
షా ఆలం; ఆగస్టు, 2025: తెలుగు భాషాసంస్కృతులను తర్వాతి తరాలకు అందించడం గొప్ప విషయం అని తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు రెడ్డి శ్యామల అన్నారు. భాష బోధన చేయడానికి భాషా శాస్త్ర పరిజ్ఞానం అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈనెల 13 నుంచి 23 వరకు మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్ లో భాగంగా నిర్వహించిన కార్యశాల ప్రారంభ సమావేశంలో ఆమె పాల్గొని, తెలుగు సంఘాన్ని అభినందించారు.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగు భాషా సాంస్కృతిక మూలాలను బతికించుకోవాలనుకోవడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మలేషియాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్పించడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్ను ఆమె అభినందించారు. ఈ కార్యశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. చంద్రయ్య, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డా. ప్రతాప్, కోఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యక్షులు సీతారావు విద్యార్థులు పాల్గొన్నారు.