చేపట్టలేదు. ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు వీలుగా ప్రభుత్వానికి సిఫార్సులు పంపారు. త్వరగా వివరాలు ఇవ్వండిఉద్యోగుల సమగ్ర వివరాలను ఇంధన శాఖ కార్యాలయం సేకరిస్తోంది. ఏ ఉద్యోగి ఎక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు? గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు? ఎలాంటి ఫిర్యాదులున్నాయి? ఇందులో వృత్తిపరమైన నిర్లక్ష్యం... డబ్బులు డిమాండ్ చేస్తున్నవి... స్థానికంగా ఉండటం లేదని వస్తున్న ఫిర్యాదులను వేర్వేరుగా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఇంధన శాఖ కోరింది. జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులను ఈ వివరాలు కోరారు. వాస్తవానికి మూడేళ్లు ఒకేచోట పనిచేస్తే బదిలీ చేసే అవకాశం ఉంటుంది. దీనిని రెండేళ్లకు కుదించాలని నిర్ణయించారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలు వెళ్లాయి. జెన్కో ప్లాంట్లు, ట్రాన్స్‌కోలో ఫీల్డ్ సిబ్బంది విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని అనుకుంటున్నారు. అయితే, స్కిల్డ్ పోస్టులైన ఇంజనీర్లు ప్లాంట్లల్లో పోస్టింగ్‌లు పొంది, డిప్యూటేషన్‌పై హైదరాబాద్ జెన్కో కార్యాలయంలో పనిచేస్తున్న వారి వివరాలను పరిశీలిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని తిరిగి ప్లాంట్లకే పంపే యోచనలో ఉన్నారు. అవినీతే ప్రధాన కారణం ఆరు నెలలుగా విద్యుత్ సిబ్బందిపై 3,841 ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఇందులో విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బందిపైనే ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం మొదలుకొని, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వరకూ భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదుల్లో ఉంది. వ్యవసాయ ఉచిత విద్యుత్ పొందే రైతుల వద్ద కూడా ముడుపులు తీసుకోవడం అధికారుల దృష్టికి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పారిశ్రామిక సంస్థల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల అవినీతి నిరోధక శాఖ దాడుల్లోనూ కొంతమంది డీఈ, ఏఈ స్థాయి అధికారులు పట్టుబడ్డారు. వారి ఆస్తుల చిట్టాలు భారీగా ఉండటాన్ని ఏసీబీ గుర్తించింది. కొన్నిచోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ కింద వేరేవాళ్లను నియమించుకొని విధులకు హాజరవ్వని ఉదంతాలు అధికారుల దృష్టికి వచ్చాయి. ఇవన్నీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఇటీవల సీఎం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి నిఘా, ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మీరే కాపాడాలి...వ్యక్తిగత వివరాలపై ఉన్నత స్థాయిలో దృష్టి పెట్టడంతో విద్యుత్ పంపిణీ సిబ్బంది రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక నేతల ఆశీస్సులతో, పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చి పోస్టులు పొందిన వారిలో గుబులు మొదలైంది. ఎలాగైనా ఉన్న చోటును కాపాడుకునేందుకు బేరసారాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైరిపక్షం కుట్ర పూరితంగా ఫిర్యాదులు ఇచ్చారని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. మరికొంత మంది విద్యుత్ ఉన్నతాధికారుల సాన్నిహిత్యంతో ఫోకల్ పోస్టులు పొందారు. వారంతా అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాల పరిధిలో ఇలాంటి ఫైరవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
‘డీజీపీ’ అర్హుల లిస్ట్ యూపీఎస్సీకి పంపండి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ పోస్టుకు అర్హులైన వారి పేర్లతో ఐపీఎస్ అధికారుల ప్యానెల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ పంపిన వివరాలు అక్కడి నుంచి వచ్చిన ఆమోదంతో ఓ నివేదికను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు శివధర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్‌కు తేల్చిచెప్పింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2025న సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్‌కు పంపిన ప్యానె ల్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యూపీఎస్సీ మధ్య జరిగిన ఉత్తర ప్ర త్యుత్తరాల వివరాలను సమర్పించారు. ఆంధ్రప్ర దేశ్‌కు కేటాయించగా, తెలంగాణలో పనిచేస్తున్న 1994 బ్యాచ్ అధికారిణి అభిలాష బిస్త్‌ను ప్యానెల్లో చేర్చవచ్చా అని కమిషన్‌ను ప్రభుత్వం అడిగిందని, అందుకు యూపీఎస్సీ నుంచి ప్రతికూల సమాధానం వచ్చిందన్నారు. కమిషన్ కోరిన వివరణలు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల్లో లోపాల కారణంగా డీజీపీ ప్రక్రియ ఆలస్యమైందని యూపీఎస్సీ తరఫు న్యాయవాది అజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అడిగిన వివరాలు పంపితే.. ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. పార్టీ ఇన్ పర్సన్ (పిటిషనర్) వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టిన శివధర్‌రెడ్డి నియామకం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రెండు నెలలకుపైగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. శివధర్‌రెడ్డి నియామక రద్దుకు నిరాకరించారు. యూపీఎస్సీకి ఎంపిక ప్యానెల్‌ను పంపే ప్రక్రియ కొనసాగించాలన్నారు. నివేదిక అందజేసిన తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తామంటూ విచారణ వాయిదా వేశారు. ప్రకాశ్‌సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలివి...» డీజీపీ ఖాళీకి మూడు నెలల ముందే రాష్ట్రాలు ఐపీఎస్‌ల పేర్లను యూపీఎస్సీకి పంపాలి» కమిషన్ ముగ్గురితో కూడిన ప్యానెల్‌ను వెనక్కి పంపించాలి» అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవచ్చు» డీజీపీకి కనీసం రెండేళ్ల పదవీకాలం ఉండేలా రాష్ట్రం, యూపీఎస్సీ ఎంపిక ఉండాలి » యాక్టింగ్, తాత్కాలిక డీజీపీలను రాష్ట్రాలు నియమించుకోవడం నిషేధం» ఎంపిక చేసిన వ్యక్తి పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగొచ్చు. అయితే, పొడిగింపునకు సహేతుక కారణం ఉండాలి» సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నియామకాలుంటే నిలిపివేయబడతాయి. -
మళ్లీ తెరపైకి ‘డీజీపీ’
సాక్షి, హైదరాబాద్: శివధర్‌రెడ్డి పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి పంపించాలని హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ నియామక వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించే సమయంలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం డీజీ కేడర్ ఉన్న అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపించింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేరు ఆ జాబితాలో లేకపోవడంతో దానిని యూపీఎస్సీ తిప్పి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పంపించిన జాబితాలోని ఇద్దరు అధికారులు జితేందర్, రవిగుప్తా ఉద్యోగ విరమణ చేశారు. ఈ జాబితా పంపించే సమయానికి అభిలాష బిస్త్ ఏపీ కేడర్ అధికారిగా డీఓపీటీ నిర్ణయించింది. దీంతో ఆమె పేరును కూడా పరిగణనలోకి తీసుకోలేదు. యూపీఎస్సీకి జాబితా తిరిగి పంపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. ఈ తరుణంలో ఓ సామాజిక కార్యకర్త డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం డీజీపీ నియామకంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, అందుకు అనుగుణంగా డీజీ ప్యానల్ జాబితాను యూపీఎస్సీకి రెండు వారాల్లోగా పంపించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీజీ కేడర్‌లో ఉన్న 1:2 నిష్పత్తిలో యూపీఎస్సీకి పంపించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో కీలకమైన వాటిలో డీజీ పోస్టు కోసం పంపించే జాబితాలోని అధికారులకు ఉద్యోగ విరమణకు ఇంకా కనీసం ఆరు మాసాల గడువు ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుత ఇన్చార్జ్ డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆయన పేరును యూపీఎస్సీ పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా ? అన్నది కీలకంగా మారుతుందని సీనియర్ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం యూపీఎస్సీకి పంపించే జాబితాలో ఇదివరకు వచ్చిన కొర్రీకి కొనసాగింపుగా సమాధానంగా పంపిస్తున్నట్టు పేర్కొంటే.. శివధర్‌రెడ్డికి ఇబ్బంది లేదని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదట జాబితా పంపించే సమయంలో వినయ్ ప్రభాకర్ ఆప్టే పేరును ఎందుకు చేర్చలేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాల కేడర్‌కు కేటాయిస్తారు. వీరిలో కొందరు కేంద్రంలో పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వెళుతుంటారు. వినయ్ ప్రభాకర్ ఆప్టే కూడా డిప్యుటేషన్‌పై వెళ్లిన అధికారి మాత్రమే.. ఆయన సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగినంత మాత్రాన ఆయన రాష్ట్ర కేడర్‌కు చెందకుండాపోరని సీనియర్ అధికారులు అంటున్నారు. యూపీఎస్సీ ఎత్తిచూపే వరకు జరిగిన పొరపాటును రాష్ట్ర అధికారులు గుర్తించకపోవడం గమనార్హమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల్లోగా పంపే జాబితాలో డీజీ కేడర్ అధికారులు వినయ్ ప్రభాకర్ ఆప్టే, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, శిఖాగోయల్, సౌమ్యామిశ్రా ఉండనున్నట్టు తెలిసింది. ఈ జాబితా వెళ్లిన తర్వాత అందులో నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే.. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. ఈ నియామక తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన అ పదవిలో కొనసాగుతారు. గతంలో తెచ్చిన చట్టాన్ని అబయన్స్‌లో పెట్టిన సుప్రీం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డీజీపీ నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన చట్టాన్ని సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టడంతోపాటు అబయన్స్‌లో పెట్టింది. ‘తెలంగాణ డీజీపీ అపాయింట్మెంట్ యాక్ట్’సీనియర్ అధికారిని డీజీపీ నియమించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదని తెచ్చిన ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో దానిని సుప్రీంకోర్టు అబయన్స్‌లో పెట్టిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
జేఈఈ ప్రశ్నావళి @ ఏఐ
సాక్షి, హైదరాబాద్: జాతీయ పోటీ పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకపాత్ర పోషించబోతోంది. కేంద్ర విద్యాశాఖ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా జేఈఈ మెయిన్స్‌లో వీలైనంత త్వరగా ఏఐని అందుబాటులోకి తేనున్నారు. కాన్సెప్ట్ క్లారిటీ మాడ్యూల్స్‌ను రంగంలోకి దించబోతున్నారు. ఐఐటీ ముంబై ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తిచేసింది. సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఐఐటీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరిగే జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలో కొంతమేర దీన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సవాళ్లపై సమీక్షిస్తారు. మార్పులు, చేర్పుల తర్వాత 2027లో పూర్తిస్థాయిలో ఏఐని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తొలుత జేఈఈ వరకూ పరిమితం చేసి, ఆ తర్వాత నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు ఏఐని అందుబాటులోకి తేవాలనే యోచనలో ఉన్నారు. సెక్యూరిటీ మాడ్యూల్స్‌పై కసరత్తు జేఈఈ పరీక్షను దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు ప్రశ్నపత్రం రూపకల్పన మొదలు, మూల్యాంకనం వరకూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉండాలని ఐఐటీ–బాంబే కేంద్రానికి సూచించింది. ప్రతీ పోటీ పరీక్షకు ప్రత్యేక లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ అవసరం ఉందని పేర్కొంది. ప్రశ్నపత్రాల తయారీ, ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాతోపాటు పలు దేశాల్లో ఏఐ ఆధారిత మాడ్యూల్స్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. సైబర్ నేరాలకు సాధ్యం కాని ఫైర్‌వాల్స్ రూపొందించినట్లు ముంబై–ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం జేఈఈ ప్రశ్నపత్రాన్ని దాదాపు పది సెట్లుగా తయారు చేస్తారు. ఇందులో కఠినం, మధ్యస్థం, సాధారణ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సాఫ్ట్వేర్ ఆధారంగానే పది సెట్ల నుంచి ప్రశ్నలు ఎంపికవుతాయి. ఏఐ టెక్నాలజీతో చాప్టర్స్, సిలబస్ ఆధారంగా డేటాను ఫీడ్ చేస్తారు. వీటిలో ఏఐ మాడ్యూల్స్ అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేస్తాయి. తుది కూర్పు తర్వాత ప్రశ్నపత్రం కేంద్రీకృత అధికారి పాస్వర్డ్తోనే పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ హాక్ అవ్వడానికి, ప్రశ్నపత్రం లీక్ అయ్యేందుకు ఆస్కారం ఉండదని నిపుణులు అంటున్నారు. ఏఐకి అందించే డేటా కూడా అత్యంత గోప్యంగా ఉండాలని చెబుతున్నారు. సమస్యల పరిష్కారంపై సాధన డేటా ప్రైవసీ, అల్గారిథమ్‌లో కొన్ని సమస్యలున్నాయని ఐఐటీ–మద్రాస్ నిపుణులు అంటున్నారు. ఫీడ్ చేసే డేటా ఇతర సంస్థలకు వెళ్తే, ఏఐ టూల్ అక్కడా ఉంటే ప్రశ్నలు కొన్ని ముందే తెలిసే వీలుందని భావిస్తున్నారు. సంప్రదాయంగా జరిగే ప్రశ్నపత్రం కూర్పులో మేథ్స్, ఫిజిక్స్‌లో ట్విస్ట్ చేసే ప్రశ్నల తయారీ కోసం ఏఐకి సరికొత్త మాడ్యూల్స్ అందించాలి. లేకపోతే చాప్టర్ ఆధారంగానే సాధారణ ప్రశ్నావళి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. అనేక దేశాల డేటా కేంద్రాలకు సమన్వయం అవుతుంది. కాబట్టి ప్రశ్నావళి రూపకల్పనలో ఇతర డేటాను ఏఐ తీసుకుంటే, విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని పోటీ పరీక్షలకు, అందులోనూ ప్రతీ సబ్జెక్టుకు విస్తృతమైన దేశీయ డేటాను డేటా సెంటర్‌కు ఫీడ్ చేయడం, దాన్ని నిర్వహించడంపై కసరత్తు జరగాలని సూచిస్తున్నారు. కోచింగ్‌లోనూ ఏఐ దూకుడువాస్తవానికి ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే ఏఐని విరివిగా వాడుతున్నాయి. విద్యార్థి బలాలు, బలహీనతలు,వ్యక్తిగత స్టడీప్లాన్, రోజువారీ ప్రాక్టీస్ ప్రశ్నలు, సందేహాల నివృత్తికి 6.5 లక్షల మంది జేఈఈ రాసే విద్యార్థులు ఏఐ, చాట్‌బాట్‌ను వాడుతున్నారు. గత రెండేళ్ల ప్రశ్నల ఆధారంగా ట్రెండ్ అనాలసిస్‌ను ఏఐ అందిస్తోంది. విద్యార్థి స్థాయికి అనుగుణంగా ప్రశ్నలు తయారు చేస్తూ మాక్ టెస్టులు, అడాప్టివ్ లెర్నింగ్ టెస్టులను ఏఐ ట్యూటర్లు అందిస్తున్నాయి. సమయ పాలన, స్కోర్, ర్యాంకు అంచనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ఏఐ అనుసంధాన ప్రిపరేషన్ మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏఐ ప్రాక్టరింగ్తో ఫేస్ రికగ్నిషన్, విద్యార్థి ప్రవర్తనను గుర్తించే ఎల్ఎల్ఆర్ఎంలు రెండేళ్లుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీని ఆధారంగా పోటీ పరీక్షల్లో విద్యార్థిస్థాయి, ఆందోళనను ఆన్లైన్లో అందిస్తున్నారు. సలహాలు, సూచనలు ఏఐ నుంచి అందుతున్నాయి. ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫాంతో స్మార్ట్ కోచింగ్ వల్ల గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన కంటెంట్ అందుకుంటున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో వేగంగా ఫలితాలు వస్తున్నాయి. -
అసెంబ్లీకి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెనక్కి వచ్చినా ఏడాదిగా ప్రభుత్వం స్పందించక పోవడం.. 45 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఓ వైపు అధికార పక్షం సవాలు విసురుతుండగా, దీటుగా ప్రతిస్పందించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నదీజలాల్లో తెలంగాణ వాటా, ఏపీ నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం వైఖరి తదితరాలను శాసనసభలో కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ మినట్స్‌ను సేకరించే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకూ అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరేందుకు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సన్నద్ధమవుతోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోపే నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాయనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా తర్వాతే కేసీఆర్ హాజరుపై స్పష్టత వచ్చే అవకాశముంది. సంక్రాంతి తర్వాత తొలి బహిరంగ సభ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులతోపాటు నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే నెల జనవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయనే ప్రచారమున్న నేపథ్యంలో ఆ తర్వాతే సభల నిర్వహించేలా షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. సభల నిర్వహణ తేదీలు, వేదికలు ఖరారు చేసేందుకు ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించే అవకాశముంది. 26న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ జరిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి నిర్వహించాల్సిన సన్నాహక సమావేశాలకు సంబంధించి ఈ భేటీల్లో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, నల్లగొండ జిల్లా పరిధిలో మల్లేపల్లిలో సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర లేదా నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో పరిధిలో నిర్వహించే సభా వేదికను ఖరారు చేయాల్సి ఉంది. జన సమీకరణ, నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై కేసీఆర్‌తో జరిగే భేటీలో స్పష్టత వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్
వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేల కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అదనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచ్‌లకు ఈ నిధులు పంపించే బాధ్యత తీసుకుంటాం. గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ నిధులు వాడుకోండి. దుర్వినియోగం చేయొద్దు.విద్యతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యం. కొడంగల్ నియోజకవర్గంలో సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25 వేల మంది పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తాం. మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యనూ అందిస్తాం. కావాల్సిన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలను సర్కారు బడులకు తీసుకురండి.సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతో, డీలిమిటేషన్‌తో 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తాం’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నీ రాజకీయమేందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఓ కల. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్ లేదు. రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేదేమీ లేదు. తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్సే’అని రేవంత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం కొడంగల్ నియోజక వర్గంలోని పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నూతన సర్పంచ్‌లకు శాలువాలు కప్పి సన్మానించిన తర్వాత సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... మీరు రండి.. ముఖాముఖి చర్చిద్దాం.. ‘కేసీఆర్.. నీ వయసు, అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఉంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశాం. 29 నుంచి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు మీరు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. మీరు చెప్పినవన్నీ చర్చకు పెడతాం. ముఖాముఖి చర్చిద్దాం. వెనుక మాట్లాడి.. వెనుక ఉరుకుడు కాదు. అభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడుదామా చెప్పండి. లేకపోతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. అప్పులా, నీళ్లా, మీరు కట్టి కూలిన కాళేశ్వరమా, టెలిఫోన్ ట్యాపింగా, ఇంకా అభివృద్ధి మీదనా. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లపైనా.. దేనిపైనైనా నేను సిద్ధం. మీరు మొహం చాటేసి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్‌కు వచ్చి.. పది మంది చెంచాలను పెట్టుకుని వారి ముందు పొంకనాలు కొట్టుడు కాదు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ అంటూ సభ పెడతాడట. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. నేను వద్దన్నానా. ఎన్నికలు ముగిసినయ్.. ఇంకా సందులకు రమ్మంటే ఎలా? చర్చ చేయడానికి సభ ఉంది. ప్రజలు అసెంబ్లీలో చర్చ చేయమని చెబుతుండ్రు. ఎవరేం మాట్లాడుతారో వారు వింటరు. ఆ తర్వాత విజు్ఞలైన ప్రజలే తీర్మానం చేస్తరు. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా.. కేసీఆర్ తన ఫామ్హౌస్నే బందీఖానా చేసుకున్నడు. ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి, చంచల్‌గూడకు పంపించినా ఇదే అయితది. ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసూ పెట్టలేదు. కేసీఆర్ నా మీద 181 కేసులు పెట్టి చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో బంధించాడు. నన్ను ఎన్నో రకాలుగా సతాయించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను ఆస్తులను గుంజుకుండ్రు. కేసులు పెట్టి హింసించిండ్రు. నాకు ఈ బాధ్యత వచ్చాక ఆలోచన చేశా. బాధను దృష్టిలో పెట్టుకుని పగ సాధించే కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించా. పైన దేవుడు చూస్తున్నడు. వాళ్ల పాపాలన్నీ దేవుడు మిత్తితో తీరుస్తుండు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుం ఇరిగింది. అసెంబ్లీలో ఓడగొట్టినం. పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా చేసినం. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,726 స్థానాల్లో 8,335 మందిని గెలిపించుకున్నాం. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా? నన్ను గెలక్కు.. అన్నీ చూశా.. నా తోలు తీస్తానని అంటావా.. షేక్‌పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటడు. ఆయన రోజూ మేకలు కోసి మండి నడుపుతుంటడు. కేసీఆర్ ఖాళీగా ఉన్నడు. తోలు తీస్తడు.. ఆయనకు నౌకరీ ఇవ్వమని చెప్పిన. నౌకరీ అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్‌కు ఉచితంగా ఇంత బోటి, కాళ్లు, తలకాయ పెట్టు పాపం.. సాయంత్రం రెండేసేటప్పుడు తీసుకుంటడని. మాజీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేశానని చెప్పుకునే నువ్వు ఇలాంటి మాటలా మాట్లాడేది. మేము ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క, తోలు అంటవా. మా సర్పంచులు వచ్చారు. నువ్వు తోలు తీసుడు కాదు. నిన్ను చీల్చి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడ్తరు. కొడంగల్ వస్తవా.. మమ్మల్నే చింతమడకకు రమ్మంటవా. ఒక్కటైనా అక్కరకొచ్చే మాట మాట్లాడావా? నన్ను గెలక్కు. నేను అన్నీ చూసిన. నల్లమల అడవుల నుంచి వచ్చిన. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ విమర్శిస్తడు. తండ్రి ఏమో ప్రభుత్వం రియల్ దందా చేస్తోందంటడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం, ఆదాయం పెంచుతుంది. నేను అయ్య పేరు చెప్పి మంత్రిని కాలే. పాస్‌పోర్టు బ్రోకర్ల దందా చేయలే. ఆంధ్రలోని గుంటూరు, గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి. మీ జాతినంతా తెచ్చుకో.. మా ఊరికొస్తవా? లేదా మేమే మీ ఊరికి రావాలా? గతంలో గజ్వేల్ వచ్చి చూడు అన్నావ్. లక్షల మంది కార్యకర్తలతోపోయి తొక్కితే పాతాళానికి పోయినవ్. మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయం. ఎవరి సొమ్ము గురించి ఆలోచన చేయం. మా కాళ్లలో కట్టెలు పెడితే మాత్రం ఊకోం. మా సంగతి చూపిస్తాం. ఇప్పటికైనా మారండి.. సొంత బిడ్డ అని చూడకుండా ఇంటి అల్లుడి ఫోన్లనే ట్యాపింగ్ చేసిండ్రు. ఇంతకన్న సిగ్గులేనోడు ఉంటడా అని వాళ్ల బిడ్డ వాళ్లే అంటుండ్రు. సొంత చెల్లికే బుక్కెడు బువ్వ పెట్టనోడు ఒక మనిషా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని మెడబెట్టి బయటకు పంపితివి. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేనోడు నాకు సవాల్ విసురుతుండు. నా సంగతి నీకు తెల్వదు. మీ నాయనను అడుగు.. నా గురించి చెబుతడు. ఇంకో ఆయన కేసీఆర్ గర్జించాడని మాట్లాడుతుండ్రు. గాండ్రింపులు, ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. మీ తోలు సంగతి ముందు తెలుసుకోండి. మేం నాటు కోడి తోలు తీసి, పసుపు పూసినట్లు పూస్తాం. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు పోతున్నయ్. ఇప్పటికైనా మారండి. లేకపోతే దేనికీ పనికి రాకుండా పోతరు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే సిగ్గుపోతది. -
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాంగ్ రూట్లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది. ఈసారి.. చిక్కడపల్లిలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుస్మిత అనే యువతి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతోంది. ఈ క్రమంలో ముఠా గుట్టు రట్టు కావడంతో ఈ ప్రేమ జంట కటకటాల పాలైంది. సుస్మిత, ఇమాన్యుయెల్ సహా మొత్తం నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ల నుంచి ఎండీఎంఏ, LSD బాటిళ్లు, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షల దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు. -
అడ్డంగా దొరికిపోవడం.. పనికిమాలిన శపథాలు చేసి పారిపోవడం
సాక్షి, హైదరాబాద్: కోస్గిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా? అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. పనికి మమాలిన శపథాలు చేయడం రేవంత్‌కు అలవాటే. అడ్డంగా దొరికిపోవడం రేవంత్‌కు మామూలే. 2028లో ప్రజలు కాంగ్రెస్‌ని బొందపెట్టడం ఖాయం. పాలమూరు ప్రాజెక్టు గొంతు ఎవరు కోశారో అందరికీ తెలుసు. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది!. అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా!సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీ కొడుతున్నా ఇంకా మారవా?. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు వూరుకోం.. పౌరుషంగల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం!. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో, ఇటు జనం మధ్య ఎండగడతాం అంటూ ట్వీట్ చేశారాయన. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా?తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్…— KTR (@KTRBRS) December 24, 2025 -
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం యూఏఈ రాజధాని అబుదాబి ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. గ్రామంలో చెడు అలవాట్లకు బానిసై దాన్నుంచి బయటపడాలని గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ దుర్భర జీవితాన్ని వెళ్ల దీస్తున్నాడు.నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబికి వెళ్లిన శ్రీరాం, రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యాడు. నెల రోజుల అనంతరం అతడిని గుర్తించి క్యాంప్‌కు తీసుకువచ్చినా, కంపెనీ మానవత్వం మరిచి లోపలికి అనుమతించకుండా బయటకు తోసివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష వైఖరి కారణంగా అతడు మళ్లీ రోడ్ల పాలయ్యాడు.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ అతడిపై ‘అబ్స్కాండింగ్’ కేసు నమోదు చేసి, స్వదేశానికి పంపాలంటే 4,500 దిర్హముల (సుమారు రూ.1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి ప్రతులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు అందజేశారు.మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు.ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబి తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు.“నా భర్తను తక్షణం స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో మానసిక వైద్యం, పునరావాసం కల్పించండి. అత్యంత పేద గిరిజన కుటుంబం. ఈ ఖర్చులు భరించే స్థితిలో లేము” అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయంకు లేఖ రాశారు. -
కేసీఆర్.. నిన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం: సీఎం రేవంత్
సాక్షి, నారాయణపేట్: పదేళ్లలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. ఇక్కడి నుంచి ఎంపీగా నెగ్గి కూడా కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే..రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తాకేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు. రెండేళ్ల నుంచి ఫాంహౌజ్నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?.. మా సర్పంచ్ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు నేను. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది. 2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు. -
గచ్చిబౌలి: ఏఐతో కాపీ కొట్టి.. అలా ఇన్విజిలేటర్‌కు దొరికారు!
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ ఎగ్జామ్స్‌లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి కాపీ కొట్టే ప్రయత్నంలోనే అనూహ్యంగా ఆ ఇద్దరూ దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగాయి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు అభ్యర్థులు అనిల్ కుమార్, సతీష్ పట్టుబడ్డారు. వర్సిటీ రిజిస్ట్రార్ దివేశ్ నిగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం.అయితే.. డిసెంబర్ 21వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ఏఐతో పరీక్ష కాపీ కొట్టబోయారు. ముందుగా.. షర్ట్ బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో పేపర్ స్కాన్ చేశారు. తరచూ బాత్రూమ్కు వెళ్లి ఏఐ సాయంతో సమాధానాలు సేకరించారు. చెవిలో ఉన్న బ్లూటూత్ పరికరాల ద్వారా సమాధానాలు వింటూ ఎగ్జామ్ రాశారు. ఈ క్రమంలో.. బ్లూటూ్ నుంచి వచ్చిన ‘బీప్’ శబ్దంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో.. నిందితుల మొబైల్ ఫోన్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, మైక్రో ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. -
నేను ఏ పార్టీలో ఉంటే వారిదే విజయం: దానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు దానం కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా.. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం. ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరుగుతాను. కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తాను. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే, స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు స్పీకర్‌కు వివరణ ఇవ్వని దానం. కాగా, దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో దానం వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
IKP నాలెడ్జ్ పార్క్ సీఈవోగా డాక్టర్ సత్య ప్రకాష్ దాస్
హైదరాబాద్ , సాక్షి : ప్రముఖ సైన్స్ పార్క్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఎనేబుల్ ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (IKP), డాక్టర్ సత్య ప్రకాష్ దాస్‌ను దాని కొత్త చీఫ్ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.తనను సీఈవోగా ఎంపిక చేయడంపై డా. సత్య దాస్ సంతోషం ప్రకటించారు. నాలెడ్జ్ పార్క్‌కు నాయకత్వం వహించడం ఒక గౌరవంగా భావిస్తున్నాననీ, దుపరి తరం బయోటెక్ స్టార్టప్‌లు & SMEలను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థ , మూడవ రంగంలోని భాగస్వాములతో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. సైన్స్, ఇన్నోవేషన్, స్ట్రాటజీ మరియు ఎకోసిస్టమ్ బిల్డింగ్‌లో 28 ఏళ్ల అనుభవజ్ఞుడైన డా.దాస్ IKPలో చేరడానికి ముందు, భారతదేశంలోని ప్రముఖ ఇన్ విట్రో డయాగ్నోస్టిక్స్ కంపెనీలలో ఒకటైన మోల్బియో డయాగ్నోస్టిక్స్ పూర్తి యాజమాన్యంలోని R&D విభాగం స్ట్రాటజీ బిగ్టెక్ అధ్యక్షుడిగా పనిచేశారు. సైన్స్ ఆధారిత ఆవిష్కరణ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు , పర్యావరణ వ్యవస్థ నిర్మాణంలో డా. దాస్ విస్తృత అనుభవం స్టార్టప్‌ల ప్రారంభంలో, పరిశోధనను స్కేలబుల్, వాస్తవ-ప్రపంచ ప్రభావంలోకి అనువదించడంలో ఐకేపీ పాత్రను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుందని సంస్థ చైర్మన్, ఎండీ పన్విత చటోపాధ్యాయ అన్నారు. 2024లో, మోల్బియో డయాగ్నోస్టిక్స్ అండ్ బిగ్టెక్లచే మార్గదర్శక మెడ్‌టెక్ కార్పొరేట్ భాగస్వామ్య కార్యక్రమం EDGEని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో తొలి బయోమెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ బ్లాక్‌చెయిన్ ఫర్ ఇంపాక్ట్ (BFI)కి సీనియర్ అడ్వైజర్‌గా, పూణేలోని ప్రముఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత ఇంక్యుబేటర్ వెంచర్ సెంటర్ బోర్డు సభ్యుడిగా DoTo హెల్త్ స్ట్రాటజీ కౌన్సెల్‌గా కూడా ఆయన పనిచేస్తున్నారు.5000 బయోటెక్ స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చిన 25కుపైగా జాతీయ కార్యక్రమాలను రూపొందించే భారతదేశానికి బయో-ఇన్నోవేషన్ ఆర్కిటెక్చర్‌ను నిర్మించడంలోనూ దాస్ దోహదపడ్డారు. భారతదేశ జాతీయ బయోటెక్నాలజీ పరిశ్రమ సంఘం ABLE చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉన్నారు.IKP నాలెడ్జ్ పార్క్ IKP నాలెడ్జ్ పార్క్ (IKP) హైదరాబాద్ , బెంగళూరులలో భౌతికంగా ఉనికిలో ఉన్న 200 ఎకరాల ప్రీమియర్ సైన్స్ పార్క్ అండ్ ఇంక్యుబేటర్. ఇది భారతదేశంలో మొట్టమొదటి వెట్ ల్యాబ్ రీసెర్చ్ పార్క్, ఇంక్యుబేటర్, ఇది అగ్రశ్రేణి ఆవిష్కరణలను పెంపొందించడానికి ప్రపంచ స్థాయి పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ చేతికి కీలక పెన్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో, పెన్ డ్రైవ్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ చుట్టూనే ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ కొనసాగుతోంది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్‌లో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్‌లోని డేటాను ప్రభాకర్ రావు ముందుంచి ఉంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక, ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నెంబర్లను గుర్తించడంలో ఈ డిజిటల్ ఆధారమే కీలకంగా మారిందని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావు బృందం చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసినప్పటికీ, ఈ ప్రెన్ డ్రైవ్ దొరకడం కేసులో కీలక ఆధారంగా మారింది. ఈ కేసును నిరూపించేందుకు పెన్ ప్రధాన ఆధారంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
చేవెళ్ల బస్సు ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. అయితే, ఈ ప్రమాదానికి ఓవర్ లోడే కారణమని పోలీసులు నిర్ధారించారు. కాగా, ప్రమాద సమయంలో లచ్చు నాయక్ టిప్పర్‌లోనే ఉన్నారని పోలీసులు చెప్పడం కొసమెరపు.వివరాల ప్రకారం.. చేవెళ్లలో నవంబర్ మూడో తేదీన ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. ఈ ప్రమాదానికి ఓవర్ లోడ్ ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అలాగే, ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ యజమాని లచ్చు నాయక్ టిప్పర్‌లోనే ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా.. లచ్చు నాయక్ మాత్రం గాయాలతో బయటపడ్డారు. అయితే, లచ్చు నాయక్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో లచ్చు నాయక్ పేరును తాజాగా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు చెప్పుకొచ్చారు.చదవండి: మందుబాబులకు సజ్జనార్ గట్టి వార్నింగ్ -
మందుబాబులకు అలర్ట్.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వచ్చెనని, సంబరాలు తెచ్చెనని రోడ్లపై హంగామా సృష్టించారో.. హద్దు మీరి ప్రవర్తించారో.. జర జాగ్రత్త! పోలీసులు చూస్తున్నారు.. నిఘా నేత్రం కనిపెడుతోంది! నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు తాగి వాహనాలు నడిపే వారిపై నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ)లో మంగళవారం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై సీపీ సజ్జనర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31న రాత్రి నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం 7 ప్లటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. పట్టుబడితే రూ.పదివేల జరిమానా.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతోపాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సీపీ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే ’డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్‌లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా... డిసెంబర్ 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్‌ను ఉంచుతామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీపీ(క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, వివిధ విభాగాల డీసీపీలు ఎన్.శ్వేత, రక్షితాకృష్ణమూర్తి, శ్రీ రూపేష్, ఆర్. వెంకటేశ్వర్లు, వి.అరవింద్‌బాబు, లావణ్య నాయక్ జాదవ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఔటర్ టు ఆర్ఆర్ఆర్.. 16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక(కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు రహదారుల విస్తరణకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్యన వివిధ ప్రాంతాల్లో మొత్తం 16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు 41 కి.మీ. మేర నిర్మించనున్న మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుతోపాటు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కి.మీ. మేర నిర్మించనున్న రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు డీపీఆర్ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గాల్లో భూసేకరణకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ రెండింటితోపాటు మరో 14 చోట్ల ఈ తరహా రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ మీదుగా నేరుగా ట్రిపుల్ ఆర్ వరకు చేరుకొనే విధంగా ఈ రహదారుల నిర్మాణం ఉంటుందని అధికారులు అంటున్నారు. మహానగరం అభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా దశలవారీగా రోడ్ల నిర్మాణంపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ రైజింగ్–47 నివేదికలోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు భారీ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు కూడా హెచ్ఎండీఏ యోచిస్తోంది. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టౌన్‌షిప్‌లను నిర్మించనుంది. 2047 నాటికి రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే రహదారుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రెండో రోడ్డుకు త్వరలో డీపీఆర్... ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుద్వేల్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వెలుపల ఉన్న కోస్గి వరకు నిరి్మంచనున్న రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు త్వరలోనే డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ దీన్ని 167వ జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని 7,250 చ.కి.మీ. నుంచి సుమారు 10,050 చ.కి.మీ. వరకు ప్రభుత్వం ఇప్పటికే విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 11 జిల్లాలకు హెచ్ఎండీఏ కార్యకలాపాలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగానే పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా హెచ్ఎండీఏ ముందుకు సాగుతోంది. సమగ్ర మాస్టర్‌ప్లాన్–2050లో భాంగా ఆర్థికాభివృద్ధి, సమగ్ర పట్టణ ప్రజారవాణా వ్యవస్థ, జలవనరులు, అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది.ఈ మూడు ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్స్ నెలకొల్పే ప్రాంతాలకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల మీదుగా తేలిగ్గా రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. టీజీఐఐసీకి చెందిన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు బుద్వేల్ నుంచి చందన్వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం వరకు దీన్ని నిర్మించనున్నారు. సుమారు 81 కి.మీ. మేర ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో హెచ్ఎండీఏ పరిధి 52 కి.మీ.వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా మరికొందరు రైతులు పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని డీపీఆర్‌పై ముందుకు వెళ్లనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. -
పారిశ్రామిక భూముల లభ్యతలో రాష్ట్రం నంబర్ వన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో సారి సత్తా చాటింది. పరిశ్రమల స్థాపనకు కీలకమైన భూములను సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 157 పారిశ్రామిక పార్కుల్లో అందుబాటులో ఉన్న మొత్తం 32,033 హెక్టార్ల భూమిలో.. పరిశ్రమల ఏర్పాటు కోసం ఏకంగా 30,749 హెక్టార్ల భూమి సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. అలాగే మహారాష్ట్రలో 19,658 హెక్టార్లు, తమిళనాడులో 16,291 హెక్టార్లు, గుజరాత్లో 12,605 హెక్టార్లు భూమి అందుబాటులో ఉంది. ఈ మేరకు ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదికలో ఆయా గణాంకాలను విడుదల చేసింది.మరోవైపు ఏపీలో ఉన్న 638 పారిశ్రామిక పార్కుల పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉండగా అందులో 10,747 హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 4,523 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 7.70 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం 1.35 లక్షల హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. మొత్తం 6.45 లక్షల ప్లాట్లు ఉండగా 1.25 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనలో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ‘ప్లగ్ అండ్ ప్లే’విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 2025–26 బడ్జెట్లో దీనికోసం రూ. 2,500 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 306 ప్లగ్ అండ్ ప్లే పార్కులు ఉన్నాయి. మరో 20 పార్కులను నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది. గ్రీన్ పార్కులకు గ్రీన్సిగ్నల్పారిశ్రామిక పార్కుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ ఏడాది సెపె్టంబర్లో ఇండ్రస్టియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 3.0ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటలైజేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచి్చంది. 41 పార్కులు ‘లీడర్స్’గా, 90 పార్కులు ‘చాలెంజర్స్’గా నిలిచాయి. భారత్‌లో సులభతర వాణిజ్యం మెరుగుపడటంతో విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. 2025 ఏప్రిల్–ఆగస్టు మధ్య ఏకంగా 43.76 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏకగవాక్ష అనుమతులు, జీఎస్టీ వంటి సంస్కరణలు దీనికి దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది. -
జనవరి 1 నుంచి రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జూలై 1 నుంచి రైళ్ల వేళలను మార్చే వారు. ఇప్పుడు దాన్ని జనవరి 1 నుంచి మారేలా సవరించారు. దేశవ్యాప్తంగా 1,400 రైళ్ల వేళలను సవరిస్తుండగా, దక్షిణమధ్య రైల్వే పరిధిలో 80కిపైగా రైళ్ల వేళలు మారుతున్నాయి. 3 నిమిషాల నుంచి గరిష్టంగా 30 నిమిషాల వరకు ఈ సమయాలను మారుస్తున్నారు. వేళలు మారిన రైళ్ల వివరాలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు.జనవరి 1 నుంచి ప్రయాణాలు ఉన్నవారు మారిన రైళ్ల వివరాలను తెలుసుకుని తదనుగుణంగానే స్టేషన్‌కు రావాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1 తర్వాత ప్రయాణాలకు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు, వారు ప్రయాణించాల్సిన రైళ్ల వేళలు మారితే... ఆ సమాచారాన్ని మెసేజ్ రూపంలో వారికి పంపుతామని తెలిపారు.కాగా, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు తుది దశకు వచ్చిన నేపథ్యంలో, కొన్ని నెలలపాటు విడతల వారీగా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రైళ్ల రాకపోకలను నిలిపేయనున్నారు. తాజా మార్పులపై దీని ప్రభావం కూడా ఉండనుంది. ఇక ఇప్పటికే చర్లపల్లి టెరి్మనల్ అందుబాటులోకి వచి్చనందున చాలా రైళ్లను అక్కడి నుంచే నడుపుతున్నారు. త్వరలో మరికొన్ని రైళ్లు అక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనివల్ల కూడా కొన్నింటి వేళల్లో సవరణలు చోటుచేసుకుంటున్నాయి. -
ఐఫోన్, నిమ్మ సోడా!
దుకాణానికి వెళ్లి నేరుగా సరుకులు కొనుక్కోవడం లేదా ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెట్టే పద్ధతి పెద్ద నగరాల్లో క్రమంగా గతంగా మారుతోంది! కాలంతో పోటీపడుతూ క్విక్ కామర్స్ సంస్థలు చిటికెలో ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇన్స్టంట్ విధానానికే ఇప్పుడందరూ జై కొడుతున్నారు. అది ఎంతగా అంటే రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్‌ను కూడా ఇన్‌స్టంట్‌గా పొందే అంత! అదొక్కటే ఆర్డర్ పెడితే మజా ఏం ఉంటుందనుకున్నాడో ఏమో కానీ.. బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారుడు ఐఫోన్‌తోపాటు ఒక నిమ్మ సోడా కూడా జోడించారని క్విక్ కామర్స్ కంపెనీ ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదిక చెబుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్10 నిమిషాల్లో డెలివరీ హామీతో.. బెంగళూరు వినియోగదారుడు రూ. 10 ఖరీదు చేసే ప్రింట్ అవుట్ మొదలు.. మూడు ఐఫోన్ల కోసం ఓ హైదరాబాదీ పెట్టిన రూ. 4.3 లక్షల విలువైన సింగిల్ ఆర్డర్ వరకు దేశంలో క్విక్ కామర్స్ పోకడలపై హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్ 2025 పేరుతో స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ‘10 నిమిషాల’డెలివరీ హామీతో క్విక్ కామర్స్ కంపెనీలు భారత రిటైల్‌రంగ రూపురేఖలను మారుస్తున్న తీరుకు ఈ నివేదికే నిదర్శనంగా నిలుస్తోంది. కరివేపాకూ ఉండాల్సిందే.. ఇన్‌స్టామార్ట్ వేదికగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కస్టమర్లు సెకనుకు 4 ప్యాకెట్ల పాలు కొనుగోలు చేశారు. దేశంలోని 10కిగాను 9 ప్రధాన నగరాల్లో రాత్రివేళ ఆర్డర్స్‌లో మసాలా ఆలు చిప్స్ టాప్‌లో నిలిచాయి. కొచి్చకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో ఏకంగా 368 సార్లు కరివేపాకును ఆర్డర్ పెట్టాడు. మరోవైపు లక్నోకు చెందిన ఓ కస్టమర్‌కు కేవలం 2 నిమిషాల్లోనే మ్యాగీ మేజిక్ మసాలా నూడుల్స్‌ను డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేర్చాడు. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యే ఎక్కువగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఖరీదైనా సరే..ఏడాది మొత్తంలో ఓ కస్టమర్ ఏకంగా రూ. 22 లక్షలు వెచ్చించారంటే క్విక్ కామర్స్ ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఐఫోన్–17 మోడల్లో 22 ఫోన్లు, 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్, ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్.. ఇలా ఒకటేమిటి పాలు, గుడ్లు, ఐస్‌క్రీమ్, పండ్లను సైతం ఆ వినియోగదారుడు చేసిన ఆర్డర్లలో ఉన్నాయి. అలాగే నోయిడావాసి సింగిల్ ఆర్డర్లో ఏకంగా రూ. 2.69 లక్షలతో బ్లూటూత్ స్పీకర్స్, ఎస్ఎస్డీలు ఆర్డర్ పెట్టాడు. దీపావళి రోజున ఓ బెంగళూరు కస్టమర్ రూ. 1.97 లక్షలు వెచ్చించి ఒక కిలో వెండి కొన్నాడు. ఇక చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో కాండోమ్స్ కోసం 228 ఆర్డర్లు పెట్టి రూ. 1,06,398 ఖర్చు చేశారు. స్విగ్గీ వేదికగా ఇలా... ⇒ ఈ ఏడాది కస్టమర్లు 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు. అంటే నిమిషానికి 194 అన్నమాట. వాటిలో 5.77 కోట్ల చికెన్ బిర్యానీలు ఉన్నాయి. ⇒ వినియోగదారులు మొత్తం 4.42 కోట్ల బర్గర్స్, 4 కోట్ల పిజ్జాలు, 2.62 కోట్ల దోశలు ఆరగించారు. ⇒ మధ్యాహ్నం 3–7 గంటల మధ్య 34.2 లక్షల సమోసాలు, 29 లక్షల అల్లం చాయ్‌లను ఆస్వాదించారు. ⇒ 69 లక్షల వైట్ చాక్లెట్ కేక్స్, 54 లక్షల చాక్లెట్ కేక్స్, 45 లక్షల గులాబ్ జామూన్స్ ఆర్డర్లున్నాయి. ⇒ కస్టమర్లు ఏకంగా 1.1 కోట్ల ఇడ్లీలు, 1.6 కోట్ల మెక్సికన్, 1.2 కోట్ల టిబెటన్, 47 లక్షల ఆర్డర్లతో కొరియన్ ఫుడ్ రుచి చూశారు. ⇒ రూ. 47,106తో 65 బాక్సుల డ్రై ఫ్రూట్ కుకీస్ గిఫ్ట్ ప్యాక్‌లను ఓ హైదరాబాదీ స్వీకరించాడు. ⇒ ఓ ముంబైకర్ ఏడాది పొడవునా 3,196 ఆర్డర్లతో టాప్‌లో నిలిచాడు. ⇒ ఆర్డర్ల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై టాప్–3లో ఉన్నాయి. ⇒స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ 2,400 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేశారు. ⇒ బెంగళూరుకు చెందిన మొహమ్మద్ రాజిక్ అనే డెలివరీ పార్ట్నర్ 11,718 డెలివరీలతో టాప్‌లో నిలిచాడు. ఇన్‌స్టామార్ట్ కస్టమర్ల రేంజ్ ఇదీ..⇒ రెడ్‌బుల్ షుగర్ ఫ్రీ డ్రింక్స్ కోసం ముంబై కస్టమర్ ఏకంగా రూ. 16.3 లక్షలు ధారపోశాడు. ⇒ ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ. 15.16 లక్షల విలువ చేసే పుత్తడి కొన్నాడు. ⇒ బెంగళూరు వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.36 లక్షల విలువైన నూడుల్స్ కొనుగోలు చేశాడు. ⇒ నోయిడా కస్టమర్ రూ. 2.8 లక్షలతో 1,343 ప్రొటీన్ ఉత్పత్తులు ఆర్డర్ చేశాడు. ⇒ చెన్నై కస్టమర్ పెట్ ఫుడ్ కోసం రూ. 2.41 లక్షలు ఖర్చుపెట్టాడు. ⇒ గులాబీలకు రూ. 31,240 వెచ్చించి హైదరాబాదీ తన ప్రేమను చాటుకున్నాడు. ⇒ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌కు టిప్స్ రూపంలో బెంగళూరు కస్టమర్ రూ. 68,600, చెన్నైవాసి రూ. 59,505 అందించారు. ⇒ వాలెంటైన్స్ డే రోజున గులాబీల కోసం సగటున నిమిషానికి 666 ఆర్డర్లు వెల్లువెత్తాయి. -
బెట్టింగ్‌యాప్ కేసు విచారణకు మంచు లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రచారం చేసిన సెలబ్రిటీల కేసులో సీఐడీ సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి సినీ నటి మంచు లక్ష్మి, రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు ముగ్గురిని సీఐడీ అధికారుల బృందాలు వేర్వేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన సంపాదనపై ఆరా తీసినట్టు సమాచారం. ఆయా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రమోషన్‌కు ప్రతిగా అందిన పారితోషికం తదితర అంశాలపై సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. -
పోలవరం – బనకచర్లను తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధానంపై నదీ పరివాహక ప్రాంతాల (బేసిన్)లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ఏకాభిప్రాయం సాధించాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంతోపాటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 39వ సాధారణ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి గోదావరి–కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని.. అందులో భాగంగా పోలవరం–బనకచర్ల–సోమశీల–కావేరి అనుసంధాన ప్రాజెక్టు చేపట్టాలని ఈ సమావేశంలో ఏపీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సీఈ కె. ప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కేవలం ఏపీ, తమిళనాడుకే ప్రయోజనం కలుగుతుందని.. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానాన్ని జాతీయ దృక్పథంతో చేపట్టారని గుర్తుచేశారు. ఈ ప్రతిపాదన ఏపీ పునిర్వభజన చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980లో ట్రిబ్యునల్‌లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందానికి పూర్తి విరుద్ధమని.. అందువల్ల దాన్ని తిరస్కరించాలని కోరారు. బెడ్తి–వరద లింక్ ప్రాజెక్టులో వాటా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు ఎంఓయూ చేసుకోవడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముందుకు రాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు సమ్మతి తెలిపారు. ఈ ప్రాజెక్టులో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా కొంత వాటా కావాలని ఏపీ డిమాండ్ చేసింది. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తామని.. కానీ తరలించే నీటిలో 50 శాతం జలాలను తమకే కేటాయించాలని తెలంగాణ కోరింది. ఏపీ చేసిన పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించే జలాల్లో తమ వాటా 34.40 నుంచి 40 టీఎంసీలకు పెంచాలని కర్ణాటక అధికారులు కోరారు. అనుసంధానంలో తమకు ఎలాంటి నీటి వాటాలు కేటాయించకపోవడంపై మహారాష్ట్ర, కేరళ అభ్యంతరం తెలపగా తక్షణమే పనులు చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరాయి. అన్ని రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. ఏకాభిప్రాయ సాధన కోసం బేసిన్‌లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ పాల్గొన్నారు. అంగీకరించాలన్న కేంద్ర మంత్రి సమావేశంలో ఇచ్చంపల్లి (గోదావరి) నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా 148 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించారు. ఈ అనుసంధానంలో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని కేంద్ర మంత్రి పాటిల్ పేర్కొన్నారు. కావేరికి తరలించే 148 టీఎంసీల (ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని జలాలు) గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఏపీకి 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామన్నారు. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు నీళ్లు అందించడంతోపాటు తాగునీటిని అందించవచ్చన్నారు. దీనిపై ఛత్తీస్‌గఢ్, ఏపీ అభ్యంతరం తెలిపాయి. నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంలో కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని సూచించింది. -
లైంగిక దాడులు.. వరకట్న వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: అత్యాచారాలు, హత్యలు, వరకట్నం, లైంగిక వేధింపులు.. ఏదో ఒక రూపంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబరాబాద్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2025లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 37,243 కేసులు నమోదు కాగా.. ఇందులో 9 శాతం మహిళలపై జరిగినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సైబరాబాద్‌లో 1,314 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. అలాగే షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 1,043 ఫిర్యాదులు అందగా.. వీటిలో 83 ఎఫ్ఐఆర్లు, 2,964 పెట్టీ కేసులు నమోదయ్యాయి. అలాగే 3,322 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. డెకాయ్ ఆపరేషన్స్‌తో 3,315 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 103 మానవ అక్రమ రవాణా కేసుల్లో 257 మందిని అరెస్టు చేశారు. మొత్తంగా చూస్తే.. గతేడాదిలో నమోదైన 37,689లతో పోలిస్తే ఈ ఏడాది కమిషనరేట్‌లో కేసులు 1.18 శాతం స్వల్పంగా తగ్గాయి. సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ సంబంధిత నేరాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వార్షిక నివేదికను విడుదల చేశారు. అందులోని పలు కీలకాంశాలివీ.. తగ్గిన సైబర్ నేరాలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో నిండిన సైబరాబాద్‌లో ఈ ఏడాది సైబర్ నేరాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది 11,914 క్రైమ్‌లు నమోదు కాగా.. 2025లో 35.9 శాతం మేర తగ్గి, 7,636లకు పరిమితయ్యాయి. వీటిలో 539 కేసుల్లో 917 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధికంగా పార్ట్ టైం జాబ్, ట్రేడింగ్, విషింగ్ కాల్, అడ్వర్టయిజ్మెంట్ మోసాలు జరిగాయి. 2025లో సైబర్ నేరాలలో బాధితులు రూ.404 కోట్ల మోసపోగా.. రూ.20.75 కోట్లు బాధితులకు రీఫండ్ చేశారు. పెరిగిన చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఐటీ హబ్‌గా పేరొందిన సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ పెరిగిపోయింది. పిల్లల అశ్లీల వీడియోలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగాయి. గతేడాది సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు కేవలం నాలుగు నమోదు కాగా.. ఈ ఏడాది ఏకంగా 53 కేసులు రిజిస్టరయ్యాయి. అలాగే ఆన్లైన్లో వేధింపులు, బెదిరింపులు (సైబర్ స్టాకింగ్), మ్యాట్రిమోనీ, డేటింగ్ మోసాలు కూడా పెరిగాయి. 2025లో 40 సైబర్ స్టాకింగ్, 34 మ్యాట్రిమోనీ, 13 డేటింగ్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి.పెరిగిన డ్రగ్స్ కేసులు.. ఈ ఏడాది సైబరాబాద్‌లో రూ.16.85 కోట్ల విలువ చేసే 1,524 కిలోల మత్తు పదార్థాలు దొరికాయి. 575 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కేసులు నమోదు కాగా.. 1,228 మందిని అరెస్టు చేశారు. అత్యధికంగా రూ.8.33 కోట్ల విలువ చేసే గంజాయి, రూ.3.30 కోట్ల విలువైన కొకైన్, రూ.4.27 కోట్ల విలువ చేసే హెరాయిన్ వంటివి ఉన్నాయి. అలాగే 2025లో సైబరాబాద్‌లో రూ.25.44 కోట్ల విలువ చేసే 2,730 కిలోల మత్తు పద్దార్థాలను ధ్వంసం చేశారు. స్థిరంగానే కన్విక్షన్లు..ఈ ఏడాది సైబరాబాద్‌లో నేర నిరూపణ (కన్విక్షన్లు) రేటు స్థిరంగానే ఉంది. వరుసగా రెండేళ్లు నేర నిరూపణలు 47 శాతం నమోదయింది. 2025లో మొత్తం 14,369 కేసులు డిస్పోజ్ కాగా.. ఇందులో 22 కేసుల్లో న్యాయస్థానం జీవితకాలం శిక్షలు విధించాయి. 22 కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష, 15 కేసుల్లో 10 ఏళ్ల జైలు, 49 కేసుల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్షలు విధించారు. ట్రాఫిక్ జరిమానాలు డబుల్..ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడా ఝుళిపించారు. 2025లో కమిషనరేట్ పరిధిలో 36.20 లక్షల చలాన్లు జారీ చేసిన పోలీసులు.. ఆయా వాహనదారులకు ఏకంగా రూ.239.37 కోట్ల జరిమానాలు విధించారు. గతేడాది 22.60 లక్షల చలాన్లలో రూ.111 కోట్ల ఫైన్లు విధించారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 4,608 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 803 ఘోరమైన యాక్సిడెంట్లలో 850 మంది మరణించారు. అత్యధికంగా 430 ప్రమాదాల్లో 449 మంది ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడగా.. 283 కేసుల్లో 285 మంది పాదచారులు చనిపోయారు. 15,706 డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) కేసులు నమోదయ్యాయి.2025లో 95 ఆర్థిక నేరాలలో 111 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ.26.17 కోట్ల సొమ్మును స్తంభింపజేయగా.. రూ.11.50 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. -
200 ఏళ్లపాటు నిలిచేలా ‘మేడారం’ పనులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతినకుండా అనుకున్న సమయానికే మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సు«దీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణ, రాత్రి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్ల పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, ఇతర పనులను జనవరి 5లోగా ముగించాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తదితర పనులను అధికారులు విభజించుకొని గడువులోపు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలపై గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు సకాలంలో పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. నేడు వనదేవతల దర్శనం నిలిపివేత ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మల దర్శనానికి భక్తుల రాకను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఈఓ వీరస్వామి, పూజారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల నూతన గద్దెలపై ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా అమ్మవార్ల దర్శనాలను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం నుంచి యథావిధిగా అమ్మవార్లను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ఈ విషయంలో భక్తులు తమకు సహకరించి దర్శనాలను బుధవారం వాయిదా వేసుకోవాలని కోరారు. -
నదీ జలాల అన్యాయంపై నల్లగొండ నుంచే పోరు
నల్లగొండ టూ టౌన్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రం తిప్పిపంపినా మాట్లాడలేని తెలివి తక్కువ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. నదీ జలాలపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన శూన్యమని అన్నారు. సాగునీటి మంత్రిది అంతులేని అజ్ఞానమని, కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసుల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తా రు. రాష్ట్రానికి నదీ జలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై నల్లగొండ నుంచే రణభేరి మోగిస్తామని ప్రకటించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో.. పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పాలమూరు’ 90% మేమే పూర్తి చేశాం.. ‘కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండాపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు పూర్తి చేశాం. మిగతా 10% పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల భయం, 420 హామీల భయం పట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు చేసినా గులాబీ సైన్యం ఎదురొడ్డి పోరాడి 45% సర్పంచ్ స్థానాలను గెలిచింది. ప్రభుత్వానికి దమ్ముంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. ఓటమి భయంతోనే అధికారం చేతిలో ఉందని నామినేటెడ్ కింద భర్తీ చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ఎన్నికలు పెడితే రైతులు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతు బంధు రూ.15 వేలు, పెన్షన్లు రూ.4 వేలు, తులం బంగారం, విద్యార్థులకు స్కూ టీలు, మహిళలకు రూ.2,500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అడిగినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేసు లు, బెదిరింపులకు భయపడేది లేదు. రెండేళ్లుగా ఏది ప్రశ్నించినా లీక్‌ల పేరిట కేసులని పత్రికల వారి కాళ్లు పట్టుకుని తాటి కాయంత అక్షరాలతో రాయిస్తున్నారు..’అని కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో 2.50 లక్షల కోట్ల అప్పు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి రాష్ట్రానికి రూ.80 వేల కోట్లు అప్పు ఉంది. కేసీఆర్ పదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసినట్లు స్వయంగా పార్లమెంట్‌లోనే సంబంధిత శాఖ మంత్రి చెప్పారు. కానీ కనీస అవగాహన లేని రేవంత్‌రెడ్డి రూ.8 లక్షల కోట్లని, భట్టి విక్రమార్క రూ.7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేశారు. మా ప్రభుత్వ హయాంలో అప్పు చేసి రైతులకు రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఇచ్చాం. రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ నీరు, రూ.20 వేల కోట్లతో మిషన్ కాకతీయ, మెడికల్ కాలేజీల నిర్మాణం, వెయ్యికి పైగా గురుకులాలు, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చాం. రెండేళ్లలో రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పమంటే ఒక్కదానికీ సమాధానం లేదు..’అని బీఆర్ఎస్ నేత ధ్వజమెత్తారు. ఈ సభలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరనేతలు పాల్గొన్నారు.నిజాయితీ ఉంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలి‘సీఎంకు నిజాయితీ ఉంటే, రైతులకు మంచి చేశామన్న నమ్మ కం ఉంటే వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వని రేవంత్‌రెడ్డి.. సర్పంచ్‌లకు ఏమి ఇస్తాడు? పార్టీ మారమని సర్పంచ్‌లను బెదిరిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం ఎంతో.. గ్రామా నికి సర్పంచ్ అంత. ఎవరికీ బెదరాల్సిన పనే లేదు. రానున్న ఎన్నికల్లో కూడా గులాబీ సైన్యం కలిసికట్టుగా పని చేసి విజయ ఢంకా మోగించాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
‘పద్మాలయ’ పాత జ్ఞాపకమా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లను మంత్రులు భట్టి విక్రమార్క, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంచుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘హరీశ్‌రావుకి అలాంటి అలవాటు ఉన్నట్టుంది. బడ్జెట్ రిలీజ్ అయితే జేబుల్లో నింపుకొని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన వచ్చారో? ఆయన అలవాట్లు అందరికీ ఉండవు..ఆయనకు బహుశా ‘పద్మాలయా స్టూడియోస్ వంటి జ్ఞాపకాలు’ఉన్నాయేమో. గతంలో నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు.. ప్రస్తుత మంత్రులపై నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. రూ.7 వేల కోట్లలో ప్రతి పైసాకి లెక్కచెప్తా. ఏ రైతులకు భూసేకరణ, పునరావాసం కోసం ఎంత ఇచ్చామో జాబితా ఇస్తా. వెళ్లి చూసుకోమనండి..’అంటూ మండిపడ్డారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్మాలయ స్టూడియోస్ వ్యవహారం ఏమిటని విలేకరులు వివరణ కోరగా.. ‘మీరు ఎవరిని అడిగినా చెబుతారు..’అని ఉత్తమ్ బదులిచ్చారు. హరీశ్ చెప్పిన ప్రకారమే చూస్తే.. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు నీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసిన రూ.1.83 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి ?’అని నిలదీశారు. పదేళ్లలో రూ.17.72 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయగా, అందులో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసిన రూ.1.83 లక్షల కోట్లతో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలకు పోయే నాటికి తాము రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నీటిపారుదల శాఖ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని అన్నారు. మీ సభల్లో ఆంధ్రవాళ్లకు నీళ్లిచ్చామని చెప్పండి ‘ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభల్లో.. ఆంధ్రవాళ్లకు మేము నీళ్లు, కాంట్రాక్టులు అప్పగించామని ప్రజలకు చెప్పుకోండి. డిండి ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి నీళ్లను తరలించాలి అన్న అంశంపై మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది.మేము వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుంచి తరలించాలని నిర్ణయించడంతో పాటు రూ.1,800 కోట్లతో పనులూ ప్రారంభించాం. కోవిడ్–19 కారణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తిచే యలేకపోయామని సాకులు చెప్పుకుంటున్నారు. ఆ కోవిడ్ సమయంలోనే రూ.20 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు ఎలా చేపట్టారు? పాలమూరుపై కేసీఆర్ కుట్రలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మీకు ఎందుకంత ప్రేమ? నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులంటే ఎందుకంత పక్షపాతం? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసింది. ప్రాజెక్టు పనుల వేగంతో పాటు పనుల సామర్థ్యాన్ని 1 టీఎంసీకి తగ్గించాలని, ఒకే సొరంగం పనులు చేపట్టాలని ఆదేశిస్తూ 2020 ఏప్రిల్ 8న నాటి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టు అధికారులకు లేఖ రాశారు. 2019లో ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయడంతో అనుమతుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించగా, కమీషన్ల కోసం దిగువన ఉన్న శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేలా కేసీఆర్ మార్పులు చేసి వ్యయాన్ని పెంచారు. 35 శాతం ప్రాజెక్టు పనులు చేసి 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అబద్ధాలాడారు. ఈ ప్రాజెక్టుకి 90 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని ఇదే నెలలో కేంద్రానికి లేఖ రాశా. కానీ 45 టీఎంసీలకు తగ్గించాలని తాము కోరినట్టు హరీశ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..’అని ఉత్తమ్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అడగకుండానే.. నాడు కేసీఆర్ ఇతర ప్రాజెక్టులకు 299 టీఎంసీల కేటాయింపులకు సమ్మతి తెలిపారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఇంత మోసం, దగా చేసి ఇప్పుడు పెద్దమనుషుల్లాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతీ సారి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నదీ జలాల్లో అన్యాయంపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాపై కేసులు పెడతామంటూ లీక్‌లు ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీ సులు ఇస్తారట. చట్టబద్ధ్దంగా వ్యవహరించని పోలీసు అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ‘పోస్టింగుల కోసం అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పోలీసుల వివరాలు రాసి పెడుతున్నాం. బీఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా, సెంట్రల్ సర్వీసులోకి డిప్యూటేషన్‌పై వెళ్లినా వదిలిపెట్టేది లేదు. ఏ బొరియలో దాక్కున్నా లాక్కొస్తాం. రేవంత్ అడుగు లకు మడుగులొత్తుడేనా డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో హరీశ్‌రావు ఇష్టాగోష్టి నిర్వహించారు. నేతి బీరలో నెయ్యిలా డీజీపీ ఖాకీ బుక్ ‘ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు నాపై సుమారు 300 కేసులు పెట్టారు. రేవంత్ పథకాల ఎగవేతను ప్రశ్నిస్తూ ఆయన పాపాలను క్షమించమని దేవుడిని వేడుకున్నందుకు కూడా యాదగిరిగుట్టలో కేసులు పెట్టారు. సిద్దిపేటలో నా ఇంటిపై దాడి చేసినా కేసు నమోదు చేయలేదు. ఫార్ములా ఈ–రేస్ తరహాలోనే నాపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటు వేయలేదని సజ్జాపూర్‌లో దళితుల ఇల్లు కూల్చివేస్తే డీఐజీ ఖాకీబుక్ ఏం చేస్తోంది.రేవంత్ ఫుట్‌బాల్ ఆడితే డీఐజీ మైదానంలో రెండు రోజులు కాపలా ఉన్నారు. కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు తమకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవులు, భద్రత పథకం, అలవెన్సుల కోసం తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని కేవలం యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో పనిచేసే వారికి మాత్రమే పెండింగ్ అలవెన్సులు ఇచ్చారు. నేతి బీరకాయలో నేతి చందంగా డీజీపీ ఖాకీ బుక్ పనిచేస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. వాస్తు భయంతో సచివాలయానికి దూరం ‘కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ఆత్మరక్షణలో పడిన రేవంత్ రాత్రి 9.30 గంటలకు మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించాడు. వాస్తు భయంతో సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నాడు. నాలుగు వేలకు పైగా సర్పంచ్ పదవులు మా పార్టీకి దక్కడంతో సహకార సంఘాల ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నాడు. కాంట్రాక్టుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.7వేల కోట్ల కమీషన్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ కంపెనీలా పనిచేస్తూ బాంబే బ్రోకర్‌కు రూ.180 కోట్లు కమీషన్ ఇచ్చి అప్పులు తెచ్చింది. ఇరిగేషన్ అంశాలపై అసెంబ్లీలో మాకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలి. 15 రోజులు అసెంబ్లీ పెట్టి మాకు అవకాశం ఇస్తే ఇరిగేషన్‌తోపాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారు బట్టలు విప్పుతాం. ఉత్తమ్ తన తప్పు ఒప్పుకుని పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయాలి’అని హరీశ్‌రావు చెప్పారు. -
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా?
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్‌లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు. దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్‌లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్‌లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు. కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
విధులు నిర్వర్తించకపోతే రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలకవర్గాలకు కొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరగడంతో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఇది కత్తి మీద సాముగా మారే ప్రమాదముంది. గతంలో సర్పంచ్ అనగానే అధికారాలే తప్ప విధులు, బాధ్యతలు పెద్దగా ఉండేవి కాదు. అయితే, నూతన పంచాయతీరాజ్ చట్టం–2018లో అనేక లక్ష్యాలు, బాధ్యతలు నిర్దేశించారు. వీటిని సరిగా నిర్వహించకపోతే, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోతే సర్పంచుల తొలగింపుతోపాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశాన్ని నూతన చట్టంలో కల్పించారు. పాలకవర్గాలు గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొత్త చట్టంలో సర్పంచులకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతోపాటు ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల పురోగతికి, వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లతోపాటు వార్డుమెంబర్లను కూడా భాగస్వాములను చేశారు. పచ్చదనం పరిరక్షణ, మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటివి ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. బాధ్యతలెన్నో... ప్రతీ గ్రామంలో మొక్కల పంపిణీ కోసం నర్సరీ ఏర్పాటుతోపాటు ఊళ్లోని ప్రతీ కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యతను కూడా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌పై ఉంచారు. రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించి గ్రామంలోని సమస్యలపై చర్చించాలి. మూడు పర్యాయాలు వరుసగా గ్రామసభల నిర్వహణలో విఫలమైతే సర్పంచ్‌ను బాధ్యతల నుంచి తొలగించే నిబంధన ఉంది. పాలకవర్గాలు ప్రతి నెలా సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించాల్సి ఉంటుంది. గ్రామాల్లో, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి ఎదుట చెత్త వేస్తే ఆ ఇంటి యజమాని నుంచి రూ.500 జరిమానా విధించే అధికారాన్ని కల్పించారు. మురుగునీటిని పైప్‌ద్వారా రోడ్డు మీదకు వదిలితే రూ.5,000 జరిమానా విధిస్తారు. గ్రామంలోని ఒక్కో కుటుంబం ఆరు మొక్కలు నాటాలని నిర్దేశించగా, అందుల్లో కనీసం మూడింటినైనా వారు నాటాలి. సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శి కూడా సంబంధిత గ్రామంలోనే నివాసం ఉండాలి. సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించినా, పాలకవర్గాలను రద్దు చేసినా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. పంచాయతీ పరిధిలోని వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు నూతన చట్టంలో వీలు కల్పించారు. అక్రమ లేఅవుట్లపైనా చర్యలు పంచాయతీలు అక్రమ లేఅవుట్లకు అనుమతినిస్తే మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇదే రీతిలో కఠిన చర్యలుంటాయి. పంచాయతీలు మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీ ప్లస్ టు భవనాల నిర్మాణాలకే అనుమతి ఇవ్వొచ్చు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాల్సి ఉంటుంది. నూతన చట్టం ప్రకారం ప్రతీ పంచాయతీలో...మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు; అభివృద్ధి పనులకు; వీధి దీపాల నిర్వహణకు; డంపింగ్ యార్డు, పారిశుధ్యం, శ్మశానాల నిర్వాహణకు ఇలా మొత్తం నాలుగు స్టాండింగ్ కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీలకు నలుగురు వార్డుమెంబర్లు చైర్మన్లుగా ఉంటారు. ఇందులో మిగతా వార్డు సభ్యులతోపాటు గ్రామంలో ఉత్సాహంగా పనిచేసే యువత, మహిళా సంఘాల సభ్యులను కూడా భాగస్వాములను చేశారు. -
పనితీరు మారాలి
సాక్షి, హైదరాబాద్: అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. పనితీరులో మార్పురాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల కార్యదర్శుల పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతినెలా సమీక్షిస్తారని, తాను ప్రతి 3 నెలలకోమారు సమీక్షిస్తానని స్పష్టం చేశారు. పది రోజులకోమారు విధిగా ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అధికారులు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని అన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సీఎంవో కార్యదర్శులతో దాదాపు 3 గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు. పలు సూచనలు చేయడంతో పాటు.. ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు. ‘విజన్’ అమలుకు నడుం బిగించాలి ‘గడిచిన రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం కొన్ని విజయాలు సాధించింది. భవిష్యత్తు కోసం మరిన్ని ప్రణాళికలు రూపొందించింది. గతంలో ఇంధన, విద్య, నీటిపారుదల, ఆరోగ్య, పర్యాటక శాఖలకు ఒక విధానం అంటూ లేకపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఈ సమస్యలను గుర్తించి కీలకమైన శాఖలకు నిర్దిష్ట విధానాలను తీసుకువచ్చాం. శాఖలతో పాటు రాష్ట్రానికి ఒక దిశ, విధానం ఉండాలన్న ఉద్దేశంతో‘ ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశాం. విజన్ అంటే కేవలం ప్రచారానికే పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, విజన్‌లో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు అధికారులు వెంటనే నడుం బిగించాలి. ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి. వారు జవాబుదారీతనంతో పనిచేయాలి. కార్యదర్శులు సీఎస్‌కు ప్రతి నెలా రిపోర్ట్ సమర్పించాలి. వాటిపై సీఎస్ శాఖల వారీగా సమీక్షలు చేస్తారు. సీఎస్ సమీక్షించి నాకు నివేదిక ఇస్తారు. మూడు నెలలకోసారి నేను సమీక్షిస్తా. సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకం. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి..’ అని సీఎం చెప్పారు. ఉద్యోగుల పూర్తి వివరాలివ్వాలి ‘వివిధ ప్రభుత్వ విభాగాల్లో రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26వ తేదీలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యదర్శులు ఇవ్వాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగుల భవిష్య నిధికి జమ అయ్యే నిధులు, ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధిపతులు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ ప్రక్రియను జనవరి 26 లోగా పూర్తి చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు. జనవరి 26వ తేదీలోగా అద్దె భవనాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలి. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలి. ఖాళీ స్థలాల్లో సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రాష్ట్రంలో ఉన్న 113 మున్సిపల్ ఆఫీసులకు సొంత భవనాలున్నాయా? ఎక్కడెక్కడ అద్దె భవనాలున్నాయి.. వెంటనే గుర్తించి నివేదిక అందించాలి. ప్రజలకు సేవలందించే ఆఫీసులు పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలి. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలు ఖాళీగా ఉంటే వాటిని వినియోగించుకోవాలి. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలు అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలి. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది..’ అని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాల నిధులు సద్వినియోగం చేసుకోవాలి.. ‘కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వాటాగా చెల్లిస్తే, కేంద్రం దాదాపు 60 శాతం ఈ పథకాలకు నిధులు ఇస్తోంది. ఈ పథకాలతో దాదాపు రూ.3 వేల కోట్లు తెచ్చుకునే వీలుంది. అందుకు వీలుగా అన్ని శాఖలు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరపాలి. సీఎస్ఎస్ నుంచి వచ్చే నిధులకు అవసరమైన రాష్ట్ర వాటాను ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించుకోవాలి. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ఈ ఫైలింగ్ సిస్టమ్ అమలు చేయాలి. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదు. అన్ని విభాగాలు తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు సంబంధించి డాష్ బోర్డు సిద్ధం చేయాలి. డాష్ బోర్డును సీఎస్, సీఎంవో డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గ్రౌండింగ్‌లో పురోగతిని ప్రతి నెలా సమీక్షించుకోవాలి. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలి..’ అని రేవంత్ సూచించారు. పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి ‘కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో హాజరు నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలుండాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిట్లో టీచింగ్ ఆస్పత్రులను అద్భుతమైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దాలి. మెడికల్ కాలేజీల హాస్పిటళ్లను కూడా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్తో అనుసంధానం చేయాలి..’ అని సీఎం చెప్పారు. -
సాక్షి టెన్త్ క్లాస్ ప్రత్యేకం.. అతి త్వరలో..
సాక్షి టెన్త్ క్లాస్ ప్రత్యేకం.. అతి త్వరలో..మీ స్టడీ టేబుల్‌పై సాక్షి టెన్త్‌క్లాస్ స్పెషల్స్..పదో తరగతి పరీక్షల్లో మీ సక్సెస్‌కు సులువైన మార్గం..ఏం చదవాలి... ఎలా చదవాలి..మంచి మార్కులు ఎలా సాధించాలి..మీకు ఒక క్లాస్ రూం టీచర్లా..టాప్ మార్కుల సాధనకు మార్గం చూపే నేస్తంలా..సాక్షి టెన్త్‌క్లాస్ స్పెషల్స్ ఉంటాయి..ప్రతి రోజూ సాక్షిలో సబ్జెక్ట్ నిపుణులు అందించే స్టడీ మెటీరియల్..మరి ఇంకెందుకు ఆలస్యం..!నేడే మీ కాపీని సాక్షి ఏజెంట్ వద్ద రిజర్వు చేసుకోండి -
సీఎం చిట్‌చాట్‌ల పేరుతో దాక్కోవద్దు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌ల పేరుతో దాక్కోవడం కాదు దమ్ముంటే బయిటకొచ్చి కేసులపై మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం నల్గొండలో నిర్వహించిన బీర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా రోజుకో కేసు అంటూ లీకులిస్తుందని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ గర్జిస్తే కాంగ్రెస్ నేతలెవరూ సమాధానం చెప్పలేకపోయారని వారికి ఆ దమ్ములేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ఎన్నికలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపైనే ఉండాలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడకూడదని కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గత ఆదివారం జరిగిన బీఆర్ఎస్సీఎల్పీ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు గుర్తుతో స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు బీఆర్ఎస్కు మరింత అనుకూలంగా ఉండేవన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. దానితో పాటు 2023లో బీఆర్ఎస్ హాయాంలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా వన్ రేసు అవినీతి కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. -
పాట తెచ్చిన ‘పంచాయితీ’
నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్ఎస్కు సంబం«ధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్‌కు, బీఆర్ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్‌రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. మంత్రులకు సంబంధించిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు వైకుంఠ ద్వారం దగ్గర ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నప్పటికీ ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ శ్రేణులు తాజాగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రులకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలను పెట్టారు. అయితే, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం ఉన్నప్పటికీ ఎలా పెట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. అనంతరం, వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ నేతల బైఠాయించి నిరసనలు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నాయకులను పీఎస్‌కు తరలించారు. కాగా, గతంలోనూ మంత్రుల పర్యటన సందర్భంగా ఇష్టారీతిన కాంగ్రెస్ కార్యకర్తల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఈవో మద్దతుగా ఉంటూ ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం, ఆలయం చుట్టూ ఫ్లెక్సీల ఏర్పాటుపై గతంలోనే నిషేధం విధించారు. అయినప్పటికీ ఈ నిషేధాన్ని కాంగ్రెస్ నేతలు ఉల్లంఘించారు. కాగా, కాంగ్రెస్ శ్రేణుల ఓవరాక్షన్‌తో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు సైతం నిరసనలకు, ధర్నాలకు సిబ్బమైనట్టు తెలిపారు. -
క్రిఫ్టో కరెన్సీ ఇస్తా అంటూ..దృష్టి మరల్చి కోటి రూపాయలతో ఉడాయింపు
హైదరాబాద్ : నగదుకు బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తానంటూ నమ్మబలికి దృష్టి మరల్చి రూ కోటి నగదుతో ఉడాయించిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఉమర్ (35) అనే వ్యాపారవేత్తకు ఇటీవల సోమవారం సాయంత్రం బంజారా శాలిబండ ప్రాంతానికి చెందిన ఎత్తెషామ్ ఆన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాము క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికాడు.దీంతో అతడి మాటలు నమ్మిన ఉమర్ సోమవారం సాయంత్రం రోడ్ నెంబర్ 1 లోని తాజ్ దక్కన్ హోటల్ కు వచ్చాడు.. రూ. కోటి కి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పడంతో కోటి రూపాయల నగదును అప్పగించాడు. కొన్ని నిమిషాల్లోనే క్రిప్టో కరెన్సీ వస్తుందంటూ దృష్టి మరల్చిన నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు.ఎంతసేపు గడిచినా ఎతేశ్యామ్ వెనక్కి రాకపోవడం, అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఉమర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
Sangareddy: అతివేగంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అతివేగంతో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు కాగా, మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పూర్ణిమా..వాడిని వదిలేయ్!
హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె.అశోక్ (45) ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్‌గా పనిచే స్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లేస్కూల్ నిర్వహిస్తోంది. వేరేకాలనీ లో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమ కొన్ని సంవత్సరా లనుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో అశోక్ గతంలో భార్య ను మందలించాడు. ఈనెల 10వ తేదీన ఇంటిముందు మహేశ్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా గైనా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేశ్, పూర్ణిమ పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేశ్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి అశోక్కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురూ మూకుమ్మడిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్లు పట్టుకోగా, ప్రియుడు, మరోవ్యక్తి మెడకు మూడు చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి, అంబులెన్స్‌లో అశోక్‌ను మల్కాజిగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. వాష్‌రూంలో హార్ట్ ఎటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. ఆసుపత్రి సిబ్బంది మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు, మరోవ్యక్తి సాయంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు మహేశ్‌తోపాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఎందుకు ఇచ్చారు..? ఎవరు ఇమ్మన్నారు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన వ్యూహం మార్చింది. ఓ పక్క సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలోని కార్యాలయంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును విచారిస్తోంది. మరోపక్క ఆయనకు పదవీ విరమణ అనంతరం ఎక్స్టెన్షన్ లభించడం, సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీనికి వెనుక బలమైన రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తోంది. ఈ విషయం నిగ్గు తేల్చడానికి అప్పట్లో కీలక బాధ్యతల్లో పని చేసిన అధికారులను ప్రశి్నస్తోంది. ఇప్పటికే మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, నిఘా విభాగం మాజీ చీఫ్ నవీన్ చంద్‌లకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ సాక్షులుగా పరిగణిస్తూ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా పని చేసిన వారితో పాటు కొందరు సలహాదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 25 వరకు ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ విచారణ చేపట్టాలని సిట్ భావిస్తోంది. వచ్చే నెల 16న సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చే సమయానికి కొత్తగా మరికొన్ని కీలకాంశాలను గుర్తించాలని, న్యాయస్థానానికి నివేదించడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావు 2016లో ఎస్ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఆయన మాత్రం ఎస్ఐబీ చీఫ్‌గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్‌చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్‌రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబీని మాత్రం వదల్లేదు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్టెన్ష¯Œన్పై కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఎక్స్టెన్షన్ కోసం నిఘా విభాగాధిపతి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతోనే ప్రధాన కార్యదర్శి దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి వరకు చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కుమార్‌తో పాటు 2016 సెపె్టంబర్ నుంచి 2020 నవంబర్ వరకు నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్‌చంద్ వాంగ్మూలాలూ ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రభాకర్‌రావు కొనసాగింపు వెనుక పెద్దల ప్రమేయం, ఒత్తిడి ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలోనూ వీరిద్దరినీ విచారించింది. ప్రభాకర్‌రావుకు ఎక్స్‌టెన్సన్ ఎందుకు ఇచ్చారు? అలాంటి ప్రతిపాదనలు రూపొందించమని ఎవరు చెప్పారు? ఎవరి ఒత్తిళ్ల మేరకు ఈ ప్రక్రియ జరిగింది? తదితర అంశాలను ప్రశి్నంచారు. త్వరలోనే మరికొందరినీ ప్రశి్నంచడానికి సిట్ సన్నాహాలు చేస్తోంది. సోమేష్‌కుమార్, నవీన్ చంద్ ఇచి్చన వాంగ్మూలాల్లోని అంశాల ఆధారంగా గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అడగాల్సిన ప్రశ్నల్ని సిట్ సిద్ధం చేస్తోంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి«నిధులకు సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలిసింది. -
ఉగాండా జాతీయురాలి డిపోర్టేషన్
సాక్షి, హైదరాబాద్: ఉగాండా నుంచి టూరిస్ట్ వీసాపై వచ్చి... వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటూ డ్రగ్ సప్లయర్స్‌తో కలిసి తిరుగుతున్న జూలిన విక్టర్ నబితకను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సోమవారం డిపోర్టేషన్ విధానంలో ఆమె స్వదేశానికి బలవంతంగా తిప్పి పంపింది. ఫారెనర్స్ రీజనల్ రిజి్రస్టేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సోమవారం వెల్లడించారు. జూలీనా ఉగాండాలో విద్యనభ్యసించింది. ఆపై టూరిస్ట్ వీసాపై 2024 ఫిబ్రవరి 12న ముంబై వచ్చింది. అక్కడి నుంచి చెన్నై, ముంబై, బెంగళూరుల్లో కొన్నాళ్లు నివసించింది. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు కొందరు డ్రగ్ పెడ్లర్లు, సప్లయర్లతో జట్టు కట్టింది. వారి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలను సప్లయర్స్ నుంచి తీసుకురావడం, కస్టమర్లకు అందించడం మొదలుపెట్టింది. ఇందు కోసమే తరచూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేది. ఇటీవల టోలిచౌకీ ప్రాంతంలో కొందరు డ్రగ్ పెడ్లర్స్‌తో ఉన్న జూలీనాను హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలోని బృందం పట్టుకుంది. మిగిలిన వారిని అరెస్టు చేయగా... ఆమె వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించకపోవడంతో లోతుగా ఆరా తీసింది. దీంతో ఆమె పాస్‌పోర్టు గడువు 2033 వరకు ఉన్నప్పటికీ వీసా మాత్రం ఈ ఏడాది జనవరి 18న ఎక్స్పైర్ అయినట్లు తేలింది. దీంతో విషయాన్ని ఎఫ్ఆర్ఆర్ఓకు తెలిపిన హెచ్–న్యూ ఆమెను డిటెన్షన్ సెంటర్లో ఉంచింది. డిపోర్టేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేసి ఆదివారం ఉగాండాకు తిప్పి పంపింది. 2022 నుంచి ఇప్పటి వరకు హెచ్–న్యూ దాదాపు 40 మంది విదేశీయులను పట్టుకుని, వారి దేశాలకు డిపోర్టేషన్ చేసింది. వీరిలో నైజీరియా, సూడాన్, ఘనా, ఐవరీ కోస్ట్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. -
బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్‌కు ఎక్స్‌ప్రెస్ వే
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు బంజారాహిల్స్ నుంచి ఫిల్మ్‌నగర్ మీదుగా శిల్పా లేఅవుట్ వరకు అక్కడి నుంచి నేరుగా ఔటర్‌కు చేరుకొనే విధంగా కొత్త ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి గచి్చ»ౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ తాజాగా టెండర్లను ఆహా్వనించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్లో డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు మరో 23 కి.మీ.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జీస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ మీదుగా ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వేను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపం వరకు వచ్చే ప్లైఓవర్ వరకు ఈ సరికొత్త రహదారికి ప్రణాళికలు రూపొందించారు. ఔటర్ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరుకొనేందుకు, బంజారాహిల్స్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొనేందుకు ఈ రహదారి దోహదం చేయనుంది.ఈ రహదారిలో దాదాపు 6 నుంచి 7 కి.మీ.వరకు ఆరు లైన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను నిరి్మంచనున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు కోసం హెచ్ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోనే టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. మరోవైపు షేక్‌పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో రహదారి నిర్మాణానికి కూడా హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. ష్క్పేట్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మార్గంలో నేరుగా ఔటర్‌కు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డుకు, అలాగే ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి అన్ని వైపు లా రీజనల్ రింగ్‌రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు రహదారుల అభివృద్ధి, విస్తరణకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. -
గడువులోగా మెట్రో స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: నిరీ్ణత గడువులోగా మెట్రో మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ కార్యాచరణను వేగవంతం చేసింది. ఆర్థిక లావాదేవీలు, న్యాయపరమైన అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఐడీబీఐ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. మరోవైపు మెట్రో రైళ్ల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థలపైన అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు త్వరలో టెక్నికల్ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మెట్రో స్వా«దీనప్రక్రియ పురోగతిపై మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ‘సాక్షి’తో ముచ్చటించారు. మరో వారం పది రోజుల్లో టెక్నికల్ కన్సల్టెన్సీ నియామకం పూర్తవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కియోలిస్ సంస్థ ఆధ్వర్యంలోనే మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది, రైళ్ల నిర్వహణ తదితర అంశాలను కియోలిస్ పర్యవేక్షిస్తోంది. మరో ఏడాది పాటు ఈ సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంది. కానీ మొదటిదశతో పాటు భవిష్యత్తులో నిర్మించనున్న రెండో దశ మెట్రో కూడా పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టుగా అవతరించనున్న దృష్ట్యా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మొత్తం రైళ్ల నిర్వహణపై ఈ సాంకేతిక అధ్యయనం దిశా నిర్దేశం చేయనుందని ఎండీ చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన మెట్రో మొదటి దశ నుంచి వైదొలగనున్నట్లు ఎల్అండ్టీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రభుత్వం కూడా మొదటి దశను స్వా«దీనం చేసుకునేందుకు సన్నద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కూడా ఏర్పాటైంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలో మెట్రో స్వా«దీన కమిటీ పని చేస్తోందని ఆయన వివరించారు. భూములు, భవనాలు స్వాదీనం... ఒప్పందానికి అనుగుణంగా మెట్రో మొదటి దశలో భాగంగా రవాణా ఆధారిత అభివృద్ధి కోసం ఎల్అండ్టీకి అప్పగించిన భూములు, భవనాలు, మాల్స్‌ను త్వరలో స్వాధీనం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం 212 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయన్నారు.అలాగే మూడు కారిడార్లలోని మాల్స్, ఇతర ఆస్తులను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఒప్పందం మేరకు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం రూ.2000 కోట్లు అందజేయవలసి ఉంది.అలాగే బ్యాంకుల్లో ఉన్న మరో రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. ఎల్అండ్టీ నుంచి స్వా«దీనం చేసుకోనున్న ఆస్తులు, భూముల విక్రయాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కియోలిస్ సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రో రైళ్లనిర్వహణను అదే సంస్థతో యథావిధిగా కొనసాగించినా, లేదా మరో సంస్థను ఎంపిక చేసినా అందుకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం అందజేయవలసి ఉంటుంది. అలాగే ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోచ్‌ల కొనుగోలు అంశం కూడా ప్రతిపాదనలో ఉంది.సకాలంలో రెండో దశ..మెట్రో రెండో దశకు కేంద్రం సానుకూలంగా ఉందని, సకాలంలోనే అన్ని కారిడార్లలో ఒకేసారి పనులను చేపట్టే అవకాశం ఉందని ఎండీ తెలిపారు. గతంలో కేంద్రానికి అందజేసిన డీపీఆర్‌ల ఆధారంగానే రెండో దశ ప్రాజెక్టుపైన ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వమే స్వాదీనం చేసుకుంటున్నందు వల్ల రెండో దశ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పరిధిలో రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన ఆస్తుల సేకరణ దాదాపుగా పూర్తయినట్లు ఎండీ చెప్పారు. మొత్తం 880 నిర్మాణాలను గుర్తించగా, ఇప్పటి వరకు సుమారు 700 ఆస్తులను సేకరించి కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రెండో దశలో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిరి్మంచనున్న కారిడార్‌లో కూడా భూసేకరణ చేపట్టవలసి ఉందని, మిగతా కారిడార్లలో పెద్దగా భూసేకరణ అవసరం లేకుండానే రెండో దశ ప్రాజెక్టును నిరి్మంచబోతున్నామని సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు. -
‘ఒక్క ఓటుతో ఓడినా.. సర్పంచ్ నేనే’
నార్కట్‌పల్లి: మండల పరిధిలోని చిన్ననారాయణపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ రోజు కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మెరుగు అనితకు, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనితకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనిత గెలుపొందినట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి రీకౌంటింగ్ నిర్వహించగా.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెరుగు అనిత ఒక ఓటుతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిపై గెలిచినట్లు ధ్రువీకరణ చేశారు. అయితే సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో ఒక్క ఓటుతో ఓడిపోయినా.. సర్పంచ్ నేనే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఉమేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగించారు. కాగా గ్రామ పంచాయతీలో 8 వార్డులకు గాను ఐదు వార్డులు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. ముగ్గురు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉప సర్పంచ్, బీఆర్ఎస్ బలపర్చిన వార్డు సభ్యులు హాజరు కాలేదు. దీంతో కేవలం సర్పంచ్‌తోపాటు ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులతో మాత్రమే ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. -
బడిలో.. కిరాణా షాపులో.. చెట్ల కింద..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. మొత్తంగా 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉప సర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిచోట్ల పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో, కొన్నిచోట్ల భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో ఓ చోట కిరాణా షాపులో, మరోచోట ఆరుబయట, ఇంకోచోట చెట్ల కింద సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల కొలువుదీరిన మొదటి రోజునుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేయడం విశేషం.కిరాణా షాపులో అధ్యక్షా.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్‌గా ఎన్నికైన పావని తన కిరాణా దుకాణంలోని సగభాగంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పాలకవర్గ సభ్యులకు ఇబ్బందికరంగా ఉండటంతో ఆరుబయట ప్రమాణ స్వీకారం చేశారు.చెట్ల నీడలోనే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలంలోని నల్లబండబోడు, చింతలతండా గ్రామపంచాయతీల భవనాలు నిర్మాణంలో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు చెట్ల కిందే టెంట్ నీడలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇదే మండలం గురువాగుతండా, శంభునిగూడెం, సాయిరాంతండా, గాం«దీనగర్ల్లో సొంత భవనాలు లేక పాఠశాల భవనాల్లో పాలకవర్గాలు ప్రమాణం చేశాయి. మద్యపాన నిషేధంతో మొదలు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్వగ్రామం, సిద్దిపేట జిల్లా భూంపల్లి–అక్బర్పేట మండలం బొప్పాపూర్‌లో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి రోజు సంపూర్ణ మద్య నిషేధంపై తొలి తీర్మానం చేశారు. బెల్ట్‌షాపులపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. తర్వాత స్వచ్ఛ బొప్పాపూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పని చేసి.. ప్రమాణం చేశారు.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని కొంపల్లి నూతన సర్పంచ్ జంగాల సాలమ్మ ప్రమాణస్వీకారానికి ముందు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి చీపురుపట్టి వీధులను శుభ్రపరిచారు. ఆ తరువాత పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ప్రమాణం చేశారు. అద్దె ఇల్లు తీసుకుని.. సిద్దిపేట జిల్లా గాంధీనగర్, బంజేరుపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో సర్పంచ్‌లు అద్దె ఇల్లును తీసుకున్నారు. ఇది అనువుగా లేకపోవడంతో ఆరుబయటే ప్రమాణం చేశారు. మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంతో పాటు వంగపల్లి, హనుమతండా, రెడ్యానాయక్ తండా, దుబ్బతండా గ్రామాల్లో సొంత భవనాలు లేకపోవడంతో ఓ చోట టెంట్ వేసి ప్రమాణం చేశారు. బడిలో ‘పంచాయతీ’ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలో నడిమితండా, సీతానగర్ పంచాయతీ కార్యాలయాలు ప్రాథమిక పాఠశాలలోని ఓ తరగతి గదిలో కొనసాగుతుండగా, గొల్లకుంట తండా పంచాయతీ కార్యాలయం ఓ ఇంట్లో నిర్వహిస్తున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలను స్కూళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణలోనే టెంట్ వేసి ప్రమాణం చేశారు. గుర్రంపై వచ్చిన సర్పంచ్ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రవీందర్ పటేల్ ప్రమాణ స్వీకారానికి గుర్రంపై వచ్చాడు. బ్యాండుమేళాలతో పెళ్లి బారాత్ ఊరేగింపు మాదిరిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. రంగుల ‘పంచాయితీ’ కాంగ్రెస్ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణం చేయబోమని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తంచేయడంతో పోలీసులు, అధికారులు వచ్చి సర్దిచెప్పారు.అంబులెన్స్‌లోనే ప్రమాణం జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా గెలుపొందారు. రెండు రోజుల క్రితం అలేఖ్య అనారోగ్యం బారినపడి అస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఉపసర్పంచ్‌గా ఆమె తండ్రి చండి పర్శయ్య, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్పత్రిలో ఉన్న అలేఖ్య అంబులెన్స్‌లో గ్రామానికి రాగా.. అధికారులు అందులోనే అలేఖ్యతో ప్రమాణం చేయించి సంతకాలు తీసుకున్నారు.పురిటి నొప్పులతో వచ్చి.. నారాయణపేట జిల్లా ఊట్కూరు సర్పంచ్‌గా గెలుపొందిన రేణుకకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కుటుంబసభ్యులు ఆమెను పంచాయతీ కార్యాలయానికి తీసుకురాగా కార్యదర్శి శ్రీనివాసరావు ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన బోయపల్లి రాజేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఆయన తండ్రి మాజీ సర్పంచ్ బోయపల్లి సురేందర్ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ప్రమాణం వాయిదా పడకూడదని భావించిన రాజేష్ బాధను దిగమింగుతూ బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకాలు చేశారు.కింద కూర్చునే బాధ్యతల స్వీకరణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) కొత్త పంచాయతీ. కార్యాలయానికి పాఠశాల ఆవరణలోని ఓ గదిని కేటాయించారు. కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో నిరసనగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కింద కూర్చునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఒక గ్రామం.. ఇద్దరు సర్పంచ్‌లు! సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయ తీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో మొత్తం 1,268 ఓట్లు ఉండగా.. 1,141 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సనప సుజాతకు 549 ఓట్లు, బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న నూనావత్ స్వాతికి 552 ఓట్లు వచ్చినట్లు ఫలితాల సందర్భంగా అధికారులు ప్రకటించారు. దీంతో స్వాతికి గెలుపుపత్రం ఇచ్చారు. సుజాత రీకౌంటింగ్ కోరగా.. తిరిగి ఓట్లను లెక్కించారు. స్వాతికి 549 ఓట్లు, సుజాతకు 550 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. ముందుగా స్వాతికి ఇచ్చిన గెలుపు పత్రం వెనక్కి తీసుకోకుండానే... రిటర్నింగ్ అధికారి సుజాతకు మరో గెలుపు పత్రం అందజేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం కోసం ఇరువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో పంచాయతీ కార్యాలయానికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సుజాత గెలిచినట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ప్రకటించి ప్రత్యేకాధికారి మంగీలాల్ ఆమెతో ప్రమాణం చేయించారు.95 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా తిరుమలగిరి (తుంగతుర్తి): 95 ఏళ్ల వయసులో సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు.ర్యాలీలో ఉద్రిక్తత మర్రిగూడ (చింతపల్లి): నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య తన ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ర్యాలీలో ప్రత్యర్థి వర్గీయులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వెంబడించడంతో వారు పరారయ్యారు. పలువురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
బీఆర్ఎస్కు తోలు తప్ప కండ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్ధమైంది.అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. బండ కూడా పగలకొట్టలేదు.. సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పారు. సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించారు. -
‘ఆహార’ పరిశ్రమలకు కేంద్రంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో వ్యవసాయ, ఆహారశుద్ధి సంబంధిత పరిశ్రమలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు ఎగుమతుల వృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెంపుదలపై దృష్టిపెట్టనుంది. రాష్ట్రంలోని పంటల వైవిధ్యం, రైతుల సంఘటిత శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ పార్కులు, ప్రాసెసింగ్ జోన్లు తదితరాలను అనువుగా మలుచుకొని జాతీయ స్థాయిలో వ్యవసాయ, ఆహార సంబంధిత పరిశ్రమలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలకు ప్రభుత్వం మెరుగులు దిద్దుతోంది. మెగా ఫుడ్ పార్కులను బలోపేతం చేయడం, చిన్నతరహా పరిశ్రమల మధ్య పోటీతత్వం పెంచడం, పంటల ఆధారిత మార్కెటింగ్ వసతులు, ఆధునాతన నిల్వ సదుపాయాలు, శీతల గిడ్డంగుల నెట్వర్క్ విస్తరణ కోసం సమగ్ర విధానం తేవాలని నిర్ణయించింది. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా.. పరిశ్రమల శాఖ అధీనంలోని ‘తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ’(టీజీఎఫ్‌పీఎస్) ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఫుడ్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ గ్రాంట్ల ద్వారా చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించి రిటైల్ విక్రయాలతోపాటు ఎగుమతులను ప్రోత్సహించనుంది. చిన్న పరిశ్రమలకు ఆర్థిక చేయూత ఇచ్చి ఈ–కామర్స్ వేదికలపై ఉత్పత్తుల విక్రయాలకు చోటు కల్పించనుంది. ప్రాసెసింగ్ యూనిట్లకు నిరంతరం కూరగాయలు, పండ్ల సరఫరా జరిగేలా 110 టన్నుల సామర్థ్యంగల మైక్రో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించనుంది. టీజీఐఐసీ, మార్కెటింగ్ శాఖల ద్వారా ఈ మైక్రో కోల్ట్ స్టోరేజీలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించనుంది. బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లు.. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారుల కోసం బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపడుతోంది. ధాన్యం, పండ్లు, కూరగాయలు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలను ప్రాసెసింగ్ సెంటర్లకు తరలించడం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పనతోపాటు మెగా ఫుడ్ పార్కులకు ముడి సరుకుల లోటు లేకుండా సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు రైతులు, రైతు సంఘాలను అనుసంధానించనుంది. పోషకాహార ఫుడ్ పార్కుల స్థాపన.. ఫార్మా, ఫుడ్ కంపెనీల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ‘న్యూట్రాసూటికల్ ఫుడ్ పార్కులు’ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫుడ్ పార్కుల్లో జరిగే కార్యకలాపాల కోసం యూనివర్సిటీలు, ఇతర అభివృద్ది, పరిశోధన సంస్థలు పనిచేస్తాయి. ఆహార శుద్ధి పరిశ్రమల్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం నేషనల్ సెంటర్ ఫర్ ఫుడ్ ఇన్నోవేషన్ (ఎన్సీఎఫ్ఐ)ను ఏర్పాటు చేయడం ద్వారా ఆహార శుద్ధి రంగం బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఆహార శుద్ధి ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు పెంపొందించి ఎగుమతులను ప్రోత్సహించేందుకు టీజీఎఫ్‌పీఎస్ ద్వారా సరి్టఫికేషన్ ఇవ్వనుంది.ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆధునిక సాంకేతికత.. మసాలా దినుసులు, పండ్లు, కూరగాయలతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రమాణాలు పెంచేందుకు ఆధునిక ఐటీ సాంకేతికతను కూడా వినియోగించే ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పంటల సాగు, దిగుబడి, శుద్ధి దశల్లో ఏఐ, ఇతర సాంకేతికతలను మేళవిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహించే బాధ్యతను సంబంధిత శాఖలకు అప్పగించింది. రాష్ట్రంలో వివిధ పంటల సాగుకు పేరొందిన ప్రాంతాలను అనుసంధానిస్తూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మామిడి, మి ర్చి, పసుపు, సోయాబీన్, కందులు, వరి, పత్తి, మొక్కజొన్న, తృణధాన్యాలు తదితరాల ప్రాసెసింగ్‌కు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహించనుంది. -
రైలు సిగ్నళ్లుగా డిటోనేటర్ పేలుళ్లు!
