breaking news
Crime
-
'కన్నడ హీరో దర్శన్ కేసు.. మరణ శిక్ష వేసినా ఓకే'
శాండల్‌వుడ్ హీరో దర్శన్(Darshan Thoogudeepa) కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో రెండోసారి అరెస్టైన దర్శన్ ప్రస్తుతం జైలులోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చాలాసార్లు విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కానీ దర్శన్ అడిగిన సౌకర్యాలు ఇవ్వడం సాధ్య కాదని.. అందులో కొన్ని మాత్రమే ఇవ్వగలమని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్‌పై వేయగా.. తాజాగా న్యాయస్థానం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా దర్శన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. జైలులో దర్శన్‌కు కనీస సదుపాయాలు కల్పించడం లేదని వివరించారు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి.. ఏ శిక్ష విధించినా దర్శన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. త్వరగా విచారణ జరిపి.. మరణశిక్ష విధించినా సరే తమకు సమ్మతమేనని దర్శన్ తరఫు న్యాయవాది వాదించారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టిందని.. గతంలో తనకు విషమిస్తే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాది గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసి తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.కాగా.. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న దర్శన్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార కార్యదర్శి వరదరాజ నివేదికను అందించారు. ఆయనకు నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ చర్మవ్యాధుల చికిత్స నిపుణురాలు జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేశారు. రేణుకాస్వామి హత్య కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలని దర్శన్, పవిత్రాగౌడ పిటిషన్ దాఖలు చేశారు. -
రేటు అడిగితే దారుణంగా దాడి : ఏకంగా వేళ్లు నరికేశారు!
స్వల్ప వివాదానికే 22 ఏళ్ల లా విద్యార్థిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మందుల ధర గురించి ప్రారంభమైన వాదన, తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి తలకు 14 కుట్లు వేయాల్సి వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాన్పూర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్ స్థానిక మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడ మందుల ధర గురించి సిబ్బంది అమర్ సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇది తీవ్రం కావడంతో విచక్షణ మరిచిన అమర్ సింగ్ దాడికి దిగాడు. ఇతనికి సోదరులు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా తోడయ్యారు. తలపై బలంగా కొట్టడంతో రక్తమోడుతున్నా, ప్రాణభయంతో పరుగు పెడుతున్నా బాధితుడిని వదలి పెట్ట లేదు. నలుగురూ కలిసి అభిజీత్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అతని కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?అభిజీత్ గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పొట్టలోని పేగులు బైటకు వచ్చేశాయి. వాటిని గుడ్డలో చుట్టి మరీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులకు పలుకుబడి ఉన్న నేపథ్యంలో చావు బతుకుల్లో ఉన్న తన కొడుకుపై, తనపైనా అక్రమ కేసు బనాయించారని చందేల్ తల్లి నీలం సింగ్ చందేల్ వాపోయారు. అయితే చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్‌పై దోపిడీ కేసు నమోదు చేశామని, కానీ దాడి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. చౌహాన్, సింగ్ , తివారీలను హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ ధృవీకరించారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితుడు తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఇదీచదవండి శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ -
కస్టమ్స్ అధికారిపై మూక దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. ఒక కస్టమ్స్ ఇన్స్పెక్టర్, అతని భార్యపై వారి ఇంటిలో ఆటో డ్రైవర్ నేతృత్వంలోని 50 మంది గుంపు దాడికి పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఇంటికి ఆలస్యంగా వచ్చారు.ఇంతలో దాడికి పాల్పడినవారంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, అతని భార్య కారులో ఇంటికి వస్తుండగా వారి ఇంటి సమీపలో వారి కారును ఒక ఆటో ఢీకొంది. ఈ నేపధ్యంలో ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీతో ప్రదీప్ కుమార్ ఘర్షణకు దిగారు. ఇది జరిగిన కొద్దిసేపటి తరువాత ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీ కొంతమందిని తనతోపాటు తీసుకువచ్చి, ఆ అధికారి అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. తరువాత అక్కడ విధ్వంసం సృష్టించారు.బాధితుడు ప్రదీప్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 50 మంది అతని ఇంటిలోనికి చొరబడి, అతనిని అతని భార్యను దారుణంగా కొట్టారు. తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందుకున్న తర్వాత ప్రదీప్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భలే వెరైటీ లంచావతారం!
తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నెవాడు ఇంకోడు అని పాతకాలపు సామెత. నేరుగా లంచాలు తీసుకునేందుకు జంకే, భయపడే ప్రభుత్వ ఉద్యోగులు... ఆ మొత్తాలను ఇంటావిడకు ఇమ్మని.. లేదా బంధువుల చేతుల్లో పెట్టమని అడగడం.. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా విఫలమై అధికారులకు చిక్కిన వైనాల గురించి మనం తరచూ చూస్తూంటాం. ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. కాకపోతే.. ఈ సంఘటనలో లంచం తీసుకున్నది చాలా వెరైటీగా కావడం విశేషం. వివరాలు..రాజస్థాన్‌లో రాజ్‌కాంప్ అని ఒక ప్రభుత్వ సంస్థ ఉంది. దీనికి ప్రద్యుమ్న దీక్షిత్ జాయింట్ డైరెక్టర్. ప్రభుత్వమన్నాక ఐటీలో కొన్ని పనులు చేపట్టడం.. వాటికి సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేటు వారికి ఇవ్వడం సహజమే. కానీ ఈయనగారు ఒక షరతుపై రెండు కాంట్రాక్టులను రెండు వేర్వేరు కంపెనీలకు ఇచ్చేశాడు. తన భార్యకు ఉత్తుత్తి ఉద్యోగం ఒకటి ఇవ్వడం.. నెల నెల జీతం కింద కొంత మొత్తం ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడమే ఈ షరతు. రెండు కంపెనీలు దీనికి ఒప్పుకున్నాయి. కాంట్రాక్టు దక్కించుకున్నాయి. రెండేళ్లు గడచిపోయాయి. ప్రద్యుమ్న దీక్షిత్ భార్య పూనమ్ దీక్షిత్.. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లోనే కూర్చుని ఉంటోంది. నెల తిరక్కముందే ఆమె బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చిపడుతున్నాయి. ఏదైనా పాపం పండే వరకే అంటారు కదా.. అలాగే ఈ వ్యవహారం కూడా ఎట్టకేలకు బట్టబయలైంది. రాజస్థాన్ హైకోర్టు గత ఏడాది ఐటీ కాంట్రాక్టులు పొందిన సంస్థలపై దర్యాప్తు జరపాలని ఒక ఆదేశం జారీ చేసింది. అటు.. ఇటు తిరిగి ఈ విచారణ కాస్తా ఈ ఏడాది జూలైలో మొదలైంది. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబరు వరకూ పూనమ్ దీక్షిత్‌కు రెండు కంపెనీల నుంచి సుమారు రూ.38 లక్షల రూపాయల వరకూ ముట్టినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ 21 నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా ఆయా ఆఫీసుల గడప తొక్కిన పాపాన పోకపోవడం ఇంకో విశేషం. అంతేకాదు... ఆమె నిజంగానే ఉద్యోగం చేస్తోందన్న భ్రమ కల్పించేందుకు ప్రద్యుమ్న స్వయంగా అటెండెన్స్‌కు సంబంధించిన మెయిళ్లు అప్రూవ్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది.ఒక కంపెనీ నుంచి ఫ్రీలాన్సింగ్ పేరుతో.. ఇంకో కంపెనీ నుంచి జీతం పేరుతో ఈమె ఖాతాలోకి డబ్బులు వచ్చినట్లు స్పష్టమైంది. కంపెనీ రికార్డులు.. పూనమ్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన తరువాత రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రద్యుమ్న దీక్షిత్‌పై ఈ నెల 17న కేసు నమోదు చేశారు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
కుక్కలను తప్పించబోయి లారీ కిందికి..
ఖమ్మం జిల్లా: రహదారిపై ఓ మహిళ స్కూటీపై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో తప్పించబోయి లారీకిందికి దూసుకుపోయింది. తీవ్రగాయాలతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణంలోని పోస్టాఫీస్ రోడ్డుకు చెందిన మోరంపూడి స్వర్ణలత (55) ద్విచక్రవాహనం(స్కూటీ)పై గంగారం వైపు నుంచి సత్తుపల్లికి వస్తోంది. తాళ్లమడ శివారున కుక్కలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ధాన్యం కోసం ఆగి ఉన్న లారీ కిందకు దూసుకుపోయింది. లారీకింద భాగంలో ఇరుక్కుపోయిన స్వర్ణలత తలకు బంపర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను సత్తుపల్లి 108 సిబ్బంది బయటకు తీశారు. మృతురాలికి భర్త రామకోటేశ్వరరావు, కుమారుడు నాగశ్యామ్, కుమార్తె నాగశ్రీ ఉన్నారు. -
ప్రాణం తీసిన కిటికీ వివాదం
కరీంనగర్ కార్పొరేషన్: చిన్న కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్లో సంచలనం సృష్టించింది. పక్కింటి వాళ్లతో పాటు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. కరీంనగర్ సిటీలోని రాఘవేంద్రనగర్‌లో వడ్లకొండ లక్ష్మీరాజం శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల పేరిట తమ ఇంటి కిటికీలను నగరపాలక సంస్థ అధికారులు పదేపదే తొలగించడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. తన ఇంటి కిటికీ విషయంపై పక్కింటి వాళ్లతో పాటు, నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్ వేధించడంతోనే చనిపోతున్నట్లు లక్ష్మిరాజం సూసైడ్ నోట్ రాశాడు. దాదాపు మూడేళ్లుగా పక్కింటివాళ్లతో కిటికీల విషయంపై లక్ష్మిరాజంకు వివాదం నడుస్తోంది. సెట్‌బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులు కిటికీని 2023లో మొదటిసారి తొలగించారు. మళ్లీ ఏర్పాటు చేశారంటూ ఈ సంవత్సరం ఆగస్టులో మరోసారి తొలగించారు. తన కిటికీలు తొలగించడం, పక్కింటి వాళ్లపై తాను ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మానసిక వేదనతో లక్ష్మిరాజం ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పక్కింటి వాళ్లతోపాటు, నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్‌పై చర్య తీసుకోవాలని లక్ష్మిరాజం భార్య శారద వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పక్కింటి వ్యక్తి ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కిటికీలు తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ తెలిపారు. -
Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన గాంధీ విహార్‌లో కలకలం రేపింది. ఇక్కడి ఒక ఫ్లాట్‌లో ఉంటున్న 32 ఏళ్ల యూపీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.కాలిపోయిన స్థితిలో..అతని మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసులకు లభ్యమయ్యింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని లివ్ ఇన్ పార్ట్నర్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఫోరెన్సిక్ సైన్స్‌లో బీఎస్సీ చదువుతున్న 21 ఏళ్ల మహిళ, ఆమె మాజీ ప్రియుడు, వారి స్నేహితుడు ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నివాసితులని పోలీసులు తెలిపారు. మృతునితో గతంలో సహజీవనం చేసిన ఒక యువతి తన ఇద్దరు పురుష స్నేహితులతో కలసి తన భాగస్వామిని హత్య చేసింది. ఆ తరువాత దానిని ప్రమాదవశాత్తూ జరిగినదిగా చూపించేందుకు అతని శరీరానికి నిప్పంటించారని పోలీసులు పేర్కొన్నారు.ఏసీ పేలిందంటూ ఫోన్..మృతుడిని రామ్కేష్ మీనాగా పోలీసులు గుర్తించారు. అతను గాంధీ విహార్‌లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో నివసిస్తున్నాడని తెలిపారు. అక్టోబర్ 6న, ఏసీ పేలుడు కారణంగా అతని ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి, గది నుండి తీవ్రంగా కాలిపోయిన ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్టోబర్ 5- 6 తేదీల మధ్యరాత్రిలో ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్‌లోకి ప్రవేశించారని, తెల్లవారుజామున 2.57 గంటల ప్రాంతంలో, ఒక మహిళతో పాటు వారంతా బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. వారు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.అశ్లీల వీడియోలే కారణం?దర్యాప్తు సమయంలో నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో మహిళ ఉన్నట్లు చూపించే కాల్ వివరాల రికార్డులు పోలీసులలో అనుమానాన్ని రేకెత్తించాయి. మొరాదాబాద్‌లో అక్టోబర్ 18న ఆమెను అరెస్టు చేశారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో పాటు తనకు సహకరించిన ఇద్దరు సహచరుల పేర్లను వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా మృతుడు రామ్కేష్ మీనా తన అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడని, అయితే వాటిని తొలగించడానికి నిరాకరించాడని ఆ యువతి పోలీసుల విచారణలో తెలిపింది. అందుకే ఆమె రామ్కేష్ మీనా చంపాలని నిర్ణయించుకున్నదని పోలీసులు తెలిపారు.ఎల్పీజీ పంపిణీదారు సహకారంతో..నిందితులు ముగ్గురూ తొలుత రామ్కేష్ మీనా గొంతు కోసి హత్య చేశారు. తరువాత అతని శరీరంపై నూనె, నెయ్యి మద్యం పోశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎల్పీజీ పంపిణీదారుగా పనిచేసే ఆ యువతి మాజీ ప్రియుడు గ్యాస్ సిలిండర్ వాల్వ్ తెరిచి నిప్పంటించాడు. దీంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత వారు రామ్కేష్ మీనాకు సంబంధించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు తీసుకుని పారిపోయారు. కాగా నిందితుల నుండి పోలీసులు హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, మృతుని షర్టు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: ‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు -
కూర ఎందుకు వండలేదు? భర్త మందలింపుతో..
రాయికల్(జగిత్యాల): కూర ఎందుకు వండలేదని భర్త మందలించినందుకు రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెల్లి మనోజ(27) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన మనోజను తొమ్మిదేళ్ల క్రితం రామాజిపేటకు చెందిన సుధాకర్‌తో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి సుధాకర్ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చేసరికి మనోజ కూర వండలేదు. ఎందుకు వండలేదని మందలించాడు. పిల్లలు కారంతో అన్నం తింటుండడంతో వంట చేసేందుకని సుధాకర్ వంటింట్లోకి వెళ్లాడు. మనోజ వెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. సుధాకర్ వచ్చి చూసేసరికే మృతిచెందింది. మనోజ తల్లి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ముకుంద్‌పూర్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. ఆదివారం అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్ బైక్‌పై ఇషాన్, అర్మాన్ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్ ఇచ్చిన బాటిల్‌ను ఓపెన్ చేసిన అర్మాన్ అందులోని యాసిడ్‌ను యువతి ముఖంపై చల్లాడు. రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్‌పై పరార య్యారు. అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితే ందర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతర మయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
పుష్ప తరహాలో ఎర్రచందనం అక్రమ రవాణా
బనశంకరి: పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం దుంగలను ఉల్లిపాయల బస్తాల్లో దాచి సరుకు వాహనంలో తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు సభ్యుల ముఠాను ఆదివారం బెంగళూరులోని సిద్ధాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 750 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన షేక్ అబ్దుల్ కలాం, షేక్ నాసీర్, పరమేశ్, రామ్ బహద్దూర్ సభ్యుల ముఠా నుంచి గూడ్స్ వాహనం, మహీంద్రా పికప్ వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిì కోసం గాలిస్తున్నారు. నగరంలోని సోమేశ్వరనగర ఆర్చ్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేసే సమయంలో గూడ్స్ వాహనంలో ఉల్లిపాయల బస్తాల్లో దాచిపెట్టిన ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటిని వెంటనే స్వా«దీనం చేసుకున్నారు. ఈ వాహనం వెనుక ఉన్న మహీంద్ర వాహనాన్ని సైతం స్వా«దీనం చేసుకుని అందులో ఉన్న ముగ్గురితో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలను కర్నూలు అటవీ ప్రాంతం నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. కానీ ఎర్రచందనం దుంగలను ఎవరు తరలిస్తున్నారనే విషయం తెలియరాలేదు. ముఖ్య నిందితుడు పట్టుబడిన అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. పోలీస్ వర్గాల ప్రకారం ఎర్రచందనం దుంగలను బెంగళూరు నగరం నుంచి విదేశాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. పట్టుబడిన నలుగురు నిందితులు ఏపీలోని ఏ జిల్లా వాసులనేది పోలీసులు వెల్లడించలేదు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: మరోసారి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ (మట్టి లేకుండా సాగు) గంజాయిని భారత్ తరలించడం ఇటీవల పెరిగింది. ఈ తరహాలో విదేశాల నుంచి గంజాయి తెస్తున్న వారిపై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు నిఘా పెంచారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు శనివారం విమానాశ్రయంలో నిఘా పెట్టారు.బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక ప్రయాణికురాలిని అడ్డుకున్నారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా, అడుగుభాగంలో గంజాయికి పాజిటివ్‌గా తేలిన ముద్ద రూపంలో ఆకుపచ్చని పదార్థాన్ని కలిగి ఉన్న ప్యాకెట్లు గుర్తించారు. ఈ సోదాల్లో మొత్తం 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 4.15 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి గంజాయి తీసుకొచ్చిన ఆ ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అరెస్టు చేశారు. -
గీజర్ మృత్యువాయువు
మైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్ గీజర్ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్ నుంచి గ్యాస్ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్ పాషా రెండో కుమార్తె గుల్బమ్ తాజ్ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్ గీజర్‌ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ లీకైంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కాగా అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి వివాహాలయ్యాయి. గుల్బమ్ తాజ్‌కు ఇటీవల నిశి్చతార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు. -
రూ. వెయ్యి కోసం చంపేశారు
రంగారెడ్డి జిల్లా: డబ్బు కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... మైలార్‌దేవ్‌పల్లి వట్టెపల్లి ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్‌లతో కలిసి అర్ధరాత్రి వరకు గడిపాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య డబ్బు విషయమై చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రూ.వెయ్యి కోసం చెలరేగిన గొడవ దాడి వరకు వెళ్లింది. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి అఫ్రోజ్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరితనం భరించలేక.. యువతి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : తల్లిదండ్రులిద్దరూ చిన్న తనంలోనే చనిపోయారు. ఊహ తెలిసిన నాటి నుంచి తోడుగా ఉంటున్న అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఒంటరి తనంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రొద్దుటూరులోని ఈశ్వర్‌రెడ్డినగర్‌లో చోటుచేసుకుంది. పల్లా మహేశ్వరి (26) అనే యువతి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన పల్లా కవిత, మహేశ్వరిలు అక్కా చెళ్లెల్లు. వీరి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా భర్త మరణాన్ని జీరి్ణంచుకోలేక తల్లి లక్ష్మీదేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లను వారి తాత అయిన బడిగించల రామయ్య పెంచి పెద్ద చేశారు. మహేశ్వరి ఎంఎస్సీ వరకు చదువుకొని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో కవితకు మూడు నెలల క్రితం వివాహం అయింది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్లినప్పటి నుంచి మహేశ్వరి, ఆమె తాత రామయ్యలు ఉంటున్నారు. రామయ్య వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే ఉండేవాడు. అతని బాగోగులన్నీ చిన్న మనవరాలే చూసు కునేది. చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అక్క పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఒంటరిని అయ్యాననే భావన మహేశ్వరిని తరచూ వేధిస్తుండేది.దీపావళికి చెల్లెలు వద్దకు వచ్చిన అక్క..చెల్లెలితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడానికి కొత్త దంపతులిద్దరూ వారం రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మహేశ్వరి ఇంటికి వచ్చారు. అక్క కవితతో కలిసి చెల్లెలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కవిత తన భర్తతో కలిసి పట్టణలోని గుడికి వెళ్లింది. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంటికి రాగా చెల్లెలు ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చుట్టు పక్కల చూసినా ఆమె కనిపించలేదు. దీంతో మేడపైన ఉన్న రేకుల ఇంట్లోకి వెళ్లి చూడగా మహేశ్వరి తాడుతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు దూరం కావడంతో ఆమె మృతదేహంపై పడి అక్క బోరున విలపించసాగింది. మృతురాలి అక్క కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
రేబిస్ వ్యాధితో బాలిక మృతి
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వీధి కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట వీధి కుక్క దాడి చేసింది. దీంతో కుక్క గోళ్లు గీరి తలలో చిన్న గాయం అయింది. భయంతో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. అయితే మూడు రోజుల కిందట చిన్నారి కుక్కలాంటి అరుపులతో వింతగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలికకు తీవ్రమైన రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాలికను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక మృతి చెందింది. -
మత్తులో కారు నడిపి ఐదుగురిని చంపేశాడు!
ఆగ్రా: సెలవులకని సొంతూరుకు వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదుగురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన అన్షు గుప్తా(40) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో గడిపేందుకని సొంతూరుకు బయలు దేరిన అతడు మత్తులో కారు ఉన్నాడు. న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా బుద్ధి సమీపంలో వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నిల్చుకున్న ఏడుగురిపైకి దూసుకెళ్లింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే క్షతగాత్రుల్లో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 20–33 ఏళ్ల వారే కావడం గమనార్హం. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: హైదరాబాద్ నడిబొడ్డున శనివారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో కరడుగట్టిన దొంగ అన్సారీ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. సెల్ ఫోన్ చోరీచేసి అతడు పారి పోతుండగా సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ గమనించి తన గన్‌మ్యాన్‌తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ, గన్‌మ్యాన్‌లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.ఘరానా నేరగాడు మహ్మద్ ఒమర్ అన్సారీ...నగరంలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ అన్సారీపై టప్పాచబుత్ర, కామాటిపుర, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి, చార్మినార్, బహదూర్‌పుర, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, హుస్సేనిఆలం, ఫలక్‌నుమా, కాలాపత్తర్ ఠాణాల్లో 20 కేసులు ఉన్నాయి. వీటిలో చైన్ స్నాచింగ్, చోరీ, బెదిరింపులు తదితర నేరాలపై నమోదైనవే అధికం. అతడిపై పోలీసులు గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆయా సందర్భాల్లో ఏడాది చొప్పున జైలులో గడిపి వచ్చినా అన్సారీ తన పంథా మార్చుకోలేదు. ఇటీవల మరో నిందితుడితో కలిసి సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. రద్దీ ప్రాంతాలతో పాటు నిర్మానుష్యంగా ఉన్న చోటు మాటు వేసి అటుగా వచ్చే వారి సెల్ఫోన్లు లాక్కుపోతున్నాడు. ఇతడితో కలిసి నేరాలు చేస్తున్నది కూడా పాతబస్తీకి చెందిన పాత నేరగాడిగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. నేరం చేస్తుండగా గుర్తించి.. 500 మీటర్లు వెంబడించి...నగరంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్.చైతన్య కుమార్ శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై సైదాబాద్‌లోని కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం సుల్తాన్‌బజార్ మీదుగా చాదర్‌ఘాట్ చౌరస్తా వైపు వస్తున్నారు. ఈయన వాహనం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ వద్దకు చేరుకునే సమయానికి అన్సారీ, మరో నేరగాడితో కలిసి ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద సెల్‌ఫోన్ దొంగిలించి పారిపోతున్నారు. వారిని గమనించిన చైతన్యకుమార్ తన వాహనం నుంచి కిందకు దిగి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెంటే గన్‌మ్యాన్ సైతం వాహనం నుంచి బయటకు వచ్చారు. వారిని తోసేసిన అన్సారీ, మరో నిందితుడు తలోదిక్కు పారిపోయారు. అన్సారీ ఇసామియా బజార్ మీదుగా పారిపోతుండగా డీసీపీ అతడిని ఛేజ్ చేసుకుంటూ విక్టోరియా ప్లే గ్రౌండ్ వరకు దాదాపు 500 మీటర్లు పరిగెత్తారు. ఆయన వెంటనే గన్‌మ్యాన్ కూడా వచ్చారు. అక్కడ ఓ భవనం ఎక్కిన అన్సారీ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ప్లేగ్రౌండ్స్లోకి దూకేశాడు. అతడి వెంటే డీసీపీ, గన్‌మ్యాన్ కూడా గ్రౌండ్లోకి దూకారు. అక్కడ తన వద్ద ఉన్న కత్తితో గన్‌మ్యాన్, డీసీపీపై అన్సారీ దాడికి ప్రయత్నించాడు. పెనుగులాట జరిగి ముగ్గురూ కిందపడిపోయారు. అదే సమయంతో కత్తితో రెచ్చిపోవడానికి ప్రయత్నించిన అన్సారీపై గన్‌మ్యాన్ తుపాకీతో డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తూటాలు అన్సారీ చేయి, కడుపులోకి దూసుకుపోయాయి. తీవ్రగాయాలైన అన్సారీ కుప్పకూలిపోయాడు.ఆస్పత్రుల్లో చికిత్స...డీసీపీ చైతన్యకుమార్‌తో పాటు ఆయన గన్‌మ్యాన్‌కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన అన్సారీని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్సారీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్సారీతో వచ్చి పరారైన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఉదంతం తర్వాత నగర పోలీసు విభాగంలోని అధికారులు, సిబ్బందిలో అవసరమైన వారికి తుపాకులు జారీ చేయాలని కొత్వాల్ సజ్జనర్ నిర్ణయించారు. కేవలం మహిళలపై జరిగే నేరాల విషయంలోనే కాకుండా ప్రతి నేరగాడి విషయంలోనూ కఠినంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని నేర రహితంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
బస్సులో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్‌ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్లు ఉండాలి.ఎమర్జెన్సీ ఎక్జిట్సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్‌గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.ఇతర భద్రతా అంశాలుఅత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.స్లీపర్ బెర్త్‌ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్‌లు ఉండాలి.ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానంఅగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్‌ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్‌ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యుషర్ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్‌తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్‌తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.ఇదీ చదవండి: భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో.. -
Maharashtra: ‘పలుమార్లు ఎస్ఐ అఘాయిత్యం’.. వైద్యురాలి సూసైడ్ నోట్లో ‘దారుణాలు’
ఫల్టన్: మహారాష్ట్రలోని ఫల్టన్‌కు చెందిన మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందుకు ఆమె రాసిన లేఖ అందరినీ కదిలింపజేస్తోంది. తనపై ఎస్సై గోపాల్ బాద్నే నాలుగుసార్లు అత్యాచారం చేశాడని మృతురాలు లేఖలో పేర్కొంది. నాలుగు పేజీల సూసైడ్ లేఖలో..మహారాష్ట్రలో చోటుచేసుకున్న యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయేముందు ఆమె తన అరచేతిపై సూసైడ్ లేఖ రాసుకున్నారు. అలాగే అంతకుముందు రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ బయటపడటంతో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆ లేఖలో ఆమె తనపై ఎస్ఐ గోపాల్ బాద్నే ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు.ఎంపీతోపాటు అతని పీఏల ప్రమేయం?అలాగే ఆ లేఖలో ఆమె ఓ ఎంపీతోపాటు అతని పీఏలపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. పోలీసు కేసుల్లోని పలువురు నిందితులకు నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులతో పాటు ఒక ఎంపీ, అతని సహాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వైద్యురాలు ఆరోపించారు. అందుకే తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యురాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బాద్నే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. 5 నెలలకు పైగా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆ లేఖలో వివరించారు. ఇక దీనిపై ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసు అధికారి సస్పెండ్బాధిత వైద్యురాలు గత 23 నెలలుగా ఇదే ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆమె భావించారు. అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా వైద్యురాలు ఆ లేఖలో తన ఇంటి యజమాని ప్రశాంత్ బంకర్‌పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. ఎస్సై గోపాల్ బాద్నే, ఇంటి యజమాని బంకర్‌పై కేసు నమోదు చేశారు. ఎస్సై గోపాల్ బాద్నేను సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కొల్హాపూర్ డివిజన్) సునీల్ ఫులారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.పోలీసులను కాపాడుతున్న ‘మహాయతి’: కాంగ్రెస్ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతలంతా పోలీసులను కాపాడుతున్నారని ఆరోపించింది.‘రక్షకుడే వేటగానిగా మారినప్పుడు.. న్యాయం ఎలా జరుగుతుంది? బాధిత వైద్యురాలు గతంలో ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహాయుతి ప్రభుత్వం పోలీసులను కాపాడుతోంది. ఫలితంగా పోలీసుల దురాగతాలు పెరుగుతున్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడేట్టివార్ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.‘క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం’‘ఈ సంఘటన దురదృష్టకరం, నేను సతారా పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడాను. వైద్యురాలు ఫిర్యాదు చేశారని, అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. మహిళలు ఇటువంటి ఫిర్యాదులను నమోదు చేయడానికి 112 హెల్ప్‌లైన్‌ను ఉపయోగించాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బీజేపీ మహిళా నేత చిత్ర వాఘ్ పేర్కొన్నారు. -
ఓఆర్ఆర్ వద్ద బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కర్నూలు ఘటన.. మరో షాకింగ్ ట్విస్ట్!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. బైక్.. బస్సునుగానీ, బస్సును.. బైక్ గానీ ఢీ కొట్టలేదని తెలుస్తోంది. అయితే బైక్ ప్రమాదానికి గురైన తర్వాతే.. బస్సు దానిని ఈడ్చుకెళ్లిందని, ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం జరిగిందని తాజాగా పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని నుంచి పోలీసులు సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి..శివశంకర్‌తోపాటు అతని స్నేహితుడు ఎర్రి స్వామి ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక వర్షంలో వెళ్తుండగా.. చిన్నటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరూ పడిపోయారు. డివైడర్‌కు బలంగా తల ఢీ కొట్టడంతో శంకర్ బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి.. రోడ్డు పక్కనే కూర్చుని పోయాడు. సరిగ్గా అదే సమయంలో.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ను వీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకెళ్లింది. కాస్త దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. అది చూసి భయపడిపోయిన శివశంకర్ స్నేహితుడు ఎర్రి సామి అక్కడి నుంచి పోరిపోయాడు. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకున్న పోలీసులు.. అతని స్టేట్మెంట్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రి స్వామిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఎర్రిస్వామిని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఎర్రిస్వామి ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా?
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా కొత్త కోణాన్ని గుర్తించాయి. ప్రమాదానికి ఇతర అంశాలు కారణమైనా, బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న సుమారు 400 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిపాయి.ఘటన జరిగిందిలా..కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం.. బస్సు ఒక బైకును ఢీకొట్టగానే ఆ బస్సు కింద బైకు ఇరుక్కుపోయింది. దాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. అధిక వేడి వల్ల ఈ ఫోన్లలో వాడే బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి.బ్యాటరీలు పేలడం వల్ల భారీ శబ్దం వచ్చి మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వేగంగా వ్యాపించాయి. లగేజీ క్యాబిన్ పైభాగంలో, అంటే బస్సు మొదటి భాగంలో ఉండే సీట్లు, బెర్తుల్లో ఉన్నవారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో బయటపడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మాత్రం తన సీటు పక్కన ఉండే కిటికీ నుంచి తప్పించుకున్నాడు. ప్రాథమికంగా ఫొరెన్సిక్ అధికారులు చెప్పిన పైవివరాల ప్రకారం బస్సు ఢీకొనడం వల్ల మంటలు ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీల పేలుడే ప్రమాద తీవ్రతను పెంచింది.లిథియం అయాన్ బ్యాటరీలుమొబైల్ ఫోన్లలో సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రత కలిగి ఉండటం వల్ల చిన్న పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. అయితే ఇవి వేడెక్కినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి.ఈ బ్యాటరీలు పేలేందుకు కారణాలుఈ బ్యాటరీలకు వేడి తగిలితే పేలే అవకాశం ఉంటుంది. బస్సు ప్రమాదంలో జరిగింది ఇదే. బయట నుంచి అగ్ని ప్రమాదం కారణంగా వేడి ఎక్కువై పార్శిల్ క్యాబిన్లోకి వచ్చింది. దాంతో ఫోన్లలోని బ్యాటరీలు వేడై పేలిపోయాయి.బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత కూడా ఛార్జింగ్ కొనసాగడం వల్ల బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది.బ్యాటరీ లోపల అనోడ్, కాథోడ్ పొరలు దెబ్బతినడం లేదా పటిష్టమైన తయారీ విధానాలు అనుసరించకపోవడంతో అవి ఒకదానితో ఒకటి తాకితే పేలిపోతాయి.పూర్తిగా బ్యాటరీ అయిపోయేంత వరకు వేచి చూసి ఒక్కసారిగా ఛార్జింగ్ పెట్టినా పేలే అవకాశం ఉంటుంది.బస్సు ఢీకొన్న సందర్భంలో పార్శిళ్లు, అందులోని వస్తువులు గట్టిగా కొట్టుకోవడం వల్ల బ్యాటరీ నిర్మాణంలో మార్పులు వచ్చి అంతర్గత షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.బ్యాటరీ పేలుడు వెనుక రసాయన చర్యలులిథియం అయాన్ బ్యాటరీ పేలడాన్ని ‘థర్మల్ రన్అవే’ అని కూడా పిలుస్తారు. అధిక వేడిమి లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్లో ఉష్ణోగ్రత నిర్ణీత పరిమితి దాటినప్పుడు థర్మల్ రన్అవేకు దారి తీస్తుంది. మొదట కాథోడ్, అనోడ్లను వేరు చేసే సెపరేటర్ (పాలిమర్) కరిగిపోతుంది. సెపరేటర్ కరగడం వల్ల కాథోడ్, అనోడ్ నేరుగా ఒకదాంతో ఒకటి తాకి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. దీనివల్ల మరింత ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద అందులోని కెమికల్స్ విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రోలైట్ (బ్యాటరీ లోపల ఉండే ద్రవం) వేడెక్కి ఆవిరై మండే స్వభావం గల హైడ్రోకార్బన్ వాయువులను విడుదల చేస్తుంది.ఈ చర్యలో విడుదలైన ఆక్సిజన్, ఇతర మండే వాయువులు అధిక వేడి వల్ల మరింత తీవ్రంగా పేలిపోతాయి. ఒక సెల్ పేలడం వల్ల విడుదలైన వేడి పక్కనే ఉన్న ఇతర మొబైళ్లకు వ్యాపించి అవి కూడా థర్మల్ రన్అవేకు గురవుతాయి. ఈ గొలుసుకట్టు చర్య కారణంగా బస్సు లగేజీ క్యాబిన్లో వందల కొద్దీ ఫోన్లు వరుసగా పేలి భారీ శబ్దంతో అగ్ని తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు.లిథియం బ్యాటరీలతో జాగ్రత్త - నాగసాయి, ఏసీపీ, సిటీ సెక్యూరిటీ వింగ్, సైబరాబాద్కర్నూలు బస్సు అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరం. క్లూస్ టీమ్ ప్రాథమికంగా విచారించిన అంశాలను బట్టి బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగాయి. అవికాస్తా పార్శిల్ క్యాబిన్‌కు వ్యాపించి అందులోని మొబైళ్లు ఒక్కసారిగా పేలాయి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. సాధారణంగా ఫోన్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలకు పేలే గుణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అవి పేలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఫోన్లు వాడటం జీవితంలో భాగమైంది. ఈ క్రమంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛార్జింగ్ చేసేటప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించేటప్పుడు ఫోన్‌ను ఎండలోగానీ, కారు డాష్బోర్డ్ల్లో, స్టవ్ లేదా రేడియేటర్ వంటి అధిక వేడిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పెట్టకూడదు. వేడి పెరిగితే బ్యాటరీ పేలే ప్రమాదం ఉంటుంది.ఎల్లప్పుడూ ఫోన్ తయారీదారు సిఫార్సు చేసిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్‌ను మాత్రమే ఉపయోగించాలి.నాసిరకం ఛార్జర్లు ఓవర్ఛార్జింగ్కు లేదా అధిక వేడికి దారితీయవచ్చు.ఫోన్‌ను రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్‌లో ఉంచడం మానుకోండి. 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ అయిన తర్వాత తీసివేయడం ఉత్తమం.ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్‌ను వాడడం మానుకోవాలి. దీనివల్ల వేడి పెరిగే ప్రమాదం ఉంది.ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్‌ను దుప్పటి, దిండు లేదా మంచం వంటి గాలి ఆడకుండా ఉండే మెత్తటి ఉపరితలాలపై కాకుండా గట్టి, చల్లటి ఉపరితలం (టేబుల్)పై ఉంచండి.బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవడం మంచిది.ఫోన్‌ను కింద పడేయడం, బలంగా కొట్టడం లేదా వంచడం వంటివి చేయకండి. దీనివల్ల బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.మీ ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లయితే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపివేసి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. ఉబ్బిన బ్యాటరీలు చాలా ప్రమాదకరం.ఒక్క మొబైళ్లలోనే కాదు, ఇంట్లో వాడే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీ వాహనాల్లోనూ లిథియం బ్యాటరీలు వాడుతున్నారు. వీటిని వాడే సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
సంగారెడ్డి: స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: డ్రైవర్ అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే స్థానికుల సాయంతో డ్రైవర్ పిల్లలను దించేయడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. శనివారం ఉదయం నారాయణఖేడ్‌లో విజ్ఞాన్ పాఠశాల బస్సు పిల్లలతో బయల్దేరింది. అయితే ఒక్కసారిగా బస్సు నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. స్థానికులను కేక వేసి పిల్లలను వెంటనే దించేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.గురువారం అర్ధరాత్రి టైంలో.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సు కర్నూల్ శివారులో ఉల్లిందకొండ క్రాస్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మంటలు ఎగసి పడి బస్సు దగ్ధమైపోగా.. అందులోని ప్రయాణికుల్లో 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవో అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్‌పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్‌పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్‌యాక్టివ్‌గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే! -
అరచేతిపై సూసైడ్ నోట్ రాసి... వైద్యురాలు బలవన్మరణం
సతారా: మహారాష్ట్రలో ఓ సబ్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్తన్ తహసీల్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉంటున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాజకీయ దుమారం డాక్టర్ ఆత్మహత్య ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. హోంశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సతారా ఎస్పీ తుషార్ దోషీకి ఫోన్‌చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్ఐని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నట్లు తుషార్ దోషీ తెలిపారు. డాక్టర్ ఆత్మహత్య ఘటన చాలా తీవ్రమైన అంశమని మహారాష్ట్ర శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్గోర్హే అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్‌ను కోరినట్లు తెలిపారు. సతారా సివిల్ సర్జన్‌తో తాను మాట్లాడానని, వేధింపుల గురించి మృతురాలు తమకేమీ ఫిర్యాదు చేయలేదని సర్జన్ చెప్పినట్లు రాష్ట ఆరోగ్యశాఖ సహాయమంత్రి మేఘన బోర్డికర్ చెప్పారు. సతారా ఘటనపై సతారా పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మీడియా న్యాయ విచారణ జరపటం మానుకోవాలని మరో మంత్రి పంకజ ముండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫడ్నవీస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు సిట్‌ను ఏర్పాటుచేయాలని శివసేన యూబీటీ నేత సుష్మఅంధరే డిమాండ్ చేశారు. తీవ్రంగా వేధించారు మృతురాలిని ఆమె ఉన్నతాధికారులతోపాటు నిందితులు తీవ్ర వేధింపులకు గురిచేశారని డాక్టర్ బంధువు ప్రయాగ ముండే ఆరోపించారు. ‘ఆమె ఎంతో తెలివైంది. గొప్ప ఆశయాలు కలిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆమెను మేమే పెంచి, చదివించాం. విధి నిర్వహణలో ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంది. తప్పుడు పోస్ట్‌మార్టం నివేదికలు ఇవ్వాలని ఆమెపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితులు కఠినంగా శిక్షించాలి’అని డిమాండ్ చేశారు. పనిచేసే చోట సీనియర్లు వేధిస్తున్నారని రెండురోజుల క్రితమే మృతురాలు తమకు తెలిపిందని మరో బంధువు వెల్లడించారు. నిందితుడికి చివరి ఫోన్‌కాల్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వైద్యురాలి నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ బంకర్‌కు ఫోన్‌చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ ఫోన్లో చాటింగ్ చేశారని వెల్లడించారు. అయితే, ఆ సందేశాల్లో ఏముంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
సాక్షి, ప్రకాశం: కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర విమర్శల వేళ.. వీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం(Vemuri Kaveri Travels Reaction) స్పందించింది. బస్సుకు ఫిట్నెస్ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయంటూ యాజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరిట ఒక ప్రకటన వెలువడింది.‘‘రాత్రి ప్రమాదం జరిగినట్టుగా మూడు గంటల 30 నిమిషాలకు మాకు సమాచారం అందింది. వర్షం పడుతున్న టైంలో రోడ్డుపైన బైకర్ స్కిడ్ అయ్యి.. బస్సును ఢీ కొట్టి పడిపోయాడు. బైక్ మంటలు చెలరేగి బస్సు కిందకు రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఆ సమయంలో మెయిన్ డోర్ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. రాడ్లతో మా డ్రైవర్లు అద్దాలు పగలకొట్టడంతో కొందరు బయటపడ్డారు. మా బస్సు కు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయి. బస్సులో మొత్తం 40 మంది రిజర్వ్డ్ ప్యాసింజర్ లు ఉన్నారు. అందరికీ మా ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉంది. ప్రమాద ఘటనపై చింతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో ఉంది. అయితే.. ప్రమాదంలో వీ కావేరీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని బస్సును పరిశీలించిన అధికారులు అంటున్నారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అంటున్నారు. ‘‘ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉంది. మంటలు ఆర్పేందుకు ఫోమ్ బాటిల్ కూడా అందుబాబులో లేదు. సేఫ్టీ విండో బద్ధలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాబులో లేదు’’ అని అధికారులు తెలిపారు. మరోపక్క.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైక్‌ను ఢీ కొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని, మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసినా.. కనీసం డోర్ తెరిచినా.. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, బైకర్ కలిపి ఇప్పటిదాకా 20 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి.. ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్ -
కర్నూలు శివారులో ఘోరం..
సాక్షి, కర్నూలు/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మరణాలపై ఏపీ హోమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 27మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే.. కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 అలాగే.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, ఇక.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010గా కర్నూలు కలెక్టర్ డా. సిరి తెలిపారు. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చని సూచించారు. మృత్యు ప్రయాణం ఇలా..వి కావేరి ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరులో ఉంది. కూకట్ పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు(డీడీ01ఎన్9490).. రాత్రి 9.30గం. పటాన్చెరు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపు బయల్దేరింది. .. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లడం.. దాని పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. దీంతో.. బస్సును ఆపేసిన డ్రైవర్.. విషయాన్ని హెల్పర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు హఠాత్తుగా ఆగడంతో కొందరు ప్రయాణికులకు మెలుకువ వచ్చి ఏం జరుగుతుందా? అని లేచి చూశారు. ఈలోపే.. మంటలు బస్సుకు అంటుకోవడం ప్రారంభించాయి. అది గమనించి డ్రైవర్ పారిపోగా.. హెల్పర్ ప్రయాణికులను అరుస్తూ బయటకు పిలిచాడు. డోర్ తెరిచి లేకపోవడంతో, ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో.. అద్దాలు పగలకొట్టుకుని కొందరు బయటకు దూకేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాఢ నిద్రలోఉన్నవాళ్లు, స్లీపర్ బెర్త్‌లో నిద్రిస్తున్నవాళ్లు.. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. నిమిషాల్లో బస్సుకు మంటలు వ్యాపించి అందులోనే సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అందరూ వీడియోలు తీస్తున్నారని వాపోతూ ఆమె తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. (Kurnool Travels Bus Fire Accident)డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. బైక్‌ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారు. ప్రమాణికులను పట్టించుకోలేదు’’ అని గాయపడ్డ ఓ ప్యాసింజర్ వాపోయారు. అలాగే.. ఘటన జరిగిన తర్వాత వాళ్ల రక్షణ చూసుకున్నారే తప్ప.. తమను అప్రమత్తం చేయలేదని, అది జరిగి ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడేవాళ్లని చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు తెలిపాడు.మృతుల సంఖ్య పెరగొచ్చు: డీఐజీప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి 23 మంది బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయలేదు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీశాం. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చు అని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివ శంకర్‌గా తెలుస్తోంది. కొడుకు మృతితో యశోదమ్మ బోరున విలపిస్తూ కనిపించింది.ట్రావెల్స్ నిర్లక్ష్యం కూడా..ఘటన నేపథ్యంలో.. కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు లేవని డీఐజీ చెబుతున్నారు. అదే సమయంలో.. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని, బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చితోనే(31-03-2025) ముగిసిందని, అలాగే.. ఇన్సూరెన్స్ వాలిడిటీ, పొల్యూషన్ కాల పరిమితి కిందటి ఏడాది ఏప్రిల్‌తోనే ముగిశాయని ప్రచారం నడుస్తోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఉన్నట్లు లిస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్లు.. రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం.. మరికొందరు. -
బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. హోటల్లో స్రీకెట్గా..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఆర్–ఇన్ హోటల్లో ఓ గదిలో గత కొంతకాలంగా యువతులతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడులు చేసి ముగ్గురు యువతులతో సహా ఏడుగురు కస్టమర్లు, వ్యభిచార గృహ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఎండీ షరీఫ్ గతంలో స్టైల్ మేకర్ సెలూన్ నిర్వహించేవాడు. ఉద్యోగాల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి సెలూన్లో చేర్చుకుని వారిని అధిక డబ్బు సంపాదించవచ్చనే ఆశపెట్టి వ్యభిచారానికి తరలిస్తున్నాడు. కజకిస్థాన్, రష్యా, ఉగాండా, థాయ్‌ల్యాండ్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి తన సెలూన్లో ఉద్యోగాల పేరుతో రప్పించి వారిని ఖరీదైన హోటళ్లకు పంపిస్తూ వ్యభిచారం చేయిస్తున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఆర్–ఇన్ హోటల్లోని గదులపై దాడులు చేసి ముగ్గురు మహిళా సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించారు. కజకిస్థాన్‌కు చెందిన యువతితో పాటు మరో ఇద్దరు యువతులు పట్టుబడిన వారిలో ఉన్నారు. మరో ఏడుగురు విటులకు నోటీసులు జారీ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఎండీ షరీఫ్‌పై కేసు నమోదు చేశారు. నగదును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్‌తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్‌ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థిని(13)పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కథనం ప్రకారం...విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి సంబంధించి తుని కొండవారపేటకు చెందిన నారాయణరావుపై పోలీసులు బుధవారం ఉదయం కేసు నమోదు చేశారు. సాయంత్రం 5 గంటలకు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10.30 సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు రూరల్ స్టేషన్ నుంచి పోలీసులు ఎస్కార్ట్‌తో తుని బయల్దేరారు. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని నారాయణరావు చెప్పడంతో మార్గంమధ్యలో కోమటిచెరువు వద్ద వాహనం ఆపారు. జోరుగా వాన కురుస్తుండడంతో ఎస్కార్ట్ సిబ్బంది చెట్టు కింద నిల్చున్నారు. నారాయణరావు చెరువు వద్దకు వెళ్లాడు. కొంతసేపటికి పెద్ద శబ్దం వినిపించడంతో ఎస్కార్ట్ సిబ్బంది వెళ్లి చూశారు. నారాయణరావు కనిపించలేదు. చెరువులో దూకి పారిపోయాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా? అనే అనుమానంతో గాలింపు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి వరకు వెదికినా నారాయణరావు ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, చెరువులో వలలు వేశారు. క్విక్ క్యూఆర్టీ టీమ్ చెరువు చుట్టూ గాలించింది. ఉదయం నారాయణరావు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఒకే గ్రామంలో ముగ్గురి ఆత్మహత్య
హయత్‌నగర్: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో సాయంత్రం డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం స్నానం చేసి వస్తానంటూ వెళ్లిన వైష్ణవి.. బెడ్రూంలో గడియ పెట్టుకొని చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంత సేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలుకొట్టి చూడగా వైష్ణవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగిన మర్నాడే సతాలి వెంకటేశ్ కుమారుడు రాకేశ్ (21) బుధవారం రాత్రి తన సోదరుడి దుకాణంలో పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ షాప్ ఊడ్చేందుకు షట్టర్ తెరిచి చూసి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ మరణవార్త తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన బుద్ద నర్సింహ రెండో కుమార్తె శ్రీజ (18) ఇంట్లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది. ఆమె సోదరి గమనించి కజిన్‌కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్రీజ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వరుస ఆత్మహత్య ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రీల్స్ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్
యూట్యూబ్ రీల్స్ పిచ్చి అనేకమంది ప్రాణాలుతీస్తోందని తెలిసినా తీరు మారడం లేదు. నిర్లక్ష్యం కొన సాగుతూనే ఉంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్‌పూర్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది.ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.తన మొబైల్ ఫోన్లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్ ఫోన్లో రీల్ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఇదీ చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్సమాచారం అందిన వెంటనే, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. రైల్వే పట్టాల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025 కాగా ఈ ఏడాది ఆగస్టులో గంజాం జిల్లా బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ కోరాపుట్‌లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే -
Hyderabad: విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. నిన్న రాత్రి(అక్టోబర్ 22 బుధవారం) ఆర్ ఇన్ హోటల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల సోదాలు నిర్వహించారు. విదేశాల చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీసులకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉజ్మా..!
కర్నూలు జిల్లా: మండల కేంద్రం వెల్దురిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తిలోని 14 వ వార్డులో నివసించే ఉజ్మా (34)కు, మస్తాన్ అనే గౌండతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వెల్దురిలోని వడ్డెగేరిలో నివసించే వ్యక్తితో ఉజ్మా వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇటీవల ఆమె బీజేపీ మండల నాయకురాలితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ క్రమంలో కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అనుమానం పెంచుకున్న మొదటి ప్రియుడు తాను ఖర్చు చేసిన పైకం ఇవ్వాలని ఇటీవల ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంపై మృతురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. అయితే, బుధవారం మధ్యాహ్నం ఉజ్మా ఇంటికి మాజీ ప్రియుడు వెళ్లాడు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. కుమార్తెలు ఇంటికి వచ్చి చూస్తే తలుపు వేసి ఉంది. పొరుగువారి సాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. కాగా మృతురాలు ఇంటా, బయట ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల హార్డ్డిస్్క, ఆమె సెల్‌ఫోన్ సైతం హంతకుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట ప్రజ్ఞాపూర్‌లో గౌండ పని చేసేందుకు వెళ్లిన మస్తాన్.. భార్య హత్య విషయం తెలుసుకుని తిరుగుప్రయాణమయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ మధుసూధన్ రావు, ఎస్ఐ అశోక్‌లు సంఘటనాస్థలికెళ్లి విచారించారు. మృతురాలి తల్లి నూర్జహాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది?
