breaking news
england
-
రన్నరప్‌గా ముగింపు
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నిలో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో చెలరేగి ఆడిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తరఫున 13వ నిమిషంలో గ్రేస్ బాల్స్‌డన్, 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ గోల్స్ సాధించారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత మహిళల బృందం ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంనుంచి భారత్ దూకుడు ప్రదర్శించింది. రెండో నిమిషంలోనే జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. అయితే దీనిని నిలువరించడంలో ఇంగ్లండ్ గోల్ కీపర్ సఫలమైంది. తొలి క్వార్టర్ ముగియడానికి కొద్ది సేపు ముందు లి క్వార్టర్లో భారత్ జోరు ప్రదర్శించినా...రెండో క్వార్టర్ నుంచి ఇంగ్లండ్‌కు ఆటపై పట్టు చిక్కి ఆ జట్టు వరుసగా దాడులు చేసింది. చివరకు పెనాల్టీ సాధించిన టీమ్‌కు బాల్స్‌డన్ గోల్ అందించింది. ఈ టోర్నికి ఆమెకిది ఐదో గోల్ కావడం విశేషం. రెండో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్ సాధించే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో దక్కినా పెనాల్టీని భారత్ వాడుకోలేకపోయింది.అయితే మూడో క్వార్టర్ చివర్లో భారత డిఫెన్స్‌ను ఛేదించి దూసుకుపోయిన ఎలిజబెత్ గోల్ కీపర్ బిచ్చుదేవిని ఏమార్చడంలో సఫలమై ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ ఆధిక్యాన్ని సరైన డిఫెన్స్‌తో కాపాడుకోవడంలో ఇంగ్లండ్ సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి ఒక నిమిషం ముందు కూడా భారత్‌కు పీసీ దక్కినా అదీ వృథా అయింది. దాంతో గోల్ లేకుండా ఓటమి తప్పలేదు. భారత్ మొత్తంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా ఉపయోగించుకోలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్కాట్లాండ్ 1–0తో ఇటలీని ఓడించింది. భారత్‌కు చెందిన నవనీత్ కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. -
జాక్‌పాట్ కొట్టిన ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్
తొలిసారి నిర్వహించిన హండ్రెడ్ లీగ్ వేలంలో ఓ అనామక ఆటగాడు జాక్‌పాట్ కొట్టాడు. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ససెక్స్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌ను లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ఏకంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 4.8 కోట్లు) సొంతం చేసుకుంది. 75 వేల పౌండ్ల బేస్‌ప్రైజ్ విభాగంలో వేలంలో బరిలోకి దిగిన 21 ఏళ్ల కోల్స్ కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ట్రెంట్ రాకెట్స్, సన్‌రైజర్స్ లీడ్స్) తీవ్రంగా పోటీపడ్డాయి. 35 బిడ్డింగ్ రౌండ్ల అనంతరం లండన్ స్పిరిట్ అతన్ని ఊహించని ధరకు దక్కించుకుంది.లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కమ్ డాషింగ్ బ్యాటర్ అయిన కోల్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్లో అతను టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 16 ఏళ్లకే ససెక్స్ తరఫున అరంగేట్రం చేసిన కోల్స్.. ఈ కౌంటీ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.చిన్న వయసులోనే 51 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్ కలిగిన కోల్స్.. 82 ఇన్నింగ్స్‌ల్లో 38.42 సగటున పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 3.75 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ మోస్తరు రికార్డు కలిగిన కోల్స్.. ఈ ఫార్మాట్లో 21 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. హండ్రెడ్ లీగ్‌లో ఇంతకుముందే ప్రవేశమున్న కోల్స్.. ఈ లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ప్రభావం చూపించాడు. గత ఎడిషన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన కోల్స్.. 152 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. 2024-25లో ఇంగ్లండ్ లయన్స్ తరఫున భారత్, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన కోల్స్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. హండ్రెడ్ లీగ్‌లో జాక్‌పాట్ కొట్టడంతో, విదేశీ లీగ్ ఫ్రాంచైజీల కన్ను కోల్స్‌పై పడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో కోల్స్ తన పేరు నమోదు చేసుకోలేదు. త్వరలో జరుగబోయే హండ్రెడ్ లీగ్‌లో కోల్స్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తే ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం అతని కోసం ఎగబడే అవకాశం ఉంది. హండ్రెడ్ వేలంలో కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.హెండ్రెడ్ లీగ్ వేలంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లీగ్‌లోని తమ సిస్టర్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ లీడ్స్ కోసం పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు)) ఎంపిక చేసుకుంది.ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. -
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్–ఇంగ్లండ్ సెమీఫైనల్
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగి రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్‌తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ చిచ్చరపిడుగు
నిన్న (మార్చి 5) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో, ఓవరాల్‌గా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన బేతెల్.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందే భారత్‌కు బ్రేక్ దొరకింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది. చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.ఇంత భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు, ముఖ్యంగా జేకబ్ బేతెల్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతను.. విల్ జాక్స్, సామ్ కర్రన్ సహకారాలతో గెలుపు తీరాల వరకు తీసుకెళ్లాడు. 18,19 ఓవర్లు బుమ్రా, హార్దిక్ కంట్రోల్ చేయకపోయుంటే పరిస్థితి వేరే ఉండేది. ఈ వీరోచిత శతకంతో బేతెల్ పలు భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్ (105) చేసిన ఆటగాడిగా, నిన్ననే ఫిన్ అలెన్ (100) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. బేతెల్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇదే తొలి సెంచరీ. ప్రపంచంలో ఏ క్రికెటర్ తన తొలి ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్ సెంచరీని అంతర్జాతీయ స్థాయిలో సాధించలేదు. చరిత్రలో జేకబ్ మొదటివాడు. ఇంగ్లండ్ తరఫున ప్రపంచకప్ టోర్నీల్లో సెంచరీలు చేసిన వారిలో జేకబ్ నాలుగో వాడు. వీరిలో రెండో అత్యధిక స్కోర్ జేకబ్‌దే. ఇంగ్లండ్ తరఫున టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక స్కోర్ రికార్డు అలెక్స్ హేల్స్ (116 నాటౌట్) పేరిట ఉంది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్‌లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్‌లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. టి20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్‌కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్‌తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్‌ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్‌లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్‌లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్‌లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్‌లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్‌లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బెతెల్‌కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్‌లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్‌దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్‌లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్‌లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్‌ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లంతా ఏ బౌలర్‌ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్‌తో బ్రూక్‌ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్‌ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్‌పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్‌పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్‌లో భారత్ నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.105 టి20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0. -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 5) అత్యంత కీలకమైన సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్ ఉన్నా, ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటం ఇది వరుసగా మూడోసారి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోగా.. 2024 ఎడిషన్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆతర్వాత టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. గత రెండు ఎడిషన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోవడంతో ఇవాల్టి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరడమే కాకుండా, ఆతర్వాత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారు నమ్ముతున్నారు.గెలుపోటముల విషయం పక్కన పెడితే, నేటి మ్యాచ్‌లో మూడు భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.అత్యధిక టీమ్ టోటల్నేటి మ్యాచ్‌లో భారత్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో అత్యధిక టీమ్ టోటల్‌ను నమోదు చేసే అవకాశం ఉంది. 2016 ఎడిషన్‌లో వాంఖడే మైదానంలోనే విండీస్‌పై చేసిన 192 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. వాంఖడే వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేస్తే టీమిండియా 200 పైచిలుకు పరుగులు సాధిస్తుందనే అంచనా ఉంది.డేంజర్లో విరాట్ రికార్డునేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 వరల్డ్‌కప్ నాకౌట్స్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఎడిషన్ సెమీఫైనల్లో విండీస్‌పై విరాట్ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్, నాటౌట్) నేటి వరకు టీ20 ప్రపంచకప్ నాకౌట్స్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ నుంచి ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.ఎవరు గెలిచినా రికార్డేనేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్స్‌కు చేరాయి. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్ర అవుతుంది. భారత్ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరగా.. ఇంగ్లండ్ 2010, 2016, 2022 ఎడిషన్లలో తుది పోరుకు అర్హత సాధించింది. -
ముంబైలో హై వోల్టేజ్ మ్యాచ్..
-
భారత్ ఫైనల్ గురి
3-2 టి20 వరల్డ్ కప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్‌పై విజయం సాధించిన ఇంగ్లండ్ ఆపై టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్‌లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్‌కు చేరింది. టి20 వరల్డ్ కప్‌ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. విండీస్‌పై గత మ్యాచ్‌లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్ సంజు సామ్సన్ ఒక్క ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్‌లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్‌తో పాటు వైవిధ్యమైన బౌలింగ్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కత్తి మీద సామే. ఇంగ్లండ్‌పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్ కీలకం విల్ జాక్స్... ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్‌పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడింది. ‘సూపర్ ఎయిట్స్’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్‌లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్‌లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్ 7 మ్యాచ్‌లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్‌లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటం అవసరం. ఆల్‌రౌండర్‌గా స్యామ్ కరన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు నెగ్గిన విల్ జాక్స్ కీలకం కానున్నాడు. ఆర్చర్‌తో పాటు రెండో పేసర్‌గా ఒవర్టన్‌పై భారం ఉంది. పిచ్ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, డాసన్ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్ మధ్య 29 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 17 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్. -
ఇండియాకు అగ్ని పరీక్ష..!
-
భారత జట్టు ముమ్మర సాధన
టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి సాధనలో పాల్గొంది. ముంబైలోనే వాంఖెడే మైదానంలో మంగళవారం సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్‌లో జట్టులో 15 మంది సభ్యులందరూ పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా జట్టు ప్రాక్టీస్ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ పర్యవేక్షణలో అభిషేక్ శర్మ ప్రత్యేకంగా ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కొంటూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ అటు స్పిన్, ఇటు పేస్ బౌలింగ్‌లో సాధన చేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌లపై తిలక్ దృష్టి పెట్టాడు. అర్ష్ దీప్ సింగ్ యార్కర్లను సంధించడంపై ఎక్కువగా ప్రాక్టీస్ చేయగా, బుమ్రా మాత్రం ఎదురుగా బ్యాటర్ లేకుండా తనదైన శైలిలో స్పాట్ బౌలింగ్‌కే ప్రాధాన్యతనిచ్చాడు. హార్దిక్ పాండ్యా మాత్రం భారీ షాట్లపైనే దృష్టి పెడుతూ ప్రతీ బంతినీ బౌండరీకి తరలించే తరహాలో సాధన చేశాడు. సెమీస్‌కు రెండు రోజుల మాత్రం పిచ్‌పై చాలా పచి్చక కనిపిస్తున్నా...మ్యాచ్ ముందు దానిని తొలగించే అవకాశం ఉంది. -
మధ్యప్రాచ్యంలో యుద్దం.. ఆపదలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో ఆపదలో ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద నేపథ్యంలో కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకుని, బిక్కుబిక్కుమంటున్నాడు. బెయిర్‌స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్ విమానాశ్రయం సహా మధ్యప్రాచ్యంలోని అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఎక్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ కలం వెల్లదీస్తున్నారు.For those writing that I’m with the England Lions team… I am not. I am with my young family in Dubai…sure the England Lions security staff will be doing all they can to get them out of Abu Dhabi but I am trying to keep my family safe and get us out of here!!— Jonny Bairstow (@jbairstow21) March 2, 2026ముందుగా బెయిర్‌స్టో అబుదాబీలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ లయన్స్ బృందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని బెయిర్‌స్టో స్వయంగా స్పష్టం చేశాడు. తాను కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్ లయన్స్‌ను భద్రతా సిబ్బంది అబుదాబి నుండి బయటకు తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తుందని అనుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకొని, ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా, మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది. మరోవైపు సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కూడా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో డర్బన్‌లోనే ఇరుక్కుపోయింది. -
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్తాన్ షాహీన్స్‌తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ లయన్స్ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అబుదాబీ నగరం ప్రస్తుతం ఇరాన్ దాడులతో అట్టుడికిపోతుంది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ అమెరికా ఎయిర్‌బేస్‌ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్ చేసింది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తుంది. అక్కడే ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారతకాలం ప్రకారం ఇవాళ (మార్చి 1) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది.అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.“జట్టు భద్రత మా ప్రాధాన్యత. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం” ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్ కోచింగ్ బృందంలో ఆ దేశ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సహా విధ్వంసకర వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య 3 టీ20లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అబుదాబీ వేదికగా షెడ్యూలైంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్ 3-0 తేడాతో ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లోని 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది. -
సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
-
ఉప ఎన్నికలో స్టార్మర్ పార్టీకి షాక్
లండన్: ఇంగ్ల్లండ్‌లో జరి గిన ఉప ఎన్నికలో అధికార లేబర్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గోర్టన్ డెంటన్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గ్రీన్ పార్టీ అభ్యర్థి అనూహ్యంగా గెలుపొందారు. వృత్తిరీత్యా ప్లంబర్ అయిన హన్నా స్పెన్సర్(34) 4,402 ఓట్ల మెజారిటీ సాధించారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఈమెకు 14,980 ఓట్లు దక్కగా, రిఫార్మ్ యూకే పార్టీకి చెందిన మాథ్యూ గుడ్విన్కు 10,758 ఓట్లు, అధికార లేబర్ పార్టీ అభ్యర్థి ఏంజెలికి స్టోగియాకు 9,364 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో పార్లమెంట్లో గ్రీన్ పార్టీ ప్రాతినిధ్యం ఐదు స్థానాలకు పెరిగింది. గోర్టన్ డెంటన్ సీటు 1931 తర్వాత లేబర్ పార్టీ నుంచి చేజారడం ఇదే మొదటిసారి. తాజా ఓటమిపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. ఇది చాలా నిరుత్సాహం కలిగించిన పరిణామమన్నారు. మధ్యంతర ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు సాధారణమేనంటూ సమరి్థంచుకున్నారు. అయితే, ఎన్నికల వేళ భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలతో స్టార్మర్ ఉన్న చిత్రాల కరపత్రాలను, ఉర్దూ వీడియోలను విడుదల చేయడం వంటి చర్యలతో అక్కడి అత్యధిక సంఖ్యలో ఉన్న బ్రిటిష్ పాకిస్తానీ ఓటర్లను గ్రీన్పార్టీ ప్రభావితం చేసిందన్న విమర్శలున్నాయి. 2024 ఎన్నికల్లో గోర్టన్డెంటన్ స్థానాన్ని లేబర్ పార్టీకి చెందిన అండ్రూ గ్విన్ 13,413 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. వేధింపుల ఆరోపణల కారణంగా ఆండ్రూ రాజీనామా చేయగా, తాజాగా ఉప ఎన్నిక నిర్వహించారు. -
టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ 'హ్యాట్రిక్'
కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించారు. దాంతో ‘సూపర్ ఎయిట్స్’లో ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి ఇంగ్లండ్ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్ చేరే అవకాశాన్ని కివీస్ పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), టీమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్ అలెన్ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. ఆర్చర్ ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన రేహన్ అహ్మద్ తన తొలి బంతికే రచిన్ రవీంద్ర (11)ను అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్ మిడిలార్డర్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (2), బట్లర్ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), బెతెల్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్ బాధ్యత తీసుకోగా, స్యామ్ కరన్ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్ చేసి కివీస్ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్ అహ్మద్ (7 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్వదేశానికి మ్యాట్ హెన్రీ... కొలంబో: న్యూజిలాండ్ ప్రధాన పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత అతను న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత కివీస్ సెమీస్‌కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 35; అలెన్ (సి) బెతెల్ (బి) జాక్స్ 29; రచిన్ (సి) బెతెల్ (బి) రేహన్ 11; ఫిలిప్స్ (బి) జాక్స్ 39; చాప్మన్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 15; మిచెల్ (సి) జాక్స్ (బి) డాసన్ 3; సాంట్నర్ (నాటౌట్) 9; మెక్‌కోన్‌కీ (బి) రేహన్ 14; హెన్రీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్: ఆర్చర్ 3–1–24–0, డాసన్ 4–0–32–1, కరన్ 1–0–10–0, రషీద్ 4–0–28–2, జాక్స్ 4–0–23–2, బెతెల్ 1–0–13–0, రేహన్ 3–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సీఫెర్ట్ (బి) హెన్రీ 2; బట్లర్ (సి) సీఫెర్ట్ (బి) ఫెర్గూసన్ 0; బ్రూక్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 26; బెతెల్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 21; బాంటన్ (సి) చాప్మన్ (బి) రచిన్ 33; కరన్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 24; జాక్స్ (నాటౌట్) 32; రేహన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117. బౌలింగ్: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్ 2–0–14–1, సాంట్నర్ 4–0–29–0, మెక్‌కోన్‌కీ 1–0–13–0, ఫిలిప్స్ 4–0–43–1, రచిన్ 4–0–19–3, సోధి 2–0–21–0. -
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో నేడు (ఫిబ్రవరి 27) కీలక సమరం జరుగనుంది. గ్రూప్-2 నుంచి ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్.. మరో బెర్త్ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. తద్వారా పాక్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ రెండో బెర్త్ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్, న్యూజిలాండ్ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ రన్ రేట్ 3.050గా ఉంది. అదే పాక్ రన్‌రేట్ -0.461గా ఉంది. పాక్ మైనస్ నుంచి ప్లస్ రన్‌రేట్‌లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి, నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా, న్యూజిలాండ్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. వాస్తవానికి న్యూజిలాండ్ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్‌లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్‌ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్‌తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్ జరిగి ఉంటే, న్యూజిలాండ్ సునాయాసంగా పాక్‌ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేది.బలాబలాల ప్రకారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమతూకంగా కనిపించినా ఎడ్జ్ న్యూజిలాండ్‌వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. అదే ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఓపెనర్ జోస్ బట్లర్, జేకబ్ బేతెల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ టీమ్
ఇంగ్లండ్ టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో సెమీస్‌కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించింది. వరుసగా 2016, 2021, 2022, 2024, 2026 ఎడిషన్లలో ఫైనల్-4కు చేరింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉండేది. పాక్ వరుసగా 2007, 2009, 2010, 2012 ఎడిషన్లలో సెమీస్‌కు చేరింది. శ్రీలంక వరుసగా 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో ఫైనల్-4కు అర్హత సాధించింది.తాజాగా ఎడిషన్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన ఇంగ్లండ్.. తమ మూడో టైటిల్ దిశగా దూసుకుపోతుంది. 2010, 2022 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. తాజాగా పాక్‌పై సూపర్-8 మ్యాచ్‌లో గెలుపుతో గ్రూప్-2 నుంచి దర్జాగా సెమీస్‌కు చేరింది. అంతకుముందు ఇదే దశలో ఆతిథ్య శ్రీలంకపై కూడా గెలిచింది. చివరి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది.మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఈ గ్రూప్‌లో భారత్ సెమీస్ బెర్త్ కోసం పోరాడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్‌ల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడాల్సి ఉంది.ఇదిలా ఉంటే, పల్లెకెలె వేదికగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కనులపండుగగా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).అంతకుముందు సాహిబ్జాదా ఫర్హాన్ (63) రాణించడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పాక్‌పై మ్యాచ్ విన్నింగ్ శతకం.. రికార్డుల మోత మోగించిన బ్రూక్
టీ20 వరల్డ్‌కప్ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 పోరులో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ మూడంకెల స్కోర్ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేసింది జాక్స్, కర్రన్ మాత్రమే. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).ఈ మ్యాచ్ విన్నింగ్ శతకంతో బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్‌కు కూడా చేర్చాడు. బ్రూక్ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీహ్యారీ బ్రూక్- 50 బంతులు (తాజా మ్యాచ్‌లో)అలెక్స్ హేల్స్- 60జోస్ బట్లర్- 67టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్లుబ్రూక్- 100 (తాజా మ్యాచ్‌లో)క్రిస్ గేల్- 98 లోర్కాన్ టక్కర్- 94 నాటౌట్రోహిత్ శర్మ- 92ఈ సెంచరీతో బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ ఈ ఘనత సాధించారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు సూపర్-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్‌కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్‌లో భారత్ సెమీస్ బెర్త్‌ను సంక్లిష్టం చేసుకుంది. -
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్‌కు
టి20 వరల్డ్ కప్‌లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్‌లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్‌ల కెరీర్లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్... బౌలింగ్‌లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్‌ను ఆపలేక మ్యాచ్‌ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి! పల్లెకెలె: టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్ ఇప్పుడు పాక్‌పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్ సెమీస్ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్‌రేట్‌లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. దక్కని శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌కు శుభారంభం లభించలేదు. సయీమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లేలో ఒక్క సిక్సర్ కూడా లేకుండా పాక్ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! ఈ క్రమంలో బాబర్ వెనుదిరగ్గా, ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది. హడలెత్తించిన అఫ్రిది ఛేదనలో ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్ బట్లర్ (2)ను, మూడో ఓవర్లో బెతెల్ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో టీమ్ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్ (2), స్యామ్ కరన్ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్ జాక్స్ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్... అఫ్రిది బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్ గట్టెక్కింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (ఎల్బీ) (బి) ఒవర్టన్ 63; అయూబ్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 7; సల్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 5; బాబర్ (బి) ఒవర్టన్ 25; ఫఖర్ (సి) డాసన్ (బి) రషీద్ 25; షాదాబ్ (రనౌట్) 23; ఉస్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 8; నవాజ్ (ఎల్బీ) (బి) డాసన్ 0; అఫ్రిది (సి) స్యామ్ కరన్ (బి) ఆర్చర్ 2; సల్మాన్ మీర్జా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2, ఒవర్టన్ 3–0–26–2, డాసన్ 4–0–24–3, స్యామ్ కరన్ 3–0–24–0, రషీద్ 4–0– 31–1, జాక్స్ 2–0–27–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 0; బట్లర్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 2; బ్రూక్ (బి) షాహిన్ అఫ్రిది 100; బెతెల్ (సి) ఫర్హాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; బాంటన్ (సి) ఉస్మాన్ (బి) తారిఖ్ 2; స్యామ్ కరన్ (సి) నవాజ్ (బి) తారిఖ్ 16; జాక్స్ (బి) నవాజ్ 28; ఒవర్టన్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) నవాజ్ 0; డాసన్ (నాటౌట్) 1; ఆర్చర్ (నాటౌట్) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–30–4, సల్మాన్ మీర్జా 3.1–0–26–0, సయీమ్ అయూబ్ 2–0–21–0, నవాజ్ 3–0–26–2, షాదాబ్ ఖాన్ 3–0–31–0, ఉస్మాన్ తారిఖ్ 4–0–31–2. 3 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. గతంలో జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్‌గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా కూడా బ్రూక్ గుర్తింపు పొందాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X న్యూజిలాండ్వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం
టీ 20 ప్రపంచకప్ సూపర్-8లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం, బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విరవిహారం సృష్టించాడు. 51 బంతుల్లో సెంచరీ చేశాడు. వరుసగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ ఫినిషర్ విల్ జాక్స్ దూకుడు ప్రదర్శించాడు. 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. ఇక పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ 4 వికెట్లు,మహ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ చెరో రెండు వికెట్లు తీశారు. -
మళ్లీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?
మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక జట్టు తలపడనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తమ స్ధానాలను ఖాయం చేసుకున్నాయి.భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో ఉన్న భారత్-పాకిస్తాన్ జట్లు జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. గ్రూపు-ఎలో భారత్, పాక్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 5న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుందిభారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ జూన్ 14 - పాకిస్తాన్‌తో.. ఎడ్జ్బాస్టన్జూన్ 17- నెదర్లాండ్స్‌తో.. లీడ్స్జూన్ 21-సౌతాఫ్రికాతో.. మాంచెస్టర్‌జూన్ 25- బంగ్లాదేశ్‌తో.. మాంచెస్టర్‌జూన్ 28- ఆస్ట్రేలియాతో.. లార్డ్స్ -
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో ఆసక్తికర సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్-8 సమరం జరుగనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కు డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్‌కు చేరాలనుకుంటే ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. శ్రీలంకపై తొలి సూపర్-8 మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ గ్రూప్-2 టాపర్‌గా ఉంది. ఆ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్ రన్‌రేట్ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్ నుంచి తొలి సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్‌కే అధికంగా ఉన్నాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులుపాకిస్తాన్-ఇంగ్లండ్ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 21, పాక్ కేవలం 9 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్ ఫైనల్ కూడా ఉంది.పిచ్ కూడా వారికి అనుకూలమే..!ఈ మ్యాచ్ జరుగనున్న పల్లెకెలె పిచ్ కూడా ఇంగ్లండ్‌కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. మరోపక్క పాక్ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పిచ్ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్‌లో ఇంగ్లండే హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది.. పాక్‌తో పోలిస్తే ఇంగ్లండ్ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్‌లో ఉంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్‌పై విజయాలు సాధించి సూపర్-8లోకి అడుగుపెట్టింది. పాక్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్ దశలో 3 విజయాలు సాధించి, సూపర్-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.తుది జట్లు (అంచనా)..ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
T20 World Cup: ఇంగ్లండ్ దెబ్బకు చేతులెత్తేసిన శ్రీలంక
పల్లెకెలె: టీ 20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. సూపర్-8లో భాగంగా గ్రూప్-2లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్.. ఆపై శ్రీలంకను 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూల్చి విజయాన్ని అందుకుంది. శ్రీలంక ఆటగాళ్లలో దసునా షనాకా(30) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో సొంత గడ్డపై శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్, డావ్సన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీసి.. శ్రీలంక పతనాన్ని శాసించారు. ఫలితంగా శ్రీలంకకు ఘోర పరాజయం తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(62) ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇంగ్లండ్ వికెట్లు ఓ వైపు పడుతున్నా సాల్ట్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ కొనసాగించాడు. దాంతో ఇంగ్లండ్ మూడంకెల స్కోరును దాట కల్గింది. -
శ్రీలంకతో సూపర్-8 సమరానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 సమరాలు నిన్నటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభమయ్యాయి. పాక్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సమరం వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) సూపర్-8లో మరో రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి.మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలె వేదికగా శ్రీలంక-ఇంగ్లండ్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లో భారత్-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.కాగా, శ్రీలంకతో కీలక సమరానికి ముందు మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ, స్టార్ ఆల్‌రౌండర్ జేకబ్ బేతెల్ గాయపడ్డాడు. బేతెల్ ఎడమ చేతి ఉంగరం వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను వేళ్లకు బ్యాండ్ ఎయిడ్ (protective strapping) వేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బేతెల్ శ్రీలంక మ్యాచ్‌లో బౌలింగ్‌కు అందుబాటులో ఉండటంపై అనిశ్చితి నెలకొంది.ఐసీసీ నియమాలు ప్రకారం, బౌలర్ చేతికి ఏ రకమైన రక్షణ ఉండాలన్నా మైదానంలోకి దిగే ముందు దాన్ని అంపైర్లు ఆమోదించాలి. ఇంగ్లండ్ ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని రెండు సార్లు ఎదుర్కొంది. కాబట్టి బేతెల్‌కి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.బేతెల్ ప్రాధాన్యంపల్లెకెలెలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే బేతెల్ గతంలో శ్రీలంకపై 4/11తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఇంగ్లండ్ విజయానికి కీలకమైంది. ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడుతున్న సందర్భంలో బేతెల్ బౌలింగ్ సేవలు అందుబాటులో లేకపోతే ఇంగ్లండ్ స్పిన్ విభాగం బలహీనపడే అవకాశం ఉంది.వ్యూహంపై ప్రభావంబేతెల్ గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టు వ్యూహంలో మార్పులు తప్పనిసరి కావచ్చు. అతని బౌలింగ్ అందుబాటులో లేకపోతే, ఆ జట్టు ఇతర స్పిన్ ఎంపికలపై ఆధారపడాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే బేతెల్ బౌలింగ్ చేయలేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద లోటు అవుతుంది. శ్రీలంక జట్టు స్పిన్ విభాగంలో బలంగా ఉండటంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి మరింత పెంచుతుంది. మ్యాచ్‌కు ముందు అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఇంగ్లండ్ దర్జాగా...
కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మెరిపించింది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇటలీ జట్టు కడదాకా పోరాడింది. చివరకు మాజీ చాంపియన్ చేతిలో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో గ్రూప్ ‘సి’ నుంచి ఇప్పటికే ‘సూపర్–8’కు చేరిన వెస్టిండీస్ సరసన ఇంగ్లండ్ చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ బ్రూక్ బృందం నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరిపించినా... బట్లర్ (3) మళ్లీ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో నాలుగో మ్యాచ్ ఆడిన బట్లర్ ఇప్పటివరకు కనీసం మూడు పదుల స్కోరైనా చేయలేకపోయాడు. జాకబ్ బెథెల్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ బ్రూక్ (14), స్యామ్ కరన్ (25; 2 సిక్స్‌లు) ఇలా టాప్–6 బ్యాటర్లు ఇటలీ బౌలింగ్‌కు ఇబ్బంది పడితే... ఏడో వరుస బ్యాటర్ విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ సిక్స్‌లతో తేలికపడింది. అతను 21 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. జాక్స్ మెరుపుల వల్లే ఇంగ్లండ్ 200 పైచిలుకు స్కోరు చేసింది. గ్రాంట్ స్టివార్ట్, కలుగమగే చెరో 2 వికెట్లు తీశారు. ‘సిక్స్’ల పిడుగు మనెంటి కొండంత లక్ష్యం ఎదురైనా... టాప్–3 బ్యాటర్లలో ఆంథోని మోస్కా (0), స్మట్స్ (0) డకౌటైనా... ఇటలీ ఆందోళన చెందలేదు. పోరాటం వీడలేదు. లక్ష్యఛేదన కోసం కడదాకా పోరాడి 20 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ జస్టిన్ మోస్కా (34 బంతుల్లో 43; 7 ఫోర్లు), బెన్ మనెంటి (25 బంతుల్లో 60; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగారు. జస్టిన్ బౌండరీలతో ధాటిగా ఆడితే... మనెంటి భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో బెన్ 22 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. దీంతో ఇటలీ 22/3 దయనీయ స్థితి నుంచి 114/4 స్కోరుతో రేసులో పడింది. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో లక్ష్యానికి దూరమైంది. అయినా సరే ఇటలీ ఆట ఆగిపోలేదు. గ్రాంట్ స్టివార్ట్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) సైతం ఇంగ్లండ్ శిబిరంపై విరుచుకుపడటంతో ప్రత్యర్థి జట్టు ఆఖరి బంతిదాకా చెమటోడ్చింది. కరన్, ఓవర్టన్ చెరో 3 వికెట్లు తీయగా... ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. -
T20 WC 2026: ఇంగ్లండ్‌ను భయపెట్టిన మరో పసికూన
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్ టీమ్‌ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఇటలీ, క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్‌ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్ గట్టెక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఇంగ్లండ్ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ 28, బట్లర్ 3, బేతెల్ 23, బాంటన్ 30, బ్రూక్ 14, సామ్ కర్రన్ 25, ఓవర్టన్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్, కలుగమగే చెరో 2, స్మట్స్, అలీ హసన్, బెన్ మనెంటి తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్ మనెంటి (60), జస్టిన్ మోస్కా (43), గ్రాంట్ స్టివర్ట్ (45) ఇంగ్లండ్ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను భయపెట్టాడు. బెన్ మనెంటి క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇంగ్లండ్ ఫ్యాన్స్ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకొని మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్‌ను దడదడలాడించాడు. స్టీవర్ట్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్‌కు జస్ప్రీత్ సింగ్‌తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్ కర్రన్ స్టీవర్ట్ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 19 ఓవర్లో కర్రన్ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్ వికెట్ తీశాడు. అక్కడే ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్లో ఓవర్టన్ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్ చేశాడు. తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్‌పై సంచలన విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది. -
T20 WC 2026: స్కాట్లాండ్పై ఇంగ్లండ్ ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం కోల్‌కతా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్చర్, డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడినప్పటికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజయాన్ని అందుకుంది.టామ్ బాంటన్(41 బంతుల్లో 63 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్ముల్లన్, బ్రాడ్ వీల్, కుర్రీ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
T20 WC 2026: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ వికెట్‌కీపింగ్ బ్యాటర్ జోస్ బట్లర్ తన అసమాన క్యాచింగ్ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ ద్వారా వదిలిన బంతిని పట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్యాచ్ పట్టిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడు. బట్లర్‌కు ముందు ఈ ఫీట్‌ను సాధించేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి వల్ల కాలేదు.బట్లర్ మాత్రం తన అద్భుతమైన హ్యాండ్-ఐ కమ్యూనికేషన్‌తో, బంతిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచి అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్ తిమోతి షానన్ జెబ్సీలన్ పేరిట ఉండేది. 2021లో తిమోతి 119.86 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా బట్లర్ తిమోతి రికార్డును అధిగమించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ప్రవేశించాడు. Jos Buttler Breaks World Record For Highest Cricket Catch! 🤯 pic.twitter.com/AZaZQtY0v2— The Switch | Kevin Pietersen (@kptheswitch) February 11, 2026ఈ ఫీట్‌కు క్రికెట్‌తో ఏ సంబంధం లేనప్పటికీ.. ఈ అనుభవం మాత్రం బట్లర్‌కు ఆన్ ఫీల్డ్ చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డింగ్ సమయంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష ఎదురైతే బట్లర్ తప్పక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్లర్ ఇప్పటికే ఆన్ ఫీల్డ్‌లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నాడు. వికెట్‌కీపర్‌గానే కాకుండా ఫీల్డర్‌గానూ పలు మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. తాజా అనుభవం (గిన్నిస్ రికార్డు) మాత్రం బట్లర్‌ను చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ గిన్నిస్ రికార్డు ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.ఇదిలా ఉంటే, బట్లర్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ ఇటీవలికాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ప్రపంచకప్‌లోనూ బట్లర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. నేపాల్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన అతను.. నిన్న వెస్టిండీస్‌పై 21 పరుగులకు ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో బట్లర్‌కు శుభారంభాలే లభించినా, పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.బట్లర్ ఫామ్‌లాగే, మెగా టోర్నీ ఇంగ్లండ్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలుత పసికూన నేపాల్ చేతిలో తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్న ఈ జట్టు.. నిన్న విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో విండీస్, స్కాట్లాండ్, ఇటలీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. -
రూథర్‌ఫోర్డ్ వీరంగం.. హోల్డర్ మెరుపులు.. విండీస్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) వికెట్లు కోల్పోయిన విండీస్‌ను షిమ్రోన్ హెట్‌మైర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్‌ఫోర్డ్ (76 నాటౌట్), హోల్డర్ (33) చెలరేగి ఆడి విండీస్‌కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్‌ను 200 దరికి చేర్చారు. రూథర్‌ఫోర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్ 17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్ బ్యాటర్లలో రోవ్‌మన్ పావెల్ 14, రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4-0-16-2) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్‌లో సత్తా చాటిన సామ్ కర్రన్ (3-0-36-1) ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్ 2 ఓవర్లలో 32, డాసన్ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్ బేతెల్ (20) వేగంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి. -
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
-
ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్
ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో చిన్న జట్ల జోరు సాగుతోంది. తొలి రోజు పాకిస్తాన్‌పై నెదర్లాండ్స్ గెలిచినంత పనిచేయగా... స్టార్లతో నిండి ఉన్న టీమిండియాను అమెరికా భయపెట్టింది. రెండో రోజు ఇదే తరహాలో రెండుసార్లు చాంపియన్ ఇంగ్లండ్ జట్టును నేపాల్ వణికించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేపాల్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు చక్కటి షాట్లు ఆడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేశ్ బామ్... స్యామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఫలితంగా ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ ఇంగ్లండ్ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెపె్టన్ హ్యారీ బ్రూక్ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ఆఖర్లో మెరుపు షాట్లు ఆడగా... జోస్ బట్లర్ (26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఫిల్ సాల్ట్ (1), టామ్ బాంటన్ (2), స్యామ్ కరన్ (2) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ (29 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రోహిత్ పౌడెల్ (34 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లోకేశ్ బామ్ (20 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ (29; 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. నేపాల్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో... ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లోకేశ్ రెండు సిక్స్‌లతో కలిపి 22 పరుగులు వచ్చాయి. తదుపరి ఓవర్లో మరో రెండు ఫోర్లతో లోకేశ్ 14 పరుగులు రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు చేరగా... స్యామ్ కరన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నేపాల్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుస్కాట్లాండ్ X ఇటలీవేదిక: కోల్‌కతా; ఉదయం 11 గంటల నుంచిజింబాబ్వే X ఒమన్‌వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గంటల నుంచిదక్షిణాఫ్రికా X కెనడా వేదిక: అహ్మదాబాద్; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 ప్రపంచకప్‌లో తృటిలో మిస్ అయిన పెను సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో ఓ పెను సంచలనం తృటిలో మిస్ అయ్యింది. ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 8) జరిగిన మ్యాచ్‌లో నేపాల్ రెప్పపాటులో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్ పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యానికి అతి సమీపంగా వచ్చి, 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. నేపాల్ ఓడినా, ఇంగ్లండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన వైనం క్రికెట్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌కు ఆది నుంచి మంచి ఆదరణ లభించింది. హాట్ ఫేవరెట్ ఇంగ్లండే అయినా, వాంఖడే స్టేడియంలోని (ముంబై) ప్రేక్షకులు నేపాల్ ఆటగాళ్లకు బ్రహ్మారథం పట్టారు. ఆ జనాలను చూసి, ఇది ఖాట్మండునా (నేపాల్ రాజధాని) లేక ముంబైనా అన్న అనుమానం వచ్చింది. ప్రేక్షకులు వేల సంఖ్యలో నేపాల్‌కు మద్దతిచ్చేందుకు తరలివచ్చారు. ఇందుకు నేపాల్ ఆటగాళ్లు తగిన న్యాయం చేశారు. వారి అభిమానులకు కావాల్సినంత మజాను అందించారు. ఇంగ్లండ్‌పై దాదాపు గెలిచినంత పని చేశారు. చివరి ఓవర్లో ఒక్క బౌండరీ నమోదై ఉంటే నేపాల్ పెను సంచలన సృష్టించేదే. 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్‌కు చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్‌ను సామ్ కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పర్ఫెక్ట్ యార్కర్లు వేసి నేపాల్ బ్యాటర్లు కరణ్, లోకేశ్ బామ్‌ను ఇబ్బంది పెట్టాడు. కర్రన్ కట్టడి చేయడంతో నేపాల్ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే చేయగలిగింది. అప్పటిదాకా మెరుపులు మెరిపించిన లోకేశ్ బామ్ (20 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో ఏమీ చేయలేకపోయాడు. కర్రన్ అతన్ని అద్భుతంగా కట్టడి చేశాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. లోకేశ్ సిక్సర్ బాది తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కర్రన్ ముందు లోకేశ్ పప్పులు ఉడకలేదు. కర్రన్ తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన యార్కర్లు సంధించాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 18వ ఓవర్ నేపాల్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అప్పటివరకు ఆచితూచి ఆడిన నేపాల్ బ్యాటర్లు.. ఆ ఓవర్లో చెలరేగిపోయారు. ఆసిఫ్ షేక్, లోకేశ్ బామ్ రెండు సిక్సర్లు సహా 22 పరుగులు పిండుకొని ఇంగ్లండ్‌వైపు నుంచి మ్యాచ్‌ను తమవైపు మళ్లించుకున్నారు. ఆతర్వాత 19 ఓవర్లోనూ 14 పరుగులు రావడంతో ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైంది. పసికూన అయినా, నేపాల్‌ను తక్కువ అంచనా వేయడం తప్పని అప్పుడు వారికి అర్దమైంది. కొంచెం అటుఇటు అయి ఉంటే, ఇంగ్లండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చేది. నేపాల్ బ్యాటర్లు ఆది నుంచే అద్భుతంగా ఆడారు. ఓపెనర్ కుషాల్ భుర్టెల్ (29) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్ ఎయిరీ (44), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39) మూడో వికెట్‌కు 54 బంతుల్లో 82 పరుగులు జోడించి అప్పుడే ఇంగ్లండ్‌ను భయపెట్టారు. ఆఖర్లో లోకేశ్ బామ్ ఇంగ్లండ్‌ను కంగారు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో నేపాల్ ఓడినా, యావత్ క్రికెట్ ప్రపంచం అభిమానాన్ని చూరగొంది. అంతకుముందు నేపాల్ బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించింది. పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బందులకు గురి చేసింది. జేకబ్ బేతెల్ (55), హ్యారీ బ్రూక్ (53), విల్ జాక్స్ (39 నాటౌట్) సత్తా చాటకపోయుంటే బౌలింగ్‌కు దిగకముందే మ్యాచ్ ఓడిపోయి ఉండేది. వారు ముగ్గురు రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నందన్ యాదవ్, దీపేంద్ర సింగ్ తలో 2, షేర్ మల్లా, సందీప్ లామిచ్చేన్ చెరో వికెట్ తీసి సత్తా చాటారు. నేపాల్ తమ తదుపరి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 12) ఇటలీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్ తప్పక గెలిచే అవకాశం ఉంది. -
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
నేపాల్ ఆఫ్ బ్రేక్ బౌలర్ షేర్ మల్లా చరిత్ర సృష్టించాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి బంతికే వికెట్ తీసి అత్యంత అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను మల్లా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో సాధించడం మరింత ప్రత్యేకం. మల్లాకు ముందు కేవలం ఐదుగురు (ఫిడేల్ ఎడ్వర్డ్స్, ప్రగ్యాన్ ఓఝా, పరాస్ ఖడ్కా, నదీమ్ అహ్మద్, ఖుర్రమ్ ఖాన్) మాత్రమే ప్రపంచకప్ టోర్నీలో (కెరీర్లో) తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలోనూ ఓ నేపాల్ బౌలర్ (పరాస్ ఖడ్కా) ఉన్నాడు. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. మల్లాకు ముందు మరో ముగ్గురు (పరాస్ ఖడ్కా, ఆరిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్) నేపాల్ ఆటగాళ్లు కూడా కెరీర్లో తొలి బంతికే వికెట్ తీశారు.కాగా, టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ ఇవాళ (ఫిబ్రవరి 8) ఆడుతుంది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జేకబ్ బేతెల్ (55), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో విల్ జాక్స్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ 1, జోస్ బట్లర్ 26, టామ్ బాంటన్ 2, సామ్ కర్రన్ 2, జోఫ్రా ఆర్చర్ ఒక్క పరుగు చేశారు. నేపాల్ బౌలర్లలో నందన్ యాదవ్, దీపేంద్ర సింగ్ ఎయిరీ తలో 2 వికెట్లు తీయగా.. షేర్ మల్లా, సందీప్ లామిచ్చేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మల్లా తొలి వికెట్ ఫిల్ సాల్ట్.అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. భుర్టెల్ (29), ఆసిఫ్ షేక్ (7) ఔట్ కాగా.. రోహిత్ పౌడెల్ (10), దీపేంద్ర సింగ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. డాసన్, జాక్స్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో నేపాల్ గెలవాలంటే మరో 78 బంతుల్లో 125 పరుగులు చేయాలి. -
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
-
యువ భారత్ 'సిక్సర్'
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత కుర్రాళ్లు మళ్లీ అదరగొట్టారు. అద్భుత ఆటతో అండర్–19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నారు. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీతో పాటు కెప్టెన్ ఆయుశ్ మాత్రే రాణించడంతో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ యువ జట్టును ఓడించింది. భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311పరుగులకు ఆలౌటైంది. ఫాల్క్‌నర్ సెంచరీ సాధించాడు. భారత్ అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఇది ఆరో సారి కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్ అజేయంగాముగించింది. గతంలో భారత్‌కు అండర్–19 వరల్డ్ కప్ అందించిన కెపె్టన్లు కైఫ్ (2000), కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్ (2012), పృథ్వీ షా (2018), యశ్ ధుల్ (2022) సరసన ఆయుశ్ మాత్రే నిలిచాడు. స్థాయి ఎలాంటిదైనా, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా తనకు తెలిసింది మైదానంలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడమే అని వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరూపించాడు. ఈ పాలబుగ్గల కుర్రాడు సునామీ ఆటతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోయాడు. ఆ షాట్లలో పవర్, పదును, ఎక్కడా తడబాటు కనిపించకుండా పూర్తి సాధికారతతో ఆడిన వైనం నిజంగా అసాధారణం. విశేషణాలతో వర్ణించలేని గొప్ప ఇన్నింగ్స్‌ను వైభవ్ క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. పాయింట్, కవర్స్, మిడ్ వికెట్, ఫైన్ లెగ్, లాంగాఫ్, లాంగాన్... ఇలా ప్రతీ దిశలో అత్యద్భుత షాట్లతో పరుగుల సునామీ సృష్టించిన వైభవ్ ఏకంగా 15 ఫోర్లు, 15 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.బౌండరీల ద్వారానే 150 పరుగులు రాబట్టిన అతని ఆట ముందు అండర్–19 వరల్డ్ కప్ దాసోహమంటూ భారత యువ జట్టును ఆరోసారి విశ్వ విజేతను చేసింది. వైభవ్ మెరుపులతో 400పైగా పరుగులు చేసి సవాల్ విసిరిన భారత్ ముందు ఇంగ్లండ్ నిలవలేకపోయింది. కొంత పోరాడినా లక్ష్యానికి సుదూరంగానే ఆగిపోవడంతో భారత కుర్రాళ్లు ప్రపంచ చాంపియన్లుగా సగర్వంగా నిలిచారు. హరారే: ఐసీసీ అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ మరోసారి విజేతగా నిలిచింది. మొత్తం 16 సార్లు టోర్నీని నిర్వహించగా... భారత్ టైటిల్ సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ అండర్–19 టీమ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వైభవ్ సూర్యవంశీ (80 బంతుల్లో 175; 15 ఫోర్లు, 15 సిక్స్‌లు) అసాధారణ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (51 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్ ఫాల్క్‌నర్ (67 బంతుల్లో 115; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకం నమోదు చేయగా, బెన్ డాకిన్స్ (56 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 169.49 స్ట్రయిక్‌రేట్‌తో మొత్తం 439 పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కింది. రాణించిన కెప్టెన్ గత మ్యాచ్‌లో చెలరేగిన హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (9) ఫైనల్లో విఫలమైన అనంతరం వైభవ్, ఆయుశ్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ధాటిగా ఆడిన కెప్టెన్ 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, 51 పరుగులు జత చేసిన వేదాంత్ త్రివేది (36 బంతుల్లో 32; 2 ఫోర్లు), విహాన్ మల్హోత్రా (36 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. అభిజ్ఞాన్ కుందు (31 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్), చివర్లో కనిష్క్ చౌహాన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు ప్రదర్శించడంతో స్కోరు 400 దాటింది. తొలి 25 ఓవర్లలో 250 పరుగులు చేసిన భారత్ తర్వాతి 25 ఓవర్లలో 161 పరుగులు సాధించింది.ఫాల్క్ నర్ మినహా... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బాగా తడబడింది. డాకిన్స్, బెన్ మాయెస్ (28 బంతుల్లో 45; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించి మెరుగైన స్థితిలో నిలిపినా ఆ తర్వాత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 22 ఓవర్లలో 177/7 వద్ద ఓటమికి చేరువైంది. ఈ దశలో జేమ్స్ మింటో (28)తో కలిసి ఫాల్‌్కనర్ కొద్దిగా పోరాడాడు. భారీ షాట్లు ఆడిన ఫాల్‌్కనర్ అంబ్రిష్ ఓవర్లో 3 సిక్స్‌లు బాది 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే ఖిలాన్ చక్కటి క్యాచ్‌తో అతను చివరి వికెట్‌గా అవుట్ కావడంతో భారత్ సంబరాల్లో మునిగిపోయింది. విధ్వంసాన్ని సృష్టిస్తూ... తొలి మూడు బంతుల్లో పరుగు తీయలేదు, నాలుగో బంతికి ఫోర్‌తో స్కోర్ మొదలైంది. అవతలి వైపు తొలి వికెట్ పడే సమయానికి 13 బంతుల్లో 10 పరుగులే. అయితే ఈ కొద్దిసేపు మాత్రమే వైభవ్ కాస్త ప్రశాంతంగా కనిపించాడు. పాయింట్ దిశగా కొట్టిన మొదటి సిక్స్‌తో జోరు షురూ చేసిన అతను అనంతరం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాతా ఇదే మోత కొనసాగుతూ మరో 14 సిక్సర్లు అతని ఖాతాలో చేరాయి! మింటో ఓవర్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన వైభవ్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ ఫర్హాన్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన అనంతరం అతని తర్వాతి ఓవర్లో వైభవ్ మరింత చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 4, 6తో బంతిని చితక్కొట్టాడు. ఆల్బర్ట్ ఓవర్లో ఆఫ్ సైడ్ దిశగా సింగిల్ తీయడంతో 55 బంతుల్లో వైభవ్ శతకం పూర్తయింది. ఆ వెంటనే గ్రీన్ ఓవర్లో కూడా మరో 2 సిక్స్‌లు కొట్టిన అనంతరం ఆల్బర్ట్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్లో మరింత పండగ చేసుకున్నాడు. వైభవ్ వరుసగా 2, 4, 6, 6, 4, 4 బాదగా వైడ్‌తో కలిసి మొత్తం 27 పరుగులు వచ్చాయి. 71 బంతుల్లో అతను 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అర్ధసెంచరీ నుంచి సెంచరీ చేరేందుకు 23 బంతులు తీసుకున్న అతనికి సెంచరీనుంచి 150కు చేరేందుకు 16 బంతులు సరిపోయాయి. మోర్గాన్ ఓవర్లో కూడా 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టిన అతను డబుల్ సెంచరీ దిశగా నడిచాడు. అయితే పుల్–సూ్కప్ షాట్‌కు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ అసాధారణ ఇన్నింగ్స్ ముగిసింది.175 సీనియర్ వరల్డ్ కప్, మహిళల వరల్డ్ కప్‌తో సహా ఏదైనా ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక స్కోరు (175) సాధించిన బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. అండర్–19 స్థాయిలో వైభవ్ కొత్త రికార్డులిలా... 1 భారత్ తరఫున వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు 2 ఓవరాల్‌గా భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరు (తొలి స్థానంలో అంబటి రాయుడు 177 నాటౌట్) 15 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు 30 అత్యధిక బౌండరీలు 150 బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు 5 ఐదో వేగవంతమైన సెంచరీ (55 బంతుల్లో) 30 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు 439 ఒకే వరల్డ్ కప్‌లో భారత్ తరఫున చేసిన పరుగుల్లో శిఖర్ ధావన్ (505) తర్వాత రెండో స్థానం. స్కోరు వివరాలు భారత అండర్–19 ఇన్నింగ్స్: ఆరోన్ జార్జ్ (సి) మాయెస్ (బి) గ్రీన్ 9; వైభవ్ (సి) ర్యూ (బి) లమ్స్‌డెన్ 175; ఆయుశ్ (సి) మాయెస్ (బి) గ్రీన్ 53; వేదాంత్ (సి) మాయెస్ (బి) మింటో 32; విహాన్ (సి) డాకిన్స్ (బి) మింటో 30; అభిజ్ఞాన్ (సి) ఆల్బర్ట్ (బి) మోర్గాన్ 40; అంబ్రిష్ (బి) మింటో 18; కనిష్క్ (నాటౌట్) 37; ఖిలాన్ (సి) మూర్స్ (బి) మోర్గాన్ 3; హెనిల్ (రనౌట్) 5; దీపేశ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 411. వికెట్ల పతనం: 1–20, 2–162, 3–251, 4–302, 5–308, 6–359, 7–367, 8–375, 9–393. బౌలింగ్: మోర్గాన్ 9–0–74–2, గ్రీన్ 5–0–49–2, లమ్స్‌డెన్ 8–0–81–1, మింటో 8–0–63–3, ఫర్హాన్ 10–0–77–0, ఆల్బర్ట్ 10–0–66–0. ఇంగ్లండ్ అండర్–19 ఇన్నింగ్స్: డాకిన్స్ (సి) ఖిలాన్ (బి) ఆయుశ్ 66; మూర్స్ (బి) అంబ్రిష్ 17; మాయెస్ (సి) హెనిల్ (బి) ఖిలాన్ 45; థామస్ ర్యూ (సి) ఆయుశ్ (బి) కనిష్క్ 31; ఫాల్క్‌నర్ (సి) ఖిలాన్ (బి) కనిష్క్ 115; ఆల్బర్ట్ (రనౌట్) 0; ఫర్హాన్ (సి) అభిజ్ఞాన్ (బి) దీపేశ్ 1; మోర్గాన్ (సి) అండ్ (బి) దీపేశ్ 0; మింటో (సి) (సబ్) ఇనాన్ (బి) అంబ్రిష్ 28; లమ్స్‌డెన్ (సి) వేదాంత్ (బి) అంబ్రిష్ 3; గ్రీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (40.2 ఓవర్లలో ఆలౌట్) 311. వికెట్ల పతనం: 1–19, 2–93, 3–142, 4–174, 5–174, 6–177, 7–177, 8–269, 9–281, 10–311. బౌలింగ్: అంబ్రిష్ 9–1–56–3, హెనిల్ 4–2–28–0, దీపేశ్ 6–0–64–2, ఖిలాన్ 8–0–66–1, కనిష్క్ 8.2–0–63–2, ఆయుశ్ 5–0–31–1. -
ఆరో టైటిల్ వేటలో...
హరారే: యువ భారత్ అండర్–19 ప్రపంచకప్ వేట ‘ఫైనల్’ మజిలీకి చేరింది. కుర్రాళ్ల ‘కప్’ కల ఈ ఒక్క విజయంతోనే నెరవేరుతుంది. అన్ని గెలవడం ఒక ఎత్తు అయితే... ఈ ఒక్కదాంతో ‘ప్రపంచ’ అందలం ఎక్కడం మరో ఎత్తు. ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత జట్టుకు ఈ మ్యాచ్ విలువేంటో బాగా తెలుసు. అందుకే ‘కప్’ చేతికందే తుది పోరును కూడా విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ రెండో ప్రపంచకప్ విజయం కోసం ఆరాటపడుతోంది. భారత్‌లాంటి దుర్బేధ్యమైన జట్టును ఓడించి ‘ప్రపంచా’న్ని గెలవడం కష్టమైనా... రెండున్నర దశాబ్దాల తర్వాత వచి్చన ఈ వరల్డ్‌కప్ చాన్స్‌ను ఎంతమాత్రం చేజార్చుకోవద్దని గట్టిగా కోరుకుంటుంది. పదో సారి ఫైనల్‌కు...అండర్–19 ప్రపంచకప్ 1988లో మొదలైంది. ఇప్పటివరకు 15 మెగా ఈవెంట్లు జరిగితే ఏ కుర్ర జట్టుకు సాధ్యం కానీ ఐదు టైటిళ్లను భారత జట్టే గెలిచింది. ఓవరాల్‌గా 16 (ప్రస్తుత కప్) ప్రపంచకప్‌ల్లో 10 సార్లు ఫైనల్ చేరిన ఘనచరిత్ర కూడా మనదే! వరుసగా యువ భారత్‌కిది ఆరో ఫైనల్. గత 2024 ఈవెంట్లోనూ ఫైనల్ చేరినా... ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ ఈ ఈవెంట్లో యువ క్రికెటర్ల ఆటతీరు... కనబరిచిన నిలకడ, సమష్టి ప్రదర్శన చూస్తే ఈసారి సరిపెట్టుకోదు... కప్ పట్టుకెళ్లడం ఖాయమని ఎవరైనా అంటారు. అంతలా భారత జైత్రయాత్ర సాగుతోంది. ఇంగ్లండ్ కథాకమామీషు... ఇంగ్లండ్ 1998లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో తొలిసారి టైటిల్ గెలిచింది. ఐసీసీ అండర్–19 పుటల్లో తప్ప... ఇంగ్లండ్ క్రికెట్లో మరుగున పడిపోయిన విజయమది. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు కప్ వేటలో పడిన ఇంగ్లండ్‌కు ఫైనల్లో మింగుడుపడని ప్రత్యర్థి, టైటిల్ ఫేవరెట్ భారత్ ఎదురవడమే ప్రధాన సమస్య. అయితే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించిన ఇంగ్లండ్... ఆఖరి పోరులో అజేయమైన గత ఫైనలిస్టును ఓడిస్తే ఇంతకుమించిన పండగ మరొకటి ఉండదేమో! భారత్ ఇలా... ఇంగ్లండ్ అలా... గ్రూప్ ‘బి’లో లీగ్ దశను మొదలుపెట్టిన భారత్ ముందు బ్యాటింగ్ చేసినా... తర్వాత లక్ష్యాన్ని ఛేదించినా అన్ని విజయంతోనే ముగించింది. అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై గెలిచి ‘సూపర్ సిక్స్’కు చేరింది. అక్కడ జింబాబ్వే, పాకిస్తాన్లను కంగుతినిపించి రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి ఆఖరి పోరుకు అర్హత సాధించింది. సరిగ్గా భారత్‌లాగే గ్రూప్ ‘సి’లో పాకిస్తాన్, జింబాబ్వే, స్కాట్లాండ్లపై ఇంగ్లండ్ గెలిచి లీగ్ దశను విజయవంతంగా దాటింది. ‘సూపర్ సిక్స్’లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై గెలిచి... తొలి సెమీఫైనల్లో నిరుటి విజేత ఆ్రస్టేలియాను ఇంటికి పంపి ఫైనల్ బరిలో నిలిచింది. జట్ల వివరాలు భారత్: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, దీపేశ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, ఉధవ్ మోహన్, హర్వంశ్ పంగాలియా, కిషన్ సింగ్. ఇంగ్లండ్: థామస్ ర్యూ (కెప్టెన్), రాల్ఫీ అల్బెర్ట్, అలీ ఫారూఖ్, డెన్ డాకిన్స్, ఫాల్కోనెర్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ల్యూక్ హాండ్స్, ఇసాక్ మొహమ్మద్, మ్యానీ లమ్స్‌డెన్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, జోసెఫ్ మూర్స్, సెబాస్టియన్ మోర్గాన్. -
బెన్ స్టోక్స్‌కు తీవ్ర గాయం.. ముఖం వాచిపోయింది
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా ఓ రాకాసి బంతి అతడి మొఖానికి బలంగా తాకింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను స్టోక్స్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తను షేర్ చేసిన ఫోటోలో అతడి ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.స్టోక్స్ కుడి కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు స్టోక్స్ 'ఆ బంతి పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి'అని నవ్వుతూ ఉన్న ఎమోజీ క్యాప్షన్‌గా ఇచ్చాడు. అయితే స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా కాకుండా.. తన సహచర ఆటగాళ్లతో పక్కన నిలబడి ఉన్న సమయంలో బంతి తగిలి గాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చిన స్టోక్స్.. కౌంటీ సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. స్టోక్స్ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు వారాల సమయం పట్టనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత అతడు తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు.అయితే స్టోక్స్ కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతుండడంతో ఈ ఏడాది జూన్ వరకు జాతీయ జట్టుకు దూరంగా ఉండనున్నాడు. ఇంగ్లండ్ జట్టు జూన్ నెలలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో స్టోక్స్ తిరిగి జట్టును నడిపించనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలవాలంటే ఇంగ్లండ్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. -
బ్రూక్ విధ్వంసం.. టీ20 సిరీస్ కూడా ఇంగ్లండ్‌దే
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు ఇంగ్లండ్ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ను (2-1) కైవసం చేసుకున్న ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. పల్లెకెలె వేదికగా జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఛేదన సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 168 పరుగులుగా సెట్ చేశారు. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. టామ్ బాంటన్ (54 నాటౌట్) అజేయ అర్ద శతకంతో.. హ్యారీ బ్రూక్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 3న జరుగనుంది.రాణించిన రత్నాయకేలంక ఇన్నింగ్స్‌లో పవన్ రత్నాయకే (22 బంతుల్లో 40) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక (34), కమిల్ మిషారా (36), , కుసాల్ మెండిస్ (32), అసలంక (28 నాటౌట్) కూడా పర్వాలేదనిపించారు. ఆఖర్లో కెప్టెన్ దసున్ షనక (6 బంతుల్లో 1) బంతులు వృధా చేసి నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.విధ్వంసం సృష్టించిన బ్రూక్డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని కుదించాక ఇంగ్లండ్ బ్యాటర్లు టామ్ బాంటన్ (33 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (14 బంతుల్లో 20 నాటౌట్; సిక్స్, ఫోర్) చెలరేగిపోయారు. జోస్ బట్లర్ (39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో పతిరణ 2, షనక, వెల్లాలగే తలో వికెట్ తీశారు. -
రెండేళ్లకే రెండు గిన్నిస్ రికార్డులు..!
పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లుగా ఈ బుడతడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ఎత్తుకు సరిపోని స్నూకర్ గేమ్‌ని ఆడి అందర్ని అబ్బురపరుస్తున్నాడు. పెద్దవాళ్లు ఆడగలిగే ఈ గేమ్ తన ఎత్తు కారణంగా ఇబ్బందిపడ్డా కూడా..ఆశ్చర్యపోయే విధంగా షాట్లు కొట్టి గిన్నిస్ రికార్డులకెక్కడు. ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన ఈ రెండేళ్ల బాలుడు జూడో ఓన్స్ ఒక ఆటలో రెండు ట్రిక్ షాట్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరించింది. స్నూక్ర్ క్రీడా పూల్ క్యూ క్రీడను పోలి ఉంటుంది. టేబుల్‌పై పెద్ద సంఖ్యలో బంతులు పెట్టి ఆడతారు. క్యూ బాల్‌తో ఇతర బాల్లను కొట్టినప్పుడూ నేరుగా నిర్ధేశిత హోల్లో పడేలా చేస్తారు. ఇక జూడ్ అక్టోబర్ 12, 2025న పూల్‌లో బ్యాంక్ షాట్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ ఘనత సాధించడానికి 41 రోజుల ముందు స్నూకర్ గేమ్‌లో డబుల్ షాట్(టేబుల్ అంచులకు తాకిస్తూ) చేసిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఇక్కడ డబుల్ పాట్ అనేది ఒకే స్ట్రైక్‌లో రెండు బంతులను క్యూ బాల్‌తో జత చేసి నిర్దేశిత హోల్లో పడేలా చేస్తే బ్యాంక్ షాట్ అంటారు. నిజానికి ఎత్తు రీత్యా అంత ఎత్తులో ఉండే టేబుల్‌పై ఆడే క్రీడను జూడో కిచెన్ స్టూల్ సాయంతో నుంచొని ఆడటం విశేషం. అలా అయినా అతని వయసుకి ఆడటం కష్టమే కానీ ఈ చిచ్చరపిడుగు అదేమంతా కష్టం కాదంటూ అవలీలగా చేసి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. కాగా, జూడ్ తండ్రి లూక్ ఒక మినీ టేబుల్ని కొన్నప్పుడే అతనికి స్నూకర్, పూల్ ఆటలను పరిచయం చేశాడు. ఆ చిన్న వయసులోనే తన చిట్టి చేతులతో చాలా సునాయాసంగా క్యూని తీసుకుని అవలీలగా బాల్స్ అన్నింటిని కొట్టేసేవాడని వివరించాడు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెట్టింట షేర్ చేసేవాడు జూడో తండ్రి లూక్. ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ క్రెయిగ్ గ్లెండే కూడా ఇంత చిన్న వయసులోనే జూడ్ ఇంత ప్రతిభ,అంకితభావం, ఉత్సాహాన్ని చూపించడం అత్యంత ప్రత్యేకమని అన్నారు. (చదవండి: Intermittent Fasting: అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ఇంగ్లాండ్‌లో... చైనా ఫోన్ ట్యాపింగ్ కలకలం
చైనా కంట్రీపై ఇంగ్లాండ్‌లో పలు నివేదికలు సంచలన అంశాలను ప్రచురించాయి. ఆ దేశ మాజీ ప్రధానుల ఉన్నతాధికారుల ఫోన్లను చైనా హ్యాక్ చేసినట్లు పలు నివేదికలు తెలిపాయి. అంతేకాకుండా ఈ ట్యాపింగ్ కోసం ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్‌ను వాడినట్లు పేర్కొన్నాయి.ఇంగ్లాండ్‌లోని పలు సంస్థల నివేదికలు ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ ప్రధానులుగా బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషిసునాక్లు ఉన్న సమయంలో వారి ప్రత్యేక అధికారులు వివరాలపై చైనా హ్యాకర్లు ట్యాప్ చేసినట్లు పలు నివేదికలు తెలుపున్నాయి. సాల్ట్టైఫూన్ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ 2021-2024 మధ్య జరిగిందని పేర్కొన్నాయి. అందులోనూ రిషి సునాక్ ఆ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ హ్యాకి్ంగ్ ఎక్కువ జరిగిందని నివేదికలు తెలిపాయి. అయితే ఇటీవల చైనా లండన్‌తో పాటు యూరప్‌లో తన రాయబార కార్యాలయం నిర్మించాలని ప్రతిపాదనలు తీసుకరాగా బ్రిటన్ దానికి అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే ఆ దేశంలో తన దౌత్య కార్యాలయాన్ని చైనా గూడ చర్య కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఉందని నిరసనలు చెలరేగాయి. దీంతో ఈ నిర్ణయంపై ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తన నిర్ణయాన్ని పదేపదే వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో చైనా తన నిరసన తెలిపింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. అయితే తాజాగా ఫోన్ ఈ నివేదిక మరోసారి ఈ అంశంపై అనుమానాలను రేకెత్తిస్తుంది. -
ఇంగ్లండ్ కోచ్‌గా బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, ఇంగ్లండ్-ఏ జట్టు (ఇంగ్లండ్ లయన్స్) కోచ్‌గా మారాడు. అతనితో పాటు మరో ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ కూడా లయన్స్ కోచింగ్ టీమ్‌లో చేరాడు. వచ్చే నెలలో పాకిస్తాన్-ఏతో (పాకిస్తాన్ షాహీన్స్) జరుగబోయే వైట్ బాల్ సిరీస్ కోసం ఈ ఇద్దరూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పించడం కోసం స్టోక్స్-మొయిన్ కోచ్ అవతరామెత్తారు. లయన్స్ తమ చివరి యూత్ టీ20ని 2018లో.. చివరి యూత్ వన్డేను 2023లో ఆడింది. లయన్స్‌లో ఈ గ్యాప్‌ను కవర్ చేసేందుకే స్టోక్స్-మొయిన్ కోచింగ్ బాట పట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి లయన్స్ కోచింగ్ బృందంలో పని చేస్తారు. స్టోక్స్-ఫ్లింటాఫ్ గత ఎడిషన్ హండ్రెడ్ లీగ్‌లో కూడా కలిసి పని చేశారు. స్టోక్స్ నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఫ్లింటాఫ్ ఆ ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేశాడు.ఇటీవల యాషెస్ సిరీస్ చివరి టెస్ట్ సందర్భంగా గాయపడిన స్టోక్స్ ఈ కోచింగ్ అనుభవాన్ని రిహాబ్గా ఉపయోగించుకుంటాడు. మొయిన్ విషయానికొస్తే.. ఇతను తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని, దేశవాలీ టీ20 టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యార్క్‌షైర్ టీమ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆటగాడిగా కెరీర్ చరమాంకంలో ఉన్న మొయిన్ ఈ కోచింగ్ అనుభవాన్ని తన కోచింగ్ కెరీర్‌కు పునాదిగా మలుచుకోనున్నాడు. పాకిస్తాన్-ఏ సిరీస్‌కు స్టోక్స్, మొయిన్‌తో పాటు మరికొంతమంది మాజీలు కూడా కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. వీరి కోచింగ్ బృందంలో నీల్ మెక్కెంజీ, సారా టేలర్, నీల్ కిల్లెన్, అమర్ రషీద్, ట్రాయ్ కూలీ ఉన్నారు.ఇంగ్లండ్ లయన్స్ జట్టు యూఏఈ వేదికగా పాక్-ఏతో మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. స్టోక్స్, మొయిన్‌కు యూఏఈలో ఆడిన అనుభవం ఉండటం కూడా వారిని కోచ్‌లుగా ఎంపిక చేసేలా చేసింది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు జోర్డన్ కాక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో జేమ్స్ కోల్స్, సాకిబ్ మహమూద్ లాంటి టీ20 స్పెషలిస్ట్‌లు ఉన్నారు.ఇంగ్లండ్ లయన్స్ టీ20 జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్ (కెప్టెన్), స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, సాకిబ్ మహమూద్, బెన్ మెకిన్నీ, టామ్ మూర్స్, డాన్ మౌస్లీ, మాట్ రెవిస్, విల్ స్మీడ్, నాథన్ సౌటర్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్వన్డే జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ (కెప్టెన్), లియామ్ ప్యాటర్సన్-వైట్, మాథ్యూ పాట్స్, మాట్ రెవిస్, జేమ్స్ రెవ్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్, జేమ్స్ వార్టన్. -
రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్ స్టార్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మరోసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. 2021లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, తిరిగి 2023 యాషెస్ సిరీస్ కోసం బరిలోకి దిగిన అతను.. తాజాగా తన దేశవాలీ రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకున్నాడు.2025లో ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి తప్పుకున్న మొయిన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, దేశవాలీ క్రికెట్లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే తన పాత జట్టును కాదని కొత్త జట్టుతో (యార్క్‌షైర్) ఒప్పందం చేసుకొని టీ20 బ్లాస్ట్, ద హండ్రెడ్ లీగ్‌ల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు.మిగతా దేశాల ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు మొయిన్ అప్పట్లో దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా ఆ రూల్స్ సవరించబడటంతో, దేశవాలీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.మొయిన్ రిటైర్మెంట్ యూటర్న్ నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న ఇలాంటి ఉదంతాలపై ఓ లుక్కేద్దాం. క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అనేక మంది రిటైర్మెంట్ ప్రకటించి, తిరిగి మైదానంలోకి వచ్చారు. కొందరు అంతర్జాతీయ కెరీర్లలో ఇలా చేస్తే, మరికొందరు ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొనేందుకు రిటైర్మెంట్ను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి వారిలో టాప్-10 ఆటగాళ్లను పరిశీలిద్దాం.ముందుగా అంతర్జాతీయ రిటైర్మెంట్ యూటర్న్‌ను తీసుకుంటే.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 1987లో రిటైర్మెంట్ ప్రకటించి, ఆ దేశ ప్రభుత్వం అభ్యర్థన మేరకు 1988లో దాన్ని ఉపసంహరించుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత ప్రభావవంతమైన యూటర్న్. ఎందుకంటే ఇమ్రాన్ రిటైర్మెంట్ను వెనక్కు తీసుకొని పాక్‌ను వన్డే ప్రపంచకప్ గెలిపించాడు.ఆతర్వాత అదే దేశానికి చెందిన జావిద్ మియాందాద్ 1993లో ఆటకు వీడ్కోలు పలికి, మూడేళ్ల తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నాడు. 1996 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు అతను ఈ పని చేశాడు. రిటైర్మెంట్ ఉపసంహరించుకొని ఆ ప్రపంచకప్ బరిలోకి దిగినా మియాందాద్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.కార్ల్ హూపర్ (వెస్టిండీస్)రిటైర్మెంట్: 1999ఉపసంహరణ: 2001, రీఎంట్రీలో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడుప్రభావం: హూపర్ రీఎంట్రీతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్లో సిర్థరత్వం వచ్చింది.షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)రిటైర్మెంట్: అనేకసార్లు (2010, 2011, 2016)ఉపసంహరణ: మూడు సార్లుబ్రెండన్ టేలర్ (జింబాబ్వే)రిటైర్మెంట్: 2015ఉపసంహరణ: 2017మొహమ్మద్ ఆమీర్ (పాకిస్తాన్)రిటైర్మెంట్: 2020ఉపసంహరణ: 2024మొయిన్ అలీ (ఇంగ్లండ్)రిటైర్మెంట్: 2021 (టెస్ట్ క్రికెట్)రీఎంట్రీ: 2023 యాషెస్ సిరీస్తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)రిటైర్మెంట్: 2023ఉపసంహరణ: దేశ ప్రధాని జోక్యంతో మరుసటి రోజేఇమాద్ వసీమ్ (పాకిస్తాన్)రిటైర్మెంట్: 2023రీఎంట్రీ: 2024క్రికెట్‌కు ఓవరాల్‌గా రిటైర్మెంట్ ప్రకటించి ప్రైవేట్ టీ20ల్లో ఆడిన ఆటగాళ్లు..ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)రిటైర్మెంట్: 2018ఐపీఎల్లో రీఎంట్రీకెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)రిటైర్మెంట్: 2012ఐపీఎల్, కౌంటీ క్రికెట్లోకి రీఎంట్రీబ్రెండన్ మెక్కల్లమ్ (న్యూజిలాండ్)రిటైర్మెంట్: 2016ఐపీఎల్ సహా మిగతా టీ20 లీగ్‌ల్లో రీఎంట్రీవీరే కాక ప్రొఫెషనల్ క్రికెట్ మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించి ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో, దేశవాలీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. -
వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్ సెంచరీల పర్వం
ఈ జనరేషన్లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరని అడిగితే.. కొద్ది రోజుల కిందటి వరకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు క్రికెట్ అభిమానులు ఇబ్బంది పడేవారు. ఎందుకంటే, ఫాబ్ ఫోర్‌గా పిలువబడే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ మధ్య అత్యుత్తమ బ్యాటర్ అనిపించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉండేది. వీరంతా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, ఏ ఒక్కరికీ అత్యుత్తమ బ్యాటర్ అనే కీర్తి దక్కకుండా పోటీపడేవారు.అయితే గత కొద్ది రోజులగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. అత్యుత్తమ బ్యాటర్ అనిపించుకునేందుకు జో రూట్ సోలోగా ముందుకొస్తున్నాడు. సహచరులు విరాట్, స్టీవ్, కేన్‌ను వెనక్కు నెడుతూ తానే అత్యుత్తమ బ్యాటర్‌నంటూ బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు. విరాట్ (37), స్టీవ్ (36), కేన్ (35) వయసు మీద పడటంతో ఏదో ఒక ఫార్మాట్‌కు/ఫార్మాట్లకు పరిమితం కాగా.. రూట్ (35) కూడా వారి ఏజ్ గ్రూప్‌లోనే ఉన్నా, మూడు ఫార్మాట్లలో కొనసాగుతూ టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అత్యుత్తమంగా సత్తా చాటుతున్నాడు. రూట్ మినహా ఫాబ్‌లోని మిగతా ముగ్గురు ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు.టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో దూసుకుపోతుండగా.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్ టెస్ట్‌ల్లో మాత్రమే సత్తా చాటుతున్నాడు. కేన్ విషయానికొస్తే.. ఇటీవలికాలంలో ఫాబ్-4లో బాగా వెనుకపడిపోయింది ఇతనే. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్.. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నా, ఏ ఒక్క ఫార్మాట్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు.రూట్ పరిస్థితి మాత్రం పై ముగ్గురికి భిన్నంగా ఉంది. ఇతను ఏ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా మూడు ఫార్మాట్లలోనూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో యంగస్టర్లకు సైతం పోటీగా మారాడు.ఇటీవలికాలంలో టెస్ట్, వన్డేల్లో రూట్ ప్రదర్శనలు చూస్తే ఔరా అనక మానదు. గత ఆరేడేళ్ల కాలంలో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఫాబ్-4లోని మిగతా ముగ్గురికి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో రూట్‌కు కల్లెం వేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఈ మధ్యకాలంలో అతను ఏకంగా 22 సెంచరీలు బాదాడు. వన్డేల్లో కెరీర్ ముగిసిందనుకున్న దశలో ఈ ఫార్మాట్లోనూ రూట్ మెరుపులు ప్రారంభమయ్యాయి. చాలాకాలం సైలెంట్‌గా ఉన్న అతను.. ఈ మధ్యకాలంలో ఈ ఫార్మాట్లోనూ మూడు, నాలుగు సెంచరీలు చేశాడు.తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రూట్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలతో సర్దుకున్న అతను.. ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సూపర్ సెంచరీతో మెరిశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 20వ సెంచరీ. ఓవరాల్‌గా 61వది. ప్రస్తుత తరం బ్యాటర్లలో విరాట్ కోహ్లి (85) మాత్రమే రూట్ కంటే ముందున్నాడు.వాస్తవానికి విరాట్, స్టీవ్, కేన్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు రూట్ చాలా వెనుకపడి ఉండేవాడు. వారికి రూట్‌కు పదుల సంఖ్యలో సెంచరీల వ్యత్యాసం ఉండేది. వారంతా రూట్ కంటే చాలా ముందుండే వారు. అయితే ఐదేళ్లలో సీన్ మొత్తం తలకిందులైంది. అతను స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌ను వెనక్కు నెట్టి విరాట్‌తో పోటీపడుతున్నాడు. వాస్తవానికి విరాట్ కూడా టెస్ట్‌ల్లో రూట్ ముందు దిగదుడుపే. నంబర్ల విషయంలో అతన్ని రూట్ ఎప్పుడో దాటేశాడు. ఇక టెస్ట్‌ల్లో రూట్ ముందున్న ఏకైక టార్గెట్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. రూట్ తర్వలోనే సచిన్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్డేల్లోనూ రూట్ జోరు ఇలాగే కొనసాగితే విరాట్ సెంచరీల సంఖ్య దాటడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ కెరీర్లో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. నిన్న (జనవరి 24) శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో (2.3-0-13-2, ఓ క్యాచ్, (90 బంతుల్లో 72; 5 ఫోర్లు)) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న అతడు.. ఇంగ్లండ్ తరఫున అత్యధిక POTM అవార్డులు (383 మ్యాచ్‌ల్లో 27) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెవిన్ పీటర్సన్ (277 మ్యాచ్‌ల్లో 26) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రూట్, కేపీ తర్వాత జోస్ బట్లర్ (24), ఇయాన్ మోర్గాన్ (23) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రూట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 27న కొలొంబో వేదికగానే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత శ్రీలంకతో పాటు భారత్‌లో ప్రపంచకప్ మొదలవుతుంది.ఎనిమిది మందితో ప్రయోగంటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించింది. తలో చేయి వేయడంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ఓవర్టన్, ఆదిల్ రషీద్, రూట్ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్, జాక్స్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (40), అసలంక (45) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.రాణించిన రూట్అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. రూట్ (75), బ్రూక్ (42), డకెట్ (39), బట్లర్ (33 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును గెలిపించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, వాండర్సే తలో 2, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. -
SL vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక
కొలంబో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన శ్రీలంక జట్టు తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (117 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోగా... జనిత్ లియనాగె (53 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా కొన్ని పరుగులు చేయడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. కమిల్ మిశ్రా (27), నిసాంక (21), కెపె్టన్ అసలంక (17), దునిత్ వెల్లలాగె (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (90 బంతుల్లో 61; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ఈ ఇద్దరూ రాణించడంతో ఒక దశలో 129/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (6), జాక్ క్రాలీ (6), జోస్ బట్లర్ (19), సామ్ కరన్ (5) విఫలమయ్యారు. జేమీ ఓవర్టన్ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రేహాన్ అహ్మద్ (27; 5 ఫోర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. లంక బౌలర్లలో ప్రమోద్ 3 వికెట్లు పడగొట్టగా... దునిత్, జెఫ్రీ వండర్సె చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన దునిత్ వెల్లలాగెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ యువ బ్యాటర్
ఇంగ్లండ్ యువ బ్యాటర్ బెన్ మేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో భాగంగా స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో మేస్ కేవలం 65 బంతుల్లో శతక్కొట్టి, మొత్తంగా 117 బంతుల్లో 191 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మేస్ మరో రెండు పరుగులు చేసుంటే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు తరఫున అయిన అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి ఉండేవాడు. ఈ ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు విరాన్ చముదిత పేరిట ఉంది. విరాన్ ఇదే ఎడిషన్‌లో జపాన్‌పై 192 పరుగుల చేశాడు. మేస్.. మరో శ్రీలంక ఆటగాడు హసిత బోయగోడాతో కలిసి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. హసిత కూడా మేస్ లాగే 191 పరుగుల వద్ద ఆగిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేస్ భారీ శతకంతో పాటు ఓపెనర్ జోసఫ్ మూర్స్ (81) అర్ద సెంచరీతో రాణించాడు. లోయర్ మిడిలార్డర్ ఆటగాడు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 400 పరుగుల మైలురాయిని తాకింది. కెప్టన్ థామస్ రూ 22, కాలెబ్ ఫాల్క్‌నర్ 32, రాల్ఫీ ఆల్బర్ట్ 13, ఫర్హాన్ అహ్మద్ 15 (నాటౌట్), సెబాస్టియన్ మోర్గాన్ 24 (నాటౌట్) పరుగులు చేశారు. మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ 5 పరుగులకే ఔటయ్యాడు.స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్‌హౌస్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిన్లే జోన్స్ 2, మ్యాక్స్ ఛాప్లిన్ ఓ వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ తడబడుతుంది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 48 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మనూ సరస్వత్ (6), మ్యాక్స్ ఛాప్లిన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, లూక్ హ్యాండ్స్, ఫర్హాన్ అహ్మద్‌కు తలో వికెట్ దక్కింది.కాగా, ప్రస్తుత ఎడిషన్ ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. మరోవైపు స్కాట్లాండ్.. జింబాబ్వేతో ఆడాల్సిన తమ తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. -
100 మందికి పైగా పోలీసుల ఆత్మహత్యలు?
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు బ్రిటన్‌లో సంచలనంగా మారాయి. ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ తాజా నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో దాదాపు 100 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు.అంతేకాకుండా 200 కంటే ఎక్కువ మంది అధికారులు ఆత్మహత్యయాత్నం చేశారంట. దీన్ని ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ నిశ్శబ్ద విపత్తుగా అభివర్ణించింది. దీనిని అరికట్టడానికి #CoppedEnough అనే నిరసన కార్యక్రమాన్ని పోలీస్ ఫెడరేషన్ చేపట్టింది.అయితే ఆత్మహత్య చేసుకున్న వారిలో అత్యధిక మంది ఏదో ఒక రకమైన శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం. చిన్నచిన్న కారణాలకు కూడా విచారణలను ఏళ్ల తరబడి సాగదీయడం వల్ల అధికారులు మనస్తాపానికి గురువుతన్నట్లు ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.ఈ ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ఫెడరేషన్ కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. అధికారులపై జరిగే క్రమశిక్షణ విచారణలను గరిష్టంగా ఒక ఏడాది లోపే పూర్తి చేయాలని సూచించింది. ప్రతి పోలీసు అధికారి ఆత్మహత్యను ఖచ్చితంగా రికార్డ్ చేసేలా చట్టం తీసుకురావాలని ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డారెన్ లెహ్మన్ కొడుకు జేక్ లెహ్మన్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్‌ను 2024-25 సీజన్‌కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక ఈ అవార్డు లభించింది.ఆసీస్ దేశవాలీ క్రికెట్లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్‌షైర్ కౌంటీతో లోకల్ ప్లేయర్ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్ విషయంలో ఇదే జరిగింది. జేక్ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.షెఫీల్డ్ షీల్డ్‌లో రికార్డు ప్రదర్శన జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్‌ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్ ఫైనల్లో జేక్ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్‌బాల్ టైటిల్‌ను అందించింది.తండ్రి వారసత్వం జేక్ తండ్రి డారెన్ లెహ్మన్ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్‌లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు. ఆస్ట్రేలియాకు ఆడటం నా కలజేక్ ఆసీస్ తరఫున ఆడే అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్ కౌంటీ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు. -
పరాయి దేశానికి వలస వెళ్లిన మరో సౌతాఫ్రికా క్రికెటర్
సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది ఓ కల. అయితే సౌతాఫ్రికన్లు మాత్రం ఇందుకు భిన్నం. ఈ మాట చెప్పడానికి కారణాలు లేకపోలేదు. క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ క్రీడ చరిత్రలో అత్యధిక శాతం వలస వెళ్లిన వాళ్లు సౌతాఫ్రికన్లే. వలస వెళ్లడమే కాదు.. దేశం మారాక వారిలో అధిక శాతం మంది స్టార్ క్రికెటర్లయ్యారు.సౌతాఫ్రికన్లే ఎక్కువ శాతం ఎందుకు విదేశాల్లో కెరీర్లు ప్లాన్ చేసుకుంటున్నారన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేరుకు పెద్ద దేశమే అయినా, ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్దిక వనరులు మాత్రం అంతంతమాత్రమే. క్రికెటర్లు ఇతర దేశాలకు వలస వెళ్లడానికి ఇదే ప్రధాన కారణం.చరిత్ర చూసుకుంటే, సౌతాఫ్రికాలో పుట్టిన క్రికెటర్లు ఎక్కువ శాతం ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. ఇందుకు కారణం కోల్పాక్ ఒప్పందాలు. ఈ ఒప్పందాల మేరకు 2010లో రూపొందించిన యూరోపియన్ యూనియన్ చట్టాల్లో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో స్థానిక ఆటగాళ్లుగా ఆడే అవకాశం పొందారు. సౌతాఫ్రికాతో పోల్చుకుంటే ఇంగ్లండ్‌లో మెరుగైన వేతనాలు, సౌకర్యాలు, స్థిరమైన కెరీర్ మరియు భవిష్యత్తు, అదనంగా కుటుంబ భద్రత అధికంగా లభిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ శాతం మంది సౌతాఫ్రికాలో జన్మించినా ఇంగ్లండ్‌లో కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు.ఉదాహరణకు.. సౌతాఫ్రికా దేశవాలీ క్రికెట్‌తో పోలిస్తే, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అధిక వేతనాలు లభిస్తాయి. ఇంగ్లండ్ కౌంటీలతో ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే స్థిరమైన ఆదాయం కూడా ఉంటుంది. ఈ కారణంగా కెవిన్ పీటర్సన్, జేసన్ రాయ్, జోనాథన్ ట్రాట్, ఆండ్రూ స్ట్రాస్, మ్యాట్ ప్రయర్ లాంటి సౌతాఫ్రికన్లు ఇంగ్లండ్‌కు వలస వెళ్లి, అక్కడ స్టార్లుగా ఎదిగారు. వీరికి ముందు అలన్ లాంబ్, క్రిస్ స్మిత్, డెర్క్ రాండల్ లాంటి వారు కూడా సౌతాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ దిగ్గజాలుగా మారారు.ఆర్దిక అవకాశాలు కాకుండా సౌతాఫ్రికన్లు ఇతర దేశాలకు వలస వెల్లడానికి మరో కారణం కెరీర్ స్థిరత్వం. ఇతర దేశాలతో పోలిస్తే.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ అవకాశాలు రావడం కాస్త కష్టం. వర్ణానికి సంబంధించిన రిజర్వేషన్ల కారణంగా ఆ జట్టులో పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో ఈ సమస్య ఉండదు. పౌరసత్వం పొందాకా ఆటలో రాణించగలిగితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.సౌతాఫ్రికన్లు వలసల బాట పట్టడానికి మరో కారణం కుటుంబ భద్రత మరియు జీవన ప్రమాణాలు. సౌతాఫ్రికాలోని సామాజిక–రాజకీయ అస్థిరత, నేరాల రేటు కారణంగా ఆటగాళ్లు కుటుంబ భద్రత కోసం వలస వెళ్తారు. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇతర దేశాల్లో పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉండటం వల్ల వారు వలసలకు ప్రాధాన్యత ఇస్తారు.క్రికెట్లో సౌతాఫ్రికన్ల వలసలకు మరో ప్రధాన కారణం బోర్డు పరిపాలనలో అంతర్గత సమస్యలు. ఆర్దిక సమస్యలతో కొట్టిమిట్టాడే క్రికెట్ సౌతాఫ్రికా (CSA).. పాలనా సమస్యల కారణంగా మరింత పతనమవుతుంది. బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఆటగాళ్లను వలసలు వెళ్లేలా ప్రేరేపిస్తాయి.వీటికి తోడు ప్రైవేట్ టీ20ల్లో లీగ్‌ల్లో పాల్గొనడంపై పరిమితులు ఉండటం సౌతాఫ్రికన్లను వలసలకుప్రోత్సహిస్తుంది. ఇటీవలికాలంలో చాలామంది సౌతాఫ్రికన్లు డబ్బు అధికంగా లభించే ప్రైవేటు టీ20 లీగ్‌ల కోసం జాతీయ జట్టు అవకాశాలను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టారు. హెన్రిచ్ క్లాసెన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ.ప్రైవేటు టీ20 లీగ్‌ల ప్రభావంతో ప్రస్తుతం సౌతాఫ్రికన్ల వలసల రేటు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురుచూసే వారు మాత్రం ఇంకా పక్క దేశాలవైపు చూస్తూనే ఉన్నారు. తాజాగా సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ జేజే స్మట్స్ జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో ఇటలీకి వలస వెళ్లాడు. భార్య ద్వారా ఆ దేశ పౌరసత్వం పొంది 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు సంపాదించాడు. స్మట్స్ ఇతర దేశ జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.క్రికెట్ చరిత్రలో ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించిన సౌతాఫ్రికన్లు (ఇంగ్లండ్ కాకుండా)..ఆస్ట్రేలియామార్నస్ లబూషేన్కీగన్ మాథ్యూస్ఫిరోస్ ఎర్ఫాన్క్లైవ్ ఇంగ్లిస్న్యూజిలాండ్గ్రాంట్ ఇలియట్నీల్ వాగ్నర్డెవాన్ కాన్వేలూక్ రోంచిక్రిస్ కేన్స్నమీబియాడేవిడ్ వీస్జింబాబ్వే గ్యారీ బ్యాలెన్స్ -
కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా ‘మకరవిళక్కు మహోత్సవం’
కెంట్: ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 7:10 గంటలకు నిర్మాల్య దర్శనం. ఉదయం 7:30 గంటలకు ఉష పూజ, ఉదయం 8 గంటలకు గణపతి హోమం, ఉదయం 9 గంటలకు ఉచ్చ పూజ నిర్వహించారు.సాయంత్రం 5.30 గంటల నుంచి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. రాత్రి ఉత్సవాల్లో రాత్రి 9 గంటలకు అథజా పూజ, 9.30 గంటలకు పడిపూజ, 9.45 గంటలకు హరివరాసనం నిర్వహించారు. అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్ పూజలు నిర్వహించారు. వెల్లిఒత్తిల్లం అద్రిత్ వాసుదేవ్ కూడా పూజలు నిర్వహించారు. విశ్వజిత్ త్రిక్కాకర సోపాన సంగీతం, తత్త్వమసి బృందం, భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్ భరతనాట్యం ప్రదర్శించారు. -
పావురాలకు ఆహారమేస్తే జైలుకే..! ఎక్కడో తెలుసా?
ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో జరిగిన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ రోడ్డుపై నడిచివెళుతున్న మహిళకు ప్రక్కనే పావురాల గుంపు కనిపించింది. వాటికి ఏదైనా తినిపించాలని అనిపించడంతో ఆహారం వేసింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.ఇంగ్లాండ్.. లండన్‌లో పరిసరాల పరిశుభ్రతకు అక్కడి అధికారులు కఠిన చట్టాలు అవలంభిస్తున్నారు. పాపం అది తెలియని ఓ మహిళ పక్షులకు ఆహారం తినిపించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బుధవారం లండన్‌లో ఓ మహిళ పావురాలకు ఆహారం వేసింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం రోడ్డుపై ఏదైనా పదార్థాలు వేయడం నేరం. దీంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వేడుకోవడంతో 100 పౌండ్లు జరిమానా విధించి వదిలేశారు. ఈ చిత్రాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. అయితే లండన్‌లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయడం నేరం. అంతేకాకుండా పెద్ద సౌండ్లతో సౌండ్‌బాక్సుల వాడకం అనుమతి లేకుండా కరపత్రాలు పంచడం తదితరమైన పనులన్నీ అక్కడ నేరంగా పరిగణిస్తారు. వీటికి జైలుశిక్షతో పాటు జరిమానాలు విధిస్తారు. -
ఇంగ్లండ్ క్రికెట్ మొగల్ కన్నుమూత
ఇంగ్లండ్ క్రికెట్ మొగల్‌గా పేరొందిన, ఆ దేశ క్రికెట్ బోర్డు (ECB) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ కాలియర్ (70) మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణాన్ని ECB ధృవీకరించి, అధికారిక నివాళి అర్పించింది. ప్రస్తుత ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ.. డేవిడ్ కాలియర్ క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించాని అన్నారు. ఆయన కాలంలో ఆట విస్తృతంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నారు. కాలియర్ నిజమైన జెంటిల్మన్, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. డేవిడ్ కాలియర్ 2004 అక్టోబర్‌లో ECB రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన జమానాలో ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రపంచకప్ డబుల్ (2009లో టీ20 మరియు వన్డే వరల్డ్‌కప్) సాధించింది.అలాగే పురుషుల జట్టు 2010 టీ20 వరల్డ్‌కప్ సాధించి, తమ ఖాతాలో తొలి ఐసీసీ ట్రోఫీ జమ చేసింది. వీటితో పాటు కాలియర్ హయాంలో ఇంగ్లండ్ పురుషులు, మహిళల జట్లు తొమ్మిది సార్లు (పురుషులు 4, మహిళలు 5) ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి. ECBలో చేరకముందు కాలియర్ ఇంగ్లండ్ దేశీయ క్రికెట్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్సెక్స్ కౌంటీలో అసిస్టెంట్ సెక్రటరీగా.. గ్లోస్టర్‌షైర్, లీసెస్టర్‌షైర్, నాటింగ్హామ్షైర్లో (1980–2004) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందించారు. కాలియర్ ECB పదవిలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్లు కోల్పోయిన ప్రభను తిరిగి దక్కించుకున్నాయి. అతని మరణం ఇంగ్లండ్ క్రికెట్‌కు పెద్ద లోటుగా భావించబడుతుంది. -
కన్నతల్లి ‘లైక్’ చేసిందని... ఫుట్‌బాల్ దిగ్గజానికి షాకిచ్చిన కొడుకు!
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. కన్న కొడుకే వారికి లీగల్ నోటీసులు పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇంకోసారి తనను ట్యాగ్ చేస్తే చట్టపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందేశం పంపినట్లు తెలుస్తోంది.కాగా మాజీ పాప్ స్టార్ విక్టోరియా ఆడమ్స్‌ను ప్రేమించి డేవిడ్ బెక్‌హామ్ (David Beckham) 1999లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ముగ్గురు కుమారులు బ్రూక్లిన్ బెక్‌హామ్ (Brooklyn Beckham), రోమియో బెక్‌హామ్, క్రూజ్ బెక్‌హామ్.. కూతురు హార్పర్ సెవెన్ బెక్‌హామ్ సంతానం. వీరిలో పెద్దవాడైన బ్రూక్లిన్ మోడల్, చెఫ్, ఫొటోగ్రాఫర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.పెళ్లైన నాటి నుంచి విభేదాలుబ్రూక్లిన్... అమెరికాకు చెందిన బిలియనీర్ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి బ్రూక్లిన్కు తల్లిదండ్రులు డేవిడ్- విక్టోరియాలతో విభేదాలు తలెత్తాయి. ఇందుకు నికోలా వెడ్డింగ్ గౌనులో మార్పే కారణం అని సమాచారం.ఈ క్రమంలో భార్య వైపు మొగ్గు చూపిన బ్రూక్లిన్.. తల్లిదండ్రులను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. భార్యతో కలిసి అతడు అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డేవిడ్ బెక్‌హామ్ 50వ పుట్టినరోజు వేడుకలకు కూడా అతడు హాజరుకాలేదు. అంతేకాదు తండ్రి ‘సర్’ బిరుదును అందుకున్న వేళా అతడు అక్కడ లేడు.నిన్ను మిస్ అవుతున్నాంఅయితే, డేవిడ్- విక్టోరియా దంపతులు మాత్రం సోషల్ మీడియా పోస్టులలో బ్రూక్లిన్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘నిన్ను మిస్ అవుతున్నాం’ అంటూ క్యాప్షన్లు పెట్టారు. బ్రూక్లిన్కు ఇది ఎంతమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. తనతో ఇకపై లాయర్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుందని ఇప్పటికే తల్లిదండ్రులకు అతడు ఓ లేఖ రాసినట్లు సమాచారం.ఈ క్రమంలో ఇటీవల బ్రూక్లిన్కు సంబంధించిన చికెన్ రోస్ట్ వీడియోను తల్లి విక్టోరియా లైక్ చేయడంతో.. అతడికి కోపం వచ్చిందట. దీంతో తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులందరినీ బ్రూక్లిన్ బ్లాక్ చేశాడు. తాజాగా ఇకపై సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేయవద్దంటూ లాయర్ల ద్వారా నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.తనతో మాట్లాడవద్దంటూబెక్హామ్ కుటుంబ సన్నిహిత వర్గాలు.. ‘ది సన్ యూఎస్’తో మాట్లాడుతూ.. ‘‘ఈ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి గల అసలు కారణమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బ్రూక్లిన్ తన తల్లిదండ్రులను బ్లాక్ చేశాడు. తనతో మాట్లాడవద్దంటూ ఇటీవల ఓ లేఖ పంపాడు.అయినా సరే సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేస్తున్నారనే కోపంతో తాజాగా నోటీసులు పంపాడు. పబ్లిక్‌గా కాకుండా ప్రైవేటుగానే తల్లిదండ్రులతో తేల్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అయితే, డేవిడ్- విక్టోరియా తన మాటను ఖాతరు చేయలేదని భావించి చట్టపరంగా ముందుకు వెళ్తున్నాడు.డేవిడ్- విక్టోరియా మాత్రం తమ పెద్ద కుమారుడి కోసం ఇంకా తలుపులు తెరిచే ఉంచారు. అయితే, ఈ పరిణామాలు వారిని తీవ్రంగా కలచివేశాయి. మున్ముందు ఏం జరుగుతుందోనని కుమారుడి విషయంలో వారు ఆందోళన చెందుతున్నారు’’ అని పేర్కొన్నాయి.చదవండి: IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు! -
ఇంగ్లండ్ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్.. ఎందుకంటే?
ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్ 1న వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేకు ముందు బ్రూక్ ఓ నైట్ క్లబ్ బౌన్సర్‌తో దురుసగా ప్రవర్తించాడు.నైట్‌క్లబ్‌లోకి వెళ్లేందుకు బ్రూక్ ప్రయత్నించగా.. మద్యం సేవించి ఉన్నాడనే అనుమానంతో అక్కడ ఉన్న బౌన్సర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ సదరు బౌన్సర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ గొడవలో బౌన్సర్ బ్రూక్‌ను కొట్టినట్లు సమాచారం. ఈ విషయం రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.సారీ చెప్పిన బ్రూక్..ఈ ఘటనపై బ్రూక్ స్పందించాడు. యాషెస్ ఐదో టెస్టు ముగిసిన తర్వాత అతడు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. నేను ఆ రోజు హద్దులు మీరి ప్రవర్తించాను. అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యలతో నా జట్టుకు, దేశానికి తలవంపులు తీసుకొచ్చాను. అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.ఇంగ్లండ్ క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇకపై మైదానంలోనూ, బయటా ఇటువంటి తప్పులు చేయనని హామీ ఇస్తున్నాను. మరోసారి అందరికి క్షమాపణలు అడుగుతున్నాను అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో బ్రూక్ పేర్కొన్నాడు.ఈసీబీ సీరియస్ఇక ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. బ్రూక్‌కు 30,000 పౌండ్ల ( భారత కరెన్సీలో దాదాపు 33 లక్షల రూపాయలు) భారీ జరిమానా ఈసీబీ విధించింది. అంతేకాకుండా ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈసీబీ హెచ్చరించింది. కాగా యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ ఘోర ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఘోర పరాభావానికి ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యమే కారణమని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ మధ్యలో ఇంగ్లండ్ వెళ్లిన 'నూసా' (Noosa) ట్రిప్ కూడా విమర్శలకు దారితీసింది.చదవండి: అభిషేక్ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో.. -
చివరి టెస్ట్‌లోనూ గెలుపు.. ఆసీస్‌దే యాషెస్
స్వదేశంలో జరిగిన 2025-26 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైసవం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (జనవరి 8) ముగిసిన ఐదో టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ఛేదనలో తొలుత తడబడినప్పటికీ అంతిమంగా గెలుపునందుకుంది. హెడ్ (29), వెదరాల్డ్ (34), లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (12), ఖ్వాజా (6) ఔట్ కాగా.. క్యారీ (16 నాటౌట్), గ్రీన్ (22 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ 3 వికెట్లు తీసి ఆసీస్‌పై ఒత్తిడి తెచ్చాడు. జాక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.అంతకుముందు (ఐదో రోజే) ఇంగ్లండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 40 పరుగులు జోడించి 342 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. నాలుగో రోజే సెంచరీ చేసిన జేకబ్ బేతెల్ 150 పరుగులు పూర్తి కాగానే ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, వెబ్‌స్టర్ తలో 3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బేశారు.దీనికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగులు చేసింది. హెడ్ (163), స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో వెబ్‌స్టర్ (71 నాటౌట్) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ చెరో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు.కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మాత్రమే గెలవగా.. ఆసీస్ మిగతా నాలుగు టెస్ట్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
తొలి శతకంతోనే చరిత్రపుటల్లోకెక్కిన ఇంగ్లండ్ యువ ఆటగాడు
సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ సెంచరీతో కదంతొక్కాడు. 22 ఏళ్ల బేతెల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి శతకం. ఈ శతకంతో అతడు రికార్డుపుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియాపై 22 ఏళ్లలోపు శతకం చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాటర్ అయ్యాడు. ఈ జాబితాలో జానీ బ్రిగ్స్, జాక్ హెర్న్, పటౌడి, కాలిన్ కౌడ్రే, డేవిడ్ గోవర్, మైక్ అథర్టన్, అలిస్టర్ కుక్, బెన్ స్టోక్స్ ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. బేతెల్ తన అద్భుత శతకంతో ఇంగ్లండ్‌ను ఆధిక్యం దిశగా నడిపించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఏడు డాట్ బాల్స్ ఆడిన బేతెల్ వెబ్‌స్టర్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు (162 బంతుల్లో). బేతెల్ సెంచరీ చేసిన అనంతరం అక్కడే మైదానంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.నాలుగో రోజు చివరి సెషన్ సమయానికి బేతెల్ 131 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా బ్రైడన్ కార్స్ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి పోరాడుతుంది. బేతెల్ పుణ్యమా అని ఆ జట్టు 107 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఈ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. డకెట్, బ్రూక్ తలో 42 పరుగులు చేయగా.. జేమీ స్మిత్ 26, జాక్ క్రాలే 1, రూట్ 6, స్టోక్స్ 1, విల్ జాక్స్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్, నెసర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా బ్యాటరల్లో వెబ్‌స్టర్ 71 (నాటౌట్), వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 , స్టార్క్ 5, బోలాండ్ డకౌయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ తలో వికెట్ తీశారు. దీనికి ముందు జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా,ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
పిల్లల్లో ఉబకాయం.. బ్రిటన్ అధికారుల కీలక నిర్ణయం..!