సాక్షి, హైదరాబాద్: దట్టమైన పొగమంచుతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో రైలు సిగ్నళ్ల కోసం డిటోనేటర్ల వినియోగానికి ఆ శాఖ సిద్ధమవుతోంది. దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని డివిజన్లలో చాలినన్ని డిటోనేటర్లను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలనే ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రస్తుతం పొగ మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో, రైలు ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. డిటోనేటర్ పేలుడు శబ్దమే సిగ్నల్!పొగ మంచు తీవ్రతకు రైళ్ల లోకో పైలట్లకు సిగ్నళ్లు కనిపించని సందర్భాల్లో డిటోనేటర్ పేలుడునే సిగ్నల్‌గా వినియోగించటం చాలా కాలంగా కొనసాగుతోంది. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో కూడా వీటి వినియోగం ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. శీతాకాలంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారే వరకు పొగమంచు కారణంగా లోకో పైలట్లకు సిగ్నళ్లు కనిపించవు. అలాంటి సందర్భాల్లో ముందు రెడ్ సిగ్నల్ ఉన్నా రైళ్లు ఆగకుండా దూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగానే డిటోనేటర్లను వినియోగిస్తున్నారు. తీవ్రమైన పొగమంచు సమయంలో రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు డిటోనేటర్ ఉన్న చిన్న స్ట్రిప్‌ను సిగ్నల్‌కు 270 మీటర్ల నుంచి 280 మీటర్ల ముందుగా పట్టాలకు సిబ్బంది అమర్చుతారు.రైలు చక్రం దాని మీదుగా వెళ్లగానే ఆ ఒత్తిడికి డిటొనేటర్ పేలి పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం... ముందు రెడ్ సిగ్నల్ ఉందనేది సందేశం. దీంతో లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపేస్తారు. ముందు మరో రైలు ఆగిఉన్నప్పుడు, ఎక్కడైనా పట్టా విరిగినప్పుడు, పట్టాలమీద జంతువులు నిలిచి ఉన్నప్పుడు, రైళ్లను నిలపాల్సిన మరే ఇతర కారణాలు ఎదురైనప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తారు. వెనక వచ్చే రైలు ఆ సిగ్నల్‌కు ముందే నిలవాల్సి ఉంటుంది. పొగమంచు ఏర్పడినప్పుడు నిర్ధారిత దూరంలో, ప్రతి పది అడుగులకు ఒకటి చొప్పున మూడు డిటోనేటర్లు అమర్చుతారు. మూడు శబ్దాలు వస్తే రైలును ఆపాలని సూచన ఇచ్చినట్టుగా లోకోపైలట్ భావిస్తాడు. అదే ఒకే డిటోనేటర్ పేలి శబ్దం వస్తే, రైలును అతి నెమ్మదిగా నడపాలన్నది సూచనగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫాగ్ సేఫ్టీ డివైస్ చాలినన్ని లేకనే...ఈ డిటోనేటర్ విధానం చాలా పాతది. దీంతో దానికి ప్రత్యామ్నాయంగా ఫాగ్ సేఫ్టీ డివైస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జీపీఎస్ ఆధారిత నావిగేషన్ డివైస్‌లు. ముందుండే సిగ్నల్ కనిపించని సమయంలో నిర్ధారిత మీటర్ల ముందే లోకో పైలట్లకు బీప్ శబ్దం వినిపించటంతో పాటు సిగ్నల్ కలర్లో ఇండికేషన్ బ్లింక్ అవుతుంది. వెంటనే లోకో పైలట్లు తదనుగుణంగా స్పందిస్తారు. కానీ, ఈ ఫాగ్ సేఫ్టీ డివైస్‌లు ఇంకా అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 25,900 పరికరాలు మాత్రమే ఉన్నాయి. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తర భారతంలో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. దక్షిణ భారత్‌లో వీటికి కొరత ఉంది. ఈ కారణంగానే డిటోనేటర్లను వాడక తప్పని పరిస్థితి నెలకొంది.డిటోనేటర్లు సమకూర్చుకోండి: జీఎం‘శీతాకాలంలో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండే సమయమిది. కాబట్టి జోన్ పరిధిలోని అన్ని సెక్షన్లలో చాలినన్ని డిటోనేటర్లు అందుబాటులో ఉండాలి. వెంటనే సమకూర్చుకోండి. ఎలక్ట్రికల్, ట్రాక్షన్, కీమెన్... ఇలా అన్ని చోట్ల అవి ఉండాలి. సిగ్నళ్లు కనిపించని పరిస్థితి ఉంటే వాటిని ఏర్పాటు చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడండి. సిగ్నళ్లకు అడ్డుగా ఉండే చెట్ల కొమ్మలు కూడా తొలగించండి. జీపీఎస్ ట్రాకర్లు, వాకీ టాకీలు, ఇతర ఫాగ్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచుకోండి..’ అంటూ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. -
'బెట్టింగ్'పై కదిలారు!
హైడ్రా కమిషనర్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య (33) ఆదివారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించారు. గత నెల 3న సంగారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సందీప్ (24) ఠాణా నుంచి తీసుకువెళ్లిన పిస్టల్‌తో కాల్చుకుని చనిపోయారు. అంబర్‌పేట పోలీసుస్టేషన్లో ఎస్సైగా పని చేసి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న భాను ప్రకాశ్ రెడ్డి ఓ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి వివాదాస్పదుడయ్యాడు.సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ జీవితాలతో ఆడుకుంటోంది. ముఖ్యంగా పలువురు పోలీసులు సైతం దీని బారిన పడి ఆర్థికంగా నష్టపోవడం, కొందరు బలవన్మరణాలకు సైతం పాల్పడుతుండటం శోచనీయం. కృష్ణ చైతన్య, సందీప్, భానుప్రకాశ్లే కాదు..తెరపైకి రాకుండా ఉన్న అనేక ఉదంతాల్లో కామన్ పాయింట్ ఆన్లైన్ బెట్టింగే కావడం గమనార్హం. వివిధ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా బెట్టింగ్, గేమింగ్‌కు బానిసలుగా మారుతున్న పోలీసులు మానసికంగా బలహీనంగా మారిపోతున్నారు. ఇలాంటి వ్యసనాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తే ఆదుకోవాల్సిన, పరిష్కార మార్గాలు చూపాల్సిన పోలీసులే ఆ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. నేరగాళ్లుగా మారుతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. రాష్ట్ర పోలీసు సిబ్బందిలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ పరిణామాలను డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల నుంచి బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించనున్నారు. నిషేధం ఉన్నప్పటికీ ఎలా సాధ్యం..? ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌పై ప్రస్తుతం పూర్తి స్థాయి నిషేధం ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది దీని ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఈ యాప్‌లు, వెబసైట్లను నిర్వహించే సూత్రధారులు ఎందరికో వల వేస్తున్నారు. తొలినాళ్లలో లాభాలు ఇచ్చినా ఆపై అంతా నష్టమే వచ్చేలా వాటిలో ప్రోగామింగ్ ఉంటుంది. ఈ విషయం తెలియక, తెలిసీ వ్యసనంగా మారడంతో పలువురు నిండా మునిగిపోతున్నారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లతో (వీపీఎన్) పాటు ఫేక్ జీపీఎస్‌లను వినియోగిస్తున్న పంటర్లు (పందెం కాసేవాళ్లు) ఈ ఆటలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసు విభాగం నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్, గేమింగ్ యాప్ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలని నిర్ణయించింది. అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షణ.. పోలీసుల నుంచి ఈ బెట్టింగ్ వ్యసనాన్ని తరిమికొట్టడానికి ఎస్ఓపీ (ఏదైనా ఒక విషయానికి సంబంధించి నిర్దిష్ట విధానాలు, ఆదేశాలు) డిజైన్ చేస్తున్నారు. మరోపక్క డీసీపీ, ఏసీపీ కార్యాలయాలతో పాటు పోలీసుస్టేషన్లలోనూ అంతర్గత నిఘా కోసం విజిలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్లు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా బెట్టింగ్, గేమింగ్ అలవాటు ఉన్న సిబ్బంది, అధికారులను గుర్తిస్తారు. వారిలో పూర్తి మార్పు తీసుకురావడానికి నేరుగా, కుటుంబీకుల ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించనున్నారు. దీంతో పాటు ప్రతి రోజూ పోలీసుస్టేషన్లలో జరిగే రోల్కాల్స్ సమయంలోనూ దైనందిన విధులు, ప్రత్యేక చర్యలతో పాటు బెట్టింగ్, గేమింగ్ వ్యసనాల వల్ల నష్టాలు, వాటి పర్యవసానాలు వివరించనున్నారు. ప్రతి అధికారి, సిబ్బంది స్నేహితులతో సంప్రదింపులు జరిపే విజిలెన్స్ బృందాలు వారి ద్వారా ఈ వ్యసనం ఉన్న వారిని గుర్తించనున్నారు. యువకుల్లోనే ఎక్కువగా ఉంది: పోలీసు విభాగంలో బెట్టింగ్, గేమింగ్ వ్యసనం అనేది యువ అధికారులు, సిబ్బందిలోనే ఎక్కువగా ఉంటోంది. సీనియర్లలో కనిపించడం అత్యంత అరుదైన విషయం. పోలీసులు సైతం సమాజంలో భాగమే కావడంతో వీరిపైనా అనేక ప్రభావాలు ఉంటాయి. ఈజీ మనీపై ఆసక్తి, ఆశ, అవసరాలు ఇలా అనేక కారణాలతో ఇలాంటి వ్యసనాలకు లోనవుతున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈ పరిస్థితి నిరోధించడానికి చర్యలు చేపడుతున్నాం. – జి.సుదీర్‌బాబు, పోలీసు కమిషనర్, రాచకొండ -
లొంగుబాటుకు దేవ్‌జీ షరతులు!
కోరుట్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లొంగుబాటు వ్యవహారంలో కొన్ని షరతుల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అందుకే దేవ్‌జీ లొంగుబాటులో తాత్సారం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ యంత్రాంగంతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా దేశాన్ని మావోయిస్టురహితంగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో దేవ్‌జీ లొంగుబాటు అంశం చర్చనీయాంశమైంది. కేంద్ర కమిటీ బలహీనం కావడంతో.. మావోయిస్టు పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన హిడ్మా సహా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1,800 మంది మావోయిస్టులు గత కొంతకాలంగా జరుగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్, ఎదురుకాల్పుల ఘటనల్లో మృతిచెందారు. దీనికితోడు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు సహా వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఫలితంగా మావోయిస్టు కేంద్ర కమిటీ బలహీనంగా మారింది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్‌జీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవ్‌జీ లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో మృతిచెందినా ఆపరేషన్ కగార్ ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల క్రితం దేవ్‌జీ అంగరక్షకులను పోలీసులు అరెస్టు చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని.. పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇప్పటికీ ఆయన లొంగుబాటు విషయంలో నెలకొన్న స్తబ్దత వీడటం లేదు. షరతులతో తాత్సారం? దేవ్‌జీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్లు ఇటీవల కాలంలో ప్రచారం సాగుతోంది. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాలతోపాటు జార్ఖండ్‌లోని తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి అంశాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఉద్యమంలో పనిచేసి జైలుశిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తు ఏమిటన్న అంశంపైనా చర్చించాలని దేవ్‌జీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షరతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రానందునే దేవ్‌జీ లొంగుబాటులో తాత్సారానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. అయితే డిమాండ్లన్నీ నెరవేరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు దేవ్ జీ లొంగిపోతారన్న ప్రచారం జరుగుతోంది. -
కమీషన్‌కే ఏటా రూ.600 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై కాసుల వర్షం కురుస్తోంది. నిర్దేశించిన విధులను నిర్వర్తించడంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రమిస్తుంటే..వారికి అరకొరగా వచ్చే వేతనం నుంచి కమీషన్ల కింద ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే సొమ్ముతో ఏజెన్సీలు జేబులు నింపుకుంటున్నాయి. కేవలం కమీషన్ పేరిట రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.600 కోట్ల మేర సంపాదిస్తుండటం గమనార్హం. కాగా తమ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోతలు, వేతన చెల్లింపుల్లో జాప్యంతో జమ అయ్యే వడ్డీ, ఇతరత్రా రూపాల్లో అందిన కాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏజెన్సీల ఇష్టానుసార నిర్ణయాలతో వారికి వేతనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. రావాల్సిన మొత్తం కంటే తక్కువగా ముట్టజెపుతుండటంతో, పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉండటంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పరిపాలన సజావుగా సాగాలనే పేరిట.. పరిపాలనను సజావుగా కొనసాగించేందుకు, ఉద్యోగ ఖాళీలతో ఏర్పడే సమస్యను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఉద్యోగులను నేరుగా నియమించుకోకుండా.. ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసుకుని వాటి ద్వారా అర్హత కలిగిన వ్యక్తులను వివిధ శాఖల్లోకి తీసుకుంటోంది. ప్రభుత్వానికి అవసరమైన సర్వీసులను నేరుగా వారి నుంచి పొందుతున్నప్పటికీ.. వేతనాలను మాత్రం ఏజెన్సీల ఖాతాకు విడుదల చేస్తుండటం ఇక్కడ గమనించవలసిన విషయం. అలా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఏజెన్సీ ప్రతినిధులు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో ఏజెన్సీ కమీషన్‌తో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్, జీఎస్టీ కోతపెట్టి వేతనాలు చెల్లిస్తారు. దీంతో వేతన పట్టికలో కన్పించే మొత్తం, వాస్తవంగా చేతికందే వేతనంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. శాశ్వత ఉద్యోగులతో దాదాపు సమానంగా.. రాష్ట్ర ప్రభుత్వంలోని 31 శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలకు సర్వీసులు అందిస్తున్న శాఖల్లోనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అత్యధికంగా ఉండటం గమనార్హం. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం..పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు 5,21,692 మంది కాగా... ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారు 4,93,820 మంది ఉన్నారు. అయితే ఇటీవల ఆర్థిక శాఖ ఆధార్ వివరాలు సేకరించగా.. కేవలం 2,74,844 మంది వివరాలు మాత్రమే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్లోడ్ అయ్యాయి. ఆధార్‌లో పేర్లు తప్పుగా నమోదు కావగడం లాంటి కారణాలతో మిగిలిన ఉద్యోగుల వివరాలు అప్లోడ్ కాలేదు. దీంతో ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎంట్రీ చేయనున్నారు. బేసిక్ కంటే తక్కువగా అందుతున్న వేతనం శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో వేతనాలను ఖరారు చేస్తే... ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి మాత్రం మూడు రకాల స్కేళ్లలో వేతనాలు అందిస్తున్నారు. జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసే వారిని మూడు కేటగిరీలుగా నిర్దేశించి వేతనాలు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి బేసిక్ వేతనం రూ.15,600గా నిర్ణయిస్తే...ఈపీఎఫ్ రూ.2,028, ఈఎస్ఐ రూ.507, జీఎస్టీ రూ.3,377, ఏజెన్సీ కమీషన్ రూ.624గా పేర్కొంటున్నారు. ఇవన్నీ కలిపితే ఉద్యోగి మొత్తం వేతనం రూ.22136 కాగా.. ఇందులో నిర్దేశించిన కేటగిరీల (ఈపీఎఫ్, ఈఎస్ఐ) కింద కోత పెడుతున్నారు. మరోవైపు డిడక్షన్ (ఇది కూడా కోతే) కింద దాదాపు రూ.2 వేలు కోత పడుతోంది. చివరకు ఉద్యోగికి రూ.13,611 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఆ ఉద్యోగి బేసిక్ వేతనం కంటే తక్కువగా చేతికందుతోందన్నమాట. ప్రస్తుతం ప్రైవేటు సంస్థల్లో ఎంట్రీ స్థాయిలోనే రూ.20 వేల చొప్పున వేతనాలు అందుతుండగా... ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారికి అత్యంత తక్కువగా వేతనాలు అందుతుండడం గమనార్హం. ఉద్యోగి కష్టం ఏజెన్సీ పాలు.. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టం చివరకు ఏజెన్సీలపాలవుతోందనే విమర్శలున్నాయి. ఒక ఉద్యోగి సగటు వేతనం నుంచి అధికారికంగా దాదాపు 4 శాతం నేరుగా ఏజెన్సీకి వెళుతోంది. ప్రభుత్వం సకాలంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు వేతనాల నిధులు బ్యాంకుల్లో జమ చేస్తున్నప్పటికీ.. ఏజెన్సీలు వాటిని వెంటవెంటనే ఉద్యోగులకు విడుదల చేయడం లేదు. తద్వారా బ్యాంకులో జమ అయిన నిధులకు సంబంధించిన వడ్డీతో ఏజెన్సీలు లబ్ధి పొందుతున్నాయి. మరికొన్ని ఏజెన్సీలు గైర్హాజరు, ఇతరత్రా కారణాలను చూపుతూ ప్రభుత్వానికి, అధికారులకు తెలియకుండా వేతనాల్లో కోతలు పెడుతున్నాయి. వాస్తవానికి ఏజెన్సీల విధానంపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఆ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగుల ఎంపిక చేపట్టడంతో 4 శాతం కమీషన్ నిధులు కూడా నేరుగా ఉద్యోగికే అందుతున్నాయి. పైపెచ్చు ఎలాంటి అనధికారిక కోతలకు తావుండటం లేదు. ఈ విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు పక్కాగా అమలు చేస్తుండటం గమనార్హం. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీల ద్వారా ఉద్యోగుల ఎంపిక విధానంలో మార్పులు చేయాలి. ప్రభుత్వం నేరుగా నియమించుకోవడమో, లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నియమించుకోవడమో చేయాలి. దీనివల్ల ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ఈ ప్రక్రియలో కార్మిక ఉపాధి కల్పన, ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌లకు బాధ్యత అప్పగించాలి. మరోవైపు ఏజెన్సీలకు కమీషన్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. దీంతో ఉద్యోగులకు కొంచెం ఎక్కువ వేతనం అందుతుంది. కోతలకూ తావులేకుండా వేతనం అందడం వల్ల వారి జీవన పరిస్థితులు మెరుగు పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయాలి. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం ఒక పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలి. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం -
బీఆర్ఎస్ను ఎండగట్టాలి
సాక్షి, హైదరాబాద్: జల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విస్తృత చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని సహచర మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కృష్ణా జలాలపై హక్కులను రాబట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో జలాల వినియోగానికి సంబంధించి కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వారి హయాంలో చేసిన నిర్ణయాలు, కేంద్రానికి రాసిన లేఖలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, బీఆర్ఎస్ హ యాంలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేశారన్న అంశాలను సభకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ సోమవారం రాత్రి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు మూడున్నర గంటలపాటు మంత్రులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీటికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టులపై సమగ్ర చర్చ తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అనుమతులు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభలో చర్చకు పెట్టనున్నారు. సాగునీటి రంగం విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రాష్ట్రానికి జరిగిన నష్టం వి వరించడంతో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అసత్యాల ను ఎండగట్టాలని నిర్ణయించారు. అవసరం అ యి తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.మొత్తం 4 రోజులు అసెంబ్లీ ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని, ఆ తర్వాత జనవరి రెండో తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఇటీవల ముగిసిన పంచాయ తీ ఎన్నికల ఫలితాల సరళి, ఇతర వర్తమాన రాజకీయ అంశాలపై సమావేశంలో విస్తృతంగా చ ర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొంత కష్టపడితే సీట్లు పెరిగేవని, కొన్ని జిల్లాల్లో ఇబ్బంది ఎదుర్కొన్న విషయాన్ని, నియోజకవర్గాల వారీగా గెలుచుకున్న పంచాయతీలను మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రు లే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు బాధ్య త చేపట్టాలని, మొత్తం జెడ్పీలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక జీహెచ్ఎంసీలో శివారు మునిసిపాలిటీల విలీనం అనంతరం చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తీరుతెన్నులను వివరించినట్లు తెలిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించే అంశం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిద్దామని సీఎంచెప్పినట్టు సమాచారం. -
చరిత్రలో మొదటి సారి.. డీఎస్పీ టూ ఏడీజీపీ
సాక్షి,హైదరాబాద్: కేంద్ర సర్వీసుల చరిత్రలోనే తొలిసారి గ్రూప్-1 డీఎస్పీగా పోలీసు శాఖలో కెరియర్ ప్రారంభించిన ఓ అధికారి అదనపు డీజీపీ స్థాయికి ఎదిగారు. సాదారణంగా కన్ఫర్డ్ ఐపీఎస్ ఇన్సెక్టర్ జనరల్(ఐజీ)ర్యాంక్‌కే పరిమితం అవుతారు. కానీ ప్రస్తుత రాచకొండ పోలీసుల కమిషనర్ జీ.సుధీర్‌బాబు చరిత్ర సృష్టించారు. 1989 బ్యాచ్ డీఎస్పీగా సర్వీసులోకి అడుగపెట్టిన సుధీర్ బాబు 2002లో ఐపీఎస్‌గా (పదోన్నత పొందడం) కన్ఫర్డ్ అయ్యారు. .హైదరాబాద్ నగరంలోని అత్యంతక్లిష్టమైన ఈస్ట్‌జోన్,నార్త్ జోన్లకు ఆయన ఎస్పీ ర్యాంకులో డీసీపీగా సేవలందించారు. ఆ తర్వాత డీజీఐ,ఐజీగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడ పని చేసినా తన దైన ముద్రవేసుకుంటూ,సౌమ్యుడిగా, వివాద రహితుడిగా విధులు నిర్వహించే సుధీర్‌బాబు ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు.తాజాగా,సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం 2001 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు డాక్టర్. అకున్ సబర్వాల్ ఐపీఎస్, జి. సుధీర్‌బాబు ఐపీఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జి. సుధీర్‌బాబు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లేదా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పదోన్నతి అమల్లోకి వస్తుంది. -
సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అత్యుత్సాహం.. బాలిక ప్రాణం తీసింది
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య (7) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.వివరాల్లోకి వెళితే… ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్లిబాయ్ పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో చిన్నారి సౌజన్య కారు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో కారే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా, సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్థులకు, పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 3 గంటలపాటు మంత్రులతో సీఎం సమావేశం సాగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం చూపాలని రేవంత్ అన్నారు. అన్ని జడ్పీ పీఠాలను క్లీన్‌స్వీప్ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానం చేశారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ పై సమావేశంలో చర్చ జరిగింది.మంత్రుల సమావేశంలో జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ జరిగింది. డివిజన్ల ఏర్పాటుపై మంత్రులకు సీఎం రేవంత్ వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యతన్న రేవంత్.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు లభించిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు కొన్ని పొరపాట్లు చేశారని.. వాటిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృత్తం కాకుండా చూసుకోవాలంటూ హెచ్చరించారు.ఈ నెల 29న అసెంబ్లీ సమావేశం కానుంది. జనవరి 2 నుంచి సమావేశాలను ప్రభుత్వం కొనసాగించనుంది. సమావేశాల్లో ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా చర్చ జరగనుంది. సభలోకి ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రధానంగా గోదావరి కృష్ణా జలాల ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. -
జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. వన్‌టైమ్ సెటిల్ మెంట్
సాక్షి హైదరాబాద్: నగర వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహానగర పురపాలక సంస్థ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్‌కు వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల పెండింగ్ బకాయిలపై 90శాతం మినహాయింపు ప్రకటించింది. వినియోగదారుడు కేవలం ప్రాపర్టీ ట్యాక్స్‌తో కలిపి కేవలం 10శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.కాగా ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిష్కృతమైంది. ఔటర్ రింగ్ రోడ్డు అనుకోని ఉన్న 20 పురపాలక సంఘాలు, ఏడు నగరపాలక సంస్థలకు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుత ప్రాపర్టీ ట్యాక్స్ ఆపర్ వీటికి వర్తించనుంది. ఈ లెక్కలతో జీహెచ్ఎంసీకి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియను ప్రభుత్వం ఆఘ మేఘాలపై పూర్తి చేసింది. మహానగర విస్తరణకు నవంబర్ 25న మంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందించగా గవర్నర్ వెంటనే ఆమోదముద్ర వేశారు. డిసెంబర్ 2న మెుత్తం 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో గతంలో 150 కార్పొరేటర్ స్థానాల సంఖ్య 300కు పెంచుతూ ప్రభుత్వం డీలిమిటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. -
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనలో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. వార్డుల విభజన అభ్యంతరాలపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాల గడువు పూర్తైనందున పిటిషన్ల విచారణను హైకోర్టు ముగించింది.కాగా, శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్ఎంసీ చెబుతోంది. -
నరెడ్కో తెలంగాణ 30వ వార్షికోత్సవ వేడుకలు
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO), తెలంగాణ సభ్యులు తమ 30 సంవత్సరాల వార్షికోత్సవాన్ని నిర్వహించకునేందుకు సిద్ధమయ్యారు. మొదటగా 1995లో స్థాపించబడిన నరెడ్కో సంస్థ రాష్ట్ర శాఖ దాని ప్రత్యక్ష వాటాదారుల భాగస్వామ్యం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించింది.ప్రభుత్వం, పరిశ్రమ,కొనుగోలుదారుల మధ్య అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించడం ద్వారా, నరెడ్కోతెలంగాణ పారదర్శక, విధాన-అనుగుణ్య, వృద్ధి-ఆధారిత రియల్ ఎస్టేట్ వాతావరణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రధాన వార్షిక ప్రాపర్టీ షోలు, ఇతర పరిశ్రమ వేదికల ద్వారా, అసోసియేషన్ అర్థవంతమైన సంభాషణను ప్రారంభించింది.మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన విధాన సంస్కరణలకు మద్దతు ఇచ్చింది. నగర రియల్ ఎస్టేట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. విశ్వసనీయ డెవలపర్లు, ధృవీకరించబడిన ప్రాజెక్ట్‌లకు ప్రాప్యతను అందిస్తూ, పారదర్శకత, నైతిక పద్ధతులు, నియంత్రణ అవగాహనను ప్రోత్సహించడం ద్వారా ఇది గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు లేదా ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు తగిన సమాచారంతో, నమ్మకంగా నిర్ణయాలు తీసుకునేలా సాధికారికతను అందిస్తుంది.నేడు, నరెడ్కోలో తెలంగాణలోని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లతో సహా 300 మందికి పైగా సభ్యులు ఉన్నారు – ఇది నరెడ్కో ఒక పటిష్టమైన స్వీయ-నియంత్రణ సంస్థగా పరిణామం చెందింది అనడానికి నిదర్శనం. హైదరాబాద్ నివాస, వాణిజ్య ఆస్తులకు ఒక ప్రీమియం కేంద్రంగా ఎదుగుతున్న సందర్భంలోనరెడ్కో తెలంగాణ రాష్ట్రానికి తన సేవలను అందిస్తూనే ఉంటుంది.దీనితో కలసి పని చేసే వారు కూడా ఈ మహానగరంతో పాటు అభివృద్ధి చెందేలా చూస్తుంది. రాబోయే మరో 30 ఏళ్లు కూడా ఈ ప్రస్థానం కొనసాగాలని ఆశిస్తోంది. -
TG: విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం DA ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (DA)/డియర్ నెస్ రిలీఫ్ (DR) ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు.అందులో భాగంగా ఈ సంవత్సరం 1-7-2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ది చేకూరనుంది.జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది. ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులకు 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది. మొత్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి 71,387 మందికి లబ్ధి చేకూరనుంది. -
చెక్ డ్యామ్‌లు కూలిన ఘటనలపై తెలంగాణ సర్కార్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: వరుస చెక్ డ్యామ్ కూలిన ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిద్దమా? అనే అంశం పై రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు. పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యామ్‌లో కూలిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కూలిపోయిన చెక్ డ్యామ్‌లపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నాసి రక నిర్మాణం లేదా నాణ్యతలేమి తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావాలనే ధ్వంసం చేసినట్లు నిర్ధారణ అయితే కఠిన శిక్షలు తప్పవన్నారు. ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.విచారణను వేగవంతం చేయాలని విజిలెన్స్ శాఖను ఆదేశించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు మేలు చేసే చెక్ డ్యామ్‌లను ధ్వంసం చేస్తే ఊరుకోమన్న మంత్రి.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలను సహించబోమన్నారు. -
వావ్.. గ్రామం కోసం ఎలుగుబంటిలా
సాక్షి నిర్మల్: ఆ గ్రామంలో ప్రజల కష్టాలను తీరుస్తానని ఆ యువ సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. దీంతో అతని మాట నమ్మిన ప్రజలు తమ కష్టాలను తీరుస్తాడనే ఉద్దేశంతో అతనని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఇచ్చిన మాటను ఏలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రహించి దానిని అరికట్టడం కోసం ఏకంగా తానే ఎలుగుబంటి రూపం ధరించి కోతులను తరిమాడు.సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వారు గెలవగానే మర్చిపోతుంటారు. మళ్లీ ఐదు సంవత్సరాలకు గానీ వారికి ఆవాగ్దానాలు గుర్తుకురావు. కానీ నిర్మల్‌లో మాత్రం ఇటీవల ఎన్నికైన యువ సర్పంచ్ గ్రామ బాగోగుల చూస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకోవడం కోసం ఏకంగా ఎలుగుబంటి రూపమే ధరించారు.నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గత రెండు, మూడు ఏళ్లుగా గ్రామ్ంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలంతా కలిసి చందాలు వేసుకొని వాటిని తరిమికొట్టేందుకు బోన్ల ఏర్పాటు చేశారు. వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్దగా ప్రభావం లేకుండా పోయింది.దీంతో ఏలాగైనా కోతులను గ్రామం నుంచి తరిమికొట్టాలని భావించిన గ్రామ సర్పంచ్ రంజిత్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోతుల బెడదను నివారించడానికి ఎలుగుబంటి వేశం వేసి గ్రామంలో కలియతిరిగారు. వానరాలను బెదిరిస్తూ వాటిని అక్కడి నుంచి తరిమికొట్టారు. కోతులు సైతం ఆయనను చూసి నిజమైన బల్లూకమోనని భావించి ఆ గ్రామం నుంచి పరారవుతున్నాయి.Innovative solution to #monkey problem – young #sarpanch dressed as a bear.The new sarpanch dressed as a bear to drive away the monkey menace in the village. When he approached monkeys in bear getup,the monkeys ran away.#Nirmal District, Kadem Mandal – #Telangana pic.twitter.com/ICCs0i6z5P— Ramana Reddy (@RamanaR69561502) December 19, 2025దీంతో ప్రస్తుతం ఆ గ్రామంలో కోతుల బెడద కొంతమేర తగ్గిందని ప్రజలు అంటున్నారు. యువ సర్పంచ్ ఆలోచనతో పాటు ప్రజలకు మంచి చేయాలనే తన ఆలోచనను గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు. -
ట్రాన్స్ జెండర్ శివాణి సరికొత్త ప్రస్థానం..!