సాక్షి, కాకినాడ: తుని ఘటన(tuni Incident)లో పోలీసుల అదుపులో టీడీపీ నేత నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది చెరువు దగ్గర ఏం జరిగిందో తెలిస్తేనే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఈలోపే నారాయణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ‘‘నలుగురు పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి రిమాండ్ పేరిట బలవంతంగా సంతకాలు సేకరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చెరువులోకి దూకాడని అంటున్నారు. చనిపోయాడని మాత్రం ఈ ఉదయం 7గం. సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?. అందుకే అనుమానాలు కలుగుతున్నాయి. మా అనుమానాలు నివృత్తి చేయాలంటే.. పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కోసం తరలిస్తుండగా మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరాలు బయటపెట్టాలి’’ అని నారాయణరావు కొడుకు సురేష్, కోడలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోమటి చెరువు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణరావుది సూసైడ్ కాదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను పక్కకు లాగేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే.. పోలీసులు మాత్రం ఆ అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడి నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు(Narayanarao Suicide). ‘‘అర్ధరాత్రి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వాష్‌రూమ్ వస్తుందని నారాయణరావు అడిగాడు. వెంటనే ఎస్కార్ట్ వాహనం ఆపాం. వర్షం పడుతుండడంతో పోలీసులు పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చీకటి కావడంతో నిందితుడు పోలీసులకు కనిపించలేదు. ఈలోపు నీళ్లలో దూకినట్లు శబ్దం వచ్చిందని సిబ్బంది చెప్పారు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఉదయం వెతికితే మృతదేహం దొరికింది’’ అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.సంచలన విషయాలు.. తుని మైనర్ బాలిక(13) లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి.. వరుసకు తాతను అవుతానంటూ హాస్టల్ సిబ్బందిని నమ్మించి నారాయణరావు ఆమెను ఐదుసార్లు బయటకు తీసుకెళ్లాడు. బాలికకు తండ్రి లేకపోవడంతో నారాయణరావు చెప్పింది నిజమేనని హాస్టల్ సిబ్బంది నమ్మారు. అలా.. మూడు సార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోసారి తన వెంట తీసుకెళ్లి ఓ తోటలో అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అది గమనించి తోట కాపలాదారు అడ్డుకున్నాడు. ఆ సమయంలో తాను టీడీపీ నేతనని, తన జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ బెదిరించాడు. ఈలోపు కొందరు వీడియో తీసి అతగాడి బాగోతాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణరావును గుడ్డలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం నారాయణరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసిన రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువులో దూకేశాడని చెబుతున్నారు. -
మేడ్చల్ కాల్పుల ఘటన.. ఇబ్రహీం సహా ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు(అజ్జు, శ్రీనివాస్) పోలీసుల అదుపులో ఉన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కీసర మండలం రాంపల్లికి చెందిన గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి ఘట్కేసర్కు వస్తున్న క్రమంలో బహుదూర్‌పురకు చెందిన ఇబ్రహీం వెంబడించాడు. యంనంపేట వద్ద కారును అడ్డగించి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే సోనూ సింగ్‌పై నిందితుడు రెండు రౌండ్ల కాల్పులను జరిపాడు. దీంతో ఆయన పక్కటెముకల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి గాయమైంది.అనంతరం, స్థానికులు బాధితుడిని హుటాహుటిన మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ, అతడికి సర్జరీ చేశారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించి పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా సీపీ తెలిపారు. -
తుని ఘటన: నారాయణరావు మృతదేహం లభ్యం
సాక్షి, కాకినాడ: బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) మృతదేహాం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో.. అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్‌రూమ్‌కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా?.. ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఓ నేత.. మైనర బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక(13)కు చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసి పోతుంటుంది. అయితే ఆమె తన మనవరాలని, ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో తోట కాపలదారుడు గమనించి నిలదీశాడు. దీంతో.. ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ దబాయించాడు.ఈలోపు.. కాపలదారుడు వీడియో తీస్తుండడం గమనించి.. బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నారాయణరావు అరెస్ట్‌ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు. -
సిగ్మా గ్యాంగ్ హతం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కరుడుగట్టిన నేర ముఠా ‘సిగ్మా గ్యాంగ్’లోని కీలక వ్యక్తులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ, బిహార్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ (25)తోపాటు గ్యాంగ్ సభ్యులు బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయినట్లు ఢిల్లీ క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ సుందర్ కుమార్ తెలిపారు. వీరంతా బిహార్‌లోని సితామర్హి జిల్లాకు చెందినవారు. గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ తలపై రూ.50 వేల రివార్డు కూడా ఉంది. అతడిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించినందుకు ఈ నెల 13న కూడా అతడిపై కేసు నమోదైంది. రంజన్ ప్రమాదకరమైన నేరస్తుడని సుందర్‌కుమార్ తెలిపారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్యాంగ్ భారీ దోపిడీలకు పాల్పడేందుకు కుట్ర చేసిందని చెప్పారు. వీరు కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారన్న విశ్వసనీయ సమాచారం అందటంతో నిఘా పెట్టామని, గురువారం తెల్లవారుజామున వారు ఓ కారులో వెళ్తున్నట్లు తెలియటంతో వెంబడించినట్లు పేర్కొన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో రోహిణిలోని బహదూర్ షా మార్గ్‌లో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరుపగా, పోలీసులు 15 నుంచి 20 రౌండ్లు కాల్చారని వివరించారు. ఈ మూఠా ప్రయాణించిన కారు దోపిడీ చేసిందే. దాని నంబర్ ప్లేట్ కూడా నకిలీదేనని గుర్తించారు. అల్లర్లకు కుట్ర పన్ని హతం.. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు బిహార్ పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఈ కుట్రకు సంబంధించిన ఆడియో వెలుగు చూడటంతో పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసింది’అని బిహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీరు ఇటీవల ఐదు వరుస హత్యలకు పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మర్షి సమాజ్ జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది. #BigBreakingNews #Delhipolice #BiharPolice#EncounterIn the intervening night of 22-23.10.25, around 2:20 AM, a fierce shoot out took place on Bahadur shah marg from Dr Ambedkar Chowk to Pansali chowk, Rohini, Delhi between 4 suspected accused persons and joint team of Crime… pic.twitter.com/jZmT91isKg— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 23, 2025 -
టీడీపీ నేత అరాచకం బాలికపై లైంగిక దాడికి యత్నం
తుని రూరల్ : తాతయ్యా అని పిలిపించుకుంటూనే మనవరాలి వయసున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీనిని అడ్డుకున్న యువకుడిపై ‘నేను కౌన్సిలర్‌ను. మేం ఎస్సీలం’ అంటూ బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీడీపీ నేతకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తుని పట్టణానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.తండ్రి లేడు. సెలవులకు తల్లి వద్దకు వెళ్లి, వస్తుంటుంది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) మంగళవారం 11 గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంజక్షన్ చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పి ఆ బాలికను తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో కాపలాదారుడు తోటకు వచ్చాడు. బాలిక వస్త్రాలను నారాయణరావు విప్పడాన్ని గమనించి మందలించాడు.దీంతో.. ఆవేశం కట్టలు తెంచుకున్న నారాయణరావు ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ కాపలాదారుడిని బెదిరించాడు. వాస్తవానికి నారాయణరావుది కొండవారపేట అయినప్పటికీ, తప్పించుకునేందుకు వీరవరపుపేట అని తప్పుగా చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తానని, తన తోటలోకి ఎందుకు వచ్చారంటూ నారాయణరావును, బాలికను ఆ కాపలాదారు నిలదీశాడు.బహిర్భూమికి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేసూ్తనే నారాయణరావు బెదిరింపులకు దిగాడు. దీంతో, బాలికకు న్యాయంచేయాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలిసున్న వ్యక్తుల ద్వారా కాపలాదారు సమాచారం అందించాడు. ఈలోపు బాలికను గురుకుల పాఠశాలలో దించి, నారాయణరావు కొండవారపేట వెళ్లిపోయాడు. అప్పటికే విషయం తెలియడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పటు్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నాలుగైదుసార్లు ఇలాగే..తాతయ్యనంటూ చెప్పి, గతంలో నాలుగైదుసార్లు ఆ బాలికను నారాయణరావు బయటకు తీసుకువెళ్లినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. తాజాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీడీఎస్, పోలీస్, విద్యాశాఖ అధికారులు బుధవారం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు, లైంగిక దాడికి యత్నించడంపై పోక్సో చట్టం కింద నారాయణరావుపై కఠినమైన కేసులు నమోదుచేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నేతలు, యువకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. బాలికకు న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.విచారణకు మూడు బృందాలు..బాలికపై లైంగిక దాడికి యత్నించిన నారాయణరావును అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. ఈ కేసులలో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. 15 రోజుల్లో చార్‌్జషీట్ దాఖలు చేస్తామన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు. -
పల్నాడు జిల్లాలో యువకుడు కిడ్నాప్!
దమ్మాలపాడు (ముప్పాళ్ళ): పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల పేరుతో ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన షేక్ నాగూర్ షరీఫ్‌కు పిడుగురాళ్లలో మెకానిక్ దుకాణం ఉంది. బుధవారం మధ్యాహ్నం పనిలో ఉండగా దుకాణం వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మరింత ఆందోళనకు గురైన నాగూర్ షరీఫ్ భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించింది.తన భర్తపై ఎలాంటి కేసులు లేవని, పోలీసులమని చెప్పి మఫ్టీలో వచ్చి ఎలా తీసుకెళ్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. నాగూర్ షరీఫ్ ముప్పాళ్ల మండలం, తొండపి ఎంపీటీసీ బందెల హుస్సేన్‌బీ అల్లుడు. ఈనెల 28న ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామాకు తెరదీశారని ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ పదవిపై కన్నేసిన టీడీపీ శ్రేణులు తమ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
ఆస్పత్రి సాక్షిగా మహిళా డాక్టర్‌కు అత్యాచార బెదిరింపులు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అరాచక పర్వం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా మహిళల రక్షణకు భద్రత కరువైంది. గత కొన్నినెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందకు అద్దం పడుతుంటే, తాజాగా మరో మహిళా డాక్టర్‌ను ఆస్పత్రి సాక్షిగా వేధించడమే కాకుండా అత్యాచారం చేస్తామనే బెదిరింపు చర్యలకు దిగడం మహిళా భద్రతపై అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఆర్టీ కార్ ఆస్పత్రిలో ఓ మహిళా డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటన ఇంకా కళ్లు ముందు కదులాడుతుండగానే, మళ్లీ మరొక మహిళా డాక్టర్‌కు అత్యాచార బెదిరింపులు రావడం రాష్ట్రంలో మహిళా రక్షణకు సవాల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం నడిపే ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌కు ముగ్గురు ఉన్మాదులు బెదిరింపులకు దిగారు. ఆస్పత్రికి వచ్చి వేధించడమే కాకుండా అత్యాచారం చేస్తామని బెదిరించారు. హౌరా జిల్లాలోని ఉలుబెరియాలో ఉన్న శరత్ చంద్ర ఛటోపాధ్యాయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్-ఆస్పత్రిలో ఇది చోటు చేసుకుంది. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక పేషెంట్ సదరు ఆస్పత్రిలో చికిత్స తీసుకునే క్రమంలో అక్కడకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. మహిళా డాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు .ఈ క్రమంలోనే వేధింపులకు గురి చేసి అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీనిపై ఆ మహిళా డాకర్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆ ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షేక్ సామ్రాట్, షేక్ బాబులాల్, ఫేక్ హసిబుల్‌గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్స్ జాయింట్ ఫారమ్ ఆందోళనమహిళా డాక్టర్ల భద్రతపై ఆ రాష్ట్ర డాక్టర్స్ జాయింట్ పారమ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉలుబెరియాలో ఆ ఆస్పత్రిని సందర్శించిన ఫారమ్ బృంద సభ్యులు.. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణ ఉందా అంటూ ప్రశ్నించారు. మమతా సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదుమరొకవైపు రాష్ట్ర బీజేపీ సైతం.. టీఎంసీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. రాష్ట్రంలో వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న మమతా సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించింది. రాష్ట్ర బీజేపీ ఎంపీ సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన నుంచి మమతా ప్రభుత్వం ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదంటూ మండిపడ్డారు. 11 ఏళ్ల పాప కప్‌బోర్డులో ఆత్మహత్య చేసుకుంటుందా? -
Delhi: యజమాని తిట్టాడని.. అతని ఐదేళ్ల కుమారునిపై పాశవిక దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక డ్రైవర్ అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. నరేలా ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారిపై పగతీర్చుకునేందుకు అతని దగ్గర పనిచేసే డ్రైవర్ నీతు తన యజమాని ఐదేళ్ల కుమారుడిపై ఇటుకలతో దాడి చేసి, కత్తితో తీవ్రంగా గాయపరిచి, హత్య చేశాడు. యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ముందు అతను ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, తన గదిలో ఉంచాడు. ఆ గదిలోని బాలుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ హత్య అనంతరం నిందితుడు నీతు పరారయ్యాడు. అతనిని వెదికేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నీతూను అతని యజమాని తీవ్రంగా మందలించిన దరిమిలా అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు బాలుని కిడ్నాప్‌పై ఫోన్లో ఫిర్యాదు వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హరేశ్వర్ స్వామి తెలిపారు. బాలుడు తమ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అదృశ్యమయ్యాడని ఫిర్యాదులో తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు, ఇంటి చుట్టుపక్కలవారు బాలుని కోసం గాలించగా, అతని మృతదేహం అక్కడికి సమీపంలోని నీతు గదిలో కనిపించిందని హరేశ్వర్ స్వామి వివరించారు.బాలుని తండ్రి ఎనిమిది రవాణా వాహనాలను నడుపుతూ, నీతు, వసీంలను డ్రైవర్లుగా నియమించుకున్నాడని, సోమవారం సాయంత్రం, మద్యం మత్తులో ఇద్దరు డ్రైవర్లూ గొడవ పడ్డారని, దీనిలో జోక్యం చేసుకున్న యజమాని.. డ్రైవర్ నీతును కొట్టాడని హరేశ్వర్ స్వామి చెప్పారు. ఈ అవమాన భారంతో నీతు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడన్నారు. ఈ ఉదంతం గురించి తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు -
టీడీపీ నేత కీచకపర్వం.. గురుకుల హాస్టల్ మైనర్‌ను తోటకు తీసుకెళ్లి..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో తునిలో టీడీపీ నాయకుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ పట్ల సదరు టీడీపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బాగోతాన్ని గుర్తించిన స్థానికులు బాలికను రక్షించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణ రావు అకృత్యాలు బయటకు వచ్చాయి. తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ పట్ల నారాయణ రావు దారుణంగా ప్రవర్తించాడు. మైనర్‌ను హస్టల్ నుండి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో ఆమెతో నారాయణ రావు అసభ్యంగా తాకాడు. ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి మైనర్‌ను రక్షించారు. ఈ క్రమంలో నారాయణ రావు ప్రశ్నించగా.. ఆమెను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్‌ను అంటూ.. తను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు. అయితే, హాస్టల్ నుండి మైనర్‌ను నారాయణ రావు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
చెల్లీ అని పిలుస్తూనే.. బాలికపై అత్యాచారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని గుడారిగుంట ప్రకాశ్ నగర్‌కు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని వెల్పేర్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఆమెకు రావులపాలేనికి చెందిన అజయ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని పిలుస్తూ, ఏదైనా అవసరం అయితే తనకు చెప్పమనేవాడు. ఇదిలావుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర సామగ్రి తీసుకువస్తానని హాస్టల్ వార్డెన్‌కు చెప్పి బయటకు వెళ్లింది. అదే రోజు రాత్రి ఏడు గంటలకు బాలిక తల్లి హాస్టల్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆ బాలిక బయట నుంచి రావడంతో తల్లి ఎక్కడికి వెళ్లావని అడిగింది. దీంతో ఆమె జరిగిదంతా చెప్పింది. తనను అజయ్, అతడి స్నేహితుడు బయటకు తీసుకెళ్లారని, స్నేహితుడు తమను రైల్వే స్టేషన్ ఎదురుగానున్న హోటల్ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్ తనను హోటల్ రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. లాడ్జి నిర్వాహకులు జరిగిదంతా చెప్పారు. యువకుడు, బాలిక వచ్చి తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని చెప్పారన్నారు. దీంతో పోలీసులు అజయ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే మైనర్లకు రూమ్ ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. అజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
పాత నేరస్తుడు రియాజ్ కాల్చివేత
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసిన పాత నేరస్తుడు షేక్‌రియాజ్ సోమవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీస్ కాల్పుల్లో మరణించాడు. పరారీలో ఉన్న రియాజ్‌ను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 4వ అంతస్తులో ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వార్డులోకి సాధారణ తనిఖీల్లో భాగంగా ఏఆర్ ఎస్సై, ఏఆర్ కానిస్టేబుల్ మరో ఇద్దరు సిబ్బంది వెళ్లారు. గదిలో రియాజ్ తలుపులు, కిటికీలు పగులగొట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్‌ను బెడ్‌వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అయితే రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. వద్దంటూ వారించినా వినలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఏఆర్ ఎస్సై కాల్పులు జరపగా, షేక్ రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. జడ్జి సమక్షంలో పంచనామా నిర్వహించి రాత్రి 7 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం పూర్తిచేసి రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో రియాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రిలో కాల్చివేత ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్టు సీపీ సాయిచైతన్య తెలిపారు. కత్తితో పొడిచి తప్పించుకొని.. ఈనెల 18న పాత నేరస్తుడు షేక్‌రియాజ్ ఇంటికి వచ్చాడని సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్, ఎస్సై విఠల్, ఇతర సిబ్బందికి సమాచారం వచ్చింది. బాబాన్ సాహెబ్ పహాడ్‌లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద రియాజ్ కనిపించడంతో కానిస్టేబుల్ ప్రమోద్ వెంబండించి పట్టుకున్నారు. అనంతరం బైక్‌పై తీసుకెళుండగా, రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో కత్తితో బలంగా పొడిచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ప్రమోద్ చనిపోయాడు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సారంగాపూర్ శివారులో పాతబడిన ఓ లారీ క్యాబిన్లో రియాజ్ ఉన్నట్టు స్థానికులు చెప్పగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రియాజ్ పారిపోతుండగా, ఆసిఫ్ అనే యువకుడు రియాజ్‌ను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్ రెండు చేతులకు గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులు చుట్టుముట్టి రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడు.గాయపడిన ఆసిఫ్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నాడు. -
11ఏళ్ల పాప కప్‌బోర్డ్‌లో ఆత్మహత్య చేసుకుంటుందా?
కోల్‌కతా: ఆర్జీకర్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అతని కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతని మేన కోడలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది.కోల్‌కతా భోవానిపూర్ ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సోమవారం 11 ఏళ్ల బాలిక అల్మారాలో శవమై కనిపించింది. బాలికను పాక్షికంగా ఉరికి వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. బాలిక మరణానికి బాలిక త్రండి భోళా సింగ్, సవతి తల్లి పూజ కారణమంటూ స్థానికులు వారిపై దాడి తెగబడ్డారు. తండ్రి, సవతి తల్లి.. బాలికను మానసికంగా,శారీరకంగా హింసించి ఆపై ప్రాణాలు తీశారు. ఈ దారుణంపై కోపంతో రగిలిపోయిన స్థానికులు భోళా సింగ్,పూజలకు దేహశుద్ధి చేశారు. స్థానికులు సవతి తల్లి జుట్టు పట్టుకుని తన్నారు. తండ్రిని బూట్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.దాడి చేస్తున్న స్థానికుల నుంచి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతిని అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. పోస్టు మార్టం పూర్తయిన తర్వాత బాలికది ఆత్మహత్యనా? హత్యనా? అన్నది తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల తీరుపై స్థానికులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 11ఏళ్ల బాలిక కప్‌బోర్డులో ఆత్మహత్య చేసుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. బాలిక మరణానికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 2024 ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన సీల్ధా జిల్లా కోర్టు, సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. -
మాజీ డీజీపీ కొడుకు కేసులో భయానక ట్విస్ట్
మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్ వెలుగు చూసింది. తన భార్యతో తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా వెనకడలేదని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.పంజాబ్ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్ ముస్తాఫా తనయుడు అకీల్ అక్తర్(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకుల నివాసంలో అక్టోబర్ 16వ తేదీన అకీల్ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. ఈలోపు పొరుగింట్లో షామ్‌షుద్దీన్ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే.. సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. ఇంకా అందులో.. తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్ చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ)పైనా బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
చాయ్‌వాలా ఇంట తనిఖీలు.. షాకైన అధికారులు
పక్కా సమాచారంతో ఓ మారుమూల పల్లెలోని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయతే ఆ రైడ్‌లో ఏకంగా కోటి రూపాయల నగదుతో పాటు బంగారం, కొంత వెండి, కుప్పలుగా ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్‌లు, ఆధార్ కార్డులు, చెక్‌బుక్‌లు, ల్యాప్‌ల్యాప్, సెల్ ఫోన్స్ చూసి షాకయ్యారు. ఈ క్రమంలో ఆ చాయ్‌వాలా సోదరుడ్ని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.బీహార్ గోపాల్‌గంజ్ అమైతీ ఖుర్ద్ గ్రామంలో అంతరాష్ట్ర సైబర్ మాఫియా బయటపడడం కలకలం సృష్టించింది. ఓ చిన్న టీ స్టాల్ నడిపించే అభిషేక్ కుమార్, అతని సోదరుడు ఆదిత్య ‘సైబర్ మాఫియా’ నడుపుతున్నారంటే పోలీసులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతూ.. ఆ వచ్చిన నగదును పక్కా ప్లాన్‌తో వైట్లోకి మార్చేసుకుంటున్నారు ఈ అన్నదమ్ములు. అలా వచ్చిన సొమ్ముతో విలాసాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.అన్నదమ్ముల ముఠా.. ?అభిషేక్ కుమార్ స్థానికంగా ఒకప్పుడు చిన్న టీ దుకాణం నడిపించేవాడు. అయితే తర్వాత దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని సహకారంతో ఆదిత్య కుమార్ ఇక్కడ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సైబర్ నేరాలతో కొల్లగొట్టిన సొమ్మును బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి నగదును డ్రా చేసి వాడుకుంటున్నారు.తనిఖీలలో పట్టుబడ్డ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సైబర్ డీఎస్పీ అవంతిక దిలీప్ కుమార్ వెల్లడించారు. బెంగళూరులో జారీ అయిన పాస్‌బుక్స్ ఆధారంగా ఈ నెట్వర్క్.. కేవలం బీహార్‌కే పరిమితమై ఉండకపోవచ్చని, జాతీయ స్థాయిలో విస్తరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఉగ్ర లింకుల నేపథ్యంలో.. ఇన్కమ్ టాక్స్, ఏటీఎస్(Anti-Terrorism Squad) బృందాలు రంగంలోకి దిగాయి. -
అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్సీసీ జెడ్పీటీసీ దారుణ హత్య
అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్సీసీ జెడ్పీటీసీ హత్యకు గురయ్యారు. జెడ్పీటీసీ వారం నూకరాజును దుండుగులు హత్య చేశారు. రోలుగుంట మండలం పెదపేట వద్ద ఈ దారుణం జరిగింది. గతంలో కూడా నూకరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు.నూకరాజు హత్యకు పోలీసులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకరాజుకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. గతంలో కూడా నూకరాజుపై హత్యాయత్నం జరిగిందని.. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని నూకరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎస్పీ చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే నూకరాజును హత్య చేశారని.. నూకరాజు కుటుంబ సభ్యులు అన్నారు. -
నంద్యాలలో దారుణం.. బుర్ఖాలో వచ్చి..
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలో దారుణం జరిగింది. వృద్దురాలిని కత్తితో దాడి చేసిన దండుగులు బంగారు అభరణాలను అపహరించారు. బుర్ఖాలో వచ్చి వృద్దురాలు ఇందిరమ్మపై దాడి చేశారు. వృద్ధురాలు ప్రతి ఘటించడంతో మహిళ కత్తితో దాడి చేసింది. గాయాలైన వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కానిస్టేబుల్ ప్రమోద్ కేసు: రియాజ్ ఖతం, డీజీపీ ఏమన్నారంటే..
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందిస్తూ(Telangana DGP reacts On Riyaz Encounter).. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్‌పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. రియాజ్ చేతిలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్చైన్స్నాచర్ టు కానిస్టేబుల్ హత్య.. చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్ ఆచూకీ గురించి శుక్రవారం(అక్టోబర్ 17వ) తేదీన నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు.అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో.. మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు 8 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. రూ.50 వేల రివార్డుతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. ఈలోపు.. రియాజ్‌ను ఆదివారం మధ్యాహ్నాం ఎట్టకేలకు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్ అంటూ ప్రచారం.. శుక్రవారం ప్రమోద్ను హత్య చేశాక.. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైకుపై పరారైన అతను మహ్మదీయకాలనీలోని తన ఇంటికి వెళ్లి, దుస్తులు మార్చుకుని బయటకొచ్చాడు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాల సాయంతో జల్లెడపట్టారు. అయితే.. ఈలోపు ఓ చోట రియాజ్ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కొని.. పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా.. రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది. అయితే ఆ సమయంలో రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు ప్రచారం జరగ్గా.. పోలీసులు ఖండించారు. నిందితుడు రియాజ్‌ను సజీవంగానే పట్టుకున్నామని, తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ అసిఫ్‌ను కూడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని స్పష్టత ఇచ్చారు. ఈలోపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయే క్రమంలో ఎన్కౌంటర్ కావడం గమనార్హం.ఇదీ చదవండి: పోలీసులకే రక్షణ లేదు.. ఇలాగైతే ఎలా? -
ఈడీ అటాచ్ చేసినా.. ఆస్తులను అమ్మేశారు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో వివిధ స్కీమ్‌ల ముసుగులో రూ.6,000 కోట్ల స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్ మరో కుంభకోణానికి తెరలేపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల్ని వివిధ మార్గాల్లో నకిలీ పత్రాల సాయంతో విక్రయించారు. హైదరాబాద్‌లోని కొన్ని ఆస్తుల్ని అమ్మేయగా... ముంబైలో విక్రయానికి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన ఈడీ అధికారులు ఆ ప్రయత్నాలు అడ్డుకోవడంతోపాటు ఈ దందాలో నౌహీరాషేక్‌కు సహకరించిన సబ్రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.స్కీముల పేరుతో రూ.వేల కోట్ల మోసాలు హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ సహా వివిధ రకాలైన స్కీమ్‌ల పేరు చెప్పిన నౌహీరా షేక్ దేశవ్యాప్తంగా అనేకమంది నుంచి డిపాజిట్లు సేకరించింది. గరిష్టంగా 36 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి దాదాపు రూ.5 వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించి మోసం చేసింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు భారీగా ఆస్తులు సీజ్ చేశారు.అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం అటాచ్ చేసిన ఆస్తులను కోర్టు అనుమతితో వేలం వేయడం ద్వారా ఈడీ నగదుగా మారుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని విక్రయించడం ద్వారా ఈడీ అధికారులు రూ.93 కోట్లు సమీకరించారు. అయితే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఫ్లాట్లను విక్రయించడానికి నౌహీరా షేక్ పథకం వేసింది. హైదరాబాద్‌లో ఉన్న కొన్నింటిని అమ్మేసి సొమ్ము చేసుకుంది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ముంబైలో ఉన్న రూ.12 కోట్ల విలువ చేసే మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. వీటిపై కొందరితో సేల్ అగ్రిమెంట్లు చేసుకున్న నౌహీరా షేక్ రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుంది. ఓ ఫ్లాట్ ఖరీదు చేసిన యజమానిని విచారించిన ఈడీ వాంగ్మూలం సైతం నమోదు చేసింది.సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వ్యవహారం నౌహీరా షేక్ వేసిన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నెల 10 తేదీన వీటి విచారణ జరిగింది. ఈ సందర్భంలో ఈడీ అధికారులు అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసు కువెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యా యస్థానం ఆయా ఆస్తుల్ని ఈడీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా నౌహీరా షేక్‌ను ఆదేశించింది. అలా చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోపక్క ఈడీ అధికారులు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆస్తులనూ నౌహీరా షేక్ విక్రయించినట్టు గుర్తించారు. వీటి రిజిస్ట్రేషన్‌కు సహకరించిన సబ్రిజిస్ట్రార్ల వ్యవహారం ఆరా తీస్తోంది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ బలి
పాములపాడు: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చుకు తగిలి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందగా.. మరో నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దుర్ఘటన నంద్యాల మండలం పాములపాడు మండలం బానకచెర్ల గ్రామ సమీపంలోని అడవిలో ఆదివారం జరిగింది. అటవీ అధికారుల కథనం మేరకు.. ఈ నెల 18న రాత్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ప్రొటెక్షన్ వాచర్లు రాముడు, రాంభూపాల్, విజయ్‌కుమార్, అరుణ్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్ విధుల్లో భాగంగా వాహనంలో బయల్దేరారు. రోడ్డు పక్కన అడవిలో చెట్ల పక్కన ఒక ద్విచక్ర వాహనం కనిపించడంతో అనుమానం వచ్చి అడవిలోకి వెళ్లి చూశారు. దారిలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చు తగలి ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్‌నాయక్ (54) కిందపడ్డాడు. మిగతా వారు వస్తుండగా ‘విద్యుత్ ఉంది.. రావొద్దు’ అంటూ కేక వేసి కుప్పకూలిపోయాడు. అప్పటికే ఇద్దరికి స్వల్పంగా తీగ తగిలింది. లక్ష్మణ్‌నాయక్‌ను వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వాహనంపై టీడీపీ ఎంపీ శబరి ఫొటో స్టిక్కర్ ఘటనా స్థలంలో లభించిన ద్విచక్ర వాహనం నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తలముడిపికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వాహనంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అటవీ అధికారులు వేటగాళ్లు ఏర్పాటు చేసిన తీగను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకరికి భార్య.. మరొకరికి లవర్.. ఢిల్లీలో జంట హత్యలు!
వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్ నగర్ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్‌గా పేరొందిన అశూ అలియాస్ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా ఆ రౌడీ షీటర్‌తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే. భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని.. లవర్‌తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు. ఒకవైపు భార్యను లవర్ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి. వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్ డీసీపీ నిధిన్ వాల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..! -
సీనియర్ వేధింపులు.. రాలిన విద్యా కుసుమం
సాక్షి, బెంగళూరు: భార్యను చంపిన భర్త, యువతిని చంపిన దుండగుడు.. ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది. సీనియర్ వేధింపులను తాళలేక బాగలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనా పర్వీన్ (19)గా గుర్తించారు. సనా మరణానికి కాలేజీలో సీనియర్ రిఫాన్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సనా చదివే కాలేజీలోనే రిఫాన్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ సనాకు వేధింపులు ఆపలేదు. కేరళకు చెందిన రిఫాన్ గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్లేవాడు. పీజీ వద్దకు కూడా వచ్చి సనాను ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇది తట్టుకోలేక ఆమె పీజీలోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై బాగలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. మహిళా సంఘాల నిరసన మరోవైపు మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని, దౌర్జన్యాలను అరికట్టాలని ఏఐడీఎస్ఓ సహా పలు స్త్రీవాద, వామపక్ష సంఘాల కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో ధర్నా చేశారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, దాడులు అధికమైనట్లు వాపోయారు. ప్రభుత్వం దుండగులకు ముకుతాడు వేయాలని నినాదాలు చేశారు. -
పరువు హత్య.. కోడలి ప్రాణం తీసిన మామ
సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తలాండి శ్రావణి (22), శివార్ల శేఖర్ ప్రేమించుకుని గతేడాది కులాంతర వివాహం చేసుకున్నారు. శేఖర్ తండ్రి సత్తయ్య అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. భార్య శ్రావణి ఉరఫ్ రాణితో కలిసి శేఖర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. శనివారం శేఖర్ తన అత్తామామలు చెన్నయ్య, అనూషతో కలిసి వంట చెరుకు తీసుకురావడానికి గ్రామ సమీపంలోని అడవికి వెళ్లాడు. గర్భిణి అయిన శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉంది. సత్తయ్య గొడ్డలితో ఇంట్లోకి చొరబడి శ్రావణిపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో బయటకు పరుగులు తీసినా వెంబడించి దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల బురిడీ!
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా వారి ఉచ్చులో టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పడ్డారు. ఫేక్ ఐడీలతో బెదిరించి భారీ స్థాయిలో దోచుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు వెబ్ మీడియా ద్వారా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. ముంబై సైబర్‌క్రైమ్ అధికారులుగా నటించిన మోసగాళ్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను మనుషుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ బెదిరించి ఆయన నుంచి డబ్బులు గుంజారు. ప్రొవిజనల్ బెయిల్ పేరుతో రూ.1.07 కోట్లను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న ఎమ్మెల్యే పుట్టాకు అక్టోబరు 10 ఉదయం 7.30 గంటలకు ఫోన్ కాల్ వచి్చంది. ఫోన్ చేసిన వ్యక్తి తను ముంబై సైబర్ క్రైమ్ విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నారు. ఆపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, 17 ఫిర్యాదులు కూడా అందాయని చెప్పాడు. ఆధార్, సిమ్‌కార్డు వాడి నకిలీ బ్యాంకు ఖాతా కూడా తెరిచారని, ముంబైలో కొనుగోలు చేసిన సిమ్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు చెప్పాడు. కొద్ది నిమిషాలకు మరో వ్యక్తి వాట్సాప్ వీడియా కాల్లోకి వచ్చాడు. తాను సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారి అని చెప్పి నకిలీ అరెస్టు వారెంట్, సీబీఐ అకౌంట్ ఫ్రీజ్ ఆర్డర్ చూపించి నమ్మించినట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే తన ఖాతాకు ఎక్కడి నుంచి డబ్బులు వచి్చందని అవతలి వ్యక్తిని ప్రశ్నించారు. కెనరా బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు డిపాజిట్ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేలా సహకరించకపోతే అరెస్టు చేస్తామని మోసగాళ్లు బెదిరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అక్టోబర్ 15లోపు రూ.1.07 కోట్లు సైబర్ మోసగాళ్ల అకౌంట్‌కు పంపించినట్లు సమాచారం. కాగా, మరో రూ.60లక్షలు పంపిస్తే కోర్టు క్లియరెన్స్ సర్టిఫికెట్ పంపిస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే, గురువారం రాత్రి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025 -
తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్.. వెలిసిన ‘వాంటెడ్ రియాజ్’ పోస్టర్లు
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యోదంతాన్ని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిందితుడు రియాజ్‌ను పట్టుకుని తీరాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 8 బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్ గురించి శుక్రవారం నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. దీంతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. అతని ఆచూకీ చెబితే రూ.50 వేలు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది బృందాలు అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర!
పట్నంబజారు/నెహ్రూనగర్(గుంటూరు): దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసును టీడీపీ నేతల ఒత్తిడితో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రధాన నిందితుడు, టీడీపీ కార్యకర్త అయిన కాకర్ల హరిచంద్రప్రసాద్, అతడి తండ్రిని అరెస్టు చేశారని, కేసుకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికీ బయటపెట్టలేదని అంటున్నారు. మీడియాకు వివరాలు ఏమీ లేకుండా, నిందితులను అరెస్టు చేసినట్లు చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడిని ఢీకొట్టిన కారులో హరిచంద్రప్రసాద్ నాయనమ్మ కాకర్ల నారాయణమ్మ, అతడి భార్య కూడా ఉన్నారని, వీరిద్దరూ అతడిని ప్రోత్సహించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనాయుడు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత వారు వెళ్లిపోయారని, వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చూపించలేదని వాపోతున్నారు. హరిచంద్రప్రసాద్‌కు పూర్తి సహకారం అందించిన పలువురు యువకుల పైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు తెరవెనుక పెద్దఎత్తున పన్నాగం పన్నుతున్నారని అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు (25)ను టీడీపీ కార్యకర్త కాకర్ల హరిచంద్రప్రసాద్ ఈ నెల 2న కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశాడు. లక్ష్మీనాయుడు తన ట్రాక్టర్‌ను హరిచంద్రప్రసాద్‌కు అమ్మగా అతడు రూ.2 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. లక్ష్మీనాయుడు గట్టిగా నిలదీయడంతో అతడి భార్య సుజాత గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఓ సందర్భంలో లక్ష్మీనాయుడు తన భార్య సుజాత ఫోన్ నుంచి హరికి కాల్ చేశాడు. నంబరు సేవ్ చేసుకున్న హరి... సుజాత ఫోన్‌కు మేసేజ్‌లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. సుజాత విసిగిపోయి భర్తకు చెప్పింది. లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్ నాయుడు, బాబాయ్ కుమారుడు భార్గవ్ నాయుడుతో కలిసి హరిచంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి అతను చేస్తున్నది తప్పని హెచ్చరించారు. ‘‘నేను ఇలాగే చేస్తా. చేతనైంది చేసుకోండి’’ అంటూ హరిచంద్రప్రసాద్ దుర్భాషలాడాడు. మరోవైపు లక్ష్మీనాయుడు కుటుంబం కలగజేసుకుని అప్పు చెల్లించాలని అడగడంతో వేరేవాళ్ల వద్ద ఉన్న ట్రక్కును ష్యూరిటీగా ఉంచాడు. కానీ, తన ట్రాక్టర్ లాక్కున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందిపెట్టాడు. ఒకటికి రెండుసార్లు గొడవలు కావడం, లక్ష్మీనాయుడు సోదరులతో వచ్చి నిలదీయడంతో పరువు పోయిందని హరి వారిపై కసి పెంచుకున్నాడు. దసరా పండుగ నాడు బైక్‌పై వెళ్తున్న లక్ష్మీనాయుడు, పవన్, భార్గవ్‌ను కారుతో ఢీకొట్టాడు. కారు దిగి రాడ్డుతో కొట్టాడు. కారులోని మహిళలు సైతం చచ్చేదాకా తొక్కించు అంటూ అతనిని రెచ్చగొట్టారు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలైన భార్గవ్‌నాయుడు, పవన్ గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తాము ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగాను సైతం హరి దుర్భాషలాడాడని, ఆయన ఫొటో పెట్టుకోవటం పాపామా అని లక్ష్మీనాయుడు కుటుంబం వాపోయింది.గుడ్లూరు ఘటనలో సమగ్ర దర్యాప్తు: ఎస్పీనెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు శివారులో ఈ నెల 2న జరిగిన లక్ష్మీనారాయణ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు హరిచంద్రప్రసాద్, మాధవరావును అరెస్ట్ చేశామని, వారు రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. నిందితుల ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సరిగా జరగడం లేదనేది అసత్య ప్రచారంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాపు వర్గ నాయకుల్లో తీవ్ర ఆగ్రహంటీడీపీ కార్యకర్త హరిచందప్రసాద్ చేతిలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కాపు యువకుడు కావడంతో ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దారకానిపాడులో లక్ష్మీనాయుడు భార్య సుజాత, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేయడం, నియోజకవర్గ ప్రజాప్రతినిధి... లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు తన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాపాడుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారనే విమర్శలు చేశారు. కాగా, తీవ్ర విమర్శలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం హడావుడిగా దారకానిపాడు వెళ్లారు. పరామర్శ పేరుతో హడావుడి చేశారు. పేదలమైన మాపై ఇంత కక్షా?మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. చేతికి అందివచి్చనవారు ఆసుపత్రుల పాలయ్యారు. వారి వైద్యానికి కనీసం డబ్బు పుట్టని పరిస్థితి. హరిచంద్రప్రసాద్ కారుతో గుద్దడంతో మా అన్న కుమారుడు లక్ష్మీనాయుడు చనిపోయాడు. పవన్‌కు నడుము విరిగి మంచానికి పరిమితమయ్యాడు. – తిరుమలశెట్టి వేణు, రమాదేవి (భార్గవ్‌నాయుడు తల్లిదండ్రులు)నా కూతురిని చంపుతానని బెదిరించాడుహరిచంద్రప్రసాద్ నన్ను లైంగికంగా వేధించాడు. లొంగకపోతే నన్నయినా, నా భర్తను అయినా చంపుతా అంటూ బెదిరించేవాడు. ఓసారి నా కూతురిని పైకి ఎత్తి చంపుతానంటూ భయపెట్టాడు. నా భర్తను దారుణంగా చంపేశాడు. ఈ ఊరికే చెందిన బెజవాడ అవినాష్, అల్లం విజయకుమార్, కామినేని శ్రీనివాసులు (పొందూరు శ్రీను) నా భర్త లక్ష్మీనాయుడు హత్యకు సహకరించారు. వారిని పోలీసులు వదిలేశారు. – లక్ష్మీనాయుడు భార్య సుజాత -
ఒక్కగానొక్క కొడుకు.. ఇంకెందుకు బతకాలి?!
కర్నూలు: గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద పారుతున్న నీటిలో ఆడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ కాలు జారి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు అయ్యారు. చెన్నారెడ్డి మృతదేహం లభ్యం కాగా ఉదయ్‌కుమార్ కోసం గాలిస్తున్నారు. ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చదువుతున్న పీఎన్. చెన్నారెడ్డి(20), ఉదయ్ కుమార్(20), శివ, బాబు, అస్తాబ్, ధనుంజయ్, శ్రీనాథ్, సాయి గణేష్ విద్యార్థులు ఇంట్లో కళాశాలకు వెళ్తామని చెప్పి గురువారం ఉదయం గాజులదిన్నె ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు గేట్లు, నీటి నిల్వ పరిసరాల్లో సందడి చేశారు. వారం రోజుల నుంచి గాజులదిన్నె ప్రాజెక్ట్ నాలుగవ క్రస్ట్ గేట్ ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పారుతున్న నీటిలో ఆడుతూ సెలీ్ఫలు దిగుతూ సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ కాలు జారి చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్ పారుతున్న నీటిలో కొట్టుకొని కిందకు పోయారు. దీన్ని గమనించిన శివ వారిని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. చెన్నా రెడ్డి, ఉదయ్ కుమార్‌లు నీటిలో కొట్టుకుపోయి కింద ఉన్న నీటి గుంతలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు నీటిలో కొట్టుకుపోయి మునిగిపోవడంతో మిగతా వారు కేకలు వేశారు. దీంతో ప్రాజెక్టు అధికారులు గేటును మూసివేశారు. అయితే అప్పటికే వారిద్దరూ నీటిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మత్స్యకారులతో వెతికించారు. సాయంత్రం చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో కనిపించదని మత్స్యకారులు బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఉదయ్ కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. చెన్నారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. ఎందుకు బతకాలి? ‘ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని మేం ఎందుకు బతకాలిరా’ అంటూ చెన్నారెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, శకుంతలు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన మోహన్ రెడ్డి, శకుంతలకు ఒక కుమారుడు చెన్నారెడ్డి, ఇద్దరు కూమార్తెలు వైష్ణవి, చైతన్య ఉన్నారు. వీరు ఎమ్మిగనూరు పట్టణంలో హోటల్ పెట్టుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. గత ఐదేళ్లుగా తండ్రి మౌలేశ్వర రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి ఒక్కటే హోటల్ నడుపుతూ పెద్ద కూతురుకు వైష్ణవికు వివాహం చేశారు. హోటల్లో వచ్చిన సంపదనతోనే చెన్నారెడ్డిని, చైతన్యను చదివిస్తున్నారు. చెన్నారెడ్డి మృతిచెందిన సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాజెక్టుకు చేరుకొని ఒక ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషిస్తాడని ఎన్నో ఆశాలు పెట్టుకున్నాం. కానీ మమ్మల్ని ఇలా ఒంటరిని చేసి వెళ్లి పోతావని అనుకోలేదని ఉన్న ఒక్క కుమారుడు పోయాడు. ఇక మేము ఎందుకు బతకాలి అని తల్లిదండ్రులు రోదించారు. ఎవరూ ముందుకు రాలేదు మా స్నేహితులు నీటిలో కొట్టుకుపోయారని, కేకలు వేస్తూ సమీపంలో ఉన్న వారందరినీ వేడుకున్నా ఎవరు ముందుకు రాలేదు. నీటిలో మునిగిపోయారు సహాయం చేయండని వేడుకున్నా ఒక్కరూ కూడా సహాయం చేయలేదు. ఆ సమయంలో ఎవరైనా సహాయం చేసి ఉంటే మా స్నేహితులు బతికి ఉండేవారు. – చెన్నారెడ్డి, ఉదయ్ స్నేహితులు కన్నీటి పర్యంతం..‘అమ్మా.. కాలేజీకి వెళ్లి వస్తా అని చెప్పి.. ఇంకా రాలేదు కదా’ అంటూ ఉదయ్ తల్లిదండ్రులు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన గోవింద్, రాధలకు ఇద్దరు కుమారులు. వీరు పట్టణంలో మగ్గం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోహర్ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చాడు. ‘3 గంటల సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని మేము ఇకా ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్‌లాగ్స్‌తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్‌లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్‌లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్‌రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
అవినీతి తిమింగళం.. డీఐజీ ఇంట్లో నోట్ల కట్టలు, కిలోన్నర బంగారం..
చండీగఢ్: పంజాబ్‌లో అవినీతి తిమింగలం బయటపడింది. పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)(DIG Harcharan Bhullar) ఆఫ్ పోలీస్ హర్చరణ్ భుల్లార్‌ను లంచం ఆరోపణలపై సీబీఐ(CBI) అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎనిమిది లక్షల రూపాయల లంచం కేసులో సీబీఐ.. భుల్లార్‌కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా విస్తుపోయే దృశ్యాలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ బట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్ డిమాండ్ చేశారు. ఇందుకుగాను కిషన్ అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. ఈ మేరకు వ్యాపారి ఆకాశ్ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. గురువారం చండీగఢ్‌లో ఆకాశ్ నుంచి డీఐజీ తరఫున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్‌ను పట్టుకున్నామని సీబీఐ తెలిపింది. Images from DIG Ropar (Punjab) Harcharan Singh Bhullar's residence.CBI raid unearthed ₹5Cr cash, Merc, Audi, 22 Expensive watches, 1.5kg gold..He was part of anti-drug campaign as well.Routine news of highly corrupt clans of India — IAS and IPS officers. pic.twitter.com/P8HEo0o1Jh— The Hawk Eye (@thehawkeyex) October 17, 2025ఈ సందర్భంగా డీఐజీ, మధ్యవర్తి కిషను, వ్యాపారి ఆకాశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా డీఐజీని అరెస్ట్ చేశామని పేర్కొంది డీఐజీ కార్యాలయం, నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, కిలోన్నర బరువున్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు, మెర్సిడెజ్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించింది. ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోపర్ రేంజ్ DIGగా భుల్లార్ విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.Recovery from DIG Harcharan Bhullar Ropar of #PunjabPolice from his house by @cbic_india today.What a corruption it would be very small amount of items? 😂😂😂😂 pic.twitter.com/jRd3tHUOlI— Thomas 🇮🇳🇷🇺🇮🇱🕊️✌️ (@Thomas11P) October 16, 2025 -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్‌తో తల్లీబిడ్డా సేఫ్! -
సజ్జనార్ ఎఫెక్ట్.. ఆ చిల్లర ఇంటర్వ్యూలు డిలీట్!
ఇటీవల కాలంలో యూట్యూబ్ చానళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో పాటు ఇతర సోషల్ మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు లైకులు, షేర్లు, వ్యూస్ కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరైతే విశృంఖలానికి తెర లేపుతున్నారు. ఈ క్రమంలో.. ఇంటర్వ్యూల పేరుతో మైనర్లను ఎంచుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు, చేష్టలు చేయిస్తున్నారు. తాజాగా ఓ మైనర్ జంట ఇంటర్వ్యూ సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఓ షార్ట్‌ఫిల్మ్/ఆల్బమ్ చేసిన జంట అందులో ముద్దు సీన్ చేయడంపై యాంకర్ ప్రశ్నిస్తాడు. అయితే ఆ బాలిక దాంట్లో ఏముంది? ఇప్పుడు కూడా పెట్టేస్తా.. అంటూ ఇంటర్వ్యూలో బరితెగించి ఓవరాక్షన్‌కు దిగింది. ఈ పరిణామంతో యాంకర్ షాక్ కావడం.. మీమ్స్, ఫన్నీ ఎడిట్ వీడియోల రూపంలోనూ వైరల్ అయ్యింది. అయితే ఈ తరహా ఇంటర్వ్యూలు, వీడియోల వ్యవహారంపై నగర పోలీస్ బాస్ వీసీ సజ్జనార్ కన్నెర్ర చేశారు. మైనర్ల అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్‌మీడియాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వ్యూలను అధ్యయనం చేస్తూ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సజ్జనార్ హెచ్చరికల నేపథ్యంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లపై సిటీ పోలీసుల నజర్ పెరిగింది. మైనర్లతో అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి వీడియోలను చేసేవాళ్లనే కాదు, అప్లోడ్ చేస్తున్నవాళ్లను, మీమ్స్ పేరిట పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు. అంతా అల్గారిథమ్ మహిమ!ఇటీవల కాలంలో సోషల్‌మీడియా ఖాతాలు, ఈ–కామర్స్ వెబ్సైట్లు తదితరాలన్నీ ప్రత్యేక ఆల్గరిథెమ్ ఆధారంగా పని చేస్తున్నాయి. ఈ ఆల్గరిథెమ్ సదరు వ్యక్తి ఏ తరహా కంటెంట్‌ను వీక్షిస్తున్నారు? ఎలాంటి వస్తువులు ఖరీదు చేస్తున్నారు? సెర్చ్ చేస్తున్నారు? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఐపీ అడ్రస్, మెయిల్ ఐడీ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తికి అదే తరహా కంటెంట్, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు, యాప్స్ పదేపదే పంపిస్తుంది. ఈ కారణంగా ఇలాంటి వీడియోలు, రీల్స్‌ను పొరపాటున మైనర్లు ఒక్కసారి వీక్షిస్తే చాలు.. వారికి పదేపదే అదే తరహావి కనిపిస్తాయి. వ్యూస్ కోసం విలువలు వదిలేస్తారా? వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్లోడ్ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్ గమనిస్తే 1930కు ఫోన్ చేసి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే.వీసీ సజ్జనార్, నగర కొత్వాల్ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసు కూడా! ప్రేమ, పెళ్లి, భాగస్వామ్యం తదితర అంశాలపై మైనర్లలో సరైన అవగాహన పెరిగేలా, వారు పెడదారి పట్టకుండా వీడియోలు రూపొందిస్తే ఇబ్బంది ఉండదు. అయితే మైనర్ల ప్రేమ వ్యవహారాలు, ముద్దుమచ్చట్లను రీల్స్, వీడియోలు, ఇంటర్వ్యూలుగా చిత్రీకరించి మరింత మందిని పెడదోవ పట్టించడం నేరమే అవుతుంది. ఈ వీడియోలతో పాటు వాటిలో మైనర్లు, యాంకర్లు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పోక్సో యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద యాంకర్లు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయవచ్చు. ఈ ఇంటర్వ్యూల కోసం ఆ మైనర్లను వివిధ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ నేరమే. దీనికి సంబంధించి కిడ్నాప్ కేసు నమోదు చేసే అవకాశమూ ఉంది. ఇవన్నీ పరిశీలించిన కొత్వాల్ సజ్జనర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం కొత్వాల్ ‘ఎక్స్’ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇవి చూసిన అనేక మంది తమ వీడియోలు, రీల్స్, ఇంటర్వ్యూలను డిలీట్ చేస్తుండటం గమనార్హం.:::సాక్షి, సిటీబ్యూరో -
చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన కానిస్టేబుల్
డోన్ టౌన్: నంద్యాల జిల్లా డోన్‌లోని శ్రీరామనగర్‌లో మంగళవారం రాత్రి ఓ పోలీస్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న శ్రీనివాస ఆచారి హోంగార్డుగా పోలీసు శాఖలో ప్రవేశించి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఇతను కొద్దినెలలుగా విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.సిక్ లీవులో ఉంటున్న ఈయన మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఈ నెల 14న రాత్రి ఓ మహిళ మెడలోని చైన్ లాగేస్తూ స్థానికులకు దొరికిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు పోలీసుపై పట్టణ పోలీసుస్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. గురువారం అతడిని అరెస్ట్ చేసి డోన్ ఫస్టక్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): విడిపోయిన తల్లిదండ్రులు.. కేన్సర్ బారిన పడిన తల్లి.. మతిస్థిమితం లేని చెల్లి.. ఓ పక్క ఇంటి బాధ్యతలు.. మరోపక్క చదువు.. ఇంతలో ఆ విద్యార్థికి ఏమైందో తెలియదు. ఇంటివద్ద బాత్రూమ్లో టవల్‌తో ఉరివేసుకున్న స్థితిలో అతడి మృతదేహం లభ్యమైంది. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ (15) అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడ్డాడు. సింగ్‌నగర్ డాబాకొట్లు సెంటర్లోని ఎమ్మెల్సీ కార్యాలయం ఎదురు రోడ్డులో ఉంటున్న కనికే రాజ్యలక్ష్మి, శ్రీనివాసులు దంపతులు విభేదాల కారణంగా ఏడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు యశ్వంత్, కుమార్తె (13) సంతానం. సింగ్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్లో యశ్వంత్ 9వ తరగతి చదువుతుండగా.. కుమార్తె పుట్టిన దగ్గర నుంచి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. రాజ్యలక్ష్మి ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల ఆమె కేన్సర్ బారినపడి 2 నెలల నుంచి ఇంట్లోనే వైద్యం చేయించుకుంటోంది. యశ్వంత్ వారం నుంచి పాఠశాలకు సరిగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి హాలులో చదువుకుంటుండగా.. తల్లి పక్కనే నిద్రపోయింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె నిద్రలేచి చూడగా యశ్వంత్ కనిపించలేదు. బెడ్రూమ్లో లేకపోవడంతో బాత్రూమ్ దగ్గరకు వెళ్లిచూడగా లోపల తలుపువేసి ఉంది. ఎంత పిలిచినా పలక్కపోవడంతో అనుమానం వచ్చిన ఆమె చుట్టుపక్కల వారిని పిలిచింది. తలుపులు పగులకొట్టి చూడగా బాత్రూమ్ డోర్‌కు టవల్‌తో మెడకు ఉరేసుకున్న స్థితిలో యశ్వంత్ కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యశ్వంత్‌ను హాస్పటల్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. కుటుంబ పరిస్థితులను చూసి యశ్వంత్ కలవరపడినట్టు తెలుస్తోంది. యశ్వంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూమ్ డోర్‌కు ఉన్న హ్యాండిల్ కేవలం రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. యశ్వంత్ ఎత్తు సుమారు ఐదు అడుగులు. ఇంత ఎత్తు ఉన్న వ్యక్తి ఆ రెండగుల ఎత్తులో ఉన్న హ్యాండిల్‌కు ఎలా ఉరివేసుకొని చనిపోతాడని పోలీసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యశ్వంత్ నేల మీద కూర్చున్నా కూడా ఆ డోర్ హ్యాండిల్ తేలిగ్గా అందుతుందని ఈ ఎత్తులో ఉరి వేసుకోవడం అసాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యశ్వంత్‌ను ఎవరైనా చంపేసి అలా కండువాతో కట్టేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. వారి కుటుంబ సభ్యులు ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వారితో ఎవరికైనా గొడవలు, ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా.. ప్రేమ వ్యవహారం లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేన్సర్ బారిన పడిన తన తల్లి కూడా చనిపోతుందని భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులుఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. -
భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!
కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్‌తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్ చేశారు. మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్ రాలేదని సెపె్టంబర్ 5న భర్త విజయ్.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్‌కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్ను విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కల్తీ మద్యం కేసులో కీలక పరిణామాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్‌రావుకి చెందిన వైన్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో.. ఓ వైన్ షాపును సీజ్ చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాస వైన్స్.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ వైన్స్‌కు నకిలీ మద్యాన్ని జనార్దన్‌రావే సరఫరా చేశారు. ఈ వ్యవహారాన్ని జనార్దన్ పిన్ని కొడుకు కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాడు. అలా వచ్చిన సొమ్ముతోనే గొల్లపూడిలో విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో కల్యాణ్ కూడా అరెస్ట్ అయ్యారు. కక్ష సాధింపులో భాగంగా..మరో వైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి లోకేష్,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.ఇదీ చదవండి: అమౌంట్ తగ్గితే వసంత బావ ఊరుకోడు! -
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
భిక్కనూరు/బోనకల్: రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ఎన్‌హెచ్ 44పై బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లికి చెందిన మెరుగు కిషన్ (54) ఆదిలాబాద్ జిల్లా రణదీవ్నగర్లో చర్చి పాస్టర్‌గా పనిచేస్తుండగా, ఆయన తల్లిదండ్రులు కామా రెడ్డిలో ఉంటున్నారు. కిషన్ తన కుమార్తె జాస్లీన్ (30)ను ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన ఆగ మని ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రకాశ్ చింతకాని మండలం చిన్న మండవలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జోయల్ ప్రకాశ్ (4), జాడ్సన్ (3 నెలలు). కామారెడ్డిలో ఉంటున్న తన నానమ్మ, తాతయ్య వద్దకు జాస్లీన్ తన ఇద్దరు కుమారులతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. కిషన్ సైతం తన తల్లి దండ్రుల వద్దకు వచ్చాడు. జాస్లీన్ తన చిన్న కుమారుడు జాడ్సన్కు టీకా వేయించేందుకు భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశ వర్కర్‌గా పనిచేస్తున్న తమ బంధువు వద్దకు తండ్రి, పెద్ద కుమారుడితో కలిసి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బయల్దేరింది. వారి వాహనం జంగంపల్లి వద్దకు చేరుకోగానే రాంగ్రూట్లో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నలుగురు రోడ్డుపై పడిపోయారు. కిషన్, జాస్లీన్ అక్కడి కక్కడే మృతి చెందగా, చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్ను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
పాతబస్తీ మహిళకు పాతికేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళకు దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అక్కడి విమానాశ్రయంలో చిక్కడంతో ఈ మేరకు తీర్పు ఇచి్చంది. బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులు బ్యాంకాక్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మహిళకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బహదూర్‌పురకు చెందిన ఓ మహిళ బ్యూటీషియన్ కోర్సు చేశారు. ఈమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తండ్రి పక్షవాతంతో మంచం పట్టగా...తల్లి గృహిణి కావడంతో కుటుంబ పోషణ భారం మహిళ పైనే పడింది. దీంతో కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలి దుబాయ్ వెళ్లి బ్యూటీషియన్ ఉద్యోగం చేయాలని భావించింది. దీనికోసం ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేయించుకుంది. అతగాడు ఈ మహిళను బ్యాంకాక్ మీదుగా దుబాయ్ పంపాడు. బ్యాంకాక్‌లో సదరు ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తి ఈ మహిళకు ఓ ప్యాకెట్ ఇచ్చాడు. దాన్ని దుబాయ్‌లో తమ మనిషి వచ్చి తీసుకుంటారని చెప్పారు. ఈ ప్యాకెట్‌తో మహిళ ఈ ఏడాది మే 18న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడ తనిఖీలు చేపట్టిన అధికారులు మహిళ తీసుకువచి్చన ప్యాకెట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు ఈ నెల 6న నేరం నిరూపణ అయినట్లు ప్రకటించింది. మçహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి సదరు మహిళ వీడియో కాల్ ద్వారా నగరంలోని తల్లితో మాట్లాడింది. తీవ్రంగా రోదిస్తూ తాను కేవలం పది నిమిషాలే మాట్లాడగలనని, ఒక్కసారి తన కుమారుడిని చూపించాలంటూ తల్లిని కోరింది. న్యాయసహాయం చేస్తే నిరోషిగా బయటపడతాననే నమ్మకం ఉందని చెప్పింది. దీంతో మహిళ తల్లి పాతబస్తీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులకు విషయం తెలిపింది. వీరి ద్వారా విషయం తెలుసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో దుబాయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ జనరల్ (సీజీఐ) స్పందించారు. యువతికి అవసరమైన న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చి బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
మద్యం తాగిన మైనర్.. రైలుకింద పడి ఆత్మహత్య
చంద్రగిరి: కూటమి నాయకుల ‘బెల్టు’ దాహం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు... మైనర్లనూ బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన బాలుడు జస్వంత్ (15) ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జశ్వంత్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా, మద్యం బాటిల్ లభ్యమైంది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్ఎం భాస్కర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన జశ్వంత్‌ను మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో జశ్వంత్ పాఠశాల గోడ దూకి పారిపోయాడు.అనంతరం అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.బెల్టు దుకాణమే కారణమా? చంద్రగిరి మండలంలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జస్వంత్ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు జస్వంత్‌కు మద్యం ఎక్కడ నుంచి వచి్చంది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. వాస్తవంగా 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. జస్వంత్ వద్ద దొరికిన బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా? లేక బెల్టు దుకాణాలకు అండగా కేసును నీరుగారుస్తారా? అనేది తేలాల్సి ఉంది. -
చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
ఆలమూరు: కుటుంబ కలహాలు, బంధువుల వేధింపులతో కన్న పిల్లలను చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పావులూరి కామరాజు అలియాస్ చంటి(36), నాగదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. చంటి సెలూన్ షాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబంలో మనస్పర్ధలతో నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల కుటుంబంలో కలహాలు, బంధువుల వేధింపులు ఎక్కువవయ్యాయి. దీంతో చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్ (11), గౌతమ్ (8)తో పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు తన బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రోలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసు వేధింపులే కారణమని చంటి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఇటీవల వేధింపులు అధికమయ్యామని, వారంతా తనను చంపేందుకు యత్నిస్తున్నారని వీడియోలో వాపోయాడు. తాను చనిపోతే తన కుమారులను ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్దేశంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆలమూరు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
సాక్షి, విజయవాడ: నగరంలో భారీగా స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏనీటైమ్ ఫిట్నెస్ సెంటర్లో స్టెరాయిడ్స్‌తో రసూల్ అనే యువకుడు పట్టుబడ్డాడు. జిమ్‌కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. నగరంలోని పలు జిమ్‌లకు కూడా రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. సునీల్, రసూల్ కలిసి స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
పార్వతీపురం మన్యం జిల్లా: ఐషర్ వ్యాన్‌లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్‌కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్‌తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్‌తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్‌లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్‌కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్‌కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్‌కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్‌మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్‌కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
Maharashtra Gurukul: ‘అభ్యంతరకరంగా తాకాడు’: బాధిత విద్యార్థిని
రత్నగిరి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తప్పుదారి పట్టిన ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరిలో గల వార్కారి గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహారాజ్ ఒక మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన ఒక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.గురుకుల క్యాంపస్‌లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్‌తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్ అనే ఉపాధ్యాయుని పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన బాలురు, బాలికలు ఆధ్యాత్మిక విద్యను చదువుకునేందుకు ఈ గురుకులంలో చేరారు. బాధితురాలు జూన్ 12న ఈ గురుకులంలో అడ్మిషన్ తీసుకుంది. అనంతరం మొదటి ఎనిమిది రోజులు బాగానే గడిచాయని, ఆ తరువాత తాను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతను లోపలికి వచ్చి, తనను కొట్టేవాడని, తాకరాని చోట తాకేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించాడని కూడా బాధితురాలు పేర్కొంది. ఆ సమయంలో ప్రీతేష్ ప్రభాకర్ తనను మాట్లాడవద్దని హెచ్చరించాడని, కోకరే తన పలుకుబడితో తన తండ్రిని, సోదరుడిని చంపేస్తాడని బెదిరించాడని బాధితురాలు వివరించింది. కాగా బాధితురాలు సోమవారం తన తండ్రికి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది.దీంతో అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టంలోని సెక్షన్ 12, 17 కింద గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్‌తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్లపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. కాగా మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ, గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్ లైంగిక వేధింపులకు పలువురు బాలికలు గురై ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో సంబంధాలు కలిగిన రాజకీయ నేతల బండారం త్వరలోనే బయటపడనున్నదని భాస్కర్ జాదవ్ అన్నారు. -
గుంటూరులో దారుణం.. రన్నింగ్ ట్రైన్లో మహిళపై లైంగిక దాడి
సాక్షి, హైదరాబాద్: గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బోగీలో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ ప్రయాణికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. సంత్రగాచి-సికింద్రాబాద్ రైలు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరింది. ఈ రైలు గుంటూరుకు చేరుకున్న తర్వాత..లొక బోగీలో ఒక మహిళా ప్రయాణికురాలు మాత్రమే కూర్చుని ఉంది. ఇంతలో ట్రైన్ కదిలే సమయంలో ఓ వ్యక్తి(40) ఆమె ఉన్న బోగీలో ఎక్కాడు. రైలు కొంత దూరం వెళ్లాక.. బోగీలో ఎవరూ లేకపోవడంతో సదరు వ్యక్తి.. మహిళను బెదిరింపులకు గురిచేశారు. కత్తితో బెదిరించి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె.. హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని మరో స్టేషన్లో దిగి పారిపోయాడు. ఈ ఘటన గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.అనంతరం, రైలు చర్లపల్లికి చేరుకోగానే బాధితురాలు.. రైల్వే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ ఘటనపై ప్రయాణికులు స్పందిస్తూ.. రైలు ప్రయాణాల్లో మహిళల భద్రత విషయమై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. -
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్: ఓ కన్నతల్లి తన ఇద్దరు కవల పిల్లలను చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. సీఐ టి.నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ ఫేజ్–2లో సాయిలక్ష్మి (27), అనిల్‌కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కవల పిల్లలు అయిన అబ్బాయి చేతన్ కార్తికేయ (2), అమ్మాయి లాస్యవల్లి ఉన్నారు. అబ్బాయి బుద్ధిమాంద్యంతో పుట్టడంతో పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో సాయిలక్ష్మి తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరు పిల్లల గొంతునులిమి చంపేసింది. అనంతరం భవనంలోని మూడవ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. -
గ్యాంగ్ రేప్ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్
తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్‌రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్‌లను అరెస్ట్‌చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. దుర్గాపూర్/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ ఉదంతం(Durgapur Gang Rape Case) కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్‌రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్‌లను అరెస్ట్‌చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్‌చేశారు. ఘటన జరిగిన తీరుపై బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని మంగళవారం సాయంత్రం బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని(No Gang Rape), క్లాస్మేట్ అయిన ఈ స్నేహితుడు మాత్రమే రేప్ చేశాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు చెప్పారు. నిందితులందరి దుస్తులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని నివేదిక వచ్చాకే కేసులో స్పష్టత వస్తుందని అసన్సోల్–దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌద్రీ చెప్పారు. చౌద్రీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు గంటన్నర ఆలస్యంగా తమ కూతురి స్నేహితుడు తమకు సమాచారం ఇచ్చాడని, అతనిపైనా తమకు అనుమానం ఉందని బాధితు రాలి తండ్రి అక్టోబర్ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చివరకు ఆ స్నేహితుడు సైతం అరెస్ట్‌కావడం గమనార్హం. దుర్గాపూర్ పట్ణణ శివారులోని ప్రైవేట్ ఎంబీబీఎస్ కళాశాల హాస్టల్ నుంచి దూరంగా ఉన్న ధాబాలో భోజనం చేసేందుకు ఈ స్నేహితుడే బాధితురాలిని బయటకు తీసుకెళ్లగా గ్యాంగ్‌రేప్ జరిగిందని కేసు నమోద వడం తెల్సిందే. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిషేక్ గుప్తా సారథ్యంలోని బృందం సీన్ రీక్రియేషన్ కోసం ఐదుగురు నిందితులను మంగళవారం మధ్యాహ్నం ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రశ్నించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రించారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులు విడివిడిగా చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీనికితోడు బాధితురాలు ముగ్గురిలో కేవలం ఒక్కరే రేప్ చేశారని తొలుత వాంగ్మూలం ఇవ్వడం, తర్వాత ఐదుగురు రేప్ చేశారని మరోలా వాంగ్మూలం ఇవ్వడం, స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆ స్నేహితుడిని అరెస్ట్చేశామని కమిషనర్ చెప్పారు. ‘‘బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలు, లభించిన ఆధారాలు, నిందితుల స్టేట్మెంట్లను గమనిస్తే ఇది గ్యాంగ్‌రేప్ కాదని అర్థమవుతోంది. ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది’’ అని కమిషనర్ వ్యాఖ్యానించారు.వాంగ్మూలాలకు, సీసీటీవీ ఫుటేజీకి కుదరని లంకెనిందితులు, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలా లకు, సీసీటీవీలో ఉన్న దృశ్యాలకు సైతం పొంతన కుదరకపోవడం ఈ కేసులో సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు పారిపో యాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కానీ బాధితురాలు, స్నేహితుడు అసలేం జరగనట్లు, ముఖాల్లో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా హాస్టల్‌కు తిరిగొచ్చినట్లు ఘటన తర్వాత హాస్టల్ గేటు దగ్గరి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రేప్ వేళ పెనుగులాటలో బాధితురాలి దుస్తులు చిరిగిపోవడమో, జుట్టు చిందరవందరగా ఉండటమో లాంటివి లేకుండా బాధితురాలు ఆ వీడియోలో మా మూలుగానే కనిపించింది. తనకు హాని జరిగిందని బాధితురాలు హాస్టల్ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదుచేసినట్లు ఫుటేజీలో కనిపించలేదు. వాళ్ల సాయం కోరిన ట్లుగా కూడా లేదు. ‘‘ఘటన తర్వాత బాధితు రాలి ఫోన్ నుంచి స్నేహితునికి ఆగంతకులు ఫోన్ చేసి రమ్మన్నారు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్‌చేశారు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లాగేసుకున్నారు’’ అని కమిషనర్ వెల్లడించారు. ఇదీ చదవండి: బస్సులో.. క్షణాల్లోనే కాలి బుగ్గైన 20 మంది -
ఆశపెట్టి.. మోసగించి!
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త విధానాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని సైతం సులువుగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేయవచ్చునంటూ వల విసిరి రూ.లక్షలు దోచేశారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా పార్ట్‌టైమ్ జాబ్‌లంటూ మోసాలకు తెగబడ్డారు. సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు లబోదిబోమంటూ మిన్నకుండిపోతున్నారు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి ఆగడాలు ఎక్కువయ్యాయి.ధర్మవరం అర్బన్: ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్ అంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో సత్యసాయి జిల్లా యువత చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆన్లైన్ జాబ్ సైట్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్, పత్రికల్లో నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోతోంది. వీరిలో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, నిరుద్యోగులే ఉన్నారు. ఇంట్లో ఉన్నవారే లక్ష్యం వర్క్ ఫ్రమ్ హోం పై మక్కువ పెంచుకున్న యువతను లక్ష్యంగా చేసుకుని జాబ్ స్కామర్లు చెలరేగిపోతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతో నెలకు వేలాది రూపాయలు సంపాదించే జాబ్‌లు తమ వద్ద ఉన్నాయంటూ తరచూ ఆన్లైన్లో ప్రకటనలు గుప్పించి ఆకర్షిస్తున్నారు. ఈ ప్రకటనలు నమ్మి సంప్రదిస్తే ఫీజుల రూపంలో డబ్బు కట్టించుకుని ఆ తర్వాత బోర్డు తిరగేయడం షరా మాములైంది. తమనే నష్టపరిచారంటూ బ్లాక్ మెయిల్ జిల్లాలో రకరకాల డేటా ఎంట్రీ స్కామ్స్ వెలుగు చూస్తున్నాయి. ఎక్కువ స్కిల్స్ అవసరం లేదని, సింపుల్‌గా డేటా ఎంట్రీ చేస్తే చాలు డబ్బు సంపాదించవచ్చని నమ్మబలుకుతారు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు రూపంలో పేమెంట్ చేయించుకుంటారు. డేటా ఎంట్రీ అనంతరం అందులో తప్పులున్నాయని, దాని వల్ల తమ సంస్థ నష్టపోయిందని, పరిహారం చెల్లించకపోతే లీగల్ ప్రొసీడింగ్స్‌కు వెళతామని బెదిరింపులకు దిగుతూ పెద్ద మొత్తంలో నగదు లూటీ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. » నెలకు రూ.60 వరకు జీతం అందిపుచ్చుకుంటున్న ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి... తీరిక వేళల్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఆన్లైన్ టాస్‌్కలో పాల్గొన్నాడు. మొదట దాదాపు రూ.15వేల వరకు నగదు అతని ఖాతాకు బదిలీ అయింది. దీంతో పూర్తిగా నమ్మి అవతలి వ్యక్తుల డిమాండ్ మేరకు నగదు బదిలీ చేస్తూ రూ.2.75లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోతున్నట్లుగా నిర్ధారించుకుని మిన్నకుండిపోయాడు. » ధర్మవరానికి చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆరునెలలుగా ఇంటి వద్దనే ఖాళీగా ఉన్నాడు. ఆన్లైన్లో జాబ్ కోసం వెతుకుతూ ఓ వెబ్సైట్లో లింక్‌ను ఓపెన్ చేశాడు. కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే అంతకు రెట్టింపు వస్తుందని అవతలి వ్యక్తులు నమ్మబలకడంతో తొలుత రూ.5వేలు వారి ఖాతాకు పంపాడు. అనంతరం విడతల వారీగా రూ.1.35 లక్షల వరకు నగదు బదిలీ చేసినా తనకు రిటర్న్స్ లేకపోవడంతో అవతలి వ్యక్తులను నిలదీశాడు. వారి సమాధానంతో తృప్తి చెందక ఇకపై తాను డబ్బు వేయనని తేల్చి చెప్పడంతో వెంటనే వారి నంబర్లు, వాట్సాప్ గ్రూపు బ్లాక్ చేసేశారు. » ధర్మవరంలో నివాసముంటున్న ఓ వివాహిత డిగ్రీ వరకు చదువుకుంది. ఇంట్లో ఖాళీగా ఉండలేక పార్ట్‌టైం జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే రోజు రెండు గంటల పాటు పనిచేస్తే రూ.250 చొప్పున నెల రోజుల తర్వాత జీతం రూపంలో బ్యాంకు ఖాతాలోకి నగదు జమ అవుతుందనే ఓ సైట్ కనిపించడంతో సంప్రదించింది. అవతలి వ్యక్తుల మాటలు నమ్మి తొలుత రూ.5వేలు చెల్లించింది. ఆ తర్వాత రోజు రూ.250 నుంచి రూ.500ల వరకు సంపాదిస్తున్నట్లు వారం రోజుల పాటు ఆన్లైన్ వాలెట్లో కనిపిస్తూ వచ్చింది. వారు విధించిన గడువు లోపు మ్యాటర్ టైప్ చేసి ఇవ్వకపోతే ఎదురు డబ్బు చెల్లించాలనే నిబంధన ఉండడంతో పలుమార్లు తన ఖాతా నుంచి దాదాపు రూ.55వేల వరకు ఆమె బదిలీ చేస్తూ వచ్చింది. అయితే రెండు నెలలు గడిచినా ఆమె బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమకాకపోవడంతో మోసపోయానని గ్రహించి వెంటనే భర్తకు వివరించింది. » ధర్మవరంలోని యాదవవీధిలో నివాసముంటున్న బీటెక్ పూర్తి చేసిన యువకుడు పార్ట్‌టైం జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. ఇంట్లో గంటసేపు కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ వెబ్సైట్లో సమాచారాన్ని నమ్మి తన సరి్టఫికెట్లు, ఆధార్‌కార్డు అప్లోడ్ చేశాడు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు పేరుతో అడ్వాన్స్‌గా రూ.15వేలు సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలోకి జమ చేయించుకున్నారు. అనంతరం తాము ఇచ్చిన మ్యాటర్‌ను అలాగే టైప్ చేసి పంపాలని, గంటలోపు ఎన్ని పదాలు టైపు చేస్తే అంత డబ్బు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుందని నమ్మబలికారు. దీంతో యువకుడు టైపు చేస్తుండగా, తప్పులు ఉన్నాయని, దీంతో కంపెనీ పరువు పోయిందని, పరిహారం రూ. 2 లక్షలు చెల్లించకపోతే కోర్టుకు లాగుతామని బెదిరించారు. పక్కనే ఉన్న తమ న్యాయవాదితో మాట్లాడమంటూ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు. విషయాన్ని వెంటనే సదరు యువకుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన సైబర్ నేరగాళ్లు వారి నంబర్‌ను బ్లాక్ చేశారు. అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్లి కొత్త కోర్సులు అభ్యసించాలి. సాధారణంగా ప్రముఖ సంస్థలు ఎప్పుడూ రిజి్రస్టేషన్ ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీజు పేరిట నగదు వసూలు చేయవు. జాబ్ స్కామర్ల ప్రకటనల్లో, ఈ మెయిల్స్‌లో ఎక్కువగా గ్రామర్ తప్పులు ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా అస్పష్టంగా ఉంటుంది. క్విక్ మనీ, అన్లిమిటెడ్ ఎరి్నంగ్స్, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు అనే పదాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోయామని గ్రహిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. – సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం -
ఎలాగూ శిక్ష పడుతుందని.. ఘోరానికి పాల్పడ్డాడు
మెదక్ మున్సిపాలిటీ: హత్య కేసులో తనకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన ఓ నిందితుడు మరో ఘాతు కానికి పాల్పడ్డాడు. గిరిజన మహిళకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గల కారణాలు తెలుసుకొని పోలీసులు సైతం నివ్వెరపోయారు. మంగళవారం మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీరానాయక్.. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం అంబోజిగూడ తండాలో ఉంటున్నాడు. ఈనెల 11న మెదక్‌లో అడ్డాపైకి వచి్చన సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళను పనికోసమని చెప్పి బస్సులో కొల్చారం మండలం ఏడుపాయల కమాన్ వద్ద ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, బండ రాయితో కొట్టి వెళ్లిపోయాడు. కొనఊపిరితో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మెదక్‌లోని పాత బస్టాండ్ వద్ద గల ఓ వైన్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్తుడు ఫకీరానాయక్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. నిందితుడిపై ఇది వరకే ఏడు కేసులు ఉన్నాయి. మహిళ హత్య కేసుకు సంబంధించిన కేసులో శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె నిరాకరించడంతో పైశాచికంగా వ్యవహరించాడు. ఆమె ఒంటిపై ఉన్న బట్టలు తీసి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, అక్కడే ఉన్న రాయితో కొట్టి చంపాడు. మహిళను హత్యచేసిన సమయంలో ఎత్తుకెళ్లిన ముక్కు పుడక, హత్యకు ఉపయోగించిన రాయి, కట్టె, చర్చి వద్ద వదిలేసిన దుస్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 2020లో జరిగిన హత్య కేసులో సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడు ఫకీరానాయక్కు జీవిత ఖైదుతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. -
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత ఇంట్లో పోలీసుల సోదాలు
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత అద్దేపల్లి జనార్ధనరావు , అతని సోదరుడు జగన్మోహనరావు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. జనార్ధన్,జగన్మోహనరావు కుటుంబాన్ని విచారించిన పోలీసులు. జనార్ధనరావు ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడిగినట్టు సమాచారం. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. జనార్ధనరావు రిమాండ్ లో ఉండగా కుటుంబ సభ్యులను పోలీసులు విచారించడం పై పలు సందేహాలు వెలువడుతున్నాయి.ఎక్సైజ్ అధికారులు ఆయనను గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. జనార్ధనరావు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే, ముందస్తు సమాచారం ఆధారంగా ఎక్సైజ్ బృందాలు జనార్ధనరావును పట్టుకున్నారు.విచారణలో జనార్ధనరావు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఉన్నాయని వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మరిన్ని నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది -
‘ఏయ్ అరవకు.. ఇంకొందరిని పిలవమంటావా?’
