అడ్డొచ్చిన పెద్ద కుమారుడిపై దాడి.. తీవ్రగాయాలు
ధరూరు: దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు భార్య హత్యకు దారితీసింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడు గ్రా మానికి చెందిన కుర్వ గోవిందు– జమ్ములమ్మ (28) దంపతులకు ఇద్దరు కుమారులు. గురువారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారుజామున వారి మధ్య చిన్నపాటి గొడవ జరి గింది.
మాటామాట పెరిగి కొట్టుకునే స్థితికి దారి తీయగా.. పెద్ద కుమారుడు మల్లికార్జున్ సర్దిచెప్పేందు కు ప్రయత్నించగా.. తండ్రి అతడిని కట్టెతో కొట్ట డంతో తీవ్ర గాయాల య్యాయి. ఈ క్రమంలో జమ్ములమ్మ గటిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
భార్య జమ్ములమ్మ బయటకు పరుగులు తీయగా.. గోవిందు జమ్ములమ్మను వెంటాడి అందరి ముందే కట్టెతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న రేవులపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోవిందును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ధరూరు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.