ఖమ్మం: సమాజంలో ఒకప్పుడు చిన్నచూపునకు గురై, ఉపాధి మార్గాలు లేక యాచనకే పరిమితమైన ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా అధికారుల చొరవ, ప్రభుత్వ ప్రోత్సాహంతో వారు ఇప్పుడు వ్యాపారులుగా ఎదుగుతున్నారు. మొదటి విడతలో ట్రాన్స్జెండర్లతో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వాటిలో మూడు సంఘాలకు రుణాలు ఇప్పించడం ద్వారా స్వయం శక్తితో ఎదిగేందుకు అవకాశం కల్పించారు. గౌరవంగా బతికేలా.. ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రోత్సాహం, మెప్మా అధికారుల చొరవతో వారందరితో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించారు. మెప్మా అధికారులు వారికి పొదుపుపై అవగాహన కల్పించారు. దీంతో ట్రాన్స్జెండర్లకు సామాజిక రక్షణతోపాటు ఆర్థిక భరోసా లభించింది. బ్యాంక్ లింకేజీ రుణాలు..నగరంలోని ట్రాన్స్జెండర్లతో మెప్మా ఆధ్వర్యంలో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయించారు. మూడు సంఘాలకు రూ.3 లక్షల చొప్పున రుణం ఇవ్వగా.. సంఘంలోని పది మంది సభ్యులకు రూ.30 వేల చొప్పున అందాయి. దీంతో వారు తమకు నచ్చిన రంగాల్లో స్వయం ఉపాధిని ప్రారంభించారు. రుణం తీసుకున్న సంఘాల్లో విశ్వం స్వయం సహాయక సంఘ సభ్యులు రూ.3లక్షలు సకాలంలో చెల్లించడంతో మరో రూ.10 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం అందించారు. ఇక మిగిలిన రెండు సంఘాలు కూడా రుణాలను సక్రమంగానే చెల్లిస్తున్నాయి. అదర్శ జీవితం గడుపుతూ..గౌరవప్రద జీవనానికి ఖమ్మంలోని ట్రాన్స్జెండర్లు మార్గదర్శకులుగా మారారు. ఒకప్పుడు యాచనే ప్రధాన వృత్తిగా ఉన్న వీరు ప్రస్తుతం తమ కాళ్లపై తాము నిలబడగలమనే ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నారు. ‘మాకు గౌరవం కావాలి, మేమూ సమాజంలో భాగమే’ అని చాటిచెబుతూ, ఇతర ప్రాంతాల్లోని ట్రాన్స్జెండర్లకు ఖమ్మం బిడ్డలు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వచ్చిన రుణంతో చిన్న తరహా వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అలాగే కేటరింగ్, ఇతర రంగాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించారు. అధికారులు తీసుకున్న చొరవతో ట్రాన్స్‌జెండర్లలో ఆర్ధిక స్థిరత్వం ఏర్పడింది.మరికొందరికి ఉపాధి కల్పించేలా..విశ్వం స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన బోడ శివాని తనకు వచ్చిన రూ.30వేల రుణంతో టీస్టాల్ ఏర్పా టు చేసుకుంది. తద్వారా వచ్చే ఆదాయంలో కొంత రుణం కింద చెల్లిస్తోంది. టీ స్టాల్ బాగానే నడుస్తుండటంతో మరింత అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ స్వ యం సహాయక సంఘం సభ్యులు తమ రుణమొత్తం రూ.3 లక్షలు చెల్లించడంతో మరో రూ.10లక్షల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొచ్చారు. ఈ రుణంతో మరో ఆరుగురు సభ్యులతో వేర్వేరు వ్యాపారాలు ఏర్పాటు చేయించనున్నట్లు శివాని తెలిపింది. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తమకు మంచి అవకాశం కల్పించారని చెప్పింది. -
ఏపీ, తెలంగాణలోనే ఎస్సీలపై అధిక దాడులు
సాక్షి, ఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఏపీ, తెలంగాణలో ఎస్సీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఉదంతాలను ప్రస్తావిస్తూ సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై అధిక దాడులు జరుగుతున్నాయి. దళితులను పోలీసు వ్యవస్థ చిన్న చూపు చూస్తూ అమానుషంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఓ దళితుడిని పోలీసుల రౌడీల్లాగా పాశవికంగా కొట్టారు. ఈ ఘటనపై డీజీపీ ఇప్పటికైనా విచారణ జరిపి పూర్తి నివేదిక పంపాలి. అమరావతిలో దళితుల డీకే పట్టా భూముల విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. భూముల రేట్లు పెరిగిన తర్వాత.. వ్యవసాయం చేయడం లేదనే సాకుతో భూమి లాక్కుంటున్నారు. దీనిపై 85 ఫిర్యాదులు వచ్చాయి వాటిపై విచారణ చేస్తున్నాం. ఇప్పటిదాకా 35 ఎకరాలు భూమి బలవంతంగా తీసుకున్నారు. దానికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి.. తెలంగాణ కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్‌పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాలి. ఈ ఘటనలో రీపోస్ట్‌మార్టం జరిగింది. సీఐ సస్పెన్షన్ తో సరిపోదు. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అని అన్నారాయన. -
పార్టీ నాకు కన్నతల్లిలాంటిది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తూ పదవుల్ని గడ్డిపోచలా వదిలేశా. రేవంత్‌రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర ఆయనది. ఫోర్ట్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ నుంచి సమాధానమే లేదు. ఆయనవన్నీ సొల్లు మాటలు’’ అని హరీష్‌రావు అన్నారు. రేవంత్ ఏమన్నారంటే.. ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్‌రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది అని విమర్శించారు. -
ఏఐలో నార్కట్‌పల్లివాసికి అంతర్జాతీయ గుర్తింపు
యాదాద్రి: నార్కట్‌పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల జయచందర్‌రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు.గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా.. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్‌కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్‌రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు యాదవరెడ్డి-రజితలకు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్‌రెడ్డి తెలిపారు. -
విషమంగానే హైడ్రా కమిషనర్ గన్‌మెన్ పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య(32) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతనికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. బుల్లెట్ దెబ్బకు తలకు బలమైన గాయం కావడంతో కృష్ణచైతన్యకు సర్జరీ చేశామని.. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్ ద్వారా వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని.. 48 గంటలు గడిస్తేగానీ పరిస్థితి ఏంటన్నది చెప్పలేమన్నారు. హయత్‌నగర్‌లోని ఇంట్లో ఆదివారం కృష్ణచైతన్య తుపాకీతో పేల్చుకోవడంతో.. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తొలుత వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ కారణం ఏంటన్నది స్వయంగా రంగనాథే మీడియాకు వెల్లడించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆస్పత్రికి వెళ్లి కృష్ణచైతన్య కుటుంబ సభ్యులను రంగనాథ్ పరామర్శించారు. ‘‘దాదాపు రెండేళ్ల క్రితం బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌ల కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పుల కారణంగా అతడి జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోంది. కుటుంబ సమస్యల కారణంగా సుమారు 3 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు హయత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుంచి నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. విధుల్లో బాగానే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆత్మహత్యకు యత్నించాడు. ఆయనకు సర్జరీ జరుగుతోంది. దయచేసి ఈ విషయాన్ని సంచలనం చేయొద్దు’’ అని మీడియాకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. -
స్వాతి? సుజాత?.. సర్పంచ్ ఎవరో??
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర అయోమయం నెలకొంది. ఒకే పదవికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గెలుపు పత్రాలు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వివరాలు ఇలా.. మొదటగా మూడు ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూనావత్ స్వాతి గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు గెలుపు పత్రాలు అందజేశారు. అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్ అనంతరం ఒక్క ఓటు ఆధిక్యంతో సానుప సుజాత గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు కూడా గెలుపు పత్రాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఇద్దరు అభ్యర్థులు తామే విజేతలమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నారు.ఇదే సమయంలో దామరవంచ గ్రామంలో మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అందులో 5 మంది కాంగ్రెస్ పార్టీకి, 5 మంది బీఆర్ఎస్కు చెందినవారు గెలుపొందారు. ఈ సమబలం పరిస్థితి కూడా గ్రామ రాజకీయాల్లో అయోమయానికి దారి తీసింది. ఒకే ఎన్నికలో ఇద్దరికి గెలుపు పత్రాలు ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ గ్రామనికి సర్పంచ్ ఎవరని తేల్చాల్సింది అధికారులే -
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
‘మా సర్పంచ్ ఎవరయ్యా?..’ ఆ ఊరిలో అయోమయం
తెలంగాణ వ్యాప్తంగా నేడు పంచాయతీ కార్యవర్గం కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం అయోమయం నెలకొంది.వేములవాడ రూరల్ మండంలోని చింతల్‌ఠాణా గ్రామం పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఊరి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన చెర్ల మురళి నామినేషన్ వేశాక గుండెపోటుతో మరణించారు. దీంతో అధికారులు ఆ సమయంలో ఏం చేయలేకపోయారు. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో 370 ఓట్ల మెజారిటీతో ఆయనే గెలిచారు. దీంతో మృతి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా విజయం సాధించిన గ్రామంగా చింతల్‌ఠాణా రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది. అయితే.. గెలిచిన అభ్యర్ధి భౌతికంగా లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫలితాలు వెల్లడించిన రోజునే అక్కడి అధికారులు నివేదిక పంపారు. అయితే ఇప్పటిదాకా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో.. ఇవాళ చింతల్ ఠాణాలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఉప సర్పంచ్ కు తాత్కాలికంగా సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తారా? లేదంటే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో గ్రామస్థులు ఉండిపోయారు. అధికారులు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెబుతుండడం గమనార్హం. -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బోలెరో ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లను విచారించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు చెప్తేనే తాను ఫోన్లు ట్యాప్ చేయించానని గతంలో పోలీసులకు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ క్రమంలో.. మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను కూడా మరోసారి సిట్ విచారించినట్లు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘనందన్, మాజీ సీఎస్‌లు సోమేష్‌కుమార్, శాంతికుమారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను మరోసారి సాక్షులుగా విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లను విచారించి.. అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును ప్రస్తుతం రెండో దఫా కస్టోడియల్ విచారణ జరుపుతోంది సిట్. ఈ క్రమంలో కేసీఆర్ హయాంలో పని చేసిన సివిల్ సర్వెంట్స్ అధికారులను మరోసారి విచారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. ఎస్ఐబీ ఓస్డీగా ప్రభాకర్‌రావును ఎలా నియమించారని సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే నవీన్ చంద్ హయాంలోనే ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు పని చేశారు. దీంతో.. ఎవరెవరి నెంబర్లు ప్రభాకర్ రావు ఇచ్చారనేదానిపై నవీన్ చంద్‌ను విచారించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. డిసెంబర్ 25వ తేదీతో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో సిట్ కస్టోడియల్ ఎంక్వైరీ వేగం పుంజుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఏం చేద్దాం ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం మధ్యాహ్నాం మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అంశంపైనా వీళ్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అలాగే పెండింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ , పార్టీ పదవులపై భర్తీ పైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ పైనా చర్చిస్తారని సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చ చేపట్టే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ‘‘ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరిగేషన్ విషయంలో దమ్ముంటే ఫేస్ టూ ఫేస్‌కు రావాలంటూ సీఎం రేవంత్ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో ఓ ప్రకటన చేశారు. -
అప్పులిచ్చినవారి వేధింపులు భరించలేక..
బెజ్జంకి (సిద్దిపేట): అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుకలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష (33)కు మూడేళ్ల క్రితం రుక్మిణి (28)తో వివాహం జరిగింది. బెజ్జంకిలో వస్త్ర దుకాణం పెట్టుకుని అక్కడే జీవిస్తున్నారు. వీరికి కూతురు హరిప్రియ ఉంది. కాగా శ్రీహర్ష తన మిత్రుడి వద్ద డబ్బులు తీసుకుని, మరో మిత్రునికి ఇచ్చాడు. డబ్బులివ్వాలని అప్పుచి్చన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వేధిస్తుండగా, తీసుకున్న వ్యక్తి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో వారి వేధింపులతో అవమానంగా భావించిన శ్రీహర్ష, భార్య, కూతురుతో కలిసి క్రిమిసంహారక మందు తాగారు. చిన్నారి రోదన విని సమీప వ్యక్తులు శ్రీహర్ష తండ్రికి సమాచారమందించారు. అతను వచ్చి ఇంటి తలుపులు తెరిచి వెళ్లేసరికి అప్పటికే రుక్మిణి మృతి చెందింది. శ్రీహర్ష, చిన్నారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా చిన్నారి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్‌రెడ్డి, రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య పరిశీలించారు. -
‘కోల్డ్ వేవ్’ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రతకు గ్రేటర్ నగరం వణుకుతోంది. శనివారం కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. సగటున కనిష్ట ఉష్ణోగ్రత 12.2 డిగ్రీలసెల్సియస్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ దాటడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9 డిగ్రీలు, మౌలాలీలో 9.1 డిగ్రీలు నమోదయ్యాయి. శివారులోని పటాన్చెరులో కనిష్ట ఉష్ణోగ్రత 7.2 డిగ్రీలు రికార్డు కాగా, సగటు కంటే 4.9 డిగ్రీలు తక్కువగా ఉంది. దీంతో వాతావరణ శాఖ కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. కోల్డ్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. చలి తీవ్రత డిసెంబర్ 24 వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తోంది. రాబోవు 7 రోజుల్లో హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 13 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రోడ్లపై పొగమంచు కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. -
చర్లపల్లికి చేరుకునేదెలా?
హైదరాబాద్‌లో నాలుగో టెర్మినల్ గా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి రైళ్లు, ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రతి రోజు సుమారు 5 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధితో పాటు ఇటీవల ప్రారంభించిన నాంపల్లి స్టేషన్ రీడెవలప్మెంట్ పనుల దృష్ట్యా పదుల సంఖ్యలో రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. కానీ అందుకనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం ఒకే ఒక్క ఎంఎంటీఎస్ ట్రైన్ లింగంపల్లి నుంచి సనత్‌నగర్, సుచిత్ర, మౌలాలి, చర్లపల్లి మీదుగా ఘట్కేసర్ వరకు నడుస్తుంది. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించి ఏడాది గడిచినా ఇప్పటి వరకు లోకల్ కనెక్టివిటీ పెరగకపోవడం వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకోవాలన్నా, చర్లపల్లిలో రైలు దిగి నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లాలన్నా ప్రయాణికులు చుక్కలు కనిపిస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్ కు ఉదయం నుంచి సాయంత్రం వరకు సిటీ బస్సులు నడుస్తున్నప్పటికీ తెల్లవారుజామున, రాత్రి 11 తరువాత రైళ్లు వచ్చే సమయానికి బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించవలసి వస్తోంది. దీంతో ప్రయాణం ఆరి్థకంగా మరింత భారంగా మారుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రైళ్లు చర్లపల్లి నుంచే... ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,దర్భంగా బై వీక్లీ,సిల్చార్ వీక్లీ సూపర్ ఫాస్ట్, యశ్వంత్‌పూర్ ట్రై వీక్లీ గరీబ్ రథ సూపర్ ఫాస్ట్, తిరుపతి–ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్.నర్సాపూర్–నాగర్సోల్ సూపర్‌ఫాస్ట్, విశాఖపట్నం ట్రై వీక్లీ, నాగావళి సూపర్ ఫాస్ట్ ట్రై వీక్లీ ఎక్స్ ప్రెస్, తదితర రైళ్లన్నీ చర్లపల్లి నుంచే నడుస్తున్నాయి.అలాగే ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లను కూడా చర్లపల్లి నుంచే నడుపుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరే మరికొన్ని రైళ్లను త్వరలో చర్లపల్లి నుంచి నడిపేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సికింద్రాబాద్–దానాపూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా–ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్, దక్షిణ్ సూపర్‌ఫాస్ట్, తదితర రైళ్లను సైతం చర్లపల్లి నుంచి నడిపే అవకాశం ఉంది.ఇలా దశలవారీగా రైళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ మేరకు కనెక్టివిటీ మాత్రం పెరగడం లేదు. బోరబండ, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి చర్లపల్లికి రాకపోకలు సాగించే బస్సులు చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల గంటల తరబడి బస్సుల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. చర్లపల్లి నుంచి నేరుగా లింగంపల్లి వరకు,అలాగే సికింద్రాబాద్,నాంపల్లి నుంచి కూడా చర్లపల్లి వరకు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెస్తే కనెక్టివిటీ సమస్యకు చాలా వరకు పరిష్కారం లభిస్తుంది. సంక్రాంతి రద్దీ ఎలా.... సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ రైళ్లతో పాటు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 41 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లన్నీ చర్లపల్లి నుంచి బయలుదేరనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులు ఈ రైళ్లను అందుకోవడం చాలా కష్టం. మరో వైపు క్యాబ్‌ల ద్వారా చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఉదాహరణకు పంజాగుట్ట నుంచి చర్లపల్లికి క్యాబ్ చార్జీ రూ. 450 ఉంటే, ఆటో చార్జీ రూ. 350 , ర్యాపిడో బైక్ రూ.235 వరకు ఉంది. దూరప్రాంతాలకు వెళ్లే స్లీపర్ చార్జీల కంటే ఈ లోకల్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ట్రిప్పులు పెంచాలి లింగంపల్లి నుంచి ఘట్కేసర్ వరకు ట్రిప్పులు పెంచాలి. ప్రతిరోజు కనీసం 15 ట్రిప్పులు రాకపోకలు సాగిస్తే ప్రయాణికులు చాలా వరకు ఊరట లభిస్తుంది. సుచిత్ర మీదుగా ఎంఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంది. – భరద్వాజ్, ఎంఎంటీఎస్, సబర్బన్ రైల్వే ప్రయాణికుల సంఘం ఐటీ ఉద్యోగులకు కూడా రవాణా సదుపాయం ఉదయం, సాయంత్రం వేళ్లలో ఘట్కేసర్, చర్లపల్లి నుండి హైటెక్ సిటీకి, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులకు కూడా ఎంఎంటీఎస్ ఎంతో సదుపాయంగా ఉంటుంది. ప్రయాణసమయం, ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. – ఫణి, అధ్యక్షులు, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరమ్ -
420 హామీలను మూసీలో కలిపారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారా? లేక మూసీనదిలో కలిపారా? లేదంటే గాం«దీభవన్‌లో పాతరేశారా?’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమెకు ఒక బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పుస్తకాన్ని ఢిల్లీకి వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీకు అందజేశారు. ఆ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ మీరు శుభాకాంక్షలు తెలిపారు.కానీ.. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సెపె్టంబర్ 17వ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు, అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది.ఈ రెండేళ్లలోఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు మీ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయతి్నంచారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా?’అని కిషన్‌రెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు మరిచి, తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారని మండిపడ్డారు.‘ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేక గాం«దీభవన్‌లో పాతరేశారా?. తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఇచ్చిన మాటమీద నిలబడండి.. ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త హామీలు ఇచ్చే ముందు, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మీరు ప్రకటించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై అధికారానికి దూరం చేస్తుంది’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాను’అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
మహాలక్ష్మి పథకంతో లాభాల్లోకి ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా సంస్థ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలను రెట్టింపు చేసిందని, ప్రతి మూడు నెలలకోమారు ఆ చార్జీలను చెల్లిస్తోందని వెల్లడించారు. ఆదివారం ప్రజాభవన్‌లో ఆర్టీ సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణాశాఖ జేటీసీలు, ఎంజేపీ కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీని బలోపేతం చేసేందుకు, కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. సంస్థకు కొత్త బస్సులను సమకూర్చుతున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ, సంస్థ సొంతంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళా సాధికారతకు ఇది దోహదం చేస్తోందని వెల్లడించారు.గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు రూ.1,400 కోట్లు పేరుకుపోగా, తమ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తాన్ని రూ.660 కోట్లకు తగ్గించామని, సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించామని తెలిపారు. ఉచిత ప్రయాణాల కోసం ప్రయాణికులకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్తో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేక కార్డులు రూపొందించి పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి మహిళకు ఈ కార్డు చేరేలా చూడాలని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతున్నందున, తదనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. గురుకులాలకు సొంత భవనాలను కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తున్నట్టు భట్టి వెల్లడించారు.అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రెగ్యులర్ కండక్టర్ పోస్టుల భర్తీకి, చీఫ్ ఎకౌంట్ ఆఫీసర్ పోస్టులకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీకి సంబంధించి యూజర్ ఛార్జీల వసూలుకు అనుమతి ఇవ్వాలని కోరారు.రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్ కోసం కొత్త వాహనాలు, పన్ను వసూళ్లకు టాబ్స్ మంజూరు చేయాలని కోరారు. -
ఐసీసీసీలోనే సిట్ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పడిన అధికారిక సిట్‌కు బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (టీజీ ఐసీసీసీ) కార్యాలయం కేటాయించారు. అందులోని ఏ టవర్‌లో ఉన్న 18వ అంతస్తులో, తన చాంబర్‌కు సమీపంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దీన్ని ఏర్పాటు చేయించారు. సిట్‌లో ఉన్న తొమ్మిది మంది సభ్యులతో ఆయన ఆదివారం తొలిసారిగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రభాకర్‌రావు విచారణ, జనవరి 16న సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన కీలక నివేదికతోపాటు కేసు దర్యాప్తునకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ అంశాలపై ఆయన సిట్‌కు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఠాణాలోనే విచారణ కేసు దర్యాప్తు కీలక దశకు చేరడంతోపాటు తుది చార్జిషీట్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిందితులు, బాధితులను మరోసారి విచారించాలని సిట్ యోచిస్తోంది. అవసరమైతే ట్యాపింగ్ బారినపడిన రాజకీయ నాయకులతోపాటు అధికారులను కూడా విచారించాలని నిర్ణయించారు. ప్రభాకర్‌రావును రెండో దఫా కస్టోడియల్ విచారణ చేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, ఆయన్ను కూడా అక్కడకే తరలించి విచారించాలని తొలుత భావించారు.అయితే ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అక్కడ సిటీ పోలీసులు ఇప్పటివరకు దాఖలు చేసిన పత్రాల ప్రకారం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పైభాగంలో ఉన్న సిట్ కార్యాలయంలో ప్రభాకర్‌రావును విచారించాలి. ఇందులో ఏ విధమైన మార్పుచేర్పులు చేసినా ఆ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణ జనవరి 16న ఉండటంతో అప్పటివరకు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ ఠాణాలో ఉన్న సిట్ కార్యాలయంలోనే ఉంచి విచారించాలని నిర్ణయించారు. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకట గిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును విచారిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు పశి్చమ మండల డీసీపీగా పనిచేసి, సిద్దిపేట సీపీగా బదిలీ అయిన ఎస్ఎం విజయ్ కుమార్ ఆది నుంచీ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. తాజాగా ఆయన్ను కూడా సిట్‌లోకి తీసుకున్నారు. దీంతో ఆయన కేసు పూర్వాపరాలు, ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచి్చన అంశాలను సమీక్షించి లూప్‌హోల్స్ వెలికితీయడంపై దృష్టి పెట్టారు.సిట్ సభ్యుడిగా ఉన్న రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మాదాపూర్, మహేశ్వరం డీసీపీలు రితిరాజ్, కె.నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, ‘ఈగిల్’డీఎస్పీ సీహెచ్ శ్రీధర్, మెట్రో రైల్ డీఎస్పీ నాగేంద్ర రావుకు కొత్వాల్ సజ్జనార్ ఒక్కో బాధ్యతను అప్పగించారు. ఎప్పటికప్పుడు కేసు మొత్తాన్ని తానే సమీక్షిస్తానని ఆయన అధికారులకు చెప్పారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు.ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
నేడు కొలువుదీరనున్న పంచాయతీలు
సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు 12,702 గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి.ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతామని, గ్రామాభివృద్ధికి పాటుపడతామని దైవసాక్షిగా ప్రమాణం చేయనున్నారు. తొలి సమావేశం నేడే ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే.. నూతన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండేళ్ల నిరీక్షణకు తెర.. గ్రామ పంచాయతీల గడువు ముగిసి రెండేళ్లు దాటినా, వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఇన్నాళ్లూ పల్లె పాలన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఫలితాలు వెలువడటంతో గ్రామాలు మళ్లీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాలకవర్గాలు బాధ్యతలు చేపడుతుండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
గుడ్డు రూ.8... టమాటా కిలో రూ. 60
సాక్షి, హైదరాబాద్: వంటింట్లో ధరల మంట పుడుతోంది. కూరగాయల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కూరగాయలు కొనాలంటే రూ.వంద నోటు తీయాల్సి వస్తోంది. అటు పౌల్ట్రీ రంగంలోనూ ఉత్పత్తి తగ్గడంతో కోడిగుడ్డు సైతం రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. దీంతో హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, ఇతర మార్కెట్లలో కూడా కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోయాయి.కూరగాయల ధరలు కిలోకి రూ. 60–80కి తక్కువగా లేకపోవడం గమనార్హం. గడ్డి అన్నారం, గుడి మల్కాపూర్, బోయినపల్లి మార్కెట్లలో రిటైల్ ధరలకు, బహిరంగ మార్కెట్లో రిటైల్ ధరలకు కిలోకి రూ.10–20 వరకు తేడా ఉంటోంది. గడ్డి అన్నారం మార్కెట్లో టమాటా ధర శనివారం రూ.41 ఉండగా, బహిరంగ మార్కెట్లో, మాల్స్‌లో రూ.60 పలికింది.బీర, కాకర, సొరకాయ వంటి వాటి ధరలు గడ్డి అన్నారంలో కిలో రూ. 45 ఉంటే బహిరంగ మార్కెట్లో రూ.60–70 వరకు విక్రయిస్తున్నారు. కట్ట రూ.10 పలికే పాలకూర, తోటకూరలు ఇప్పుడు రూ. 20–30 పలుకుతున్నాయి. అదే సమయంలో చికెన్, మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి. ఆదివారం హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో చికెన్ ధర కిలో రూ.250, మటన్ రూ.950–1,000 పలుకగా, కోడిగుడ్డు రిటైల్ ధర రూ.8గా ఉంది. చలి తీవ్రత – దిగుబడిపై ప్రభావం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో దాని ప్రభావం కూరగాయల ఉత్పత్తిపై పడింది. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల పూత నిలవకపోవడం, కాయ పెరుగుదల మందగించడం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. డిసెంబర్లో ఇళ్లల్లో పాదులకు పెరిగే చిక్కుడు, బీరకాయ, కాకరకాయలు వంటివి కూడా చలి తీవ్రతతో దిగుబడి రాలేదని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కూరగాయలు సరఫరా అయ్యే ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ధరలు పెరిగాయి.ముఖ్యంగా టమాటా, మిర్చి తోటలు చలి ధాటికి నల్లబారిపోవడంతో మార్కెట్‌కు వచ్చే సరుకు తగ్గిపోయింది. గత సెపె్టంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు రెండో విడత సాగు చేయడానికి వెనకడుగు వేశారు. ఫలితంగా మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు పైపైకి వెళ్తున్నాయి. తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణం 20–30 శాతం తగ్గడంతో ఉత్పత్తి క్షీణించింది. వరి, పత్తి వైపు రైతులు మళ్లడం, ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం మరో కారణం. కొండెక్కిన కోడిగుడ్డు పేదల ప్రొటీన్ ఆహారమైన కోడిగుడ్డు ధర కూడా చుక్కలను తాకుతోంది. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.8కి చేరింది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల పెంపకం వ్యయం పెరగడం, గతంలో సోకిన కొన్ని వ్యాధుల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గడం దీనికి ప్రధాన కారణం. చలికాలంలో డిమాండ్ పెరగడం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడంతో కోడిగుడ్డు రేట్లు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రూ.670 దాటడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లోనే 100 గుడ్ల ధర 700కు చేరింది. రిటైల్‌లో రూ. 7.50–8 పలుకుతోంది. కొన్ని పౌల్ట్రీ సంస్థలు అందిస్తున్న విటమిన్ గుడ్ల ధరలు రూ.10–12 వరకు పలుకుతుండగా, నాటుకోడి గుడ్డు ధర రూ.15 పైనే ఉంది. సంక్రాంతి వరకు ఇంతేనా..?మార్కెటింగ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, రాబోయే సంక్రాంతి పండుగ వరకు ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. చలి తీవ్రత ఇలాగే కొనసాగితే దిగుబడి మరింత తగ్గి, ధరలు మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లాలంటే భయమేస్తోందని, రూ.500 పట్టుకెళ్తే సంచి కూడా నిండటం లేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కూరగాయలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎట్ హోంలో ప్రముఖుల సందడి
సాక్షి, హైదరాబాద్: బోల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ఎట్ హోం కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. శీతాకాల విడిది కోసం ఈనెల 17న రాష్ట్ర పర్యటనకు వచ్చినన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఇచ్చినన తేనీటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము అతిథులను పలుకరిస్తూ సందడి చేశారు. కార్యక్రమ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ వారితో మాట్లాడారు.కిన్నెర మొగిలయ్యను ఆప్యాయంగా పలకరించడంతో పాటు కిన్నెర వాయిద్యాన్ని వాయించాలని కోరారు. కాగా మంత్రులను, ఇతర ప్రముఖులను రాష్ట్రపతికి సీఎం పరిచయం చేశారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
నందిగామ: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే అలవాటు చేసుకున్నట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమ్లేశ్ పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిషు్ణదేవ్ వర్మ, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని అలవాటుగా చేసుకోవాలని అన్నా రు. ధ్యానంతో అంతర్గత శాంతి లభిస్తుందని, కోపతాపాలు దూరమవుతాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ధ్యానాన్ని అభ్యసిస్తుండటంతో వారిలో గొప్ప మార్పు వచి్చందని గుర్తు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.ధ్యానం మన అంతర్గత ఉనికిని కనుగొనడంలో ఉపయోగపడుతుందని వివరించారు. గురూజీ కమ్లేశ్ పటేల్ మాట్లాడుతూ.. ధ్యానం జడత్వాన్ని వదిలి, ఉన్నత చైతన్యాన్ని చేరుకోవడానికి సాధనంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 30 వేల మంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది వర్చువల్‌గా 170 దేశాల నుంచి పాల్గొంటున్నారని చెప్పారు. అంతకు ముందు గురూజీ కమ్లేశ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ధ్యానంలో అక్కడికి వచి్చన అతిథులు పాల్గొన్నారు. అనంతరం దాజీ రచించిన ‘రివీల్ డార్స్’పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీ చేరుకున్న ఉపరాష్ట్రపతి శంషాబాద్: రెండు రోజుల హైదరాబాద్ పర్యటకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆదివారం సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. కన్హాశాంతి వనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. -
ప్రభుత్వ శాఖలకు న్యూ ఇయర్ ‘షాక్’
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఆర్థిక శాఖ వివిధ విభాగాలకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, అలాంటి భవనాలకు జనవరి, 2026 నుంచి అద్దె చెల్లించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి, 2026 నుంచి ఎలాంటి అద్దెలు చెల్లించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సర్క్యులర్ జారీ చేశారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలకు సంబంధించిన కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఎక్కడైనా ఉన్నా, ప్రభుత్వ భవనంలోకి మార్చేందుకు వెంటనే చర్యలు తీసుకోండి.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా ఖాళీ ఉంది. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలు ఈనెల 31 లోపు ప్రభుత్వ భవనాల్లో ఖాళీలు వెతుక్కుని అక్కడకు ప్రభుత్వ కార్యాలయాలను మార్చాలి. జనవరి1, 2026 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో కొనసాగాల్సి ఉంటుంది. ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఫిబ్రవరి1, 2026 నుంచి ఎలాంటి అద్దె చెల్లింపులు చేయవద్దని ట్రెజరీ అధికారులకు సూచిస్తున్నాం.గ్రాంట్ ఇన్ ఎయిడ్, సీఎస్ఎస్ నిధుల నుంచి కూడా ఈ అద్దెలు చెల్లించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాధిపతి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది’అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అన్ని శాఖల ప్ర«త్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్వోడీలు, సెక్రటేరియట్ విభాగాలు, ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలకు ఈ సర్క్యులర్‌ను పంపారు. -
కేసీఆర్‌వి 90% అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై 90 శాతం పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని దారుణంగా, దుర్మార్గంగా నాశనం చేసింది ఆయనే అని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లోపం, అసమర్థత, చేతకానితనంతో 10 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు జీరో ప్రయోజనం చేశారని ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లు కూలిపోవడానికి.. సీఎంగా, నీటిపారుదల, ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌దే బాధ్యత అని, కేసీఆరే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తేలి్చందని అన్నారు. ఆదివారం రాత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం చేపట్టకుంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. ‘కాళేశ్వరం అంత పెద్ద కుంభకోణం మరొకటి జరగదేదని ఘోష్ కమిషన్, విజిలెన్స్, కాగ్ ఎన్డీఎస్ఏ తేల్చాయి. ఈ విషయంలో చట్టప్రకారం ముందుకు పోతున్నాం. అంతర్జాతీయ నిపుణులతో కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణను వాటి నిర్మాణ సంస్థలతోనే పూర్తి చేయిస్తాం. రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్ల పనులు పూర్తయ్యాక అధిక కమీషన్ల కోసం అర్ధాంతరంగా వదిలేసి దాని స్థానంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం చేపట్టకుండా ప్రాణహిత–చేవెళ్లనే నిర్మిస్తే మిగిలిపోయే రూ.65 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి..’ అని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ‘కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుతో పాటు పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌లో ఎన్నికలకు 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటైనా పూర్తి చేశారా? మార్పులు చేయకుంటే రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. పాలమూరు కింద ఎకరా ఆయకట్టు ఇవ్వలేదు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అంటున్నారు. దాని కింద ఒక్క ఎకరమైనా ఆయకట్టు ఇచ్చారా? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు గత ప్రభుత్వమే సవరించగా, రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2023 ఏప్రిల్ 12న కేంద్రం తిప్పి పంపింది. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి కేసీఆరే..’ అని ఉత్తమ్ చెప్పారు. 45 టీఎంసీలకు తగ్గింపు అబద్ధం... ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేందుకు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 90 టీఎంసీలతో ప్రాజెక్టుకు జీవో ఇచ్చాం. తొలి విడత ప్రాజెక్టును మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో చేపట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతించింది. గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచి్చన మరో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకి కేటాయించాలని కేంద్రంతో మేము నిరంతరం కొట్లాడుతున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీకి కేసీఆర్ సహకరించారు ‘ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్యలో ఏపీ రోజుకి 4.1 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోగా, తెలంగాణ వచ్చాక కేసీఆర్ సహకారంతో రోజుకు 9 టీఎంసీలు అక్రమంగా తరలించుకునేలా సామర్థ్యాన్ని పెంచుకుంది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు కేసీఆర్ సహకరిస్తే మేము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులను ఆపివేయించాం. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ 2004–14 మధ్యలో 727 టీఎంసీలను అక్రమంగా తరలించగా, కేసీఆర్ సీఎం అయ్యాక 2014–23 మధ్యలో 1442 టీఎంసీలను అక్రమంగా తరలించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణకు కేసీఆర్ సహకరించారు. ఆయన కాలంలోనే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ఉత్తమ్ తెలిపారు. -
