Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Aarogyasri suspends services to patients due to non payment of dues1
కుప్పం నుంచి కుట్రలకు క్లాప్‌!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్‌’ (డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్‌ ద్వారా మెడికల్‌ కాలేజీల్లోని హబ్‌లతో పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది. గతంలో అందించిన టెలీ మెడిసిన్‌ సేవలకే కలరింగ్‌ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్‌ క్లినిక్స్‌కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్‌’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనా­నికి టెండర్‌ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్‌’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ‘డింక్‌’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ‘డింక్‌’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్‌ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్‌ క్లినిక్‌లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్‌ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టు­లు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్‌ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్‌ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజె­క్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ‘డింక్‌’ ప్రాజెక్టు ఏమిటంటే..?‘డింక్‌’ పేరిట కుప్పంలో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌ జారీచేసి ఈ సెంటర్‌ ద్వారా ఫోన్‌లో స్పెషలిస్ట్‌ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్‌ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్‌లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సల­హాలు, సూచనలు ఇస్తుంటారు. స్థూలంగా చెప్పాలంటే ‘డింక్‌’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్‌ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. టెలీ మెడిసిన్‌తో అంతకంటే మెరుగ్గా..గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్‌ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్‌సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియా­ట్రిక్స్‌ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్‌ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్ల సేవలు అందుబా­టులో ఉంచింది. పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యు­లను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్‌ సూచించేవారు. పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు. స్మార్ట్‌ఫోన్‌ లేనివారు, విని­యోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయప­డ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశా­వర్క­ర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్‌ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్‌ సేవలు పారదర్శకంగా అందాయి.నాడు దేశానికే ఆదర్శంగా..నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్‌ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్‌లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.ప్రివెంటివ్‌ కేర్‌ బలోపేతం.. వైఎస్‌ జగన్‌ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్‌ కేర్‌ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్‌సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు/ఒక పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు. అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ను నెలకొల్పారు.వైద్యులే ప్రజల వద్దకు..వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవే­శ­పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు. ఇందులో భాగంగా ఊరూ­వాడా స్పెషలిస్ట్‌ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్ర­స్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్‌ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది.

Telangana Speaker Gaddam Prasad Notices To Party Changed MLAs2
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు.. బీఆర్‌ఎస్‌కు ప్లస్‌?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్‌ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్‌. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్‌కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్‌కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది.

US Trump Says Getting Zelensky-Putin Together Like Mixing Oil And Vinegar3
వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్‌

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని ట్రంప్‌ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్‌-జెలెన్‌స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా క‌ష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్‌-జెలెన్‌స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. నూనె వెనిగర్‌ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వారిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఒకవేళ సమావేశం జరగకపోతే, ఎందుకు సమావేశం కాలేదో అందుకు గల కారణాలను తెలుసుకుంటానని అన్నారు. శాంతి చర్చలకు రష్యా ఒప్పుకోని క్రమంలో మాస్కో మరోసారి భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు.Q: “How long will you give Putin?”Trump: “A couple of weeks. We’re going to figure this out. It takes two to tango… In the meantime, people continue to die.”Trump is NEVER going to hold Putin accountable. Ever.pic.twitter.com/TusMVxEIXk— Republicans against Trump (@RpsAgainstTrump) August 22, 2025అయితే ఇరు దేశాలూ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రజలను చంపుకుంటూనే ఉన్నారు. ఇది చాలా మూర్ఖత్వం. యుద్ధం వల్ల వారానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ముందు 5,000 అన్నాను కానీ ఇప్పుడు 7,000 మంది వారానికి చనిపోతున్నారు. అందులో ఎక్కువ మంది సైనికులే ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లో ఒక అమెరికన్‌ కర్మాగారం దెబ్బతిన్నట్టు వచ్చిన వార్తపై స్పందిస్తూ ట్రంప్‌ స్పందించారు. రష్యా దాడుల విషయంలో తాను సంతోషంగా లేనని చెప్పారు. తాను ఏడు యుద్ధాలను పరిష్కరించానని చెప్పారు. మొత్తం 10 యుద్ధాలు ఆపిన తాను ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో అస్సలు సంతోషంగా లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్- పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇండియా–పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని తాను నివారించానని ట్రంప్‌ పేర్కొన్నారు.

OTT: Maaman Movie Review in Telugu4
ఎమోషనల్‌ స్టోరీ మామన్‌ మూవీ రివ్యూ

మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్‌తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్‌’. ఓటీటీలో సూపర్‌ హిట్‌ మూవీఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్‌ పాండ్యరాజన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్‌ సూపర్‌ హిట్‌. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్‌ యాక్షన్‌ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్‌ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review). కథ‘మామన్‌’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. ఎలా ఉందంటే?అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్‌ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్‌’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌.– హరికృష్ణ ఇంటూరు

Under Suryakumar Yadavs captaincy, India can dominate Asia once again: Virender  Sehwag5
'ఆసియాక‌ప్ గెలిచేది ఆ జ‌ట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం

ఆసియాక‌ప్‌-2025 మ‌రో రెండు వారాల్లో తెర‌లేవ‌నుంది. ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబ‌ర్ 8 నుంచి యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌గా బ‌రిలోకి దిగ‌నుంది.శుబ్‌మ‌న్ గిల్‌, జ‌స్ప్రీత్ బుమ్రా తిరిగి రావ‌డంతో టీమిండియా అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా క‌న్పిస్తోంది. ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో సెప్టెంబ‌ర్ 10న దుబాయ్ వేదిక‌గా యూఏఈతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.భార‌త జ‌ట్టు మ‌రోసారి ఆసియాక‌ప్ విజేత‌గా నిలుస్తుంద‌ని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024 త‌ర్వాత రోహిత్ శ‌ర్మ నుంచి భార‌త జ‌ట్టు ప‌గ్గాల‌ను చేప‌ట్టిన సూర్య‌కు కెప్టెన్‌గా ఇదే తొలి మ‌ల్టీనేష‌న‌ల్ టోర్న‌మెంట్‌."ఆసియాక‌ప్‌న‌కు యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఫియర్ లెస్ కెప్టెన్సీలో టీమిండియా మరోసారి ఆసియాకప్‌లో ఆధిపత్యం చెలాయించే అవకాశముంది.సూర్య ఆలోచన విధానం టీ20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది. జట్టు మొత్తం అదే వైఖ‌రి క‌న‌బ‌రిస్తే టీమిండియా మ‌రోసారి అసియాక‌ప్ ఛాంపియ‌న్స్‌గా నిలుస్తుందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్'రాగ్‌రాగ్‌మే భారత్'లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్‌- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్‌ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ గ్రూప్‌-బి నుంచి తలపడతాయి.ఆసియా కప్‌ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్‌.చదవండి: చిన్నస్వామిలో క్రికెట్‌ బంద్‌!

