ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 23 11 2025 To 29 11 2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Nov 23 2025 1:09 AM | Updated on Nov 23 2025 1:15 AM

Weekly Horoscope In Telugu From 23 11 2025 To 29 11 2025

మేషం: రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువర్గంతో తగాదాలు తీరతాయి. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం. ఎరుపు, లేత గులాబీ రంగులు. వినాయకుని పూజించండి.

వృషభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితోఉత్తరప్రత్యుత్తరాలు.  ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.  పారిశ్రామికవర్గాలకు విదేశీయానం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. పనుల్లో  ఆటంకాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు.  లక్ష్మీస్తుతి మంచిది.

మిథునం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వాహనాలు కొంటారు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలితమిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళాకారులకు సన్మానాలు,ఊహించని అవకాశాలు. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఇంటిలో విందువినోదాలు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దాపరికాలు లేకుండా మీ అభిప్రాయాలను నిర్భయంగా  వెల్లడిస్తారు . చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి., ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో  ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు.  కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందçర్శిస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో  దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువిరోధాలు. లేత నీలం, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కన్య: పనులు నిదానంగా సాగుతాయి. స్నేహితులతో స్వల్ప వివాదాలు. కలహాలు. శ్రమాధిక్యంతో కొన్ని విజయాలు సాధిస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతసంఘటనలు గుర్తుకుతెచ్చుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కే ఛాన్స్‌. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధువులు ఆపద్బాంధువులుగా ఆదుకుంటారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన పురోభివృద్ధి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కాంట్రాక్టర్లకు కొంత నిరాశ ఎదురవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. అనారోగ్య సూచనలు. దేవాలయ దర్శనాలు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి..

ధనుస్సు: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవర్తమానాలు. రాబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. అనుకున్నది పట్టుదలతో  సాధిస్తారు. కార్యసిద్ధి. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారలావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ఖర్చులు అధికం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆశ్చర్యకౖరమైన సమాచారం. మిత్రులతో వివాదాలు తీరతాయి. అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులకు  లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు అవార్డులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. సోదరులతో స్వల్ప వివాదాలు. పసుపు, ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: పరపతి పెరుగుతుంది. సోదరులు,  సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల సహకరిస్తారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి. కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో  వివాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు. దుర్గాదేవిని పూజించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement