
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.చతుర్దశి ప.11.54 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: ఆశ్లేష రా.1.10 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: ప.1.59 నుండి 3.35 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు,అమృత ఘడియలు: రా.11.40 నుండి 1.15 వరకు.
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.20
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కష్టానికి తగిన ఫలితం దక్కదు. ఆరోగ్యభంగం. పనులలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు.
వృషభం.... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
మిథునం..... బంధువులతో వివాదాలు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కర్కాటకం.... వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.
సింహం..... పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బంధుమిత్రులతో విభేదాలు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. అనారోగ్యం.
కన్య..... అందరిలోనూ గుర్తింపు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.
తుల.... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం..... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.
ధనుస్సు... శ్రమ మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ధనవ్యయం.
మకరం... పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి.
కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింతగా కలసివస్తాయి. సత్కారాలు జరుగుతాయి.
మీనం... మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. అనారోగ్యం.