Trump Political Aide Sergio Gor as India Ambassador6
ట్రంప్‌ మరో ఎత్తుగడ: భారత రాయబారిగా సన్నిహితుడు సెర్గియో గోర్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను తనదారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ పై తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్‌ ఇప్పుడు తన దగ్గరున్న మరో అ‍స్త్రం ప్రయోగించారు. భారత్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్‌లో తమ దేశ రాయబారిని మారుస్తూ అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారు.భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా పరిణమంచింది. వైట్ హౌస్‌లో తనకు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ డైరెక్టర్ గా ఉన్న సెర్గియో గోర్ ను ట్రంప్‌ భారతదేశ నూతన రాయబారిగా నియమించారు. చమురు కొనుగోలు తదితర అంశాలలో భారత్‌ రష్యా బంధం బలపడుతున్న సమయంలో ట్రంప్‌.. సర్గియోకు నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ఈ పదవి ఖాళీ అయిన ఎనిమిది నెలల తర్వాత ఈ తాజా నియామకం జరిగింది. సెర్గియో గోర్ అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత విధేయునిగా పేరుగాంచాడు. భారత రాయబాది సెర్గియో గోర్ నియామకాన్ని తన ట్రూత్ సోషల్‌లో తెలియజేసిన ట్రంప్‌ త్వరలోనే ఆయన పరిపాలనా విభాగంలో చేరనున్నారని ప్రకటించారు. సెర్గియో గోర్ దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ఆయనను స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ సెంట్రల్ ఏసియన్ ఎఫైర్స్‌గా ట్రంప్‌ నియమించారు. ఆయన భారత్‌కు వెళ్లేంతవరకు వైట్‌హౌస్‌లోనే తన పాత విధులను నిర్వహిస్తారని ట్రంప్ ఆ పోస్ట్ లో తెలియజేశారు.సెర్గియో తనకు అత్యంత సన్నిహితునిగా ఉన్నారని, చాలా కాలంగా తనకు మద్దుతునిస్తూ, తాను ఎన్నికల్లో గెలిచేందుకు అమితమైన కృషి చేశారని తెలిపారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా సెర్గియో పాత్ర చాలా కీలకమైనదని ట్రంప్ పేర్కొన్నారు. తాను పాలనలోకి అడుగుపెట్టాక సెర్గియో ఎన్నోమంచి పనులు చేశారన్నారు. ఆయన తన బృందంలో నాలుగువేల మంది దేశ భక్తులను నియమించుకున్నారని,ఫెడరల్‌ ప్రభుత్వ శాఖల్లోని 95 శాతం ఉద్యోగాలను ఆయన భర్తీ చేశారన్నారు. అతి పెద్ద జనాభా కలిగిన భారత దేశంలో అమెరికా ఎజెండాను పూర్తి చేసేందుకు సెర్గియో తోడ్పడతారని ట్రంప్ పేర్కొన్నారు.

Married Daughters have Equal Rights Under Hindu Succession Act 2005 Amendment7
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?

సాధారణంగా పెళ్లైన కుమార్తెలకు తండ్రి, తల్లి, తాతల ఆస్తిలో వాటా ఉండదనే అభిప్రాయాలుంటాయి. ఎలాగో పెళ్లి అయిపోయింది కదా ఆమె భర్త, మామలకు చెందిన ఆస్తులపైనే తనకు హక్కులుంటాయనే వాదనలున్నాయి. కానీ హిందూ వారసత్వ చట్టం 1956ను 2005లో సవరించకముందు వరకు ఇదే తంతు ఉండేది. కానీ ఇలాంటి అంశాలపై స్పష్టత ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించారు. అయితే ఇప్పటికీ చాలామందిలో దీనికి సంబంధించి అవగాహన ఉండకపోవచ్చు. సవరణ చట్టంలోని కుమార్తె ఆస్తి హక్కుల