
‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.
ఇప్పటికే మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట... ఇలా అన్నీ హైలెట్‌గా మారాయి. తాజాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ని నిర్మించారనే వార్తలు వస్తున్నాయి. ఈ భారీ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభిస్తారట.
సినిమాలో ఈ ఇంటి సెట్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందట. కళా ఖండాలు, వాల్ హ్యాంగింగ్... ఇలా ఈ సెట్‌కి సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారట మేకర్స్. అందుకే సెట్‌కే దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌కి చిన్న విరామం ఇచ్చిన ఎన్టీఆర్ వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని టాక్. ఈ కొత్త షెడ్యూల్ నెల పాటు జరగనుందని తెలి సింది. ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.