
ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియాకి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ పురస్కారం లభించినట్లు లభించింది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) ఈ అవార్డును ప్రకటించినట్లు తెలి పింది.
పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో కూడుకున్న వ్యాపార విధానాలను పాటించడంపై తమకున్న నిబద్ధతకు ఇది గుర్తింపని సంస్థ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు. నవంబర్ 4న జరిగే గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ (ఐపీపీ) దిగ్గజంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..