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో పెరుగుతున్న ఉబకాయాన్ని అరికట్టేందుకు నడుం బిగించింది. బాల్యంలో ఉబకాయం రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కఠిన నియమాన్ని అమల్లోకి తెచ్చింది. రాత్రి 9 గంటల వరకు టీవీ, ఆన్లైన్లో జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ రూల్‌తో పిల్లలను ఉబకాయం నుంచి బయటపడేలా దోహదం చేస్తుందని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం నుంచే ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.తక్కువ పోషకాహార ఆహారాలు, చక్కెర పానీయాల ప్రకటనలను నిషేధించడం వల్ల ప్రతి సంవత్సరం పిల్లల ఆహారంలో సుమారు 7.2 బిలియన్ కేలరీలు తగ్గుతాయని ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం (DHSC) తెలిపింది. దీని వలన ఊబకాయం బారిన పడే పిల్లల సంఖ్య సుమారు 20 వేల వరకు తగ్గుతుందని అభిప్రాయపడింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వ జాతీయ ఆరోగ్య సేవ (NHS)కు సుమారు 2 బిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.రాత్రి 9 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను పరిమితం చేయడం, ఆన్లైన్లో చెల్లింపు ప్రకటనలను నిషేధించడం వల్ల పిల్లలు, తల్లిదండ్రులను అనారోగ్యకరమైన ఆహారం నుంచి రక్షించవచ్చని భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరింత సులభతరం అవుతుందని యూకే ఆరోగ్య మంత్రి ఆష్లే డాల్టన్ అన్నారు. వ్యాధులకు చికిత్స చేయడం కంటే.. వాటిని నివారించడంపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. జంక్‌ఫుడ్ ప్రకటనలు పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు.జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయస్సులోనే ఊబకాయంతో పాటు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశముందని బ్రిటన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్‌లో 22.1 శాతం మంది పిల్లలు ప్రాథమిక పాఠశాల నుంచే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 35.8 శాతానికి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆసుపత్రిలో చేరడానికి దంత క్షయం ప్రధాన కారణమని అన్నారు. తాజాగా విధించిన ఆంక్షలు పిల్లలను అత్యంత హానికరమైన ప్రకటనల నుంచి రక్షించడంలో సహాయపడతాయని ఒబేసిటీ హెల్త్ అలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ జెన్నర్ అన్నారు.ఇప్పటివరకు ఆరోగ్యకరమైన తరాన్ని సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని.. ఈ విధానం ఊబకాయం సంబంధిత వ్యాధులను నివారించడానికి విస్తృత ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన భాగమని ఆమె అన్నారు. ఇది మరింత ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో నిబంధనలు బలోపేతం చేయడం చాలా అవసరమని తెలిపారు. -
ఇంగ్లాండ్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
బ్రిటన్‌లో అయ్యప్ప మకరవిళక్కు మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఇంగ్లాండ్‌లోని రోచెస్టర్‌లో ఉన్న కెంట్ అయ్యప్ప ఆలయంలో ఈ వేడుక జరగనుంది. జనవరి 14, 2026న ఈ మకరవిళక్కు మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం పూజకు ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.అదే రోజు ఉదయం ఏడు గంటలకు ఈ మహోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నిర్మాల్య దర్శనం, ఉష పూజ, గణపతి హోమం, పూజలు జరుగుతాయి. అనంతరం ఉదయం 9.30 గంటలకు ఆలయం మూసివేయనున్నారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఆలయం తెరిచిన అనంతరం స్వామివారికి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహిస్తారు. అనంతరం తత్త్వమసి భజన బృందం నేతృత్వంలో భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్చే భరతనాట్యం కార్యక్రమం ఉండనున్నాయి.రాత్రి నిర్వహించే వేడుకల్లో రాత్రి తొమ్మిది గంటలకు అట్టాస పూజ, తొమ్మిదినర్ర గంటలకు పడి పూజ, ఆ తర్వాత హరివరాసనం నిర్వహిస్తారు. రాత్రి పది గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పూజా కార్యక్రమాలను అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్, సహ అధికారిగా అద్రిత్ వాసుదేవ్ వ్యవహరిస్తారు. -
జో రూట్ 41వ శతకం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో మరో శతకం సాధించాడు. ఇది అతనికి 41వ శతకం. ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 60వ శతకం. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్, రూట్ చెరో 41 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సచిన్ (51), సంగక్కర (45) పాంటింగ్, రూట్ కంటే ముందున్నారు.ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ (84) ఒక్కడే రూట్ కంటే ముందున్నాడు. గత ఆరేళ్లలో రూట్‌కు ఇది 24 శతకం. ఇంత తక్కువ వ్యవధిలో ఓ ఆటగాడు ఇన్ని శతకాలు చేయడమనేది ఆషామాషీ విషయం కాదు.తాజా శతకంతో రూట్ తన సమకాలీకులు, ఫాబ్-4లో మిగతా ముగ్గురి కంటే మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్ ఖాతాలో 41 సెంచరీలు ఉండగా.. స్టీవ్ స్మిత్ 36, కేన్ విలియమ్సన్ 33, విరాట్ కోహ్లి 30 సెంచరీలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి టెస్ట్‌లో రూట్ తన 41వ శతకాన్ని సాధించాడు. ఈ సిరీస్‌కు ముందు రూట్‌కు ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా లేదు. ఇదే సిరీస్‌లోనే ఆసీస్ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. తాజాగా ఆ సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్ 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 394 పరుగులు చేశాడు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (15921) కొనసాగుతుండగా.. అతనికి రూట్‌కు (13937) వ్యత్యాసం ఇంకా 1984 పరుగులు మాత్రమే.సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 242 బంతులు ఎదుర్కొన్న రూట్ 15 బౌండరీల సాయంతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) సెంచరీకి చేరువలో ఔట్ కాగా.. జేమీ స్మిత్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో సెషన్ సమయానికి వికెట నష్టపోకుండా 44 పరుగులు చేసింది. హెడ్ 24, వెదరాల్డ్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 340 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. -
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ పేసర్ జోష్ టంగ్‌కు చోటు దక్కింది. టంగ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఒక్క వైట్‌బాల్ మ్యాచ్ కూడా ఆడలేదు.యాషెస్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టంగ్‌ను వైట్‌బాల్ జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్‌ను కూడా వరల్డ్‌కప్ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా టోర్నీకి ఆర్చర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.ఈ జట్టులో జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే విధ్వంసకర ఆల్‌రౌండర్ లియమ్ లివింగ్‌స్టోన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆల్రౌండర్లగా కుర్రాన్, డాసన్, విల్ జాక్స్‌కు అవకాశం దక్కింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లండ్.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు టీ20, వన్డే సిరీస్‌లలో తలపడనుంది.ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు కూడా ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా లంకతో టీ20లకూ కొనసాగించారు. ఆర్చర్ ఒక్కడే అందుబాటులో లేడు. అయితే వన్డే జట్టులో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. జనవరి 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్‌కప్ షూరూ కానుంది.ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, ల్యూక్ వుడ్. -
ఐదో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్ అవుట్
యాషెస్ సిరీస్ 2025-26 తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిష్టాతక సిరీస్‌లో ఆఖరి టెస్టు జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ తొడ కండరాల గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమయ్యాడు.బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో అట్కిన్సన్ తొడ వెనక కండరాలు పట్టేశాయి. అనంతరం స్కాన్ రిపోర్ట్‌లో గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు నిజంగా ఇది భారీ షాక్ అని చెప్పాలి. అయితే ఈ సిరీస్‌లో అట్కిన్సన్ తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.అట్కిన్సన్ తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా సాధించికపోయినప్పటికి.. బ్రిస్బేన్‌లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం అడిలైడ్ టెస్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆర్చర్ గాయపడడంతో అట్కిన్సన్ తిరిగి బాక్సింగ్ డే టెస్టు కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ చారిత్రత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో అతడు మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు.పాట్స్ ఎంట్రీ?ఇక ఐదో టెస్టులో అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రానున్నట్లు తెలుస్తోంది. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్‌తో కలిసి మాథ్యూ పాట్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. ఒక వేళ సిడ్నీ పిచ్ కండీషన్స్ బట్టి స్పిన్నర్ ఆడించాలనుకుంటే షోయబ్ బషీర్‌ను తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్పటికే 3-1 తేడాతో కోల్పోయింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని స్టోక్స్ సేన భావిస్తోంది.సిడ్నీ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్. -
క్రికెట్ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం!
మెల్బోర్న్: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నా... ఆర్థికంగా మాత్రం క్రికెట్ ఆ్రస్టేలియాకు నష్టాలు తప్పేలా లేవు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో మూడింట గెలిచిన ఆతిథ్య ఆసీస్ సిరీస్ నిలబెట్టుకుంది. అయితే వీటిలో రెండు టెస్టు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిశాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం రాగా... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన నాలుగోదైన ‘బాక్సింగ్ డే’ టెస్టు మ్యాచ్ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శుక్రవారం తొలి రోజు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు మైదానానికి తరలిరాగా... శనివారం రెండో రోజు 92,045 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మూడో రోజు కోసం కూడా 90 వేల మందికి పైగా టికెట్లు కొనుగోలు చేసుకున్నారు. అయితే పిచ్ పేసర్లకు ఇతోధిక సాయం చేయడంతో ఈ మ్యాచ్‌లో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఇక రెండో రోజు 16 వికెట్లు పడగా... ఆరు సెషన్లలోపే ఫలితం తేలింది. దీంతో మూడో రోజు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఇలా సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)కు 10 మిలియన్ ఆ్రస్టేలియా డాలర్లు (రూ. 60.22 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఎంసీజీ పిచ్‌పై దుమారం ‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రీడాభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తునున్నారు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలా రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిసిఉంటే పెద్దఎత్తున చర్చ జరిగేదని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ నిప్పు రాజేయగా... దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎంసీజీ పిచ్‌పై 10 మిల్లీ మీటర్ల కన్నా ఎక్కువ పచ్చికను సిద్ధం చేశారని... ఇలా అయితే ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు. ‘మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తినిచి్చంది. తొలి రోజు పిచ్ అనూహ్యంగా స్పందించి పేసర్లకు సాయం చేసింది. ఇందులో మా ప్రమేయం లేదు. మంచి స్పోర్టింగ్ వికెట్ తయారు చేయాలనుకున్నాం. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం’ అని ఎంసీజీ క్యూరేటర్ మాథ్యూ పేజ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన ఆసీస్ ఓపెనర్ హెడ్ మాట్లాడుతూ... ‘మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు విజయం సాధించడం ఖాయం. బంతికి, బ్యాట్‌కు మధ్య పోరాటాన్ని అభిమానులు ఆస్వాదిస్తారు. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇది కనిపించింది. ఎంసీజీలో మాత్రం ఇలా జరగలేదు’ అని అన్నాడు. -
18 టెస్టుల తర్వాత...
మెల్బోర్న్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్ జట్టు అద్భుతం చేసింది. ఆ్రస్టేలియా గడ్డపై గత పదిహేనేళ్లుగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టు... ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ‘యాషెస్’ సిరీస్‌లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మూడు టెస్టులు గెలిచిన ఆతిథ్య ఆ్రస్టేలియా సిరీస్ హస్తగతం చేసుకోగా... ఈ విజయంతో ఇంగ్లండ్ 1–3తో నిలిచింది. ‘యాషెస్’ సిరీస్‌లో భాగంగా సొంతగడ్డపై వరుసగా 18 టెస్టుల్లో పరాజయం ఎరగని ఆ్రస్టేలియా జట్టు... మెల్బోర్న్ టెస్టులో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు రెండు రోజుల్లోనే విజయం సాధించగా... ఇప్పుడు అశేష అభిమానుల మధ్య సాగిన పోరులో ఇంగ్లండ్ కూడా రెండు రోజుల్లోనే గెలుపొందింది. ఒకే సిరీస్‌లో ఇలా రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియడం 129 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓవర్‌నైట్ స్కోరు 4/0తో శనివారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా చివరకు 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (39 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్) కాస్త పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4, బెన్ స్టోక్స్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యం నిలవగా... చక్కటి పోరాటం కనబర్చిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు 32.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 40; 5 ఫోర్లు), జాక్ క్రాలీ (48 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (26 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బ్రూక్ (18 నాటౌట్), జేమీ స్మిత్ (3 నాటౌట్) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. మళ్లీ అదే తంతు... పేసర్లు పండగ చేసుకున్న ఈ పోరులో... తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోయిన ఆ్రస్టేలియా... రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే వైఫల్యం కొనసాగించింది. హెడ్, స్మిత్‌తో పాటు కామెరాన్ గ్రీన్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. నైట్ వాచ్‌మన్ స్కాట్ బోలాండ్ (6) ఏడో ఓవర్లో అవుట్ కాగా... కాసేపటికే వెదరాల్డ్ (5) అతడిని అనుసరించాడు. లబుషేన్ (8) విఫలం కాగా... ఉస్మాన్ ఖ్వాజా (0), అలెక్స్ కేరీ (4) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యమే ఉన్నా... పచ్చికతో కూడిన పిచ్‌పై కంగారూ పేసర్లను ఎదుర్కొంటూ ఆ మాత్రం స్కోరు చేయడం కూడా కష్టమే అనిపించింది. అయితే ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ‘పోరాడితే పోయేదేముంది’ అన్న తరహాలో చెలరేగింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించగా... బ్రైడన్ కార్స్ (6), జో రూట్ (15), కెపె్టన్ బెన్ స్టోక్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయినా... బెథెల్ చక్కటి షాట్లతో జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. ‘ఈ విజయానికి ముందు వరకు ఈ పర్యటన చాలా కష్టంగా సాగింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జట్టుగా పోరాడం. ప్లేయర్లు చూపిన తెగింపు ఆకట్టుకుంది. అందుకు తగ్గ ఫలితం దక్కింది. ‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లో ముగియాలని ఎవరూ కోరుకోరు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ అన్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 152 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 110 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్ హెడ్ చేసిన 46 పరుగులే అత్యధికం. ‘రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50–60 పరుగులు తక్కువ చేశాం. అవి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని ఆస్ట్రేలియా కెపె్టన్ స్మిత్ అన్నాడు. 17 మ్యాచ్‌ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై రూట్ తొలి టెస్టు విజయం రుచి చూశాడు. న్యూజిలాండ్ మాజీ కెపె్టన్ డానియల్ వెటోరీ 1997 నుంచి 2011 మధ్య ఆ్రస్టేలియాలో 12 మ్యాచ్‌లాడి ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు.92,045 బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆటను ప్రత్యక్షంగా తిలకించేందుకు మెల్బోర్న్ క్రికెట్ మైదానానికి వచ్చిన అభిమానుల సంఖ్య. 5468 రోజుల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఇంగ్లండ్ జట్టు టెస్టు మ్యాచ్ గెలిచింది. చివరగా 2011లో ఆసీస్‌లో టెస్టు నెగ్గిన ఇంగ్లండ్ జట్టు ఆ తర్వాత ఆడిన 18 టెస్టుల్లో 16 మ్యాచ్‌ల్లో ఓడి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది.479 ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదుర్కొన్న బంతులు. 1928 బ్రిస్బేన్ టెస్టు (457 బంతులు) తర్వాత ఇదే అత్యల్పం. -
మీ వెంటే మేము...
మెల్బోర్న్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో బౌలర్ల జోరు కొనసాగుతోంది. పచ్చికతో కూడిన పిచ్‌పై ఆట తొలి రోజే 20 వికెట్లు నేలకూలి రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన పోరులో... ఇరు జట్ల బౌలర్లు బంతితో నిప్పులు చెరిగారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఆడిన తొలి మూడు టెస్టుల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన ‘బాక్సింగ్ డే’ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. నెసెర్ (49 బంతుల్లో 35; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ కేరీ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టగా... అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా ప్రత్యర్థి పేస్‌కు దాసోహమైంది. 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పోరాడగా... అట్కిన్సన్ (28), కెపె్టన్ బెన్ స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4 వికెట్లు పడగొట్టగా... బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. స్కాట్ బోలాండ్ (4 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా... ఓవరాల్‌గా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకరి వెంట ఒకరు... గత మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న ఆ్రస్టేలియాకు... ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లబుషేన్ (6) విఫలం కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 9) క్రీజులో నిలిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆసీస్ 51 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఖ్వాజా, కేరీ కాస్త ప్రతిఘటన కనబర్చారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ... కంగారూలపై ఒత్తిడి పెంచారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న కామెరాన్ గ్రీన్ (17) కూడా ప్రభావం చూపలేకపోగా... ఆఖర్లో నెసెర్ ధాటిగా ఆడాడు. గ్రీన్, నేసెర్ ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/45) నమోదు చేసుకున్నాడు. తీరు మారని ఇంగ్లండ్... చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసి సిరీస్‌లో తొలిసారి ఆధిపత్యం కనబర్చే అవకాశాన్ని ఇంగ్లండ్ వినియోగించుకోలేకపోయింది. జాక్ క్రాలీ (5), బెన్ డకెట్ (2), జాకబ్ బెథెల్ (1), జో రూట్ (0) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ జట్టు 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డకెట్‌ను అవుట్ చేసిన స్టార్క్... తన తదుపరి ఓవర్లో క్రాలీని బుట్టులో వేసుకున్నాడు. ఈ మధ్య డకెట్‌ను నెసెర్ అవుట్ చేయగా... 15 బంతులాడి ఖాతా తెరవలేకపోయిన రూట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్రూక్ కౌంటర్ ఎటాక్‌కు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు. కెపె్టన్ స్టోక్స్‌తో కలిసి చక్కటి షాట్లతో ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. బోలాండ్ బౌలింగ్‌లో బ్రూక్ వికెట్ల ముందు దొరికిపోగా... తక్కినవాళ్లు అతడిని అనుసరించారు. ఆఖర్లో అట్కిన్సన్ కొన్ని షాట్స్ ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. దీంతో ఆసీస్‌కు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 94,199 ఈ మ్యాచ్‌కు తొలి రోజు ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల సంఖ్య. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇదే అత్యధికం. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ మధ్య 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు 93,013 మంది హాజరయ్యారు. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 3468 టెస్టు క్రికెట్లో 3000 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు హ్యారీ బ్రూక్‌కు అవసరమైన బంతులు. ఆ్రస్టేలియా మాజీ ప్లేయర్ గిల్‌క్రిస్ట్ 3610 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. 4 మెల్బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో తొలి రోజే 20 అంతకంటే ఎక్కువ వికెట్లు నేలకూలడం ఇది నాలుగోసారి. 1894లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 20 వికెట్లు... 1902లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 25 వికెట్లు...1932లో ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా టెస్టు తొలి రోజు 20 వికెట్లు పడ్డాయి. -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండిన వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.గిల్‌క్రిస్ట్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 3610 బంతులు అవసరం కాగా.. బ్రూక్ కేవలం 3468 బంతుల్లోనే ఈ మైలురాయిని తాకాడు. ఈ విభాగంలో బ్రూక్, గిల్‌క్రిస్ట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (4047), రిషబ్ పంత్ (4095), వీరేంద్ర సెహ్వాగ్ (4129) ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్ట్ తొలి రోజు బ్రూక్ ఈ ఘనత సాధించాడు.ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ తన దేశానికే చెందిన డెన్నిస్ కాంప్టన్తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. బ్రూక్, కాంప్టన్ ఇద్దరూ 57వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని తాకారు. ఈ విభాగంలో డాన్ బ్రాడ్‌మన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ దిగ్గజం కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.ఇప్పటివరకు 34 టెస్ట్‌లు ఆడిన బ్రూక్ 54.18 సగటున, 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 3034 పరుగులు చేశాడు. ఇందులో డబుల్, ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. జోష్ టంగ్ (11.2-2-45-5), అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.అనంతరం ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Ashes 4th Test: చెలరేగిన ఇరు జట్ల బౌలర్లు.. తొలి రోజే 20 వికెట్లు
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలుత ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. ఆతర్వాత ఆసీస్ బౌలర్లు కూడా అదే పని చేశారు. మొత్తంగా ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్‌ల్లో తొలి రోజే 20 వికెట్లు పడటం 1909 తర్వాత ఇదే తొలిసారి. చెలరేగిన టంగ్జోష్ టంగ్ (11.2-2-45-5) చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. టంగ్‌కు అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) సహకరించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.ఇంగ్లండ్ ఇంకా ఘోరంఅనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కుప్పకూలింగి. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
మరో విజయం లక్ష్యంగా...
మెల్బోర్న్: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా జట్టు నేటి నుంచి నాలుగో టెస్టు ‘బాక్సింగ్ డే’ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి నెగ్గిన ఆసీస్ 3–0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ‘క్లీన్‌స్వీప్’ చేయాలని కంగారూలు భావిస్తుండగా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న తరహాలో తెగించి ఆడేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన నాథన్ లయన్ స్థానంలో మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీకి బదులుగా ఆ్రస్టేలియా జట్టు అదనపు పేసర్‌కు అవకాశమివ్వనుంది. ‘బాక్సింగ్ డే’ టెస్టు కోసం మెల్బోర్న్ స్టేడియం ముస్తాబవగా... పచి్చకతో కూడిన పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకారం అందించనుంది. అయితే కాస్త సంయమనం పాటిస్తే ఇక్కడ బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టం కాదని రికార్డులు చెబుతున్నాయి. కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంతో మరోసారి స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును నడిపించిన ఈ స్టార్ బ్యాటర్... రెండింట్లోనూ విజయాలు కట్టబెట్టాడు. ట్రావిస్ హెడ్ మంచి జోరు మీదుండగా... గత మ్యాచ్‌లో అలెక్స్ కేరీ గొప్ప ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. స్మిత్, లబుషేన్, ఉస్మాన్ ఖ్వాజా, వెదరాల్డ్‌తో ఆసీస్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఏడో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై కంగారూలు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నారు. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ మరోసారి బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. మికెల్ నెసెర్, బోలాండ్, డగెట్ అతడికి సహకరించనున్నారు. సమష్టిగా రాణిస్తేనే... మరోవైపు ఇంగ్లండ్ విషయానికి వస్తే... ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు... చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా పోరాడాలని భావిస్తోంది. ‘ఆ్రస్టేలియా నుంచి సానుకూల దృక్పథంతో తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. సిరీస్ కోల్పోయినప్పటికీ ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని ఇంగ్లండ్ కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ‘బాజ్‌బాల్’ ఆటతీరు పెద్దగా ఫలితాన్నివ్వని నేపథ్యంలో మెల్బోర్న్లో ఇంగ్లండ్ ఎలాంటి ప్రణాళికతో బరిలోకి దిగుతుందో చూడాలి. మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్ రిసార్ట్‌కు వెళ్లిన ఇంగ్లండ్ ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించి వార్తల్లోకెక్కగా... అందులో వైరల్‌గా మారిన బెన్ డకెట్పై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకముంచింది. ఈ సిరీస్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి డకెట్ 97 పరుగులే చేసినప్పటికీ... మరో మెరుగైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతడినే కొనసాగించాల్సిన పరిస్థితి. ఇక ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం ఇంగ్లండ్ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. అతడి స్థానంలో అట్కిన్సన్ బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ కెరీర్లో ఈ సిరీస్‌లోనే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సెంచరీ నమోదు చేసుకున్న మాజీ కెప్టెన్ జో రూట్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవడం సిరీస్ ఫలితంపై ప్రభావం చూపింది. మరి ఎలాంటి ఒత్తిడి లేని ఈ పోరులో క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్‌తో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఏమాత్రం ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం. బౌలింగ్‌లో కార్స్, జాక్స్ కీలకం కానున్నారు.4 మెల్బోర్న్ మైదానంలో ఆ్రస్టేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించిన టెస్టులు. స్మిత్ సారథ్యంలో ఈ వేదికపై ఆ్రస్టేలియా రెండు టెస్టుల్లో నెగ్గి, మరో రెండు టెస్టులను ‘డ్రా’గా ముగించి అజేయంగా ఉంది.57 మెల్బోర్న్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులు. 29 టెస్టుల్లో ఆ్రస్టేలియా నెగ్గగా... 20 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. 8 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.117 మెల్బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు ఆ్రస్టేలియా ఆడిన టెస్టులు. ఈ వేదికపై ఆస్ట్రేలియా 68 టెస్టుల్లో గెలిచి, 32 టెస్టుల్లో ఓడిపోయింది. 17 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. జట్ల వివరాలు ఆ్రస్టేలియా (అంచనా): స్మిత్ (కెప్టెన్), వెదరాల్డ్, హెడ్, లబుషేన్, ఖ్వాజా, కేరీ, గ్రీన్, నెసెర్, స్టార్క్, డగెట్/జే రిచర్డ్సన్, బోలాండ్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, జేమీ స్మిత్, విల్ జాక్స్, అట్కిన్సన్, కార్స్, టంగ్. -
ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ
మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 0-3 తేడాతో యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయం చివరి రెండు టెస్ట్‌లకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే ఇంగ్లండ్ మరో స్టార్ బౌలర్ మార్క్ వుడ్ సేవలను కూడా కోల్పోయింది. వుడ్ మోకాలి గాయం కారణంగా రెండో టెస్ట్‌కు ముందే తప్పుకున్నాడు. తాజాగా ఆర్చర్ కూడా వైదొలగ డంతో ఇంగ్లండ్ పేస్ విభాగం మరింత బలహీనపడింది. ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్ను నాలుగో టెస్ట్‌కు తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ఈసీబీ ప్రకటించింది.పోప్ ఔట్గాయం కారణంగా ఆర్చర్ సిరీస్ మొత్తానికే దూరం కాగా.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్‌ను ఈసీబీ నాలుగో టెస్ట్ నుంచి తప్పించింది. పోప్ గత మూడు టెస్ట్‌ల్లో కేవలం 125 పరుగులే చేశాడు. పోప్ స్థానంలో నాలుగో టెస్ట్‌లో జేకబ్ బేతెల్‌ను ఆడించనున్నట్లు ఈసీబీ తెలిపింది.ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్ తుది యాధాతథంగా కొనసాగనుంది. రేపటి నుంచి (డిసెంబర్ 26) మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో యాషెస్ టెస్ట్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ చివరి రెండు టెస్ట్‌లైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆర్చర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడం ఇంగ్లండ్ కష్టాలను మరింత తీవ్రం చేసింది.యాషెస్ నాలుగో టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ -
రెండో వివాహం చేసుకున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం (2018లో) అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మొదటి భార్య రూత్‌ను కోల్పోయిన స్ట్రాస్.. తాజాగా ఆంటోనియా లిన్నేయస్ పీట్ (30) అనే మాజీ పీఆర్ ఎగ్జిక్యూటివ్‌ను మనువాడాడు.వీరి వివాహం అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో స్ట్రాస్ జన్మస్థలమైన దక్షిణాఫ్రికాలోని (ఫ్రాన్స్హోక్) ఓ వైన్ యార్డ్‌లో జరిగింది. లిన్నేయస్ పీట్తో వివాహ సమాచారాన్ని స్ట్రాస్ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నాడు.వివాహ ఫోటోలను షేర్ చేస్తూ, భార్య లిన్నేయస్ను ఉద్దేశిస్తూ ఈ సందేశాన్ని రాసుకొచ్చాడు. “మన ప్రియమైన ప్రదేశంలో అత్యంత ప్రత్యేకమైన రోజు జరుపుకున్నాం. నన్ను, నా పిల్లలను ప్రేమించి, నిజమైన ఆనందాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. నేను ఎంతో అదృష్టవంతుడిని. మన జీవితంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉండాలని కోరుకుంటున్నాను”స్ట్రాస్ భార్య ప్రస్తుతం లిన్నేయస్ అనే ఫైన్ ఆర్ట్ అడ్వైజరీ సంస్థ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల స్ట్రాస్ ఇటీవల ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పని చేసి పదవీ విరమణ చేశాడు. స్ట్రాస్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన స్ట్రాస్.. 2003-2012 మధ్యలో 100 టెస్ట్‌లు, 127 వన్డేలు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీల సాయంతో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ గెలిచిన అతి కొద్ది మంది ఇంగ్లండ్ కెప్టెన్లలో స్ట్రాస్ ఒకరు.స్ట్రాస్.. మొదటి భార్య రూత్ జ్ఞాపకార్థం Ruth Strauss Foundation స్థాపించాడు. ఈ ఫౌండేషన్ కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది. ఈ సేవలకు గాను స్ట్రాస్‌కు 2019లో నైట్‌హుడ్ లభించింది. -
చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్
యాషెస్ సిరీస్ 2025-26ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ ఘోర పరభావాన్ని మూట కట్టుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 రన్స్‌కు ఆలౌటైంది.లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (85) అద్భుతంగా పోరాడినప్పటికీ.. మిడిలార్డర్ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ఆఖరిలో జామీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39 నాటౌట్) జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్ తలా మూడు వికెట్లతో ఇంగ్లీష్ జట్టు ఓటమిని శాసించారు."సిరీస్‌ను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో అడిలైడ్‌లో అడుగుపెట్టాము. కానీ మా కల ఇప్పుడు చెదిరిపోయింది. ఈ ఓటమి జట్టులోని ప్రతీ ఒక్కరిని ఎంతో బాధకు గురి చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది.ఈ మ్యాచ్‌లో ఆసీస్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు. నాలుగో ఇన్నింగ్స్‌లో మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి మేము ఆఖరివరకు పోరాడాము. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆడిన తీరు చూసి మేము గెలుస్తామని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. టాస్ ఓడినప్పటికి ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఓ మోస్తార్ స్కోర్‌కే కట్టడి చేయడంలో మేము విజయవంతమయ్యాము. అయితే ఆ తర్వాత మేము భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాము. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను ఆశించిన పట్టుదల వారిలో కన్పించింది. సిరీస్ కోల్పోయినప్పటికి మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: సంజూ శాంసన్ కీలక నిర్ణయం -
హెడ్ అజేయ శతకం
అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా జట్టు మరో విజయానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (196 బంతుల్లో 142 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో ఆ్రస్టేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఆ్రస్టేలియా... మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకున్న హెడ్... ఈ సిరీస్‌లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకోవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ జాక్ వెదరాల్డ్ (1), మార్నస్ లబుõÙన్ (13), కామెరాన్ గ్రీన్ (7) విఫలం కాగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అలెక్స్ కేరీ (91 బంతుల్లో 52 బ్యాటింగ్; 4 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఉస్మాన్ ఖ్వాజా (51 బంతుల్లో 40; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మరో వైపు నుంచి వికెట్లు పడుతున్నా... హెడ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ పరుగులు సాధించాడు. మంచి బంతులను గౌరవిస్తూనే... చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. 72 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్... 146 బంతుల్లో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తనకు అలవాటైన రీతిలో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకునే హెడ్... ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పిచ్‌ను ముద్దాడి ఆనందంలో మునిగిపోయాడు. సెంచరీకి ఒక పరుగు ముందు హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఆ తర్వాత కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్న హెడ్ ఎట్టకేలకు సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిది 11వ శతకం. అబేధ్యమైన ఐదో వికెట్‌కు కేరీతో కలిసి హెడ్ 122 పరుగులు జోడించాడు.చేతిలో 6 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా.... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 85 పరుగులతో కలుపుకొని ఓవరాల్‌గా 356 పరుగుల ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలుండగా... శనివారం మరింత స్కోరు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిలపాలని ఆసీస్ భావిస్తోంది. స్టోక్స్–ఆర్చర్ రికార్డు భాగస్వామ్యం... అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 213/8తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 87.2 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83; 8 ఫోర్లు) పట్టుదలగా పోరాడగా... జోఫ్రా ఆర్చర్ (105 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక హాఫ్‌సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో స్టోక్స్ 159 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే నెమ్మదైన అర్ధ శతకం. ఈ జోడీ తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 106 పరుగులు జోడించడంతో ఆ్రస్టేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ ఆధిక్యం దక్కలేదు. ఒక్కసారి స్టోక్స్ అవుట్ అయ్యాక... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ్రస్టేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
కేరీ సూపర్ సెంచరీ
అడిలైడ్: వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక ‘యాషెస్ సిరీస్’ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆ్రస్టేలియా... సిరీస్ చేజిక్కించుకునే దిశగా కీలక పోరులోనూ మంచి ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా... బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ ‘శత’క్కొట్టగా... ఉస్మాన్ ఖ్వాజా (126 బంతుల్లో 82; 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా... టాస్ వేయడానికి 45 నిమిషాల ముందు స్టీవ్ స్మిత్ అనూహ్యంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వెల్లడించింది. ఐపీఎల్–2026 మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న పేస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కేరీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారీ జన సందోహం మధ్య తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో జేక్ వెదరాల్డ్ (18)ను ఆర్చర్ అవుట్ చేయగా... మరుసటి ఓవర్లో ట్రావిస్ హెడ్ (10) కూడా వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన హెడ్‌ను కార్స్ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో లబుషేన్ (19)తో కలిసి ఉస్మాన్ ఖ్వాజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. స్మిత్ గైర్హాజరీతో చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే లంచ్ అనంతరం ఆర్చర్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి మరోసారి ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అతడి ధాటికి లబుషేన్, హెడ్ పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆసీస్ 94/4తో నిలిచింది. ఈ దశలో అడిలైడ్ ‘లోకల్ బాయ్’ కేరీ గొప్ప సంయమనం కనబర్చాడు. మరో ఎండ్‌లో ఖ్వాజా కూడా పట్టువదలకుండా ప్రయతి్నంచాడు. ఈ జంట ఐదో వికెట్‌కు 91 పరుగులు జత చేసింది. తొలి రోజు ఆటకు రికార్డు స్థాయిలో 56,298 మంది అభిమానులు హాజరయ్యారు. అడిలైడ్ మైదానంలో ఇదే అత్యధికం. ‘ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు టెస్టు మ్యాచ్ చూసేందుకు తరలి రావడం అద్భుతంగా ఉంది. సొంత మైదానంలో 56 వేల పైచిలుకు జనం ముందు సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకం’ అని కేరీ అన్నాడు. జోష్ ఇన్గ్లిస్తో ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించిన కేరీ... ఎనిమిదో వికెట్‌కు మిచెల్ స్టార్క్ (63 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి 50 పరుగులు జోడించాడు. 135 బంతుల్లో ‘యాషెస్ సిరీస్’ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న కేరీ... కాసేపటికే పెవిలియన్ చేరాడు. స్టార్క్‌తో పాటు లయన్ (18 బంతుల్లో 0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు అడిలైడ్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా... నేడు మరింత ఎండ తీవ్రత ఉండనుంది. సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. -
ఈసారి ఎన్ని రోజుల్లో!
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌లో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి బ్రిస్బేన్‌లోని ‘గాబా’ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో గెలిచిన ఆ్రస్టేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. అదే జోరు కొనసాగిస్తూ ‘డే అండ్ నైట్’ టెస్టులోనూ విజయం సాధించాలని స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు భావిస్తోంది. మరోవైపు 2010–11 నుంచి ఆసీస్ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఇంగ్లండ్ జట్టు ‘ఫ్లడ్ లైట్’ల వెలుతురులో జరగనున్న పోరులో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ‘పింక్ బాల్’ టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఆసీస్... ఇప్పటి వరకు ఆడిన 14 ‘గులాబీ’ టెస్టుల్లో 13 గెలిచి, ఒక్కటి మాత్రమే ఓడింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో అతిగా స్వింగ్ అయ్యే ఆసీస్ పేసర్ల బంతులను ఎదుర్కోవడం ఇంగ్లండ్ ఆటగాళ్లకు శక్తికి మించిన పనే. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఉస్మాన్ ఖ్వాజా స్థానంలో జోష్ ఇన్గ్లిస్కు ఆ్రస్టేలియా తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయమే. గత మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన ట్రావిస్ హెడ్ మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... లబుషేన్, స్మిత్, గ్రీన్, కేరీ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో స్టార్క్‌కు బొలాండ్, డగెట్ నుంచి చక్కటి సహకారం లభిస్తోంది. మరోవైపు ‘బాజ్‌బాల్’నే నమ్ముకున్న ఇంగ్లండ్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా... వీరంతా సమష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆర్చర్, అట్కిన్సన్, కార్స్ కీలకం కానున్నారు. -
క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్ స్మిత్ హఠాన్మరణం
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు దిగ్గజ ఆటగాడు రాబిన్ స్మిత్(62) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని రాబిన్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సౌత్ పెర్త్‌లోని తమ ఇంట్లోనే ఆయన ప్రాణాలు విడిచారని వారు చెప్పుకొచ్చారు.కానీ ఆయన మరణానికి గల కారణాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించలేదు. పోస్ట్‌మార్టమ్ దర్యాప్తులో మరణ కారణం నిర్ధారించబడుతుందని తెలిపారు. 2004లో రిటైర్మెంట్ తర్వాత ఆయన మద్యానికి బానిసై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ స్మిత్ మరణానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రసారం చేయవద్దని మీడియాను ఆయన కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు.'ది జడ్జ్'గా పేరొందిన స్మిత్.. మాల్కమ్ మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్ , కోర్ట్నీ వాల్ష్ వంటి పేస్ దళంతో కూడిన వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశారు. 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 43.67 సగటుతో 4236 టెస్టు పరుగులు చేశారు. ఆయన కెరీర్లో తొమ్మిది టెస్టు సెంచరీలు ఉన్నాయి.అదేవిధంగా ఆయన 71 వన్డేలలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1992 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లండ్ చేరడంలో స్మిత్‌ది కీలక పాత్ర. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కోవడంలో ఆయన దిట్ట. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో స్మిత్ ఆడిన ఇన్నింగ్స్(167 నాటౌట్) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదుర్స్..రాబిన్ స్మిత్ డర్బన్‌లో జన్మించినప్పటికీ 1983లో ఇంగ్లండ్‌కు వచ్చి హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్లో చేరారు. మొత్తంగా 17 సీజన్లలో ఆయన 18,984 ఫస్ట్-క్లాస్ పరుగులు సాధించారు. స్మిత్ మృతిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. -
అటు స్టార్క్... ఇటు స్టోక్స్
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాషెస్ సిరీస్ అనూహ్య రీతిలో ఆరంభమైంది. కిక్కిరిసిన పెర్త్ స్టేడియంలో ఆసీస్ పేసర్లు అదరగొట్టడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశాం అనుకుంటే... ఇంగ్లండ్ బౌలర్లు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు. స్టార్క్ ధాటికి ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా... బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బంతితో విజృంభించాడు. ఐదు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. వెరసి... పర్యాటక ఇంగ్లండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యం దక్కే అవకాశాలున్నాయి. పెర్త్: పేసర్లకు అనుకూలించే పెర్త్ పిచ్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా యాషెస్ సిరీస్ తొలి టెస్టు తొలి రోజే 19 వికెట్లు నేలకూలాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ధాటిగా ఆడుతూ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (61 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా... ఒలీ పోప్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), జేమీ స్మిత్ (22 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ పేసర్లు ఆకట్టుకున్న చోట... ఇంగ్లండ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. సారథి బెన్ స్టోక్స్ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో 2 వికెట్లు తీశారు. చేతిలో ఒక వికెట్ ఉన్న ఆస్ట్రేలియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. నాథన్ లయన్ (3 బ్యాటింగ్), బ్రెండన్ డగెట్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే వికెట్...ఆస్ట్రేలియా గడ్డపై గత కొన్నాళ్లుగా ప్రభావం చూపలేకపోతున్న ఇంగ్లండ్ జట్టును స్టార్క్ (7/58) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో గట్టిదెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ జాక్ క్రాలీ (0)ని అవుట్ చేసిన అతడు... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. తొలి ఓవర్లో వికెట్ పడగొట్టడం స్టార్క్‌కు ఇది 24వసారి. సీనియర్ బ్యాటర్ జో రూట్ (0) డకౌట్ కాగా... కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) ప్రభావం చూపలేకపోయాడు. బెన్ డకెట్ 21 పరుగులు చేశాడు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై సంయమనంతో బ్యాటింగ్ చేయడానికి బదులు ఇంగ్లండ్ జట్టు... తమకు అలవాటైన ‘బాజ్‌బాల్’ ఆటతీరును అవలంభించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. దీంతో ఒకవైపు వికెట్లు పడుతున్నా... ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అరంగేట్ర పేసర్ బ్రెండన్ డగెట్ 2 వికెట్లు తీశాడు. కామెరూన్ గ్రీన్‌కు ఒక వికెట్ దక్కింది. 6 ఓవర్లు వేసి 5 వికెట్లు...తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్... బౌలింగ్‌లో పట్టుదల కనబర్చింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఆసీస్ అరంగేట్ర ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (0)ను ఆర్చర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్ (41 బంతుల్లో 9; 1 ఫోర్) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా... ఈ మ్యాచ్‌లో సారథ్యం వహిస్తున్న స్టీవ్ స్మిత్ (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఉస్మాన్ ఖ్వాజా (2) విఫలం కాగా... ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24) తలా కొన్ని పరుగులు చేశారు. తొలి నాలుగు వికెట్లను ఆర్చర్, కార్స్ పంచుకోగా... ఆ తర్వాత కెప్టెన్ స్టోక్స్ మ్యాజిక్ ప్రారంభమైంది. కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్ చేసిన అతడు... వరుసగా హెడ్, గ్రీన్, స్టార్క్ (12), కేరీ, బోలండ్ (3)లను పెవిలియన్ బాట పట్టించాడు. ఇంగ్లండ్ కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా... 5.23 రన్‌రేట్‌తో పరుగులు సాధించగా... ఆస్ట్రేలియా మాత్రం ఆ పని చేయలేకపోయింది.19 యాషెస్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు నేలకూలడం 1909 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1909 మాంచెస్టర్ టెస్టు తొలి రోజు ఇరు జట్లు ఆలౌటయ్యాయి.5 ఆస్ట్రేలియా గడ్డపై 5 వికెట్లు పడగొట్టిన ఐదో ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ నిలిచాడు. చివరిసారిగా 1982లో ఇంగ్లండ్ సారథి బాబ్ విల్లీస్ బ్రిస్బేన్ టెస్టులో ఈ ఘనత సాధించాడు.36 బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టేందుకు వేసిన బంతులు. ఇంగ్లండ్ పేసర్లలో ఇది మూడో వేగవంతమైంది. గతంలో స్టువర్ట్ బ్రాడ్ 19 బంతుల్లో (ఆస్ట్రేలియాపై), 34 బంతుల్లో (న్యూజిలాండ్‌పై) ఈ ఫీట్ నమోదు చేశాడు.7/58 ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌కు టెస్టు క్రికెట్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆసీస్ ఆడిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై స్టార్క్ 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టెస్టుల్లో స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి.100 ‘యాషెస్’ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన 11వ ఆస్ట్రేలియా పేసర్‌గా స్టార్క్ నిలిచాడు. 21వ శతాబ్దంలో టెస్టు అరంగేంట్రం చేసిన వారిలో ఈ ఘనత సాధించిన మొదటి పేసర్ అతడే.0/1 యాషెస్ సిరీస్‌లో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదు కాకుండా ఇరు జట్లు ఓపెనింగ్ బ్యాటర్ వికెట్ కోల్పోవడం ఇదే తొలిసారి.10 బెన్‌స్టోక్స్‌ను స్టార్క్ అవుట్ చేయడం ఇది పదోసారి. భారత స్పిన్నర్ అశ్విన్ 13 సార్లు స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చాడు. -
‘యాషెస్’ సమరానికి సిద్ధం
టెస్టు క్రికెట్లో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న సుదీర్ఘ వైరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌కు నేటితో తెర లేవనుంది. ఇరు జట్ల ఆటగాళ్లను ఒక్క మంచి ప్రదర్శనతో హీరోలుగా, ఒక్క పరాజయంతో జీరోలుగా మార్చగల ఈ సమరంపై క్రికెట్ అభిమానులందరి దృష్టీ నిలిచింది. సొంతగడ్డపై ఆ్రస్టేలియా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నా... ‘బాజ్‌బాల్’ తరహా ఆటతో తమకంటూ విజయావకాశాలు ఉన్నాయని ఇంగ్లండ్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడు వారాల పాటు హోరాహోరీ ఆట ఖాయం. పెర్త్ స్టేడియంలో పిచ్‌పై పచ్చిక ఉంది. ఆరంభంలో పేస్, బౌన్స్‌కు బాగా అనుకూలిస్తూ ఆ తర్వాత నెమ్మదించే అవకాశం ఉంది. పెర్త్: యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో ఆ్రస్టేలియా పర్యటించగా, ఆ సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అంతకుముందు 2021లో ఆసీస్ గడ్డపై ఆడిన ఇంగ్లండ్ 0–4తో చిత్తుగా ఓడింది. ఈ గణాంకాలు చూస్తే ఎవరిది పైచేయో అర్థమవుతుంది. అయితే కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పర్యవేక్షణలో దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్ తమ ప్రత్యర్థిని ఓడించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.ముఖ్యంగా తొలి టెస్టులో ఇద్దరు ఆసీస్ ప్రధాన పేసర్లు జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సిరీస్‌లో శుభారంభం చేస్తే దానిని కొనసాగించాలని బెన్ స్టోక్స్ బృందం పట్టుదలగా ఉంది. అయితే సమర్థుడైన స్టీవ్ స్మిత్ టీమ్‌కు నాయకత్వం వహించడం ఆసీస్‌కు బలం. ఇద్దరు అరంగేట్రం... ‘స్మిత్‌ను 40 పరుగుల్లోపు ఆపగలిగితే మంచిది. లేదంటే మ్యాచ్ చేజారినట్లే’... ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బ్యాటింగ్ ప్రభావం ఎలాంటిదో ఇది చెబుతుంది. ఇప్పుడు కూడా స్మిత్ బలమైన బ్యాటింగే ఆసీస్‌కు పెద్ద బలం. ఇతర సీనియర్లలో లబుషేన్, హెడ్లపై ప్రధానంగా బ్యాటింగ్ భారం ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్నా ఉస్మాన్ ఖ్వాజా అదృష్టవశాత్తూ ఈ సిరీస్‌లో అవకాశం దక్కించుకున్నాడు. అతనికి ఓపెనింగ్ భాగస్వామిగా కొత్త ఆటగాడు జేక్ వెదరాల్డ్ బరిలోకి దిగుతాడు. కీపర్ అలెక్స్ కేరీకి కూడా టెస్టు బ్యాటర్‌గా మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఫిట్నెస్ సమస్యలు దాటి కొత్తగా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా రెగ్యులర్ కెపె్టన్ కమిన్స్, హేజల్‌వుడ్ తొలి టెస్టు నుంచి తప్పుకోవడంతో బౌలింగ్‌లో సీనియర్ మిచెల్ స్టార్క్‌పై చాలా పెద్ద బాధ్యత ఉంది. బోలండ్ అతనికి తగిన భాగస్వామి కాగా, మరో పేసర్ బ్రెండన్ డగెట్ తొలి టెస్టు ఆడబోతున్నాడు. ఎప్పటిలాగే ఏకైక స్పిన్నర్ లయన్ ప్రత్యర్థి కి సవాల్ విసురుతున్నాడు. 2019 తర్వాత ఆ్రస్టేలియా జట్టు తరఫున ఒకే టెస్టులో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. స్పిన్నర్ లేకుండా... తొలి టెస్టు వరకు మాత్రం ఆసీస్‌తో పోలిస్తే ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగనుండటం విశేషం. ఆర్చర్, మార్క్‌వుడ్‌లాంటి ఫాస్టెస్ట్ బౌలర్లతో పాటు అట్కిన్సన్, కార్స్ ఆడనుండగా బౌలింగ్‌లో స్టోక్స్ కీలక పాత్ర పోషించడం ఖాయం. తుది జట్టులో ఇంగ్లండ్ ఒక్క స్పిన్నర్‌ను కూడా తీసుకోవడం లేదు. బ్యాటింగ్‌తో భారత్‌తో సిరీస్ సహా గత కొంతకాలంగా టాప్–7లో ఎలాంటి మార్పూ లేదు. పెద్దగా రాణించకపోయినా క్రాలీ, పోప్‌లపై జట్టు నమ్మకం ఉంచింది. డకెట్, బ్రూక్, స్టోక్స్ ఎలా ఆడతారనేది ఆసక్తికరం. అందరి దృష్టీ ఇప్పుడు జో రూట్‌పై నిలిచింది. ఆధునిక టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు ఉన్న రూట్ ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతని తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఈ సిరీస్‌లో ఆ లోటును పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, జట్టుపరంగా చూసినా కూడా రూట్ ఆట సిరీస్ ఫలితాన్ని నిర్దేశించగలదు. 34-32ఓవరాల్‌గా 73 యాషెస్ సిరీస్‌లు జరిగితే...ఆ్రస్టేలియా 34, ఇంగ్లండ్ 32 గెలవడం ఇరు జట్ల మధ్య పోటీని చూపిస్తోంది.152-111యాషెస్ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 361 టెస్టులు జరిగాయి. ఆ్రస్టేలియా 152 గెలవగా, ఇంగ్లండ్ 111 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 13సొంతగడ్డపై జరిగిన గత 15 యాషెస్ టెస్టుల్లో ఆ్రస్టేలియా 13 గెలిచి, 2 ‘డ్రా’ చేసుకుంది. ఒక్కదాంట్లోనూ ఓడలేదు. 2011 జనవరి తర్వాత ఇక్కడ ఇంగ్లండ్ ఒక్క టెస్టు కూడా నెగ్గలేకపోయింది. 2023 తర్వాత ఓవరాల్‌గా అన్ని జట్లపై కలిపి ఆడిన 18 టెస్టుల్లో ఆసీస్ 14 గెలిచింది. ఆసీస్ గడ్డపై ఆడిన గత మూడు ‘యాషెస్’లలో ఇంగ్లండ్ 0–5, 0–4, 0–4తో ఓడింది. -
యాషెస్ తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల మహా సంగ్రామం పెర్త్ టెస్ట్‌తో మొదలవుతుంది.ఈ మ్యాచ్ కోసం 12 మంది సభ్యుల ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే స్టార్ ప్లేయర్లంతా చోటు దక్కించుకున్నారు. పేసర్ మార్క్ వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తుది జట్టులోకి వచ్చాడు.గత కొంతకాలంగా ఫామ్‌లో లేని ఓలీ పోప్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. పోప్ స్థానంలో బేకబ్ బేతెల్‌కు అవకాశం లభిస్తుందని చాలామంది అనుకున్నప్పటికీ అలా జరగలేదు. పోప్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 100, 90 పరుగులు చేశాడు.ఆఫ్ స్పిన్నర్ షోయమ్ బషీర్ కూడా ఫైనల్-12లో చోటు దక్కించుకున్నాడు. అయితే ప్లేయింగ్-11 అతడి స్థానం ఇంకా ఖరారు కాలేదు. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి బషీర్‌కు ప్లేయింగ్-11లో స్థానం దక్కకపోవచ్చు. వాస్తవానికి బషీర్ స్థానం కోసం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ పోటీపడ్డాడు.చివరి నిమిషంలో మేనేజ్మెంట్ బషీర్‌కే ఓటు వేసింది. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న సమాచారం ఉండటంతో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ బలమైన పేస్ ఫోర్స్‌తో బరిలోకి దిగనుంది. ఈ జట్టులో మార్క్ వుడ్‌తో పాటు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, గస్ అట్కిన్సన్ లాంటి పేస్ గన్స్కు చోటు దక్కింది. వీరికి తోడు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉండనే ఉన్నాడు.బ్యాటింగ్ విభాగంలోనూ ఇంగ్లండ్ బలమైన జట్టునే ఎంపిక చేసుకుంది. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్ లాంటి స్పెషలిస్ట్ బ్యాటర్లతో ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ శక్తివంతంగా ఉంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ నవంబర్ 21వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.తొలి టెస్ట్‌కు 12 మంది సభ్యుల ఇంగ్లండ్ తుది జట్టు..స్టోక్స్(కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బ్రూక్, కార్స్, క్రాలే, డకెట్, పోప్, రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), మార్క్ వుడ్ -
న్యూజిలాండ్ ‘క్లీన్ స్వీప్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్... మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న ఇంగ్లండ్... శనివారం కివీస్‌తో జరిగిన ఆఖరి పోరులో 2 వికెట్ల తేడాతో ఓడింది. ఫలితంగా సొంతగడ్డపై టి20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్... వన్డే సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్... 40.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ (62 బంతుల్లో 68; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా... జోస్ బట్లర్ (56 బంతుల్లో 38; 7 ఫోర్లు), బ్రైడన్ కార్స్ (30 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో బ్లెయిర్ టిక్నెర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (46; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (44; 4 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. టిక్నెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, డారిల్ మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. -
దక్షిణాఫ్రికా ధమాకా
గువాహటి: ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు అనుకున్నది సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాలుగుసార్లు చాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాట్‌తో కెపె్టన్ లారా వోల్వార్ట్ (143 బంతుల్లో 169; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు)... బంతితో మరిజాన్ కాప్ (5/20) అదరగొట్టి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వోల్వర్ట్ అసాధారణ ఆటతీరుతో ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టింది. బ్రిట్స్ (65 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్), ట్రియాన్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్ల ధాటికి స్కోరు బోర్డుపై ఒక పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ నటాలియా సివర్ బ్రంట్ (76 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్), అలీస్ కాప్సీ (71 బంతుల్లో 50; 6 ఫోర్లు) పోరాడారు. అమీ జోన్స్ (0), బ్యూమౌంట్ (0), హీథర్ నైట్ (0) డకౌట్ కావడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. డంక్లీ (2), చార్లీ డీన్ (0) కూడా విఫలమయ్యారు. నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా తలపడనుంది. -
బట్లర్ మరో అడుగు ముందుకు..!
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ల జాబితాలో జోస్ బట్లర్ (Jos Buttler) మరో అడుగు ముందుకేశాడు. ఇవాళ (అక్టోబర్ 29) న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డేలో 9 పరగులు చేసిన అతను.. ఇంగ్లండ్ ఆల్‌టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఇయాన్ బెల్‌ను (5416) అధిగమించాడు.ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 5245 వన్డే పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో జో రూట్ (7328) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గన్ (6975) రెండో స్థానంలో నిలిచాడు.వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ టాప్-10 బ్యాటర్లు..జో రూట్ - 7328ఇయాన్ మోర్గన్ - 6957జోస్ బట్లర్ - 5425ఇయాన్ బెల్ - 5416పాల్ కాలింగ్‌వుడ్ - 5092అలెక్ స్టీవర్ట్ - 4677కెవిన్ పీటర్సన్ - 4422మార్కస్ ట్రెస్కోథిక్ - 4335గ్రహం గూచ్ - 4290జేసన్ రాయ్ - 4271ఇదిలా ఉంటే, బట్లర్ కెరీర్ గత కొంతకాలంగా బాగా నెమ్మదించింది. అతను ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేసి నాలుగేళ్లవుతుంది. చివరిగా 2021 అక్టోబర్ 30న శ్రీలంకపై T20 వరల్డ్‌కప్‌లో మూడంకెల మార్కును తాకాడు. అప్పటి నుంచి కొన్ని మంచి ఆరంభాలు లభించినా అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. పెద్ద స్కోర్లు చేయకపోయినా బట్లర్ స్ట్రయిక్‌రేట్‌ను మెయింటైన్ చేస్తూ ఇంగ్లండ్ విజయాల్లో పాలు పంచుకుంటున్నాడు. యువ ఓపెనర్ల రాకతో బట్లర్ మిడిలార్డర్లో వస్తున్నాడు. ఇదే అతన్ని సెంచరీలు చేయనివ్వడం లేదు.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దైన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో ఓవర్టన్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దైన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
దక్షిణాఫ్రికా...ఈసారైనా!
