సాక్షి, ఖమ్మం: జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖుల ఇళ్లు.. బంధువుల ఇళ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.
కొన్ని నెలల కిందట పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ ఖమ్మంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే ఈ ప్రదర్శనల్లో ఈ ఇద్దరు ప్రముఖులు పాల్గొనడాన్ని స్థానిక బీజేపీ నేతలు తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి(సహాయ) బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఆయన ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది.
ఆరుగురు సభ్యుల ఎన్ఐఏ బృందం ఆ ఇద్దరి నివాసాల్లో.. బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిపినట్లు సమాచారం. ఈ ఇద్దరికి ఉగ్రవాద సంస్థలతో లేదంటే మావోయిస్టులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అని దర్యాప్తు సంస్థ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే.. ఈ తనిఖీలను స్థానిక పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
ఇదీ చదవండి: ఉగ్రవాదుల కన్నా మేధావులే మరీ డేంజర్!