గురించి కింద తెలియజేశాం.2005లో ఈ చట్టం సవరణకు ముందు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కుమారులకు మాత్రమే ఉండేది. కుమార్తెలు కుటుంబంలో భాగమైనప్పటికీ సహ-భాగస్వాములుగా(ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు ఉన్న హిందూ ఉమ్మడి కుటుంబానికి చెందిన సభ్యులు) గుర్తించబడలేదు. అయితే, హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 వివాహిత కుమార్తెలకు కుమారులతో సమానమైన హక్కులను ఇచ్చింది. అంటే వివాహమైన కుమార్తెలకు వారి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. ఈ మార్పు సవరణ తర్వాత జన్మించిన ఆడపిల్లలకే కాకుండా 2005కు ముందు జన్మించిన వారికి కూడా రెట్రోస్పెక్టివ్ హక్కులను కల్పిస్తుంది.తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?తల్లి సొంతంగా సంపాదించిన ఆస్తిని కాస్త భిన్నంగా పరిగణిస్తారు. తల్లి అకాల మరణం చెందితే (వీలునామా లేకుండా) ఆమె ఆస్తిని చట్టబద్ధమైన వారసులకు సమానంగా పంచాలి. ఇందులో కుమారులు, కుమార్తెలు పరిస్థితిని బట్టి కొన్నిసార్లు భర్త కూడా ఉంటారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వివాహిత కుమార్తెలను క్లాస్ 1 వారసులుగా పరిగణిస్తారు. అంటే వారు తమ తల్లి ఆస్తిని వారసత్వంగా పొందడానికి సమాన హక్కు కలిగి ఉంటారు. కుతురుకు వివాహం అయినా తల్లి ఆస్తిలో కుమారులతో సమానంగా వాటా ఉంటుంది.అపోహలుసాధారణంగా వివాహం తర్వాత కుమార్తెకు తమ పూర్వీకుల ఆస్తిపై హక్కు రద్దు అవుతుందని అనుకుంటారు. కుమార్తెలు తమ తండ్రులు లేదా తాతలు వారసత్వంగా పొందిన ఆస్తిలో వాటాను పొందలేరని భావిస్తారు. అయితే హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ ప్రకారం దీని అమలుకు ముందు వివాహం చేసుకున్నప్పటికీ, పూర్వీకుల ఆస్తిపై కుమార్తెలకు సమాన హక్కు ఉందని స్పష్టం చేస్తుంది.ఆస్తి వివరాల్లో స్పష్టత వచ్చిన తర్వాత దాని హక్కులను, వారసత్వాన్ని క్లెయిమ్ చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. ఇందులోని న్యాయ ప్రక్రియను అర్థం చేసుకోవడం, సజావుగా క్లెయిమ్ చేయడం చాలా అవసరం.మ్యుటేషన్ ప్రక్రియఆస్తి హక్కును నిర్ధారించడంలో మొదటి దశ ఆస్తి రికార్డుల మ్యుటేషన్. కొత్త యజమానులను (కుమార్తెలతో సహా) ప్రతిబింబించేలా భూ రికార్డులను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్ దరఖాస్తును స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమర్పించవచ్చు.వారసత్వ ధ్రువీకరణ పత్రంబ్యాంకు ఖాతాలు లేదా బీమా పాలసీలు వంటి మృతుడి ఆస్తి చరాస్తులుగా ఉన్న సందర్భాల్లో వారసత్వ ధ్రువీకరణ పత్రం అవసరం కావచ్చు. మృతుడి ఆస్తిపై వారసుల హక్కు ఉందని పేర్కొంటూ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.సివిల్ కోర్టువివాదం కేసుల్లో లేదా కుటుంబ సభ్యులు కుమార్తె వాటాను అంగీకరించడానికి నిరాకరిస్తే కేసును సివిల్ కోర్టుకు తీసుకెళ్లవచ్చు. ఆస్తిలో న్యాయమైన వాటాను పొందడానికి హిందూ వారసత్వ చట్టం నిబంధనల ప్రకారం చట్టపరమైన దావా వేయవచ్చు.ఇదీ చదవండి: మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక

body shaming Ghaziabad woman alleges husband NoraFatehi obsession8
ఈ జబ్బుకి మందు కనిపెట్టండి ప్లీజ్‌!

భార్యను బాడీ షేమింగ్‌ చేయడంఎప్పటి నుంచో ఉంది. శరీర ఆకృతిని బట్టి పేర్లు పెట్టి పిలుస్తూ వేధిస్తారు భర్తలు. తాజాగా ఒక భర్త మరీ శృతి మించాడు. భార్యను నోరా ఫతేహీలా మారమని రోజుకు మూడు గంటలు జిమ్‌ చేయిస్తున్నాడు. జిమ్‌ చేయలేని రోజు పస్తు పెడుతున్నాడు. గర్భం వస్తే అబార్షన్‌కూ వెనుకాడటం లేదు. ఘజియాబాద్‌లో ఆ భార్య పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ‘ఈ భర్త నాకు వద్దు’ అని ఫిర్యాదు చేసింది.అంతా నచ్చి, అన్నీ చూసి వివాహం చేసుకున్నాక భర్తలకు వస్తున్న ఈ పాడు జబ్బుకు మందు వెతకాలి. భార్య పొట్టిగా ఉంటే ఒక నిక్‌నేమ్, సన్నగా ఉంటే మరొకటి, నల్లగా ఉంటే... లావుగా ఉంటే... పొడవుగా ఉంటే... పలు వరుస సరిగా లేకపోతే... జుట్టు పలుచగా ఉంటే... శరీర అంగాలు పెద్దవో చిన్నవో ఉంటే... భర్తలు వాటిని కేంద్రంగా చేసుకుని నిక్‌నేమ్స్‌తో పిలుస్తూ ఇంట్లో, పిల్లల ఎదుట, బంధువుల సమక్షంలో ఆట పట్టించడం ఆనవాయితీ. దీనికి అంగీకారం ఉండటం మన సంప్రదాయం. ఆ నిక్‌నేమ్స్‌ ఏదో సరదాగా పెట్టినట్టు అనిపించినా, భర్త అలా పిలవడంలో ఏదో గారాబం కనిపించినా, ఆ పేర్లన్నీ భార్యను బాడీ షేమింగ్‌ చేసేవే. భార్య తన భర్తకు నిక్‌నేమ్‌ పెట్టదు. పెట్టలేదు. పెట్టి నలుగురిలో పిలిస్తే పర్యవసానాలు మనకు తెలుసు. కాని భర్తలు మాత్రం భార్యలను బాడీ షేమింగ్‌ చేయడం తమ హక్కుగా భావిస్తూ ఉంటారు.ఫిట్‌నెస్‌ వేరు... అందం వేరుభార్యాభర్తలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాల్సిందే. పిల్లలు పెరిగి ఒక వయసు వచ్చాక శారీరక మార్పులు స్త్రీ, పురుషుల్లో వస్తాయి. ఫిట్‌నెస్‌ కోసం కనీస వ్యాయామం, వాకింగ్, ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ఇరువురూ పాటించాల్సిందే. భార్య ఫిట్‌నెస్‌ కోసం భర్తలు సూచనలు చేయడం, వ్యాయామం కోసం ప్రోత్సహించడం మంచి విషయం. కాని సౌందర్యాభిలాషతో, ఇతర స్త్రీలతో పోలుస్తూ... ఈ విధంగా ఉంటే నువ్వు బాగుంటావు... లేకుంటే నచ్చవు అనే సందేశం ఇస్తున్నట్టుగా మాట్లాడటం ఆమెను హింసించడమే. జన్యువుల వల్ల, శరీర తత్వం వల్ల కొందరు స్త్రీల శరీరంలో వ్యాయామంతో తగ్గని బరువు ఉండొచ్చు. లేదా కాన్పుల వల్ల, మెనోపాజ్‌ వల్ల కూడా తీవ్రమైన మార్పులు రావచ్చు. వాటిని అర్థం చేసుకుని, భార్య ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి తప్ప అనునిత్యం కించ పరుస్తూ ఉంటే తప్పు,.. నేరం కూడా. కాని భర్తలు ఈ విషయంలో మారడం లేదు. సొంత పిల్లల ఎదుట కూడా భార్యను గేలి చేస్తూ పిల్లలు ఆమెను తేలిగ్గా తీసుకునేలా చూస్తున్నారు.నోరా ఫతేహీలా ఉండుకాని ఆగస్టు 20వ తేదీన ఒక భార్య ఆవేదన ఇలాంటి భర్తల స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఒక వివాహిత అక్కడి మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి భర్త మీద కేసు పెట్టింది. ఆమె తన ఫిర్యాదులో– ‘నేను ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నాను. నా భర్త ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌. పెళ్లిలో మా వాళ్లు 6 లక్షల బంగారం, 24 లక్షల స్కార్పియో, 10 లక్షల రొక్కం ఇచ్చారు. కాని పెళ్లయి వచ్చినప్పటి నుంచి నన్ను నా భర్త నోరా ఫతేహీ ఫిగర్‌లాంటిది సాధించాలని వేధిస్తున్నాడు. ఇందుకోసం నాకు రోజుకు 3 గంటల వర్కవుట్‌ చెప్పి చేయిస్తున్నాడు. ఆ వర్కవుట్లు చేసి అలసి ఏ రోజైనా చేయకపోతే ఆ రోజు నాకు అన్నం పెట్టడం లేదు. అత్తామామలు కూడా అతనికి వంత పాడుతున్నారు. నేను చూడటానికి బాగానే ఉంటాను. కాని అతను అది చాలదని, పిల్లలు కూడా ఇప్పుడే వద్దని, గర్భం వస్తే అబార్షన్‌ చేయించుకోవాలని చెబుతూ నన్ను భయభ్రాంతం చేస్తున్నాడు. ఈ భర్త వద్దు’ అని ఫిర్యాదు చేసింది.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఆరోగ్యం, అనురాగంభార్యాభర్తల మధ్య ఉండాల్సింది అనుబంధం, అనురాగం, గౌరవం. వారిరువురూ తమ బంధాన్ని బలపరుచుకుంటూ పరస్పరం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జీవిస్తే రూపం సమస్య కాబోదు. రూపదోషాల నిర్వచనం ఒకరి సొత్తు కాదు. కొలతలతో ఉండేదే ఆకృతి కాదు. సంతోషకర దాంపత్యమే అందం, ఆనందం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్‌ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!