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో మెడికల్ కాలేజీ స్టూడెంట్‌పై జరిగిన సామూహిక ఘటన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు ఆనాడు ఏం జరిగిందో చెప్పిన విషయాలు ఓ జాతీయ మీడియా కథనం ద్వారా బయటకు వచ్చింది.వాళ్లు తమ వాహనాల నుంచి దిగి మా వైపు నడుచుకుంటూ వచ్చారు. అది గమనించి మేం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాం. వాళ్లలో ముగ్గురు నన్ను పట్టకుని దగ్గర్లోని అడవిలోకి లాక్కెళ్లారు. నా ఫ్రెండ్‌కు కాల్ చేయమని నాపై ఒత్తిడి చేశారు. అయితే అవతలి నుంచి స్పందన లేకపోవడంతో.. నన్ను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. గట్టిగా అరిచేందుకు ప్రయత్నిస్తే.. అరిస్తే మరికొంత మందిని పిలిపిస్తామని బెదిరించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అని స్టేట్మెంట్లో బాధితురాలు పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి వచ్చిన హక్కుల కమిషన్ బాధితురాలిని పరామర్శించి.. ఘటనపై నివేదికను సిద్ధం చేస్తోంది.ఒడిశా జలేశ్వర్‌కు చెందిన యువతి.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. గత శుక్రవారం డిన్నర్ కోసం ఫ్రెండ్‌తో ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గ్యాంగ్‌రేప్‌కు గురైంది. ఈ కేసుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు 10 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు అర్దరాత్రి పూట ఆమె బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అయితే పోలీసుల నివేదిక ప్రకారం.. అత్యాచారం రాత్రి 9గం. ప్రాంతంలోనే జరిగింది. -
యువతిపై సామూహిక అత్యాచారం
కర్ణాటక: డ్రాప్ చేస్తామని యువతిని బైక్ ఎక్కించుకున్న యువకులు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం జరిపిన దారుణ సంఘటన చిక్కబళ్లాపురం పట్టణంలో జరిగింది. స్థానికంగా మెకానిక్ పని చేస్తున్న సికిందర్ బాబా (30), గుజరీ వ్యాపారి జనార్ధనాచారి(31)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సమీప గ్రామానికి చెందిన యువతి పని మీద ఆదివారం చిక్కబళ్లాపురానికి వచ్చింది. సాయంత్రం తిరిగి ఊరికి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో బైక్‌పై వచ్చిన సికిందర్ డ్రాప్ చేస్తానని ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. దారిలో నిర్జన ప్రదేశంలో ఆమైపె అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. మళ్లీ స్నేహితుడు జనార్ధనాచారిని తీసుకుని వచ్చి యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను బైక్‌పై కూర్చోబెట్టుకుని సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వదిలి వెళ్లిపోయారు. రోడ్డు మీదే యువతి ఏడుస్తూ కూర్చుని ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మహిళా ఠాణా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు యువతిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.మహిళా వైద్యురాలితో అసభ్య ప్రవర్తనఇటీవల బస్సుల్లో కామాంధులు ఎక్కువయ్యారు. తాజాగా దొడ్డబళ్లాపురం నుంచి బెంగళూరుకు బస్సులో వస్తున్న మహిళా వైద్యురాలిని ఓ దుండగుడు వేధించాడు. ఆమె పక్కన కూర్చుని అసభ్యంగా తాకసాగాడు. దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్‌కు విషయం చెప్పగా, పోలీసులకు ఫోన్ చేసి నిందితుడు ఫిరోజ్‌ఖాన్‌ని పట్టించారు. సంజయ్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.బస్సులో మరో దురాగతంబెంగళూరులో ఆర్టీసీ బస్సులో మరో దుస్సంఘటన జరిగింది. తుమకూరు నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సులో ఓ వ్యక్తి ఎక్కి మహిళ పక్కనే కూర్చున్నాడు. ప్యాంట్ జిప్ తీసి యువతి దుస్తులపై వీర్యం చిమ్మాడు. ఈ చర్యతో భయంతో యువతి గట్టిగా కేకలు వేసింది. తోటి ప్రయాణికులు ఆ కామాంధున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు, మార్గమధ్యలో క్యాత్సంద్ర వద్ద బస్సు ఆపి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
నా అప్పులతో నా భార్యాపిల్లలకు సంబంధం లేదు..!
సిరిసిల్ల: ‘మీ అమ్మకి ఏమీ తెలియదు. చాలా అమాయకురాలు. ఇక నన్ను క్షమించండి. నేను చేసిన అప్పులతో నా భార్యాపిల్లలకు ఏం సంబంధం లేదు. వారికి ఎలాంటి హానీ తలపెట్టవద్దు. నా భార్యాపిల్లలకు మనవి.. మీకు ఇబ్బందిగా ఉంటే.. నాతోపాటే మీరు కూడా రాగలరు. జిల్లా కలెక్టర్ గారు.. ఎస్పీ గారు.. నా భార్యాపిల్లలకు న్యాయం చేయండి.. నేను బిజినెస్‌లో నష్టపోయి.. అప్పులోళ్లకు మొహం చూపించలేక సచ్చిపోతున్నా... అప్పులోళ్లు ఇద్దరే చాలా వేధించారు..’ అని సూసైడ్ నోట్ రాసి చనిపోయిన సంఘటన సిరిసిల్లలో సంచలనంగా మారింది. కరీంనగర్ శివారులోని ఎలగందులకు చెందిన విక్కుర్తి శేఖర్(48) ఇరువై ఏళ్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. స్థానిక మొదటి బైపాస్‌రోడ్డులో గణపతి విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడం.. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక సోమవారం విగ్రహాలను తయారు చేసే షెడ్డులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్లకు చెందిన బాలసాని అంజయ్యగౌడ్ తన ప్లాటు(స్థలం) కాగితాలను బెదిరించి లాక్కున్నారని, బాలసాని యాదయ్య ఇల్లును ఆక్రమించుకోవాలని చూస్తున్నారని లేఖలో శేఖర్ పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన ఇతరులు ఏమీ అనలేదని, మూడేళ్లు సమయం ఇచ్చారని, వాళ్లంతా నన్ను క్షమించాలని లేఖలో వేడుకున్నారు. వాళ్లకు మొఖం చూపించలేకపోతున్నానని పేర్కొన్నారు. షెడ్డు ఓనర్ తన భార్యపిల్లలకు సహకరించాలని కోరారు.కలెక్టర్, ఎస్పీలకు లేఖతన ఆస్తి భార్య పిల్లలకు దక్కేలా చూడాలని, కల్లు సొసైటీలో సభ్యత్వం పిల్లలకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరారు. మృతుడికి భార్య వసుధ, పిల్లలు అఖిల్, మణిదీప్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. -
హైదరాబాద్ బాలానగర్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను బలవన్మరణానికి పాల్పడింది(Balanagar Mother Kills Children). మరణించిన చిన్నారులు కవలలుగా తెలుస్తోంది. బాలానగర్ పద్మారావునగర్ ఏరియాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను హతమార్చి.. ఆపై నివాసం ఉంటున్న బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను కార్తీకేయ(2) లాస్యత వల్లి(2), సాయిలక్ష్మిగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: నాన్నమ్మ మందలింపు, భార్యాకొడుకుతో కలిసి రైలు కింద పడి.. -
499 కిలోల గంజాయి పట్టివేత
సుజాతనగర్: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసి రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలిస్తున్న 499 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సరుకు విలువ రూ.2.50 కోట్లు ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కంటైనర్‌లో గంజాయి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సుజాతనగర్ ఎస్సై రమాదేవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కంటైనర్‌లో రవాణా చేస్తున్న 96 గంజాయి ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. కంటైనర్ యజమాని సంజుకుమార్, మహారాష్ట్రకు చెందిన జగదీశ్ దయారాంను అరెస్ట్ చేశామని, వీరితో సంబంధం ఉన్న అమిత్ రోహిదాస్ పాటిల్ (మహారాష్ట్ర), హరి (ఒడిశా) పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. అరెస్టైన ఇద్దరిపై గతంలో కూడా పాడేరు, ఔరద్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 59 మంది నుంచి రూ.25.85 కోట్ల విలువైన 52 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
బాలుడిపై లైంగిక దాడి
సాక్షి, హైదరాబాద్: బాలసదనంలోని ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి ఆ బాలుడు వెళ్లగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ బాల సదనంలోని ఓ బాలుడిపై కొంత కాలంగా అక్కడే పనిచేస్తున్న గార్డ్ స్టాఫ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు అస్వస్థతకు లోనయ్యాడు. అనుమతి లేకున్నా, షార్ట్ లీవ్ మంజూరు చేశారు. దీంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్.. ఆ బాలుడు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలసదనానికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఉద్యోగి (గార్డ్ స్టాఫ్)ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. మరికొందరిపైనా దాడి...: ఈ బాలసదనంలో మొత్తం 77 మంది చిన్నారులున్నారు. లైంగిక దాడి విషయంపై పోలీసులు ఆదివారం కూడా ఆరా తీశారు. మరో నలుగురిపైనా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. వారిని పోలీసులు ప్రత్యేకంగా విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఈ దాడి వెనుక మరో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. నిత్య వైద్య పరీక్షలేవీ?: వాస్తవానికి విద్యార్థులకు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ మేరకు అక్కడ శాశ్వత ప్రాతిపదికన డాక్టర్‌ను నియమించినా, ఆయన బాలసదనానికి చుట్టపుచూపుగా వస్తుంటాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోచోట ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తుండటంతో ఆయన ఇక్కడ విధులకు సకాలంలో హాజరుకారనే ప్రచారం ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. -
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
కర్ణాటక: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు.మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.కులగణనలో టీచర్‌కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్‌సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్‌ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తోంది. -
కడప నగరంలో తీవ్ర విషాదం, కుటుంబ కలహాలతో..!!
వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో భార్యాభర్తలు బిడ్డతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో.. వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది.ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్‌పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు.అయితే మృతుల్ని శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, వాళ్ల కొడుకు రిత్విక్‌గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నాన్నమ్మ సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్థాపం చెందిన భార్యాపిల్లలతో బయటకు వెళ్లిపోయారు. అది తట్టుకోలేక ఆమె గుండెపోటుతో కన్నుమూసింది.అయితే.. కాసేపటికే గూడ్స్ రైలు కింద పడి ఆ భార్యాభర్తలు బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఎందుకు గొడవపడ్డారు, సుబ్బమ్మ ఏమని మందలించింది.. తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
క్షణికావేశం.. తీస్తోంది ప్రాణం
‘బలమే జీవితం.. బలహీనతే మరణం’ అని ఆలోచనాత్మక వాక్యం చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్న సమస్యలకే కుంగిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ సమస్యలనో.. ఆర్థిక ఇబ్బందులనో.. అనారోగ్య సమస్యలనో.. పరీక్ష తప్పామనో.. చదువు ఇష్టం లేదనో.. ప్రేమ విఫలమైందనో.. ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పెరగిపోతున్నాయి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందన్న విషయాన్ని మరచి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కదిరి: ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంలో చేజేతులా సమాప్తం చేసుకుంటే వారి మీద ఆధారపడ్డవారిని, వారి మీదే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నవారిని రోడ్డున పడేసినట్లే అవుతుంది. సత్యసాయి జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకూ కేవలం 9 రోజుల్లోనే 9 మంది పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. వీరిలో అధిక శాతం మంది యువతీ యువకులే. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగానే ఇలా బలవన్మరణాలు జరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. భయపెడుతున్న ఘటనలు..మడకశిర పట్టణానికి చెందిన మధు(23) అగళి మండలంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇదే విషయంగా చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒక ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదనే భావంతో క్షణికావేశంలో ఈ నెల 1వ తేదీ ఆత్మహత్య చేసుకున్నాడు.» నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(40) చిన్నపాటి అంశానికి భార్యతో గొడవ పడి కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నాడు. చివరకు ఒంటరి జీవితంపై విరక్తి పుట్టి ఈ నెల 5న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.= ధర్మవరంలోని కోట కాలనీకి చెందిన తొండమాల మహేష్(37) ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. పెళ్లి సంబందాలేవీ కుదరడం లేదని మనస్థాపానికి గురై ఈ నెల 6న ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.» మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యంకు చెందిన ప్రవీణ్‌కుమార్(27) సైతం పెళ్లి సంబందాలు కుదరడం లేదని ఈ నెల 6న రాత్రి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.» చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన పార్వతి, గంగాధర్‌ల కుమార్తె అశ్వని(16) రామగిరి కేజీబీవిలో ఇంటర్ చదువుతుండేది. దసరా సెలవుల్లో ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఈ నెల 8న ఇంటి పక్కనే ఉన్న షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ... ఇలా ఒకరిద్దరు కాదు... ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 153 మంది బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన చెందే విషయం. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు లేవు. సగటున ప్రతి రెండు రోజులకు ఒకరు ఆత్యహత్య చేసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ అధికారికంగా వెలుగు చూసిన ఘటనలే. ఇక అనధికారిక లెక్కలు మరిన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది.కౌన్సెలింగ్ అవసరం మానసిక సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. ప్రారంభ దశలోనే గుర్తించి తగిన కౌన్సెలింగ్ ఇప్పిస్తే వ్యతిరేక ఆలోచనల నుంచి బయట పడవచ్చు. మానసిక సమస్యలతో బాధపడే వారిని మరింత కోపానికి, ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. వీలైనంత వరకూ వారు అందరిలో ఉంటూ ఆనందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ ఫైరోజాబేగం, డీఎంహెచ్ఓ ఒక్క క్షణం ఆలోచించాలిజీవితం ఎంతో విలువైనది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. నమ్ముకున్న అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఆ క్షణంలో తలుచుకుంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాదు. సమస్యలకు చావు పరిష్కారం కానే కాదు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తాం. యువతను మేల్కోలిపే కార్యక్రమాలు చేపడతాం. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీఇవీ హెచ్చరిక సంకేతాలు.. » ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం » స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండటం » విపరీతమైన కోపం, భయం ప్రదర్శిస్తూ సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం. » నిరంతరం నిస్సహాయతాభావాన్ని వ్యక్త పరుస్తుండడం. » అతిగా మద్యం సేవించడం, ప్రతీకార కాంక్షతో మాట్లాడుతుండడం. » ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్ర, ఆకలిలో మార్పులు ఉండడం. » పండగలు, వివాహాల వంటి వేడుకల్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం. » స్నేహితులకు విషాదరకమైన మెజేస్‌లు పంపడం. » చనిపోతున్నట్లు ముందుగానే వారి మాటల్లో పరోక్షంగా వ్యక్తపరుస్తుండడం. -
మనవడు మహా ముదురు
విశాఖ సిటీ : క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కంచరపాలెంలో బామ్మ, మనవడిని కట్టేసి.. బంగారం, నగలు దోచుకున్నది ఇంటి దొంగే అని గుర్తించారు. ఈ దోపిడీలో మాస్టర్ మైండ్ మనవడే అన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు థ్రిల్లర్ సినిమాను తలదన్నెలా ముగ్గురి స్నేహితులతో కలిసి సొంతింట్లోనే దోపిడీకి పక్కాగా ప్లాన్ చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచేశాడు. సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయాన్ని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. తన సొంత ఇంటికే కన్నం వేసిన కృష్ణకాంత్ (19)తో పాటు అతని ముగ్గురు స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్ (30), షేక్ అభిష్క్ (21), అవసరాల సత్యసూర్యకుమార్ (24)లను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేసే ఆనంద్‌రెడ్డి కుటుంబంతో కలిసి కంచరపాలెంలో ఇంద్రానగర్ 5వ వీధిలో నివాసముంటున్నాడు. ఇతడు ఈ నెల 4వ తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. 5వ తేదీ రాత్రి సుమారు 12.30 గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఆనంద్‌రెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్ నిద్రలో ఉన్నారు. ఆ అగంతకులు బామ్మ, మనవుడ్ని ప్లాస్టర్, ప్లాస్టిక్ ట్యాగ్ వైర్లతో కట్టేసి నిర్బంధించారు. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, మనవడి చేతికి ఉన్న డైమండ్ రింగ్, బీరువాలో ఉన్న రూ. 50 వేలు దోచుకున్నారు. తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన మహీంద్ర ఎక్స్‌యూవీ వాహనాన్ని కూడా దొంగలించి అక్కడ నుంచి పరారయ్యారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కోసం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ (క్రైమ్స్) లతా మాధురి ఆధ్వర్యంలో ఇన్చార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్ క్రైమ్ సీఐ మీసాల చంద్రమౌళి, ఎస్ఐ షేక్ అబ్దుల్ మరూఫ్, సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఒకవైపు నగరంలో గాలిస్తూనే మరోవైపు వారి మొబైల్ డేటాలో అనుమానాస్పద యాప్‌లు, ట్రేడింగ్‌కు సంబంధించిన హిస్టరీ, ప్లాస్టర్ సెర్చ్ హిస్టరీ వంటి ఆధారాలను గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లలో గాలించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు తిరిగి విశాఖకు వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.1 లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు, మహీంద్రా కారును స్వా«దీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఆన్లైన్ ట్రేడింగ్‌లో అప్పులపాలుప్రధాన నిందితుడు కృష్ణకాంత్ తండ్రి ఆనంద్రెడ్డిలా వ్యాపారంలో సక్సస్ అవ్వాలని ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు స్నేహితులు పీఎం పాలెంకు చెందిన పరపతి ప్రమోద్ కుమార్, కేఆర్ఎం కాలనీకి చెందిన షేక్ అభిõÙక్, మధురవాడకు చెందిన అవసరాల సత్య సూర్యకుమార్‌లతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్రణాళిక చేశాడు. వారం రోజుల ముందు వీరు సెల్ కాన్ఫరెన్స్‌లో నేరానికి ఏం ఉపయోగించాలి.. ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పని చెయ్యకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకుని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కృష్ణకాంత్ తండ్రి ఆనంద్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లడంతో వీరు ఈ నెల 5వ తేదీ రాత్రికి ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా బామ్మతో పాటు కృష్ణకాంత్‌ను కట్టేసి బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆనంద్‌రెడ్డి కార్లో పరారయ్యారు. అక్కడి నుంచి ఎన్ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడవివరం, హనుమంతవాక వైపు నుంచి మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చారు. బస్సులో ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు. -
ఎల్బీనగర్లో థార్ బీభత్సం.. పల్టీలు కొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో(LBnagar) థార్ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపి వరుస ప్రమాదాలకు కారణమయ్యాడు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. బీఎన్‌రెడ్డినగర్(BNReddy Nagar) సమీపంలోని గుర్రంగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వేగంగా దూసుకొచ్చిన థార్ వాహనం(Thar Road Accident) అదుపు తప్పింది. అనంతరం, మొదట రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ సందర్భంగా ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు విద్యార్థిని సిరిసిల్లకు చెందినట్టు తెలిసింది. దీంతో, వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: జూబ్లీహిల్స్ బరిలో ఎవరు.. ఇద్దరిలో అవకాశం ఎవరికి?ఇక, వాహనం ఎక్కువ వేగంతో ఉండటంతో డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత వాహనం గాల్లోకి లేచి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో థార్ వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు యజమాని అనిరుధ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, రెండో కారులో ప్రయాణిస్తున్న దినేష్, శివ అనే ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. దీంతో, వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కుటుంబాన్ని చిదిమేసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ!
సాక్షి, చెన్నై: ఇన్స్టాగ్రామ్ ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇందులో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ముగ్గురు పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకోట్టైలో శనివారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలోని కోయిల్ సముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ (38), నిత్య (35)కు పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.తొలుత వినోద్ కుమార్ సొంతంగా వ్యాపారం చేయగా.. నష్టాలు రావడంతో ఫొటోగ్రాఫర్‌గా మారి ఆపై ఓ హోటల్లో పనికిచేరాడు. ఈ దంపతులకు కుమార్తెలు ఓవియ(11), కీర్తి(8), కుమారుడు ఈశ్వర్(5) ఉన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆ కుటుంబానికి సమస్యలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిత్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది.వాటికి ఆకర్షితుడైన మన్నార్గుడికి చెందిన ఓ యువకుడు ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఆర్థిక కష్టాలను గుర్తించి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగుతుండటాన్ని గుర్తించిన వినోద్‌కుమార్.. నిత్యను మందలించాడు. దీంతో తనకు విలాసవంతమైన జీవితం కావాలంటూ ఆ యువకుడితో నిత్య ఇటీవల వెళ్లిపోయింది.ఉన్మాదిగా మారి...ఆమెను బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో విజయ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓవియ బడి మానేసి తన చెల్లి, తమ్ముడి లాలన చూసుకునేది. క్రమంగా వినోద్‌కుమార్ మానసికంగా కుంగిపోతూ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం రాత్రి పకోడీని తన తమ్ముడు, చెల్లికి ఓవియ తినిపిస్తుండగా, మద్యం మత్తులో వచ్చిన వినోద్‌కుమార్ ఓవియ, ఈశ్వర్‌ను బయటకు పంపించాడు.మరో కుమార్తె కీర్తిని తన ఒడిలో పెట్టుకుని లాలిస్తూ, క్షణాల్లో కత్తితో ఆమె గొంతు కోసేశాడు. కీర్తి పెడుతున్న కేకలతో ఓవియ, ఈశ్వర్ ఇంట్లోకి పరుగులు తీశారు. క్షణాల్లో మిగిలిన ఇద్దరినీ గొంతుకోసి చంపేశాడు. రక్తపు మడుగులో మరణించిన పిల్లలను చూసి ఏడుస్తూ, తన భార్యకు గుణపాఠం చెప్పేశానంటూ తాను పనిచేస్తున్న హోటల్‌కు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి మదుక్కూర్ పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. -
ఫేస్బుక్లో దొంగనోట్ల గ్రూప్‌లు
కామారెడ్డి క్రైం: బిహార్‌లోని ఓ మారుమూల ప్రాంతం అడ్డాగా దొంగనోట్లు తయారు చేసే ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో దాడులు చేసి 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఆ వివరాలు వెల్లడించారు. రెండు నోట్లతో మొదలైన కేసు.. కామారెడ్డి కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ వైన్స్‌లో గత నెల 23న కామారెడ్డి మండలం షాబ్దీపూర్‌కు చెందిన సిద్దాగౌడ్ మరొకరితో కలిసి రెండు రూ. 500 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. వైన్స్ క్యాషియర్ అఖిల్‌కు సిద్దాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీవనే అనుమానం కలిగి తర్వాత సిద్దాగౌడ్ ఇంటికి వెళ్లి అడిగాడు. తన జీతం డబ్బులు ఇచ్చి మద్యం కొన్నానని సిద్దాగౌడ్ బదులివ్వగా అనుమానం తీరక అఖిల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి నోట్లు నకిలీవని నిర్ధారించారు. సిద్దాగౌడ్‌ను అదుపులోకి విచారణ జరపగా నేరం అంగీకరించాడు. ఫేస్బుక్లో ఫేక్ కరెన్సీ గ్రూపు ద్వారా కోల్‌కతాకు చెందిన సౌరవ్‌డేను పరిచయం చేసుకొ ని రూ.5 వేలు అసలు నోట్లు చెల్లించి రూ.10 వేలు దొంగనోట్లు తెప్పించుకున్నట్లు సిద్దాగౌడ్ తెలిపాడు. కామారెడ్డి నుంచి సీసీఎస్ పోలీసులు బెంగాల్ వెళ్లి సౌరవ్‌డేను పట్టు కొని విచారించగా అతడు హరినాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి బిహార్‌కు చెందిన రషీద్ నుంచి దొంగ నోట్లు తెప్పించి కొరియర్ ద్వారా కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది. నిందితు లిద్దరితోపాటు సిద్దాగౌడ్, మరో కస్టమర్ అయిన కృత్తిక్ రాజు (తమిళనాడు నుంచి వలస వచ్చి కామారెడ్డి ప్రాంతంలో నివసిస్తున్నాడు) లను అరెస్టు చేసి నాలుగు రోజుల క్రితమే కోర్టుకు హాజరుప ర్చినట్లు ఎస్పీ తెలిపారు. బృందాలుగా ఏర్పడి.. దొంగనోట్ల వ్యవహారం వెలుగులోకి రాగానే కామా రెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో కలిపి బృందాలను ఏర్పాటు చేశారు. రషీద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు బిహార్‌కు వెళ్లాయి. అక్కడ మారుమూల ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగనోట్లు ముద్రించే సామగ్రిని, రషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వృత్తిరీత్యా రషీద్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కలర్స్, కెమికల్ మిక్సింగ్‌లపై అవ గాహన ఉంది. దొంగనోట్లు తయారు చేసి అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో అతడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నందు లాల్ జంగ్డే, చట్టారాం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్ డే, హరినారాయణ భగత్, పండిత్, యూపీకి చెందిన లక్కన్ కుమార్ దూబే, దివాకర్ చౌదరీ, సత్యదేవ్‌యాదవ్, మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ కాట్రేలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వారిలో కొందరు ఫేస్ బుక్‌లో గ్రూపులను ఏర్పా టు చేసి ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ల ద్వారా జనాన్ని పోగు చేస్తారు. వారి నుంచి ఆర్డర్లు తీసుకుంటారు. మరి కొందరు రషీద్ నుంచి దొంగనోట్లు తెప్పించి కొరియర్ల ద్వారా కస్టమర్లకు పంపిస్తారని రషీద్‌ను విచారించగా తేలింది. అక్కడి నుంచి పోలీసులు బృందాలుగా ఏర్పడి యూపీ, బెంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి లక్కన్ కుమార్ దూబే, దివాకర్ చౌదరి, సత్యదేవ్‌యాదవ్‌లను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అంతేగాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మంది ఆన్లైన్ ద్వారా దొంగనోట్లు తెప్పించుకునేందుకు ఆర్డర్లు పెట్టి సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రూ. 3 కోట్ల నకిలీ నోట్లకు ఆర్డర్ పెట్టుకున్నాడని తెలిసింది. ప్రధాన నిందితుడు రషీద్ ఇంటి నుంచి రూ.3.08 లక్షల నకిలీ నోట్లు, రూ.15,300 అసలు నోట్లు, రూ.8,830 సగం ముద్రించిన నకిలీ నోట్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, కలర్లు, పేపర్లు ఇతర వస్తువులన్నింటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. -
గిరిజన మహిళపై హత్యాచారం
మెదక్‌జోన్/కొల్చారం(నర్సాపూర్): ఏడుపాయల పుణ్యక్షేత్ర సమీపంలో ఘోరం జరిగింది. ఆలయానికి అతి సమీపంలోని ఓ వెంచర్ పక్కన ముళ్ల పొదల్లో గిరిజన మహిళపై అత్యాచారం చేశారు. ఆపై గుర్తుతెలియని దుండగులు తీవ్రంగా కొట్టడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.మెదక్ రూరల్ సీఐ జార్జ్, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళ భర్త, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. భర్త రెండు రోజుల క్రితం పని ఉండటంతో గజ్వేల్‌కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ఆమె పనికోసం టిఫిన్ బాక్స్ పట్టుకొని ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కొడుకు తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇంటికి వచ్చిన భర్త తన భార్య కోసం అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంతలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసుల ద్వారా విషయం తెలిసింది. ఘటనాస్థలిని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. ఆ మహిళను వెంచర్‌లోని స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా, తలకు బలమైన గాయం, కుడిచేయి విరిగి ఉంది. మెడ, ఇతర చోట్ల గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులు హుటాహుటిన మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాత్రి 7 గంటల వరకు చికిత్స అందిస్తున్నా స్పృహాలోకి రాలేదు. పరిస్థితి విషమించటంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. వైద్యులు గిరిజన మహిళపై అత్యాచారం చేసిన తర్వాతే దాడి చేసి ఉంటారని చెబుతున్నారు. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపామని రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
బెంగాల్లో మరో ఘోరం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైద్య కళాశాల విద్యార్థినిపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన బాధిత విద్యార్థిని ఇదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. రాత్రి సమయంలో భోజనం కోసం స్నేహితుడితో కలిసి క్యాంపస్ బయటకు వెళ్తుండగా, దుండగులు అడ్డుకొని సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. 2024 ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడాది తర్వాత మళ్లీ అలాంటి సంఘటనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ ప్రభుత్వం అసమర్థత వల్లే బెంగాల్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనను రాజకీయం చేయొద్దని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోరింది. అసలేం జరిగింది? పోలీసుల ప్రాథమిక విచారణ పూర్తిచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థిని శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లేందుకు బయలుదేరింది. గేటు వద్దకు చేరుకోగానే ముగ్గురు వ్యక్తులు వారిని అటకాయించారు. దాంతో ఆ మిత్రుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఒంటరిగా మిగిలిన బాధితురాలిని ఆసుపత్రి వెనుక భాగంలోని చెట్లపొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె ఫోన్‌ను లాక్కున్నారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు బయటకు వచ్చింది. అప్పటికే తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స ప్రారంభించారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) బృందం ఆసుపత్రికి చేరుకొని బాధితురాలిని పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. న్యాయం జరిగేలా కృషి చేస్తామని హమీ ఇచ్చారు. వైద్య విద్యార్థిపై జరిగిన దురాగతాన్ని పశ్చిమ బెంగాల్ డాక్టర్ల ఫోరం ఖండించింది. కాలేజీ క్యాంపస్‌లో కూడా రక్షణ లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేసింది. బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ సైతం స్పందించారు. ఐక్యూ మెడికల్ కాలేజీలో అత్యాచార ఘటన జరిగిందని, వసిఫ్ అలీతోపాటు అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. విద్యార్థినిపై దుశ్చర్య పట్ల నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. -
ప్రేమ పేరుతో ‘కోచ్’ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, అడ్డగుట్ట: ప్రేమ పేరుతో కోచ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటున్న ప్రమోద్‌కుమార్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.వారి పెద్ద కుమార్తె మౌలిక(19) అలియాస్ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజీలో మాణికేశ్వర్ నగర్‌కు చెందిన అంబాజీ అనే యువకుడు కొన్ని నెలల క్రితం వాలీబాల్ కోచ్‌గా జాయిన్ అయ్యాడు. కొద్ది రోజులుగా అతను మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన మౌలిక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి సెల్ఫోన్లో డేటా పూర్తిగా డిలీట్ చేసి ఉందని, డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు చెప్పారు. అంబాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బావ పొట్టిగా ఉన్నాడంటూ..