గువాహటి: అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ... మహిళల వన్డే ప్రపంచకప్‌లో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది. మూడుసార్లు సెమీఫైనల్లోకి ప్రవేశించినా ఆ అడ్డంకిని దాటడంలో విఫలమైంది. నాలుగో ప్రయత్నంలోనైనా సెమీఫైనల్ అవరోధాన్ని అధిగమించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు ఫైనల్ చేరుకున్న ఇంగ్లండ్... నాలుగుసార్లు విజేతగా నిలిచి, మరో నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఇక తాజా ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. తమతో ఆడిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 69 పరుగులకు కుప్పకూల్చిన ఇంగ్లండ్ మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఎదురైన తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకోవాలని దక్షిణఫ్రికా భావిస్తోంది. ఆస్ట్రేలియాతో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 97 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లోపాలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ ప్రణాళికలు రచిస్తోంది. సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సే స్మిత్, చార్లీ డీన్ రూపంలో ఇంగ్లండ్‌కు ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్... ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 50.16 సగటుతో 301 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపిస్తోంది. బ్రిట్స్, సునే లుస్, మరిజాన్ కాప్ రూపంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో కాప్, ఖాకా, ఎంలాబా కీలకం కానున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ సారథి కెప్టెన్ హీథర్ నైట్ ఈ వరల్డ్‌కప్‌లో 288 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. అమీ జోన్స్, బ్యూమౌంట్ కూడా రెండొందల పైచిలుకు పరుగులు చేశారు. కెప్టెన్ సివర్ బ్రంట్ రూపంలో నిఖార్సైన ఆల్‌రౌండర్ అందుబాటులో ఉంది. రిజర్వ్ డే... మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఈ టోర్నీలోని రెండు సెమీఫైనల్స్‌కు, ఫైనల్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ ఉంది. బుధవారం వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే... గురువారం నిర్వహిస్తారు. ఒకవేళ గురువారం కూడా మ్యాచ్ జరగపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ (ఇంగ్లండ్) చేరుకుంటుంది.36 దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 47 వన్డేలు జరిగాయి. 36 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా ... 10 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. 7 సార్లు ఇంగ్లండ్, 2 సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. -
ఇంగ్లండ్ సునాయాస విజయం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ (New Zealand vs England) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలర్లు, స్వల్ప ఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో ఆడుతూ పాడుతూ గెలుపుతీరాలు చేరింది. ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్ ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగింది.చెలరేగిన బౌలర్లుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు.సత్తా చాటిన జోన్స్అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ యామీ జోన్స్ (86 నాటౌట్) సత్తా చాటడంతో 29.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ (40), హీథర్ నైట్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్, లియా తహుహు తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ బౌలర్లలో లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ త్వరగా మ్యాచ్ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్ (20), ట్యామీ బేమౌంట్ (26) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా -
హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా
న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ తొలి ఓటమి ఎదుర్కొంది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లీష్ జట్టు.. మౌంట్ మాంగనూయ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 26) జరిగిన తొలి వన్డేలో (New Zealand vs England) 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ఐకానిక్ శతకం (101 బంతుల్లో 135; 9 ఫోర్లు, 11 సిక్సరు) కారణంగా గౌరవప్రదమైన స్కోర్ (35.2 ఓవర్లలో 223 ఆలౌట్) చేయగా.. న్యూజిలాండ్ 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండో వన్డే హ్యామిల్టన్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.బ్రూక్ ఐకానిక్ శతకంఈ మ్యాచ్‌లో బ్రూక్ చేసిన శతకం వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత క్రేజీయెస్ట్ శతకంగా చెప్పవచ్చు. బ్రూక్ తన జట్టును 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్ వరకు చేర్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ 166 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోగా ఆ సమయానికి బ్రూక్ స్కోర్ 86 పరుగులుగా ఉండింది. ఈ దశలో బ్రూక్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్ మొత్తాన్ని నడిపాడు. జేమీ ఓవర్టన్ (46) అతనికి కాస్త సహకించాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.గెలిపించిన మిచెల్స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డారిల్ మిచెల్ (78 నాటౌట్), మైఖేల్ బ్రేస్‌వెల్ (51) ఆదుకున్నారు. ముఖ్యంగా మిచెల్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. మిచెల్‌కు బ్రేస్‌వెల్‌తో పాటు టామ్ లాథమ్ (24), మిచెల్ సాంట్నర్ (27) సహకరించారు. చదవండి: జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్ మోడల్! ఈ వీరుడి గురుంచి తెలుసా? -
సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా బ్రూక్
న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (New Zealand vs England) మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు క్రైస్ట్‌చర్చ్‌లో జరగాల్సిన తొలి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది.మధ్యలో రెండో టీ20లో 65 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్ ఇంగ్లండ్ (England) వశమైంది (1-0). ఆ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్‌కు (Harry Brookk) (35 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.అక్టోబర్ 26 (మౌంట్ మాంగనూయ్), 29 (హ్యామిల్టన్), నవంబర్ 1 (వెల్లింగ్టన్) తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3.4 ఓవర్ల పాటు సాగిన ఆటమూడో టీ20 3.4 ఓవర్ల పాటు సాగింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ వర్షం ప్రారంభమయ్యే సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (2) ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (23), రచిన్ రవీంద్ర (10) క్రీజ్‌లో ఉన్నారు.వన్డే సిరీస్‌కు ఇరు జట్లు..ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, లూక్ వుడ్న్యూజిలాండ్: మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీచదవండి: Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..! -
రాణించిన ఆసీస్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ఇంగ్లండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 22) ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు (Australia vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (10-1-60-3), సోఫీ మోలినెక్స్ (10-0-52-2), ఆష్లే గార్డ్నర్ (9-0-39-2), అలానా కింగ్ (10-1-20-1), కిమ్ గార్త్ (7-2-43-0) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ (78) మాత్రమే సత్తా చాటింది. అలైస్ క్యాప్సీ (38), ఛార్లోట్ డీన్ (26), సోఫీ డంక్లీ (22), హీథర్ నైట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యామీ జోన్స్ 18, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ 7, ఎమ్మా ల్యాంబ్ 7, లిన్సే స్మిత్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ 10, లారెన్ బెల్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ రెండు జట్లతో పాటు సౌతాఫ్రికాకు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
సాల్ట్, బ్రూక్ విధ్వంసం.. రషీద్ మాయాజాలం.. ఇంగ్లండ్ ఘన విజయం
మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 20) రెండో టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (New Zealand vs England) పర్యాటక జట్టు 65 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది. అనంతరం 26, 29, నవంబర్ 1 తేదీల్లో మౌంట్ మౌంగనూయ్, హ్యామిల్టన్, వెల్లింగ్టన్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.సాల్ట్, బ్రూక్ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (Phil Salt) (56 బంతుల్లో 85; 11 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) (35 బంతుల్లో 78; 5 సిక్సర్లు, 6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు.జేకబ్ బేతెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ బాంటన్ (12 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోస్ బట్లర్ (4) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 2, డఫీ, బ్రేస్‌వెల్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన స్కోర్ టీ20ల్లో న్యూజిలాండ్‌పై రెండో అత్యధికం. రషీద్ మాయాజాలం237 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఓటమి ఖరారయ్యాక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (36) బ్యాట్ ఝులిపించాడు. టిమ్ సీఫర్ట్ (39), చాప్మన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆదిల్ రషీద్ (Adil Rashid) (4-0-32-4) తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. అతనికి లూక్ వుడ్ (4-0-36-2), బ్రైడన్ కార్స్ (3-0-27-2), లియామ్ డాసన్ (4-0-38-2) సహకరించారు. వీరి ధాటికి న్యూజిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 10 మంది ఆటగాళ్లు క్యాచ్ ఔట్ల రూపంలో ఔటయ్యారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం కేవలం 13వ సారి మాత్రమే.చదవండి: ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. అతడితో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్ కూడా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ వ్యవహరించాడు. అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ గాయం కారణంగా దూరమయ్యాడు.లాథమ్‌తో పాటు మొహమ్మద్ అబ్బాస్ ఫిన్ అల్లెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే , గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. టీ20ల్లో సత్తాచాటుతున్న జాక్ ఫాల్క్స్కు కివీస్ సెలక్టర్లు వన్డేలకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20 సోమవారం జరగనుంది. అక్టోబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
శతక్కొట్టిన హీథర్ నైట్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 19) భారత్, ఇంగ్లండ్ జట్లు (india vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది. మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో హీథర్ నైట్ చేసిన సెంచరీ ఎనిదవది. ఆమె తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడంకెల మార్కును చేరుకుంది. హీథర్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో అలైస్సా హీలీ 2 సెంచరీలు, సోఫీ డివైన్, నాట్ సీవర్ బ్రంట్, ఆష్లే గార్డ్నర్, తజ్మిన్ బ్రిట్స్, బెత్ మూనీ తలో సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లండ్ కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి నాలుగో స్థానంలో ఉంది. చదవండి: బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా -
హర్మన్ బృందానికి పరీక్ష
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఇంగ్లండ్‌తో తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో శ్రీలంక, పాకిస్తాన్లను ఓడించి సానుకూలంగా టోర్నీని మొదలుపెట్టిన భారత్ ఆ తర్వాత తడబడింది. రెండు పటిష్ట జట్లు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా చేతిలో పరాజయంపాలైంది. ఇప్పుడు మరో కఠిన ప్రత్యర్థి ఇంగ్లండ్ రూపంలో ఎదురైంది. ఇటీవలి కాలంలో ఈ జట్టుపై మన రికార్డు బాగున్నా... వరల్డ్ కప్ ఒత్తిడిని అధిగమించి పైచేయి సాధించడం ముఖ్యం. ఈ మ్యాచ్‌లో ఓడితే తర్వాతి రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మరో వైపు నాట్ సివర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి (ఒకటి రద్దు) జోరు మీదుంది. అమన్‌జోత్ స్థానంలో రేణుక! తొలి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఆ్రస్టేలియాపై భారత్‌కు మెరుగైన ఆరంభం లభించింది. స్మతి మంధాన, మరో ఓపెనర్ ప్రతీక కూడా అర్ధసెంచరీలు సాధించారు. హర్లీన్, జెమీమా కూడా కీలక పరుగులు సాధించారు. అయితే హర్మన్ మరోసారి అంచనాలకు తగినట్లు ఆడటంలో విఫలమైంది. రిచా ఘోష్ దూకుడుగా ఆడటం పెద్ద సానుకూలాంశం. దీప్తి చాలా కాలంగా బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోతోంది. మరో సారి ప్రధాన బ్యాటర్లంతా మెరుగ్గా ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ఆసీస్‌పై 330 పరుగులు చేసి కూడా భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఇలాంటి స్థితిలో బౌలింగ్ బలహీనత బయటపడింది. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు విఫలమైనా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అయినా సరే అదే వ్యూహాన్ని జట్టు కొనసాగించే అవకాశం ఉంది. హర్మన్ ఎలాగూ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలదు. ఆల్‌రౌండర్ అమన్‌జోత్ స్థానంలో పేసర్ రేణుక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. యువ బౌలర్లు క్రాంతి, చరణి ఒత్తిడిని అధిగమించాల్సి ఉంది. చరణితో పాటు దీప్తి, స్నేహ్ స్పిన్‌తో ఇంగ్లండ్‌కు కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. ఫామ్‌లో కెప్టెన్... పాకిస్తాన్‌తో గత మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, అంతకు ముందు బలహీన బంగ్లా, శ్రీలంకను ఇంగ్లండ్ ఓడించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాను 69కే కుప్పకూల్చినా... జట్టు బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. కెపె్టన్ సివర్ బ్రంట్, హీతర్ నైట్ మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. ఎమీ జోన్స్, బీమాంట్లలో ఇంకా తడబాటు కనిపిస్తోంది. సోఫీయా డంక్లీ, ఎమా ల్యాంబ్లనుంచి జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటింగ్‌తో పోలిస్తే ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉండటం విశేషం. భారత్‌పై పలు మార్లు చక్కటి ప్రదర్శన కనబర్చిన సోఫీ ఎకెల్‌స్టోన్‌తో పాటు మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ లిన్సీ స్మిత్ కూడా వరల్డ్ కప్‌లో చక్కగా రాణిస్తున్నారు. ప్రధాన పేసర్ లారెన్ బెల్ ఆరంభంలో ప్రత్యర్థిని నిలువరించగలదు. -
పాక్ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ఇంగ్లండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో (Pakistan vs England) పాకిస్తాన్ బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 31 ఓవర్లకు కుదించబడిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను కేవలం 133 పరుగులకే పరిమితం చేశారు. ఓ దశలో పాక్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 100 పరుగులు కూడా చేయలేని పరిస్థితిలో ఉండింది. 25 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 79 పరుగులుగా ఉండింది. ఈ దశలో వర్షం మొదలైంది.సుదీర్ఘ విరామం తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ పునఃప్రారంభమయ్యాక ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. అప్పటిదాకా ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ వారు, చివరి 6 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సాధించారు. తొలి 25 ఓవర్లలో పాక్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 150 బంతుల్లో ఏకంగా 117 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించారు.కెప్టెన్ ఫాతిమా సనా 6 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. సదియా ఇక్బాల్ 6 ఓవర్లలో 12 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది. డయానా బేగ్, రమీన్ షమీమ్ తలో వికెట్ తీశారు. నష్రా సంధు వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా (7-2-12-0) బౌలింగ్ చేసింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ప్లేయర్ ఛార్లీ డీన్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఎమ్ ఆర్లాట్ (18), హీథర్ నైట్ (18), అలైస్ క్యాప్సీ (16), సోఫీ డంక్లీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని ఇంగ్లండ్ నుంచి ఇది అత్యంత ఘోరమైన ప్రదర్శన. ఈ టోర్నీలో ఇంగ్లండ్ సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పాక్ విషయానికొస్తే.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదర్కొని చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది.కాగా, వర్షం కారణంగా పాకిస్తాన్ లక్ష్యాన్ని కుదించారు. 31 ఓవర్లలో ఆ జట్టు టార్గెట్ 113 పరుగులుగా నిర్దేశించారు. చదవండి: కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులను దక్కించుకున్న భారత్ -
నాట్ సీవర్ సెంచరీ
కొలంబో: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నాట్ సీవర్ బ్రంట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు 89 పరుగుల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించింది. బ్యాటింగ్‌లో విరోచిత శతకం సాధించిన కెప్టెన్ బ్రంట్ (117 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బౌలింగ్‌తో 2 వికెట్లు పడగొట్టింది. టాస్ నెగ్గిన లంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అమీ జోన్స్ (11), బ్యూమోంట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు), హీథర్‌నైట్ (47 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. ఇలాంటి స్థితిలో నాట్ సీవర్ బ్రంట్ ఒంటరి పోరాటం చేసింది. సోఫియా డన్క్లే (18), ఎమ్మా లాంబ్ (13), చార్లీ డీన్ (19)లతో కలిసి జట్టు స్కోరును నడిపించింది. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసింది. లంక బౌలర్లలో ఇనోక రణవీర 3 వికెట్లు పడగొట్టగా, ఉదేశిక ప్రబోధని, సుగంధిక కుమారి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ హాసిని పెరిర (60 బంతుల్లో 35; 3 ఫోర్లు), మిడిలార్డర్లో హర్షిత సమరవిక్రమ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. మిగతా వాళ్లంతా ఇంగ్లండ్ బౌలింగ్‌కు తలొంచారు. నీలాక్షిక సిల్వా (23) మినహా ఇంకెవరూ రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. సోఫి ఎకిల్‌స్టోన్ (10–3–17–4) తన మ్యాజిక్ స్పెల్‌తో లంకను కూల్చేసింది. నాట్ సీవర్, చార్లీ డీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఆడిన మూడు గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలువగా, ఇంకా బోణీ చేయలేకపోయిన శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. లంక మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: అమీ జోన్స్ రనౌట్ 11; బ్యూమోంట్ (సి)హర్షిత (బి) సుగంధిక 32; హీథర్‌నైట్ (సి) విహంగ (బి) ఇనొక 29; నాట్ సీవర్ (సి) నీలాక్షిక (బి) ప్రబోధని 117; సోఫియా (సి) అండ్ (బి) కవిశా 18; ఎమ్మా లాంబ్ (బి) ఇనొక 13; క్యాప్సీ (స్టంప్డ్) సంజీవని (బి) ఇనొక 0; చార్లీ డీన్ (సి) విహంగ (బి) ప్రబోధని 19; సోఫి ఎకిల్‌స్టోన్ (స్టంప్డ్) సంజీవని (బి) సగంధిక 3; లిన్సే స్మిత్ నాటౌట్ 5; లారెన్ బెల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–24, 2–49, 3–109, 4–146, 5–168, 6–168, 7–206, 8–216, 9–252. బౌలింగ్: ప్రబోధని 9–0–55–2, సుగంధిక 10–0–66–2, చమరి 5–0–21–0, ఇనొక 10–1–33–3, విహంగ 8–0–42–0, కవిశా 8–0–34–1. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (సి) క్యాప్సీ (బి) సోఫి 35; చమరి (బి) సోఫి 15, విష్మీ (బి) చార్లీ డీన్ 10; హర్షిత (సి) బెల్ (బి) సోఫి 33; కవిశా (బి) సోఫి 4; నీలాక్షిక (సి)హీథర్‌నైట్ (బి) క్యాప్సీ 23; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) నాట్ సీవర్ 10; విహంగ (సి) చార్లీ డీన్ (బి) నాట్ సీవర్ 3; సుగంధిక (బి) చార్లీ డీన్ 4; ప్రబోధని (సి) నాట్ సీవర్ (బి) లిన్సే స్మిత్ 0; ఇనొక నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–37, 2–95, 3–98, 4–103, 5–116, 6–134, 7–145, 8–157, 9–157, 10–164. బౌలింగ్: లారెన్ బెల్ 8–1–32–0, లిన్సే స్మిత్ 8.4–1–22–1, నాట్ సీవర్ 5–0–25–2, చార్లీ డీన్ 9–1–47–2, అలైస్ క్యాప్సీ 5–1–15–1, సోఫి 10–3–17–4. -
ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్
అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి తాజాగా రెండు శుభకార్యాలు జరిగాయి. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తన దీర్ఘకాల ప్రియురాలు లూసీ లైల్స్‌తో నిశ్చితార్థం చేసుకోగా.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది.ముందుగా బ్రూక్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ బ్యాటింగ్ యువ కెరటం లూసీ లైల్స్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు 2020లో తొలిసారి పబ్లిక్‌గా కనిపించారు. లూసీతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బ్రూక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. లూసీ చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించే ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానుల బ్రూక్-లూసీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లూసీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానసిక ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రూక్ ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అక్టోబర్ 18 నుంచి ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.అబ్రార్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ ఓవరాక్షన్ స్పిన్నర్ కొద్ది రోజుల కిందట అమ్నా రహీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం తాజాగా కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహిసిన్ నఖ్వీ సహా పలువురు పాక్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్-2025లో నఖ్వీకి, పాక్ జట్టుకు ఘోర అవమానాలు ఎదురైన తర్వాత జరిగిన వేడుక కావడంతో అబ్రార్ రిసెప్షన్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్ పాక్‌ను ఫైనల్ సహా మూడు సార్లు ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఏసీసీ చీఫ్‌గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీ దాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. తదనంతర పరిణామాల్లో నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పజెప్పాడని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్యలో భారత జట్టు పాక్‌ను మరోసారి చిత్తుగా ఓడించింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భాగంగా కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. చదవండి: స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..! -
గట్టెక్కిన ఇంగ్లండ్
గువాహటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యఛేదనలో మొదట్లో తడబడ్డా ఆ తర్వాత తేరుకొని విజయ తీరాలకు చేరింది. మంగళవారం జరిగిన ఈ పోరులో నాట్ సీవర్ బ్రంట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. శోభన మోస్తారీ (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరిపించింది. ఆఖర్లో రాబియా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంది. షర్మిన్ అక్తర్ (30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (0) డకౌట్ కాగా... రూబ్యా (4), షోర్నా అక్తర్ (10), రీతు మోని (5), ఫహీమ ఖాతూన్ (7), నహిదా అక్తర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లిన్సే స్మిత్, చార్లీ డీన్, అలీస్ కాప్సీ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. కెప్టెన్ సీవర్ బ్రంట్ (41 బంతుల్లో 32; 5 ఫోర్లు), అలీస్ కాప్సీ (20; 3 ఫోర్లు), చార్లీ డీన్ (27 నాటౌట్; 2 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా... బంగ్లా క్రమశిక్షణాయుత బౌలింగ్‌తో దాన్ని కఠినతరంగా మార్చింది. అమీ జోన్స్ (1), బ్యూమౌంట్ (13), సోఫీ డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హీథర్ నైట్ ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచింది. వన్‌డౌన్‌లో దిగిన నైట్... చివరి వరకు అజేయంగా నిలిచింది. అబేధ్యమైన ఏడోవికెట్‌కు డీన్‌తో కలిసి 79 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమా ఖాతూన్ 10 ఓవర్ల కోటాలో 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మారుఫా అక్తర్ 2 వికెట్లు తీసింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆ్రస్టేలియా తలపడనుంది. -
మాంచెస్టర్ సినగాగ్ వద్ద దాడి
మాంచెస్టర్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సిటీలో దారుణంగా జరిగింది. యూదుల ప్రార్థనా మందిరం(సినగాగ్) వద్ద ఓ దుండగుడు దాడికి దిగాడు. సినగాగ్ బయట నిల్చున్నవారిపైకి గురువారం కారుతో దూసుకొచ్చాడు. అనంతరం కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అడ్రియాన్ డల్బీ(53), మెల్విన్ క్రావిట్జ్(66) మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మరణించిన ఇద్దరితో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతువాత పడినట్లు తెలిసింది. దుండుగుడిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కాల్పులు జరపగా, ఒకరు మృతిచెందినట్లు గుర్తించారు. కానీ, తమ కాల్పుల్లో దుండగుడే హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. -
సంచలన నిర్ణయం తీసుకున్న ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్
ఇంగ్లండ్ (England) స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.బ్యాడ్జ్ (మూడు సింహాలు) కోసం 15 ఏళ్ల పాటు అంకితభావంతో సేవలందించిన Wizzకు (వోక్స్ ముద్దు పేరు) అంతర్జాతీయ రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది.నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల వోక్స్ స్వతహాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.ఈసీబీ నాకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, కౌంటీ క్రికెట్ ఆడతాను. అలాగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో కూడా అవకాశాల కోసం వెతుకుతానంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు.వోక్స్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సిరీస్‌లోని ఐదో టెస్ట్ తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా అతని భుజం మిస్ లొకేట్ అయ్యింది. అయినా అతను ఐదో రోజు జట్టు ఒంటిచేత్తో బరిలోకి దిగి అందరి ప్రశంసలు అందుకున్నాడు.2011లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వోక్స్.. 62 టెస్ట్‌లు, 122 వన్డేలు, 33 టీ20లు ఆడాడు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వోక్స్.. టెస్ట్‌ల్లో సెంచరీ, 7 అర్ద సెంచరీలు.. వన్డేల్లో 6 అర్ద సెంచరీలు చేశాడు.టెస్ట్‌ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 192 వికెట్లు.. వన్డేల్లో 3 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 173 వికెట్లు.. టీ20ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. వోక్స్‌కు ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది. 2017 అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున 21 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీశాడు.మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు అపురూప విజయాలు అందించిన వోక్స్.. ఇంగ్లండ్ గెలిచిన 2022 టీ20 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు.చదవండి: రేపటి నుంచి క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం -
యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
2025-26 యాషెస్ సిరీస్ (Ashes 2025-26) కోసం ఇంగ్లండ్ జట్టును (England Cricket Team) ఇవాళ (సెప్టెంబర్ 23) ప్రకటించారు. భుజం గాయంతో కోలుకుంటున్న బెన్ స్టోక్స్‌నే (Ben Stokes) ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కొనసాగించారు. ఓలీ పోప్ స్థానంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.మ్యాథ్యూ పాట్స్, విల్ జాక్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మార్క్ వుడ్, షోయబ్ బషీర్ గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చారు. జేమీ స్మిత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడు. క్రాలే, డకెట్, పోప్, రూట్, జేకబ్ బేతెల్ టాపార్డర్‌లో ఉంటారు.భారత్‌తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ పేస్ అటాక్‌కు లీడ్ చేస్తాడు. బ్రైడన్ కార్స్, గస్ అట్కిన్సన్, టంగ్ జట్టులో చోటు నిలుపుకున్నారు. బషీర్‌కు జతగా రూట్, జేకబ్ బేతెల్, జాక్స్ స్పిన్ భారాన్ని మోస్తారు.ఓవల్ టెస్ట్‌లో గాయానికి గురైన క్రిస్ వోక్స్ యాషెస్‌కు ఎంపిక కాలేదు. ఆ మ్యాచ్‌లో భుజం విరిగినా, వోక్స్ బ్యాటింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అతను శస్త్రచికిత్సను నివారిస్తూ రీహ్యాబ్పై దృష్టి పెట్టాడు.ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ (Australia Vs England) నవంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు (5 టెస్ట్ మ్యాచ్‌లు) జరుగుతుంది. ఈ సారి ఈ సిరీస్ ఆస్ట్రేలియాలో జరుగనుంది.ఇంగ్లండ్ యాషెస్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (వైస్-కెప్టెన్), బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, మార్క్ వుడ్యాషెస్కు ముందు న్యూజిలాండ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా ఇదే సందర్భంగా జట్లను ప్రకటించారు. టీ20, వన్డే జట్లకు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జాక్ క్రాలీ తొలిసారి టీ20 జట్టుకు ఎంపిక కాగా.. ఆర్చర్, డకెట్, స్మిత్ విశ్రాంతి పొందనున్నారు. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 1 వరకు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, లూక్ వుడ్ఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, సామ్ కర్రన్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, లూక్ వుడ్చదవండి: ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు -
పసికూనపై ప్రతాపం చూపించిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం
ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.తొలుత ఇంగ్లండ్ బౌలర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆదిల్ రషీద్ (4-0-29-3), జేమీ ఓవర్టన్ (4-0-17-2), లియామ్ డాసన్ (2-0-9-2) అద్బుతంగా బౌలింగ్ చేసి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. రెహాన్ అహ్మద్ (3-0-24-1) కూడా పర్వాలేదనిపించాడు.ఐర్లాండ్ బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గెరాత్ డెలానీ (29 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల కారణంగా ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాస్ అదైర్ (33), హ్యారీ టెక్టార్ (28), బెంజమిన్ కాలిట్జ్ (22) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (7), లోర్కాన్ టక్కర్ (1), కర్టిస్ క్యాంపర్ (2), బ్యారీ మెక్‌కార్తీ (0), మాథ్యూ హంఫ్రేస్ (7) నిరాశపరిచారు.అనంతరం 155 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలో కాస్త తటపటాయించినా, ఆతర్వాత తమ సహజ సిద్దమైన దూకుడు ప్రదర్శించింది. బట్లర్ 0, బేతెల్ 15 పరుగులకే ఔటైనా.. ఫిల్ సాల్ట్ (29), జోర్డన్ కాక్స్ (55) వేగంగా ఆడారు. టామ్ బాంటన్ (37 నాటౌట్), రెహాన్ అహ్మద్ (9 నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
రాణించిన రషీద్, ఓవర్టన్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఐర్లాండ్
డబ్లిన్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్ (4-0-29-3), జేమీ ఓవర్టన్ (4-0-17-2), లియామ్ డాసన్ (2-0-9-2) అద్బుతంగా బౌలింగ్ చేసి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. రెహాన్ అహ్మద్ (3-0-24-1) కూడా పర్వాలేదనిపించాడు.ఐర్లాండ్ బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గెరాత్ డెలానీ (29 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల కారణంగా ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాస్ అదైర్ (33), హ్యారీ టెక్టార్ (28), బెంజమిన్ కాలిట్జ్ (22) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (7), లోర్కాన్ టక్కర్ (1), కర్టిస్ క్యాంపర్ (2), బ్యారీ మెక్‌కార్తీ (0), మాథ్యూ హంఫ్రేస్ (7) నిరాశపరిచారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ వారి వశం అవుతుంది. ఐర్లాండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. -
టాస్ కూడా పడకుండానే రద్దైన ఇంగ్లండ్ మ్యాచ్
డబ్లిన్ వేదికగా ఇంగ్లండ్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (సెప్టెంబర్ 19) జరగాల్సిన రెండో టీ20 వర్షార్పణం అయ్యింది. భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని చివరి టీ20 డబ్లిన్ వేదికగానే సెప్టెంబర్ 21న జరుగనుంది.తొలి మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐర్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ అంచనాలకు మించి రాణించి భారీ స్కోర్ చేసింది. హ్యారీ టెక్టార్ (36 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్ టక్కర్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (34), రాస్ అదైర్ (26) కూడా సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్, డాసన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఫిల్ సాల్ట్ (46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు) తొలి బంతి నుంచే చెలరేగడంతో మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (10 బంతుల్లో 28), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 24), సామ్ కర్రన్ (15 బంతుల్లో 27) కూడా రాణించారు. ఐరిష్ బౌలర్లలో హంఫ్రేస్, హ్యూమ్ తలో 2, హ్యారీ టెక్టార్, గెరాత్ డెలానీ చెరో వికెట్ తీశారు. -
మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి
అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకాండ కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాపై సుడిగాలి శతకంతో (60 బంతుల్లో 141 నాటౌట్; 15 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. ఇవాళ (సెప్టెంబర్ 17) పసికూన ఐర్లాండ్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు.మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐర్లాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే బ్యాట్ ఝులిపిస్తూ విధ్వంసం సృష్టించాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి గెలుపు ఖరారయ్యాక ఔటయ్యాడు.సాల్ట్ వీర ఉతుకుడు ధాటికి ఇంగ్లండ్ మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ అంచనాలకు మించి భారీ స్కోర్ చేసింది. హ్యారీ టెక్టార్ (36 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్ టక్కర్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (34), రాస్ అదైర్ (26) కూడా సత్తా చాటారు.ఐరిష్ బ్యాటర్ల ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్టన్, డాసన్, ఆదిల్ రషీద్ మాత్రం తలో వికెట్ తీశారు.197 పరుగుల లక్ష్య ఛేదనలో సాల్ట్ తొలి బంతి నుంచే డ్యూటీకి ఎక్కాడు. అతనికి బట్లర్ (10 బంతుల్లో 28), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 24), సామ్ కర్రన్ (15 బంతుల్లో 27) తోడయ్యారు. మ్యాచ్‌ను మరింత వేగంగా ముగించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. రెహాన్ అహ్మద్ 8, టామ్ బాంటన్ 11 పరుగులకు ఔటయ్యారు. ఓవర్టన్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. ఐరిష్ బౌలర్లలో హంఫ్రేస్, హ్యూమ్ తలో 2, హ్యారీ టెక్టార్, గెరాత్ డెలానీ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 సెప్టెంబర్ 19న డబ్లిన్లోనే జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. -
ఇంగ్లండ్‌కు సౌతాఫ్రికా మరో షాక్
సౌతాఫ్రికా ఇంగ్లండ్‌కు మరో షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌ను వారి దేశంలోనే వన్డే సిరీస్‌లో ఓడించిన (2-1తో) ఆ జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌లోనూ ఆ దిశగా తొలి అడుగు వేసింది. నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన తొలి మ్యాచ్‌లో అతిథ్య జట్టుపై సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 14 పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్‌ను తొలుత 9 ఓవర్ల మ్యాచ్‌గా నిర్ణయించారు. అయితే 7.5 ఓవర్ల తర్వాత వరుణుడు మరోసారి అడ్డుపడటంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అక్కడే ముగించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (28), బ్రెవిస్ (23), డొనొవన్ ఫెర్రియెరా (25 నాటౌట్), స్టబ్స్ (13) ఉన్న పరిధిలో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్ 2, ఓవర్టన్, ఆదిల్ రషీద్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు.వర్షం కారణంగా మరి కాస్త సమయం వృధా కావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 69 పరుగులకే కుదించారు. అయితే ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఇంగ్లండ్ విఫలమైంది. 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లు వికెట్ల రూపంలోనే ఐదు బంతులు వేస్ట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. జన్సెన్, కార్బిన్ బాష్ తలో 2, రబాడ ఓ వికెట్ తీశారు. ఛేదనలో తొలి బంతికే సాల్ట్‌ను రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత ఇంగ్లండ్ ఓవర్‌కు ఒకటి చొప్పున వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (25), సామ్ కర్రన్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 12న జరుగనుంది. -
ఇంగ్లండ్ తుది జట్టులో నాలుగు మార్పులు.. స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగబోయే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. దాదాపుగా ఏడాది తర్వాత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ప్లేయింగ్ ఎవెవెన్లోకి వచ్చాడు. తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో బంతితో (12 వికెట్లు), బ్యాట్‌తో (238 పరుగులు) అద్బుత ప్రదర్శనలు చేయడంతో సామ్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపందింది.అతను చివరిగా 2024 నవంబర్‌లో (వెస్టిండీస్ టూర్) ఇంగ్లండ్ తరఫున టీ20 ఆడాడు. బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లండ్ టీ20 జట్టు కోచ్ అయ్యాక సామ్ ఆడనున్న తొలి టీ20 ఇదే. సామ్‌తో పాటు ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ కూడా ఇంగ్లండ్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. సాల్ట్ పితృత్వ సెలవు కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత టీ20 సిరీస్ (విండీస్) ఆడలేదు. ఆర్చర్, ఓవర్టన్ ఇంగ్లండ్ చివరిగా ఆడిన టీ20లో లేరు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. కాగా, సౌతాఫ్రికాతో తొలి టీ20 కార్డిఫ్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో సాల్ట్‌తో పాటు జోస్ బట్లర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. బేతెల్, బ్రూక్, సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్ ఆతర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తారు. బౌలర్లుగా ఓవర్టన్, డాసన్, ఆర్చర్, ఆదిల్ రషీద్ ఉంటారు.దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ఇంగ్లండ్ XI: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
ఇంగ్లండ్‌తో ఐర్లాండ్ చారిత్రక సిరీస్.. ప్రత్యేక ఆకర్షణగా కెనడా కుర్రాడు
త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే చారిత్రక టీ20 సిరీస్‌కు ముందు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో కెనడా కుర్రాడికి చోటు కల్పించింది. 23 ఏళ్ల బెన్ కాలిట్జ్ అండర్-19 స్థాయి వరకు కెనడాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే ఐర్లాండ్‌కు వలస వచ్చాడు. ఐర్లాండ్ పౌరసత్వం పొందడం ద్వారా కాలిట్జ్ జాతీయ జట్టు ఎంపికకు అర్హత సాధించాడు.ఎడమ చేతి వాటం బ్యాటర్, రైట్ ఆర్మ్ స్లో బౌలర్ అయిన కాలిట్జ్కు ఇదే తొలి అంతర్జాతీయ అవకాశం. కాలిట్జ్కు 17 టీ20లు, 11 లిస్ట్-A మ్యాచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. గతంలో ఐర్లాండ్ తరఫున చాలామంది విదేశీ ఆటగాళ్లు ఆడినప్పటికీ.. ఇంగ్లండ్‌తో హోం టీ20 సిరీస్‌లో కాలిట్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు.ఈ సిరీస్‌కు పాల్ స్టిర్లింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్డన్ నీల్, లార్కన్ టక్కర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ మాత్రం ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఈ సిరీస్ ఐర్లాండ్‌కు ఇంగ్లండ్‌తో తొలి హోమ్ టీ20 సిరీస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ డబ్లిన్‌లోని ది విలేజ్ వేదికగా జరుగనున్నాయి.షెడ్యూల్:తొలి టీ20: సెప్టెంబర్ 17 రెండో టీ20: సెప్టెంబర్ 19 మూడో టీ20: సెప్టెంబర్ 21 ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, బ్యారీ మెక్‌కార్తీ, జోర్డాన్ నీల్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్. -
ఈ ఏడాది మూడో శతకం.. వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్ జోరు
గత ఐదారేళ్లుగా టెస్ట్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జో రూట్.. ప్రస్తుతం వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వరకు రూట్‌కు కేవలం టెస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ముద్ర ఉండేది. ఈ ముద్రను రూట్ ఇటీవలికాలంలో చెరిపేశాడు. వన్డేల్లోనూ వరుస పెట్టి సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ సత్తా చాటుతున్నాడు.ఈ ఏడాది రూట్ ఇప్పటికే 3 వన్డే శతకాలు చేశాడు. తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ అతని వన్డే కెరీర్లో 19వది. మొత్తం కెరీర్లో 58వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో కోహ్లి (82) తర్వాత అత్యధిక సెంచరీలు రూట్ పేరిటే ఉన్నాయి. సెంచరీల విషయంలో రూట్ తన సమకాలిక దిగ్గజాలైన రోహిత్ శర్మ (49), కేన్ విలియమ్సన్ (48), స్టీవ్ స్మిత్‌ను (48) దాటేసి మరింత దూరం వెళ్లిపోతున్నాడు.తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీతో బాబర్ ఆజమ్, బ్రియాన్ లారా, మహేల జయవర్ధనే సరసన చేరాడు. వీరంతా వన్డేల్లో తలో 19 సెంచరీలు చేశారు. తాజా చేసిన సెంచరీ రూట్ ఇంగ్లండ్ గడ్డపై 10వది. ఈ సెంచరీతో అతను స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా ట్రెస్కోథిక్ రికార్డును బద్దలు కొట్టాడు.వన్డేల్లో ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు (19), పరుగులు (7301) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న రూట్.. ఈ ఏడాది ఈ ఫార్మాట్లోనూ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది రూట్ 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఫ్యాబ్ ఫోర్లో రూట్.. కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్నాడు.సౌతాఫ్రికాతో మ్యాచ్ విషయానికొస్తే.. రూట్‌తో పాటు యువ ఆటగాడు జేకబ్ బేతెల్ కూడా సెంచరీతో చెలరేగడం, ఆతర్వాత బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. వన్డే క్రికెట్లో అతి భారీ విజయం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో పరుగుల పరంగా అతి భారీ విజయం నమోదు చేసింది. సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన మ్యాచ్‌లో 342 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో ఈ ఘనత సాధించింది. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇంతటి భారీ విజయాన్ని ఏ జట్టు సాధించలేదు.ఇంగ్లండ్‌కు ముందు ఈ రికార్డు భారత్ పేరిట ఉంది. టీమిండియా 2023 జనవరిలో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియా, జింబాబ్వే.. ఇంగ్లండ్, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో.. 2023 జూన్‌లో జింబాబ్వే యూఎస్ఏపై 304 పరుగుల తేడాతో గెలుపొందాయి.కాగా, స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన (సౌతాంప్టన్) మూడో వన్డేలో ఇంగ్లండ్ఈ చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ చరిత్ర సృష్టించగలిగింది. ఎందుకుంటే, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన సౌతాఫ్రికా అప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది.రూట్, బేతెల్ శతకాలుటాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (100), జేకబ్ బేతెల్ (110) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (62), జోస్ బట్లర్ (62 నాటౌట్) కూడా మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. బెన్ డకెట్ 31, కెప్టెన్ బ్రూక్ 3 పరుగులకు ఔట్ కాగా.. విల్ జాక్స్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించున్నారు. కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ తలో 2 వికెట్లు తీశారు.నిప్పులు చెరిగిన ఆర్చర్.. బెంబేలెత్తిపోయిన సౌతాఫ్రికా బ్యాటర్లుఅనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. జోఫ్రా ఆర్చర్ (9-3-18-4), బ్రైడన్ కార్స్ (6-1-33-2), ఆదిల్ రషీద్ (3.5-0-13-3) ధాటికి కనీసం సగం ఓవర్లు కూడా ఆడలేక 20.5 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికాకు వన్డే క్రికెట్లో ఇది అతి భారీ పరాజయం. ఆ జట్టుకు వన్డేల్లో ఇది రెండో అత్యల్స స్కోర్ (72) కూడా. ఈ మ్యాచ్‌లో ఆర్చర్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కార్బిన్ బాష్ చేసిన 20 పరుగులే అత్యధికం. అరంగేట్రం నుంచి వరుసగా 5 మ్యాచ్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసి చరిత్ర సృష్టించిన మాథ్యూ బ్రీట్జ్కీ (4) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మంచి ఫామ్‌లో ఉండిన మార్క్రమ్, ముల్దర్ డకౌట్లయ్యారు. రికెల్టన్ 1 పరుగుకే వెనుదిరిగాడు. విధ్వంసకర ఆటగాళ్లు స్టబ్స్ (10), బ్రెవిస్ (6) చేతులెత్తేశారు. -
వీరంగం సృష్టించిన లివింగ్‌స్టోన్
టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా కెంట్‌తో నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో లాంకాషైర్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ వీరంగం సృష్టించాడు. తొలుత బౌలింగ్‌లో రాణించి (4-0-21-2), ఆతర్వాత బ్యాటింగ్‌లో (45 బంతుల్లో 85 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగిపోయాడు. లివింగ్‌స్టోన్ విధ్వంసం ధాటికి కెంట్ నిర్దేశించిన 154 పరుగుల సాధారణ లక్ష్యాన్ని లాంకాషైర్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.- T20 Blast.- Quarter Final.- 85*(45) with bat.- 2/21 with ball.- Player of the match.ITS LIAM LIVINGSTONE SHOW, THE BIG MATCH PLAYER. 💪🔥 pic.twitter.com/R0ag5hQgQe— Johns. (@CricCrazyJohns) September 6, 2025ఇటీవలికాలంలో లివింగ్‌స్టోన్ పెద్ద మ్యాచ్లనగానే చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్ మెగా టీ20 టోర్నీ అయిన టీ20 బ్లాస్ట్‌లోనూ ఇదే జరిగింది. క్వార్టర్ ఫైనల్లో బంతితో, బ్యాట్‌తో సత్తా చాటిన లివింగ్‌స్టోన్ తన జట్టును ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 153 పరుగులకు ఆలౌటైంది. లాంకాషైర్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కెంట్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. లూక్ వుడ్ 3, లివింగ్‌స్టోన్, థామస్ అస్పిన్‌వాల్ చెరో 2, జేమ్స్ ఆండర్సన్, బ్లాథర్విక్, టామ్ హార్ట్లీ తలో వికెట్ తీసి కెంట్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కెంట్ తరఫున 28 పరుగులు చేసిన జో డెన్లీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. జాక్ క్రాలే (27), జోయ్ ఎవిసన్ (27), స్టీవర్ట్ (25) 20కి పైగా పరుగులు చేశారు. ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సామ్ బిల్లింగ్స్ (కెంట్ కెప్టెన్) 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో లాంకాషైర్ ఆదిలో తడబడినప్పటికీ (31 పరుగులకే 3 వికెట్లు).. లివింగ్‌స్టోన్ ఇన్నింగ్స్ కారణంగా ఆతర్వాత గెలుపు తీరాలు దాటింది. లివింగ్‌స్టోన్ సింగిల్ హ్యాండ్‌తో ఆ జట్టును గెలిపించాడు. అతనికి ఆస్టన్ టర్నర్ (22), మైఖేల్ జోన్స్ (28) సహకరించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా లివింగ్‌స్టోన్ తన బ్యాట్‌కు పని పెట్టి, టెయిలెండర్ల సాయంతో లాంకాషైర్ను విజయతీరాలు దాటించాడు. కెంట్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్ (4-0-14-3), జోయ్ ఎవిసన్ (4-0-21-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిద్దరు ఓ దశలో లాంకాషైర్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించారు. అయితే లివింగ్‌స్టోన్ తన జోరును ఏమాత్రం తగ్గించకుండా బ్యాటింగ్ చేసి లాంకాషైర్ను గెలిపించాడు. -
ఇంగ్లండ్‌కు డేంజర్ బెల్స్.. వన్డే వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ కష్టమే!?
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027కు ఇంగ్లండ్ జట్టు నేరుగా ఆర్హత సాధిస్తుందా? లేదా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆడుతుందా? అన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఇటీవల కాలంలో ఇంగ్లండ్ జట్టు దారుణ ప్రదర్శన ఇందుకు కారణం. టీ20, టెస్టుల్లో పర్వాలేదన్పిస్తున్న ఇంగ్లీష్ జట్టు.. వన్డేల్లో మాత్రం పూర్తిగా తెలిపోతుంది.2019 ఛాంపియన్స్ అయిన ఇంగ్లండ్ ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. తాజాగా గురువారం లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో 2-0 తేడాతో బ్రూక్ సేన సిరీస్‌ను కోల్పోయింది. 1998 తర్వాత సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను కోల్పోడం ఇదే తొలిసారి.డైరెక్ట్ ఎంట్రీ కష్టమే..?వన్డే ప్రపంచకప్-2023 తర్వాత ఇప్పటివరకు 21 వన్డేలు ఆడిన ఇంగ్లండ్ కేవలం 7 మాత్రమే గెలిచింది. ఈ ఫలితాలు బట్టి వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్ ప్రదర్శన ఎలా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఇంగ్లండ్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో జోస్ బట్లర్ కెప్టెన్సీ తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో యువ హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయినప్పటికి ఇంగ్లీష్ జట్టు తలరాత మారలేదు. ఇప్పుడు సౌతాఫ్రికాతో సిరీస్‌ను కోల్పోవడంతో 2027 వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను ఇంగ్లండ్ సంక్లిష్టం చేసుకుంటుంది.వన్డే ప్రపంచకప్-2027కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో ఏడు జట్లు చొప్పున ఉంటాయి. ఇందులో ఎనిమిది జట్లు ర్యాంకింగ్, మరో రెండు జట్లు ఆతిథ్య హోదాలో ఆర్హత సాధిస్తాయి. మరో నాలుగు జట్లు క్వాలిఫయర్ రౌండ్స్ నుంచి ప్రధాన టోర్నీలో అడుగుపెడతాయి. ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆటోమేటిక్ ఆర్హత సాధిస్తాయి. అయితే నమీబియా ఆతిథ్యమిస్తున్నప్పటికి ఇంకా ఐసీసీ సభ్య దేశం కాకపోవడంతో క్వాలిఫయర్స్ ఆడాల్సిందే.ఆఖరి స్దానంలో ఇంగ్లండ్..ఇక ప్రస్తుతానికి ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో టాప్-8లో భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. సౌతాఫ్రికా ఎలాగో నేరుగా ఆర్హత సాధిస్తుంది కాబట్టి ర్యాంకింగ్‌తో సంబంధం లేదు. అయితే ఇంగ్లండ్ మాత్రం 86 రేటియింగ్ పాయింట్లతో ఎనిమిదో స్ధానంలో ఉంది. ఇంగ్లండ్ తర్వాతి స్ధానంలో వెస్టిండీస్(80), బంగ్లాదేశ్(77) ఉంది. ఇంగ్లండ్, విండీస్, బంగ్లాదేశ్‌కు మధ్య పెద్దగా రేటింగ్ పాయింట్లు తేడా లేవు. ఇప్పటినుంచి అయినా ఇంగ్లండ్ వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే పదో స్ధానానికి పడిపోతుంది. దీంతో ఇంగ్లీష్ జట్టు క్వాలిఫయర్స్ ఆడాల్సి వుంటుంది. ఒకవేళ రాబోయో సిరీస్‌లలో విజయాలు సాధిస్తే ఇంగ్లండ్ నేరుగా ఆర్హత సాధిస్తుంది. ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌తో సిరీస్‌లో ఆడనున్నారు. శ్రీలంకతో రెండు సార్లు వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది.చదవండి: కివీస్ క్రికెట్ దిగ్గజం సంచలన నిర్ణయం.. 41 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ.. ఓ ట్విస్ట్ -
విధ్వంసకర వీరుడిని జట్టులో కలుపుకున్న ఇంగ్లండ్
తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ విధ్వంసకర ఆటగాడు జోర్డన్ కాక్స్‌కు ఇంగ్లండ్ జాతీయ జట్టు నుంచి పిలుపందింది. త్వరలో ఐర్లాండ్‌లో పర్యటించబోయే ఇంగ్లండ్ జట్టులో కాక్స్ యాడ్ చేయబడ్డాడు. ఈ పర్యటన కోసం 14 మంది సభ్యుల జట్టును ఇదివరకే ప్రకటించినా, హండ్రెడ్ లీగ్ ప్రదర్శనల కారణంగా కాక్స్‌ను 15వ ఆటగాడిగా జట్టులో యాడ్ చేశారు.ఐర్లాండ్ పర్యటనలో ఇంగ్లండ్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 17-21 మధ్యలో డబ్లిన్ వేదికగా జరుగనుంది.కాక్స్ హండ్రెడ్ లీగ్-2025లో 300కు పైగా పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కాక్స్ ప్రదర్శనల కారణంగా అతని జట్టు వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్లో 300కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కాక్స్ మాత్రమే.24 ఏళ్ల కాక్స్ ఇదివరకే ఇంగ్లండ్ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది హోం సిరీస్‌లో అతను ఆస్ట్రేలియాపై టీ20 అరంగేట్రం చేసి రెండు టీ20లు ఆడాడు. అనంతరం కాక్స్ వెస్టిండీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు.ఐర్లాండ్‌లో పర్యటించబోయే ఇంగ్లండ్ జట్టుకు జేకబ్ బేతెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ పర్యటన కోసం ఇంగ్లండ్ సెలెక్టర్లు కెప్టెన్ బ్రూక్‌కు విశ్రాంతినిచ్చారు.ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..జేకబ్ బేతెల్ (కెప్టెన్), విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోస్ బట్లర్, టామ్ బాంటన్, ఫిల్ సాల్ట్, జోర్డన్ కాక్స్, సోన్నీ బేకర్, టామ్ హార్ట్లీ, సాకిబ్ మహమూద్, లూక్ వుడ్, మ్యాట్ పాట్స్, ఆదిల్ రషీద్ -
లేటు వయసులో వీరంగం సృష్టించిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్.. విధ్వంసకర శతకం
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ రవి బొపారా 40 ఏళ్ల లేటు వయసులో వీరంగం సృష్టించాడు. టీ20 బ్లాస్ట్ తొలి క్వార్టర్ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్న బొపారా.. నిన్న (సెప్టెంబర్ 3) సర్రేతో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 105 పరుగులు చేశాడు.వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బొపారా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ భారీ స్కోర్ (154/4) చేసింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌటైనా బొపారా (వన్‌డౌన్‌లో వచ్చి) మెరుపు సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అతడొక్కడే జట్టు స్కోర్‌లో 70 శాతానికి పైగా చేశాడు. టీ20ల్లో బొపారాకు ఇది మూడో శతకం.మిగతా ఆటగాళ్లలో టిమ్ రాబిన్సన్ 20, జస్టిన్ బ్రాడ్ 9, సైఫ్ జైబ్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. సర్రే బౌలర్లలో జోర్డన్ క్లార్క్ 3 వికెట్లతో రాణించగా.. క్రిస్ జోర్డన్ ఓ వికెట్ పడగొట్టారు.సామ్ కర్రన్ పోరాటం వృధాభారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్రే.. కెప్టెన్ సామ్ కర్రన్ (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఓలీ పోప్ (23 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జార్జ్ స్క్రిమ్షా 3, బెన్ సాండర్సన్ 2 వికెట్లు తీసి సర్రేను దెబ్బకొట్టారు. -
ఇంగ్లండ్ యువ సంచలనానికి తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం
తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో హ్యాట్రిక్ సహా సంచలన ప్రదర్శనలు నమోదు చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ యువ ఫాస్ట్ బౌలర్ సోన్నీ బేకర్‌కు చేదు అనుభవం ఎదురైంది.హండ్రెడ్ లీగ్ ప్రదర్శనల కారణంగా ఇంగ్లండ్ జాతీయ జట్టు నుంచి పిలుపందున్న అతనికి తొలి మ్యాచే పీడకలగా మారింది. సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బేకర్.. తన తొలి మ్యాచ్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన అతను వికెట్లేమీ తీయకుండా ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఇంగ్లండ్ బౌలర్‌గా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.బేకర్‌కు ముందు ఈ చెత్త రికార్డు లియామ్ డాసన్ పేరిట ఉండేది. 2016లో అతను పాకిస్తాన్‌పై తన వన్డే అరంగేట్రంలో 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విభాగంలో బేకర్, డాసన్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ లారెన్స్ (67), జార్జ్ స్క్రిమ్షా (66) ఉన్నారు.సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన బేకర్.. మార్క్రమ్ ధాటికి తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఆతర్వాత కూడా మార్క్రమ్ బేకర్‌ను కుదురుకోనివ్వలేదు. అతని రెండో ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. మార్క్రమ్కు రికెల్టన్ కూడా జతకలవడంతో బేకర్ తన తొలి నాలుగు ఓవర్లలోనే 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బేకర్ బ్యాటర్‌గానూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి బంతికే కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డై అరంగేట్రాన్ని పీడకలగా మార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికా చేతిలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. కేశవ్ మహారాజ్ (4/22), ముల్దర్ (3/33) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేస్తూ 24.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌గా వచ్చిన జేమీ స్మిత్ (54) అర్ద సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ పరువు కాస్తైనా మిగిలింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో మార్క్రమ్ (55 బంతుల్లో 86) చెలరేగడంతో సౌతాఫ్రికా 20.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలోనే సోన్నీ బేకర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.22 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన బేకర్.. తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌పై హ్యాట్రిక్ సాధించి వార్తల్లో నిలిచాడు. -
టీ20ల్లోనూ రూట్ హవా.. వరుస విధ్వంసాలతో హంగామా
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్, ఫాబ్ ఫోర్లో ముఖ్యుడు జో రూట్ గత కొన్నేళ్లుగా టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఫాబ్ ఫోర్లో మిగతా ముగ్గురు (కోహ్లి, స్మిత్, కేన్) సహా ఈతరం బ్యాటర్లలో ఎవ్వరూ ఈ మధ్యకాలంలో రూట్ జోరును అందుకోలేకపోతున్నారు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్ కెరీర్.. ఆ ఏడాది నుంచి కట్టలు తెంచుకుంది.అప్పటివరకు 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. ఈ ఐదేళ్లలో ఏకంగా 22 శతకాలు బాదాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో మెజార్టీ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టెస్ట్‌ల్లో రూట్ ముందున్న ప్రధాన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు. ఈ రికార్డుకు రూట్ మరో 3000 పైచిలుకు పరుగుల దూరంలో ఉన్నాడు.టెస్ట్‌ల్లో హవా కొనసాగిస్తూనే రూట్ ఈ మధ్యకాలంలో వన్డేల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది రూట్ వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పై అద్భుత శతకాలు బాదాడు. అప్పటివరకు వన్డేల్లో తన పని అయిపోయిందన్న వారికి రూట్ వరుస సెంచరీలతో సమాధానం చెప్పాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో సత్తా చాటుతున్నా రూట్ పొట్టి క్రికెట్‌కు పనికి రాడన్న అపవాదు మాత్రం నిన్నమొన్నటి వరకు ఉండింది.అయితే దీన్ని కూడా రూట్ అధిగమించడం మొదలుపెట్టాడు. ఇటీవలే భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉండిన రూట్.. అదే ఫామ్‌ను ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే జరుగుతున్న ద హండ్రెడ్ లీగ్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌ల్లో తేలిపోయిన రూట్.. ఆతర్వాత వరుస మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఇరగదీశాడు. ఆగస్ట్ 21న ఓవల్ ఇన్విన్సిబుల్స్పై 41 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 76 పరుగులు చేసిన రూట్.. తాజాగా వెల్ష్ ఫైర్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి తన జట్టును నాకౌట్‌కు కూడా చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్లోని భారీ హిట్టర్ కోణం బయటపడింది. సహజంగా గ్రౌండ్ స్ట్రోక్స్ మాత్రమే ఆడే రూట్.. ఈ మ్యాచ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. -
4 బంతుల్లో 32 పరుగులు.. చరిత్రలో చెత్త గణాంకాలు
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కుక్ హండ్రెడ్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ (సెట్) వేశాడు. ఈ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న కుక్.. ఇవాళ (ఆగస్ట్ 22) ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో 4 బంతుల్లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు.66వ బంతికి 12 పరుగులిచ్చిన (5 వైడ్లు, మరో వైడ్, సిక్సర్) కుక్.. 67 బంతికి బౌండరీ.. 68 బంతికి రికార్డు స్థాయిలో 14 పరుగులు (సిక్సర్ ప్లస్ నో బాల్ (హండ్రెడ్ లీగ్‌లో నో బాల్‌కు 2 పరుగులు), సిక్సర్), 69వ బంతికి 2 పరుగులిచ్చాడు. 70వ బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. దీంతో కుక్ సెట్లో (ఓవర్) మొత్తం 32 పరుగులు వచ్చాయి. హండ్రెడ్ లీగ్‌లో 5 బంతులను ఓ సెట్‌గా పరిగణిస్తారు. ఈ లీగ్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన సెట్‌గా రికార్డుల్లోకెక్కింది.కుక్ చెత్త ప్రదర్శన కారణంగా అతని జట్టు ట్రెంట్ రాకెట్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. కుక్ బంతిని అందుకోకముందు ప్రత్యర్థి ఇన్విన్సిబుల్స్ 35 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉండింది. ఈ సెట్లో కుక్ స్వయంకృతాపరాథాలతో పాటు సామ్ కర్రన్ బ్యాట్ ఝులిపించడంతో సమీకరణలు ఒక్కసారిగా 30 బంతుల్లో 51 పరుగులకు మారాయి. సామ్ కర్రన్‌తో పాటు (24 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) జోర్డన్ కాక్స్ (32 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హుద్దగా చెలరేగి ఇన్విన్సిబుల్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. జో రూట్ (41 బంతుల్లో 76; 11 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇన్విన్సిబుల్స్.. ఆదిలో నిదానంగా ఆడినా, ఆతర్వాత గేర్ మార్చి ఊహించని విజయం సాధించింది. కర్రన్, కాక్స్ విధ్వంసం ధాటికి ఆ జట్టు 89 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
వన్డే ప్రపంచకప్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
మహిళల వన్డే ప్రపంచకప్-2025కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ వ్యవహరించనుంది. ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్లో స్కైవర్-బ్రంట్ బ్రంట్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి.అదేవిధంగా తొడ కండరాల గాయం కారణంగా గత కొన్ని నెలలగా ఆటకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ హీథర్ నైట్ తిరిగి జట్టులోకి వచ్చింది. నైట్ తిరిగి రావడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారింది. ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టు సెలక్టర్లు ఎక్కవగా స్పిన్ విభాగంపై దృష్టిసారించారు.దీంతో స్పిన్నర్ల కోటాలో గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లిన్సే స్మిత్‌లకు చోటు దక్కింది. కాగా ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది. ఇటీవల సిరీస్‌లలో నిరాశపరిచిన కేట్ క్రాస్, మైయా బౌచియర్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన క్రాస్.. గతేడాది నుంచి గాయాలు,పేలవ ఫామ్‌తో సతమతమవుతోంది. ఆమె స్ధానాన్ని యువ పేసర్ ఎమ్ ఆర్లోట్తో భర్తీ చేశారు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 3న బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఐదవ వన్డే ప్రపంచ కప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.మహిళల ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టు: ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్.చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్ -
రికార్డు హాఫ్ సెంచరీ.. తండ్రికి అంకితమిచ్చిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఇటీవల చనిపోయిన తన తండ్రి జాన్ బట్లర్‌కు ఓ అపూర్వ కానుక ఇచ్చాడు. హండ్రెడ్ లీగ్‌లో చేసిన రికార్డు హాఫ్ సెంచరీని తండ్రికి అంకితమిచ్చాడు. తండ్రి మరణం తీవ్రంగా కలచి వేస్తున్నప్పటికీ హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న జోస్ (మాంచెస్టర్ ఒరిజినల్స్).. తాజాగా వెల్ష్ ఫైర్‌పై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.ఈ ఫీట్ సాధించిన అనంతరం జోస్ తండ్రిని స్మరించుకుంటూ.. "నాన్నా, ఇది నీ కోసమే" అన్నట్లు బ్యాట్‌ను ఆకాశానికెత్తి చూపాడు. ఈ సీన్లు క్రికెట్ అభిమానులను కదలించాయి. బట్లర్ తన తండ్రిని ఎంత మిస్ అవుతాన్నాడో వ్యక్తపరిచాయి.కొద్ది రోజుల కిందటే జోస్ తన తండ్రి మరణ వార్తను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మాకు ప్రతిదీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.అనంతరం ఆగస్టు 9న ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ సభ్యులంతా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి జోస్ తండ్రి మృతికి నివాళులు అర్పించారు. అయితే ఆ మ్యాచ్‌లో జోస్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు.రికార్డు హాఫ్ సెంచరీతాజాగా వెల్ష్ ఫైర్‌పై జోస్ చేసిన హాఫ్ సెంచరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డుపుటల్లోకెక్కింది. ఈ హాఫ్ సెంచరీ జోస్‌కు టీ20ల్లో 94వది. దీంతో జోస్ పొట్టి క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. వెల్ష్ ఫైర్‌తో మ్యాచ్‌లో జోస్ హాఫ్ సెంచరీతో మెరిసిరా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒరిజినల్స్ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. జోస్ రికార్డు హాఫ్ సెంచరీ వృధా అయిపోయింది. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్: 113 అర్ద సెంచరీలు (418 ఇన్నింగ్స్)విరాట్ కోహ్లీ: 105 అర్ధ సెంచరీలు (397 ఇన్నింగ్స్)జోస్ బట్లర్: 94 అర్ధ సెంచరీలు (436 ఇన్నింగ్స్)బాబర్ అజామ్: 93 అర్ధ సెంచరీలు (309 ఇన్నింగ్స్)క్రిస్ గేల్: 88 అర్ధ సెంచరీలు (455 ఇన్నింగ్స్) -
తండ్రి మరణం.. స్టార్ క్రికెటర్ భావోద్వేగం
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ చేదు వార్తను బట్లర్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మాకు ప్రతిదీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తన నాన్నతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో బట్లర్ పోస్ట్ చేశాడు.అయితే జాన్ బట్లర్ మరణించి దాదాపు వారం రోజులు అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు తండ్రి మరణం బాధిస్తున్నప్పటికి ది హాండ్రడ్ లీగ్‌లో ఆడుతూ బట్లర్ క్రికెట్‌పై తనకు ఉన్న అంకిత భావాన్ని చాటుకున్నాడు. హాండ్రడ్ లీగ్-2025లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు జోస్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 9న ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు మొత్తం నల్లటి ఆర్మ్ బ్యాండ్ ధరించి ఆయన మృతికి నివాళులు అర్పించారు. అయితే ఈ మ్యాచ్‌లో బట్లర్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మాంచెస్టర్ ఒరిజినల్స్ పై ఓవల్ ఇన్విన్సిబుల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 128 పరుగులకు ఆలౌటైంది. మాంచెస్టర్ బ్యాటర్లలో కెప్టెన్ ఫిల్ సాల్ట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అనంతరం స్పల్య లక్ష్యాన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ 57 బంతుల్లోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి చేధించింది. ఓపెనర్లు విల్ జాక్స్ (61), టవాండా ముయేయే (59) హాఫ్ సెంచరీలతో మ్యాచ్ ఫినిష్ చేశారు.చదవండి: కొత్త కారు కొన్న రోహిత్ శర్మ.. ఎన్ని కోట్లంటే? -
చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్డ్.. తొలి పురుష క్రికెటర్‌గా..!
ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. హండ్రెడ్ లీగ్ 1000 పరుగులు సాధించిన తొలి పురుష బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2025 ఎడిషన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సాల్ట్ (మాంచెస్టర్ ఒరిజినల్స్).. 32 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు.సాల్ట్ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో అతని జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 100 బంతుల్లో 128కి ఆలౌటైన ఒరిజినల్స్.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇన్విన్సిబుల్స్ కేవలం 57 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. విల్ జాక్స్ (26 బంతుల్లో 61; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), తవండ ముయేయే (28 బంతుల్లో 59; 10 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించారు.చెలరేగిన రషీద్ ఖాన్ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్ బౌలర్ రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. తన కోటా 20 బంతుల్లో కేవలం 19 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్‌తో పాటు ఇన్విన్సిబుల్స్ బౌలర్లు బెహ్రెన్‌డార్ఫ్, సాకిబ్ మహమూద్, సామ్ కర్రన్ కూడా రాణించారు. వీరంతా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు తలో 2 వికెట్లు తీశారు. -
‘నా జీవితంలో అత్యంత మధుర క్షణాలవి’
ఎనిమిదేళ్ల విరామం తర్వాత టెస్టు క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత బ్యాటర్ కరుణ్ నాయర్ తన ఇంగ్లండ్ పర్యటన మర్చిపోలేని విధంగా సాగిందని వ్యాఖ్యానించాడు. హెడింగ్లీలో తొలి టెస్టు మొదటి రోజు జాతీయ గీతం పాడుతున్నప్పుడు నేను సాధించగలిగాను అనే గర్వంతో భావోద్వేగానికి లోనయ్యానని అతను గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన నాయర్ 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 205 పరుగులు చేశాడు.అయితే చివరి టెస్టులో చేసిన అర్ధసెంచరీ భారత్ విజయానికి కీలకంగా మారింది. ‘ఓవల్ టెస్టులో అర్ధ సెంచరీని శతకంగా మలచలేకపోవడం కొంత నిరాశ కలిగించింది. అయితే టెస్టు తొలి రోజు కఠిన పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడగలిగాను. మొత్తంగా చూస్తే ఎత్తుపల్లాలతో నా సిరీస్ సాగింది. అయితే ఆ అంకం ముగిసింది. ఇకపై రాబోయే రోజుల్లో నాకు అవకాశం దక్కినప్పుడు భారీ స్కోర్లు సాధించగలనని నమ్ముతున్నా’ అని నాయర్ చెప్పాడు. త్వరలో జరిగే మహరాజా టి20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరఫున కరుణ్ నాయర్ బరిలోకి దిగనున్నాడు. -
ఇంగ్లండ్‌లో పాక్ క్రికెటర్ అరెస్ట్
పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఇంగ్లండ్‌లో అత్యాచార ఆరోపణల కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ కేసు విషయం తెలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) హైదర్ అలీని సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది.ఓ యువతి ఫిర్యాదు మేరకు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు హైదర్ అలీని ఈ నెల 3వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను పాకిస్తాన్-ఏ (షాహీన్స్) తరఫున బెకెన్హెయిమ్‌లో ఇంగ్లండ్-ఏ జట్టుతో వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. గత ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందని పీసీబీ ప్రకటించింది.పోలీసుల ప్రాథమిక విచారణ సందర్భంగా హైదర్ అలీ కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తాను నిర్దోషినంటూ వాదించినట్లు సమాచారం. 24 ఏళ్ల హైదర్ అలీ పాక్ జాతీయ జట్టు తరఫున ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతను పాక్ తరఫున 35 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 547 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన హైదర్ అలీ 2020లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు.కాగా, పాక్ క్రికెటర్లకు ఇంగ్లండ్‌లో వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ లైంగిక వేధింపులు సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైదర్ అలీ విషయంలో పాక్ క్రికెట్ పైకి హుందాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ, లోలోపల తమ దేశ క్రికెటర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హైదర్‌కు కావాల్సిన లీగల్ సపోర్ట్‌కు పీసీబీనే సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే, పాక్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో పాక్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 8) ఆ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఆడనుంది. -
‘బుమ్రా లేకుండా గెలవడం యాదృచ్ఛికమే
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా అనుకున్నట్లుగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. అయితే అతను బరిలోకి దిగని బర్మింగ్‌హామ్, ఓవల్ టెస్టులలోనే టీమిండియా గెలిచింది. దాంతో బుమ్రా లేకపోయినా పెద్దగా తేడా రాదని, అతను లేకపోయినా మ్యాచ్‌లు గెలవగలమని కొన్ని విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అసాధారణ బౌలర్ అయిన బుమ్రా గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ అండగా నిలిచాడు. ‘బుమ్రా సిరీస్‌ను చాలా బాగా మొదలు పెట్టాడు. ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా... తొలి టెస్టులో ఒకసారి, మూడో టెస్టులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ప్రజలు వేరే అంశాలు ముందుకు తెచ్చి అతను లేని టెస్టుల్లో భారత్ గెలిచిందంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ నా అభిప్రాయ ప్రకారం అది యాదృచ్ఛికం మాత్రమే. బుమ్రా ఒక అసాధారణ బౌలర్. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా కాలంగా నిలకడగా రాణించాడు. నా దృష్టిలో నిస్సందేహంగా అందరికంటే అతను అగ్ర స్థానంలో ఉంటాడు’ అని సచిన్ కితాబిచ్చాడు. మాంచెస్టర్ టెస్టులో స్టోక్స్ ‘షేక్ హ్యాండ్’కు నిరాకరించి జడేజా, సుందర్ ఆటను కొనసాగించడంలో ఎలాంటి తప్పూ లేదని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘డ్రా’కు అంగీకరించాలని ఇంగ్లండ్ కోరడంలో అర్థం లేదన్న సచిన్... భారత బ్యాటర్లు స్పందించిన తీరుతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని అన్నాడు. -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ ది హాండ్రెడ్ లీగ్-2025 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఏడాది సీజన్లో కార్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ అతడు ప్రస్తుతం పాదం, బొటనవేలు గాయంతో బాధపడుతున్నాడు.కార్స్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగమయ్యాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా ఈ స్పీడ్ స్టార్ రాణించాడు. అయితే గాయం కారణంగా కీలకమైన ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు వైద్యల సలహా మెరకు హాండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని కార్స్ ధ్రువీకరించాడు."భారత్‌తో జరిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంతరం వైద్య సిబ్బందితో నా గాయం గురించి సంప్రదింపులు జరిపాను. వైద్యుల సూచన మేరకు ఈ ఏడాది ది హండ్రెడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీకి నేను దూరంగా ఉన్నప్పటికి నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను.భవిష్యత్తులో ఈ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యం వహించడానికి ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో కార్స్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు కూడా కార్స్ దూరమయ్యే అవకాశముంది. అతడు తిరిగి మళ్లీ యాషెస్ సిరీస్‌లో ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే? -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హాండ్రడ్ లీగ్-2025ను అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ ఖాన్.. మంగళవారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తాచాటాడు.తన 20 బంతుల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో 650 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ చరిత్ర సృష్టించాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 478 ఇన్నింగ్స్‌లలో 18.54 సగటుతో 651 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట నాలుగు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. 26 ఏళ్ల రషీద్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడుతుంటాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ ఐపీఎల్-2025లో మాత్రం ఈ అఫ్గానీ దారుణంగా విఫలమయ్యాడు. 15 మ్యాచ్‌లు ఆడి కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లండన్ స్పిరిట్‌పై 6 వికెట్ల తేడాతో ఇన్విన్సిబుల్స్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. ఇన్విన్సిబుల్స్ బౌలర్లు రషీద్ ఖాన్, సామ్ కర్రన్ (19-10-18-3), జోర్డన్ క్లార్క్ (10-6-8-2) చెలరేగడంతో 80 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇన్విన్సిబుల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.చదవండి: Mohammad Siraj: సిరాజ్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా? -
‘పని భారం’ను పక్కన పెట్టాల్సిందే!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఒక కీలక అంశం భారత క్రికెట్లో చర్చకు వచ్చింది. గత కొంత కాలంగా బీసీసీఐ ప్రధాన ఆటగాళ్లకు ‘పనిభారం’ ఎక్కువగా ఉంటుందని, వారికి మ్యాచ్‌లు, సిరీస్‌ల మధ్యలో తగినంత ‘విశ్రాంతి’ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ముందే ప్రకటించింది. చివరకు అదే జరిగింది. అయితే తొలి టెస్టు తర్వాత వారం రోజుల విరామం వచ్చినా బుమ్రా రెండో టెస్టు ఆడకపోవడం, కీలకమైన, సిరీస్‌ను సమం చేయాల్సిన చివరి టెస్టుకు కూడా అతను దూరం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు ఎలాంటి విరామం లేకుండా పూర్తి ఫిట్నెస్తో మొహమ్మద్ సిరాజ్ ఐదు టెస్టులూ ఆడి వేయికి పైగా బంతులు వేయడం ఈ అంశాన్ని మరింతగా చర్చించేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇకపై ‘పనిభారం’ పేరుతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కాకుండా నిబంధనలు విధించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో పాటు కొందరు క్రికెటర్లు ప్రత్యేక హోదాను ప్రదర్శిస్తూ తమకు నచ్చిన మ్యాచ్‌లు ఎంచుకుంటూ మిగతా కొన్ని మ్యాచ్‌ల నుంచి వేర్వేరు కారణాలతో తప్పుకుంటున్నారు. దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టే ప్రతిపాదన ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.‘సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరికీ ఈ సమాచారం అందిస్తాం. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడే ప్లేయర్లు ఇకపై తమ ఇష్టానుసారం మ్యాచ్‌లను ఎంపిక చేసుకునే వీలుండదు’ అని ఆయన అన్నారు. ‘పనిభారం’ అంటూ ఆటగాళ్లను మ్యాచ్‌లకు దూరం పెట్టే విషయంపై కూడా సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘పేస్ బౌలర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ఈ విషయంలో వైద్యబృందం సలహాలతోనే ముందుకు వెళతాం. అయితే పనిభారం పేరుతో కీలక మ్యాచ్‌లకు దూరం కావడం మాత్రం జరగదు. ఆటకంటే ఆటగాళ్లు ఎక్కువ కాదని సందేశం అందరికీ వెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు... మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ‘పనిభారం’ విషయంలో ఘాటుగా స్పందించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు గాయం, నొప్పిలాంటివాటిని మర్చిపోవాలి. సరిహద్దుల్లో చలి ఎక్కువగా ఉందని సైనికులు ఫిర్యాదు చేస్తున్నారా. పంత్ ఫ్రాక్చర్‌తో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి తత్వం ఆటగాళ్ళలో ఉండాలి. కోట్లాది మంది భారతీయులకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.సిరాజ్ ఐదు టెస్టుల్లోనూ కెప్టెన్ అడిగిన ప్రతీసారి 7–8 ఓవర్ల స్పెల్‌లు బౌలింగ్ చేశాడు. అసలు ‘పనిభారం’ అనే చర్చనే అతను తీసిపడేశాడు. నేను చాలా కాలంగా చెబుతున్నా. ఈ పదాన్ని భారత క్రికెట్ డిక్షనరీ నుంచి పూర్తిగా తొలగించాలి’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.సిరీస్ విజయంతో స్వదేశానికి... న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఓవల్‌లో చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు ప్రత్యేకంగా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. సుదీర్ఘ సిరీస్ ముగిసిన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమయ్యారు. కొందరు విశ్రాంతి కోసం ఇంగ్లండ్‌లోనే ఆగిపోయేందుకు సిద్ధపడగా...మరికొందరు సాధ్యమైనంత తొందరగా అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ద్వారా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మ్యాచ్ ముగిశాక లండన్ వీధుల్లో సహచరుడు కుల్దీప్తో కలిసి సరదాగా తిరిగిన అనంతరం అర్ష్ దీప్ స్వదేశానికి బయల్దేరాడు. అతనితో పాటు సిరాజ్, శార్దుల్ కూడా భారత్‌కు చేరుకున్నారు. -
IND Vs ENG: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
చిరస్మరణీయ విజయం.. ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టిన టీమిండియా
ఓవల్ టెస్ట్ విజయానంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడో ప్లేస్‌లో ఉండింది.ఈ మ్యాచ్ విజయానంతరం భారత్ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్ విన్నింగ్ పర్సంటేజ్ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్ ఐదో ప్లేస్‌లో ఉంది. వెస్టిండీస్ ఈ సైకిల్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఈ సైకిల్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీలో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ వెస్టిండీస్‌తో ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ భారత్ వేదికగా ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్ (అక్టోబర్ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్ టెస్ట్‌లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్ మ్యాజిక్ చేసి ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ENG Vs IND: వాట్ ఏ స్పెల్.. సిరాజ్ మియ్యా.. దర్శకధీరుడు ఫిదా!
