
2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో, జియోఫైనాన్స్ ఓ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 24తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వ్యక్తిగత పన్ను చెల్లించేవారు.. ఇప్పుడు రూ.24 ప్లాన్‌తోనే ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు. దీనికోసం కంపెనీ జియో ఫైనాన్ యాప్ ద్వారా.. కొత్త ట్యాక్స్ ప్లానింగ్, ఫైలింగ్ ఫీచర్ వంటివి వాటిని తీసుకొచ్చింది. ట్యాక్స్ పేయర్లు.. ఈ యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే, కొన్ని మినహాయింపులు కూడా పొందవచ్చని సమాచారం.
కేవలం రూ. 24 ప్లాన్ ద్వారా అందరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చా? అనేది చాలామందికి తలెత్తిని ప్రశ్న. ఇది రూ. 5 లక్షల వరకు ఆదాయం.. ఒకే ఫారం-16 ఉన్న జీతం పొందే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని జియో ఫైనాన్స్ స్పష్టం చేసింది. ఇందులో ట్యాక్స్ పేయర్ స్వయంగా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే బిజినెస్ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, విదేశీ పెట్టుబడులు వంటి కాంప్లెక్స్ ట్యాక్సులు ఉన్నవారికి ఈ రూ. 24ప్లాన్ పనిచేయదు. దీనికోసం నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారికోసం జియో ఫైనాన్స్ రూ. 999 ప్లాన్ అందిస్తోంది.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో బేస్ ప్లాన్ ధరలు
➤టాక్స్2విన్: బేసిక్ ప్లాన్ రూ.49, సీఏ సహాయంతో రూ. 1,274 నుంచి రూ. 7,968
➤మైట్రీటర్న్: సెల్ఫ్-ఫైలింగ్ రూ.199, సీఏ సహాయంతో రూ.1,000 నుంచి రూ. 6,000
➤టాక్స్ మేనేజర్: రూ. 500 నుంచి ప్రారంభమవుతుంది, సీఏ సహాయంతో రూ. 5,000 వరకు
➤క్లియర్ టాక్స్: బేసిక్ రూ. 2,540, లక్స్ అడ్వైజరీ ప్లాన్ రూ. 25,000
➤టాక్స్‌బడ్డీ (డైరెక్ట్): సెల్ఫ్-ఫైలింగ్ రూ. 699, కాంప్లెక్స్ ఫైలింగ్స్ రూ. 2,999
ఇదీ చదవండి: స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలా
పైన పేర్కొన్న ధరలతో పోలిస్తే.. జియో ఫైనాన్స్ అందించే రూ. 24 ప్లాన్ చాలా తక్కువ అని స్పష్టమవుతుంది. అయితే ట్యాక్స్ పేయర్లు ధరను మాత్రమే చూడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చౌక ప్లన్స్ సాధారణంగా ప్రొఫెషనల్ మార్గదర్శకత్వాన్ని అందించవు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ప్లాన్స్ ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.