బావమరది బావ బతుకు కోరతారంటారు. కానీ, ఇక్కడ సొంత బావమరిది చేతిలోనే బావ హత్యకు గురయ్యాడు. అందుకు కారణం.. ఎత్తు తక్కువ అని తెలిస్తే ఎవరికైనా మతి పోవాల్సిదే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన ఈ పరువు హత్య(Guntur Honor killing).. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరులో పెళ్ళైన 10 రోజులకే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్(Kurra Ganesh Case)కు, దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతితో పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే.. గణేష్ పొట్టిగా ఉన్నాడని యువతి తల్లిదండ్రులు సంబంధం వద్దనుకున్నారు. కానీ మొదటి చూపులోనే గణేష్, కీర్తి.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని, రోజు ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. తాము వివాహం చేసుకుంటామని చెప్పగా.. పెద్దలు అంగీకరించలేదు. దీంతో పది రోజుల కిందట పారిపోయి అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి సోదరుడు దుర్గారావు అసహ్యం పెంచుకున్నాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. వివాహం జరిగిన నాడే గణేష్ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు కూడా. దీంతో.. తనకు యువతి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులను(Nallapadu Police) గణేష్ ఆశ్రయించాడు కూడా. ఈలోపు.. పెళ్లి గుడిలో చేసుకోవడంతో రిసెప్షన్ అయినా గ్రాండ్‌గా చేసుకోవాలని ఆ జంట భావించింది. ఇందుకోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో గణేష్ ఇంటికి పయనం అయ్యాడు. దారిలో గణేష్‌ను ఆటకాయించి.. కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు దుర్గారావు. ఆపై దుర్గారావును, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు.ఇదీ చదవండి: పిల్లనిచ్చిన అత్తతో రొమాన్స్! భార్యకు అడ్డంగా దొరికిపోయి.. -
భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ అయోధ్య.. ఐదుగురి దుర్మరణం
లక్నో: భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడింది(Ayodhya Blast). ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అయోధ్య సమీంలోని పగ్లాభారీ గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోగా.. చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఇల్లు కూలిపోయిందని.. శిథిలాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు. ఆ వెంటనే పోలీసుల రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. अयोध्या के पुरा कलंदर में एक ज़ोरदार ब्लास्ट से एक मकान ढह गया। राम कुमार के परिवार के 5 लोगों की दर्दनाक मौत हो गई। कहा जा रहा है अवैध पटाखे बन रहे थे या सिलेंडर ब्लास्ट हुआ जांच में साफ होगा।#Ayodhya@ayodhya_police pic.twitter.com/2BX9IRqAhp— Hussain Rizvi हुसैन حسین رضوی (@TheHussainRizvi) October 10, 2025గ్యాస్ సిలిండర్ లేదంటే ప్రెజర్ కుక్కర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే.. పేలుడు జరిగిన చోట గన్‌పౌడర్, పటాకుల మిగులు భాగాలు బయటపడ్డాయి. దీంతో అనుమతులు లేకుండా బాణాసంచాలు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి యాజమానిని రామ్‌కుమార్ కసౌధన్ అలియాస్ పప్పు గుప్తాగా పోలీసులు నిర్ధారించారు. ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలోనూ ఇదే ఇంట్లో పేలుడు జరిగి యజమాని భార్య, తల్లి మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరా తీశారు(CM Yogi on Ayodhya Blast). ఘటనపై త్వరగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. దీంతో క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. మొన్నే కాన్పూర్‌లో స్కూటర్ పేలుడు సంభవించి(Kanpur Scooter Blast).. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే తొలుత బాణాసంచాల వల్లే ప్రమాదం జరిగిందని తెలిపిన పోలీసులు.. అది సిలిండర్ బ్లాస్ట్ అని తాజాగా ప్రకటించారు. ఈ రెండు పేలుళ్లపై కుట్ర కోణం ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని ఖండించారు.ఇదీ చదవండి: శబరిమలై వ్యవహారంలో మరో ట్విస్ట్ -
మనిషిని చంపి, ముక్కలు చేయడమెలా?
ఖమ్మం రూరల్: ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడిన పరిచ యం స్నేహంగా మారి అసహజ శృంగార బంధానికి దారితీసింది. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి.. రెండో వ్యక్తి అడిగినప్పుడల్లా డబ్బు అప్పుగా ఇచ్చేవాడు. అయితే అతన్ని చంపితే ఆ డబ్బంతా సొంతం చేసుకోవచ్చని రెండో వ్యక్తికి దుర్బుద్ధి పు ట్టింది. అంతే.. వెంటనే తనకు పరిచయమైన మూడో వ్యక్తి తోపాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం మృతదేహా న్ని ముక్కలుగా నరికి పడేశాడు. మృతదేహాన్ని ఎలా ముక్కలు చేయాలో యూట్యూబ్ వీడియోలు చూసి అమలు చేశాడు. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో బయటపడ్డ ఒళ్లు జలదరించే విషయాలివి. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. ఆ వివరాలను గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. జీతం సరిపోక.. సాగు కలిసిరాక ఏపీలోని ఎనీ్టఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్ ఎం.ఫార్మసీ చదివాక తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కడే ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. జీతం సరిపోక గ్రామంలో కూరగాయలు సాగు చేసినప్పటికీ నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాడు. ఆపై ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలెంకు చెందిన కొమ్ము నగ్మాతో ఏర్పడిన పరిచ యం వివాహేతర సంబంధానికి దారితీసింది.వారిద్దరూ ఖమ్మంలో ఉండేవారు. మరోవైపు అశోక్‌కు కామేపల్లి మండలం కెపె్టన్ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లు (ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం)తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. తరచూ అశోక్ గదికి వచ్చే వెంకటేశ్వర్లు అతని అవసరానికి డబ్బు అప్పు ఇచ్చేవాడు. ఈ క్రమంలో అశోక్, వెంకటేశ్వర్లు నడుమ అసహజ సంబంధం ఏర్పడింది. ఆపై అశోక్‌కు డ్రిప్ కంపెనీలో పనిచేసిన పెంటి కృష్ణయ్య పరిచయమయ్యాడు. వారిద్దరూ వెంకటేశ్వర్లు వద్ద డబ్బు బాగా ఉందని భావించి దోచుకోవాలని కుట్రపన్నారు. యూట్యూబ్‌లో చూసి.. వెంకటేశ్వర్లు హత్యకు సిద్ధమైన నిందితులు ఇందుకోసం యూట్యూబ్ వీడియోలు చూశారు. నిద్రలో ఉన్నప్పుడు కత్తితో గొంతు కోస్తే శబ్దం రాకుండా చనిపోతాడని నిర్ణయానికి వచ్చారు. అలాగే మృతదేహాన్ని ముక్కలుగా ఎలా నరకాలో కూడా తెలుసుకున్నారు. ఇందుకోసం కత్తులు సిద్ధం చేసుకున్నారు. గత నెల 15న రాత్రి వెంకటేశ్వర్లు అశోక్ ఇంటికి వచ్చి పడుకోవడంతో 16న తెల్లవారుజామున నగ్మాను బయట కాపలా ఉంచిన అశోక్.. కృష్ణయ్యతో కలిసి వెంకటేశ్వర్లు గొంతు భాగంలో కత్తితో పలుమార్లు నరికాడు. దీంతో అతని తల, మొండెం వేరయ్యాయి.ఆపై మృతదేహాన్ని ముక్కలుగా కోసి కవర్లలో కుక్కి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి కరుణగిరి ప్రాంతంలో పడేశారు. అనంతరం గదిలో రక్తం మరకలను శుభ్రం చేశారు. అయితే వెంకటేశ్వర్లు తిరిగి హైదరాబాద్ చేరుకోకపోవడంతో ఆయన సోదరుడు యాదగిరి గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు.. వెంకటేశ్వర్లు ఫోన్ మాయం కావడం.. ఆయన ఫోన్‌పే యాప్ నుంచి నగదు బదిలీ అవుతుండటంతో అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టగా కృష్ణయ్య, నగ్మాతో కలిసి అశోక్ హత్యకు పాల్పడ్డట్లు తేలింది. నిందితుల నుంచి 2.7 తులాల బంగారం గొలుసు, నాలుగు ఫోన్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: నగరాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా.. డ్రగ్స్ మూలాలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. తాజాగా హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటమే ఇందుకు ఉదాహరణ. సుమారు 10 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఒక అపార్ట్మెంట్ వేదికగా ఐదురుగు కలిసి డ్రగ్స్ తయారీ చేస్తున్న సమాచారం అందుకున్న ఈగల్ టీమ్.. ఈ మేరకు సోదాలు నిర్వహించింది.జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయి దత్తా రెసిడెన్సీలో 220 కేజీల డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని అరెస్ట్ చేయగా, ఒకరు పరారయ్యారు. ఈ డ్రగ్స్ విలువ స్థానిక మార్కెట్లో రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని అదే అంతర్జాతీయ మార్కెట్లో అయితే రూ. 70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అపార్ట్మెంట్ వేదికగా డ్రగ్స్ తయారు చేస్తున్న వారిలో వాస్తవాయి శివరామకృష్ణ పరమ వర్మ, దంగేటి అనిల్, మద్దు వెంకట కృష్ణ, ఎం ప్రసాద్, ముసిని దొరబాబులు ఉన్నారు. వీరంతా కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు కాగా, హైదరాబాద్‌లో ఉంటూ ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అత్తపై మోజుతో..
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్‌పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.2018లో శివాని, ప్రమోద్‌ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి.. -
ఆంటీ నువ్వంటే నాకు ఇష్టం..!
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఖబడ్దార్..’ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఇంటికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో నీలగిరిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయగా.. కాల్ చేసిన ఆగంతకుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు. చెన్నై పోలీసులకు కాల్ చేసిన సదరు వ్యక్తి.. భవిష్యత్తులో విజయ్ గనుక పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇంటిని బాంబుతో పేల్చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ కాల్ కోయంబత్తూరు నుంచి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఘటన తర్వాత విజయ్ కనీసం బాధితులను పరామర్శించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో.. విజయ్ ఇంటికి పోలీసు భద్రతను పెంచారు.ఈ ఘటనపై నమోదైన కేసులో టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయగా, మద్రాస్ హైకోర్టు సిట్ ఏర్పాటునకు ఆదేశించింది. అయితే టీవీకే మాత్రం ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. కరూర్ ఘటన నేపథ్యంలో రాజకీయ సభలకు, ర్యాలీలకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో తమిళనాడు ప్రభుత్వం ఉంది. ఆ మార్గదర్శకాలను జారీ చేసే దాకా.. తమిళనాడులో ఏ పార్టీకి ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వబోమని ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేసింది కూడా. ఇదిలా ఉంటే.. తమిళనాడు (Tamil Nadu)లో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గతకొంతకాలంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు జరిపి.. ఆ బెదిరింపులు ఉత్తవేనని తేల్చాయి. ఇదీ చదవండి: కరూర్ బాధితులకు విజయ్ పరామర్శ -
రైల్లో మహిళా ఐటీ ఉద్యోగినికి లైంగిక వేధింపులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి తన స్వస్థలం ఈరోడ్‌కు కుర్లా ఎక్స్‌ప్రెస్ రైల్లో రిజర్వ్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తోంది. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటినప్పుడు, ఓ వ్యక్తి ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షాక్‌కు గురైన మహిళ కేకలు వేయగా, తన తోటి ప్రయాణికుల సాయంతో ఆ వ్యక్తిని ఆమె పట్టుకుంది. తర్వాత రైలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేలం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన శంకర్(45)గా గుర్తించారు. వస్త్ర వ్యాపారం కోసం ఈరోడ్‌కు వచ్చినట్లు తేలింది. -
భార్య శవాన్ని పరుపు కింద దాచి, ఆపై..
ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం.. వరకట్న వేధింపుల ఘటనలు, ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్ సూసైడ్! -
కిడ్నాప్ చేసి...తుపాకీతో బెదిరించి..
వెంగళరావునగర్: రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఆఫీసుకు తీసుకెళ్లి, అనంతరం కిడ్నాప్ చేసి తుపాకులతో బెదిరించి నగదు డిమాండ్ చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్ బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 6న తన స్నేహితుడితో కలిసి ఎల్లారెడ్డిగూడలో నడిచి వెళుతుండగా వెంకట్స్వరూప్ అనే వ్యక్తి అమీర్‌పేటలోని తన ప్లాట్‌కు రమ్మని మనోజ్‌కుమార్‌ను కారులో తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్కుమార్పై దాడిచేసి తుపాకులతో బెదిరించి ఎల్లారెడ్డిగూడలోని శివసాయి అపార్ట్‌మెంట్స్‌కు తీసుకెళ్ళారు. అక్కడ అతడిని బంధించి తమకు రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతడి భార్య, కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించాడు. బాధితుడు తన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టగా వెంకటస్వరూప్ మరోసారి మనోజ్‌కుమార్ భార్యకు ఫోన్ చేసి మైత్రీవనం 1039 పిల్లర్ వద్దకు నగదు, తీసుకురావాలని చెప్పాడు. ఆమె పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళగా ముగ్గురు నిందితులు బైక్‌పై పారిపోగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు. -
‘ఇంటర్నేషనల్’ తెలివి తేటలు.. ఏఐ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలు..!
రాయ్‌పూర్: మనోడు చదివేది చత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో.. మరి చేసేవి గలీజు పనులు. మనోడికి ఇంటర్నేషనల్ తెలివి తేటలు బాగా ఉన్నట్లు ఉన్నాయి. ఐటీ విద్యార్థిగా తన స్కిల్స్ డెవలప్చేసుకోవడం మానేసి.. అమ్మాయిల ఫోటోలను ఏఐ టెక్నాలజీ జోడించి న్యూడ్‌గా మార్చేస్తున్నాడు. ఇలా సుమారు 36 మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వెయ్యిపైగా ఏఐ చిత్రాలను రూపొందించాడు. ఈ విషయం బయటకి రావడంతో సదరు విద్యార్థి సస్సెండ్ గురయ్యాడు. బిలాస్‌పూర్‌కు చెందిన థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థి.. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే పనిలో ఉన్నాడు. ఇలా 36 మంది విద్యార్థినులకు చెందిన 1000కి పైగా ఏఐ న్యూడ్ చిత్రాలను సృష్టించాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు విద్యార్థినులు అక్టోబర్ 6వ తేదీ ఆ ఇన్స్టిట్యూట్లో ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని సస్సండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన స్టాఫ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై విచారణకు సిద్ధమైన ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. అదే సమయంలో విద్యార్థినుల రాతపూర్వక ఫిర్యాదు కోసం వేచిచూస్తున్నామని, దానిని బట్టే తమ చర్యలు ఉంటాయని రాఖీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆశిష్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. -
సీనియర్ల వేధింపుల వల్లే.. ఆత్మహత్య: ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ నోట్
గుర్గావ్: సీనియర్ అధికారుల వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న హర్యానాకు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రాసిన సూసైడ్ నోట్లో బహిర్గతమైంది. ఈ మేరకు పూరన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాశారు. నిన్న(మంగళవారం, అక్టోబర్ 7) పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడగా, తాజాగా సదరు అధికారి రాసిన సుదీర్ఘ సూసైడ్ నోట్ బయటకొచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారులు తమ దర్యాప్తులో కనుగొన్నారు.పూరన్ కుమార్ సన్నిహితుడైన సుశీల్ కుమార్ అనే వ్యక్తి సదరు ఆఫీసర్ పేరు మీద లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదురై రోహతక్ పోలీసులు.. సోమవారం నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలువురు పైస్థాయి అధికారులు మానసిక వేధింపుల కారణంగానే పూరన్ కుమార్ ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. పూరన్ కుమార్ సకుమార్ సహాయకుడు డ తన పేరు మీద రూ. 2.5 లక్షలు లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రోహ్తక్ పోలీసులు సోమవారం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు.అయితే ఈ క్రమంలోనే సుశీల్‌ను అరెస్ట్ చేయగా, పూరన్ కుమార్ పేరు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆపీసర్ పూరన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఇది సీనియర్ అధికారుల తనను వేధింపులకు గురి చేయడంలో భాగంగానే జరిగిందని, తన ప్రొఫెషనల్ కెరీర్‌ను నాశనం చేయడానికి ఇలా చేశారని సూసైడ్ నోట్ రాసిన పూరన్ కుమార్ ఆపై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు పేర్లు రాసి పెట్టాడు పూరన్ కుమార్.కాగా, హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పురాణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా? మరేదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆయన మొబైల్ ఫోన్‌తో పాటు వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్‌కు పోలీస్ శాఖలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్‌కు పయనమయ్యారు. ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఇది ఉగ్రవాదుల పనేనా? -
నెల్లూరు డబుల్ మర్డర్.. గంజా బ్యాచ్ పనే!
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో గంజాయి వ్యాపారం స్వైర విహారం చేస్తోంది. అక్రమ రవాణా, నిల్వ, వినియోగం వంటి కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం.. పోలీసుల నిఘా లోపాలను బయటపెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ వద్ద వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసు.. గంజాయి బ్యాచ్ పనేనని నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై నెత్తురు మరకలు, మూడు జతల చెప్పులు ఉండడం చూసిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతపేట పోలీసులు అనుమానంతో నదిలో గత ఈతగాళ్లను దింపి రెండు మృతదేహాలను వెలికి తీయించారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పని చేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమనే భావించారంతా. దీంతో.. ఎస్పీ అజితా ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి.ఈ తరుణంలో.. కందుకూరు వద్ద బుధవారం ఉదయం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులిద్దరూ గంజాయ్ బ్యాచ్‌గా గుర్తించారు. అడిగితే నగదు ఇవ్వలేదని కోపంతో ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలతో పాటు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
నల్లగొండ: హాలియా ఎస్బీఐలో అగ్నిప్రమాదం.. ఆన్‌లో ఉన్న కంప్యూటర్ వల్లే!
సాక్షి, నల్లగొండ: హాలియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది(Haliya SBI Fire Accident). అయితే స్థానికంగా ఒకరు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం కూడా తప్పింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఓ అంచనాకి వచ్చారు.హాలియా ఎస్బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్మెంట్ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర సామాగ్రి బూడిద అయ్యాయి. ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు. ఆ కంప్యూటర్ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్(Computer Short Circuit) జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి. అంతకంతకు పెరిగి బ్యాంకును దగ్ధం చేశాయి’’ అని అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రేషన్ కార్డులు.. అందరికీ కాదు! -
నకిలీ మద్యానికి నలుగురు బలి
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ములకలచెరువులో వ్యక్తి మృతిశ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.నెల్లూరు జిల్లాలో ఇద్దరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్‌షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్‌పై పామూరుకు చెందిన పవన్ మెన్స్‌వేర్ లేబుల్‌ను గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్నా బ్యారేజ్: డబుల్ మర్డర్ కలకలం
సాక్షి, నెల్లూరు: పెన్నా నది సమీపంలో డబుల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు టవర్ డంప్‌ను సంతపేట పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను పోలీసులు మంగళవారం వెలికి తీశారు. హత్య చేసి నదిలో పడేసి ఉంటారని.. అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మృతుల వివరాల కోసం సమీపంలోని గిరిజన తండాల్లో ఆరా తీస్తున్నారు. -
చెట్టు.. తీసింది కీర్తన ఊపిరి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు. గతంలో ఫిర్యాదు ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. మ్యాచ్ చూసి వస్తుండగా.. ఎలా జరిగిందంటే.. ఆదివారం కీర్తన, ఆమె స్నేహితురాలు రాధతో ఆచార్య మైదానంలో జరిగే శాండల్‌వుడ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ను చూడడానికి స్కూటర్లో వెళ్లారు. మ్యాచ్ ముగిశాక సాయంత్రం 7 గంటల సమయంలో తమ స్కూటర్లో ఇళ్లకు బయల్దేరింది. కీర్తన స్కూటర్ వెనుక కూర్చుంది. సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఎలాంటి గాలి వాన లేవు.చెట్టు కింద నలిగిన కీర్తన క్షణాల్లోనే చనిపోయింది. రాధ, మరో బైక్‌పై వస్తున్న భాస్కర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కీర్తన చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. -
బైక్ ఈఎంఐ కట్టలేక వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన సుమంత్ (24) అనే వ్యక్తి మద్యం మైకంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. MGM ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.సుమంత్ మద్యానికి బానిసై, తన బైక్ EMI కట్టలేక చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. -
సెంట్రల్ జైల్లో రౌడీ బర్త్‌డే.. వీడియో వైరల్
సెంట్రల్ జైలు అంటే ఎంత సెక్యురిటీ ఉంటుందో అందరికీ తెలిసింది. కారాగారంలో ఉన్నవారిని కలవాలంటే చాలా తతంగం ఉంటుంది. ఏదైనా తీసుకెళ్లాలన్న కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది సెంట్రల్ జైలులో ఏకంగా ఓ రౌడీ తన అనుచరులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదంతా ఎలా జరిగిందో విచారణ చేపడతామని చెబుతున్నారు.బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా (Gubbachhi Seena) కేక్‌ను కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కనిపించారు. ఆపిల్ పండ్లతో తయారు చేసిన దండను అతడి మెడలో వేశారు. ఈ వీడియోను ఒక ఖైదీ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.వీడియో ఎలా తీశారు?జైలులో రౌడీషీటర్ బర్త్ డే చేసుకోవడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్లో వీడియో కూడా తీయడంపై విమర్శలు వస్తున్నాయి. జైలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు కారాగారం లోపలవున్న తమ వారి భద్రతపై ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ఖైదీ వీడియోను ఎలా రికార్డ్ చేయగలడనే దానిపై కూడా వారు కూపీ లాగుతున్నారు.ఎవరీ సీనా?రౌడీ షీటర్ శ్రీనివాస తన ప్రత్యర్థి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్‌ను హత్య చేసినట్లు సీనాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది.Criminals in Comfort Video Shows Rowdy-Sheeter Enjoying Royal Treatment in Karnataka’s Parappana Agrahara JailParappana Agrahara Central Jail is once again under the spotlight, this time for a shocking display of privilege to a rowdy sheeter. Notorious Srinivas, alias Gubbachi… pic.twitter.com/bpdzxGLH19— Karnataka Portfolio (@karnatakaportf) October 5, 2025భాస్కరరావు ఫైర్ఈ వ్యహహారంపై బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, బీజేపీ నేత భాస్కరరావు ఎక్స్‌లో స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరప్పణ అగ్రహార జైలు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జైలులోకి ఒక భారీ కేక్ ప్రవేశించింది. జైలులో ఉన్న మినీ రౌడీలతో కలిసి ఒక రౌడీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కర్ణాటకలో పాలన కుప్పకూలిపోయింది. సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు అవినీతి గురించి బహిరంగంగా ఏడుస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువత వీధుల్లోకి వచ్చారు. బెంగళూరు పరిపాలన గుంతలు, చెత్తతో చెత్తగా ఉంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయ'ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. Parrapana Agrahara Jail is in news again !!!!! A massive cake enters the jail and a rowdy with all his incarcerated mini Rowdies celebrate his birthday with total impunity and the same is recorded and uploaded on Social Media…..!!!!!!🤣🤣🤣🤣@DrParameshwara has now abdicated &… pic.twitter.com/DsQxPi4kVj— Bhaskar Rao (@Nimmabhaskar22) October 5, 2025గతంలోనూ.. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. 2020, డిసెంబర్లో రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లా తన మద్దతుదారులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. దర్యాప్తు చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతంఅవుతున్నాయని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
రాజస్థాన్: ఐసీయూలో విష వాయువులు.. ఏడుగురి దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది(Rajasthan Fire Accident). ఈ ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చికిత్స పొందుతున్న వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి జైపూర్‌లోని సవాయ మాన్సింగ్(SMS Hospital Mishap) ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ਸਵਾਈ ਮਾਨ ਸਿੰਘ ਸਰਕਾਰੀ ਹਸਪਤਾਲ ਦੇ ICU 'ਚ ਲੱਗੀ ਅੱ+ਗਝੁਲ.ਸ ਗਏ ਕਿੰਨੇ ਹੀ ਮਰੀਜ਼ ! ਦੇਖੋ ਰਾਜਸਥਾਨ ਦੇ ਸਰਕਾਰੀ ਹਸਤਪਾਲ ਦੀਆਂ ਤਸਵੀਰਾਂ #jaipur #rajasthan #accident #LatestNews #Bignews #PunjabiNews #DailypostTV pic.twitter.com/kvlIRlBb4I— DailyPost TV (@DailyPostPhh) October 6, 2025 ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి సీరియస్‌గా ఉండగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరుకుంది. #WATCH | Jaipur, Rajasthan | A massive fire broke out in an ICU ward of Sawai Man Singh (SMS) Hospital, claiming the lives of six patients pic.twitter.com/CBM6vcTMfZ— ANI (@ANI) October 5, 2025ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా.. ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. जयपुर के SMS हॉस्पिटल के ट्रॉमा सेंटर के लगी आग.#Jaipur pic.twitter.com/q9Q6OQfma8— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) October 5, 2025సిబ్బందిపై ఆరోపణలుఅయితే ఘటన సమయంలో ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేదన్నట్లు తమ ప్రాణాల కోసం పరుగులు తీశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన సమయంలో ఐసీయూ నుంచి దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం వ్యాపించిందని.. దీంతో తాము కంగారు పడ్డామని, ఆ సమయంలో మమ్మల్ని అప్రమత్తం చేయకుండా సిబ్బందే ముందుగా బయటకు పారిపోయారని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆ ఆరోపణలను నిర్వాహకులు కొట్టిపారేశారు. తమ సిబ్బంది పేషెంట్లను బయటకు తీసుకొచ్చారని.. సీసీటీవీ ఫుటేజీలే అందుకు సాక్ష్యాలని అంటున్నారు. విష వాయువుల పొగ కారణంగా పేషెంట్లు అపస్మారక స్థితికి చేరుకున్నారని, సీపీఆర్‌తో రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రకటించారు.ప్రధాని దిగ్భ్రాంతిజైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రి విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.The loss of lives due to a fire tragedy at a hospital in Jaipur, Rajasthan, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi— PMO India (@PMOIndia) October 6, 2025 #WATCH | Jaipur, Rajasthan | SMS Hospital Trauma centre Incharge Anurag Dhakad says, "Our trauma centre has two ICUs on the second floor: a trauma ICU and a semi-ICU. We had 24 patients there; 11 in the trauma ICU and 13 in the semi-ICU. A short circuit occurred in the trauma… pic.twitter.com/cjMwutRCl3— ANI (@ANI) October 5, 2025 -
బాలికపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి ఆమెపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంతపేట పోలీసుల కథనం మేరకు.. సంతపేట కామాక్షినగర్‌కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో శశి అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.ఈ నెల 3వ తేదీన బాలిక స్కూల్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో యువకుడు అడ్డుకుని ఆమెను బాలాజీనగర్‌లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బైక్‌పై మైపాడుబీచ్‌కు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సాయంత్రం అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి విచారించారు. బాలిక రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాత్రి 8 గంటల సమయంలో బాలికను ఆమె ఇంటికి సమీపంలో వదిలి వెళ్లాడు.ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక నానమ్మ శనివారం రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. -
కన్న కొడుకే కాలయముడయ్యాడు
ప్రొద్దుటూరు క్రైం: డబ్బు పంపలేదనే కోపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే కన్న తల్లిని గొంతుకోసి హత్యచేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. డబ్బు పంపకుంటే కొడుకు ఇంటికి వస్తాడనుకుంది ఆ తల్లి. కానీ ఆ ఆలోచనతోనే కుమారుని ఆగ్రహానికి ఆమె బలైపోయింది. ప్రొద్దుటూరు మండలంలోని శ్రీరాంనగర్‌లో ఆదివారం ఉప్పలూరు లక్ష్మీదేవి (51)ని ఆమె కుమారుడు యశ్వంత్‌రెడ్డి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముచ్చుగుంట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఉప్పలూరు లక్ష్మీదేవి పట్టణంలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు.వీరికి యశ్వంత్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. విజయర్ భాస్కరెడ్డి గతంలో బార్లో పని చేసేవాడు. యశ్వంత్‌రెడ్డి చెన్నైలోని సత్యభామ ఇంజినీరింగ్ కాలేజీలో మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్‌లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. హాస్టల్, కోచింగ్ ఫీజులతో పాటు ఖర్చుల నిమిత్తం లక్ష్మీదేవి ప్రతినెలా అతనికి డబ్బు పంపేవారు. అయితే ఎప్పుడు ఇంటికి రమ్మన్నా వచ్చేవాడు కాదు.అతడికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని, ఆ దిÔశగా ప్రయత్నాలు చేసేవాడని సన్నిహిత వర్గాల సమాచారం. కొన్ని నెలల క్రితం బంధువులు, కుటుంబ సభ్యులు యశ్వంత్‌రెడ్డిని కారులో బలవంతంగా ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. ఆరోగ్యం సరిగా లేదని భావించిన తల్లిదండ్రులు అతనికి నాటు మందు కూడా తినిపించారు. రెండు నెలల పాటు ఇంటి వద్దే ఉన్న యశ్వంత్‌రెడ్డి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇటీవల కుమారుడిని ఇంటికి రమ్మని అనేకసార్లు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయినా అతను రాలేదు. ఇటీవల యశ్వంత్‌రెడ్డి తల్లికి ఫోన్ చేసి హాస్టల్ ఫీజుతో పాటు తన ఖర్చులకు డబ్బు పంపించాలని కోరాడు. ఆమె పంపలేదు. అలా అయినా కొడుకు వస్తాడని తల్లిదండ్రులు భావించారు.ఆదివారం ఉదయాన్నే యశ్వంత్ ప్రొద్దుటూరుకు వచ్చాడు. నేరుగా వంట గదిలో ఉన్న తల్లి లక్ష్మీదేవితో గొడవపడ్డాడు. తండ్రి విజయభాస్కర్‌రెడ్డి బెడ్రూంలో స్నానం చేస్తుండగా గది తలుపులు మూసి గొళ్లెం పెట్టాడు. ఈ క్రమంలోనే వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకొని లక్ష్మీదేవి గొంతుకోశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా ఈడ్చుకొచ్చి వరండాలో పడేశాడు. తర్వాత స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బెడ్రూం తలుపులు తీయడంతో తండ్రి విజయభాస్కర్‌రెడ్డి బయటికి వచ్చాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. కాగా, తల్లిని హత్యచేసిన అనంతరం యశ్వంత్‌రెడ్డి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులుసైతం అవాక్కయ్యారు. -
నకిలీ మద్యం తాగి ఒకరి మృతి
గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్లో ఓ వైన్ షాపు వద్ద మద్యం తాగుతూ బేల్దారి పెద్దన్న (39) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న బేల్దారి పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం ఓ వైన్ షాపులో మద్యం కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న అనధికార పర్మిట్ రూమ్‌లో బండలపై కూర్చొని కొద్ది కొద్దిగా తాగుతుండగా 15 నిమిషాల్లోనే విపరీతంగా మైకం తలకెక్కి కిందకు ఒరిగిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా విపరీతమైన మైకంలో తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత కొందరు వెళ్లి చూడగా పెద్దన్న మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి చిన్న పెద్దక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ సీఐ మనోహర్ చెప్పారు. మద్యం తాగిన వ్యక్తి కుప్పకూలిపోయి చనిపోయాడని తోటి మందుబాబులు, స్థానికులు వైన్ షాపు సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యం తాగడానికి ఏర్పాటు చేసిన బండలను పగులగొట్టారు. కాగా, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు రట్టయిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన నకిలీ మద్యం తాగినందునే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
పిన్నిని ముక్కలుగా నరికి..!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాలువల్లో పడవేశాడు. సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం ఊర్మిళానగర్‌లో విజయలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది.ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఆమె అక్క కుమారుడు వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం భావించాడు. ఆమెపై పగ పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గత బుధవారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.ఆ తరువాత ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం మైనర్ కుమారుడు సహకరించాడు. విజయలక్ష్మిని ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరు చేశారు. వాటిని వేర్వేరు గోనెసంచుల్లో మూటకట్టి ఊర్మిళానగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనపడటం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం గొల్లపూడి పంటకాలువ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో అవి విజయలక్ష్మి శరీరభాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన కుమారుడిని నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవటంతో విచారణ కొనసాగుతోంది. -
లైంగిక వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య
కొమరవోలు(పామర్రు): లైంగిక వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం, కొమరవోలులో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేడపాటి ప్రవీణ్ రాజు, వసంత(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న మెరుగుమాల పవన్ రోజూ వసంతను అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతూ.. రెండు రోజుల నుంచి లైంగికంగా కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. శనివారం రాత్రి బాధితురాలి వద్ద పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తనను పవన్ నిత్యం లైంగికంగా వేధించడం వల్లే విషద్రావణం తాగానని చెప్పిందని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మృతదేహాన్ని పామర్రు–గుడివాడ జాతీయ రహదారిపై ఉంచి కుటుంబీకులు శనివారం రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
కదిరిలో ‘దృశ్యం’ తరహా కేసు.. మిస్టరీ వీడింది
తన కూతురితో పాటు తనపైనా కన్నేసిన ఓ మృగాన్ని భార్య కడతేరిస్తే.. ఆ మృతదేహాం ఆనవాలు కూడా దొరక్కుండా మాయం చేస్తాడు ఓ భర్త. అటుపై ఈ కేసులో కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతగాడు చేసే ప్రయత్నాల ఆధారంగా అటు మలయాళం, ఇటు తెలుగు, మిగతా భాషల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం’ సిరీస్ అలరిస్తూ వస్తోంది. తాజాగా ఒరిజినల్ లాంగ్వేజ్‌లో మూడో పార్ట్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే.. ఈ సినిమా స్ఫూర్తితో చాలా నేరాలు జరగడమూ చూశాం. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోనూ ఈ తరహాలో జరిగిన ఓ నేరాన్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని కనపడకుండా చేశారు ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే.. అల్లుగుండుకు చెందిన అమర్నాథ్ మిస్సింగ్ కేసు రెండేళ్ల తర్వాత సాల్వ్ అయ్యింది. తన భర్త, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఓ మహిళ అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమర్నాథ్ తనను అసభ్యంగా ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆమె రగిలిపోయింది. విషయాన్ని తన భర్త దాదా పీర్‌కు చెప్పి వాపోయింది. దీంతో.. అమర్నాథ్పై కోపంతో రగిలిపోయిన దాదా పీర్.. స్నేహితులు సాధిక్, యాసిన్‌లతో కలిసి అమర్నాథ్ను హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్‌లో పడేశాడు. తాజాగా కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ఆ శ్రీనుగాడి వల్లే.. నన్ను క్షమించు మమ్మీ!
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్‌బషిరాబాద్ పోలీస్‌స్టేషన్ (petbasheerabad police station) పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి (Kompally) పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రైవేట్ ఫైనాన్స్‌లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచ్చిన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీనును కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
ముత్యాలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, బీరు బాటిళ్లతో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలపాడులోని అరుంధతతీయ పాలెంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సుధా, రాముడు, పెంచలయమ్మ అనే ముగ్గురి పై సుమారు 15 మంది దాడికి దిగారు. కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్నెట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్‌బషిరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా ప్రైవేట్ ఫైనాన్స్‌లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచి్చన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీను ను కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజన బాలికపై గ్యాంగ్‌రేప్
పాడేరు: కూటమి పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేదనటానికి ఈ దారుణ సంఘటన మరో ఉదాహరణ. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజులు అత్యాచారం చేశారు. ఈ దారుణంపై సెపె్టంబర్ 13న ఫిర్యాదు చేసినా చింతపల్లి పోలీసులు స్పందించలేదు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్‌కు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆ బాలికతో పాటు గిరిజన నాయకులు బాలకృష్ణ (కాంగ్రెస్), చంటిబాబు (సీపీఐ) తదితరులు కలెక్టరును కలిసి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు.. సెపె్టంబర్ 5న లంబసింగికి చెందిన తెలిసిన మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తనవెంట తీసుకెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక తోటమామిడికి చెందిన యువకుడి బైక్‌పై వారు నర్సీపట్నం వెళ్లారు. అక్కడి నుంచి జి.మాడుగుల మండలం వంజరికి చెందిన యువకుడి కారులో వీరు ముగ్గురు విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో బాలికను బంధించి తోటమామిడి యువకుడు, వంజరి యువకుడు 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. నాలుగో రోజు నర్సీపట్నం తీసుకొచ్చి లాడ్జిలో ఉన్నారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడితో బాలికకు రూ.100 ఇప్పించి, అక్కడి నుంచి పరారయ్యారు. ఆ బాలిక సెపె్టంబర్ 12న కుటుంబ సభ్యులకు నర్సీపట్నం నుంచి ఫోన్ చేసి, జరిగిన దారుణాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు సెపె్టంబర్ 13న చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చారు. అయినా పోలీసులు రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కలెక్టర్‌ను కోరారు. అనంతరం విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. -
అల్లరి చేస్తోందని.. చేతులు విరిచి.. ట్యాంకులో పడేసి.. ఏడేళ్ల బాలిక హత్య
సాక్షి,హైదరాబాద్: మాదన్న పేట బాలిక హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏడేళ్ల బాలిక అల్లరి చేస్తుందనే కారణంతో మేనమామ,అత్త కిరాతకంగా ప్రాణాలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో బాలికను నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్‌లో పడేశారు. అయితే, బాలిక తల్లితో నిందితులకు గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు, పాప అల్లరి చేయడం తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక గత వారం తన తల్లితో కలిసి మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మొన్న సాయంత్రం ఇంట్లో నుండి బయటకి వెళ్లిన బాలిక ఆచూకీ గల్లంతయ్యింది. చీకటి పడుతున్న పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక తల్లి, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ప్రమాదవ శాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి వాటర్ ట్యాంక్‌లో నీర్జీవంగా ఉన్న బాలిక మెడ, నోరు, చేతులు అనుమానాస్పద గుర్తులు ఉండటం, చేతులు వెనక్కి విరిచి ఉండడంపై పోలీసులు బాలికది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో విచారణలో నిర్ధారించారు. కుటుంబ సభ్యుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో బాలిక మేనమామ,అతని భార్య తీరు అనుమానాస్పదంగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టగా దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసింది మేనమామ,అత్తేనని గుర్తించారు. -
జాతర కోసం వచ్చి..రైల్వే ట్రాక్‌పై రీల్స్? స్పాట్లోనే నలుగురూ!
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్‌తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.బీహార్‌లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్‌పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్కు చెందినవారు.శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్‌ప్రెస్) రన్‌ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్‌లోని అనేక చోట్ల రైల్వే అండర్‌పాస్, ఓవర్‌బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్‌లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. -
బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు..
భర్త పెట్టిన చిత్రహింసలను మౌనంగా భరించింది. మానసికంగా, భౌతికంగా హించించినా ఓర్చుకుంది. పరాయి మహిళలతో తన పెనిమిటి పాడు సంబంధాలు పెట్టుకున్నా ఊరుకుంది. కానీ పరాయి మగాళ్ల కోరిక తీర్చాలని తనను భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్తకు తోడు అతడి కుటుంబ సభ్యులు కూడా గలీజు పనులు చేయమని పోరు పెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని పుట్టెనహళ్లిలో (Puttenahalli) వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. 2024, డిసెంబర్లో సయ్యద్ ఇనాముల్ హక్ అనే వ్యక్తితో బాధితురాలికి పెళ్లి జరిగింది. వివాహ సమయంలో 340 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక యమహా బైక్‌ను ఇచ్చారు. పెళ్లైన కొద్దిరోజులకే వరుడి అసలు రూపం బయటపడింది. అతడికి అప్పటికే పెళ్లయిందని, తాను రెండో భార్యనని తెలిసి బాధితురాలు హతశురాలయింది. అంతేకాదు తనకు 19 మంది పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని స్వయంగా భర్త చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలయింది.అతడి ఆగడాలు అక్కడితో ఆగలేదు. బెడ్రూంలో సీక్రెట్ కెమెరా (Secret Camera) పెట్టి రికార్డు చేసిన వీడియోలను విదేశాల్లోని తన స్నేహితులకు పంపించాడని బాధితురాలు వెల్లడించింది. వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని, తాను ఒప్పుకోకపోవడంతో.. ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్టు పోలీసులకు ఆమె తెలిపింది. ఇంటా, బయట తనను పదేపదే చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది.ఫ్లాట్ (Flat) కొనడానికి తన బంగారు నగలను అమ్మమని అతడు ఒత్తిడి తెచ్చాడని, తాను నిరాకరించడంతో తనపై దాడి చేశాడని ఆమె చెప్పింది. అత్తమామలతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 21న బాధితురాలిపై దాడి చేసి నిందితుడు పారిపోయాడు. అతడితో పాటు కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఇంకా పట్టుబడలేదని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని, అతడి బారి నుంచి మహిళలను కాపాడాలని పోలీసులను బాధితురాలు ప్రాధేయపడింది.చదవండి: 'నా కుమారుడిని వదలనంటున్న లేడీ గాడ్సే' -
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్‌పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్‌లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
‘నా కొడుకుని వదలనంది..’ పూజపై అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలు
యూపీ యువ వ్యాపారి అభిషేక్ గుప్తా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హిందూ మహాసభ(ABHM) నేత పూజా శకున్ పాండే భర్త అశోక్ పాండేను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలకు దిగాడు. వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని చెబుతున్నాయాన. అలీఘడ్‌లో ఓ బైక్ షోరూమ్ ఓనర్ అయిన అభిషేక్ గుప్తా(30) సెప్టెంబర్ 23వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, కజిన్‌తో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అబిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) భర్తను అశోక్‌ను, కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. పూజతో తన కొడుక్కి వివాహేతర సంబంధం ఉందని, దాని నుంచి బయటపడే క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యాడని అభిషేక్ తండ్రి ఆరోపిస్తున్నారు. సుపారీ హంతకుడికి డబ్బులు చెల్లించి ఆ జంట ఈ హత్య చేయించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ వచ్చిన అలీఘడ్ పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తునకు సిద్ధమయ్యారు.అభిషేక్ తండ్రి ఏమన్నారంటే.. పూజా శకున్ పాండేకి, తన కొడుకుకి మధ్య వివాహేతర సంబంధం ఉందని నీరజ్ గుప్తా మీడియాతో చెప్పారు. ‘‘నా చిన్న కొడుకు వివాహ సమయంలో ఆమె(పూజా శకున్) నానారచ్చ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అభిషేక్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయాన్ని అతను నా భార్య(అభిషేక్ తల్లి)కి చెప్పాడు. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడ పూజను వివాహం చేసుకుంటాడో మేం అని ఆందోళన చెందాం. చివరకు ఆమె నెంబర్ బ్లాక్ చేసి దూరం పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలోనూ ఆమె మాతో గొడవ పెట్టుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంది. అంతేకాదు.. అభిషేక్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలోనూ తనను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ మమ్మల్ని బెదిరించింది అని సంచలన ఆరోపణలు చేశాడాయన. నిందితుడి అరెస్ట్‌తో.. ఈ నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు.. అందరినీ విచారించారు. చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. అభిషేక్ గుప్తాను కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్‌ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3 లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త ఇద్దరూ అభిషేక్ ఫొటో చూపించారని, రూ.1 లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్య చేసినట్లు ఫజల్ అంగీకరించాడు. దీంతో అశోక్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజా, ఫజల్‌కు సహకరించిన అసిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అభిషేక్ తండ్రి మాకు బాకీ ఉన్నాడుఅరెస్ట్ సమయంలో అశోక్ పాండే మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసని, అతను తమ దగ్గరే ఉండి చదువుకున్నాడని, అతని కోసం తాము చాలా చేశామని చెప్పాడు. అంతేకాదు.. అభిషేక్ తండ్రి తమకు రూ.10 లక్షల బాకీ ఉన్నాడని, అందుకే తమను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆరోపించాడు. పోలీసులేమన్నారంటే.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు నియమించామని, అభిషేక్ తండ్రి చేస్తున్న ఆరోపణలు ఇంకా ధృవీకరణ కావాల్సి ఉందని తెలిపారు. ఫజల్ అరెస్టును ధృవీకరించిన పోలీసులు.. పాండే దంపతులకు ఫజల్ చాలా కాలంగా తెలుసన్నారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన దేశీ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరీ పూజా శకున్?పూజా శకున్ పాండే.. యూపీ హిందూ మహాసభ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఉమా భారతితో పాటు పలువురు బీజేపీ పెద్దలకు ఆమె బాగా దగ్గర. ఓ వర్గాన్ని ఊచకోత కోయాలంటూ గతంలో ఆమె ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది. తనను తాను లేడీ గాడ్సే(Lady Godse)గా అభివర్ణించుకుంటుందామె. అంతేకాదు. గతంలో జాతి పిత మహత్మా గాంధీని దూషించడం.. గాడ్సేను మహానుభావుడిగా కీర్తించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. హిందూ కోర్టు పేరుతో అలహాబాద్, మీరట్‌లలో ఆమె, ఆమె భర్త కలిసి పలు పంచాయితీలు నిర్వహించారామె. ఇది పోలీసుల దాకా చేరడంతో.. వాళ్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..2018 గాంధీ వర్ధంతిన ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాడ్సేని దేవుడిగా అభివర్ణిస్తూ ఆమె పూజలు చేసి స్వీట్లు పంచింది. అలాగే.. గాంధీ ఫొటోకు తుపాకీ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవేళ గాడ్సే గనుక చంపకపోతే నేనే చంపేదాన్ని అంటూ అసంబద్ధమైన వ్యాఖ్య ఒకటి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదు కావడంతో.. కొన్నిరోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదీ చదవండి: 50 కోట్ల ఇన్సూరెన్స్.. భార్యాభర్తల నడుమ హైడ్రామా -
చిత్తూరు దేవళం పేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత
సాక్షి, చిత్తూరు: సాక్షి, చిత్తూరు: వెదురుకుప్పం మండలం దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడి అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో స్థానిక సర్పంచ్ ఆధ్వరంలో దళిత సంఘాలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ నిరసనలకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కృపాలక్ష్మీ అక్కడికి చేరుకుని దళిత సంఘాల నేతలకు సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు స్థానికులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ.. నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు. దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలి లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గత అర్ధరాత్రి ఎవరో నిప్పు పెట్టారు(Ambedkar Statue fire Incident). అయితే.. టీడీపీ నేత సతీష్ నాయుడు(TDP Leader Satish Naidu), అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విగ్రహానికి నిప్పు పెట్టినవాళ్లను అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి -
జుబీన్ గార్గ్ మేనేజర్ సహా ఇద్దరి అరెస్ట్
గౌహతి: సింగపూర్‌లో సెప్టెంబర్ 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గాయకుడు జుబీన్ గార్గ్ ఉదంతంపై దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఘటనపై అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతాను బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి జుబీన్ మరణానికి కారణమయ్యారన్న ఆరోప ణలపై కేసులు నమోదు చేసింది. వీరిని వెంటనే గౌహతికి తరలించి కామ్రూప్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దసరా సెలవులు కావడంతో జడ్జి ఇంటి వద్దే వీరిని హాజరు పర్చామని సిట్ చీఫ్ సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా ప్రసాద్ గుప్తా చెప్పారు. శర్మ, మహంతాలపై ఇప్పటికే ఇంటర్‌పోల్ ద్వారా లుకౌట్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నెల 6వ తేదీలోగా వీరిని తమ ఎదుట హాజరు కావాలని కోరామని ఆయన తెలిపారు. దీంతో, సింగపూర్ నుంచి మహంతా ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదు పులోకి తీసుకుని సమాచారమిచ్చారన్నారు. గుప్తా జాడ కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశామని, చివరికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో ఉండగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతోపాటు, జుబీన్ ఫోన్‌ను కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు విచారణ చట్ట ప్రకారం సాగుతుందని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయంలో కటకటాల వెనుక మహంతా, శర్మలు చేతులకు బేడీలతో ఉన్న ఫొటో లను సిట్ ఆన్లైన్లో షేర్ చేసింది. గౌహతి విమానాశ్రయం నుంచి జడ్జి ఇంటికి వీరిని తరలించే సమయంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ కూడా కాన్వాయ్‌ను అనుసరించింది. సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివ ల్కు మహంతా మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జుబీన్ హాజర య్యారు. అప్పుడే, సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో జుబీన్ గార్గ్ చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం అసోం ప్రభుత్వం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తాజాగా మహంతాపై అసోం ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. మహంతా, శర్మల అరెస్ట్‌పై జుబీన్ భార్య గరిమా సైకియా గర్గ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జుబీన్ మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలని తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు దర్యాప్తు సజావుగా సాగుతుందన్న విశ్వాసం గరిమా వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన వేగం
పహాడీషరీఫ్: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయాలపాలయ్యాడు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రాజేంద్రనగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన కొండ రామకృష్ణ కుమారుడు అరుణ్ (24) సాయంత్రం 6.30 గంటలకు తన పల్సర్ బైక్ (టీజీ 08సి 4722)పై పెద్ద గోల్కొండలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో హర్షగూడకు చెందిన ఇస్లావత్ నరేష్ కుమారుడు, స్కూల్ బస్సు క్లీనర్‌గా పనిచేసే మోహన్ (18), రమావత్‌నర్స్ కుమారుడు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధూ(17), ఇస్లావత్ సేవ్య కుమారుడు సింహాద్రి (17) యూనికార్న్ బైక్ (టీఎస్07జేఏ 9052)పై పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు హర్షగూడ నుంచి తుక్కుగూడకు వస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వెళ్తున్న వీరి బైక్‌లు.. అవుటర్ సర్వీస్ రోడ్డులోని పీవీఆర్ క్రికెట్ గ్రౌండ్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అరుణ్‌తో పాటు యూనికార్న్ నడిపిన సిద్ధూ, వెనుక కూర్చున్న మోహన్‌లు దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. సింహాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్‌రెడ్డి, ఎస్ఐ దయాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన సింహాద్రిని వెంటనే ఆస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మోహన్, సిద్ధూ వరుసకు బావ బావమరుదులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదంగా ముగిసిన మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు
సాక్షి,హైదరాబాద్: మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్‌లో విగత జీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక నిన్న తల్లితో పాటు మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తంమైన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు వెళ్లమని.. భారత్‌కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు. -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్‌తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి.