టీమిండియా చివరి టెస్ట్‌లో విజయం సాధించడంపై దర్శకధీరుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. వాట్ ఏ స్పెల్ సిరాజ్ మియా అంటూ మహమ్మద్ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రసిధ్ కృష్ణను సైతం కొనియాడారు. ఓవల్‌లో టీమిండియా తిరిగి పుంజుకుని అద్భుతంగా పోరాడిందని ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్రికెట్‌కు మరేది సాటిరాదని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో మనోళ్లు విజయకేతనం ఎగరేశారు. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రసిధ్ కృష్ణ సైతం నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.SIRAJ MIYAA… 🔥What a spell!!!Prasidh’s double blow!!!India fights back at The Oval!!!Test cricket… nothing comes close. 🥰🥰Team India 🇮🇳🫡— rajamouli ss (@ssrajamouli) August 4, 2025 -
England Vs India: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగిన వోక్స్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్‌ను తలపించింది.వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రయిక్ రొటేట్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.ఇదే సిరీస్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకున్నాడు. 1984లో విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మార్షల్ ఒంటిచేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు.Arm in a sling, Chris Woakes has arrived to the crease 😱 pic.twitter.com/D4QDscnfXE— Sky Sports Cricket (@SkyCricket) August 4, 2025మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వీరోచితంగా పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్బుతమైన శతకాలతో గెలుపుకు గట్టి పునాది వేసినా చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. టీమిండియా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా సిరాజ్ చివరి రోజు సింహంలా గర్జించి ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. అతనికి ప్రసిద్ద్ కృష్ణ (27-3-126-4), ఆకాశ్‌దీప్ (20-4-85-1) సహకరించాడు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్‌లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. -
IND VS ENG: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్‌ల టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఈ సిరీస్‌లో ఏళ్ల నాటి రికార్డులు తిరగరాయబడ్డాయి. కొన్ని విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పబడ్డాయి. ఐదో టెస్ట్‌లో రికార్డుల పరంపర తారాస్థాయికి చేరింది.ఈ మ్యాచ్ నాలుగో రోజు సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ సిరీస్‌లో ఏకంగా 9 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సిరీస్‌లోనూ ఇంత మంది 400 ప్లస్ పరుగులు చేయలేదు.ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 754 పరుగులు చేశాడు. గిల్ తర్వాత జో రూట్ (537), కేఎల్ రాహుల్ (532), రవీంద్ర జడేజా (516), హ్యారీ బ్రూక్ (481), రిషబ్ పంత్ (479), బెన్ డకెట్ (462), జేమీ స్మిత్ (434), యశస్వి జైస్వాల్ (411) 400 ప్లస్ పరుగులు చేశారు.గతంలో ఇలా..!వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 1975-76 సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన 8 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. ఆతర్వాత 1993 యాషెస్ సిరీస్‌లోనూ ఇదే ఫీట్ రిపైటైంది. అయితే 9 మంది 400 ప్లస్ పరుగులు నమోదు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.భారత క్రికెట్ చరిత్రలోనూ ఇదే మొదటిసారిఈ సిరీస్‌లో ఏకంగా ముగ్గురు భారత బ్యాటర్లు (గిల్, రాహుల్, జడేజా) 500 ప్లస్ పరుగులు చేయడం మరో విశేషం. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఫీట్ నమోదు కాలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. 1, 3 టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్ గెలిచింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. స్కోర్ వివరాలు..భారత్ 224 & 396ఇంగ్లండ్ 247 & 339/6 (76.2) -
ENG VS IND 5th Test: ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.అంత ఈజీ కాదుఐదో రోజు ఇంగ్లండ్ ఛేదించాల్సిన లక్ష్యం 35 పరుగులే అయినప్పటికీ ఇది అంత ఈజీ కాదు. 22 బంతుల తర్వాత భారత బౌలర్ల చేతికి కొత్త బంతి వస్తుంది. కొత్త బంతితో భారత బౌలర్లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ టెయిలెండర్లకు కత్తి మీద సామే అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వికెట్ సమర్పించుకోక తప్పదు.ఇలాంటి పరిస్థితుల్లో భారత పేసర్లు సర్వశక్తులు ఒడ్డి వికెట్ల కోసం ప్రయత్నిస్తారు. నాలుగో రోజు చివర్లోనే సిరాజ్, ప్రసిద్ద్ లయను అందుకున్నారు. ఐదో రోజు ఆరంభంలోనే వికెట్ పడితే ఇంగ్లండ్‌పై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. క్రీజ్‌లో ఉన్న ఆటగాళ్లలో జేమీ స్మిత్‌ను తప్పిస్తే ఆట భారత్‌వైపుకు మళ్లే అవకాశం లేకపోలేదు.ఇంగ్లండ్‌కు శుభవార్తఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త వినిపించింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ అవసరమైతే బ్యాటింగ్‌కు వస్తాడని జో రూట్ తెలిపాడు. వోక్స్‌కు ఎడమ భుజం మిస్ లొకేట్ అయినప్పటికీ జట్టు కోసం గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు వస్తాడని రూట్ స్పష్టం చేశాడు. అయినా, మ్యాచ్ అంతవరకు (వోక్స్ బ్యాటింగ్ చేసేంత వరకు) వస్తుందని అనుకోవట్లేదని రూట్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ సిరీస్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా గాయాన్ని (విరిగిన పాదం) లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే.బ్రూక్, రూట్ సెంచరీలు భారీ లక్ష్య ఛేదనలో బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలు చేసి ఇంగ్లండ్‌ను గెలుపుతీరాల వరకు తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ఇంగ్లండ్ డిఫెన్స్‌లో పడింది. 36 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ బ్రూక్, రూట్‌తో పాటు జేకబ్ బేతెల్ వికెట్ కూడా కోల్పోయి తడబాటుకు లోనైంది. జైస్వాల్ సూపర్ శతకంఅంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
India vs England: ఆఖరి పంచ్ ఎవరిది..?
-
India vs England: ఇంకా ఉంది!
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్‌కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌కు ఒక వికెట్ దక్కింది. ‘టాప్’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్‌నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రూక్, రూట్ శతకాలు నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్‌తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసి«ద్‌కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0. -
ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఆతర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌ల్లో సేద తీరుతున్నారు.ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5() ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
శతక్కొట్టిన బ్రూక్.. సెంచరీకి చేరువలో రూట్.. గెలుపు దిశగా ఇంగ్లండ్
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్ (98 నాటౌట్) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్‌కు జతగా జేకబ్ బేతెల్ (1) క్రీజ్‌లో ఉన్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ల భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది (1-3లో).అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఏకంగా 50 అర్ద సెంచరీలు బాదారు. టెస్ట్ క్రికెట్ ఆరంభం నుంచి ఓ సిరీస్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల సంఖ్య ఇదే. 1993 యాషెస్ సిరీస్‌లోనూ ఇన్నే హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసింది. ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చేసిన హాఫ్ సెంచరీ ఈ సిరీస్‌లో 50వది.టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వ్యక్తిగత 50+ స్కోర్లు50* - ఇంగ్లండ్‌లో టీమిండియా, 202550 - ది యాషెస్, 199349 - ది యాషెస్, 1920/2146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్, 1960/6146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ 1968/69మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి ఇంకా 128 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 246/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ది ఓవల్ టెస్ట్ లో ముగిసిన మూడో రోజు ఆట
-
చిలకపచ్చ పావురం..!
పావురాలు ఎక్కువగా కాసింత నీలిఛాయ కలగలసిన బూడిద రంగులో ఉంటాయి. తెల్ల పావురాలు కూడా సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని పావురాలు గోధుమరంగులో ఉంటాయి. ఇంకొన్ని ఇవన్నీ కలగలసిన రంగుల్లో ఉంటాయి. వీటికి భిన్నంగా చిలకపచ్చ రంగులో ఉన్న పావురం ఒకటి ఇటీవల ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్ పట్టణంలో కనిపించి, స్థానికులను అబ్బురపరచింది. ఈ అరుదైన పావురాన్ని చూడగానే కొందరు ఔత్సాహికులు దీనిని తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. కొద్ది వారాలుగా ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ వీథుల్లో మిగిలిన పావురాల గుంపుతో కలసి చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కువగా నార్తాంప్టన్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆల్ సెయింట్స్ చర్చ్ ప్రాంగణంలోను, ఆ పరిసరాల్లోని వీథుల్లో ఉన్న ఇళ్ల వద్ద కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు దీని వీడియోలను ‘టిక్‌టాక్’లో పోస్ట్ చేస్తే, అవి వైరల్‌గా మారాయి. మొదటిసారిగా ఈ పావురాన్ని తన ఇంటి ముందున్న తోటలో జూన్ 28న చూసినట్లు రాబిన్ హింక్మాట్ అనే స్థానికులు చెప్పారు. ఆయన దీని ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు స్థానికులు కూడా దీని ఫొటోలు, వీడియోలు తీసి ఆన్లైన్లో పెట్టారు. మొత్తానికి ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. (చదవండి: ప్రాణం తీసిన ఫ్లాస్కు) -
IND vs ENG: 9 తీస్తారా... సిరీస్‌ను వదిలేస్తారా?
ఆఖరి పోరులో గెలవాలన్నా... సిరీస్‌ను సమం చేయాలన్నా... ఇప్పుడు భారత్ భారమంతా బౌలర్లమీదే ఉంది. బ్యాట్ పట్టి అర్ధశతకాలతో రెండో ఇన్నింగ్స్‌లో నిలబెట్టిన బౌలర్లే... ఇప్పుడు 9 వికెట్లు తీస్తే 2–2తో ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్‌ను సమం చేసిన గర్వంతో భారత్ స్వదేశానికి బయల్దేరుతుంది. ఇదే జరిగితే టీమిండియా టెస్టుల భవిష్యత్తుకు ఇక ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ ఫార్మాట్ నుంచి స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తప్పుకోవడంతో డీలాపడిన టెస్టు జట్టుకు నూతనోత్సాహాన్ని ఇంగ్లండ్ పర్యటన ఇచ్చినట్లు అవుతుంది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. భారత్ నెగ్గాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. మొత్తానికి సిరీస్‌లోని చివరి టెస్టులోనూ ఫలితం రావడం ఖాయమైంది. లండన్: కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్, కరుణ్ నాయర్... వీళ్లంతా స్పెషలిస్టు బ్యాటర్లు. కానీ కీలకమైన చివరి టెస్టులో బ్యాట్లెత్తారు. పేసర్ ఆకాశ్‌దీప్ సహా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు ప్రధానంగా బౌలర్లు. బౌలింగ్ ఆల్‌రౌండర్లు అయినా భారత బ్యాటింగ్ భారాన్ని మోశారు. ప్రధాన బ్యాటింగ్ బలగమే కనీసం 20 పరుగులైనా చేయలేకపోయిన చోటు ఈ ముగ్గురు అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... ఆకాశ్‌దీప్, జడేజా, సుందర్ తమ విలువైన అర్ధశతకాలతో ఈ టెస్టులో పోరాడే స్కోరును జత చేశారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 396 పరుగులు చేసింది. ఆకాశ్‌దీప్ (66; 12 ఫోర్లు), జడేజా (53; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు, అట్కిన్సన్ 3 వికెట్లు, ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట నిలిచే ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రాలీ (14)ని సిరాజ్ బౌల్డ్ చేయగా, డకెట్ (34 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఊహించని ఫిఫ్టీ... ఓవర్‌నైట్ స్కోరు 75/2 శనివారం మూడో రోజు ఆట రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు, ఓపెనర్ జైస్వాల్‌కు ఆకాశ్‌దీప్ కొండంత అండగా నిలిచాడు. ‘నైట్ వాచ్‌మన్’గా వచ్చిన ఆకాశ్‌దీప్ ఊహించని విధంగా ఆతిథ్య బౌలర్లను ఎదుర్కొన్నాడు. తొలిసెషన్లో తేలిగ్గానే అతని వికెట్‌ను దక్కించుకుందామనుకున్న ప్రధాన పేసర్లు అట్కిన్సన్, టంగ్‌లకు కొరకరాని కొయ్యగా మారాడు. మరోవైపు జైస్వాల్ కూడా అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును కదిలించాడు. మూడో వికెట్‌కు 100 పరుగులు జతయ్యాక 70 బంతుల్లో ఆకాశ్‌దీప్ టెస్టుల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతే జట్టు స్కోరు 177 వద్ద వెనుదిరిగాడు. జైస్వాల్ ‘శత’క్కొట్టినా... రెండో సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు ప్రభావం చూపెట్టారు. గిల్ (11), కరుణ్ నాయర్ (17)లను అట్కిన్సన్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో జైస్వాల్ ... జడేజా అండతో పరుగులు చక్కబెట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్ టెస్టుల్లో ఆరో సెంచరీని 127 బంతుల్లో పూర్తిచేసుకున్నాడు. భాగస్వామ్యం బలపడుతుండగానే టంగ్... జైస్వాల్ వికెట్ తీసి దెబ్బకొట్టాడు. ధ్రువ్ జురేల్ (34; 4 ఫోర్లు)తో కలిసి జడేజా జట్టు స్కోరును 300 దాటించాడు. 304/6 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ఆఖరి సెషన్ మొదలైన కొద్దిసేపటి తర్వాత జురేల్ అవుటవ్వగా... జడేజా, సుందర్ టీమిండియాను నడిపించారు. జడేజా 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే వికెట్‌ను సమరి్పంచుకోగా, సుందర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో మెరుపు ఫిఫ్టీని సాధించి స్కోరు పెంచే క్రమంలో అవుట్‌కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఓవర్టన్ (బి) టంగ్ 118; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్‌దీప్ (సి) అట్కిన్సన్ (బి) ఓవర్టన్ 66; శుబ్‌మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; నాయర్ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 17; జడేజా (సి) బ్రూక్ (బి) టంగ్ 53; ధ్రువ్ జురేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఓవర్టన్ 34; సుందర్ (సి) క్రాలీ (బి) టంగ్ 53; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 0; ప్రసిధ్‌కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (88 ఓవర్లలో ఆలౌట్) 396. వికెట్ల పతనం: 1–46, 2–70, 3–177, 4–189, 5–229, 6–273, 7–323, 8–357, 9–357, 10–396. బౌలింగ్: అట్కిన్సన్ 27–3–127–3, టంగ్ 30–4–125–5, ఓవర్టన్ 22–2–98–2, బెథెల్ 4–0–13–0, రూట్ 5–1–15–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (బ్యాటింగ్) 34; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 50. వికెట్ల పతనం: 1–50. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 5–1–15–0, ప్రసిధ్ 5–1–23–0, సిరాజ్ 3.5–0–11–1. -
ఓవల్ టెస్ట్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడు
-
గ్రాహం థోర్ప్‌కు నివాళిగా...
మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ స్మరణార్ధం ఇంగ్లండ్ ఆటగాళ్లు ‘ఎ డే ఫర్ థోర్పీ’ పేరుతో నివాళి అర్పించారు. ఆటగాడిగా ఉన్నప్పుడు తలకు హెడ్‌బ్యాండ్ ధరించి బ్యాటింగ్‌కు వచ్చే థోర్ప్‌ను గుర్తు చేసుకుంటూ...ఇంగ్లండ్ క్రికెటర్లు మ్యాచ్ రెండో రోజు అదే తరహా తెలుపు హెడ్బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. థోర్ప్ సొంత మైదానమైన ఓవల్ గ్రౌండ్‌లోనే టెస్టు జరుగుతున్న నేపథ్యంలో అతని భార్య, కూతురు ఆటకు ముందు గంట మోగించారు.మ్యాచ్ సందర్భంగా ప్రత్యేకంగా నిధుల సేకరణ కూడా జరిగింది. శుక్రవారం థోర్ప్ పుట్టిన రోజు కాగా...ఏడాది క్రితం 55 ఏళ్ల వయసులో అతను చనిపోయాడు. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన థోర్ప్ 44.66 సగటుతో 6744 పరగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 82 వన్డేల్లో 37.18 సగటుతో 2380 పరుగులు సాధించాడు. -
ENG VS IND 5th Test: ఆటను శాసించిన బౌలర్లు
లండన్: అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు రసకందాయంగా జరుగుతోంది. రెండో రోజును ఇరు జట్ల బౌలర్లు శాసించారు. దీంతో ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్ ఇలా మొదలవగానే అలా 224 పరుగుల వద్ద ముగిసింది. మరోవైపు జోరుగా మొదలైన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ అంతే జోరుగా కుప్పకూలింది. 92 పరుగుల వరకు వికెట్ కోల్పోని ఆతిథ్య జట్టు 247 పరుగులకే ఆలౌటైంది. కేవలం 23 పరుగుల ఆధిక్యమే లభించగా... అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) వెనుదిరగ్గా... యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 51 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి అజేయ అర్ధ శతకంతో నిలిచాడు. జైస్వాల్‌తో ఆకాశ్‌దీప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జైస్వాల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేయడం కలిసొచ్చింది. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. 34 బంతుల్లోనే ముగిసె... రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత్ ఆలౌటైంది. 204/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మిగిలిన నాలుగు వికెట్లను తొలి అర గంటలోనే కోల్పోయింది. మూడో ఓవర్లోనే ఓవర్‌నైట్ స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను (109 బంతుల్లో 57; 8 ఫోర్లు) టంగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 218 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. ఆ తర్వాత 6 పరుగుల వ్యవధిలోనే అట్కిన్సన్... వాషింగ్టన్ సుందర్ (55 బంతుల్లో 26; 3 ఫోర్లు), సిరాజ్ (0), ప్రసిధ్ కృష్ణ (0) వికెట్లను పడగొట్టాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 224 వద్ద ముగిసింది. రెండో రోజు భారత్ కేవలం 20 పరుగులే చేయగలిగింది. అట్కిన్సన్కు ఐదు వికెట్లు దక్కాయి. ఓపెనింగ్ జోరులో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా మొదలైంది. క్రాలీ, డకెట్ పేసర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సిరాజ్ మూడో ఓవర్లో క్రాలీ 2 ఫోర్లు కొడితే... ఆకాశ్‌దీప్ ఓవర్లో డకెట్ మూడు ఫోర్లు బాదాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఇలా ఎవరిని విడిచిపెట్టకుండా యథేచ్చగా ఆడేశారు. బౌండరీలు, సిక్స్‌లతో వన్డేను తలపించే ‘పవర్ ప్లే’లా సాగిన ఓపెనింగ్ జోరుతో ఇంగ్లండ్ 12 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది. ఈ దూకుడుకు మరుసటి ఓవర్లో డకెట్ (38 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను అవుట్ చేయడం ద్వారా ఆకాశ్‌దీప్ బ్రేకులేశాడు. 15వ ఓవర్లో ఇంగ్లండ్ వందకు చేరగా, క్రాలీ 42 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 109/1 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్లో బౌలర్ల హవా ఆ తర్వాత కూడా బజ్‌బాల్ ఆట ఆడిన క్రాలీని ప్రసి«ద్‌కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఇక్కడి నుంచి బౌలింగ్ ప్రతాపం మొదలైంది. సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విలువైన వికెట్లను పడేశాడు. పోప్ (22; 4 ఫోర్లు), జో రూట్ (29; 6 ఫోర్లు), బెథెల్ (6)లను వరుస విరామాల్లో సిరాజ్ అవుట్ చేయడంతో 196 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 200 దాటాక స్మిత్ (8), ఓవర్టన్ (0)లను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. 215/7 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. టెయిలెండర్ల అండతో 57 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్రూక్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఫీల్డింగ్‌లో భుజానికి గాయమైన వోక్స్ ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో 9 వికెట్లకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.జట్టునుంచి బుమ్రా విడుదలఐదో టెస్టుకు దూరమైన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ జట్టు నుంచి విడుదల చేసింది. దీని వల్ల అతను ఈ టెస్టు జరిగే సమయంలో టీమ్‌తో పాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో ముందుగా అనుకున్నట్లుగానే 3 టెస్టులే ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెలలో భారత్ ఆసియా కప్ టి20 టోర్నీ ఆడనుంది. బుమ్రా ఇందులో ఆడతాడా లేదా అనే విషయంపై సెలక్టర్లు తర్వాత నిర్ణయం తీసుకుంటారు.స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 2; రాహుల్ (బి) వోక్స్ 14; సుదర్శన్ (సి) స్మిత్ (బి) టంగ్ 38; గిల్ రనౌట్ 21; కరుణ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 57; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 9; జురేల్ (సి) బ్రూక్ (బి) అట్కిన్సన్ 19; సుందర్ (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 26; ఆకాశ్‌దీప్ నాటౌట్ 0; సిరాజ్ (బి) అట్కిన్సన్ 0; ప్రసి«ద్‌కృష్ణ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 0; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 224. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153, 7–218, 8–220, 9–224, 10–224. బౌలింగ్: వోక్స్ 14–1–46–1, అట్కిన్సన్ 21.4–8–33–5, టంగ్ 16–4–57–3, ఓవర్టన్ 16–0–66–0, బెథెల్ 2–1–4–0. ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: క్రాలీ (సి) జడేజా (బి) ప్రసిధ్ 64, డకెట్ (సి) జురేల్ (బి) ఆకాశ్‌దీప్ 43; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 22; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 29; బ్రూక్ (బి) సిరాజ్ 53; బెథెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 6; స్మిత్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 8; ఓవర్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 0; అట్కిన్సన్ (సి) ఆకాశ్‌దీప్ (బి) ప్రసిధ్ 11; టంగ్ నాటౌట్ 0; వోక్స్ అబ్సెంట్ హర్ట్; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–92, 2–129, 3–142, 4–175, 5–195, 6–215, 7–215, 8–235, 9–247. బౌలింగ్: సిరాజ్ 16.2–1–86–4, ఆకాశ్‌దీప్ 17–0–80–1, ప్రసి«ద్‌కృష్ణ 16–1–62–4, జడేజా 2–0–11–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ బ్యాటింగ్ 51; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్‌దీప్ బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–46, 2–70. బౌలింగ్: అట్కిన్సన్ 6–2–26–1, టంగ్ 7–1–25–1, ఓవర్టన్ 5–1–22–0. -
ENG VS IND 5th Test: చెలరేగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్
ఓవల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (16.2-1-86-4), ప్రసిద్ద్ కృష్ణ (16-1-62-4), ఆకాశ్‌దీప్ (17-0-80-1) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ మ్యాచ్ మొత్తానికి దూరం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 247 పరుగుల వద్ద పుల్ స్టాప్ పడింది. ఆ జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, హ్యారీ బ్రూక్ 53, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యరు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా
ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టీమిండియా చెత్త ఆటతీరును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.204/6 వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్‌కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్‌ను టంగ్ బోల్తా కొట్టించాడు.భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
భారత్‌తో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వోక్స్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. జేమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ తీయగా బలమైన గాయమని తేలింది.దీంతో అతను ఐదో టెస్ట్ నుంచి అర్దంతరంగా వైదొలిగాడు. ఈ మ్యాచ్‌లో వోక్స్ లేని లోటు ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్ తమ స్టార్ పేసర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తాజాగా వోక్స్ కూడా దూరం కావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడినైట్లంది.ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన వోక్స్ 181 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు కూడా వోక్స్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా తరుపుముక్క అయిన కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్ తలో 2 వికెట్లు తీయగా.. వోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గిల్ రనౌటయ్యాడు. -
యూకే ఏటీసీలో సమస్య.. 100 విమానాలపై ప్రభావం
లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సమస్య తలెత్తడంతో గురువారం దక్షిణ ఇంగ్లండ్‌లోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమాన సర్వీసులు, ఆలస్యంగా నడవడం లేదా రద్దవడం సంభవించాయి. దీంతో వేలాదిగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హీత్రూ, గాట్విక్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కార్డిఫ్, ఎడిన్‌బరో తదితర విమానాశ్రయాల్లో పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించినప్పటికీ ఆ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి దరిద్రంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నామని నేషనల్ ఎయిర్‌ట్రాఫిక్ సర్వీసెస్(ఎన్ఏటీఎస్) తెలిపింది. -
బుమ్రా ఎంత కాలం ఇలా..!
టెస్టు బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాపై మరోసారి చర్చ మొదలైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన టెస్టులో ఆడించకుండా ‘పని భారం’ పేరుతో అతడిని పక్కన పెట్టడం మళ్లీ అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు రేకెత్తించింది. నిజానికి సిరీస్‌కు ముందే అతను మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ చేసిన ప్రకటనే తప్పు. ప్రతీ మ్యాచ్‌కు ముందు పరిస్థితిని బట్టి తుది జట్టును ఎంపిక చేసే సమయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ‘మూడే టెస్టులు’ అంటూ మళ్లీ మళ్లీ చెప్పడం అర్థరహితం. అలా ప్రకటించినా... పేస్, స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న ఓవల్ పిచ్‌పై అతను ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో నాలుగు, ఐదు రోజుల్లో బుమ్రాకు బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. మూడు రోజుల విరామం కలిపితే ఐదు రోజుల పాటు అతని పూర్తి విశ్రాంతి లభించింది. లీడ్స్‌తో మొదటి టెస్టు, బరి్మంగ్‌హామ్‌లో రెండో టెస్టుకు మధ్య ఏడు రోజుల వ్యవధి వచ్చినా బుమ్రాను ఆడించకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తప్పు పట్టగా, ఇప్పుడు అదే పునరావృతమైంది. బుమ్రా అత్యద్భుత బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంటి చేత్తో అతను జట్టుకు విజయాలు అందించాడు. 48 టెస్టుల కెరీర్లో 35 టెస్టుల్లో విదేశాల్లోనే ఆడి కేవలం 20 సగటుతో 172 వికెట్లు పడగొట్టిన రికార్డు అతని సొంతం. అయితే ఇలా అప్పుడప్పుడు ఆడుతూ 31 ఏళ్ల బుమ్రా ఎంత కాలం టెస్టు కెరీర్‌ను కొనసాగించగలడనేదే చర్చనీయాంశం. టెస్టుల్లో అతను రిటైర్ కావడం మంచిదనే సూచనలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అతను పూర్తిగా తప్పుకోవడంకంటే ఇదే తరహాలో వ్యూహాత్మకంగా వాడుకోవడం సరైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే బుమ్రాను నమ్ముకొని మ్యాచ్‌లు గెలవాలనుకునే ఆలోచనను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టాల్సిందే. అతను అందుబాటులో ఉంటే మంచిదే కానీ లేకపోయినా అన్ని రకాలుగా సిద్ధం కావడం సరైన ప్రణాళిక అవుతుంది. ఇతర బౌలర్లతో పోలిస్తే బుమ్రా తక్కువ ఓవర్లు ఏమీ వేయలేదు. ఆ్రస్టేలియా సిరీస్‌లో 151.2 ఓవర్లు వేసిన అతను...ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌లోనే 119.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతని భిన్నమైన బౌలింగ్ శైలితోనే సమస్య. అదే అతని వెన్నుభాగంపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. బౌలింగ్ సమయంలో శరీరాన్ని ఒక వైపు వంచే ‘లేటరల్ ఫ్లెక్సియాన్’తో అతను ఇంత కాలం కొనసాగడమే గొప్ప. నిజానికి ఈ సిరీస్‌లో అతను ఆడిన మూడు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లలో 140 కిలోమీటర్లకు పైగా వేసిన బంతుల శాతం 42.7 నుంచి 22.3కి, ఆపై 0.5 శాతానికి తగ్గుతూ వచ్చింది. మాంచెస్టర్‌లో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లు వేసిన బుమ్రా తొలిసారి 100కు పైగా పరుగులు ఇచ్చాడు. కాబట్టి అతడిని ఓవల్‌లోనూ ఆడిస్తే సమస్య తీవ్రంగా మారేదేమో! ఇలాంటి స్థితిలో బుమ్రాకు విరామాలు ఇవ్వడంలో తప్పు లేదనేది మేనేజ్మెంట్ వాదన. – సాక్షి క్రీడా విభాగం -
తొలిరోజు తడబాటు
సిరీస్ సమం కోసం గెలవాల్సిన సమరాన్ని భారత్ సరిపోలని ఆటతీరుతో మొదలు పెట్టింది. ప్రతికూల వాతావరణం, కలిసిరాని పిచ్, నిలకడలేని బ్యాటింగ్... అన్నీ టీమిండియాకు ప్రతికూలంగా మారాయి. వాన చినుకులు పదేపదే ఇబ్బంది పెట్టిన తొలిరోజు ఆటలో భారత్ అడుగడుగునా కష్టాల్నే ఎదుర్కొంది. బ్యాటర్ల వైఫల్యంతో సెషన్, సెషన్‌కు వికెట్లను కోల్పోయిన భారత్ మొదటి రోజు అతికష్టంగా 200 పరుగుల స్కోరు దాటింది. లండన్: చికాకు పెట్టిన చినుకులు, ప్రతికూల పరిస్థితుల మధ్య ఆఖరి టెస్టును భారత్ అతిక్లిష్టంగా మొదలు పెట్టింది. విలువైన వికెట్లను తక్కువ స్కోరుకే కోల్పోయి కష్టంగా బ్యాటింగ్ చేసింది. మరోవైపు సిరీస్‌లో ఇదివరకే ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... ఆధిపత్యంతో ఐదో టెస్టుకు శ్రీకారం చుట్టింది. సమష్టి బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియాను బెంబేలెత్తించింది. దీంతో తొలిరోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (98 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (45 బంతల్లో 19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్‌ను, వెటరన్ సీమర్ బుమ్రా, అన్షుల్ కంబోజ్, శార్దుల్ ఠాకూర్ స్థానాల్లో వరుసగా ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, కరుణ్ నాయర్లను తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమవగా ఒలీ పోప్ సారథ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, జోష్ టంగ్ రెండు వికెట్ల చొప్పున తీశారు. వర్షం కారణంగా తొలి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. జైస్వాల్ 2, రాహుల్ 14... టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ ఒలీ పోప్ పరిస్థితులను గమనించి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరంభ ఓవర్లలోనే భారత్‌ను కష్టాల్లోకి నెట్టేశారు. నాలుగో ఓవర్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ (2)ను అట్కిన్సన్, కాసేపటికి కేఎల్ రాహుల్ (14)ను వోక్స్ అవుట్ చేశారు. సాయి సుదర్శన్ (38; 6 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (21; 4 ఫోర్లు) నిలదొక్కుకునే ప్రయత్నాలపై చినుకులు కురవడంతో 72/2 స్కోరు వద్ద ఆట ఆగింది. ముందు వాన... తర్వాత తడారని మైదానం కోసం మ్యాచ్ చాలా సేపు నిలిపివేశారు. ఈ లోపే లంచ్ బ్రేక్‌ను కానిచ్చారు. ఫీల్డ్ అంపైర్లు పిచ్, అవుట్ ఫీల్డ్‌ను పరిశీలించిన తర్వాత రెండో సెషన్ ఆలస్యంగానే మొదలైంది. గిల్ నిర్లక్ష్యం తొలి సెషన్ ఎదురుదెబ్బల నుంచి ఇంకా కోలుకోకముందే రెండో సెషన్లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అవుట్‌తో కోలుకోలేని దెబ్బ తగిలింది. బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళుతున్న క్రమంలోనే పరుగుకు ప్రయత్నించి గిల్ వికెట్‌ను సమర్పించుకున్నాడు. కవర్స్ దిశగా బంతిని బాదిన శుబ్‌మన్... ఫీల్డర్ అట్కిన్సన్ను సమీపిస్తున్న బంతిని చూసుకోకుండానే పరుగు కోసం సగం పిచ్‌ను దాటేశాడు. సాయి సుదర్శన్ వారించినా పట్టించుకోలేదు. అట్కిన్సన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని నేరుగా వికెట్లకు (డైరెక్ట్ హిట్) త్రో చేయడంతో గిల్ నిష్క్రమించాడు. దీంతో 45 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం రనౌట్‌తో కూలింది. టెస్టుల్లో శుబ్‌మన్ ఇలా రనౌట్ కావడం ఇది రెండోసారి. ఏడాది క్రితం రాజ్‌కోట్‌లో అదికూడా ఇంగ్లండ్‌తోనే జరిగిన టెస్టులో అతను రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా (9), ధ్రువ్ జురేల్ (19) తక్కువే చేశారు. నాయర్ ఫిఫ్టీ భారత బ్యాటింగ్ బలగమంతా చేతులెత్తేయడంతో ఒకదశలో 153 పరుగులకే 6 ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఇలా క్లిష్టపరిస్థితుల్లో కరుణ్ నాయర్ టీమిండియా పాలిట ఆపద్భాంధవుడయ్యాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి వికెట్‌ను కాపాడుకుంటూనే ఒక్కో పరుగు జతచేస్తూ జట్టు స్కోరును 200 పరుగులు దాటించిన పోరాటం అద్భుతం. ఈ క్రమంలోనే అతను 89 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు అబేధ్యమైన ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 2; రాహుల్ (బి) వోక్స్ 14; సుదర్శన్ (సి) స్మిత్ (బి) టంగ్ 38; గిల్ (రనౌట్) 21; కరుణ్ నాయర్ (బ్యాటింగ్) 52; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 9; జురేల్ (సి) బ్రూక్ (బి) అట్కిన్సన్ 19; సుందర్ (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (64 ఓవర్లలో 6 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153. బౌలింగ్: వోక్స్ 14–1–46–1, అట్కిన్సన్ 19–7–31–2, టంగ్ 13–3–47–2, ఓవర్టన్ 16–0–66–0, బెథెల్ 2–1–4–0.743 ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా శుబ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో గిల్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 743 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు సునీల్ గావస్కర్ (1979లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో 732 పరుగులు) పేరిట ఉండేది. -
ENG VS IND 5th Test: మళ్లీ టాస్ ఓడిన భారత్.. జట్టులో ఎవరూ ఊహించని ఆటగాడు
ఇంగ్లండ్ గడ్డపై భారత్ వరుసగా ఐదో మ్యాచ్‌లో టాస్ ఓడింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఇంగ్లండ్ తాత్కాలిక సారధి ఓలీ పోప్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్‌ను పక్కకు పెట్టి మరీ కరుణ్‌కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్