భయపెడుతున్న ‘గోస్ట్ పేరింగ్ ఎటాక్’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ గోస్ట్ పేరింగ్ ఎటాక్ (వాట్సాప్ టేక్ఓవర్)ను, క్రోమ్ ఎటాక్‌లు మొదలు పెట్టినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) హెచ్చరించింది. క్రోమ్‌లో హానికరమైన, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తిగత, బ్యాంకులకు సంబంధించిన సమాచారం చోరీ చేస్తున్నట్టు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అదేవిధంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాల్లో ఉండే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయగానే సైబర్‌నేరగాళ్లు గోస్ట్ పేరింగ్ ఎటాక్‌కు తెరతీస్తున్నట్టు తెలిపారు. లింక్‌పై క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే మన వాట్సాప్ అకౌంట్‌ను సైబర్‌నేరగాళ్లు వారి డివైజ్‌లో లింక్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా వాట్సాప్ లింక్ అయిన తర్వాత మనకు వచ్చే.. మనం పంపే మెసేజ్‌లను, చాట్లను సీక్రెట్‌గా గమనిస్తూ మన నుంచి సమాచారం సేకరిస్తుంటారని చెప్పారు. అయితే గోస్ట్ ఎటాక్ జరిగినప్పటికీ మన వాట్సాప్ సాధారణంగానే పనిచేస్తుందని తెలిపారు. మీ వాట్సాప్ ఇతరులు లింక్ చేసుకున్నట్లు అనుమానిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చేయకూడనివి..» ఓటీపీ, పిన్, సీవీవీ లేదా వాట్సాప్ కోడ్లు ఎవరికీ ఎప్పుడూ షేర్ చేయొద్దు. » ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్స్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు. » తెలియని వెబ్సైట్లు లేదా పాప్–అప్లలో లాగిన్ కావొద్దు. చేయాల్సినవి..»వాట్సాప్ లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేయండి.» ఏదైనా అనుమానాస్పదంగా డివైజ్‌లు లింక్ అయినట్టు కనిపిస్తే వెంటనే వాటిని తీసివేయండి.» వాట్సాప్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోవాలి. » మీకు సంబంధించిన కీలక సమాచారం. ఫొటోలు, వీడియోలు వేరేచోట కాపీ చేసి పెట్టుకోండి.» అనుమానాస్పద సందేశాలు, లింక్‌లు, పాప్–అప్ల స్క్రీన్షాట్లను తీసుకోండి. » లావాదేవీ ఐడీలు, యూటీఆర్ నంబర్లు, కాల్ లాగ్లను సేవ్ చేయండి.» గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్‌ను అప్డేట్ చేయండి.» ఈ–మెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చండి.» మీ బ్యాంక్‌లకు అనుమానాస్పద లావాదేవీల సమాచారం వెంటనే తెలియజేయండి. » క్రోమ్, ఇతర యాప్‌లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలి. -
ప్రభుత్వాన్ని ఎండగడదాం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. నందినగర్ నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటినుంచి రాత్రి ఏడున్నరకు ఆయన తిరిగి వెళ్లేంత వరకు అక్కడ ఉత్సాహపూరిత సందడి వాతావరణం నెలకొంది. కాగా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టేలా బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ చేపట్టడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ.. ఈ మూడు జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణ, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో దశల వారీగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల తీరును వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, నల్లగొండ జిల్లా మల్లేపల్లితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదో ఒక చోట బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో సభను నిర్వహించేందుకు ఒకటి రెండు రోజుల్లో జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మహబూబ్‌నగర్ సభను సంక్రాంతి లోపు నిర్వహించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ‘పాలమూరు’కు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదులో డంబాచారం వద్దు పార్టీ సభ్యత్వ నమోదును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చేయాలనే అంశంపై పార్టీ నేతల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు కోరారు. రెండు విధానాల్లో సభ్యత్వ నమోదు చేయాలని, సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలను నియమించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పార్టీ సభ్యత్వ నమోదు పేరిట డంబాచారాలకు పోకుండా పార్టీ పట్ల నిబద్ధత ఉండే వారికే సభ్వత్యం ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూలును సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సభ్యత్వ నమోదు ఉచితంగా కాకుండా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించేలా నిబంధనలు ఉండాలని నేతలు సూచించారు. సభ్యత్వం తీసుకునే వారికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే కేంద్రంగా పనిచేయడంతో నష్టం! ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగడంతో కొంత మేర నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని ఈ భేటీలో కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు క్షేత్ర స్తాయిలో కేడర్‌తో సమన్వయంతో చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు సాధించిన పలితాపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తాం చెక్‌డ్యామ్‌ల పేల్చివేత అంశంపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి న తర్వాత బాధ్యులు పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ సహజ శైలిలో సాగిన ప్రసంగంలో ఆయన సీఎం రేవంత్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత 26 ఏళ్లుగా ప్రత్యర్థులు తన చావును కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇలావుండగా కేసీఆర్ రాకమునుపే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపం వద్ద నివాళి అరి్పంచారు. కేసీఆర్ రాక సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డికి స్వల్ప గాయం అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అజ్మీర్ దర్గా ఉర్సుకు కేసీఆర్ చాదర్ సమర్పణ సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతియేటా పార్టీ తరపున చాదర్ సమరి్పంచే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ ఆదివారం చాదర్ అందజేశారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు వారి వైద్య విద్యకు అయ్యే ఫీజును కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అందజేశారు. 15 మంది విద్యార్థులకు ఈ చెక్కులు అందజేశారు. -
ముందు అసెంబ్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరేం చేశారో, ఎవరి హయాంలో ఏం జరిగిందో కూలంకశంగా మాట్లాడేందుకు వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని తాను ప్రతిపాదిస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో? తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశానో? అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చని చెప్పారు.ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేస్తే ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను ఏపీకి రాసిచ్చేసి పాల మూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణశాసనం రాసింది కేసీఆరేనని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..! ప్రజలు తీర్పు ఇస్తూనే ఉన్నారు ‘కలుగులో ఉన్న ఎలుకకు పొగబెడితే బయటకు వచ్చినట్టు రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. సంతోషం. ప్రజలిచి్చన తీర్పు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించి స్రత్పవర్తన తెస్తుందని ఆశించాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలే పెట్టుబడిగా ఆయన 75 నిమిషాల ప్రసంగం సాగింది. బీఆర్ఎస్ చేసిన నేరాలు, ఘోరాలు దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కరడుగట్టిన నేరగాళ్లకు కూడా కనువిప్పు కలుగుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఏ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. మూతి దగ్గర కాకుండా తోక దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. 811 టీఎంసీల్లో 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని సంతకం పెట్టింది ఎవరు? ఒక్కసారి కాదు పదేపదే సంతకాలు పెట్టి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 2021–22లో శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను కేసీఆర్ ఏపీకి రాసిచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూరాల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీటిని శ్రీశైలంలో కలిపి ఏపీ జలదోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేశాడు.మూతి దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకోవాలని చూశాడు. లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ఇదంతా చేశాడు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణాపై పూర్తికాని పరిస్థితి. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నారాయణపేట– కొడంగల్, డిండి, ఎస్సెల్బీసీల్లో ఒక్క ప్రాజెక్టునయినా పదేళ్లలో పూర్తి చేశాడా? మేం వచి్చన తర్వాత రూ.6,800 కోట్ల విలువైన పనులను కృష్ణాపై సాగునీటి ప్రాజెక్టుల కోసం చేశాం. తేలు కుట్టిన దొంగలా.. మేం వచ్చిన తర్వాతే కృష్ణా జలాల్లో 71 శాతం వాటా అడిగాం. ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నదే మేము. పైగా తానే నీళ్లకు నడక నేరి్పనట్టు ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతాం. ట్రిబ్యునల్‌లో స్వయంగా మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాడు.పదేపదే జలశక్తి మంత్రిని కలుస్తున్నారు. కేంద్రం చేయకపోతే అంతా ఎడారిగా మారిపోదు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో చేసిన ద్రోహానికి కేసీఆర్ సమా«ధానం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలి. ఈ ద్రోహిని నిలదీద్దామని సభకు రమ్మంటే తేలు కుట్టిన దొంగలా తప్పించుకుంటున్నాడు. సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చి అసలు ఊరుకునేదే లేదంటూ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీకి రావడంలేదు.. అసెంబ్లీలో కృష్ణాకు ఒకరోజు, గోదావరి ఒకరోజు కేటాయించి చర్చ చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నా... ఆయన్ను రమ్మనండి. లేదంటే రెండు రోజుల చొప్పున చర్చిద్దామన్నా ఓకే. ఆయన అబద్ధాలు చెపుతున్నాడు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రండని అడుగుతున్నా.. రాకుండా కేసీఆర్ పారిపోవడంలో ఉద్దేశమేంటి? ఆయనకు అధికారం కోసం వ్యామోహం తప్ప తెలంగాణ ప్రజలపై అభిమానం లేదు. అందుకే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. సభలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోమని నేను హామీ ఇస్తున్నా. అలా ఎవరైనా భంగం కలిగించినా చర్యలు తీసుకోమని నేనే చెబుతా. ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు. కొడుకు, అల్లుడి పంచాయతీ తీర్చేందుకు వచ్చాడు. కొడుకు దగ్గరి నుంచి అల్లుడు పార్టీని గుంజుకుంటాడేమోనని, దేనికీ చెల్లనోడు అల్లుడి చేతిలో పార్టీ పెడతాడేమోనని, కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టు వచ్చాడు. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడే కొడుకు కుర్చీ కోసం ప్రయతి్నంచాడు. ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు. ఇప్పుడు అల్లుడు సావు కోరుకుంటున్నాడు.ఆయన పోతే అల్లుడికి పార్టీ వస్తదని అనుకుంటున్నాడు. నాకేమి వస్తుంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆయన కింద పడి కాలువిరిగితే మొదట పరామర్శించిందే నేను. అర్ధరాత్రి ఆంబులెన్సు పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిందే నేను. కానీ ఆయన అల్లుడు, కొడుకే పోటీలుపడి ఆయన్ను ఫామ్‌హౌజ్‌లో నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలతో ఇబ్బంది లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం ఉంది. నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వయసుకు తగ్గట్టు లేవు. ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపుచెక్కతో కొట్టగలను. అల్లుడు కాపలా కాసుకుని ఉన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది మేం కాదు. ఆయన కొడుకు, అల్లుడే. కేటీఆర్ ఐరన్‌లెగ్ అని చెప్పి పార్టీని గుంజుకుంటే ఉన్న పళంగా హరీశ్‌రావుకు రూ.5వేల కోట్ల ఆస్తి వస్తుంది. రూ.1,500 కోట్ల పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు, రూ.3,500 కోట్ల విలువైన పార్టీ ఆస్తులు రాత్రికి రాత్రి ఆయన హస్తగతమవుతాయి. నేను చెప్పేది కనపడే ఆస్తుల గురించే. కనిపించని వజ్రాలు, వైఢూర్యాల గురించి కాదు. నేను కోటి మంది మహిళలకు సారె పెడితే కేటీఆర్ ఉన్న చెల్లిని ఇంటి నుంచి పంపించేశాడు. ప్రతి దగ్గర బాంబులు పెట్టారనడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పులు చేసి గుల్ల చేశారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశాడు. 11.9 శాతం వడ్డీకి అప్పులు తెచ్చాడు. సంసారం చేసేటోడెవడైనా అంత వడ్డీకి అప్పులు తెస్తాడా? కేసీఆర్, ఆయన కుమారుడు కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. మేం వచ్చిన తర్వాత ఒక్కోక్కటి సరిదిద్దుతున్నాం. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లు అప్పులను రీస్ట్రక్చర్ చేశాం. మరో 85వేల కోట్ల కోసం ప్రయతి్నస్తున్నాం. ప్రధాని మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీయగానే కేసీఆర్ సంతోషపడుతున్నాడు. ఫార్ములా ఈ–రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఇదే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సర్వభ్రష్ట సర్కారు
గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు? మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. సాక్షి, హైదరాబాద్: ‘క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్న రాష్ట్రంలో ప్రజలను అబద్ధపు హామీలతో మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. మాయమాటలతో అర్రాజ్ పాటలు పాడి చాంతాడంత హామీలు ఇవ్వడంతో ప్రజలు టెంప్ట్ అయ్యా రు. వంద శాతం సమ్మిళిత అభివృద్ధితో ముందుకు సాగుతున్న తెలంగాణలో బాండు పేపర్లు, గ్యారంటీ కార్డులు అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు శఠగోపం పెట్టారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలదోపిడీ, పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా స్పందించడం లేదు. కిరికిరి మాటలతో, కారు కూతలతో ప్రభుత్వం నడుపుతామంటే కుదరదు.మాది తెలంగాణ తెచి్చన పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా మా విధి మేము నిర్వర్తించాలి. సర్కారుకు సరిపడినంత సమయం ఇచ్చాం. ఇవాళ్టి వరకు వేరు, రేపటి నుంచి వేరే.. తోలు తీస్తాం.. అందుకోసం నేను రంగంలోకి దిగుతున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నాలుగు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొట్టి కార్యాచరణ ప్రకటిస్తాం.ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని ఎండగడ™తాం. కవులు, కళాకారులను తట్టి లేపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తాం. ఈ సభలకు నేను స్వయంగా హాజరవుతా..’ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, ఇతర కీలక నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రెండేళ్లుగా గమనిస్తున్నాం.. ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ని్రష్కియా పరత్వం, కేంద్రం వ్యతిరేకిస్తున్న తీరును రెండేళ్లుగా గమనిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన బీఆర్ఎస్..తెలంగాణ హక్కులకు ఒక్క నొక్కు పడినా, ఒక్క చుక్క నష్టం జరిగినా సహించేది లేదు. తెలంగాణకు శనిలా బీజేపీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఒత్తిడితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను వెనక్కి పంపారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర ప్రధాన అనుమతులు సాధించినా బీజేపీ దిగజారి తెలంగాణకు శనిలా మారింది. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపి ఆగం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా పెదవులు మూసుకుంది.మైనర్ ఇరిగేషన్ నష్టాలు, ఏపీ పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో తెలంగాణకు దక్కిన 45 టీఎంసీలను కలుపుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించాం. కానీ నీటిపారుదల శాఖ మంత్రి 45 టీఎంసీలు చాలని లేఖ రాశారు. గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో ఏపీ వదులుకున్న జలాలను ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర వాడుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోంది. రెండేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టెడు తీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా, కమీషన్లు కొట్టడం తప్ప వేరే పనిలేదా?..’ అని కేసీఆర్ మండిపడ్డారు. మేం పెండింగు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. ‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోలుకోలేని రీతిలో దెబ్బతింది. నాటి సీఎం చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకున్నా జూరాలలో ముంపునకు గురైన కర్ణాటక భూమికి రూ.13 కోట్లు పరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై దేవునూరు, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలో అన్యాయం చేసిన రీతిలోనే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం చేశారు. 17 టీఎంసీలతో మంజూరైన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల తరబడి కనీసం ఫౌండేషన్‌కు నోచుకోలేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత.. చంద్రబాబు మోకాళ్ల మీద పరుగెత్తి పరిహారం చెల్లించడంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు సాగులోకి వచి్చంది.రాజోలిబండ మళ్లింపు పథకం కోసం ఆలంపూర్, గద్వాల వరకు పాదయాత్ర చేశా. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణా ప్రవహిస్తున్నా నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి తదితర పథకాలను పెండింగులో పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 170కి పైగా టీఎంసీలు తీసుకోవాలనే వ్యూహంతో తొలుత 90.81 టీఎంసీలు కేటాయించాం. అనేక అవాంతరాలు ఎదురైనా అనుమతులు సాధించాం. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశాం..’ అని బీఆర్ఎస్ అధినేత వెల్లడించారు. హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు ‘బిజినెస్ మీట్ల పేరిట హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు. ఏపీలో చంద్రబాబు హోటల్లో పనిచేసే వంట మనుషులతో ఎంఓయూలపై సంతకాలు పెట్టించారు. ఆయన చెప్పిన లెక్కలు నిజమైతే ఈ పాటికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. ఒప్పందాలు నిజమైతే కనీసం రూ.10 వేల కోట్లయినా రావాలి కదా. గతంలో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు భోపాల్‌కు వెళ్లిన సందర్భంలో ప్రధాని మోదీ సమక్షంలో కుదిరిన రూ.14 లక్షల కోట్ల ఎంఓయూలు బోగస్ అని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. పెట్టుబడులపై అబద్ధపు ప్రకటనలు, ఒప్పందాలతో ప్రజలను మోసం చేయడం ఎందుకు?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ‘ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ముచ్చర్లలో మేం 14 వేల ఎకరాలు సేకరించాం. పర్యావరణ అనుమతులు కూడా సాధించి ముందుకు సాగుతున్న క్రమంలో ప్రభుత్వం మారింది. కానీ ఫ్యూచర్ సిటీ పేరిట భూములను అమ్ముకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాకు తెరలేపారు. గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అమ్ముకునేందుకు ఉత్సాహం చూపుతోంది.వంతారాకు 3 వేల ఎకరాలు, జూపార్కు తరలింపు భూముల అమ్మకం కోసమేనా? గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంత కాలం వంచిస్తారు? యాప్ ద్వారా యూరియా అంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. అడ్డమైన హామీలు ఇచ్చి రైతులు, పేదలు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులను ఏడిపిస్తున్నారు. సందర్భం ఏదైనా కేసీఆర్ చనిపోవాలి అంటూ మాట్లాడటం కరెక్టేనా?..’ అని కేసీఆర్ నిలదీశారు. -
...అనే నేను
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని 525 మంది సర్పంచులు .. అనూ నేను అంటూ ఏకకాలంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. పంచాయతీ ప్రత్యేక అధికారులు/ కార్యదర్శులు గ్రామ ప్రథమ పౌరుడితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇప్పటికే ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికైన అభ్యర్థులు తమ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా అభ్యర్థిస్తూ గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 526 పంచాయతీలు సహా 4,668 వార్డులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. మొదటి విడతలో భాగంగా ఈనెల 11న 174 పంచాయతీలు సహా 1,530 వార్డులకు, రెండో విడతలో భాగంగా 14న 178 పంచాయతీలు, 1,540 వార్డులకు, మూడో విడతలో భాగంగా 17న 174 పంచాయతీలు సహా 1,598 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి పంచాయతీ మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయింది. గెలుపొందిన అభ్యర్థుల పేర్లను కూడా అదే రోజు ప్రకటించారు. రెండేళ్లుగా ప్రత్యేక పాలనలో మగ్గిన ఆయా పంచాయతీలు ఇక నుంచి నూతన పాలకవర్గం సభ్యులతో కళకళ లాడనున్నాయి. -
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, కృష్ణా జాలాలపై ఒక రోజు, గోదావరి జలాలపై మరో రోజు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21 వ తేదీ) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరేనన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఆయనే దెబ్బ తీశారన్నారు. కేసీఆర్ వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను చూపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో 36 శాతం వాటా అంగీకరించింది కేసీఆర్ మాత్రమేనని, 71 శాతం వాటా కోసం తాము పోరాడుతున్నామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు.ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం.రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పింది.గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు -
ఆ విషయాలే ప్రధానంగా చర్చించాం: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పింది. గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు. -
‘కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా?’
హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనపై రాష్ట్రంలోని మా రెండేళ్ల పాలనై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరాఉ. రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌రెడ్డి మోకాలు అడ్డుతున్నారని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణలను కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని మహేష్‌గౌడ్ మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలను నెరవేర్చామన్నారు మహేష్‌గౌడ్.కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమే..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్, హరీష్ చేసిన తప్పిదాల వల్లే నదీజాలల సమస్యలు వచ్చాయన్నారు. వృథా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ అనవరసరప ఖర్చు చేశాడని, తామ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటన్నామన్నారు. అప్పులపై కేసీఆర్ ఏం సంజాయిషీ ఇస్తారో చూద్దామన్నారు. ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 70 శాతం సీట్లు గెలిచామని, మరి బీఆర్ఎస్ ఎక్కడుంది?అని ప్రశ్నించారు మహేష్ గౌడ్. -
మహాజాతర పోస్టర్ విడుదల చేసిన సీఎం
సాక్షి హెదరాబాద్: 2026 జనవరిలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ గిరిజన మహాజాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు 2026 జనవరి 28న ప్రారంభంకానుంది. 28 బుధవారం నాడు సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. 29 గురువారం నాడు సమ్మక్క తల్లి గద్దెలపైకి వస్తుంది. జనవరి 30 శుక్రవారం భక్తులు మెుక్కులు సమర్పించుకుంటారు. అనంతరం జనవరి 31వ తేదీన దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.సమ్మక్క-సారక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇది వరకే రూ.150 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో జాతర జరిగే ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌళిక సదుపాయాల ఏర్పాటు చేయనున్నారు. ఆసియాలోని అత్యంత పెద్దదైన ఈ జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. -
పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తెలిసేది: కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అధ్యక్షుడు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తనను దూషించడం, అవమానించడమేనని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిందన్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తేలేదన్నారు కేసీఆర్.‘గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదు. ఉన్న పథకాలు కూడా ఆపేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఈ ప్రభుత్వ పాలసీ. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. తెలంగాణలో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. మా హయాంలో రైతుల ఇంటికే యూరియా వచ్చేది’ అని తెలిపారు కేసీఆర్.ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాను,ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోంది. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేస్తోంది. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఏదైనా ఉంటుందా?అని కేసీఆర్ నిలదీశారు. -
తెలంగాణ భవన్‌కు కేసీఆర్
హైదరాబాద్ సాక్షి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికాసేపట్లో జరిగే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై న్యాయ పోరాటానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే కాలంలో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు ఇదివరకే తెలంగాణ భవన్ చేరుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పార్టీ కీలక నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడున్నట్లు సమాచారం. -
దారి తప్పుతున్న యువ ఖాకీలు
ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. -
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ గాదె ఇన్నయ్య ఆశ్రమంలోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు.. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు చేశారు. ఆదివారం.. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.ఇన్నయ్యను అరెస్ట్చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్నయ్య అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం. -
సోనియా గాంధీకి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను అభినందిస్తున్న సోనియాగాంధీ. ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకున్నారా? అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్యారెంటీలు, హామీల అమలు వదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ లేఖలో దుయ్యబట్టారు.‘‘తెలంగాణ అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్‌తో కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను గాలికి వదిలేశారా? 420 హామీలను మూసినదిలో కలిపేశారా? గతంలో ఇచ్చిన హామీలపై నిలబడాలి. లేదంటే ప్రజల ఆగ్రహం మీ పాలిట భస్మాసుర హస్తమవుతుంది. గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. మోసానికి పాల్పడితే గుణపాఠం తప్పదు’’ అంటూ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ప్రమాణ స్వీకారానికి ముందే అభివృద్ధి బాట..
నల్గొండ జిల్లా: రెండేళ్లుగా గుంతలమయంగా మారిన రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎర్రబెల్లి గ్రామ నూతన సర్పంచ్ అయితగోని మధు, ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల సమస్యకు పరిష్కారం చూపారు.ముషంపల్లి నుంచి ఎర్రబెల్లి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు అడ్డంకిగా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎర్రబెల్లి సర్పంచ్‌గా అయితగోని మధు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, తన సొంత ఖర్చులతో ఆ రోడ్డుపై మొరం మట్టి వేయించి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ, అధికారికంగా బాధ్యతలు స్వీకరించేలోపే అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషకరమని గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని అయితగోని మధు తెలిపారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్లో నేడు(ఆదివారం, డిసెంబర్ 21) ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు. ఇవాళ జరగబోయే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు చెబుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని బీఆర్ఎస్ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయ్యిందని బీఆర్ఎస్ బలంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ భేటీని పార్టీ కీలకంగా భావిస్తోందని సమాచారం. -
సిరిసిల్ల: ఏర్పుల నర్సయ్య అనుమానాస్పదంగా మృతి
సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్‌లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! జానపద కళాకారిణి.. సర్పంచ్ఇల్లంతకుంట: నాగులమ్మ.. నాగులమ్మ.. నల్ల నాగులమ్మ.. చిన్న దొర బంగ్లా మీద సీటీలెయ్యకురా.. తెల్లచీర కట్టుకొని టేకుళ్లకు కలువబోతే.. వంటి జానపదపాటలకు నృత్యంతో అలరించిన యూట్యూబ్ ఆర్టిస్ట్ గౌరవేణి శివాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటు మీద పల్లె గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. శివాని 300కు పైగా జానపద పాటలకు డాన్సర్‌గా అభినయించారు. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆమె సోదరుడు బాబు వద్ద డ్యాన్స్ నేర్చుకున్నారు. తర్వాత క్లాసికల్ డాన్స్ మాస్టర్ సత్యం వద్ద మెలకువలు నేర్చుకున్నారు. ఆర్ఎన్ఎస్ పేరుతో డ్యాన్స్సూ్కల్ ఏర్పాటు చేశారు. జానపద గేయాల డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్ కొనసాగారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన శివానికి బోటు మీద పల్లెకు చెందిన గౌరవేణి సుమన్‌తో వివాహమైంది. దాచారం అనుబంధ గ్రామంగా ఉన్న బోటు మీద పల్లె నూతన గ్రామపంచాయతీగా ఏర్పడడంతో రిజర్వేషన్ కలిసొచ్చి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి పాటుపడడంతో పాటు, అవకాశం వచ్చినప్పుడు జానపద గేయాల్లో రాణిస్తానని శివాని పేర్కొన్నారు.సైనికుడు.. సేవకుడుఫెర్టిలైజర్ సిటీ: మొన్నటి వరకు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహించి.. నేడు గ్రామ సర్పంచ్‌గా సేవలందించేందుకు సిద్ధమయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గుంటూరుపల్లి సర్పంచ్ యర్రం హరినాథ్‌రెడ్డి 2003లో దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీలో చేరారు. 17ఏళ్లు సరిహద్దుల్లో విధులు నిర్వహించి 2020లో ఉద్యోగ విరమణ చేశారు. ఊరిపై ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2023లో రామగుండం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్ని కలు రావడంతో పదవికి రాజీ నామా చేసి, గుంటూరుపల్లి సర్పంచ్‌గా పోటీ చేశారు. 303 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఏ చదివిన హరినాథ్‌రెడ్డి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడించారు. -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ భవనాల్లో కొనసాగాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్ భవనాల అద్దె చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది2026 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ భవనాల్లోనే పని చేయాలని అన్ని శాఖలకు, యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వర్సిటీలను వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని పేర్కొంది. డిసెంబర్ 31లోపు ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ అవ్వాలని.. అన్ని శాఖలు ప్రభుత్వ స్థలాల గుర్తింపు పూర్తిచేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాధిపతులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని.. ఆ అద్దెలు వాళ్లే చెల్లించాల్సి వస్తుందని సర్కార్ హెచ్చరించింది. -
త్వరలో 2,322 మంది స్టాఫ్ నర్సుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. గత సంవత్సరం నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందికిపైగా నర్సింగ్ అభ్యర్థులు పరీక్ష రాసి ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల ఫలితాలను ఒకటి రెండు రోజుల్లోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల జాబితాను సిద్ధం చేశామని, ఫలితాల ప్రకటన దశలో ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే రెండ్రోజుల్లోనే అధికారిక వెబ్సైట్ ద్వారా రిజల్ట్, ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశముందని సమాచారం. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం 2024 నవంబర్ 23న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా 2,322 పోస్టులు భర్తీ చేయనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులు, సేవా అనుభవానికి కేటాయించిన వెయిటేజీ పాయింట్లు కలిపి 100 మార్కుల ఆధారంగా మెరిట్ సిద్ధం చేసినట్టు బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఫలితాల విడుదల అనంతరం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసి, ఎంపికైన వారికి ని యామక ఉత్తర్వులు అందించే ప్రక్రియను ఆరోగ్య శాఖ వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 7 వేలకుపైగా పోస్టుల భర్తీ తెలంగాణలో నర్సింగ్ నియామకాల పరంగా గత రెండేళ్లలో ప్రభుత్వం వేగం పెంచింది. 2022లో నోటిఫై చేసిన 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టుల్లో 6,956 మందిని గతేడాది ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 36కు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెరిగింది. ఈ ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది నియామకం అత్యవసరమని ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్తగా నియమితులయ్యే నర్సింగ్ ఆఫీసర్లు సేవల్లోకి రాగానే ఐసీయూ, మెటర్నిటీ, పిల్లల, అత్యవసర చికిత్స వార్డుల్లో రోగి సంరక్షణ మరింత మెరుగుపడనుందని అధికారులు భావిస్తున్నారు. -
కలిసొచ్చినట్టు కనికట్టు!
హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి (63)కి ఇండియా నివేశ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో వాట్సాప్‌నకు గత నెలలో ఓ లింక్ వచ్చింది. లింక్‌ను ఆయన ఓపెన్ చేయగానే దివ్య మెహ్రాగా చెప్పుకున్న ఓ మహిళ వాట్సాప్ చాటింగ్ ద్వారా మాటలు కలిపి ఆయన్ను 163 గేట్ వే టు ది ఫ్యూచర్ అనే వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్‌లో చేర్చింది. అలాగే ఎన్ఐవీపీఆర్ఓ ట్రేడింగ్ యాప్ ఇన్స్టాల్ చేయించి కొంత సొమ్మును అందులో డిపాజిట్ చేయించింది. ఆన్లైన్ ట్రేడింగ్‌లో ఆయన పెట్టుబడి ఏకంగా రూ. 64 లక్షలకు పెరిగినట్లు వర్చువల్‌గా బ్యాలెన్స్ చూపించింది. చివరకు ఆ ఖాతా ఫ్రీజ్ అయ్యిందంటూ రూ. 29.5 లక్షలు కొల్లగొట్టింది. దీంతో బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఎల్బీ నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ ఏడాది ఆగస్ట్ 20న ఆర్తి అనే మహిళ పేరు, ఫొటో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె పరిచయం పెంచుకొని 305 స్టాక్ మార్కెట్ న్యూస్ అనే వాట్సాప్ గ్రూప్‌లో అతన్ని చేర్చింది. ఆ గ్రూప్‌లోని సభ్యులు తమకు అధిక లాభాలు వస్తున్నట్లు నమ్మించడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైతం ఆన్లైన్ ట్రేడింగ్‌కు సిద్ధపడ్డాడు. దీంతో తొలుత అతనితో రూ. 50 వేలు డిపాజిట్ చేయించి 4.69 శాతం లాభం వచ్చినట్లు చూపారు. ఇలా 50 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 3.49 కోట్లు పెట్టుబడి పేరిట వసూలు చేసి రూ. 28.52 కోట్లు లాభం వచ్చినట్లు వర్చువల్ ఖాతాలో బ్యాలెన్స్ చూపారు. ఈ డబ్బు విత్ డ్రాకు బాధితుడు యతి్నంచగా అకౌంట్ బ్లాక్ అయ్యిందని చెప్పి ట్రేడింగ్ యాప్‌ను, వాట్సాప్ గ్రూప్‌ను డిలీట్ చేసి జారుకున్నారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రెండు రోజుల కిందట నలుగురిని అరెస్టు చేశారు.సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలు వస్తాయని మెసేజ్‌లు, వెబ్ లింక్‌లతో ఊదరగొడుతూ వారిని మోసాల ఊబిలోకి దింపుతున్నారు. పెట్టుబడికి భారీగా లాభాలు వచ్చినట్లు వర్చువల్ ఖాతాల్లో కనికట్టు చేస్తున్నారు. తీరా సొమ్ము విత్‌డ్రాకు ప్రయతి్నస్తే ఖాతాలను బ్లాక్ చేసి బాధితుల నుంచి రూ. కోట్లలో దండుకుంటున్నారు. మోసగాళ్ల పంథా ఇదీ.. సైబర్ నేరగాళ్లు గుర్తుతెలియని వాట్సాప్ నంబర్ల ద్వారా బాధితులకు తొలుత బల్క్ మెసేజ్‌లు పంపుతూ నకిలీ పేర్లు, మహిళల ఫొటోలతో ఆన్లైన్లో పరిచయం చేసుకుంటున్నారు. బాధితుడు తమను నమ్మినట్లు తెలియగానే ముందుగానే ఏర్పాటు చేసిన మోసపూరిత వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్‌లలో సభ్యులుగా చేరుస్తున్నారు. నెలల వ్యవధిలోనే అనూహ్య లాభాలు గడించినట్లు గ్రూప్ సభ్యుల మధ్య చర్చ నడుపుతూ బాధితులను సైతం అందులో చేరాల్సిందిగా కోరుతున్నారు. ఆ తర్వాత తాము డిజైన్ చేసిన యాప్‌లలో వారిని చేర్చి వర్చువల్ ఖాతాకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నారు. తక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కలి్పంచి ఆశచూపుతున్నారు.కమీషన్లు, రివార్డు పాయింట్ల పేరిట మళ్లీమళ్లీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేసేలా వల విసురుతున్నారు. ఇలా పెట్టిన పెట్డుబడితో లాభాలు వచ్చినట్లు ఆన్లైన్ ఖాతాల్లో బ్యాలెన్స్ చూపుతున్నారు. అయితే ఆ సొమ్ము విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. డబ్బు బదిలీ కావాలంటే పన్నులు, చార్జీలు, మనీలాండరింగ్ పేరు చెప్పి అందినంత దోచేస్తున్నారు. చివరకు అకౌంట్‌ను డిలీట్ చేసేస్తున్నారు. రాష్ట్రంలో నమోదైన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 10 వేలకుపైగా వర్చువల్ ఖాతాలను గుర్తించారు. చివరి వరకు అదే డ్రామా ట్రేడింగ్, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సైబర్ నేరాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితుల వర్చువల్ ఖాతాల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు వారి వద్దే పెట్టుకుంటారని, దీంతో సమాచారమంతా వారి చేతుల్లోనే ఉంటోందని వివరిస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి మొదట్లో రెట్టింపు లాభం చూపుతున్న కేటుగాళ్లు.. అందులోనూ బాధితుడు పెట్టిన సొమ్ము నుంచే కొంత మొత్తం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చి నమ్మకం కలిగేలా చేస్తున్నారని.. ఇలా ట్రాప్‌లో చిక్కిన వారి నుంచి అందినంత కొల్లగొడుతున్నారని అధికారులు చెబుతున్నారు. -
పొగబట్టిన కాలుష్యం!
దేశంలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో 2022–24 మధ్య ఢిల్లీలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులకు 2 లక్షల కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చారంటే కాలుష్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన 2024 అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం కలుíÙతమైన గాలిని పీల్చడం వల్ల భారత్‌లో ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.వాయు కాలుష్యం వల్ల దేశ సగటు ఆయుర్దాయం 3.5 ఏళ్లు తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయం 2025 ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) వెల్లడించింది. గాలి నాణ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరి్టక్యులేట్ మ్యాటర్–2.5 (పీఎం) ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 40 ్పమైక్రోగ్రాముల వరకు ఆమోదయోగ్యం. అంటే గాలిలో 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసంతో కలిసిన దుమ్ము, ధూళి, పొగ కణాలు అన్నమాట. గాలిలో ఈ కణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత తీవ్రంగా ఉన్నట్లు లెక్క.ఏడాది పొడవునా.. దేశంలో వాయు నాణ్యత సంక్షోభం అంతకంతకూ విస్తృతమవుతోంది. ఈ ఏడాది 256 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు జరపగా 150 కేంద్రాల్లో వాయు కాలుష్యం నిర్దేశిత ప్రమాణాలను మించిపోయిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తెలిపింది. చాలా మంది పట్టణవాసులకు అనారోగ్యకర లేదా ప్రమాదకర గాలిని పీల్చడం ఏడాది పొడవునా నిత్యకృత్యంగా మారింది. 2025లో ఢిల్లీలో పీఎం–2.5 స్థాయి రోజుకు క్యూబిక్ మీటర్‌కు 107–130 మైక్రోగ్రాములుగా³ నమోదైంది. ఇది దేశంలో ఒక రోజు పరిమితి అయిన 60 మైక్రోగ్రాములు, డబ్ల్యూహెచ్ఓ నిర్దేశిత 15 మైక్రోగ్రాముల కంటే చాలా ఎక్కువ. తగ్గుతున్న ఆయుర్దాయం..దేశంలో 46% మంది ప్రజలు పీఎం–2.5 స్థాయి కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఏక్యూఎల్‌ఐ నివేదిక తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రజలు 4.74 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నారని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన కఠినమైన మార్గదర్శకాలను పాటిస్తే ఆయుర్దాయం 9.4 నెలలు పెరుగుతుందని అంచనా వేసింది.ఎనిమిదిలో ఒకటి..వాయు కాలుష్యానికి సంబంధించిన మరణాలను భారత్‌లో లెక్కించడం లేదని గ్లోబల్ క్లైమేట్, హెల్త్ అలయన్స్ చెబుతోంది. క్రమబద్ధమైన విధానాలు లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక–2025 తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి 2023లో 79 లక్షల మరణాలు వాయు కాలుష్యం వల్ల సంభవించాయని పేర్కొంది. అందులో పీఎం–2.5 స్థాయి కాలుష్యానికి గురై 49 లక్షల మంది మృతిచెందారని తెలిపింది. తగ్గిన సూర్యకాంతి.. 1993–2022 మధ్యకాలంలో గాలిలోని దుమ్ము, ధూళి కారణంగా దేశంలో సూర్యకాంతి దాదాపు 13% తగ్గింది. మేఘాలు అదనంగా 31–44% సూర్యకాంతి క్షీణతకు కారణమయ్యాయని ఐఐటీ కాన్పూర్‌లోని వాతావరణ శాస్త్రవేత్త సచ్చిదానంద్ త్రిపాఠి తెలిపారు. సూర్యకాంతి తగ్గితే వ్యవసాయం, సౌర శక్తితోపాటు రోజువారీ జీవితాలపైనా ప్రభావం చూపుతుందని వివరించారు. ఫొటోవోల్టాయిక్ సిస్టమ్స్‌ను బట్టి సౌర విద్యుత్ ఉత్పత్తి 12–41% పడిపోతుందని చెప్పారు. బీజింగ్ ఒక ఉదాహరణ.. చైనాలోని బీజింగ్ 20 ఏళ్ల క్రితం ప్రపంచ పొగమంచు రాజధానిగా పేరొందింది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బొగ్గు ఆధారిత బాయిలర్స్‌ను మూసివేయడం, ప్రజారవాణా, పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించడం, సాంకేతిక సంస్కరణలు, ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం వంటి చర్యలను చైనా సర్కారు యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఫలితంగా పీఎం–2.5 స్థాయి 2013లో ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 72గా ఉండగా గతేడాది 29.3 ్పమైక్రోగ్రాములకు తగ్గిపోవడం విశేషం. -
రేవంత్ హనీమూన్ ముగిసింది
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఆయన పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల్లోకి వెళ్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ కీలక నేతల సమావేశంలో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు సహా పలు అంశాలపై మాట్లాడారు. రేవంత్ ఇంటిని బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు ‘కాంగ్రెస్, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందం ఉంది, రేవంత్ ఓ కాలు కాంగ్రెస్‌లో మరో కాలు బీజేపీలో ఉంది. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులో రేవంత్ ఇల్లును ఓ బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహ ప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లాడో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు చెప్పాలి. సీఎం రమేశ్ వంటి వారికి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బీజేపీ ఆయనకు అండగా నిలుస్తోంది. అఖిలేశ్ యాదవ్‌తో నా దోస్తీపై రామచందర్‌రావుకు బాధ ఎందుకు? పంచాయతీ ఎన్నికల ఫలితాల దెబ్బతో ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి.గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా జరిగింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ ఆలోచన. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయడం వంటి ప్రయోగాల జోలికి కేంద్రం వెళ్లకపోవచ్చు. ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి ప్రయోగాలు ఫలించవు..’అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నామనడం కామెడీ ‘కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన కడియం బీఆర్ఎస్లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఆ ఎమ్మెల్యేలు చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రేవంత్ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్ కాలేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఏడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. ఫార్ములా ఈ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు డొల్ల అని రేవంత్‌కు అర్ధమైంది. ఆయన పాలన వైఫల్యాలకు ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక. రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా.. రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా. ఆయన మాదిరిగా కుటుంబసభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. ఇంట్లోని పిల్లలు, మహిళలు, మనవడి గురించి మాట్లాడను..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.లైన్లు దాచేందుకే యూరియా యాప్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజంసాక్షి, హైదరాబాద్: యూరియా కోసం రైతులు బారులు తీరే దృశ్యాలను దాచి పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్ విధానం తెస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనాన్ని బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచి పెట్టేందుకు కొత్తగా రైతు వ్యతిరేక విధానం తెస్తోందన్నారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతుదారులను తెలంగాణ భవన్లో శనివారం కేటీఆర్ సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల అవసరాల మేరకు వెంటనే యూరియాను సరఫరా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యాప్‌ల పేరిట రైతులకు కొత్తగా సమస్యలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి సొంత ఆస్తి కాదని, ప్రజల సొమ్ముకు నాయకులు ధర్మకర్తలు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీకి వచ్చే నిధులపై సర్పంచ్‌లు, పంచాయతీ పాలక మండలికి మాత్రమే సంపూర్ణ అధికారం ఉంటుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజా అవసరాలకు నిధులను ఖర్చు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ కీలక నేతల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షంతో పాటు పార్టీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు తదితరులు కలిపి మొత్తంగా సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పార్టీ సమావేశానికి హాజరు కానుండటం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రమే కేసీఆర్ దంపతులు ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరుల స్తూపం, జయశంకర్ విగ్రహానికి నివాళి అరి్పంచిన అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. ఏపీ జల దోపిడీపై పోరుబాట రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఏపీ జలదోపిడీపై పోరుబాటకు ఆదివారం జరిగే సమావేశంలో కేసీఆర్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన కరివెన రిజర్వాయర్ వద్ద ఈ సభ నిర్వహించే అవకాశముంది. అలాగే నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం జల దోపిడీ కోసం చేస్తున్న కుట్రలపైనా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపైనా క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పోరాట రూపాలపైనా ఈ సమావేశంలో చర్చించి కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశముందని అంటున్నారు. కవిత ఎపిసోడ్ సహా ఇతర అంశాలపై? పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘జనం బాట’పేరిట జిల్లా పర్యటనల్లో పార్టీ కీలక నేతలు లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత కుమార్తె కవిత అంశంలో కేసీఆర్ స్పందిస్తారా అనే ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వ నిర్ణయం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి అంశాలు ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది.ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ తదితర అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే కోణంలోనూ దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడంపై కూడా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌పై స్పష్టత ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. -
ప్రభుత్వం మాటలు విని మోసపోయా: హిడ్మా తల్లి
కొన్నాళ్ల క్రితం వరకు ఎక్కువ మంది నోట వినిపించిన పేరు మడ్వి హిడ్మా. ఏపీలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాను అభినవ భగత్‌సింగ్ అని, మరో అల్లూరి సీతారామరాజు అంటూ కొందరు కీర్తించగా.. హిడ్మా పేరిట ఉన్న క్రైం రికార్డుల మాటేమిటని మరికొందరు ప్రశి్నస్తున్నారు. కానీ ఇరువర్గాలను తల్లడిల్లిపోయేలా చేస్తోన్న ఒకే అంశం హిడ్మా తల్లి పొజ్జి. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ ఆమెను కలిసినప్పుడు తొలిసారిగా పొజ్జి వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత హిడ్మా అంత్యక్రియల సమయంలో ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన వారి మనుసులు బరువెక్కాయి. ఇప్పుడా పొజ్జి ఎలా ఉంది.. ఏం చేస్తోందని పలువురు ఆరా తీస్తుండగా ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పూవర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఓయ్ పారా అనే చిన్న పల్లెలో ఊరికి చివరగా అడవికి దగ్గరగా పాకలో మడ్వి పొజ్జి నివసిస్తోంది. ఆ పాకలో తిండి గింజలు దాచుకునేందుకు వీలుగా చుట్టూ కర్రలతో కట్టిన ఒక గది ఉంది. ఆ గదికి ఉన్న కర్ర తలుపులు జంతువులు లోపలికి పోకుండా తాళ్లతో కట్టి ఉన్నాయి. తాళం కూడా లేని ఇంట్లో ఆమె జీవిస్తోంది. గోండి భాషలో ఆమె చెప్పిన విషయాలను అక్కడ తెలుగు తెలిసిన మరో ఆదివాసీ యువకుడు తర్జుమా చేసి చెప్పిన వివరాల ఆధారంగా... ‘నా కొడుకు ఉన్నప్పుడు ఎవరూ ఇటు రాలేదు.ఇవన్నీ నాకెందుకు ? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. కొందరు దుప్పట్లు, బట్టలు ఇస్తున్నారు. ఇంకొందరు డబ్బులు ఇస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా, దాచమని నీ కొడుకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు అని అడుగుతున్నారు. వాడు (హిడ్మా) పార్టీలోకి వెళ్లిన తర్వాత నన్ను కలిసింది తక్కువ. మాట్లాడింది తక్కువ. నాకు వాడు ఇచ్చిన, మీరు ఇచ్చినా... అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? అసలు వాటితో నాకు ఏం అవసరం ఉంది’అంటూ పూవర్తిపైకి దండెత్తి వస్తున్న మీడియా బృందాలపై పొజ్జి కోప్పడింది. ఆయన మాటలు నమ్మాను‘ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ మా ఊరికి వచ్చాడు. మాతో మాట్లాడాడు. మాతో కలిసి అన్నం తిన్నాడు. ‘నీ కొడుకును లొంగిపొమ్మని చెప్పమ్మా’అని అడిగాడు. ‘వాడు నా మాట వినడయ్యా.. జనం కోసమని పోయిండు, నేను రమ్మంటే రాడు’అని చెప్పిన. ‘లేదమ్మా! మేము చెబితే అతను రావడం లేదు. నీ కొడుకు నీ మాట వింటాడు, నువ్వు చెబితే తప్పకుండా వస్తాడు. ఒక్కసారి అజ్ఞాత జీవితం వదలి రమ్మని అతనికి నువ్వు చెప్పు’అని అడిగాడు. అంత పెద్దమనిషి మా ఊరికి వచ్చి అడుగుతున్నాడు కదా అని మనసులో ఇష్టం లేకపోయినా లొంగిపో కొడుకా అని చెప్పాను. (హిడ్మాను లొంగిపొమ్మంటూ ఆమె చెబుతున్నట్టుగా వీడియోను గతంలో షూట్ చేసి రిలీజ్ చేశారు). ఆయన (విజయ్ శర్మ) మాటల మీద నమ్మకం ఉంచుకున్న.నా కొడుకు లొంగిపోయి ఇంటికి వస్తాడని ఆశలు పెట్టుకున్న. కానీ కొన్ని రోజులకే నా కొడుకును శవంగా మార్చి ఇంటికి పంపారు. ఆ రోజు (విజయ్ శర్మ పూవర్తికి వచ్చిన రోజు)న జరిగింది గుర్తుకు వస్తేనే అంటూ చెప్పే ప్రయత్నంలో ఆమె గొంతు బాధతో పూడుకుపోయింది. మాటలు ఆగిపోయాయి, కానీ కన్నీళ్లు ఆగలేదు. కొద్ది సేపటికే దుఃఖం నుంచి తేరుకుంది. చేతిలో కొడవలి పట్టుకొని, నాకు పని ఉంది అంటూ ఆమె నివసిస్తున్న పాకను ఆనుకొని ఉన్న పొలం వైపు అడుగులు వేసుకుంటూ సమీపంలోని అడవిలోకి పొజ్జి వెళ్లింది.:::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
బడిపై చలి దాడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వణికించే చలిలో ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లడానికి పిల్లలు మారాం చేస్తున్నారు. మరోవైపు వారు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో పాఠశాలల్లో హాజరు శాతం పడిపోతోంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో పాఠశాలల వేళల మార్పునకు ఇది కారణమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో అయితే అరకొరగానే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు లేని చోట్ల బోధన చేపట్టడం లేదు.చలిలో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం కూడా సమస్యగా మారింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లల్లో విద్యార్థులు చలికి వణికి పోతున్నారు. గీజర్లు పనిచేయని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల కిటికీలకు తలుపులు కూడా లేవు. దీంతో విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకోలేక అష్టకష్టాలూ పడుతున్నారు. ఉదయం ఓ యజ్ఞం పొద్దున్నే నిద్ర లేచేందుకు విద్యార్థులు బద్ధకిస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుని పాఠశాలకు తయారవ్వడం ఓ యజ్ఞంగా మారుతోంది. ఆలస్యంగా నిద్రలేవడం, హడావుడిగా స్కూలుకు వెళుతుండటంతో అల్పాహారం తీసుకునేందుకు వీలవడం లేదు. విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే..తల్లిదండ్రులకూ ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లల కన్నా ముందే లేచి బాక్సు సిద్ధం చేయడం చలిలో కష్టమవుతోందని అంటున్నారు. ఇక ఉద్యోగం చేసే తల్లిదండ్రుల అవస్థలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. హాజరు అంతంత మాత్రమే వారం రోజులుగా ప్రాథమిక పాఠశాలల్లో హాజరు 46 శాతం మించడం లేదని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 480 ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లల్లో 10 మందికి మించి విద్యార్థులు హాజరవ్వడం లేదు. ఉన్నత పాఠశాలల్లో కేవలం టెన్త్ క్లాస్ విద్యార్థుల హాజరు మాత్రమే కాస్త ఎక్కువగా ఉంటోంది. వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండటంతో కష్టంగానైనా వాళ్లు స్కూలుకు హాజరవుతున్నారు. అయితే వీళ్ళల్లో చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఇక ప్రత్యేక తరగతులంటే విద్యార్థులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. స్కూలుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఒకటి రెండు క్లాసులు ఉండగానే ఇళ్లదారి పడుతున్నారు. ఇదీ సంగతి! ⇒ సంగారెడ్డి, కుమురం భీం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల లోపే ఉంటున్నాయి. ఈ జిల్లాల్లో వారం రోజులుగా విద్యార్థుల హాజరు శాతం 20 నుంచి 38 శాతం వరకు పడిపోయింది. 50 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కొన్ని రోజులుగా 10కి మించడం లేదు. ⇒ ఆదిలాబాద్, కుమురం భీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 100కు పైగా స్కూళ్లల్లో 50 శాతం లోపే హాజరు ఉంటోంది. ప్రైవేటు స్కూళ్లల్లోనూ వారం రోజులుగా హాజరు 25 శాతం వరకూ పడిపోయింది. హైదరాబాద్‌లోని పలు స్కూళ్లల్లో దాదాపు 20 శాతం మంది విద్యార్థులు ఆలస్యంగా వస్తున్నారు. ⇒ మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విద్యార్థులు జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. వీళ్లు స్కూళ్లకు వచ్చినా త్వరగా వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. టీచర్లు కూడా చాలామంది సెలవుల్లో ఉంటున్నారు. టెట్ కోసం కొందరు, ఇతర కారణాలతో మరికొందరు సెలవులు పెడుతుండటంతో బోధన అరకొరగానే సాగుతోంది. ⇒ నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుము రం భీం సహా పలు జిల్లాల సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థు లు చలికి వణికి పోతున్నారు. అనేకచోట్ల గీజర్లు పని చే యడం లేదు. ఇతర వసతుల లోపం కూడా కన్పిస్తోంది. చలికి భయ‘బడి’! ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటల వరకు బయటే కూర్చోవలసి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కనిపించిన ఈ దృశ్యం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆధునికత, ఆధ్యాత్మికతల సమ్మేళనమే మన బలం
సాక్షి, హైదరాబాద్: ఆధునికత,ఆధ్యాత్మికతల సమ్మేళనమే మన నాగరికతకు అతిపెద్ద బలమని రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము అన్నారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో నిర్వహించిన ‘భారతదేశ శాశ్వత జ్ఞానం: శాంతి, ప్రగతికి మార్గాలు’అంశంపై జరిగిన సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ..సమాజం అనేక మార్పులకు లోనవుతోందని, ఈ మార్పులతో పాటు మనమూ మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత, మానవీయ విలువల క్షీణత వంటి అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు.సదస్సు కోసం ఎంచుకున్న అంశం చాలా సందర్భోచితంగా ఉంద న్నారు. భౌతిక అభివృద్ధి మాత్రమే సంతోషాన్ని, శాంతిని తీసుకురాలేదని, అంతర్గత స్థిరత్వం, భావోద్వేగ మేధస్సు, విలువలతో కూడిన జీవన విధానం అత్యంత అవసరమన్నారు. సత్యం, అహింస, శాంతియుత సహజీవనం అనే సందేశాన్ని భారతీయ పురాతన ఋషి సంప్రదాయం మనకు ఇచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘వసుధైక కుటుంబం అనే భావన ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా భావించే ఆలోచన. ఇది నేటి ప్రపంచ శాంతికి అత్యంత అవసరం. సామాజిక ఐక్యతకు, జాతీయ ప్రగతికి ఆధ్యాత్మికత ఒక బలమైన పునాదిగా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మానసిక స్థిరత్వం, నైతిక విలువలు, ఆత్మ నియంత్రణను పెంపొందించుకున్నప్పుడు, వారి ప్రవర్తన సమాజంలో క్రమశిక్షణ, సహనం, సహకారాన్ని పెంపొందిస్తుంది’అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దశాబ్దాలుగా బ్రహ్మకుమారీస్ సంస్థ భారతీయ విలువలను వివిధ దేశాలకు విస్తరింపజేయడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలలో శాంతి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా ఈ సంస్థ సమాజం నైతిక, భావోద్వేగ నిర్మాణాన్ని బలోపేతం చేస్తోందని కొనియాడారు. -
బీఆర్ఎస్ హయాంలో జల వివాదాలపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరున లేదా జనవరి తొలివారంలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో జలవివాదాలు–వాస్తవాలు అనే అంశంపై రోజంతా చర్చ జరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అధికారులు నివేదికతో సిద్ధంగా ఉండాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉతమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) మొహమ్మద్ అంజాద్ హుస్సేన్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ కె.ప్రసాద్‌తో సమీక్షించారు.తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదలశాఖలో తీసుకున్న నిర్ణయాలతో కలిగిన నష్టాలపై నివేదిక ఉండాలన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ కట్టకుండా మేడిగడ్డకు తరలించడం వల్ల కలిగిన నష్టాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. కాళేశ్వరం బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిన అంశాలను నివేదికలో చేర్చాలని సూచించారు.ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో రాష్ట్ర అవతరణ అనంతరం ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 290 టీఎంసీలు చాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించిన విషయాన్ని కూడా చేర్చాలని నిర్దేశించారు. పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీతోపాటు కృష్ణా బేసిన్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని కూడా నివేదికలో పేర్కొనాలని మంత్రి ఉత్తమ్ నిర్దేశించారు. ‘బేసిన్లు లేవు... భేషజాలు లేవు’అంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలతోపాటు నాడు ఏపీ సర్కార్‌తో జరిగిన చర్చలన్నీ నివేదికలో రికార్డు కావాలన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగాల్లో నైతికతకూ చోటివ్వాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలనను ముందుకు నడిపే అధికారులు, ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో నైతికతకూ ప్రాధాన్యం ఇవ్వాలని.. ఈ దిశగా పబ్లిక్ సర్విస్ కమిషన్లు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. నేటి పాలనకు కేవలం చదువుల ప్రతిభ ఒక్కటే చాలదన్నారు. నైతికంగా నిర్ణయం తీసుకునే శక్తి, భావోద్వేగ మేధస్సు, నాయకత్వ లక్షణాలు, టీమ్‌వర్క్ చేయించే సత్తా తప్పనిసరి అన్నారు. అలాంటి వారే దేశ సేవలో ముందు వరుసలోకి వస్తారని చెప్పారు. పబ్లిక్ సర్విస్ కమిషన్ (పీఎస్సీ)ల రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను సాధించాలంటే పరిపాలన నాణ్యతతోపాటు పాలనను నడిపించే వ్యక్తుల నాణ్యత కూడా కీలకమన్నారు.దేశ పాలనా వ్యవస్థల నాణ్యత, సమగ్రత, సమర్థతను తీర్చిదిద్దడంలో పీఎస్సీల పాత్ర కీలకమని చెప్పారు. అర్హత, నిష్పక్షపాత ధోరణి, నైతికత కలిగిన అధికారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత పీఎస్సీలపై ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన స్వతంత్రత వల్లే పీఎస్సీలు ప్రతిభ, న్యాయం, పారదర్శకతలను కాపాడగలుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పీఎస్సీలు నిష్పక్షపాత నియామకాల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని.. పరిపాలనా స్థిరత్వాన్ని నిలబెట్టాయని ప్రశంసించారు.డిజిటల్ గవర్నెన్స్, మౌలికవసతుల అభివృద్ధి వంటి జాతీయ ప్రాధాన్యాల అమలు అధికారుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందన్నారు. చిన్నపాటి అవకతవకలు కూడా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, పరీక్షల్లో అక్రమాలను ఉపేక్షించొద్దని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఉన్నత ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జ్ఞానాధారిత పరీక్షలతోపాటు ప్రవర్తన, నైతిక నైపుణ్యాల్ని అంచనా వేసే విధానాలను కూడా పీఎస్సీలు పరిశీలించాలని సూచించారు. వ్యక్తిత్వం, నైతిక ప్రవర్తనే దేశ నిర్మాణానికి, ప్రజా విశ్వాసానికి పునాది అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.పాలనా వ్యవస్థకు పీఎస్సీలే వెన్నెముక: డిప్యూటీ సీఎం భట్టి ప్రభుత్వ పాలనా వ్యవస్థకు పబ్లిక్ సర్విస్ కమిషన్లే వెన్నెముక వంటివని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పారదర్శకతే పీఎస్సీలకు ప్రాణమని.. ప్రశ్నపత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకు ప్రతి దశలోనూ సందేహాలకు తావు లేకుండా వాటి పనితీరు ఉండాలన్నారు. పరీక్షల్లో జాప్యం వల్ల యువతలో నిరాశ పెరుగుతుందని.. అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రణాళికాబద్ధంగా పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందన్నారు. పోటీ పరీక్షల వార్షిక కేలండర్ అమలు ద్వారా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోందన్నారు. -
యాప్స్‌తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేథోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్‌తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్‌ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్‌ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్‌లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్‌లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్‌పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్‌తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సరీ్వస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్‌ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రాకతో.. ⇒ ఫుడ్ యాప్స్‌తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు.⇒ నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు⇒ కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు.⇒ 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు.. ⇒ భారత్‌లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ⇒ రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. ⇒ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. ⇒ మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది. -
‘చూపు’తో చెలగాటం!
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రి అది. అక్కడ ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు.. ఎంఎస్ (ఆప్తాల్మాలజీ) అని చెప్పుకుంటూ కంటి వైద్యులుగా చలామణి అవుతున్నారు. కానీ వాళ్లు కూడా కంటి చికిత్సలు చేయడం లేదు. కేవలం అక్కడ పనిచేసే టెక్నీషియన్లే కంటి పరీక్షలు మొదలు చికిత్సలు, కంటి అద్దాలు సిఫారసు చేయడం వరకు చేసేస్తున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి కంటి వైద్యుల పేర్లతో అనుమతులు పొందినప్పటికీ, ఆప్తాల్మాలజీ, ఆప్టోమెట్రీ టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బహిర్గతమైన ఈ తరహా కంటి వైద్యుల బాగోతాలు విస్మయం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ కంటి ఆసుపత్రులు, అర్హతల్లేని నకిలీ వైద్యుల అక్రమాలపై టీజీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్ మిర్యాలగూడ ఎగైనెస్ట్ క్వాకరీ’(చికిత్సలకు అర్హతలేని ఆస్పత్రుల తనిఖీలు) కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన టీజీఎంసీ బృందం, పట్టణంలో కంటి వైద్య సేవల పేరుతో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చింది.టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ కె. మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు సభ్యులు డా. వి.నరేష్కుమార్, డా. కె.రవికుమార్, డా. జె.శ్రీకాంత్ వర్మ, విజిలెన్స్ అధికారి ఎం.రాకేశ్‌లతో కూడిన బృందం పట్టణంలోని పలు కంటి ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తనిఖీ చేయగా పలు అక్రమాలు వెలుగుచూశాయి. ఒక్క ఆస్పత్రిలో కూడా నిపుణులు లేరు! శ్రీ వెంకటేశ్వర (ఎస్వీ) ఐ హాస్పిటల్, శ్రీ మహాలక్ష్మి కంటి ఆస్పత్రి, అన్నపూర్ణ నేత్రాలయం, యశస్వి కంటి ఆస్పత్రి, షాలిని ఐ క్లినిక్, రఫా విజన్ కేర్ సెంటర్, శివ సాయి కంటి ఆస్పత్రి తదితర కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఏ ఒక్క కంటి ఆసుపత్రిలో కూడా అర్హత గల (ఎంఎస్– ఆఫ్తాల్మాలజీ) కంటి వైద్య నిపుణులు ప్రత్యక్షంగా పని చేయకపోవడం అధికారులను విస్మయపరిచింది. ఆయా ఆస్పత్రులు నిపుణులైన కంటి వైద్యులు లేకుండానే మందులు, పరీక్షలు సూచించడం, పరీక్షలు చేయడం, కొన్నిచోట్ల శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నట్లు ఈ బృందం గుర్తించింది. వీటికి సంబంధించి అనుమతులు పొందిన కంటి వైద్యులు హైదరాబాద్, ఇతర నగరాల్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నట్లు టీజీఎంసీ తేల్చింది. ఇక్కడ పరిస్థితి దారుణంమిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి, షాలిని కంటి ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉందని టీజీఎంసీ అధికారులు వెల్లడించారు. ఎంబీబీఎస్ మాత్రమే చదివిన డా.ఎం.భరత్ భూషణ్, డా.కె.వెంకటేశ్వర్లు తాము ఎంఎస్ (ఆప్తాల్మాలజీ) చేసినట్లు తప్పుడు వివరాలు ప్రదర్శిస్తూ, కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేసుకుంటూ, కేవలం టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నడుపుతున్నట్లు తేలింది. ఆయా నకిలీ డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్‌ప్రాక్టీసెస్ కమిటీ ముందు విచారణ చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అవసరమైతే వారి ఎంబీబీఎస్ డిగ్రీ లైసెన్సులను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ⇒ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉండి టెక్నీషియన్ల ద్వారా ఇక్కడ ఆసుపత్రులు నిర్వహిస్తున్న కంటి వైద్య నిపుణులు డా.శ్రీకుమార్, డా.ప్రభు చైతన్య, డా.బïÙర్, డా.అమర్‌లకు కౌన్సిల్ నుంచి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ⇒ కోమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకుడు ఎ.కోటేశ్వర్రావు ఎలాంటి అర్హతలు లేకుండానే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో బెడ్లు ఏర్పాటు చేసి, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇష్టానుసారంగా ఇస్తున్నట్లు గుర్తించారు. మరో నకిలీ వైద్యుడు, ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు మునీర్ తనిఖీల సమాచారం తెలిసి పరారైనట్లు అధికారులు తెలిపారు. ⇒ అర్హత లేకపోయినా కంటి వైద్యం నిర్వహిస్తున్న టెక్నీషియన్లు నాగేష్ , వాల్కె శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వరరావు, వెంకటేష్, వికాస్ కుమార్, అలాగే నకిలీ వైద్యుడు ఎ.కోటేశ్వరరావుపై ఎన్ఎంసీ, టీఎంపీఆర్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ సభ్యులు తెలిపారు. ⇒ కంటి ఆసుపత్రుల అవకతవకలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేయనున్నట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డా.వి.నరేష్ కుమార్ తెలిపారు. అర్హతకు మించి వైద్యం చేయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం, లింగ నిర్ధారణ, అ క్రమ గర్భస్రావాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని డా.కె.రవికుమార్, డా.జె.శ్రీకాంత్ స్పష్టం చేశారు. -
అందరికీ మత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుని శిక్షించడానికి వీలుగా త్వరలోనే శాసనసభలో విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో ఇతర మతాలను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాల్లో అలాంటి చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. అన్ని మతాలకు సమానమైన హక్కు, అధికారం, స్వేచ్ఛను అందిస్తామని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ను పురస్కరించుకుని క్రైస్తవులకు ఇచి్చన విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మరణించినప్పుడు కూడా ప్రభుత్వానిదే బాధ్యత ‘రాష్ట్రంలో ఇప్పటికే ఎవరి మతాన్ని వాళ్లు ఆచరించుకుంటూ ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని తీసుకొచ్చాం. మత ప్రాతిపదికన దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, ఘటనలకు పాల్పడినా కఠినంగా అణచివేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకు అందించే సంక్షేమం, అభివృద్ధి ఎవరి దయ కాదు.. వాళ్ళ హక్కు. మైనారిటీల హక్కులను కాపాడటంతో పాటు భంగం వాటిల్లినా సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మైనారిటీలకు శ్మశానవాటికల సమస్య ఉంది. స్థల సమస్య కారణంగా ఊరికి కొంచెం దూరమైనా ప్రభుత్వ భూమిæ కేటాయిస్తాం. స్థానికంగా అంబులెన్సులను ఏర్పాటు చేసుకుని అక్కడికి తీసుకెళ్ళాలి. బతకడానికి ఇల్లు ఇచ్చినప్పుడు, మరణించినప్పుడు వాళ్ళను ఎక్కడికి తీసుకువెళ్ళాలనేది కూడా ప్రభుత్వ బాధ్యతే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. డిసెంబర్ అద్భుతమైన నెల ‘డిసెంబర్ క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాదు..యావత్ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మిరాకిల్ మంత్ (అద్భుతమైన నెల). ఈ మాసంలో యేసు ప్రభువు జన్మించి ప్రపంచానికి శాంతి సందేశం అందించి అందరినీ సన్మార్గంలో నడిపించారు. ఈ నెలలోనే సోనియాగాంధీ తన జన్మదిన కానుకగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల 60 ఏళ్ల బలమైన ఆకాంక్షను సాకారం చేశారు. అలాగే ఇదే మాసంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ సమాజానికి ఒక మిరాకిల్. ఈ రెండేళ్లలో ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టినా, ఆరోపణలు చేసినా, ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా, శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాం.రాష్ట్రంలో ఈ రెండేళ్లలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం దాదాపుగా రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టింది. 65 లక్షల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ఆడబిడ్డలకు రూ.27 వేల కోట్ల రుణాలు సున్నా వడ్డీతో అందించి ఆర్థికంగా ఆదుకుంది. రేషన్‌కార్డు కలిగిన ప్రతి పేదవాడికి ప్రతి నెలా ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా రూ.500 బోనస్ ఇస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని సీఎం వివరించారు. తెలంగాణ నంబర్ 1గా ఉండేలా ప్రభువును ప్రారి్థంచాలి ‘క్రిస్టియన్ మిషనరీస్ ఒక యుద్ధం మాదిరిగా విద్య, వైద్య రంగాల్లో సేవలు అందించడం ప్రశంసనీయం. ప్రభుత్వాలతో సమానంగా పేదలకు సేవలు అందించడం వల్లే నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికే మేధస్సును అందించే సైంటిస్టులను, ఇంజనీర్లను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆనాడు మనిషి జీవన ప్రమాణం 32 సంవత్సరాలుంటే తాజాగా మిషనరీ సంస్థల సేవలతో సరాసరి 72కు పెరిగింది. ’తెలంగాణ రైజింగ్’ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి.దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి. అలా ముందుకు వెళ్లేలా శక్తిని ప్రసాదించడానికి ప్రభువును ప్రారి్థంచాలి..’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్‌రావు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. -
జాతీయ ఇంధన పరిరక్షణ ఉద్యమానికి మేము సైతం !
హైదరాబాద్, డిసెంబర్ 19: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలోనూ, భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన నిబద్ధతను చాటుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే లక్ష్యంతో జాతీయ ఇంధన పరిరక్షణ ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించింది. కోటిమందికిపైగా జనభాతో ప్రపంచంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా జీహెచ్ఎంసీ వెలుగొందుతోంది. త్వరలోనే ఈ జనాభా సంఖ్య 1.12 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రజా పరిపాలన, పట్టణ ప్రణాళిక, పారిశుధ్యం మరియు రహదారి మౌలిక సదుపాయాలలో జీహెచ్ఎంసీ కీలక పాత్ర పోషిస్తుంది. నగర అభివృద్ధి ఎజెండాలో భాగంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి కార్పొరేషన్ ఇంధన సామర్థ్యం (ఈఈ), ఇంధన పరిరక్షణ (ఈసీ) లకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో జీహెచ్ఎంసీ నగరం అంతటా సుమారు 5.53 లక్షల ఇంధన-సమర్థవంతమైన ఎల్ఈడీ వీధి దీపాలను విజయవంతంగా పునరుద్ధరించింది. ఈ చొరవ కేంద్రం వీధి దీపాల జాతీయ కార్యక్రమం (ఎస్ఎల్ఎన్పీ) కింద అమలు చేయబడిన మెట్రోపాలిటన్ నగరాల్లో భారతదేశంలోని అతిపెద్ద ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఇప్పుడు ప్రపంచ సాంకేతికతలు మరియు అంతర్జాతీయ సేవా ప్రమాణాలను స్వీకరించడం ద్వారా హైదరాబాద్ వీధి దీపాల కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం జాతీయ ఇంధన సామర్థ్య నిపుణులతో సంప్రదించి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యతసామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తూ కేవలం ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణపైనే కాకుండా పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణపై కూడా జీహెచ్ఎంసీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేస్తోందని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ పేర్కొన్నారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆయన హైదరాబాద్ వాతావరణ కార్యాచరణ వ్యూహంలో ఇంధన సామర్థ్యం పాత్రను హైలైట్ చేసే సమగ్ర నివేదికను ఆవిష్కరించారు. ఈ నివేదికను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మీడియా సలహాదారు ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈఎస్ఎల్ మరియు తెలంగాణ ప్రభుత్వంలోని రాష్ట్ర నియమించబడిన ఏజెన్సీ టీఎస్ రెడ్కో సహకారంతో రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఇంధన సామర్థ్యం మాత్రమే 40 శాతానికి పైగా దోహదపడుతుందని చెప్పారు. ఇది ప్రపంచ అవసరాన్ని పెంచుతుందని తెలిపారు. అదుపులేని మానవ కార్యకలాపాలు గాలి, నీరు మరియు నేల కాలుష్యానికి దారితీశాయని ఆవేదన వ్యక్తంచేశారు. వన్యప్రాణులు, మానవ ఆరోగ్యం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని గుర్తుచేశారు. కమిషనర్, బీఈఈ ఆర్థిక సహాయంతో టీఎస్ రెడ్కో ద్వారా అమలు చేయబడిన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని కూల్ రూఫ్ పైలట్ ప్రాజెక్టును కూడా అభినందించారు. సుమారు 36,746 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వాతావరణ మార్పులను తట్టుకోగల మరియు ఇంధన సామర్థ్యం గల క్యాంపస్‌ను సృష్టించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రశంసించారు. దీని ద్వారా ఏటా 7 వేల కిలోవాట్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేశామన్నారు.నగరంలో ఇంథన సామర్ధ్య ఫలితాలు ఇలాహైదరాబాద్ ఇంధన సామర్థ్య కార్యక్రమాల యొక్క స్పష్టమైన ఫలితాలను హైలైట్ చేస్తూ ఈఈఎస్ఎల్ కొన్ని వార్షిక ప్రయోజనాలను నివేదించింది. వాటిలో 238.83 మిలియన్ యూనిట్లు ఇంధన ఆదా చేసినట్లు తెలిపింది. ఇక గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో తగ్గింపులో భాగంగా 59.49 మెగావాట్లు తగ్గించినట్లు పేర్కొంది. దీనిద్వారా వార్షిక వ్యయ పొదుపు రూ. 193.45 కోట్లు మేర అయ్యిందని వెల్లడించింది. కార్బన్ ఉద్గారాలను 0.19 మిలియన్ టన్నులు తగ్గించామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో ఈఈఎస్ఎల్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 15.41 లక్షల వీధి దీపాలలో జీహెచ్ఃఎంసీ పరిధిలో 5.53 లక్షల ఎల్ఈడీ వీధి దీపాల రెట్రోఫిట్టింగ్ను పూర్తి చేసింది. పట్టణ పాలనను జాతీయ వాతావరణ లక్ష్యాలు, ప్రపంచ ఉత్తమ పద్ధతులు మరియు పౌర-కేంద్రీకృత సుస్థిరత ఫలితాలతో సమలేఖనం చేయడానికి తాము గట్టిగా కట్టుబడి ఉన్నామని జీహెచ్ఎంసీ పునరుద్ఘాటించింది. -
ఆత్మహత్యా..? జారి పడ్డారా..?
యాదగిరిగుట్ట రూరల్: నవ దంపతుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ శివారులో గురువారం అర్ధరాత్రి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి నవ దంపతులు కోరాడ సింహాచలం (25), కొంగరపు భవాని(19) మృతి చెందారు. చనిపోవడానికి ముందు రైలు లో సింహాచలం, భవాని ఏదో విషయంపై గొడవ పడుతుండగా, తోటి ప్రయాణికులు తీసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో గొడవ జరిగిన తర్వాతే భార్యాభర్తలిద్దరూ రైలు నుంచి కిందపడిపోయారని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నారా.? లేదా భార్యను సముదాయిస్తున్న క్రమంలో ఇద్దరూ కలిసి జారి పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఎవరు చిత్రీకరించారనే దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. -
దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: రేవంత్ సర్కార్ హానీమూన్ ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వాళ్లు ఆదారాలతో సహాదొరికారని అయినప్పటికీ వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్‌కు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదు గానీ తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుతానని కేటీఆర్ అన్నారు. ఆయన ఇంట్లోని మహిళలు, పిల్లలు, మనమడి గురించి మాట్లాడి తన మాదిరి చిల్లర రాజకీయాలు చేయనని తెలిపారు. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని అది పెద్ద కామెడీలా అనిపిస్తుందన్నారు. కొంతమంది తనను ఐరన్ లెగ్ అంటున్నారని తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకే 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీ స్థానాలు గెలిచామన్నారు. రేవంత్ సీఎం అయ్యాక కనీసం సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేక పోయాడని కేటీఆర్ విమర్శించారు. కనుక తాను ఐరన్ లెగ్ కాదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఐరన్ లెగ్ అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ప్రజల్లోకి రానున్నారని ఆయన బహిరంగ సభలలో పాల్గొనే అంశం రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)
-
టాస్క్ ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ షాక్
సాక్షి, హైదరాబాద్: ఓ మంత్రి ఇంటి వద్ద గలాబా.. ఓ నిందితులు ఎస్కేప్ కావడానికి సహకారం.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం.. అందిన చోటల్లా ఆమ్యామ్యాలు... ఇలా వరుస వైఫల్యాలు, వివాదాలు, అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతూ సుప్తచేతనావస్థలో ఉన్న నగర పోలీసు విభాగం ప్రక్షాళనను కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ప్రారంభించారు.సిటీ కాప్స్‌కు వెన్నెముక లాంటి టాస్‌్కఫోర్స్‌తో దీనికి శ్రీకారం చుట్టారు. ఇందులోని ఏడు బృందాల్లో పని చేస్తున్న 65 మందిని ఒకేసారి సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగానికి అటాచ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సుదీర్ఘకాలంగా టాస్క్ ఫోర్స్‌లో పని చేస్తున్న వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లూ ఉన్నారు. వీరి స్థానంలో తాత్కాలికంగా వివిధ ఠాణాల నుంచి 22 మంది కొత్తవారిని నియమించారు. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐతో పాటు హెడ్–కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారు.సైబర్ క్రైమ్, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ ఇలా మిగిలిన విభాగాలనూ ప్రక్షాళన చేయడానికి కొత్వాల్ సన్నాహాలు చేస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరకు వివిధ హోదాల్లో పని చేస్తున్న వారి పూర్వాపరాలపై సమగ్ర విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 15 మంది ఇన్స్పెక్టర్లు, ఏడుగురు ఏసీపీల వ్యవహార శైలిపై సజ్జనర్‌కు నివేదికలు అందినట్లు సమాచారం. త్వరలోనే కమిషనరేట్‌లో పని చేస్తున్న ఇన్స్పెక్టర్, సబ్–ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.‘చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి ఏదైనా నేరం చేస్తే... ఆ నేరానికి సంబంధించి సాధారణ వ్యక్తులకు విధించే శిక్ష కంటే ఎక్కువ శిక్ష వేయాలి’ అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు పునరుద్ఘాటించిన అంశమిది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ పోలీసు కమిషనర్ సజ్జనర్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని ఏకంగా అరెస్టు చేస్తున్నారు. ఇటీవల రోజుల్లోనే ఇద్దరు కానిస్టేబుళ్లు కటకటాల్లోకి వెళ్లిన విషయం విదితమే.క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి తొలి ప్రతినిధిగా ఉండేది పోలీసులే. ఈ నేపథ్యంలో క్రమ శిక్షణ కలిగి ఉండాల్సిన విభాగాల్లో దీన్ని మొదటిదిగా పరిగణిస్తారు. ఈ అధికారులు, సిబ్బందికి ఎన్ని అధికారాలు ఉంటాయో.. విధి నిర్వహణ అంత సున్నితంగా ఉంటుంది. తమకు ఉన్న అధికారాలు, హోదా తదితరాలను దుర్వినియోగం చేస్తూ వివాదాస్పదమయ్యే వాళ్లూ ఎక్కువగానే ఉంటారు.ఒకప్పుడు ఏ స్థాయి ఆరోపణలు వచ్చినా, వాటి తీవ్రత ఎలా ఉన్నా బదిలీ వేటు వేయడమో, హెడ్–క్వార్టర్స్‌కు ఎటాచ్ చేయడమో చేసేవాళ్లు. ఉన్నతాధికారులు చాలా వరకు మెమోలు, చార్జ్‌మెమోలు, సస్పెన్షన్ల వరకే వెళ్లేవాళ్లు. ఇది కొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయి అధికారులకు అలుసుగా మారింది. దీంతో ప్రస్తుత ఉన్నతాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సివిల్ వివాదంల్లో తల దూర్చడం, మామూళ్ల వసూళ్లు తదితర అంశాల్లో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకు మించి తీవ్రమైన ఆరోపణలు వస్తే మాత్రం ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, ఏరియాపై పట్టులేకున్నా, ఏ స్థాయిలో కట్టు తప్పినా వేటు తప్పదని కొత్వాల్ సజ్జనర్ స్పష్టం చేస్తున్నారు. -
మహబూబ్‌నగర్‌లో ఘనంగా టీజీఐసీ ‘ఇన్నోవేషన్ పంచాయత్’కార్యక్రమం
మహబూబ్‌నగర్,సాక్షి:రాష్ట్ర అంకుర వ్యవస్థను జిల్లాల్లోని ఔత్సాహిక ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులకు మరింత అందుబాటులోకి తీసుకువెళ్లే పనిలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC) శనివారం (20 డిసెంబరు, 2025) మహబూబ్‌నగర్‌లోని ఐటీ టవర్ వేదికగా ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి 250 మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు మరియు గ్రామీణ ఆవిష్కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, TGIC సీఈఓ మెరాజ్ ఫహీమ్, వారి బృందం కూడా పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. నిధుల సేకరణ (Funding), వ్యాపార విస్తరణ మరియు మార్కెటింగ్ మెళకువలకు సంబంధించి తమకున్న సందేహాలను నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు.ఒక సాధారణ 'వాక్-ఇన్' (Walk-in) ప్లాట్‌ఫామ్‌గా రూపొందించబడిన ఈ వేదికపై, ఆవిష్కర్తలు తమ ప్రోటోటైప్లను ప్రదర్శించారు. తెలంగాణ అంకుర వ్యవస్థ నుండి 12 మంది మెంటార్లతో వ్యవసాయ, ఆరోగ్య, లైవ్లీహుడ్ రంగాల్లో వారి ఆలోచనలను పరిశీలించి, తగిన సూచనలు మరియు సలహాలను అందించారు. మంచి ఆలోచనలు ఉన్నవారు హైదరాబాద్‌కు దూరంగా ఉన్నామనే కారణంతో వెనుకబడకూడదన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో మార్గదర్శకత్వం అందించడం మరియు ప్రభుత్వ సహకారాన్ని నేరుగా అందించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మూలకు స్టార్టప్ సంస్కృతిని తీసుకెళ్లాలని TGIC లక్ష్యంగా పెట్టుకుంది."ప్రోటోటైపింగ్, మార్కెట్ యాక్సెస్ మరియు ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులకు... ఇబ్బందులను తొలగించి మీ విజయానికి కావాల్సిన సాంకేతిక మరియు వ్యూహాత్మక సహకారాన్ని అందించడానికి TGIC సిద్ధంగా ఉందని మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, IAS తెలిపారు. ఇక్కడ ఉన్న వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మీకున్న సందేహాలన్నింటినీ అడిగి తెలుసుకుని, తదుపరి కార్యాచరణపై స్పష్టత తెచ్చుకోమని సూచించారు.తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సీఈఓ మెరాజ్ ఫహీమ్ మాట్లాడుతూ'ఇన్నోవేషన్ పంచాయత్' ద్వారా మేము జిల్లాల్లోకి వెళ్లి, మంచి ఆలోచనలు, ఆవిష్కరణలు ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించేలా చూస్తున్నామన్నారు.. వ్యవసాయ రంగంలో కొత్త పరికరాల నుండి పర్యావరణహిత ఇంధన వనరుల వరకు విభిన్నమైన ఆలోచనలను ఆవిష్కర్తలు ప్రదర్శించారు. -
రిపోర్ట్ ఇవ్వాల్సిందే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య, విద్య ప్రమాణాల పెంపు, పరిశోధనలకు పెద్దపీట వేస్తూ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మెడికల్ కాలేజీల పనితీరుపై ఎంసీఎంసీ (MCMC) కమిటీలు ఇకపై ప్రతి నెలా నివేదికలు ఇవ్వాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా 'స్పోకెన్ ఇంగ్లీష్'లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాసులు.. ప్రత్యేక టీచర్ల నియామకానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా ఉంచాలని మంత్రి అన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మెడికోల ఆత్మహత్యల నివారణకు కాలేజీల్లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.పెరిగిన కాలేజీలకు అనుగుణంగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ పటిష్టం చేయడానికి సిబ్బంది పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెల్త్ యూనివర్సిటీ సేవలను వేగవంతం చేసేలా కార్యకలాపాలన్నీ పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. -
సోషల్ మీడియాలో పోస్టులా.. అయితే ఇది మీకోసమే?
సోషల్ మీడియా ఈ రోజుల్లో దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ఏదో రూపకంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే న్యూస్ చూస్తుంటాం. కొన్ని సార్లు మెసేజ్‌లను ఫార్వర్డ్ చేస్తుంటాం. అయితే మనం ఫార్వడ్ చేసే సమాచారం వల్ల మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రచారం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజనిర్ధారణతో సంబంధం లేకపోవడం,ఎటువంచి ఖర్చు లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు ఇష్ఠారీతిన సోషల్ మీడియా ప్రచారం చేపడుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు సామాజిక మాధ్యమాలలో జరిగే అసత్య ప్రచారాల వల్ల మహిళలు, పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే వాటిపై సరైన అవగాహాన లేకపోవడంతో కొంతమంది అటువంటి మెసేజ్‌లను గమనించకుండా వేరే వారికి ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అటువంటి మెసేజ్‌లపై జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. మీరు రాసే వార్త నిజమో కాదో నిర్ధారించుకుని, ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో చేసే మేసేజ్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకూడదు. తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావొద్దు. సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ తప్పుడు వార్తలు సష్టించవద్దు.ఏదైనా మెసేజ్‌లను ఫార్వర్డ్ చేసే ముందు అది సరైందా కాదా దానివల్ల ఏవరి మనోభావాలైనా దెబ్బతింటాయా అనే విషయం గుర్తుంచుకోవాలని పోలిీసులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. -
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
-
రాజకీయాల్లోకి సినీ నటి ఆమని.. పార్టీలో చేరిక
ప్రముఖ సినీనటి ఆమని భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని తమిళ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే, రీఎంట్రీలో పలు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 5 చిన్న సినిమాల్లో ఆమె నటించారు.తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సినీ రంగం నుంచి చాలామంది తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరడం సహజమే.. కానీ, ఆమని బీజేపీలో చేరడం ప్రాధాన్యత ఉంది. సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే పలు సామాజిక అంశాల గురించి ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె వాయిస్ బీజేపీకి ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.ఆమని తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి భారీ హిట్ సినిమాల్లో నటించారు. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ (1993) సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు ఆఫర్స్ వరించాయి. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకున్నారు. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైన ఆమని తిరిగి 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో సినీ రంగప్రవేశం చేశారు. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు. -
ఈ బుకాయింపు ఆత్మవంచన కాదా?
గజం మిథ్య ,పలాయనం మిథ్య అని అంటారు. అందరూ శ్రీవైష్ణవులే.. రొయ్యల బుట్ట మాయం అని మరో సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభాపతి గడ్డం ప్రసాదకుమార్ ఇచ్చిన తీర్పును గమనిస్తే ఈ సామెతలు గుర్తుకు వస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పవర్ వైపు నడిచే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి మళ్లారు. వారిలో పలువురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పీ మరీ ఆహ్వానించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. అందరికి తెలిసిన ఈ సత్యం స్పీకర్‌కు తెలియకపోవడమే ఒక ప్రత్యేకత . ఆయనకు మాత్రం వీరు పార్టీ మారిన ఆధారాలు కనిపించలేదు. వారిపై అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పక్షాన లోక్ సభ ఎన్నికలలో పోటీచేశారు. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందించలేదు. బహుశా మరికొంతకాలం ఈ విచారణ తంతు సాగుతుందేమో తెలియదు. లేదా మరీ ఓపెన్ అయిపోయినందున కొద్ది కాలం తర్వాత ఆయన రాజీనామా చేస్తారా?లేక తప్పనిస్థితిలో అనర్హత వేటు వేస్తారా?అన్నది చూడాలి. మరో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకుని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యం. మాజీ స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు అయ్యారు. ఈయన విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహీపాల్ రెడ్డి అరికపూడి గాంధీలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయనవసరం లేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు యాదయ్య,సంజయ్ కుమార్ లపై కూడా నిర్ణయం రావల్సి ఉంది. దానం నాగేందర్ తప్ప మిగిలిన ఎమ్ఎల్యేలంతా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాదించారు. ఈ పదిమంది ఎ మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి గత ఏడాదిన్నరగా పోరాడుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ,జాప్యం చేస్తున్నారని హైకోర్టు ,సుప్రింకోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి సుప్రింకోర్టు మూడు నెలలలో దీనిపై తేల్చాలని స్పీకర్ ను ఆదేశించడంతో ఈ నిర్ణయం అయినా వెలువడింది. న్యాయ వ్యవస్త ఈ మాత్రం అయినా పట్టించుకోకపోతే ,ఈ తంతగం ఐదేళ్లపాటు సాగుతుండేది.ఇలా జరగడం మొదటిసారి కాదన్నది వాస్తవమే. బీఆర్ఎస్ కు ఈ విషయంలో అర్హత లేదన్న కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చలేం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తో సహా వివిధ విపక్షాల ఎమ్మెల్యేలు 38 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పట్లో ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుత సి.ఎమ్. రేవంత్ కూడా అదే పనిచేశారు. విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రేవంత్ తదితరులు న్యాయ పోరాటం చేశారు.కాని అది కొలిక్కి రాకుండానే ఎన్నికలు వచ్చే శాయి. ఒక చిన్న తేడా ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని,ఇతర పక్షాలను బీఆర్ఎస్ విలీనం చేసినట్లు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ విడత విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇద్దరు అనారోగ్యంతో మరణించారు.మిగిలినవారిలో పది మందే పార్టీ మారారు. అందువల్ల విలీన ప్రకటనకు అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు ఐదువేల చొప్పున శాసనసభ పక్షానికి విరాళం ఇస్తుంటే దానిని ఆ పార్టీ అంగీకరించిందని,అందువల్ల వారు బీఆర్ఎస్ వారే అనే చిత్రమైన కొత్త లాజిక్ ను రేవంత్ తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ ఫిరాయింపులన్నవి ఒక సమస్యగా మారింది. బీజేపీ కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసింది.అదే టైమ్ లో రాజ్యసభలో టీడీపీ ఎమ్.పిలు నలుగురిని బీజేపీలో విలీనం చేసుకుంది. ఇది కూడా అనైతికమే అయినా అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత, దివంగత శరద్ యాదవ్ ఒక సభలో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనపై అతి వేగంగా వెంకయ్య అనర్హత వేటు వేశారు. ప్రభుత్వపక్షం నుంచి ఎవరైనా పార్టీ మారితే మాత్రం అధ్యక్ష స్థానంలో ఉన్నారు అలా స్పందిస్తారన్నమాట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వ పక్షంలోకి వస్తే ఇలాంటి విచారణలు,తీర్పులు వస్తుంటాయని అనుకోవాలి. వైఎస్సార్సీపీ ఎమ్.పి రఘురామకీష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాను పదే,పదే కోరినా, కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేశారేకాని అనర్హత వేటు వేయలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తుంటుంది.ఏపీలో చంద్రబాబు నాయుడు గత టరమ్ లో వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా న లుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎవరిపై చర్య తీసుకోలేదు. కెసిఆర్ కూడా తొలి టరమ్ లో తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీలో ఉండగానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అయినా వీరిలో ఎవరికి ఏమీ కాలేదు. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజలకు నీతి వచనాలు చెప్పవలసిన ప్రజాప్రతినిధులు తామే అబద్దాలు చెబుతూ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ అప్రతిష్టపాలు అవడానికి సిద్దపడుతున్నారు తప్ప రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజివ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుల నిరోదక చట్టం వచ్చింది.ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు ఆయన కుమారుడైన లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ తదితరులకు కూడా తెలుసు.అయినా వారు కూడా దీనిని ఆపడం లేదు.దాంతో కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు కోల్పోతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకే పనిచేస్తున్నారని,తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిజెపి,బీఆర్ఎస్ లు విమర్శించాయి. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తప్ప నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండడం లేదు.ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి,జి.నారాయణరావు వంటి గట్టి స్పీకర్ లు ఉండేవారు.అవసరమైతే వారు ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి కూడా ఆదేశాలు ఇవ్వడానికి వెనుకాడేవారు. చాలావరకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది.గతంలో కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన కేసులో వారిపై అనర్హత వేటు వేశారు. కాకపోతే విచారణ పేరుతో ఆలస్యం చేశారన్న విమర్శ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యేలపై సకాలంలో అనర్హత వేటు వేయకుండా ఉప ఎన్నికలు రాకుండా చేశారన్న విమర్శ ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి,పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఈ విషయాలలో వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మినహాయింపు ఇవ్వాలి. ఆయన కాంగ్రెస్ ను వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్న తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేసి మళ్లీ గెలిచారు. అలాగే తన పార్టీలోకి రాదలచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారే తప్ప, అనైతికంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయం పాటించేవారు అరుదుగానే ఉంటున్నారని చెప్పాలి. ఈ ఫిరాయింపులకు పరిష్కారం వెదకవలసి ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణ రాగానే మూడు నెలలు లేదా ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. లేదా ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకునేలా అధికారం ఇవ్వాలన్న సూచన ఉన్నప్పటికీ, అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే వింటోందన్న విమర్శలు ఉన్నాయి.ఏది ఏమైనా ఈ ఫిరాయింపుల సమస్యవల్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలలో పలచన అవుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే తన అనర్హత పిటిషన్ ను కొట్టివేశాక ఒక వ్యాఖ్య చేశారు. పాలకు,పాలు, నీళ్ళకు నీళ్లు మాదిరి తేలిందని అన్నారు. కాని వాస్తవం వేరు. పాలల్లో నీళ్లు కలిశాయన్నది వాస్తవం. కండువా కప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. దానిని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం అంటే అది ఆత్మవంచన కాకుండా మరేమవుతుంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడటంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రాజేంద్రనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్‌పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, ఆరు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
సర్పంచ్ ఎన్నికలు.. 18 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపు విజయం సాధించారు. అయితే, పంచాయతీ ఎన్నికలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలు జిల్లాల నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయమై సీఎం రేవంత్ సహా నేతలు సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రెబల్స్‌ను బుజ్జగించకపోవడం.. సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్ అయినట్టు తెలిసింది. కాగా, భవిష్యత్‌లో ఇది రిపీట్ అయితే ఉరుకునేది లేదని సీఎం రవంత్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు.. ఎల్లుండి మధ్యాహ్నం పీసీసీ ఛీఫ్, మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నేతలు విశ్లేషించుకోనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.హస్తం జోరు.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. మూడు విడతల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, రెండో దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మూడో విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. మూడో విడతలో 4,159 స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీ 242 స్థానాల్లో, సీపీఐ 24, సీపీఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు.రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు గాను.. తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. మూడో విడతలో అత్యధికంగా 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30 శాతంగా నమోదైంది. -
రాజేష్ మృతి ఎఫెక్ట్.. సీఐ సస్పెండ్, ఎస్ఐపై చర్యలు
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజేష్ మృతి నేపథ్యంలో కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, చిలుకూరు ఎస్ఐ సురేష్‌పై చర్యలు తీసుకున్నారు. సురేష్‌ను వీఆర్‌కు అటాచ్ చేశారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. స్థానిక మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పనిచేసే చడపంగు నరేష్ కొంతమంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అదే పేరుతో ఉన్న ఇతరుల బ్యాంకు ఖాతాల్లో వేయించి సొమ్ము చేసుకున్నాడు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నరేష్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా చిలుకూరుకు చెందిన కె. రాజేష్ పేరుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును కోదాడకు చెందిన కె.(కర్ల) రాజేష్‌కు ఇచ్చి అతని అకౌంట్ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లు నరేష్ చెప్పాడు. దీంతో..చిలుకూరు పోలీసులు ఈనెల 9న రాజేష్‌ను అరెస్ట్ చేసి 10న రిమాండ్ విధించడంతో హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. 14వ తేదీ రాత్రి రాజేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిలుకూరు పోలీసులను ఎస్కార్ట్ ఇచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న రాజేష్ మృతిచెందాడు. 17న పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చిలుకూరు పోలీసులు కొట్టడం వల్లే రాజేష్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కోదాడలోని కల్లుగడ్డ బజార్లో రాజేష్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. రాజేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లాకప్‌లో రాజేష్ మృతి చెందిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటన రీత్యా అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూరల్ సీఐ, ఎస్ఐపై కూడా చర్యలు తీసుకుంది. -
మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది. -
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
లవ్ మ్యారేజ్ చేసుకుని..కొట్టి చంపేశాడు
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. Sensitive Content సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్తతాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతియువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025 ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. -
తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..
రామచంద్రాపురం (పటాన్చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్ నగర్ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ మృతి
చర్ల/సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్టీఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.ఈక్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పారిపోతుండగా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, అతన్ని ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యుడు పడ్నీ మడవిగా గుర్తించారు. 41 మంది మావోల లొంగుబాటు మావోయిస్టు పార్టీ కొమురంభీం ఆసిఫాబాద్–మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ , పార్టీ సభ్యుడు చెందిన కనికారపు ప్రభంజన్ (మంచిర్యాల జిల్లా) సహా మొత్తం 41 మంది మావోయిస్టులు శుక్రవారం డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. -
2030-35 నాటికి విస్తృతంగా పొలాల్లో రోబోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030-35 నాటికి రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవరహిత ట్రాక్టర్లు, సెన్సర్ల వినియోగం విస్తృతం కానుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. అందుకు అవసరమైన పరిశోధనలు వర్సిటీల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. మానవరహిత వ్యవసాయ సాధన దిశగా తమ వర్సిటీ కీలక ముందడుగు వేసిందన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తొలిదశ అగ్రి రొబోటిక్స్ ప్రయోగశాలను ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టితో కలిసి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శుక్రవారం ప్రారంభించారు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అత్యాధునిక అగ్రి రొబోటిక్స్ ల్యాబ్ ఏర్పాటవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాసులుశెట్టి మాట్లాడుతూ వర్సిటీ పూర్వ విద్యార్థిగా ఇలాంటి ఆధునిక ప్రయోగశాల ప్రారంభంలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. సుమారు ఏడాది క్రితం ప్రయోగశాల ప్రతిపాదనను వీసీ అల్దాస్ జానయ్య, నాటి డీన్ జెల్లా సత్యనారాయణ తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఏడాదిలోనే ప్రయోగశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చి తొలిదశ ల్యాబ్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, రోబోలు భవిష్యత్తులో వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడంలో కీలకంగా మారతాయని శ్రీనివాసులుశెట్టి అభిప్రాయపడ్డారు. వికసిత్, రైజింగ్ లక్ష్యాల సాధనలో..ఉపకులపతి అల్దాస్ జానయ్య మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనలో వ్యవసాయ, గ్రామీణ రంగాలు కీలకపాత్ర పోషించనున్నాయని తెలిపారు. భవిష్యత్తు వ్యవసాయం ఏఐ ఆధారిత పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా మానవరహిత వ్యవసాయ సాధనలో భాగంగా అగ్రి రొబోటిక్స్ ల్యాబ్‌ను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రిహబ్ ఎండీ డాక్టర్ జి. వెంకటేశ్వర్లు, అగ్రి రొబోటిక్స్ ల్యాబ్ ప్రాజెక్టు హెడ్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, వర్సిటీ అధికారులు, ఎస్బీఐ సీనియర్ అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయం కావాలి
కవాడిగూడ: సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తి వంతమైన ఆయుధమని, ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయంగా మారాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం పునాస మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత అధునాతన సాంకేతికత, సోషల్ మీడియా యుగంలోనూ దాదాపు 15 లక్షల మంది పుస్తక ప్రదర్శనకు రావడం శుభపరిణామమన్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థ కేవలం మార్కులు ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని, ఇది మనిషిని సంస్కరించలేకపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాటితరం ఆలోచనా విధానం, విలువలు నేడు కల్తీ అయి.. కేవలం ఉద్యోగం, సంపాదన «ధోరణిలో పడి మానవజన్మ సార్థకతను మర్చిపోతున్నాం. పాత కాలపు సంస్కారం మళ్లీ రావాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది’అని జూపల్లి పేర్కొన్నారు. సామాజిక చైతన్యం నింపేందుకు ప్రభాతభేరి పుస్తక ప్రదర్శనలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు జూపల్లి వెల్లడించారు. ఇందుకోసం సాంస్కృతికశాఖ ద్వారా రూ.3 కోట్లు (జిల్లాకు రూ.10 లక్షల చొప్పున) కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామీణ, మండల స్థాయి గ్రంథాలయాలకు మంచి పుస్తకాలను చేరవేయడానికి తక్షణమే రూ.కోటి మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల్లో సామాజిక చైతన్యం నింపేందుకు త్వరలోనే ప్రభాతభేరి అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌కు బుక్‌ఫెయిర్‌కు శాశ్వత స్థలం కేటాయించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సోషల్ మీడియా ఇచ్చే సంతృప్తి తాత్కలికమైనదని.. పుస్తకాల ద్వారా లభించే జ్ఞానం మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ పేరు పెట్టడం హర్షణీయమని చెప్పారు. ఎన్ని సాంకేతిక మార్పులు వచ్చినా పుస్తకం ప్రాధాన్యం తగ్గదన్నారు. ఆధ్యాత్మికత, టెక్నాలజీ, చరిత్ర, సాహిత్యం వంటి అన్ని రకాల పుస్తకాలు ఒకేచోట లభించే ఈ ప్రదర్శనను నగరవాసులు కుటుంబ సమేతంగా సందర్శించాలని ఆయన సూచించారు.హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ యాకుబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి, సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి, బుక్‌ఫెయిర్ ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు తదితరులు పాల్గొన్నారు. -
నా డబ్బులు నాకు ఇచ్చేయండి
ఆసిఫాబాద్ రూరల్/జూలూరుపాడు: ఉప సర్పంచ్ పదవి దక్కని ఓ మాజీ సర్పంచ్ ఓట ర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేసిన ఘటన కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చిలాటిగూడ పంచాయతీలో ఎకోన్ కార్ మహేశ్ ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఏడు స్థానాల్లో తన మద్దతుదారు లను నిలబెట్టాడు. వీరిలో మహేశ్ ఒక్కడే గెలిచాడు. మిగిలిన ఆరు స్థానాల్లో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు విజయం సాధించగా, ఉప సర్పంచ్‌గా వినోద్‌ను ఎన్ను కున్నారు. దీంతో మహేశ్ ఉపసర్పంచ్ పదవి దక్కలేదని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శుక్రవారం ఎనిమిదో వార్డు బెస్తవాడ ఓటర్లతో వాగ్వా దానికి దిగారు. ఓటు వేయలేదని ధాన్యం తడిపిన నేతభద్రాద్రిజిల్లా జూలూరుపాడు మండలం గంగారంతండాకు చెందిన చిన్న రాములు రెండెకరాల్లో వరిసాగు చేయగా, కోత అనంతరం కల్లంలో ఆరబోశాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఓటు వేయాలని చిన్న రాములుకు అదే గ్రామానికే చెందిననేత సామ్యా సూచించాడు. అయితే, రాములు ఓటు వేయలేదనే భావనతో కల్లం పక్కనే ఉన్న తన పొలంలోని మోటార్ గురువారం రాత్రి ఆన్ చేయగా 60 బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది.


