కన్హా శాంతివనంలో జరిగిన కార్యక్రమంలో గురూజీ కమ్లేశ్ పటేల్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్‌బాబు
కన్హాలో ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం
హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్‌బాబు
నందిగామ: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే అలవాటు చేసుకున్నట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరంలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమ్లేశ్ పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జిషు్ణదేవ్ వర్మ, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని అలవాటుగా చేసుకోవాలని అన్నా రు. ధ్యానంతో అంతర్గత శాంతి లభిస్తుందని, కోపతాపాలు దూరమవుతాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో ధ్యానాన్ని అభ్యసిస్తుండటంతో వారిలో గొప్ప మార్పు వచి్చందని గుర్తు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.
ధ్యానం మన అంతర్గత ఉనికిని కనుగొనడంలో ఉపయోగపడుతుందని వివరించారు. గురూజీ కమ్లేశ్ పటేల్ మాట్లాడుతూ.. ధ్యానం జడత్వాన్ని వదిలి, ఉన్నత చైతన్యాన్ని చేరుకోవడానికి సాధనంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 30 వేల మంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది వర్చువల్‌గా 170 దేశాల నుంచి పాల్గొంటున్నారని చెప్పారు. అంతకు ముందు గురూజీ కమ్లేశ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ధ్యానంలో అక్కడికి వచి్చన అతిథులు పాల్గొన్నారు. అనంతరం దాజీ రచించిన ‘రివీల్ డార్స్’పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఢిల్లీ చేరుకున్న ఉపరాష్ట్రపతి
శంషాబాద్: రెండు రోజుల హైదరాబాద్ పర్యటకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆదివారం సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. కన్హాశాంతి వనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.