ysrcp Leaders Questioned By land For Andhra Jyothi In Visaka9
కోట్ల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి ఎలా ఇస్తారు?

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని విలువైన స్థలాలను కారుచౌకగా అనుయాయులకు అప్పగిస్తున్న కూటమి ప్రభుత్వం, తాజాగా తన తోకపత్రిక ఆంధ్రజ్యోతికి అర ఎకరం హౌసింగ్‌ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలన్న ప్రయత్నం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కోట్లాది రూపాయల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారంటూ శుక్రవారం కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు.వివరాల్లోకి వెళితే, పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీలోని అర ఎకరం స్థలం కేటాయింపు అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్‌ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్‌ అజెండాను నాలుగైదు రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కేటాయింపును రెగ్యులర్‌ అజెండాలో చేర్చకుండా టేబుల్‌ అజెండాగా, అదీ చివరి 67వ అంశంగా ఆఖరు నిమిషంలో కౌన్సిల్‌ ముందుకు తెచ్చారు.అనంతరం టేబుల్‌ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. చివరి నిమిషంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు 67 వ అంశాన్ని తిరిగి ప్రస్తావించారు. ఇంతటి కీలక అంశాన్ని టేబుల్‌ అజెండాగా చేర్చి, ఎలా ఆమోదింపజేస్తారంటూ గట్టిగా నిలదీశారు. దీనితో తప్పనిసరి పరిస్థితిల్లో 67వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్‌ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా, ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరా ధర దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.గతంలోనూ కారుచౌకగా కేటాయింపు, రద్దు చేసిన వైఎస్సార్‌సీపీ.. వాస్తవానికి 2017లో ఇదే ప్రాంతంలో రూ.7.26 కోట్లు విలువ చేసే స్థలాన్ని రూ.50.50 లక్షలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయించింది. ఆ కేటాయింపును గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు బాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు భూమిని అతి తక్కువ ధరకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Actor Sarathkumar Comments On Vijay thalapathy10
విజయ్‌ విమర్శలకు శరత్‌కుమార్‌ కౌంటర్‌

మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రచ్చకెక్కాయి. తాను సింగిల్‌గానే 2026లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కూటమి వర్గాలపై విమర్శలు చేశారు. దీంతో అక్కడి అన్ని పొలిటికల్‌ పార్టీలు విజయ్‌పై ముప్పెట్ట దాడి చేసేందుకు దిగాయి.విజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ నేత, నటుడు శరత్‌కుమార్‌ రియాక్ట్‌ అయ్యారు. సిద్ధాంత పరంగా విజయ్‌ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మిస్టర్‌ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆపై అన్నాడీఎంకే నేతలు కూడా ఫైర్‌ అయ్యారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్‌, జయలలితలు కాలేరని ఎద్దేవాచేశారు.దివంగత నటుడు విజయకాంత్‌ ఆశీస్సులు విజయ్‌కి ఉంటాయని ఆయన సతీమణి ప్రేమలత అన్నారు. విజయ్‌ తమ ఇంటి బిడ్డ అని ఆమె అన్నారు. విజయ్‌ వ్యాఖ్యలు కూడా విజయకాంత్‌ను గుర్తుచేస్తున్నాయని డీఎండీకే నేత ప్రేమలత అన్నారు. ప్రస్తుతం విజయ్‌కి సపోర్ట్‌గా విజయకాంత్‌ సతీమణి రావడం అభిమానులు సంతోషిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement