ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి | Today Telugu Horoscope On August 23rd, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి

Aug 23 2025 3:48 AM | Updated on Aug 23 2025 9:38 AM

Rasi Phalalu: Daily Horoscope On 23-08-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: అమావాస్య ప.11.18 వరకు, తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి, నక్షత్రం: మఖ రా.1.32 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.1.21 నుండి 2.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: రా.11.14 నుండి 12.50 వరకు, పోలాల అమావాస్య.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: కొత్త రుణయత్నాలు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత ఉంటుంది.

కర్కాటకం: ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమకు ఫలితం అంతంత మాత్రమే. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

సింహం: నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు.

కన్య: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ప్రయాణాలు వాయిదా.

తుల: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

వృశ్చికం: పనులలో మరింత పురోగతి. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. పురస్కారాలు అందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement